దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తమ ప్రభువును దర్శించారా? లేదా అల్లాహ్ కనిపించాడా?


హజ్రత్ మస్రూఖ్ (రధి అల్లాహు అన్హు) కధనం :-నేను విశ్వాసుల మాతృమూర్తి హజ్రత్ ఆయిషాను (రధి అల్లాహు అన్హ) - “అమ్మా! దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తమ ప్రభువును (ప్రత్యక్షంగా) చూశారా?” అని అడిగాను. దానికి ఆమె ఇలా అన్నారు : “నీ మాటలు విని నా రోమాలు నిక్కపొడుచుకున్నాయి. నీకు తెలుసా? ఈ మూడు విషయాలను గురించి మీలో ఎవరైనా తన వైపు నుంచి ఏదైనా అంటే అతను అబద్ధాలకోరుగా పరిగణించబడతాడు

 

విషయసూచిక

 

దృష్టి

“ఎవరి చూపులూ ఆయన్ని అందుకోజాలవు. ఆయన మాత్రం అందరి చూపులనూ అందుకోగలడు.”  [దివ్యఖుర్ఆన్ - 6: 103]

 

సంభాషణ

“అల్లాహ్ ఏ మానవునితోనూ ప్రత్యక్షంగా సంభాషించడు. మానవ మాత్రుడికి అది సాధ్యమయ్యే పనికాదు. అల్లాహ్ తన మాటను వహీ ద్వారానో లేక తెరవెనుక నుంచో మాత్రమే మానవునికి చేరవేస్తాడు.”  [దివ్యఖుర్ఆన్ - 42:51]

 

జరగబోయే విషయాలు

అలాగే రేపు జరగబోయే విషయాలేవో దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కు తెలుసనేవాడు కూడా అబద్దాల కోరే. ఈ సందర్భంలో హజ్రత్ ఆయిషా (రధి అల్లాహు అన్హ) ఈ సూక్తిని ఉదహరించారు – “రేపు తాను ఏం చేయనున్నాడో ఏ మానవునికీ తెలియదు.” [దివ్యఖుర్ఆన్ - 31: 34 ]

 

భాధ్యత నిర్వహణ

అదే విధంగా దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) (ధర్మానికి సంబంధించిన) ఏదైనా విషయం రహస్యంగా ఉంచారని అనేవాడు కూడా అబద్దాలరాయుడే. దీని గురించి హజ్రత్ ఆయిషా (రధి అల్లాహు అన్హ) ఈ సూక్తిని ఉదహరించారు – “ప్రవక్తా! నీ ప్రభువు నుండి నీపై అవతరించే బోధనలను ప్రజలకు అందజేస్తూ ఉండు. ఒకవేళ నీవు అలా చేయకపోతే దౌత్య బాధ్యతను నెరవేర్చని వాడవుతావు.”  [దివ్యఖుర్ఆన్ - 5: 67]

 

దైవదూత ప్రత్యక్షం

కనుక అసలు విషయం ఏమిటంటే, దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) జిబ్రయీల్ (అలైహిస్సలాం) ను ఆయన నిజ స్వరూపంలో రెండుసార్లు చూశారు.”

 

ఆధారాలు

www.teluguislam.net

[సహీహ్ బుఖారీ : 65 వ ప్రకరణం - అత్తఫ్సీర్, 53 వ సూరా - అన్నజ్మ్ - 1 వ అధ్యాయం - హద్ధసనా యహ్యా]  విశ్వాస ప్రకరణం – 75 వ అధ్యాయం – దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తమ ప్రభువును దర్శించారా? మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు  (Al-Loolu Wal Marjan ) Vol. 1 సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ

 

372 Views
మమ్మల్ని సరిచేయండి లేదా మిమ్మల్ని సరిచేసుకోండి
.
వ్యాఖ్యలు
పేజీ యొక్క టాప్