ఆయిషా (రజి) తో దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం గారి వివాహం- PROPHET MUHAMMAD'S صلى الله عليه و سلم MARRIAGE TO AISHA رضي الله عنها


అనేక ప్రజలు దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ను ఏవేవో అని నిందించారు. ఆయన చిన్న పిల్ల అయిన ఆయిషా (రజి)ను వివాహమాడారని ఆయనపై నింద వేశారు.  

 

విషయసూచిక

 

స్పందన

పెళ్లి విషయంలో ఇస్లామీయ చట్టం

ఇస్లాంలో పెళ్ళికి నిర్ణీత వయసు అంటూ లేదు. అమ్మాయి అయినా లేదా అబ్బాయి అయినా యుక్త వయసుకు చేరగానే, వారు వివాహానికి అర్హులై పోతారు. పెళ్లి (నిఖా) ముందుగానే చేసి, ఆ తరువాత యుక్త వయసు వచ్చాక, మిగతా తతంగం (ఇద్దరినీ కలపడం) పూర్తి చేయవచ్చు.

 

యుక్త వయసు ఎప్పుడు ప్రారంభమవుతుంది?

సాధారణంగా అమ్మాయిలు 8 నుండి 13 సంవత్సరాల వయసులో యుక్త వయసుకు చేరుకుంటారు (పెద్ద మనిషి/పుష్పవతులుఅవుతారు). కొందరు దీనికి ముందు, మరి కొందరు దీని తరువాత కూడా యుక్త వయసుకు చేరవచ్చు. ప్రతి ఒక్కరి శరీరంలో మార్పులు జరిగే వయసు వేరుగా ఉంటుంది. 10 సంవత్సరాల వయసులో వక్ష స్థలాలు పెరిగినా, పెరగక పోయినా – 14 సంవత్సరాల వయసులో రుతుస్రావం మొదలైనా, మొదలవ్వక పోయినా పరవాలేదు. అందరూ ఒకానొక సమయాన యుక్త వయసుకు చేరుకుంటారు.    

(http://www.healthtouch.com/bin/EContent_HT/cnoteShowLfts.asp? fname=07103&title=PUBERTY+IN+GIRLS+&cid=HTHLTH) (ఇంగ్లీష్)

 

అమ్మాయిల యుక్త వయసు     

ఆస్ట్రేలియా ప్రభుత్వ ఆరోగ్య శాఖ ఇలా అంటుంది: “యుక్త వయసుకు చేరిన మొదటి చిహ్నం: పొడుగు పెరుగుతుంది; వక్ష స్థలాలు పెరుగుతాయి; మర్మాంగాలలో మరియు ఇతర చోట్ల వెంట్రుకలు పెరగడం మొదలవుతుంది. ఇది 10 నుండి 14 సంవత్సరాల మధ్యలో జరుగుతుంది – కొందరికి దీనికి ముందు, మరి కొందరికి దీని తరువాత కూడా జరగవచ్చు.”

(http://www.population.health.w a.gov.au/Communicable/Resources/2107%20PubertyinGirls.pdf(ఇంగ్లీష్)

 

ఆయిషా (రజి) యుక్త వయసుకు చేరాక ఆమె వివాహం పూర్తి చేయబడింది అని కారెన్ ఆర్మ్ స్ట్రాంగ్ తన పుస్తకం ముహమ్మద్ లో వ్రాసింది. ఇది దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం జీవిత గ్రంథం, హార్పర్ సాన్ ఫ్రాన్సిస్కో , 1992, పేజి 157: “తబరి ప్రకారం ఆయిషా (రజి) పెళ్లి చిన్న వయసులో జరిగింది. పెళ్లి తరువాత ఆమె తన తల్లిదండ్రుల ఇంటిలోనే ఉండిపోయింది. ఆమె యుక్త వయసుకు చేరాక, పెళ్లి పూర్తి చేయబడింది.”

 

ఆధునిక శాస్త్రం ప్రకారం యుక్త వయసుకు చేరిన వారి వెంట్రుకలు రాలడం మొదలవుతాయి. ఇది హదీసు ద్వారా కూడా నిరూపితమయింది: ఆయిషా (రజి) ఉల్లేఖనం: “దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లంతో నా నిశ్చితార్ధం జరిగినప్పుడు, నా వయసు ఆరు సంవత్సరాలు. మేము మదీనా వెళ్ళాక, బనీ అల్ హారిస్ బిన్ ఖజ్రజ్ ఇంట్లో ఉన్నాము. అప్పుడు నేను అనారోగ్యానికి గురి అయ్యాను. నా తలవెంట్రుకలు పడడం మొదలయ్యాయి.....” [సహీహ్ బుఖారీ 3605]

 

చిన్న వయసులో తల్లులైన వారి జాబితా

http://en.wikipedia.org/wiki/List_of_youngest_birth_mother s (ఇంగ్లీష్)

 

దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం వివాహాల వెనుక ఉన్న దృక్పధం

 

దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం జీవత విధానాన్ని మరియు వివాహాలను పరిశీలిద్దాము.

 

పెళ్లి కూతురు పేరు

పెళ్లి సమయంలో ఆమె వయసు

వివరాలు/స్థీతి

ఖదీజాబిన్త్ఖువైలిద్

40

రెండు సార్లు విధవరాలు అయ్యారు

సౌదా బిన్త్ జమా

50

వితంతువు 

ఆయిషా బిన్త్ అబూ బకర్

9

9 సంవత్సరాల వయసులో దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లంతో ఉండడం ప్రారంభించారు

హఫ్సా బిన్త్ ఉమర్ బిన్ ఖత్తాబ్

22

వితంతువు

జైనబ్ బిన్త్ ఖుజైమా

30

విడాకులు తీసుకున్న స్త్రీ

ఉమ్మ్ సల్మా బిన్త్ అబూ ఉమయ్యా

26

వితంతువు

జైనబ్ బిన్త్ జహష్

38

వితంతువు

జువేరియా బిన్త్ హారిస్

20

వితంతువు

ఉమ్మె హబీబా బిన్త్ అబూ సుఫ్యాన్

36

వితంతువు

మరియా ఖిబ్తియ్య బిన్త్ షామున్

17

-

సఫియా బిన్త్ హయి బిన్ అఖ్తబ్

17

వితంతువు

రైహానా బిన్త్ ఉమ్రు బిన్ హనఫా

-

-

మైమూనా బిన్త్ హారిస్

36

వితంతువు

 

దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ఖదీజా (రజి)ను వివాహమాడినప్పుడు ఆమె వయసు 40 సంవత్సరాలు మరియు ఆయన వయసు 25 సంవత్సరాలు – ఇది పురుషుల యుక్త వయసు – అయిననూ ఆమె మరణించే వరకు ఆయన ఇతర పెళ్లి చేసుకోలేదు.

