ఇస్లాం –పూర్తి జీవన శైలి


అనేకులు మానవ జీవిత శైలిని వివిధ కోణాల్లో, వివిధ రకాలుగా తమ ఆలోచనా సరళిని బట్టి దాన్ని విశ్లేషిస్తున్నారు. చార్లెస్ డార్విన్, సిగ్మండ్ ఫ్రెడ్, హెగెల్, కార్ల్ మాక్స్ వంటి వారు మానవ జీవితాన్ని వివిధ కోణాల్లో నుంచి చూడడానికి ప్రయత్నించారు. కొందరు మానవ ఆకృతిపై ఎక్కువగా నిర్భరపడ్డారు. కొందరు అతని వృత్తిపై ధ్యానమిచ్చారు. కొందరైతే మనిషి కడుపే అన్నిటికీ కారణం అన్నారు. అన్ని సమస్యలకు కారణం మానవుని ఆకలే అని వారి ఆలోచన.ఆకలి సమస్యను పరిష్కరిస్తే అన్ని సమస్యలు అంతమైపోతాయని వారి వాదన.


మరికొందరైతేమానవ జీవితాన్ని శృంగారంతో కూడగట్టారు. శృంగారమేమానవ జీవిత ధ్యేయం అని వాదించారు. శృంగారంపై ఉన్న పరిమితులను, నియంత్రణలను తీసివేస్తే అన్నీ సర్డుకుంటాయని వారి భావన. కొందరు సన్యాసత్వానికి ప్రాధాన్యత ఇచ్చారు. మానవ శరీరాన్ని, దాని అవసరాలను త్రోసిపుచ్చారు. కావున దైవాన్ని, దైవవాణిని లెక్కచేయకుండా మానవ జీవితాన్ని విశ్లేశించేవారు గుడ్డివారితో సమానం. వారు విశ్లేశించినవి పూర్తిగాఅసంపూర్ణమైనవి మరియు లోపాలతో కూడినవి. [1]

 

విషయసూచిక

 

ఇస్లాం పదం

‘ఇస్లాం’ అనగా తనను తాను అల్లాహ్ కు సమర్పించుకొని శాంతి పొందడం. అంటే- ఖుర్ఆన్ లో అల్లాహ్ చెప్పినట్లుగా నడచుకోవడం, దైవప్రవక్త సల్లల్లాహుఅలైహివసల్లం చూపించిన విధానాన్ని అనుసరించడం మరియు సహాబా (దైవప్రవక్త సల్లల్లాహుఅలైహివసల్లం అనుచరులు) అర్ధం చేసుకున్న, అనుసరించిన విధానంపై జీవితం గడపడం.


ఏదైనా వస్తువు గురించి దాన్ని తాయారు చేసిన వానికి బాగా తెలిసి ఉంటుంది. ఉదాహరణకు–వాహనాన్ని తయారు చేసిన వానికి వాహనం అవసరాలు బాగా తెలిసుంటాయి. వాహనపు చక్రాలలోని గాలి కూడా దాని తయారుదారు చెప్పినంతే నింపుతాము. కాని ఈ వాహనం మాది కదా. కావున మా ఇష్టప్రకారం మేము దీంట్లో గాలి నింపుతాము అని ఎవరైనా అనవచ్చు? అలా చేసినచో వాహనానికి నష్టం జరుగుతుంది.


మన సృష్టికర్త, అల్లాహ్ కు మనకోసం ఏది మంచో, ఏది చెడో అంతా తెలుసు. అతనుదైవప్రవక్త సల్లల్లాహుఅలైహివసల్లం జీవితం ద్వారా మనకు మార్గదర్శకత్వం చేశాడు. అల్లాహ్ చూపించిన రుజుమార్గం నుండి తప్పిపోయినచో కల్లోలం, వినాశనం తప్పదు.


ఇస్లాం దైవధర్మం కావటం వలన ఇందులో జీవితానికి సంబంధించిన విషయాలన్నీ ఉన్నాయి. మన సృష్టికర్త అల్లాహ్, ఈ జీవిత విధానానికి ‘ఇస్లాం’ అని పేరు పెట్టాడు.


