అస్- సఫా వల్-మర్వాహ్


సఫా మరియు మర్వా అనేవి చిన్న పర్వతాలు ఇవి సౌదీ అరేబియాలోని మక్కాలోని కాబా దగ్గర వున్నవి. సఫా మరియు మర్వా అనేవి హజ్ మరియు ఉమ్రా లోని ఒక భాగం. ప్రతి హాజీ ఈ రెండు పర్వతాల మధ్యలో ఏడు సార్లు నడవాలి. ఈ రెండు ప్రదేశాల మధ్యలో నడవాన్ని స’యీ అంటారు. (ఈ రెండు ప్రదేశాలు అల్లాహ్ సూచనలలోనివి)

 

విషయసూచిక

 

ఖుర్ఆన్ దృష్టిలో

ఈ విషయాన్ని ఖుర్ఆన్ దృష్టిలో చూస్తే  ఇవి అల్లాహ్ చిహ్నలలోనివి . అల్లాహ్ సుబు హానహు వత ఆలా ఖుర్ఆన్ లో  ఇలా సెలవిస్తున్నాడు.  ఇన్నస్-సఫా-వల్-మర్-వత-మిన్ షఆ-ఇరిల్లాహి-ఫమన్ హజ్జల్ బైత-అవి’-తమర-ఫలా-జునాహా-అలైహి-అన్-యత్-తవ్వఫ- బిహిమా-వమన్-తతవ్వఅ-ఖైరన్-ఫ-ఇన్నాల్లాహా-షాకిరున్-అలీమున్. 

 

నిస్సందేహంగా సఫా మర్వాలు అల్లాహ్ చిహ్నాలలోనివి. కనుక కాబా గృహాన్ని (సందర్శించి)హజ్ ఉమ్రాలు చేసేవారు వాటి మధ్యన ప్రదక్షిణ అందులో ఏ మాత్రం తప్పులేదు. స్వచ్చందంగా ఎవరైనా ఏదైనా సత్కార్యం చేస్తే అల్లాహ్ ఆదరించేవాడు, తెలుసుకునేవాడు. సూరా అల్ బఖర 2:158.

 

హాజ్ మూలస్థంభం

 ఈ రెండు ప్రసిద్ధిగాంచిన పర్వతాలు మక్కాలోని  అల్-మస్జిద్ అల్ హరాం  ప్రదేశంలో ఉన్నవి. అస్-సఫా పర్వతం అబూ ఖుబైస్ పర్వతం తో కలిసి ఉన్నది, అల్-మర్వా పర్వతం ఖు’అయ్కి’ఆన్ తో కలిసి ఉన్నది. అల్-మస్జిద్ అల్-హరాం విస్తరణ సమయంలో అస్-సఫా,అల్-మర్వా పర్వతాలు మిగతా వాటితో వేరు అయ్యాయి, అలాగే ఈ రెండు పర్వతాలు అల్-మస్జిద్ అల్-హరాం ఆవరణలోకి వచ్చాయి.

 

 అస్-సఫా,అల్-మర్వా మధ్య దూరం 400 మీటర్లు,  మస్’అ ప్రదేశం [అస్-సఫా,అల్ మర్వా మధ్యలో హాజీ లు నడిచే ప్రదేశం లో ] ఆకుపచ్చని బల్బులతో  55 మీటర్లు  దూరం వరకు ఆవరించి ఉంది.  ఈ ప్రదేశంలో హాజీలు కొంచెం వేగంగా పరిగెత్తాలి. ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాం భార్య అయిన హాజిరా అలైహిస్సలాం మస్’అ ప్రదేశంలో నీటి కోసం వేగంగా పరిగెత్తుతూ వెతకసాగింది.

 

అస్-సఫా మరియు అల్-మర్వా మధ్యలో చేసే స’యీ అనేది హజ్ ,ఉమ్రా ల మూలస్థంభం. మొత్తం పూర్తిగా 7 సార్లు తిరగాలి, మొదట సఫా దగ్గర నుండి మొదలు పెట్టాలి. జాబిర్ ఉల్లేఖనం ప్రకారం సహీహ్ అల్ – బుఖారీ లో ఇలా తెల్పబడింది: ప్రవక్త ముహమ్మద్ హజ్ సమయంలో 7 సార్లు సయీ అస్-సఫా మరియు అల్-మర్వా మధ్యలో తిరగారు

 

