అవతరణ ప్రారంభం


ఖుర్ఆన్ అవతరణ రమజాన్ మాసంలోని లైలతుల్ ఖద్ర్ (ఆఖరి పది రాత్రుల్లోని బేసి సంఖ్య రాత్రులు)లో ప్రారంభమయింది. అప్పుడు దైవప్రవక్త సల్లల్లాహుఅలైహివసల్లం వయసు నలభై సంవత్సరాలు (దాదాపు610 CE).

 

విషయసూచిక

 

హదీస్

విశ్వాసుల మాతృమూర్తి అయిన ఆయిషా రజిఅల్లాహుఅన్హా ఉల్లేఖనం ప్రకారం : దైవప్రవక్త సల్లల్లాహుఅలైహివసల్లం పై అవతరణ ప్రారంభం (నిజమైన) కలల రూపంలో జరిగింది. ఆ తరువాత ఆయన సల్లాహుఅలైహివసల్లం కు ఏకాంతంలో గడిపే ఇచ్చ కలిగేది. అప్పుడు అయన సల్లల్లాహుఅలైహివసల్లం హిరా గుహలో ఏకాంతంగా అనేక రోజులు కేవలం అల్లాహ్ ఆరాధనలో గడిపేవారు. ఎప్పుడైతే తన పరివారాన్ని చూడాలని అనిపించేదో అప్పుడు ఇంటికి తిరిగి వచ్చేవారు. తనతో పాటు భోజన సామగ్రి కూడా తీసుకెళ్ళేవారు. అది అయిపోయినచో భార్య (ఖదీజా రజిఅల్లాహుఅన్హా) వద్దకు వచ్చి భోజన సామగ్రి తీసుకుని మళ్ళీ వెళ్ళిపోయేవారు. తనపై వహీ (దైవాదేశం) అవతరించేవరకు ఇలా చేసేవారు.


దైవదూత వచ్చి దైవప్రవక్త సల్లల్లాహుఅలైహివసల్లం ను చదవండి అన్నారు. దైవప్రవక్త సల్లల్లాహుఅలైహివసల్లం ‘నాకు చదవడం రాదు’ అని జవాబిచ్చారు. ఇంకా ఇలా అన్నారు, ‘దైవదూత నన్ను ఎంత గట్టిగా బిగించి పట్టుకున్నారంటే నేను తట్టుకోలేకపోయాను. కాసేపటి తరువాత నన్ను వదిలి మళ్ళీ చదవండి అన్నారు. దానికి నేను మళ్ళీ “నాకు చదవడం రాదు” అన్నాను. దైవదూత రెండవసారి నన్ను నేను తట్టుకోలేనంతగా గట్టిగా బిగించి పట్టుకున్నారు. ఆ తరువాత వదిలి మళ్ళీ చదవండి అన్నారు. నేను “నాకు చదవడం రాదు” (నేను ఏమని చదవాలి?) అన్నాను. దైవదూత మూడవసారి నన్ను గట్టిగా పట్టుకుని వదిలారు. అప్పుడు ఇలా అన్నారు: “ చదువు, సృష్టించిన నీ ప్రభువు పేరుతో. అయన మనిషిని నెత్తుటి ముద్దతో సృష్టించాడు. నువ్వు చదువుతూ పో. నీ ప్రభువు దయాశీలి”.... సహీహ్ బుఖారీ1:3,4:478,సహీహ్ ముస్లిం 1:301


దైవప్రవక్త సల్లల్లాహుఅలైహివసల్లం తన భార్య ఖదీజా రజిఅల్లాహుఅన్హా వద్దకు వెళ్లి ఈ వృత్తాంతం వివరించారు. ఆమె దైవప్రవక్త సల్లల్లాహుఅలైహివసల్లం ను ఓదార్చింది. వారిద్దరూ ఖదీజా రజిఅల్లాహుఅన్హా బంధువు మరియు క్రైస్తవ పండితుడైన వరఖా అనే అతణ్ణి కలిసి జరిగినదంతా చెప్పారు.వరఖా దైవప్రవక్త సల్లల్లాహుఅలైహివసల్లంతో ఇలా అన్నాడు, ‘మూసా అలైహిస్సలాం వద్దకు పంపబడిన దైవదూతను నీవు కలిశావు మరియు నీ ప్రజలు నిన్ను బయటికి గెంటేస్తారు.’

 

అవతరణ ఎలా జరిగింది

విశ్వాసుల మాతృమూర్తి అయిన ఆయిషా రజిఅల్లాహుఅన్హా ఉల్లేఖనం ప్రకారం: అల్ హరీస్ బిన్ హిషాం దైవప్రవక్త సల్లల్లాహుఅలైహివసల్లంతో ఇలా అడిగారు, ‘ఓ దైవప్రవక్తా! మీపై వహీ (దైవాదేశం) అవతరణ ఎలావచ్చేది?’ దైవప్రవక్త సల్లల్లాహుఅలైహివసల్లం ఇలా జవాబిచ్చారు, ‘ఒక్కోసారి “అవతరణ” గంట మొగినట్లుగా ఉండేది. అది చాలా కఠినంగా అనిపించేది. (వహీ) అవతరణ పూర్తవగానే మామూలు స్థితి తిరిగొచ్చేది. మరోసారి దైవదూత మానవ రూపంలో నా వద్దకు వచ్చి నేను అయన మాటలు గ్రహించేవరకు నాతో మాట్లాడేవారు.’