 

దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం వివాహమాడిన అందరిలో ఆయిషా (రజి) ఒక్కరే కన్య. ఇతర భార్యలందరూ మొదట పెళ్లి అయినవారే. దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లంకు స్త్రీల పిచ్చి మరియు శారీరక ఆనందం పొందే ఆశ ఎక్కువగా ఉండేదని, ఆయనపై నింద వేసిన వారి నిందను ఇది ఖండిస్తుంది. ఎందుకంటే, ఇదే గనక ఆయన ఉద్దేశం అయి ఉంటే, ఆయన కన్యలను మరియు అందమైన స్త్రీలను వెతికి వివాహమాడేవారు.   

 

ఆయిషా (రజి)తప్ప, దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ఇతర భార్యలందరూ వయసు మీరిన వితంతువులు

పైన ఇవ్వబడిన పట్టికను పరిశీలిస్తే, దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం స్త్రీల పిచ్చి లేదా శారీరక ఆనందం ఆశించే వారు కాదని నిరూపితమవుతుంది. ఇదే గనక నిజమైతే, దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ఆయిషా (రజి)తో 6 సంవత్సరాల వయసులోనే సంభోగం జరిపేవారు. అంతేకాక, ఆయన ఇతర భార్యలను కూడా చిన్న వయసు వారినే చేసుకునేవారు మరియు వారితో సంభోగం చేసేవారు. కాని ఆయన ఎన్నడూ ఇలా చేయలేదు. (నౌజుబిల్లాహ్)

 

5 లేదా 9 సంవత్సరాల అమ్మాయిలు బిడ్డను ప్రసవించిన ఉదాహరణలు

తొందరగా యుక్త వయసుకు చేరిన వారు అనేకులు ఉన్నారు.  

 

ఉదాహరణకు, లినా మేడినా 5 సంవత్సరాల 7 నెలల 21 రోజుల వయసులో బిడ్డను ప్రసవించింది. Encyclopaedia Wikipedia లో ఉంది.

 

లినా మేడినా సెప్టెంబర్ 27, 1933 నాడు పెరూలో జన్మించింది. ఆమె 5 సంవత్సరాల, 7 నెలల, 21 రోజుల వయసులో బిడ్డను ప్రసవించింది. వైద్య శాస్త్రంలో ఈమె అతి చిన్న వయసులో బిడ్డను ప్రసవించిన మహిళగా నిరూపించబడింది. ప్రపంచంలో ఇది ఒక రికార్డ్. రష్యాలో దీనికి దగ్గరగా మరో సంఘటన జరిగింది.

(http://en.wikipedia.org/wiki/Lina_Medina)(ఇంగ్లీష్)

 

9 సంవత్సరాల థాయిలాండ్ అమ్మాయి కూడా బిడ్డను ప్రసవించింది:

ఇది New Straits Times లో ప్రచురించబడింది – 10/3/2001.

 

ప్రపంచంలో నేడు, ప్రత్యేకంగా మూడో ప్రపంచదేశాలలో , చాలా చిన్న వయసు అమ్మాయిలను పెళ్ళాడుతారు. 1400 సంవత్సరాల క్రితం 9 సంవత్సరాల అమ్మాయిని పెళ్లి చేసుకున్న దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లంను అమ్మాయిల పిచ్చిగలవారు అని అనడం ఎంత సబబు? నేటికీ ఎంతో మంది దీన్ని పాటిస్తున్నారు, కావున దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లంపై నింద మోపడం సరిఅయినది కాదు. పైన ఉదహరించబడిన అమ్మాయి 9 సంవత్సరాల వయసులోనే బిడ్డను ప్రసవించింది!

 

ఆయిషా (రజి) తల్లిదండ్రులు మనస్ఫూర్తిగా, తమ ఇష్టంతో తమ కూతురును దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లంకు ఇచ్చి పెళ్లి చేశారు. తమ కూతురును అంతిమ ప్రవక్త మరియు భూమి మీద అందరికంటే ఉత్తమమైన వ్యక్తి అయిన దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లంకు ఇచ్చి వివాహం చేసినందుకు వారు గర్వంగా భావించేవారు.

 

దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లంఆయిషా (రజి)ను 6 సంవత్సరాల వయసులో వివాహమాడారా?

ప్రామాణిక హదీసుల ద్వారా తెలిసేది ఏమిటంటే, దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ఆయిషా (రజి)ను 6 సంవత్సరాల వయసులో పెళ్లి చేసుకున్నారు, కాని వివాహ బంధాన్ని ఆమె 9 సంవత్సరాల వయసులో పూర్తి చేశారు.  

 

ఆయిషా (రజి) ఉల్లేఖనం: దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం నన్ను 6 సంవత్సరాల వయసులో వివాహమాడారు. మేము మదీనా వెళ్ళాక, బనీ అల్ హారిస్ బిన్ ఖజ్రజ్ గారి ఇంట్లో నివసించాము. అప్పుడు నేను వ్యాధికి గురయ్యాను మరియు నా వెంట్రుకలు రాలసాగాయి. కొన్ని రోజుల తరువాత వెంట్రుకలు తిరిగి వచ్చాయి. ఒక రోజు నేను నా స్నేహితులతో ఆడుకుంటూ ఉండగా, మా అమ్మ వచ్చింది. ఆమె నన్ను పిలిచింది. నేను ఆమె దగ్గర వెళ్ళగానే, ఆమె నా చేయి పట్టుకుని తీసుకెళ్ళి, ఇంటి గుమ్మం వద్ద నిలబెట్టింది. అప్పుడు  (ఆడటం వల్ల) నా ఊపిరి పైకి రాసాగింది. కాస్త కుదుటుపడ్డాక నీళ్ళతో నా ముఖాన్ని మరియు తలను తుడిచింది. ఆ తరువాత అమ్మ నన్ను ఇంటిలోనికి తీసుకెళ్ళింది. అక్కడ నేను కొందరు అన్సారీ స్త్రీలు ఉండడం చూశాను. వారు ఇలా అన్నారు, “శుభాకాంక్షలు,  అల్లాహ్ దీవెనలు నీపై ఉండుగాక, నీ అదృష్టం బాగుండుగాక.” ఆ తరువాత వారు నన్ను (పెళ్లి కోసం) తయారు చేశారు. నేను ఊహించని విధంగా, ఆ రోజు సాయంత్రం దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం మా ఇంటికి వచ్చారు. మా అమ్మ నన్ను ఆయనకు అప్పగించింది. ఆ సమయంలో నా వయసు 9 సంవత్సరాలు. [సహీహ్ బుఖారీ 4738]

 

హిష్శాం తండ్రి ఉల్లేఖించారు: దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం మదీనాకు వలస చేయటానికిమూడు   సంవత్సరాల ముందు ఖదీజా (రజి) మరణించారు. ఆయన అక్కడ దాదాపు రెండు సంవత్సరాలు ఉన్నాక, ఆయిషా (రజి)ను వివాహమాడారు. అప్పుడు ఆమె వయసు 6 సంవత్సరాలు. దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ఆ వివాహ బంధాన్ని ఆమె 9వ ఏట పూర్తి చేశారు. [సహీహ్ బుఖారీ, vol 5, బుక్ 58, నెం 236]   

 

ఆయిషా (రజి) ఉల్లేఖించారు: నా వయసు 6 సంవత్సరాలు ఉన్నప్పుడు దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం నన్ను వివాహమాడారు. 9 సంవత్సరాల వయసులో ఆయన నన్ను తన ఇంటికి తీసుకెళ్ళారు. [సహీహ్ ముస్లిం, బుక్ 008, నెం 3310]

 

ఆయిషా (రజి) ఉల్లేఖనం: దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ఆమెను ఏడు సంవత్సరాల వయసులో పెళ్ళాడారు. ఆమెను తన ఇంటికి పెల్లికూతురుగా 9 సంవత్సరాల వయసులో తీసుకెళ్ళారు. ఆమెతో ఆమె ఆడుకునే బొమ్మలు కూడా ఉన్నాయి; దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం మరణించినప్పుడు ఆమె వయసు 18 సంవత్సరాలు. [సహీహ్ ముస్లిం, బుక్ 008, నెం 3311]

 

వివాహం పూర్తి అయినప్పుడు యిష (రజి) వయసు ఎంత?