సఫా,మర్వా మధ్యలో చేసే స’యీ

సఫా మర్వా మధ్యలో నడిచే లేదా పరిగెత్తడాన్ని స’యీ అంటారు.ప్రవక్త సఫా దగ్గర నుండి మొదలుపెట్టేవారు, అక్కడ కాబా కనబడే వరకు సఫా పర్వతం పైకి చేరి తన మొహాన్ని కాబా వైపు త్రిప్పి దుఆ చేసి తక్బీర్ ఈ క్రింది పదాలను పలికేవారు:

 

అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ – లా ఇలాహ ఇల్లల్లాహు వహ్దహు లా షరీకలహు – లహుల్ ముల్కు  వ లహుల్ హందు  - యుహీఉ  వ యుమీతు వ హువ అలా కుల్లి షైయిన్ ఖదీర్ - లా ఇలాహ ఇల్లల్లాహు వహ్దహు లా షరీకలహు – అన్జజా వ’దహూ వ నసారా’అబ్దహు వ హజామల్ ఆహ్ జాబ వహ్దహు.   

 

ఇలా మూడుసార్లు పలికిన తర్వాత దుఆ చేసేవారు. ప్రవక్త స’యీ చేయండి అల్లాహ్ మీపై స’యీ చేయడం విధిగా చేశాడు అని చెప్పారు.

 

కాబట్టి ఆయన  కుడి ఎడమల  వైపు ఆకుపచ్చని చిహ్నం వచ్చినప్పుడు త్వరగా పరిగెత్తడం మొదలెట్టారు, ఆ విధంగా రెండవ ఆకుపచ్చని చిహ్నం వరకు వెళ్లి అక్కడినుండి నెమ్మదిగా నడిచేవారు. ఈ ఆకుపచ్చని చిహ్నం ప్రవక్త ముహమ్మద్ కాలంలో ఎండిన బురుద మట్టిలో కొన్ని రాళ్ళను కలిపి ఒక చిన్న అడ్డుగోడ గా ఉండేది. ప్రవక్త ఇలా చెప్పారు : (ఈ ఎండిన బురుద మట్టినీ దాటేవరకూ వేగంగా పరిగెత్తాలి) తర్వాత ఆయన మర్వా దగ్గరకు వెళ్లి ఏదైతే సఫా దగ్గర చేశారో అలా చేయారు. అంటే ఖిబ్లా వైపు మ్రోహం త్రిప్పి, తక్బీర్ మరియు తహ్లీల్ మరియు దుఆ చేశారు. అప్పుడు సయీ లోని ఏడు భాగాలలో ఒక భాగం పూర్తి చేశారు.

 

తర్వాత అయన అస్-సఫా దగ్గరికి పైన చేసిన విధానం ప్రకారమే నడిచారు, ఎలాగైతే నడిచే ప్రదేశంలో నడిచారు మరియు పరిగెత్తే ప్రదేశంలో పరిగెత్తారు. అలాగా సయీ లోని  ఏడు భాగాలలో రెండవ భాగం పూర్తి చేశారు.  తర్వాత ఆయన మర్వా వైపు తిరిగి  వెళ్ళారు అలా పూర్తిగా ఏడు సార్లు స’యీ చేసి చివరిగా మర్వా చేరుకున్నారు.

 

సఫా మరియు మర్వా ల మధ్య పరిగెత్తడాన్ని అనుమతించబడింది, కాని ప్రవక్త  నడవడానికే ప్రోత్సాహించారు.

 

స’యీ చేసేటప్పుడు ఈ దుఆ పలకాలి: రబ్బిగ్ఫీర్ వరహం ఇన్నక అంతల్ అ’అజుల్ అక్రం    

 

ఓ అల్లాహ్ నన్ను క్షమించు మరియు నాపై దయ చూపు, వాస్తవంగా మీరు అత్యంత శక్తిమంతుడు మరియు అధికంగా దయచూపేవాడు.

 

ఎప్పుడైతే ఏడవ సారి సఫా మర్వా ల మధ్యన నడవడం పూర్తయిన తర్వాత ఆయన తల వెంట్రుకలను కత్తిరింపజేశారు, దీనితో ఉమ్రా పూర్తి చేశారు. ఇహ్రామ్ దుస్తులలో ఉన్నప్పుడు ఏవైతే నిషేదించబడిన విషయాలు అన్ని అనుమతించబడతాయి అని చెప్పారు. అలా మరల (జుల్ హజ్జా 8 వ తేదీన) యౌమ్ ఉత్ తర్వియహ్ ముందు రోజు వరకు  అనుమతించబడతాయి అని చెప్పారు, ఎందుకంటే ఆ సమయంలో ఇహ్రామ్ లో ఉండరు కాబట్టి అని చెప్పారు.

