అవిశ్వాసం


దైవవిశ్వాసానికి బద్ధ విరుద్ధమైనది అల్ కుఫ్ర్ (అవిశ్వాసం). కాబట్టి కుఫ్ర్ (అవిశ్వాసం) అంటే అల్లాహ్ పై విశ్వాసాన్ని,  అల్లాహ్ యొక్క సందేశహరులపై విశ్వాసాన్ని నిరాకరించటం. అది అబద్ధాలతో, అపనిందలతో, అభియోగాలతో కూడినదైనా కావచ్చు లేదా అవి లేకుండా నిరాకరించటమైనా కావచ్చు. కాబట్టి ఇస్లాం ధర్మం పై ఎటువంటి సందేహం, అనుమానం ఉన్నా, దానిలోని కొన్ని నియమాలను విడిచి పెట్టినా, ఇస్లాం స్వీకరించీ శత్రుత్వం, గర్వం లేక తమ పూర్వపు జీవితం అసత్యమార్గం వైపుకు పోవటం జరిగినా అది అవిశ్వాసం క్రిందికే వస్తుంది. కాబట్టి ఎవరైనా అవిశ్వసకుడిగా మారిపోవటానికి ఇవి చాలు. ఇంకా, నిరాకరించటమనేది చాలా చాలా ఘోరమైనది.కుఫ్ర్ రెండు భాగాలుగా విభజింపబడినది: కుఫ్ర్ అక్బర్ (ఘోరమైన అవిశ్వాసం) మరియు కుఫ్ర్ అస్గర్ (అల్పమైన అవిశ్వాసం)

 

విషయసూచిక

 

కుఫ్ర్ అక్బర్ (ఘోరమైన అతిపెద్ద అవిశ్వాసం)

ఇది ఇస్లాం ధర్మం నుండి బహిష్కరింప జేస్తుంది. దీనిని ఐదు ఉపభాగాలుగా విభజింప బడినది:


విరుద్ధమైన అవిశ్వాసం
దీనికి ఋజువు - ఖుర్ఆన్ లోని 29  అన్ కబూత్ సూరా లోని 68వ వచనంలో అల్లాహ్ ఇలా ప్రకటిస్తున్నాడు.    అల్లాహ్ కు వ్యతిరేకంగా అసత్యం పలికే వాడి కంటే లేదా తన దగ్గరకు వచ్చిన సత్యాన్ని తిరస్కరించిన వాడి కంటే ఎక్కువ పాపిష్టి ఎవరు? అటువంటి సత్యతిరస్కారులకు నరకంలో శాశ్వతమైన పక్కా నివాసం లేదా?}



లోలోపలి అవిశ్వాసంతో పాటు తిరస్కారం మరియు దురహంకారంతో కూడిన అవిశ్వాసం

దీనికి ఋజువు – దివ్యఖుర్ఆన్ లోని 2 వ సూరా అల్ బఖర లోని 34వ వచనంలో అల్లాహ్ ఇలా ప్రకటిస్తున్నాడు.  మేము దైవదూతలకు ఇలా ఆజ్ఞాపించాము: “ఆదం (అలైహిస్సలాం) కు సాష్టాంగ పడండి:” మరియు వారు సాష్టాంగ పడినారు: కాని, ఇబ్లీస్ మాత్రం పడలేదు: అతడు తిరస్కరించాడు మరియు దురహంకారి అయ్యాడు: అతడు సత్యతిరస్కారులలోని వాడై పోయాడు.  


సందేహాస్పదమైన మరియు అనుమానంతో కూడిన అవిశ్వాసం

దీనికి ఋజువు –  దివ్యఖుర్ఆన్ లోని 18 వ సూరా అల్ బఖర లోని 35-38వ వచనంలో అల్లాహ్ ఇలా ప్రకటిస్తున్నాడు.  