నిస్సందేహంగా ఇస్లాం మాత్రమే అల్లాహ్ వద్ద సమ్మతమైన ధర్మం. (ఖుర్ఆన్, సూరా ఆలి ఇమ్రాన్ 3:19)

 

ఇస్లాం ఓ ధర్మం

ఇస్లాం ఓ ధర్మం, కాని పాశ్చాత్య దేశాల భావంలో కాదు. పాశ్చాత్యుల ప్రకారం ధర్మం అంటే కేవలం మానవునికి, అల్లాహ్ కు మధ్య ఉన్న బంధం మాత్రమే.మానవుని జీవితపు అన్ని రంగాలతోఇస్లాం ధర్మానికి సంబంధం ఉంది. అది వ్యక్తిగతమైనా, సామాజికమైనా, ప్రాపంచికమైనా సరే.

 

ఇస్లాం మీ సంబంధాలను కుదుర్చుతుంది

ఇస్లాం మీ సృష్టికర్త అయిన అల్లాహ్ తో, స్వయంగా మీతో, మీ పిల్లలతో, మీ బంధువులతో, మీ పొరుగువారితో, మీ అతిథులతో మరియు ప్రపంచపుమానవాళితో మీ సంబంధాలను కుదుర్చుతుంది. ఇస్లాం అందరితో మీ హక్కులను, విధులనుస్పష్టపరుస్తుంది.

 

ఇస్లాం స్పష్టమైన వ్యవస్థను స్థాపిస్తుంది

ఇస్లాం – ఆరాధించే వ్యవస్థను, పౌరహక్కులను, వివాహవిడాకుల నియమాలను, వారసత్వపు చట్టాలను, వ్యవహరించే తీరును, ఏది త్రాగకూడదో, ఏది ధరించాలో, ఏది ధరించకూడదో, అల్లాహ్ ను ఎలా పూజించాలో, రాజ్యమెలా పాలించాలో, యుద్ధానికి మరియు శాంతికి సంబంధించిన చట్టాలు, ఎప్పుడు యుద్ధం చేయాలో, ఎప్పుడు శాంతిని అమలుపరచాలో, ఆర్ధిక వ్యవస్థ చట్టాలు, అమ్మే కొనే నియమాలు –అన్నీ స్పష్టంగా వివరిస్తుంది. ఇలా ఇస్లాం పూర్తి జీవిత వ్యవస్థను స్థాపిస్తుంది.

 

ఇస్లాం ఆచరణాత్మక ధర్మం

ఇస్లాం కేవలం మస్జిద్కే పరిమితం కాదు. ఇది రోజువారి జీవితంతో సంబంధించింది. సామాజికంగా, ఆర్ధికపరంగా, రాజకీయంగా మొదలైన రంగాల్లో – జీవితపు అన్ని కోణాల్లో ఇస్లాం మార్గం చూపుతుంది.

 

ఇస్లాం పూర్తి జీవన విధానం

ఇది సృష్టికర్త అల్లాహ్ సూచించిన ధర్మం కాబట్టి ఇందులో పూర్తి జీవన విధానం ఇమిడి ఉంది. దీనివల్ల ముస్లింలు తమ ధర్మమైన ఇస్లాం గురించి ఎలాంటి సంకోచంలో ఉండరు. ఇస్లాం తార్కిక, హేతుబద్ధమైన ధర్మం. ఇస్లాం మానవ నైజానికి అనుగుణంగా ఉంటుంది,వ్యతిరేకంగా ఉండదు. ఇందులో మతాధికారత్వం, బ్రహ్మచర్యం ఉండవు. ఇస్లాం మానవుని పూర్తి జీవన విధానం. [2]

 

ఆధారాలు

[1] http://dawah.invitetogod.com/category- 1/why-is-islam-a-complete-way-of-life (ఇంగ్లీష్)
[2] http://www.beconvinced.com/archive/en/article.php? articleid=0157&catid=02&subcatname=Intro%20To%20Islam (ఇంగ్లీష్)

1772 Views
మమ్మల్ని సరిచేయండి లేదా మిమ్మల్ని సరిచేసుకోండి
.
వ్యాఖ్యలు
పేజీ యొక్క టాప్