1400 సంవత్సరాల క్రితం ప్రపంచం లోని మానవులు ఇలా ఉండవారు కాదు. క్రమేణా మానవుల్లో చాలా మార్పు వచ్చింది. 1400 సంవత్సరాల క్రితం చిన్న వయసు అమ్మాయిలను పెళ్లి చేసుకోవడం చాలా సర్వ సాధారణం. అప్పుడు చిన్న వయసు అమ్మాయిలను కూడా యువ స్త్రీలుగా భావించేవారు.  

 

9 నుండి 14 సంవత్సరాల మధ్య అమ్మాయిలను యూరోప్, ఆసియా, ఆఫ్రికా దేశాలలో పెళ్ళిళ్ళు చేసేవారు అని చారిత్రక ప్రమాణాల ద్వారా తెలుస్తుంది. ఒక దశాబ్ద కలం ముందు అమెరికాలో కూడా 10 సంవత్సరాల అమ్మాయిలను పెళ్లి చేసేవారు. (దీని ఉదాహరణలు క్రింద ఇవ్వబడ్డాయి).

 

ఆ కాలపు మనుషులను చరిత్రకారులు ఎన్నడు స్త్రీ పిచ్చి గలవారు అని అనలేదు. దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లంపై నింద వేసే వారు బొత్తిగా చరిత్ర జ్ఞానం లేనివారు.  

 

ముస్లిం ఉల్లేఖకుల ప్రకారం సమాజంలోని ఎవరూ ఆయిషా (రజి) పెళ్లి చిన్న వయసులో జరిగిందని ఎలాంటి ఖండన చేయలేదు. అంతేకాదు, ఆయిషా (రజి) తండ్రి, అబూ బకర్ (రజి) ఈ పెళ్లి వల్ల చాలా సంతోషం చెందారు మరియు సమాజంలోని చాలా మంది దీన్ని ప్రోత్సహించారు.   

 

ఇందులో మరో ముఖ్య విషయం ఏమిటంటే, ఆయిషా (రజి) పెళ్లి 6 సంవత్సరాల వయసులో జరిగింది. కాని, వివాహం పూర్తిగావించబడింది మాత్రం ఆమె 9వ ఏట. దీనికి కారణం, ఆయిషా (రజి) 9 సంవత్సరాల వయసులో యవ్వనానికి చేరారు. ఇస్లాం ప్రకారం యవ్వనానికి చేరిన ప్రతి అమ్మాయి, స్త్రీగా భావించబడుతుంది మరియు పెళ్ళికి అర్హత చెందుతుంది.

 

దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం తన మనోవాంఛలను పూర్తి చేసుకోవడానికి పెళ్ళిళ్ళు చేసుకోలేదు

దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లంకు ఆమె (ఆయిషా – రజి)ను పెళ్ళాడినట్లు కల వచ్చింది. ఈ హదీసు సహీహ్ బుఖారిలో ఉంది. ఆయిషా (రజి) ఉల్లేఖనం ప్రకారం దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ఆమెతో ఇలా అన్నారు: “నా కలలో నువ్వు రెండు సార్లు చూపించబడ్డావు. నువ్వు పట్టు చీరలోచుట్టబడి ఉన్నావు. ఈవిడ నీ భార్య అని నాతో అనబడింది. నేను కొంగు జరిపి చూస్తే, నువ్వు కనిపించావు. ఇది అల్లాహ్ తరఫున అయితే, తప్పకుండా జరిగితీరుతుంది అని నేను అన్నాను.” [సహీహ్ బుఖారీ 3682]

 

ఆయిషా (రజి) తో దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం పెళ్లి, స్వయాన దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం నిర్ణయం కాదు. ఈ ఆలోచన ఖౌలా బిన్త్ హాకిం (రజి) గారికి వచ్చింది. ఇలా చేస్తే దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లంకు చాలా దగ్గరి స్నేహితులైన అబూ బకర్ (రజి) – ఆయిషా (రజి) గారి తండ్రి – గారితో స్నేహం బంధుత్వంగా మారుతుందని ఆమె అభిలషించారు. 

 

అబూ బకర్ (రజి) ఇస్లాంలో చాలా ప్రముఖులు మరియు దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లంకు దగ్గరి స్నేహితులు. దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం  మరణం తరువాత ఇస్లామీయ రాజ్యానికి నాయకులైన మొట్ట మొదటి వ్యక్తి ఈయనే.  

 

.

అబూ బకర్ (రజి) గారితో ఉన్న సన్నిహిత సంబంధం వల్ల దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ఆయన మాటను కాదనలేకపోయారు.

 

దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లంతో వివాహానికి ముందు ఆయిషా (రజి) గారి నిశ్చితార్ధం మరో మనిషితో జరిగింది. అతని పేరు జుబైర్ బిన్ ముతెమ్. కాని అబూ బకర్ (రజి) ఇస్లాం స్వీకరించాక, జుబైర్ తల్లిదండ్రులు ఈ నిష్చితార్ధాన్ని రద్దు చేశారు.

 

దీని వల్ల తెలిసిన ఇంకో విషయం ఏమిటంటే, ఆ రోజుల్లో చిన్న వయసులో పెళ్లి చేయడం ఒక సంప్రదాయంగా ఉండేది మరియు దీన్ని ఎవరూ ఆక్షేపించేవారు కాదు. అంతేకాదు, దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లంతో పెళ్లి తరువాత ఆయిషా (రజి) హోదా చాలా పెరిగి పోయింది.

 

సర్వసాధారణమైన అరబ్ ఆచారము

ఆ సమయంలో అరబ్బులలో ఇది సర్వ

సాధారణమైన ఆచారము.


