ఇహ్రామ్ - IHRAM OR EHRAMముస్లింలు ధరించే వస్త్రాన్ని ఇహ్రామ్ అంటారు. దీన్ని ముస్లింలు హజ్ యాత్ర కోసం మక్కాకు వెళ్ళినప్పుడు ధరిస్తారు. ఇహ్రామ్ దుస్తుల్లో రెండు భాగాలుంటాయి. ఇది తెల్ల రంగులో ఉంటుంది. ఇది కుట్టబడి ఉండదు. ఒకదాన్ని తుంటిపై నుండి, మరోదాన్ని భుజాలపై నుండి వేసుకోవాలి. ఇహ్రామ్ కేవలం దుస్తులే కాదు, దీన్ని ధరించి మనిషి పవిత్ర ప్రదేశంలోకి ప్రవేశిస్తాడు.
ఇహ్రామ్ మూల పదం హర్మ్. ఇస్లాంలో దీని వల్ల మనిషి పవిత్రతను పొంది, పవిత్ర స్థలమైన కాబాలోనికి హజ్ లేదా ఉమ్రా కోసం ప్రవేశిస్తాడు. హజ్ లేదా ఉమ్రా కోసం మక్కాలో ప్రవేశించే ముందు ఒక హద్దు ఉంటుంది. దాన్ని మీఖాత్ అంటారు. అది దాటే ముందు, స్నానం చేసి ఇహ్రామ్ ధరించాలి.
భావంపారిభాషికంగా ఇహ్రామ్ అంటే, పవిత్ర స్థితిలోకి ప్రవేశించడం. ఇది త్రెంచకూడదు. ఇస్లామియంగా ఇహ్రామ్ అంటే, ఆ స్థితిలో కొన్ని చర్యలు నిషిద్ధం చేయబడుతాయి.
ఇహ్రామ్ లో ప్రవేశించే ముందు తీసుకోవలసిన చర్యలుఇహ్రామ్ స్థితిలో ప్రవేశించే ముందు స్నానం చేయాలి. ఇంకా ఇవి కూడా సిఫారసు చేయబడ్డాయి:
ఇహ్రామ్ వేసుకునే పద్ధతిరెండు షరతులు లేనిచో ఇహ్రామ్ చెల్లదు. అవి: సంకల్పం పురుషులకు ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే, వారు ఇహ్రామ్ కోసం ప్రత్యేకమైన దుస్తులు ధరిస్తారు. ఇహ్రామ్ దుస్తులు కుట్టించబడనివి, తెల్ల రంగులో, పరిశుభ్రమైనవై ఉంటాయి. అవి రెండు భాగాలలో ఉంటాయి. క్రింది భాగాన్ని ‘ఇజార్’ మరియు పై భాగాన్ని ‘రిదా’ అంటారు. కాళ్ళకు వేసుకునే పాదరక్షలు చీలమండలాన్ని కప్పివేయకూడదు.
స్త్రీలు తమకు తోచింది ధరించవచ్చు. కాని, అది ఇస్లామీయ చట్టానికి (షరియాకు) విరుద్ధంగా ఉండకూడదు. దుస్తుల రంగు ఏదైనా పర్లేదు. కొందరు తెల్ల రంగు లేదా ఆకు పచ్చ రంగును ప్రత్యేకంగా భావిస్తారు. కాని, సున్నత్ (దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ఆచరణ లేదా బోధన) ద్వారా ఇలాంటి విషయం ఏది నిరూపితం కాలేదు.
కేవలం ఇహ్రామ్ దుస్తులు ధరించిన కారణంగా ఎవరూ ఇహ్రామ్ స్థితిలోకి రారు. ఇహ్రామ్ స్థితిలో రావాలంటే, నోటి ద్వారా (నియ్యత్) సంకల్పం పలుకులు ఉచ్చరించడం తప్పనిసరి.