18.35=ఇలా అతను తన ఆత్మకు అన్యాయం చేసుకున్న స్థితిలో తన తోటలోకి వెళ్ళాడు. ఇలా అన్నాడు:  "ఏనాటికైనా  ఈ తోట నాశనమై పోతుందని నేననుకోను."


18.36="ప్రళయ ఘడియ ఆసన్నమవుతుందని కూడా నేను భావిం చటం లేదు. ఒకవేళ (అలాంటిదేదైనా జరిగి) నేను నా ప్రభువు వద్దకు మరలింపబడినా,నిస్సందేహంగా  నేను (ఆ మళ్ళింపు స్థానంలో) ఇంతకన్నా మంచి స్థితిలోనే ఉంటాను."


18.37=అప్పుడు అతని స్నేహితుడు అతనితో మాట్లాడుతూ ఇలా అన్నాడు : "ఏమిటీ,నిన్ను మట్టితో చేసి, ఆ తరువాత వీర్యపు బిందువుతో సృష్టించి,ఆపైన నిన్ను నిండు మనిషిగా తీర్చిదిద్దిన ఆయననే (ఆ ఆరాధ్య దైవాన్నే) తిరస్కరిస్తున్నావా?


18.38="నా మట్టుకు నేను ఆ అల్లాహ్‌యే నా ప్రభువు అని నమ్ము తున్నాను. నేను నా ప్రభువుకు సహవర్తునిగా ఎవరినీ కల్పిం చను.

దారి మరలించే అవిశ్వాసం  
దీనికి ఋజువు – ఖుర్ఆన్ లోని 46 వ సూరా అల్ అహ్ ఖాప్  లోని 3వ వచనంలో అల్లాహ్ ఇలా ప్రకటిస్తున్నాడు  ఎవరైతే దైవవిశ్వాసాన్ని తిరస్కరిస్తారో, వారు హెచ్చరింప బడిన తీవ్ర పరిమాణాల వైపుకు మళ్ళింపబడతారు .   

కపటత్వపు అవిశ్వాసం
దీనికి ఋజువు – దివ్యఖుర్ఆన్ లోని 63  వ సూరా అల్ మూనాఫిఖూన్ లోని 3వ వచనంలో అల్లాహ్ ఇలా ప్రకటిస్తున్నాడు    దీనికంతటికీ కారణం, వారు విశ్వసించిన తర్వాత తిరస్కరించటమే. అందుకని వారి హృదయాలపై ముద్రవేయబడినది, ఇక వారు దేనినీ అర్థం చేసుకోలేరు .  
 
కుఫ్ర్ అస్గర్ (అల్పమైన అవిశ్వాసం)

ఇది ఇస్లాం ధర్మం నుండి బహిష్కరింప జేయదు. కాని, ఇది ఆచరణలో ఉండే అవిశ్వాసం.(a practical disbelief). వాస్తవానికి, ఇవి ఖుర్ఆన్ మరియు సున్నత్ లలో తెలుపబడిన ఘోరమైన అవిశ్వాసం వరకు చేర్చని చిన్న, చిన్న అల్పమైన అవిశ్వాసములు – ఉదాహరణకు అల్లాహ్ అనంతమైన దయామయుడు అనే సుగుణంలో అవిశ్వాసం కలిగి ఉండటం. దివ్యఖుర్ఆన్ లోని 16 వ సూరా అన్నహల్ లోని 112వ వచనంలో అల్లాహ్ ఇలా ప్రకటిస్తున్నాడు.అల్లాహ్ ఒక పట్టణానికి సంబంధించిన ఉదాహరణ ఇస్తున్నాడు: ఆ పట్టణం శాంతిమయమూ, సంతృప్తికరమూ అయిన జీవితాన్ని గడుపుతూ ఉండేది. ప్రతి వైపు నుండి దానికి ఆహారం పుష్కలంగా చేరుతూ ఉండేది. అప్పుడు అది అల్లాహ్ ఆశీర్వాదాలకు కృతఘ్నత చూపటం ప్రారంభించినది  ఇంకా ప్రవక్త సల్లల్లాహు అలైహి వ సల్లం బోధించిన హదీస్ “ఒక ముస్లిం ను దూషించటం, తిట్లు తిట్టడం, దుర్భాష లాడటం వంటివి దౌర్జన్యం, దురాగతం క్రిందకు వస్తుంది మరియు ముస్లింతో పోట్లాడటమనేది అవిశ్వాసం క్రిందకు వస్తుంది” (సహీహ్ బుఖారీ మరియు సహీ ముస్లిం హదీస్ గ్రంథాలలో నమోదు చేయబడిన)  ప్రకారం ముస్లిం తో పోట్లాడటమనేది, జగడం చేయటమనేది కూడా అల్పమైన అవిశ్వాసం క్రిందకు వస్తుంది .