ఇమాం అల్ షాఫయి ఇలా అన్నారు: “నేను యెమన్ లో ఉన్నప్పుడు, ఎంతో మంది అమ్మాయిలు 9 సంవత్సరాల వయసులో యవ్వన దశకు చేరడాన్ని (రుతుస్రావం మొదలవడం) చూశాను,” [సియర్ ఆలం అల్ నుబాలా, vol 10, పేజి 91]

 

ఇమాం బైహఖి ఉల్లేఖనం ప్రకారం ఇమాం షాఫయి ఇలా అన్నారు, “ నేను సనా (యమన్ లోని) నగరంలో 21 సంవత్సరాల నాయనమ్మను చూశాను. ఆమె 9 సంవత్సరాల వయసులో పెద్ద మనిషి అయింది మరియు 10 సంవత్సరాల వయసులో బిడ్డను ప్రసవించింది.” [సునన్ అల్ బైహఖి అల్ కుబ్రా 1/319]


అబ్బాద్ ఇబ్న్ అబ్బాద్ అల్ ముహ్లబి ఇలా అన్నారు: “నేను ముహ్లబా (ఒక ప్రదేశం పేరు) లో 18 సంవత్సరాల అమ్మాయి నాయనమ్మ అవడం చూశాను. ఆమె 9 సంవత్సరాల వయసులో తన బిడ్డకు జన్మనిచ్చింది. ఆమె బిడ్డ కూడా తన తొమ్మిదవ ఏట బిడ్డను ప్రసవించింది. ఇలా ఆమె 18 సంవత్సరాల వయసులో నాయనమ్మ అయిపోయింది.” [తహ్ఖీఖ్ ఫీ అహాదీస్ అల్ ఖిలాఫ్, vol 2, పేజి 267]

 

క్రైస్తవ సాధువుల, రాజుల, నాయకుల వివాహాలు

కాథలిక్ ఎన్సైక్లోపీడియా ప్రకారం: “....పన్నెండు నుండి పద్నాలుగు సంవత్సరాల మధ్య వయసులో ఉన్న మేరీని, 90 సంవత్సరాల జోసెఫ్ పెళ్ళాడారు ....”  (http://www.newadvent.org/cathen/08504a.htm(ఇంగ్లీష్)

 

“పెళ్ళికి సరిఅయిన వయసు పురుషులకు 14 సంవత్సరాలు మరియు స్త్రీలకు 12 సంవత్సరాలు అని కాథలికులు నిర్ణయించారు. ఇంగ్లాండ్, స్పెయిన్, పోర్చుగల్, గ్రీసు దేశాలలో  పురుషులకు 16 మరియు స్త్రీలకు 14 అని నిరనయించబడింది.ఆస్ట్రియాలోని కాథలికులు కూడా ఇదే పాటిస్తారు. అమెరికాలోని కొన్ని ప్రదేశాలలో నేడు కూడా పురుషులకు 14 మరియు స్త్రీలకు 12 సంవత్సరాల పరంపర సాగుతుంది. కొన్ని చోట్ల దీన్ని పెంచారు.(Catholic Encyclopedia, http://www.newadvent.org/cathen/01206c.htm(ఇంగ్లీష్)

 

సాధారణంగా 12 సంవత్సరాల వయసు నిర్ణీత గడువుగా నిర్ణయించబడినప్పటికి, క్రైస్తవ మత గురువులు వారి అమ్మాయిలను దానికంటే ముందే పెళ్ళిచేసేవారు. ఇలా వ్రాయబడి ఉంది: మధ్యయుగ క్రైస్తవులు అమ్మాయిల పెళ్లి వయసు 12 గా నిర్ణయించారు. కాని, ఇదే తప్పనిసరి అని ఎలాంటి నియమం ఉండేది కాదు. ఒక అమ్మాయి పెళ్ళికి సరిపోతుందో కాదో, తేల్చేది ఆమె యవ్వన దశకు (రుతుస్రావం) చేరిందా లేదా అనేది మాత్రమే, ఆమె వయసుతో దీనికి సంబంధం లేదు అని కాథలిక్ పెద్దలు వాదించారు. ఒక కాథలిక్ విద్వాంసుని ప్రకారం, “అబ్బాయి 14 సంవత్సరాలకు మరియు అమ్మాయి 12 సంవత్సరాలకు ముందే యవ్వన దశకు చేరినట్లు తేలిపోతే, వారిద్దరి మధ్య వివాహం చేయడంలో ఎలాంటి తప్పు లేదు.” (Mark E. Pietrzyk, http://www.internationalorder.org/scandal_response.html(ఇంగ్లీష్)

  

యూదుల చట్టం లానే, క్రైస్తవుల చట్టం కూడా పెళ్లి కోసం అమ్మాయి కనీస వయసు 12 అని నిర్ణయించినప్పటికీ, అందులో మార్పుకు అవకాశం ఉంచింది. 12 సంవత్సరాల వయసు కనీస వయసు. మరోమాటలో చెప్పాలంటే, 12 సంవత్సరాల వయసులో అమ్మాయి స్వంతంగా తన పెళ్లి ఏర్పాట్లు చేసుకోవచ్చు. దీని కంటే, తక్కువ కనీస వయసు 7 సంవత్సరాలు. ఈ వయసులో అమ్మాయి తండ్రి, అమ్మాయి అనుమతి లేకుండా ఆమె పెళ్లి చేయవచ్చు.    

 

  1. సెయింట్ ఆగస్టిన్: క్రైస్తవ వేదాంతాన్ని రూపొందించిన ఇతను, తన 31వ ఏట 10 సంవత్సరాల వయసు గల అమ్మాయిని పెళ్ళాడాడు. ఆ తరువాత రెండు సంవత్సరాలు ఆగి, ఆమె 12 సంవత్సరాల వయసులో యవ్వన దశకు చేరాక, వివాహ బంధాన్ని పూర్తి చేశాడు. క్రైస్తవుల మత గురువు ఇలా చేయగా తప్పులేనిది, దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం 9 సంవత్సరాల అమ్మాయిని పెళ్లాడితే తప్పు ఎలా అవుతుంది? (Mark E. Pietrzyk, http://www.internationalorder.org/scandal_response.html(ఇంగ్లీష్)

     
  2. సెయింట్ ఆగ్నెస్: చరిత్రలో మరో ప్రముఖ  క్రైస్తవ గురువు, సెయింట్ ఆగ్నెస్- ఈమె పవిత్రతకు ప్రతిబింబం. ఈమెకు 12 సంవత్సరాల వయసులో వివాహ ప్రతిపాదనలు  వచ్చాయి. కాని అదే వయసులో ఆయిషా (రజి)కు ప్రతిపాదన వస్తే, వీరు ఆశ్చర్యాన్ని ప్రకటిస్తారు.   
    గ్రీకు భాషలో సెయింట్ ఆగ్నెస్ అర్ధం పవిత్రమైనది మరియు లాటిన్ భాషలో గొర్రె పిల్ల లేదా బాధితుడు అవుతుంది. 
    క్రైస్తవులు ఆమెను పవిత్రతకు ప్రత్యేకమైన ప్రతిబింబంగా భావించేవారు. 
    ఆగ్నెస్ మార్చ్ 303లో వీరగతి పొందింది. అప్పుడు ఆమె వయసు 13 సంవత్సరాలు. అంత చిన్న వయసులో కూడా ఆమె తన అందం కారణంగా అనేక మంది పురుషుల హృదయాలను దోచుకుంది. ఎందరో పురుషులు ఆమెను పెళ్ళాడడానికి పోటీపడ్డారు.
    (Domestic-Church.com, http://www.domestic- church.com/CONTENT.DCC/19980101/SAINTS/STAGNES.HTM(ఇంగ్లీష్)
     
  3. ఆన్దేక్స్లోని సెయింట్ హెడ్విగ్: ఈమె క్రైస్తవ అనాధల ముఖ్య సెయింట్ (గురువు)గా భావించేవారు. ఆమె 12 సంవత్సరాల వయసులో హెన్రీ 1 ను పెళ్ళాడింది.
     
