అల్లాహ్ హక్కులు


అల్లాహ్ హక్కులు ఆయన సృష్టి అంతా వ్యాపించి వున్నాయి. అల్లాహ్ యే  సర్వ సృష్టికర్త, ఆయనే ఈ సర్వాన్ని పరిపాలించేవాడు. ఆయన సంపూర్ణ వివేకంతో ప్రతి దానిని ఈ విశ్వంలో సృష్టించాడు. అల్లాహ్ యే శూన్యం నుంచి ఈ సృష్టిని ఉనికిలోకి తీసుకువచ్చాడు. అలాగే తల్లి గర్భంలో ఉండే పిల్లల పరిస్థితి  సైతం ఆయన ఎరుగును. అలాగే అల్లాహ్ యే అందరికి ఆహారంను ఇచ్చేవాడు మరియు జీవిత సదుపాయంను కల్పించేవాడు.

 

విషయసూచిక

 

ఖుర్ ఆన్


అల్లాహ్ ఖుర్ఆన్ లో ఇలా సెలవిస్తున్నాడు.

 

అల్లాహ్ మిమ్మల్ని  మీ మాతృ గర్భాల నుండి – మీకేమీ తెలీని స్థితిలో బయటికి తీశాడు. మీ కొరకు చెవులను, కళ్ళను, హృదయాలను తయారుచేసినది ఆయనే - మీరు కృతజ్ఞులుగా వ్యవహరిస్తారని! ఖుర్ఆన్ సూరా అన్  నహల్ 16 :78

 

అల్లాహ్ ఎవరికైనా జీవనోపాధిని నిలిపి వేస్తే అతను సర్వనాశనం అవుతాడు. అల్లాహ్ యొక్క  కరుణ వల్లనే సర్వ మానవులు మరియు జీవరాసులన్నీ ఈ ప్రపంచంలో ప్రశాంతంగా జీవించగలుగుతున్నాయి.

 

హదీస్


దైవప్రవక్త సల్లల్లాహు అలైహి  వసల్లం ఇలా ప్రవచించారు : అప్పుడు ఆయన ఇలా సెలవిచ్చారు, పాపాలలోకెల్లా అతి పెద్ద పాపం అల్లాహ్ కు వేరొకరిని సహవర్తులుగా చేయడం”. సహీహ్ అల్ బుఖారి భాగం:8 :8

 

అల్లాహ్ కు మానవులపైన ఉండే  హక్కు ఏమిటంటే వారు అల్లాహ్ సుబ్ హానహు వత’ఆల కు  వేరొకరిని సహవర్తులుగా చేయకుండా వుండాలి.

 

సదుపాయాలన్నీ అల్లాహ్ దగ్గర నుంచే లేదా అల్లాహ్ తరపునే, ఆన్ని అల్లాహ్ నుంచే కేటాయించబడినవి లేదా సదుపాయాల్ని అల్లాహ్ దగ్గరనుంచే.

 

అల్లాహ్ తన దాసులను  కనిపెట్టుకుని వున్నాడు. ఎందుకంటే ఆయన కరుణ ఈ సర్వత్ర మానవాళి పై వ్యాపించి వుంది. ఇది ఆయనకున్న హక్కు. అల్లాహ్ కు తన దాసుల అవసరం ఏమి లేదు.

 

మీ కుటుంబీకులకు నమాజు గురించి తాకీదు చెయ్యి. నువ్వు సైతం దానిపై స్థిరంగా వుండు. మేము నీ  నుంచి ఉపాధిని అడగటం లేదు. పైగా మేమే నీకు ఉపాధిని ఇస్తున్నాము. చివరికి మంచి జరిగేది భయభక్తులకే . ఖుర్ ఆన్ సూరా తాహా : 20 :132

 

సృష్టించడం గల కారణం


అల్లాహ్ తన దాసులనుండి కోరేదేమిటంటే : నేను జిన్నాతులను, మానవులను సృష్టించినది వారు నన్ను ఆరాధించటానికి మాత్రమే. నేను వారి నుండి జీవనోపాధిని కోరటం లేదు. వారు నాకు అన్నం పెట్టాలని కూడా నేను కోరటం లేదు. అల్లాహ్ యే స్వయంగా అందరికీ ఉపాధిని సమకూర్చేవాడు. ఆయన మహా శక్తిశాలి, మహబలుడు. ఖుర్ఆన్ సూరా అజ్ జారియాత్ 51 : 56 - 58