ఇంకో హదీస్ (సహాబుఖారీ మరియు సహీ ముస్లిం హదీస్ గ్రంథాలు) లో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం ఇలా  “నా తర్వాత ఒకరినొకరు గొంతులు కోసుకుంటూ అవిశ్వాసం వైపునకు మరలిపోవద్దు”. అల్లాహ్ పై కాకుండా ఇతరులపై ప్రమాణం చేయటం – కూడా అవిశ్వాసం క్రిందికే వస్తుంది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం ఇలా ఉపదేశించారు   “అల్లాహ్ పై కాకుండా వేరే ఇతర వాటిపై ప్రమాణం చేసేవారు అవిశ్వాసం  చేసిన దోషి అవుతారు (లేదా అల్లాహ్ తో పాటు ఇతరులను భాగస్వాములుగా చేసేవారు)”.  ఇలాంటివి అల్పమైన అవిశ్వాసపు పనులుగా గుర్తించబడినాయి. ముస్లింలు ఏదైనా ఘోర పాపం చేసినా కూడా, వారు విశ్వాసులుగానే ఉంటారు.


దీనికి ఋజువు దివ్యఖుర్ఆన్ లోని 2 వ సూరా అల్ బఖర  లోని 178వ వచనంలో అల్లాహ్ యొక్క ప్రకటన.ఓ విశ్వాసులారా! హత్యా వ్యవహారాలలో మీ కొరకు ప్రతీకార న్యాయం సరిసమానంగా నిర్ణయించబడినది. దీని నుండి తెలిసిన దేమిటంటే విశ్వాసులై ఉండీ హత్య చేసిన వారిని ధర్మశాసనం నుండి తప్పించ చేయలేదు. ఇంకా అల్లాహ్ వారిని, హత్య చేయబడిన వారి బంధువుల సోదరులుగా పరిగణించినాడు.


దీనికి ఋజువు దివ్యఖుర్ఆన్ లోని  2 వ సూరా అల్ బఖర లోని 178వ వచనంలో అల్లాహ్ యొక్క ప్రకటన.    ఒకవేళ హతుని సోదరుడు హంతకుణ్ణి కనికరించదలిస్తే, న్యాయ సమ్మతంగా రక్తశుల్క నిర్ణయం జరగాలి.

 

హంతకుడు ఉత్తమమైన రీతిలో అతనికి రక్తధనాన్ని చెల్లించాలి.  నిశ్చయంగా ఇది ఇస్లాం ధర్మంలోని  ఉత్తమమైన సోదర భావాన్ని తెలియజేస్తున్నది.


దివ్యఖుర్ఆన్ లోని 49 వ సూరా హుజురాత్ లోని 9వ వచనంలో అల్లాహ్ ఇలా ప్రకటిస్తున్నాడు.   ఒకవేళ విశ్వాసులలోని రెండు వర్గాల వారు పరస్పరం పోట్లాడుకుంటే వారి మధ్య రాజీ కుదర్చండి . దివ్యఖుర్ఆన్ లోని  49 వ సూరా హుజురాత్లోని 10వ వచనంలో చివరికి అల్లాహ్ ఇలా ప్రకటిస్తున్నాడు.   విశ్వాసులు పరస్పరం అన్నదమ్ములు. కనుక మీ సోదరుల మధ్య సంబంధాలను సంస్కరించండి. అల్లాహ్ కు భయపడండి. మీ పై దయచూపటం జరగవచ్చు quoted from “The Explanation of the Tahawiah”, briefly.