  4. సెయింట్ రీటా: ఈమెను క్రైస్తవులు నిస్సహాయ ప్రజల సెయింట్ (గురువు)గా భావించేవారు. ఆమె 12వ ఏట పౌలా మాన్సిని అనే అతనితో పెళ్ళాడారు.  
     
  5. సెయింట్ మేరీ: ఆమె 13 సంవత్సరాల వయసులో వివాహమాడింది. 
     
  6. పోర్చుగల్ లోని సెయింట్ ఎలిజిబెత్ : సెయింట్ ఫ్రాన్సిస్ మూడో వంశానికి  చెందిన ఈవిడ పెళ్లి 12 సంవత్సరాల వయసులో జరిగింది.  

 

గౌరవప్రదమైన క్రైస్తవ గురువుల అనేక ఉదాహరణలు...

 

  1. కింగ్ రిచర్డ్ ll, ముఫ్ఫై సంవత్సరాల వయసులో కేవలం ఏడు సంవత్సరాల ఇసాబెల్లా అనే అమ్మాయిని పెళ్ళాడారు. http://en.wikipedia.org/wiki/Isabella_of_Valois (ఇంగ్లీష్)
     
  2. మిలాన్ రాణి, బియాంక, 13 సంవత్సరాల వయసులో పెళ్లి చేసుకుంది. http://www.academia.edu/990174/Medieval_Marriage (ఇంగ్లీష్)
     
  3. థిఒడోరా కోమ్నీన 13 సంవత్సరాల వయసులో తన కంటే రెట్టింపు వయసు గల కింగ్ బాల్డ్విన్ lll ను పెళ్ళాడారు.    http://www.academia.edu/990174/Medieval_Marriage(ఇంగ్లీష్)
     
  4. నవార్రే కు చెందిన జేనీ lll 13 సంవత్సరాల వయసులో పెళ్లి చేసుకుంది.
     http://en.wikipedia.org/wiki/Jeanne_d'Albret (ఇంగ్లీష్)
     
  5. జియోవన్ని ఫోర్జా, 13 సంవత్సరాల లుక్రేజియా బోర్గియ అనే అమ్మాయిని పెళ్ళాడారు.  
    http://en.wikipedia.org/wiki/Giovanni_Sforza
     (ఇంగ్లీష్)
     
  6. నార్వేకు చెందిన కింగ్ హాకోన్ Vl, పది సంవత్సరాల క్వీన్ మార్గరేట్ ను పెళ్ళాడారు.   
    http://en.wikipedia.org/wiki/Margaret_I_of_Denmark
     (ఇంగ్లీష్)

 

ఇలా ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి.

 

దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం శత్రువులు ఆ సమయంలో ఎలా ప్రవర్తించారు

ఖురైషు ప్రజలు ఎల్లప్పుడూ దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లంపై నిందలు వేయడానికి ఎదురు చూస్తూ ఉండేవారు. ఈ పెళ్లి వల్ల వారు ఆయనపై నిందలు మోపే అవకాశం వచ్చింది. కాని, వారికి ఇందులో ఎలాంటి తప్పు కనిపించలేదు. అందుకే వారు ఆయనపై ఎలాంటి నింద మోపలేదు, సరికదా దీన్ని స్వాగతించారు.  

 

ఆయిషా (రజి) ఎన్నడూ ఈ పెళ్లిపై అసహ్యం చూపలేదు

మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఆయిషా (రజి) ఉల్లేఖించిన హదీసులు వేలలో ఉన్నాయి. అయిననూ ఆమె ఎన్నడూ, ఏ హదీసులో గానీ ఈ పెళ్లి గురించి తన అసహ్యాన్ని గానీ, అసంతృప్తిని గానీ వెల్లడించలేదు. దీని వల్ల తెలిసింది ఏమిటంటే, ఆమెకు ఈ వివాహ బంధం వల్ల ఎలాంటి అసౌకర్యం కలగలేదు. అంతేకాక, అనేక వ్యాఖ్యానాల ద్వారా, ఆమె దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లంను చాలా ప్రేమించేవారని మరియు ఇతర స్త్రీలు ఆయన చుట్టుప్రక్కల ఉంటే అసూయ చెందేవారని కూడా తెలుస్తుంది. ఇది చూస్తే, ఆమె ఈ పెళ్లి వల్ల చాలా సంతోషంగా ఉండేవారని నిరూపితం అవదా? ఈ వివాహ బంధం వల్ల ఆమెకే ఎలాంటి సమస్య లేనప్పుడు, ఇతరులకు సమస్య ఎలా అవుతుంది?

 

ఆయిషా (రజి) ఈ పెళ్ళితో చాలా సంతోషం చెందారు. ఆమె దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లంకు చాలా తోడ్పాటు అందించారు. ఆయన వద్ద ఇస్లాం గురించి చాలా నేర్చుకున్నారు. ఆమె అనేక స్త్రీలకు మరియు పురుషులకు తన జీవితకాలంలో ఇస్లాం గురించి నేర్పించారు. ఆమె తల్లిదండ్రులు కూడా ఈ వివాహం వల్ల చాలా సంతోషపడ్డారు. దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం అనుచరులు గానీ, స్నేహితులు గానీ – ఎవరూ ఈ పెళ్ళికి విరోధం తెలుపలేదు.

 

పెళ్లి వెనుక గల వివేకము

ఆయిషా (రజి)ను చిన్న వయసులో పెళ్లి చేసుకోవడం వల్ల, దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం జీవితంలోని అనేక వ్యక్తిగత విషయాలను ఆమె కళ్లారా చూశారు మరియు వాటిని రాబోయే తరాలకు తరలించడంలో చాలా తోడ్పడ్డారు. చిన్న వయసులో మానవుల మేధస్సు చాలా పదునుగా ఉంటుంది మరియు ప్రతి దాన్ని చాలా పరిశీలనగా చూస్తారు. ఆయిషా (రజి) దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం మరణాంతరం దాదాపు 46 సంవత్సరాలు జీవించారు. ఇన్ని సంవత్సరాలు ఆమె ఇస్లాంకు సంబంధించిన ఎన్నో ప్రముఖ విషయాలను ఇతరులకు బోధించారు. అందులోనూ, ఇంటి విషయాలు మరియు భార్యా భర్తలకు సంబంధించిన విషయాలు ప్రత్యేకంగా బోధించారు.                                                           

 

ఆయిషా (రజి) దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లంకు మానసికంగా మరియు శారీరకంగా దగ్గరవడం వల్ల, ఆమె ప్రత్యేకంగా స్త్రీల కోసం ఒక ఉదాహరణగా మరియు ఆదర్శంగా ఉండేవారు. ఆమె చాలా తెలివి మరియు వివేకం గల స్త్రీ అవడం వల్ల, ఆధ్యాత్మిక గురువు మరియు విద్వాంసురాలిగా ఖ్యాతి చెందారు. ఆమె దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ఇస్లామీయ కార్యాల్లో చాలా తోడ్పడేవారు. ఆయిషా (రజి) – విశ్వాసుల (ముస్లింల) తల్లి, భార్యలు మరియు తల్లుల కొరకు ఆదర్శమూర్తులు, ఖుర్ఆన్ వ్యాఖ్యానం చేయడంలో మంచి నైపుణ్యం ఉండేది, ప్రముఖ హదీసు ఉల్లేఖకులు, ఇస్లామీయ చట్టం గురించి బాగా తెలిసునవారు.       