 

మొదటి అవతరణ

దైవప్రవక్త సల్లల్లాహుఅలైహివసల్లంపై అవతరించిన మొదటి అవతరణ సూరా అల్ అలఖ్(96:1-5)లోని మొదటి ఆయత్:

‘చదువు, సృష్టించిన నీ ప్రభువు పేరుతో. ఆయన మనిషిని నెత్తుటి ముద్దతో సృష్టించాడు. నువ్వు చదువుతూ పో. నీ ప్రభువు దయాశీలి. ఆయన కలం ద్వారా (జ్ఞాన)బోధ చేశాడు. ఆయన మనిషికి, అతడు ఎరుగని దానిని నేర్పాడు.’


ఆగిపోవడం(ఫత్రా)

మొదటి అవతరణ తరువాత కొన్ని రోజుల వరకు అవతరణ ఆగిపోయి  మళ్ళీ ప్రారంభమయింది (దానిని ఫత్రా అంటారు).


జాబిర్ బిన్ అబ్దుల్లా అల్ అన్సారీ అవతరణలో విరామం గురించి మాట్లాడుతూ దైవప్రవక్త సల్లల్లాహుఅలైహివసల్లం ఇలా అన్నారని ఉల్లేఖించారు, ‘ఒకసారి నేను నడుస్తున్నప్పుడు ఆకాశం నుంచి పెద్ద శబ్దం వినిపించింది. నేను హిరా గుహలో చూసిన దైవదూత ఆకాశం భూమి మధ్యలో ఒక కుర్చీపై కూర్చుని ఉండడం చూశాను. నేను భయపడుతూ ఇంటికి తిరిగొచ్చి, “నన్ను దుప్పట్లలో కప్పండి” అని అన్నాను. అప్పుడు అల్లాహ్ ఖుర్ఆన్ లోని ఈ క్రింది ఆయతులను అవతరింపజేశాడు: ఓ దుప్పటి కప్పుకున్నవాడా! లే. (లేచి జనులను) హెచ్చరించు....దీని తరువాత అవతరణ క్రమం తప్పకుండ రావడం మొదలయింది. సహీహ్ బుఖారీ vol 1, 3వ హదీసు చివరి భాగం.

 

రెండవ అవతరణ

దైవప్రవక్త సల్లల్లాహుఅలైహివసల్లంపై అవతరించిన రెండవ అవతరణ సూరా అల్ ముద్దస్సిర్, సూరా నెం 74. ఇందులో 56 ఆయతులు ఉన్నాయి. ఇది ఈ విధంగా మొదలవుతుంది: ‘ఓ దుప్పటి కప్పుకున్నవాడా! లే. (లేచి జనులను) హెచ్చరించు. నీ ప్రభువు గొప్పతనాన్ని చాటిచెప్పు. నీ దుస్తులను పరిశుభ్రంగా ఉంచుకో. అశుద్ధతను వదలిపెట్టు....’

 

తొలి ఇతర అవతరణలు

దైవప్రవక్త సల్లల్లాహుఅలైహివసల్లం ప్రకారం మక్కాలో అవతరించిన తొలి అవతరణలలో సూరా 1, సూరా 111, సూరా 81, సూరా 87, సూరా 89, సూరా 92 మొదలైనవి. ఆ తరువాత అవతరణ కొనసాగింది, ‘ మానవులు ఇస్లాం వైపు మరలే వరకు స్వర్గం నరకం గురించి, ఆ తరువాత “హలాల్”  “హరాం” గురించి.....’ (వహీ) అవతరణ దైవప్రవక్త సల్లల్లాహుఅలైహివసల్లం జీవితాంతం మక్కా, మదీనాలలో వస్తూనే ఉంది. అవతరణ దాదాపు 23సంవత్సరాలు వచ్చింది. దైవప్రవక్త సల్లల్లాహుఅలైహివసల్లం మరణానికి కాస్త ముందు అనగా10 హిజ్రీ(632CE) వరకూ అవతరణ వస్తూనే ఉంది.

 

అంతిమ అవతరణ

అనేక విద్వాంసుల ప్రకారం ఖుర్ఆన్ లోని అంతిమ అవతరణ సూరా మాయిదా 5:3– “ఈ రోజు మీ కొరకు మీ ధర్మాన్ని పరిపూర్ణం గావించాను. మీపై నా అనుగ్రహాన్ని పూర్తిచేశాను. ఇంకా, ఇస్లాంను మీ ధర్మంగా సమ్మతించి ఆమోదించాను.”

 

ఖుర్ఆన్ దశలలో అవతరించడానికి కారణం

ఖుర్ఆన్ అంచెల వారిగా 23 సంవత్సరాలలో అవతరించింది. ఇది ఒక్కసారిగా ఓ పూర్తి పుస్తక రూపంలో అవతరించలేదు. దీనికి ఎన్నో కారణాలున్నాయి. అందులో కొన్ని:

 

  • దైవప్రవక్త సల్లల్లాహుఅలైహివసల్లం మనోబలాన్ని పెంచడం.
     
  • దైవప్రవక్త సల్లల్లాహుఅలైహివసల్లం ను దృష్టిలో ఉంచుకొని, ఎందుకంటే అవతరణ ఒక పెద్ద భారం.
     
  • అల్లాహ్ చట్టాన్ని క్రమేనా ఆచరణలో తేవడానికి.
     
  • అవతరించిన వాటిని మంచిగా అర్ధం చేసుకోవడానికి, అమలు చేయడానికి మరియు గుర్తుంచుకోవడానికి.

 

ఆధారాలు

http://www.missionislam.com/quran/beginrevelation.htm (ఇంగ్లీష్)

 

1140 Views
మమ్మల్ని సరిచేయండి లేదా మిమ్మల్ని సరిచేసుకోండి
.
వ్యాఖ్యలు
పేజీ యొక్క టాప్