 

అష్షిర్క్ అల్ అక్బర్

మనం ఇప్పుడు ఘోరమైన అవిశ్వాసానికి (అష్షిర్క్ అల్ అక్బర్) మరియు అల్పమైన అవిశ్వాసానికి (అష్షిర్క్ అల్ అస్గర్) మధ్య గల భేదాలను క్లుప్తంగా గమనిద్దాం: ఘోరమైన అవిశ్వాసానికి (అష్షిర్క్ అల్ అక్బర్) ఇస్లాం ధర్మం బహిష్కరింప జేస్తుంది మరియు పుణ్యాలను నిర్వీర్యం చేస్తుంది. అల్పమైన అవిశ్వాసం (అష్షిర్క్ అల్ అస్గర్) ఇస్లాం ధర్మం బహిష్కరింప జేయదు, పుణ్యాలను నశింపజేయదు కాని వాటి ప్రతిఫలాన్ని తగ్గిస్తుంది. ఇంకా నేరస్థుడిలో అల్లాహ్ యొక్క భయాన్ని కలుగజేస్తుంది. ఘోరమైన అవిశ్వాసం (అష్షిర్క్ అల్ అక్బర్) వలన నరకాగ్నిలో శాశ్వతంగా ఉంచబడతారు. కాని అల్పమైన అవిశ్వాసం (అష్షిర్క్ అల్ అస్గర్) అలా చేయక, శిక్ష పూర్తయ్యే వరకు మాత్రమే నరకాగ్నిలో ఉంచుతుంది. ఘోరమైన అవిశ్వాసం (అష్షిర్క్ అల్ అక్బర్) ప్రాణాన్ని మరియు సంపదను రక్షించదు. కాని అల్పమైన అవిశ్వాసం (అష్షిర్క్ అల్ అస్గర్) అలా చేయదు, అంటే సంరక్షిస్తుంది.

 

అవిశ్వాసికి మరియు విశ్వాసికి మధ్య శత్రుత్వాన్ని ఘోరమైన అవిశ్వాసం (అష్షిర్క్ అల్ అక్బర్) తప్పని సరి చేస్తుంది. ఈ విధంగా విశ్వాసులు అవిశ్వాసులను (ఎంత దగ్గరి బంధువులైనా సరే) ప్రేమించకుండా మరియు సహాయపడకుండా కట్టుదిట్టం చేస్తుంది (నిరోధిస్తుంది).  కాని అల్పమైన అవిశ్వాసం (అష్షిర్క్ అల్ అస్గర్) అవిశ్వాసిని ప్రేమించటం మరియు సహాయపడటం నుండి పూర్తిగా నిరోధించదు. అల్పమైన అవిశ్వాసం ఉన్న వారు తమ విశ్వాసాన్ని దాచి ఉంచినంత కాలం ఇంకా ఎక్కువగా ప్రేమించబడతారు. కాని విశ్వాసాన్ని బయటపెట్టి మరీ పాపాలు చేస్తున్నవారు, అవిధేయత చూపిస్తున్నవారు అసహ్యించుకోబడతారు మరియు శత్రుత్వాన్ని ఎదుర్కోవలసి వస్తుంది.

 

ఆధారాలు

http://teluguislam.net/2010/10/02/disbelief/
 

 

1318 Views
మమ్మల్ని సరిచేయండి లేదా మిమ్మల్ని సరిచేసుకోండి
.
వ్యాఖ్యలు
పేజీ యొక్క టాప్