సంకల్పం తరువాత తల్బియా చదవాలి: ఇహ్రామ్ ధరించాక, హజ్ కోసం ఈ పలుకులతో సంకల్పం చేయాలి – “అల్లాహుమ్మ లబ్బైక్ హజ్జన్”
ఇహ్రామ్ ధరించాక, తల్బియా బిగ్గరగా చదవండి – (లబ్బైక్ అల్లాహుమ్మ లబ్బైక్, లబ్బైక్ లా షరీక లక లబ్బైక్, ఇన్నల్ హమ్ద వన్నెమత లక వల్ ముల్క్ లా షరీక లక్) ఆ తరువాత ఈ దుఆ ఒకసారి చదవండి – (అల్లాహుమ్మ హాజిహి హజ్జతున్ లారియా ఫీహా వలా సుమాహ్) (ఓ అల్లాహ్! నేను హజ్ సంకల్పం చేస్తున్నాను. ఇది ఎవరికీ చూపించడానికి లేదా పేరు ప్రఖ్యాతలు పొందడానికి కాదు.)
ఓ అల్లాహ్ నేను హాజరయ్యాను! నేను హాజరయ్యాను, నేను హాజరయ్యాను (నేను సాక్ష్యమిస్తున్నాను) నీవు తప్ప ఎవ్వరు (ఆరాధ్యానికి అర్హులు ఎవ్వరు లేరు) లేరు, నేను హాజరయ్యాను, ప్రశంసలన్నీ, దయానుగ్రహాలన్నీ అల్లాహ్ కే చెందును. సామ్రాజ్యమంతా నీదే. నీవు తప్ప దైవాలెవరూ లేరు.
ఇహ్రామ్ స్థితిలో తప్పనిసరి విషయాలుహజ్ లేదా ఉమ్రా చేసేటప్పుడు ఇహ్రామ్ స్థితిలో క్రింద ఇవ్వబడిన విషయాలు తప్పనిసరి:
ఈ నిషేధాజ్ఞలు స్త్రీలు మరియు పురుషులకు వర్తిస్తాయి.
ఇహ్రామ్ స్థితిలో నిషేధించబడినవి* పురుషులు తలను దేనితో కప్పుకోరాదు. గొడుగు లేదా కారు నీడ తలపై పడితే ఎలాంటి తప్పు లేదు. తలపై ఏదైనా మోసుకొని వెళ్ళినా దోషం లేదు.
* పురుషుడు శరీరం మొత్తంపై అయినా లేదా కొంత భాగంపై అయినా షర్ట్ గానీ, ఏదైనా ఇతర కుట్టబడిన వస్త్రం గానీ – టర్బన్, చిన్న బూట్లు తొడగరాదు. కాని, శరీరం క్రింద భాగంపై తొడిగే ఇహ్రామ్ (ఇజార్) లభించని పక్షంలో పైంట్ (ట్రౌజర్) తొడగవచ్చు. అలాగే చెప్పులు లభించని పక్షంలో చిన్న బూట్లు వేసుకోవచ్చు.
* ఇహ్రామ్ స్థితిలో స్త్రీ చేతుల తొడుగులు, ముఖంపై నిఖాబ్ లేదా బుర్ఖా వేసుకోవడం కూడా నిషేధించబడింది. కాని, పరాయి మగవాళ్ళు దగ్గరగా ఉన్నప్పుడు, బుర్ఖాతో గానీ, ఇతర వస్త్రంతో గానీ ముఖాన్ని దాచుకోవచ్చు. ఈ నిబంధనలన్నీ ఇహ్రామ్ స్థితిలో ఉన్నంత వరకే.
* ఒకవేళ ఒక మనిషి (పురుషుడు) కుట్టబడిన వస్త్రం ధరించడం గానీ, సువాసన పూసుకోవడం గానీ, వెంట్రుకలు లేదా గోళ్ళు కత్తిరించడం గానీ – మరచిపోయి లేదా తెలియక చేసినచో, అతనిపై ఫిదియా (పరిహారం) ఉండదు. అతనికి గుర్తురాగానే లేదా తెలియగానే, ఇలాంటి వాటి నుండి ఆగిపోవాలి.
* చెప్పులు తొడగడం, ఉంగరం ధరించడం, కళ్ళద్దాలు పెట్టుకోవడం, చెవిటివారు వినడానికి ఉపయోగించే పరికరం వాడడం, చేతి గడియారం ధరించడం, నడి కట్టు లేదా బెల్టు ధరించడం (ధనాన్ని లేదా పత్రాల రక్షణ కొరకు) అనుమతించబడింది.
* దుస్తులను మార్చుకోవడం, వాటిని ఉతుక్కోవడం అనుమతించబడింది. శరీరాన్ని కడుక్కోవడం (స్నానం చేయడం), తల వెంట్రుకలను కడగడం కూడా సమంజసమే. ఇలా చేసేటప్పుడు కొన్ని వెంట్రుకలు రాలినా ఎలాంటి దోషం లేదు.