 

ఆమె దాదాపు 2,210 హదీసులు ఉల్లేఖించారు. వీటి వల్ల ముస్లింలకు దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం గారి జీవితంలోని అన్ని విషయాలు వివరంగా తెలిశాయి. ఈ విధంగా దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం సున్నత్ (ఆచారాలు) భద్రంగా ఉండిపోయాయి.

 

ఇస్లామీయ విద్వాంసుల ప్రకారం, ఆయిషా (రజి) లేని పక్షంలో హదీసు జ్ఞానంలోని దాదాపు సగ భాగం పరిరక్షించబడేది కాదు.   

 

ఆయిషా (రజి) ఎల్లప్పుడూ సత్యం కోసం పోరాడారు. ఆమె అనేక మందికి ఇస్లాం బోధించారు. ఆమెకు ఇస్లామీయ చట్టంపై  మంచి పట్టు ఉండింది, ప్రత్యేకంగా మహిళలకు సంబంధించిన విషయాలలో. 

 

ఆయిషా (రజి) ఒక ధార్మిక గురువుగా చేసే ప్రసంగం ప్రజలను మంత్రముగ్దుల్ని చేసేది. అల్ అహ్నాఫ్ ఆమె గురించి ఇలా అన్నారు, “నేను అబూ బకర్, ఉమర్, ఉస్మాన్, అలీ (రజిఅల్లాహు అన్హుం)ల ప్రసంగాలను విన్నాను. కాని, ఆయిషా (రజి) ప్రసంగంలో ఉండే ప్రేరణ, స్ఫూర్తి ఇతరుల ప్రసంగాలలో అంతగా ఉండేది కాదు.”    

 

అబూ మూసా అల్ అష్ అరీ (రజి) ఉల్లేఖనం: దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ఇలా అన్నారు: “ఇతర స్త్రీలకు మరియు ఆయిషా (రజి)కు మధ్య భేదం – సరీద్ (మాంసం, రొట్టె) మరియు మామూలు అన్నానికి గల తేడా లాంటిది. పురుషులెందరో ఉన్నత స్థానానికి చేరుకున్నారు, కాని స్త్రీలలో అంత ఉన్నత స్థానానికి చేరిన వారు, మర్యం అలైహిస్సలాం (ఈసా – అలైహిస్సలాం - తల్లి) మరియు ఆసియా (ఫిరౌన్ భార్య).” [సహీహ్ బుఖారీ vol 4:643]

 

ముసా ఇబ్న్ తల్హా (రజి) ఇలా అన్నారు, “ఆయిషా (రజి) మాట్లాడినంత (ప్రసంగించినంత) అనర్గళంగా ఎవరూ మాట్లాడేవారు కాదు.” [ముస్తద్రక్ లిల్ హాకిం vol.4, p.11]

 

ఇది (ఈ పెళ్లి) దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లంస్వయంగా తీసుకున్న నిర్ణయం కాదు, అల్లాహ్ తరఫున నిశ్చయించబడినది అని తెలుస్తుంది. ఆమె స్వయంగా ఇలా అన్నారు: “దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం నాతో ఇలా అన్నారు, ‘పెళ్లికి ముందు నీవు నా కలలో రెండు సార్లు చూపించబడ్డావు. ఒక దైవదూత నిన్ను పట్టు చీరలో తీసుకువెళుతుండగా నేను అతనితో, ఈమె ఎవరో చూపించు అని అన్నాను. చూస్తే అది నీవే.’” [సహీహ్ బుఖారీ 6495]

 

సయ్యిదా ఆయిషా దేని కోసం ప్రఖ్యాతి చెందారు?

 

ఆమె ప్రాముఖ్యత ఏమిటి?

 

అది అందమా?

 

ధనమా?

 

కాదు! ఆమె ధర్మం మూలంగా ఖ్యాతి చెందారు. ఇది దైవాదేశం అని నిరూపితమవుతుంది.

 

యూదులు మరియు క్రైస్తవుల్లో వివాహపు వయసు

యూద మతం ప్రకారం ఒక అమ్మాయి మూడు సంవత్సరాల ఒక రోజు దాటితే పెళ్ళికి అర్హురాలైపోతుంది.

 

యూదుల వెబ్ సైట్, jewfaq.org, ఇలా చెబుతుంది:   

 

“యూద మత చట్టం ప్రకారం వివాహానికి అబ్బాయిల కనీస వయసు 13 సంవత్సరాలు; అమ్మాయిల కనీస వయసు 12 సంవత్సరాలు. కాని నిశ్చితార్ధం అంతకు ముందు కూడా చేయవచ్చు. మధ్య యుగ కాలంలో దాదాపు ఇలాగే జరిగేది.”  (JewFaq.org,http://www.jewfaq.org/marriage.htm) (ఇంగ్లీష్)

 

పన్నెండు సంవత్సరాల వయసులో యవ్వన దశ ప్రారంభమవుతుంది. యూద ధర్మపు చట్టం ప్రకారం, ఈ వయసులో పెళ్లి చేయవచ్చు అని అనడమే కాక, దీన్ని ప్రోత్సహించబడింది. తమ కూతుళ్ళకు తొందరగా పెళ్లి చేయండని వారి తండ్రులకు సలహా ఇవ్వబడేది.   

 

అనేక యూద మత విద్వాంసుల ప్రకారం, అమ్మాయి యవ్వన దశకు చేరిన వెంటనే, ఆలస్యం చేయకుండా ఆమె పెళ్లి చేసి వేయాలి. యూద ఎన్సైక్లోపీడియా ఇలా అంటుంది:

 

“బైబిల్ మొదటి సానుకూల ఆదేశం, రబ్బినిక్ వ్యాఖ్యానం ప్రకారం- (మైమోనైడ్స్ , “మిన్యాన్హ-మిజ్వోట్” 212)- ఇందులో మానవ జాతుల గురించి వివరించబడింది (Gen 1.28).   