 

ప్రతి ముస్లిం విధి,అల్లాహ్ ను విశ్వసించడం ఆయనకు ఆరాధనలో ఎవరిని సాటి చేయకూడదు. తనకు తాను అల్లాహ్ కు సమర్పించుకోవాలి  అనగా ప్రతి ముస్లిం తన జీవితాన్ని(ఇస్లాం జీవితం) మొత్తం ఆయనకు నిబంధనల తోనే గడపాలి.

 

దీవేనలన్ని అల్లాహ్ దగ్గర నుంచే


అల్లాహ్ ఆరాధించడం తో పాటు సర్వత్రా  కృతఙ్ఞతలు చెల్లిస్తూ వుండాలి. మీ దగ్గరున్న భాగ్యాలన్నీ అల్లాహ్ ప్రసాధించినవే. ఇప్పటికీ మీకేదైనా కష్టం వస్తే మీరు ఆయనకే మొరపెట్టుకుంటారు. సూరా అన్ నహల్ 16 :53

 

మన:స్పూర్తిగా కష్టపడటం


అల్లాహ్ తన దాసులకు ఆరాధన విషయంలో సులభతరాన్ని నేర్పాడు, కాని వారిని  ఇబ్బందికి  గురి చేయాలనుకోవడం లేడు.  అల్లాహ్ ఖుర్ఆన్ లో ఇలా సెలవిస్తున్నాడు:అల్లాహ్ (ప్రసన్నత) కోసం పాటుపడవలసిన విధంగా పాటుపడండి. ఆయన మిమ్మల్ని ఎన్నుకున్నాడు. ధర్మం విషయంలో ఆయన మీపై ఎలాంటి ఇబ్బందిని ఉంచలేదు. మీ పితామహుడైన ఇబ్రహీము (అలైహిస్సలాం) ధర్మానికి కట్టుబడి ఉండండి. ఈ ఖుర్ఆన్ కు  పూర్వం కూడా ఆయన (అల్లాహ్ మిమ్మల్ని ‘ముస్లింలు’గానే నామకరణం చేశాడు. మరి ఇందులో కూడా(మీ పేరు అదే). దైవప్రవక్త మీపై సాక్షిగా, మీరు మానవాలి పై సాక్షులుగా ఉండటానికి (ఈ విధంగా చేయబడింది). కనుక మీరు నమాజును నెలకొల్పండి, జకాతును చెల్లించండి, అల్లాహ్ ను స్థిరంగా ఆశ్రయించండి. ఆయనే మీ సంరక్షకుడు! (ఆయన) ఎంత చక్కని సంరక్షకుడు! మరెంత చక్కని సహాయకుడు. ఖుర్ఆన్ సూరా అల్ హజ్ 22:78

 

మన:స్పూర్తిగా ఆరాధించడం


అల్లాహ్ తన దాసుల నుండి కోరేదిమిటంటే  అల్లాహ్ ను మన:స్పూర్తిగా ఆరాధించడం, మరియు మంచి పనులు చేయడం, అలాగే 5 పూటలు నమాజు చేస్తూ పశ్చాత్తాపం చెందుతూ వుండడం. ముస్లిం లు ప్రవక్త సంప్రదాయం ప్రకారం ఉత్తమంగా నమాజ్  చేయడం.

 

కాబట్టి ఎల్లవేళలా మీరు అల్లాహ్ కు భయపడుతూ  ఉండండి. (ఆజ్ఞలను) వినండి, విధేయత చూపండి. (దైవ మార్గంలో) ఖర్చు చేస్తూ ఉండండి. ఇది స్వయంగా మీకే శ్రేయస్కరం. ఎవరైతే తమ ఆత్మ లోభత్వం నుండి రక్షించబడ్డారో వారే సాఫల్య భాగ్యం పొందినవారు. ఖుర్ఆన్ సూరా అత్ తగాబున్ : 64 :16

 

ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు : నమాజు చేసేటప్పుడు నిలబడం చేత కాకపోతే కూర్చోని నమాజు చదవండి. అది కూడా కాకపోతే పడుకోని నమాజు చేయండి. సహీహ్ అల్ బుఖారి భాగం 2 : 218