స్త్రీ అయినా, పురుషుడు అయినా నెత్తి మీద ఏదైనా వ్యాధి వల్ల గుండు గీయిస్తే, వారు ఈ మూడింటిలో ఒకటి చేయాలి:
ఇహ్రామ్ కు సంబంధించిన తప్పులుకొందరు భక్తులు (హాజీలు) ఇహ్రామ్ లో లేని స్థితిలోనే (ఇహ్రామ్ ధరించే చోటు) మీఖాత్ ను దాటి వెళ్ళిపోతారు. ఆలా జిద్డా (లేదా ఇతర దగ్గరి స్థలం) వరకు వెళ్లి ఇహ్రామ్ ధరిస్తారు. ఇది దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ఆజ్ఞకు వ్యతిరేకం. దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ప్రతి భక్తునికి తన దారిలో పడే మీఖాత్ (ఇహ్రామ్ ధరించే స్థలం) వద్ద ఇహ్రామ్ స్థితిలోకి వచ్చేయాలని అజ్ఞాపించారు.
ఎవరికైనా ఇలా జరిగినచో, అతను తిరిగి తన దారిలో పడే మీఖాత్ ప్రదేశానికి వెళ్లి ఇహ్రామ్ ధరించాలి. లేదా పరిహారంగా మక్కాలో ఒక మేకను బలి ఇచ్చి, దాని మాంసాన్ని బీదవారికి పంచిపెట్టాలి.
ఇది మీఖాత్ ప్రదేశాన్ని విమానం ద్వారా, ఓడ ద్వారా లేదా భూమి (బస్సు, కారు) ద్వారా దాటిన ప్రతి ఒక్కరికీ వర్తిస్తుంది.
ఇహ్రామ్ ధరించే చోట్లు (మీఖాత్) ఐదు ఉన్నాయి. ఆ ఐదింటిలో ఒక్క దాన్ని కూడా తాకకుండా వెళ్ళేవారు, తమ దారిలో దగ్గరగా ఉన్న మీఖాత్ ప్రదేశంలో ఇహ్రామ్ ధరించాలి.
ఇహ్రామ్ ధరించే పద్ధతిపురుషులు క్రింది భాగాన్ని నడుము పై కడతారు.
పై భాగాన్ని రెండు భుజాలపై నుండి వేసుకుంటారు. కేవలం మొదటి తవాఫ్ (తవాఫె ఖదూం)లో కుడి భుజంపై నుండి వస్త్రం తీసివేయాలి.
గమనిక: ఇహ్రామ్ కోసం పలచగా ఉన్న వస్త్రాన్ని కొనకండి. దీని వల్ల చెమటకు ఆ వస్త్రం మీ శరీరానికి అతుక్కుంటుంది. కాస్త మందపాటి వస్త్రం ఉత్తమమైనది. వీటిని తువాలులా, దుప్పటిలా వాడవచ్చు.
ఒక భాగం మన నడుము చుట్టు చుట్టుకోవాలి. స్నానం చేశాక మనం తువాలును ఎలా నడుముపై చుట్టు కుంటామో అలానే చుట్టుకోవాలి. (లుంగీ ధరించే వారికి ఇది చాలా సులభం అవుతుంది).
రెండో భాగాన్ని రెండు భుజాలపై నుంచి శరీరపు పై భాగాన్ని కప్పుకోవాలి. కుడి భుజంపై నుండి వస్త్రాన్ని కేవలం తవాఫె ఖుదూం (కాబా చేరాక చేసే మొదటి తవాఫ్) చేసేటప్పుడు తీయాలి. ఇతర సమయాల్లో కుడి భుజం కూడా కప్పబడి ఉండాలి, ప్రత్యేకంగా నమాజ్ చేస్తున్నప్పుడు. ఇతర భక్తుల కుడి భుజం వైపు మన చూపులు పోకూడదు.
క్రింద భాగంపై ధరించే వస్త్రం జారిపోకుండా దానిపై బెల్ట్ ధరించవచ్చు. పై భాగపు వస్త్రం పడిపోకుండా పిన్ను వాడవచ్చు.