 

(Jewish Encyclopedia, http://www.jewishencyclopedia.com/view.jsp?letter=M&artid=216) (ఇంగ్లీష్)

 

ఓల్డ్ టెస్టమెంట్ లో ఇస్హాఖ్ బిన్ ఇబ్రాహీం అలైహిస్సలాం పెళ్లి ప్రస్తావించబడింది. ఆయన మూడు సంవత్సరాల వయసు గల రెఫ్కా అనే అమ్మాయిని పెళ్ళాడారు. ఇస్హాఖ్ అలైహిస్సలాం జన్మించినప్పుడు సారా (ఆయన తల్లి) వయసు 90 సంవత్సరాలు. ఇబ్రాహీం అలైహిస్సలాం నవ్వుతూ, మనసులో ఇలా అనుకున్నారు, ‘100 సంవత్సరాలు వయసు గల మనిషికి బిడ్డ పుట్టగలడా? 90 సంవత్సరాలు గల సారా బిడ్డను జన్మనివ్వగలదా?’ [జెనెసిస్ 17:17]

 

హిందూ మతంలో పెళ్లి వయసు

హిందూ మత గ్రంథమైన మను స్మృతిలో ఇలా ఉంది:

 

గౌతమా (18-21) – అమ్మాయి యవ్వన దశకు చేరక ముందు పెళ్లి చేయవచ్చు.

 

వశిష్ట (17.70) – అమ్మాయికి  రుతుస్రావం మొదలవక ముందే, ఆమె బట్టలు లేకుండా బయట తిరిగే వయసులోనే (అంటే, చాలా చిన్న వయసులో)  తండ్రి ఆమె పెళ్లి చేసేయాలి. లేని పక్షంలో తండ్రికి పాపాలు చుట్టుకుంటాయి.    

 

బోధ్యానా (4.1.11) -  అతను తన కూతురును, తను ఇంకా బట్టలు లేకుండా తిరిగే వయసులోనే ఇచ్చివేయాలి (పెళ్లి చేయాలి). ఎవరైతే పవిత్రంగా ఉన్నారో,ఉత్తమ లక్షణాలు కలిగి ఉన్నారో,  అలాంటి వారికి ఇచ్చి పెళ్లి చేయాలి. అమ్మాయి యవ్వన దశకు చేరాక ఆమెను ఇంట్లో ఉంచుకోకూడదు.

(Manu IX, 88; http://www.payer.de/dharmashastra/dharmash083.htm) (ఇంగ్లీష్)

 

“హిందూ అమ్మాయి యవ్వనం దశకు చేరాక కూడా ఆమె పెళ్లి చేయని తండ్రి పాపం చేసినట్లుగా భావించేవారు. అలాంటి అమ్మాయి సుద్రా (చిన్న జాతి)లో పడిపోయేది. అలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకున్నవాడు అవమానం భరించాల్సి ఉండేది. మను స్మ్రితి అబ్బాయి మరియు అమ్మాయి పెళ్లి వయసు 30-12 లేదా 24-8 గా నిర్ణయించింది. బ్రహస్పతి మరియు మహాభారతంలోని కొన్ని భాగాలలో పెళ్లి వయసు 10-7 హ తెలియజేయబడింది. దాని తరువాతి వచనాలలో 4-6 కనీస వయసుగా మరియు 8 గరిష్ట వయసుగా (అమ్మాయి పెళ్లి వయసుగా) నిర్ణయించబడింది.    

(Encyclopedia of Religion and Ethics, p.450,

http://books.google.com/books?id=INJI4FGeLpYC&pg=PA523&lpg=PA523&dq=manu+ix +a+girl+should+be+given+in+marriage+before+puberty&source=web&ots=7WP3uyXj9V&sig=HN- O7gG0ya_0QTuwCvEUjGPQG_Y#PPA522,M1) (ఇంగ్లీష్)

 

ఇస్లాంలో పెళ్లి వయసు

ఇస్లాం పెళ్లి వయసును యవ్వన దశతో జోడించింది. ఎందుకంటే, ఈ దశలోనే అమ్మాయి స్త్రీగా మారుతుంది. రుతుస్రావం, అమ్మాయి బిడ్డను ప్రసవించే శక్తిని కలిగి ఉందని సూచిస్తుంది. ఈ వయసు (యవ్వన దశ) ప్రాంతానికి, దేశానికి మారుతూ ఉంటుంది.  

 

ఇస్లామీయ చట్ట ప్రకారం పెళ్లి (నిఖా) ఒప్పందం, పెళ్ళికి అనేక సంవత్సరాల ముందు చేసుకోవచ్చు. పెళ్లి ఒప్పందం జరిగాక కూడా అమ్మాయి భర్త ఇంట్లో కాకుండా, తన తల్లిదండ్రుల వద్ద ఉండవచ్చు. మరో మాటలో చెప్పాలంటే, అమ్మాయి యవ్వన దశకు చేరక ముందే పెళ్లి చేయవచ్చు. కాని, భర్త వద్దకు యవ్వన దశకు చేరాకనే పంపాలి.    

 

ఇస్లామీయ చట్ట ప్రకారం, కొన్ని ‘షురూత్ అన్ నిఫాద్’ (పెళ్లి ఒప్పందం చేసుకోవడానికి కావలసిన షరతులు): ఇద్దరు (భార్యాభర్తలు) యవ్వన దశకు చేరి ఉండాలి. ఈ షరతు పూర్తి కానిచో, పెళ్లి ఒప్పందం ‘మౌఖూఫ్’ (తాత్కాలికంగా రద్దు) అవుతుంది. అమ్మాయి యవ్వనానికి చేరగానే, పెళ్లి ఒప్పందం అమలులోకి వస్తుంది. ఉదాహరణకు, దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం మరియు ఆయిషా (రజి)ల వివాహం. ఆయిషా (రజి) ఇంకా యవ్వనానికి చేరక ముందు పెళ్లి ఒప్పందం జరిగింది. ఆమె యవ్వనానికి చేరాకనే, పెళ్లి పూర్తి గావించబడింది. అందువల్లే, ఆయిషా (రజి) పెళ్లి ఒప్పందం తరువాత కూడా మూడు సంవత్సరాలు తన తండ్రి ఇంట్లోనే ఉన్నారు.    

 

ఇస్లామీయ చట్ట ప్రకారం, భార్యాభర్తల మధ్య లైంగిక సంపర్కం జరిగాకనే, పెళ్లి పూర్తి అవుతుంది. ఇస్లాంలో అమ్మాయి పెళ్లి కనీస వయసు 8 సంవత్సరాలు లేదా రుతుస్రావం మొదలవడం అని కొందరు ముస్లింలు భావిస్తారు. ఇది సరిఅయినది కాదు; వాస్తవానికి ఇస్లాంలో పెళ్లికి ఫలానా వయసు ఉండాలనే షరతు లేదు. 

 

ఇస్లామీయ చట్టం చాలా సులువైనది:

స్త్రీకు లైంగిక సంపర్కం వల్ల ఎలాంటి హాని ఉండదనే నిర్ధారణ అయిన వెంటనే, భర్త తన భార్యతో లైంగిక సంపర్కం చేయవచ్చు. ఇది ప్రపంచంలోని అన్ని విధానాలలో మేలైనది. ఇస్లామీయ విద్వాంసులు ఏకగ్రీవంగా (ఇజ్మా) దీన్ని ఆమోదించారు.  

