అల్లాహ్ శరణు


ప్రతి ఆపద నుండి అల్లాహ్ శరణు కోరాలి.

 

విషయసూచిక

 

మసీహ్ దజ్జాల్ నుండి రక్షణ

హజ్రత్ ఆయిషా (రజి అల్లాహు అన్హ) కధనం :-దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) నమాజులో తషహ్హుద్ తరువాత ఇలా దుఆ (ప్రార్ధన) చేస్తూ ఉంటే నేను విన్నాను.అల్లాహుమ్మఇన్నీ అఅవూజుబిక మిన్ అజాబిల్ ఖబ్రి వ అవూజుబిక మిన్ ఫిత్నతిల్మసీహిద్దజ్జాలి వ అవూజుబిక మిన్ ఫిత్నతిల్ మహ్యాయి వ ఫిత్నతిల్ మమాతి.అల్లాహుమ్మ ఇన్నీ అఅవూజుబిక మినల్ మాసమి వల్ మగ్రమ్.“ఓ అల్లాహ్! నేనుసమాధి యాతన నుండి నీ శరణు కోరుతున్నాను. ‘మసీహిద్దజ్జాల్’ ఉపద్రవం నుండినీ శరణు కోరుతున్నాను. జీవన్మ(*)రణాల పరీక్ష నుండి నీ శరణు కోరుతున్నాను.ఓ అల్లాహ్!! పాపాల్లో పడివేసే పనుల నుండి నీ శరణు కోరుతున్నాను. రుణగ్రస్తుడినిఅయ్యే దుస్థితి నుండి నీ శరణు కోరుతున్నాను.”

 

రుణ భాద నుండి రక్షణ

ఒక వ్యక్తిదైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తో మాట్లాడుతూ “దైవప్రవక్తా! మీరురుణగ్రస్త స్థితి నుండి కూడా అంత ఎక్కువగా శరణు కోరుతున్నారెందుకు?” అనిఅడిగాడు. దానికి ఆయన సమాధానమిస్తూ “ఎందుకంటే మనిషి అప్పుల పాలయితేఅసత్యమాడతాడు. వాగ్దాన భంగానికి పాల్పడతాడు” అని అన్నారు.

 

344. [సహీహ్ బుఖారీ : 10 వ ప్రకరణం - అజాన్, 149 వ అధ్యాయం - అద్దుఆవు ఖబ్లస్సలాం ] ప్రార్ధనా స్థలాల ప్రకరణం – 25 వ అధ్యాయం – నమాజులో ఏఏ కీడు నుండి దేవుని శరణు కోరాలి?
మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు(Al-Loolu Wal Marjan ) vol-1


సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్

 

ఆధారాలు

http://telugudailyhadith.wordpress.com/2012/11/07/seeking-refuge-with-allaah-from-these-things-in-prayer/

 

842 Views
మమ్మల్ని సరిచేయండి లేదా మిమ్మల్ని సరిచేసుకోండి
.
వ్యాఖ్యలు
పేజీ యొక్క టాప్