స్త్రీలకు ఇహ్రామ్ లో ఎలాంటి ప్రత్యేకమైన దుస్తులు ఉండవు. కేవలం ఇహ్రామ్ లో ఉన్నప్పుడు, స్త్రీలు తమ ముఖాన్ని మరియు చేతులను ఎలాంటి వాటితో కప్పుకోకూడదు. ఇహ్రామ్ దుస్తులను మీఖాత్ ప్రదేశానికి చేరక ముందే ధరించవచ్చు. ఇక కేవలం సంకల్పం (నియ్యత్) చేయడం మాత్రమే మిగిలి ఉంటుంది.
సంకల్పం (నియ్యత్) మీఖాత్ వద్ద లేదా దానికి దగ్గరగా చేయాలి. సంకల్పం దుఆ బిగ్గరగా చదవాలి. (హజ్ అయినా, ఉమ్రా అయినా) ఇహ్రామ్ స్థితిలో రావడానికి సంకల్పపు దుఆ చేయాలి. ఆ దుఆ:
“లబ్బైక్ అల్లాహుమ్మ ఉమ్రతన్” (ఓ అల్లాహ్! నేను ఉమ్రా కోసం హాజరయ్యాను).
“లబ్బైక్ అల్లాహుమ్మ హజ్జన్” (ఓ అల్లాహ్! నేను హజ్ కోసం హాజరయ్యాను).
గమనిక: హజ్జె ఖిరన్ లో ఉమ్రా మరియు హజ్ సంకల్పం (నియ్యాత్) చేయాలి. హజ్జె ఇఫ్రాద్ లో కేవలం హజ్ సంకల్పం చేయాలి.
రుతుస్రావంలో ఉన్న స్త్రీలు మరియు గర్భానంతరం రక్తస్రావం జరిగే స్త్రీలు ఇహ్రామ్ స్థితిలోకి రావాలి. వారు హజ్ లో చేయాల్సిన ఆచరణలు చేస్తూ మక్కా, మినా, అరఫా చేరాలి. ఈ స్థితిలో స్త్రీలు, కేవలం తవాఫ్ తప్ప హజ్ లోని అన్ని ఆచరణలు పాటించాలి.
మీరు ఇతరుల కోసం హజ్ చేస్తున్నప్పుడు (ఉదా - మీ తల్లి, తండ్రి), కేవలం సంకల్పం (నియ్యత్) చేస్తున్నప్పుడే వారి పేరు చెప్పాలి. హజ్ లోని మిగతా ఆచరణలు అన్నీ తన స్వంతం కోసం చేసినట్లే చేయాలి.
ఇతరుల కోసం హజ్ చేసినప్పుడు చేయాల్సిన సంకల్పం (నియ్యత్) : (అతని పేరు) “లబ్బైక్ అల్లాహుమ్మ హజ్జన్’ అన్; అతని పేరు.” (ఓ అల్లాహ్! నేను ....... (మనిషి పేరు) హజ్ కోసం హాజరయ్యాను).
ఇక మీరు ఇహ్రామ్ స్థితిలోకి వచ్చేశారు! ఇహ్రామ్ స్థితిలో ఉన్న వారిని ‘ముహ్రిం’ అంటారు.
ఇహ్రామ్ స్థితిలో మీరు వాడుకోదగినవి
ఇహ్రామ్ స్థితిలో చేయకూడని పనులుఇహ్రామ్ ధరించిననూ, సంకల్పం (నియ్యత్) చేయనంతవరకూ మనిషి ముహ్రిం (ఇహ్రామ్ స్థితిలోకి రాలేడు) కాలేడు. సంకల్పం (నియ్యత్) చేశాక మనిషి ముహ్రిం అవుతాడు మరియు అతనిపై నిషేధాజ్ఞలు వర్తిస్తాయి. కావాలని ఏదైనా నిషేధాజ్ఞను ఉల్లంఘించినచో పరిహారం (ఫిదియా) చెల్లించాల్సి ఉంటుంది:
ఇహ్రామ్ స్థితిలో మనిషి సాధారణ ఆచరణలు
ఇప్పుడు మీరు “అల్లాహ్ అతిథులు”, కావున హుందాగా మెలగండి.
ఆధారాలు http://www.hajj.org.au/index.php?option=com_content&task=view&id=23&Itemid=55 (ఇంగ్లీష్)
|
.