 

యూద మరియు క్రైస్తవ గ్రంథాల పరిశీలన

తల్ముద్ (యూదుల గ్రంథం) ఇలా అంటుంది: “అమ్మాయి యవ్వనానికి చేరగానే, ఒక బానిసతో అయినా సరే ఆమె పెళ్లి చేసేయాలి. (తల్ముద్, పెసాచిం 113 a)”

 

తల్ముద్ లోని 11వ ఆజ్ఞ ప్రకారం: ‘పెద్ద వయసు గల పురుషులు యువ స్త్రీలతో లైంగిక సంపర్కం జరపడం సర్వ సాధారణం.’ సయీద్ రబీ జోసెఫ్ ఇలా వ్రాశారు: ‘అమ్మాయికి మూడు సంవత్సరాల ఒక రోజు నిండినచో, ఆమె లైంగిక సంపర్కానికి అర్హులైపోతుంది.’  

 (Mark E. Pietrzyk, http://www.internationalorder.org/scandal_response.html(ఇంగ్లీష్)

 

యోచించవలసిన విషయాలు

క్రింద ఇవ్వబడిన విషయాలు  నిందలను ఖండిస్తాయి.

  1. దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం శత్రువులు ఆయనకు విరుద్ధంగా దీన్ని ఎందుకు వాడలేదు? కాని వారు ఒక్కసారి కూడా దీన్ని దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లంకు విరుద్ధంగా ఉపయోగించలేదు.
     
  2. ఆయిషా (రజి)ను దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లంకు ఇచ్చేటప్పుడు, ఆమెతో పాటు ఉన్న స్త్రీలు, ఆమెకు శుభాకాంక్షలు ఎందుకు చెప్పారు మరియు ఆనందాన్ని ఎందుకు వెలిబుచ్చారు? వారు బాధపడుతూ ఉండాల్సిందిపోయి ఆయిషా పెళ్లిపై ఆనందపడ్డారు. వారు ఈ పెళ్లిపై ఎలాంటి నిరుత్సాహం చూపలేదు.   
     
  3. ఆయిషా  (రజి) ఈ పెళ్లిపై సంతోషంగా లేనట్టు ఒక్క హదీసు కూడా లేదే? ఆమెపై అత్యాచారం చేసినట్టు ఒక్క హదీసు కూడా లేదు. పైగా ఆమె పెద్ద ఇస్లామీయ నాయకురాలిగా మరియు విద్వాంసురాలిగా ప్రసిద్ది చెందారు. 
     
  4. ఆయిషా (రజి), దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లంతో కోపంగా ఉంటే, ఇతర స్త్రీలు ఆయనకు దగ్గరగా కనిపిస్తే ఆమె ఎందుకు అసూయచెందేవారు? దీనికి కారణం ఆమె దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లంను చాలా గాఢంగా ప్రేమించేవారు. 

 

ముగింపు

పెడోఫిలియా (ఆడవాళ్ళ పిచ్చి ఉన్నవాడు) స్వీయాత్మకమైన (subjective term) పదం. కొన్ని దేశాలలో పెళ్లి వయసు 16 సంవత్సరాలుగా నిర్ణయించారు. మరి కొన్ని దేశాలలో దీనికంటే తక్కువ లేదా ఎక్కువ వయసును నిర్ధారించారు. కావున ఒక దేశంలో పెడోఫిలియా అయినవాడు మరో దేశంలో పెడోఫిలియ కాడు. దీన్ని ఎవరు నిర్ధారిస్తారు? దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం 1400 సంవత్సరాల పూర్వపు సమాజంలో జీవించారు. కావున, మనము నేటి సమాజపు కట్టుబాట్లను, అప్పటి సమాజంపై రుద్దడం సమంజసం కాదు.

 

ప్రపంచం మొత్తంలో పెళ్లి గురించి ఒకే సామాన్యమైన చట్టం ఉండాలి. అదేమిటంటే, పెళ్లి వలన ఎలాంటి హాని లేని పక్షంలో పెళ్లి చేయవచ్చు. కాని, పెళ్లి వల్ల ఏదైనా హాని జరిగే అవకాశం ఉన్నచో, పెళ్లి చేయరాదు.

 

ఇది ఎలా తెలుస్తుంది అని ఎవరైనా ప్రశ్నించవచ్చు? అమ్మాయి లేదా అబ్బాయి శారీరక మరియు మానసిక ఎదుగుదలను చూసి పసిగట్టడం అంత కష్టం కాదు. వారి ఎదుగుదల సూచించిన విధంగా వారు అమలు చేయవచ్చు.   

 

దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం పూర్తి మానవాళికి ఆదర్శమూర్తి. ఆయన దైవప్రవక్త మాత్రమే కాకుండా, ఓ ఉన్నత- అధికారి, నాయకులు, బోధించేవారు, సేనాధిపతి, పొరుగువారు మరియు స్నేహితులు. కుటుంబ జీవితంలో ఆయన అందరికంటే ఉత్తమ ఆదర్శమూర్తులు. ఎందుకంటే, ఆయన భర్తగా మరియు తండ్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. అనేక కుటుంబ సమస్యలు, ప్రత్యేకంగా పాశ్చాత్య దేశాలలోని కుటుంబ సమస్యలకు పరిష్కారం దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం సున్నత్ లలో(ఆచరణలలో) చాల సునాయాసంగా లభిస్తుంది.  

 

అల్లాహ్ ఖుర్ఆన్ లో ఇలా అన్నాడు: ఇంకాఈ  విధంగా  ప్రకటించు:  ''సత్యం  వచ్చేసింది.   అసత్యం  సమసిపోయింది.  నిశ్చయంగా,  అసత్యం  సమసిపోవలసినదే.''[ఖుర్ఆన్ సూరా ఇస్రా 17:81]

 

ఆధారాలు

[1] http://www.answering- christianity.com/aisha.htm (ఇంగ్లీష్)

[2] http://www.answering-christianity.com/sami_zaatri/aisha_and_prophet_Muhammad صلى الله عليه وسلم.htm (ఇంగ్లీష్)

[3] http://www.answering- christianity.com/childbrides_rebuttal.htm (ఇంగ్లీష్)

[4] http://muslim- responses.com/Marriage_with_Aisha/Marriage_with_Aisha_ (ఇంగ్లీష్)

[5] http://www.islamic- awareness.org/Polemics/aishah.html (ఇంగ్లీష్)

[6] http://www.iol.ie/~afifi/BICNews/Sabeel/sabeel6.htm (ఇంగ్లీష్)

[7] http://www.call-to- monotheism.com/why_did_prophet_muhammed_marry_aisha_at_a_young_age__is_that_morally_right__what_about_paedophilia___by_dan_19 88 (ఇంగ్లీష్)

[8] http://forums.almaghrib.org/showthread.php? t=64727 (ఇంగ్లీష్)

[9] http://www.letmeturnthetables.com/2008/07/why-prophet-muhammad-married-aisha-when.html (ఇంగ్లీష్)

[10] http://www.ummaland.com/blog/927/defending-the-marriage-of-our-beloved-prophet-muhammad-s-a-w-s-with-our-bel/ (ఇంగ్లీష్)

 

1162 Views
మమ్మల్ని సరిచేయండి లేదా మిమ్మల్ని సరిచేసుకోండి
.
వ్యాఖ్యలు
పేజీ యొక్క టాప్