అల్లాహు అక్బర్


అల్లాహు అక్బర్ అంటే ‘అల్లాహ్ మహోన్నతుడు.’ అల్లాహ్ కంటే గొప్పది ఏదీ లేదు ఉండబోదు. దీన్ని అజాన్ మరియు నమాజ్ లలో సర్వ సాధారణంగా ఉపయోగిస్తారు. ముస్లింలు దీన్ని ఎన్నో విధాలుగా, మరెన్నో పరిస్థితుల్లో ఉచ్చరిస్తారు.

 

విషయసూచిక

 

ఖుర్ఆన్

ఇంకా ఇలా చెప్పు: “ప్రశంసలన్నీ అల్లాహ్ కే శోభిస్తాయి. అయన ఎవరినీ సంతానంగా చేసుకోలేదు. తన విశ్వ సామ్రాజ్యంలో ఆయనకు భాగస్వాములెవరూలేరు. ఒకరి సహాయ సహకారాలపై ఆధారపడటానికి అయన ఏ మాత్రం బలహీనుడు కాడు. కాబట్టి నువ్వు అయన గొప్పదనాన్ని ఘనంగా కీర్తిస్తూ ఉండు.” ఖుర్ఆన్, సూరా అల్ ఇస్రా 17:111


రాత్రి పూట కూడా (ఏ సమయంలోనయినా) ఆయన పవిత్రతను కొనియాడు, మరి నమాజు తరువాత కూడా (ఆయన్ను స్తుతించు). ఖుర్ఆన్, సూరా ఖాఫ్ 50:40

 

హదీస్

మేము ఎక్కడైనా ఎత్తైన చోట వెళ్ళేటప్పుడు ‘అల్లాహు అక్బర్’ అనేవారము, అలాగే క్రిందకు వెళ్ళేటప్పుడు ‘సుభానల్లాహ్’ అనేవారము. సహీహ్ బుఖారీ 2993 (vol 4:236)    


అబూ హురైరా రజిఅల్లాహుఅన్హు ఉల్లేఖించారు : ఒకతను దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం వద్దకు వచ్చి, “ఓ దైవప్రవక్తా! నేను ప్రయాణం చేయబోతున్నాను. నాకు ఉపదేశించండి” అని అన్నాడు. దానికి దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం, “అల్లాహ్ కు భయపడు మరియు ఎత్తైన ప్రదేశం వైపు వెళ్ళేటప్పుడు ‘అల్లాహు అక్బర్’ అంటూ వెళ్ళు” అని అన్నారు. అతను వెళ్ళిపోయాక దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ఇలా అన్నారు : “ఓ అల్లాహ్! అతని ప్రయాణపు దూరాన్ని తగ్గించు మరియు అతని ప్రయాణం సుఖమయం చేయి.” అత్ తిర్మిజి 3445.

 

అజాన్ లో అల్లాహు అక్బర్

అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్,

అష్  హదు అన్ లా ఇలాహ ఇల్లల్లాహ్,  అష్  హదు అన్ లా ఇలాహ ఇల్లల్లాహ్

ఆష్ హదు అన్న ముహమ్మదుర్ రసూలుల్లాహ్, ఆష్ హదు అన్న ముహమ్మదుర్ రసూలుల్లాహ్

హయ్యా లస్ సలాహ్, హయ్యా లస్ సలాహ్

హయ్యా లల్ ఫలాహ్, హయ్యా లల్ ఫలాహ్

అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్

లా ఇలాహ ఇల్లల్లాహ్

 

ఇతర పనుల్లో అల్లాహు అక్బర్ అనడం

జంతువును జిబహ్ చేస్తున్నప్పుడు

దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం రెండు మేకలను బలి ఇచ్చారు. వాటిని జిబహ్ చేసేటప్పుడు ‘అల్లాహు అక్బర్’ అన్నారు. సహీహ్ అల్ బుఖారీ 7399 (vol 9:496)

 

నమాజు మొదలుపెడుతున్నప్పుడు

దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ఇలా అన్నారు : “నమాజ్ కోసం శుబ్రంగా ఉండడం వుజూ చేయడం ముఖ్యమైన (తాళం చెవి లాంటి)ది. నమాజు మొదలుపెట్టేటప్పుడు అల్లాహు అక్బర్ అనాలి, అంతం చేసేటప్పుడు అస్సలాము అలైకుమ్ అనాలి. సునన్ ఇబ్న్ మాజా vol 1:276  

 

హజ్ రోజున

మేము హజ్ రోజున దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లంతో పాటు మినా నుండి అరఫాత్ కు వెళ్ళాము. మాలో కొందరు ‘అల్లాహు అక్బర్’ పఠిoచారు, మరికొందరు ‘లా ఇలాహ ఇల్లల్లాహ్’ అన్నారు. ఎవరూ ఎవరినీ విమర్శించలేదు. సునన్ అబన్ మాజా vol 1:3008

 

పడుకునే ముందు

పడుకునే ముందు ‘సుభానల్లాహ్’ ౩౩ సార్లు, ‘అల్ హందు లిల్లాహ్’ ౩౩ సార్లు, ‘అల్లాహు అక్బర్’ 34 సార్లు చదవాలి. సహీహ్ అల్ బుఖారీ 5362 (vol 7:275) [3]  

 

అల్లాహు అక్బర్ అనడం వల్ల కలిగే శుభాలు

ప్రతి నమాజ్ తరువాత చేసే జిక్ర్ (దువాల) గురించి చెబుతూ దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ఇలా అన్నారని అబూ హురైరా రజిఅల్లాహుఅన్హు ఉల్లేఖించారు : “ఎవరైతే ప్రతి నమాజ్ తరువాత వెంటనే ౩౩ సార్లు ‘సుభానల్లాహ్’, ౩౩ సార్లు ‘అల్ హందు లిల్లాహ్’, ౩౩ సార్లు ‘అల్లాహు అక్బర్’ అంటారో  – ఇలా 99 సార్లు అయిపోతుంది. 100 పూర్తి చేయడానికి ఒకసారి ‘లా ఇలాహ ఇల్లల్లాహు వహదహు లా షరీక లహు, లహుల్ ముల్క్ వ లహుల్ హమ్ద్ వహువ అలా కుల్లి షయ్యిన్ ఖదీర్’ (కేవలం అల్లాహ్ తప్ప ఆరాధ్యానికి అర్హులు ఎవ్వరూ లేరు, అతనికి భాగస్వాములెవరూ లేరు, అతనే సర్వాధిక్యుడు, అతనే ప్రశంసనీయుడు, అతను అన్నీ చేయగలవాడు) – అతని పాపాలన్నీ అవి సముద్రపు కెరటాలంతవైనా సరే మన్నించబడతాయి. సహీహ్ ముస్లిం 939 [4]

 

ఆధారాలు

[1] http://www.islamic-dictionary.com/index.php?word=Allahu+Akbar+ (ఇంగ్లీష్)
[2] http://quran.com/ (ఇంగ్లీష్)
[3] http://www.sunnah.com/search/Allahu-Akbar (ఇంగ్లీష్)
[4] http://www.islamqa.com/en/ref/2355/Allahu%20Akbar (ఇంగ్లీష్)

 

706 Views
మమ్మల్ని సరిచేయండి లేదా మిమ్మల్ని సరిచేసుకోండి
.
వ్యాఖ్యలు
పేజీ యొక్క టాప్