 

అల్లాహ్ తన దాసులకు ఇలా సెలవిస్తున్నాడు. అత్యవసర స్థితిలో వున్నా ముస్లింలైన వారికి దానం చేయడం. మరియు ఎవరైతే జకాతు తీసుకోవడానికి అర్హులైన వారికి ఆ జకాతు ను అందజేయడం. జకాతు ను ఇవ్వడం వలన ధనవంతులకు ఎటువంటి నష్టం లేదు. పేదవారు వీటి నుండి చాల లాభాలను పొందుతారు. అల్లాహ్ తన దాసులకు రమజాన్ నెల మొత్తం ఉపవాసాలు ఉండమని కోరుతున్నాడు. అల్లాహ్ ఖుర్ఆన్ లో ఇలా సెలవిస్తున్నాడు.

 

రమజాన్ నెల – ఖుర్ఆన్ అవతరింపజేయబడిన నెల. అది మానవులందరికి మార్గదర్శకం. అందులో సన్మార్గం తో పాటు, సత్య అసత్యాలను వేరు పరిచే స్పష్టమైన నిదర్శనాలు ఉన్నాయి. కనుక మీలో ఎవరు ఈ నెలను చూస్తారో వారు ఉపవాసాలుండాలి. అయితే రోగగ్రస్తుని గానో, ప్రయాణికినిగానో ఉన్న వారు ఇతర దినాలలో ఈ లెక్కను పూర్తి చేయాలి. అల్లాహ్ మీకు సౌలభ్యాన్ని సమకూర్చదలుస్తున్నాడేగాని మిమ్మల్ని కష్ట పెట్టదలచటం లేదు. మీరు (ఉపవాసాల) నిర్ణీత సంఖ్యను పూర్తి చేసుకోవాలన్నదీ, తాను అనుగ్రహించిన సన్మార్గ భాగ్యానికి ప్రతిగా ఆయన గొప్పదనాన్ని కీర్తించి, తగురీతిలో మీరు ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకోవాలన్నది అల్లాహ్ అభిలాష!  ఖుర్ ఆన్ సూరా అల్ బఖర 2 :185

 

హజ్ చేయడం


ప్రతి ముస్లిం తన జీవిత కాలంలో ఒక్కసారైనా కాబా (మస్జిదె  హరాం)  ను సందర్శించి హజ్ యాత్ర చేయడం, అలాగే అల్లాహ్ భోధించిన వాటిని పాటించడం మరియు నిషేదించిన వాటిని వదిలి వేయడం ముస్లిం ల విధి.

 

పైన పేర్కొన్న విషయాలలో  అల్లాహ్ నిభందనలను  పాటించడం ముస్లింల విధి.  అల్లాహ్ కు భయపడేవారికి ఇది కష్టమైన  పని కాదు,  ఇది వారి కోసం ప్రత్యేకంగా చేసుకుంటున్న పుణ్యాలు. ఈ విషయాన్ని అల్లాహ్ ఖుర్ఆన్ లో ఇలా సెలవిస్తున్నాడు: ప్రతి ప్రాణీ మృత్యువు రుచి చూడవలసిందే. ప్రళయదినాన మీరు అందరూ మీ కర్మల పూర్తి ఫలితాన్ని పొందుతారు. అప్పుడు ఎవడు నరకాగ్ని నుంచి కాపాడబడి, స్వర్గంలో ప్రవేశం కల్పించబడతాడో అతడు నిశ్చయంగా సఫలీకృతుడయ్యాడు. ప్రాపంచిక జీవితమైతే ఒక మాయవస్తువు తప్ప మరేమీ కాదు. ఖుర్ఆన్ సూరా అలి ఇమ్రాన్ 3 :185

 

ఆధారాలు


http://en.islamway.com/article/8761?ref=w-new

Allah’s Right, Book by Shaykh Muhammad ibnSalih al-`Uthaymeen

1746 Views
మమ్మల్ని సరిచేయండి లేదా మిమ్మల్ని సరిచేసుకోండి
.
వ్యాఖ్యలు
Mohammed Shahbaz Khan Masha Allah.

4/22/14 12:52 PM

పేజీ యొక్క టాప్