 

ఎవరైతే హజ్ చేయడానికి ముందు ఉమ్రా చేయాలని నిస్చయించుకోలేదో, అలాగే హాది (కుర్భానీ జంతువును) తీసుకు రాలేదో వారు ఇహ్రామ్ ను ధరించి ఉంటే వారు ఇహ్రామ్ ను తీసివేయాలని ప్రవక్త తెలియజేశారు, ఒకవేళ ఎవరైతే తీసివేయలేదో వారిపై కోపం వ్యక్తపరచారు, ఒకవేళ ఎవరైతే ఇహ్రామ్ స్తితిలో ఉండి కుర్భానీ జంతువును తమ వెంట తీసుకొని వచ్చారోవారు (యౌమ్–ఉన్-నహర్)(జుల్ హజ్ 10 వ తేదీన) జమరాహ్ కు రాళ్ళు రువ్విన తర్వాత ఇహ్రామ్ ను తీసివేయవచ్చు అని చెప్పారు.

 

సఫా, మర్వా దగ్గర నిలబడినపుడు చదవవలసిన దుఆలు

  

ఇన్నస్-సఫా-వల్-మర్-వత-మిన్ షఆ-ఇరిల్లాహి. అబ్దహు బిమా బాద’అల్లాహు బిహి.

 

నిజంగా సఫా,మర్వాలు అల్లాహ్ సుబు హానహు వత ఆలా చిహ్నాలలోనివి. ఏదైతే అల్లాహ్ సుబు హానహు వత ఆలా  పాటించమని చెప్పాడో నేను దానిని పాటించాను.

 

అల్లాహ్ మొదలుపెట్టాడు (అల్లాహ్ చెప్పాడు) సఫా పర్వతం పైకి చేరి కాబా ను చూసి ఖిబ్లా వైపు తన మొహాన్ని త్రిప్పి ఈ క్రింది పదాలను చదివేవారు.

 

లా ఇలాహ ఇల్లల్లాహ్, అల్లాహు అక్బర్

 

అల్లాహ్ తప్ప ఆరాధనకు అర్హులు ఎవ్వరూ లేరు, అల్లాహ్ గొప్పవాడు.

 

తర్వాత ఇలా చెప్పారు

అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ – లాఇలాహ ఇల్లాల్లాహు వహ్ దహు లా షరీక లహు – లహుల్ ముల్కు  వలహుల్ హమ్ దు   - యుహీఉ  వ యుమీతు వ హువ అలా కుల్లి షైఇన్ ఖదీర్ - లా ఇలాహ ఇల్లల్లాహు వహ్ దహు లా షరీకలహు – అన్ జజ  వఅదహూ వ నసర అబ్ దహు వ హజామల్ ఆహ్ జాబ వహ్ దహు.   

 

అల్లాహ్ గొప్పవాడు అల్లాహ్ గొప్పవాడు అల్లాహ్ గొప్పవాడు - అల్లాహ్ తప్ప ఆరాధనకు అర్హులు ఎవరూ లేరు, ఆయన ఒక్కడే. ఆయనకు సరి సమానులు లేరు. రాజ్యాధికారము ఆయనదే. సర్వస్తోత్రములు ఆయనకే చెల్లును. జీవం పోసేవాడు ప్రాణాలు తీసేవాడు ఆయనే  ఆయనే అన్నింటిపై అధికారం కలవాడు.  అల్లాహ్ తప్ప ఆరాధనకు అర్హులు ఎవరూ లేరు, ఆయన ఒక్కడే. ఆయన తన వాగ్దానాన్ని నెరవేర్చాడు. తన దాసునికి సహాయం చేశాడు, ఆయన ఒక్కడే శత్రు వర్గాలను చిత్తుగా ఓడించాడు.

 

 తర్వాత ఆయన కు ఏమి చేయాలో (అల్లాహ్ కోరినది) అల్లాహ్ ను  అడిగారు, ఇలా ఈ విధానాన్ని మూడుసార్లు చేశారు. ఆయన మర్వా పర్వతం దగ్గర కు చేరి సఫా పర్వతం దగ్గర ఏదైతే చేశారో ఇక్కడ కూడా అదే చేశారు. సహీహ్ అల్ ముస్లిం Vol 2:888

 

ఆధారాలు

హజ్ మరియు ఉమ్రా – షేక్ నసీరుద్దిన్ అల్బాని,

http://www.islamweb.net/emainpage/index.php?page=articles&id=154839

848 Views
మమ్మల్ని సరిచేయండి లేదా మిమ్మల్ని సరిచేసుకోండి
.
వ్యాఖ్యలు
పేజీ యొక్క టాప్