అలైహిస్సలాం


అలైహిస్సలాం అనగా ఆయనపై శాంతి కురియుగాక  అని అర్థం. ఇది ప్రవక్తలకు ఇవ్వబడిన ఉత్తమమైన శాంతియుతమైన  పదం. ఈ పదం యొక్క సంక్షిప్త నామం (అసం), లేదా దీనిని ఇంగ్లీష్ పరిభాషలో ఉన్న సంక్షిప్త నామం Peace Be Upon Him (PBUH) ఆయనపై శాంతి కురియుగాక .


అరబీ లో - عليه السلام(అలైహిస్సలాం)

 

విషయసూచిక

 

పరిచయం

ఇస్లాం ధర్మంలో అల్లాహ్ సుబ్ హానహు వత’ఆల మానవులలో కొంతమంది  ప్రవక్తలుగా ఎన్నుకున్నాడు. వారు వారిపై అవతరించిన గ్రంథాలను ప్రజలకు అందజేశారు. ప్రతి ముస్లిం యొక్క విశ్వాసం ఏమంటే ప్రతి ప్రవక్త భోధించిన విషయoము ఒక్కటే అదేమిటంటే అల్లాహ్ సుబ్ హానహు వత’ఆల ను మాత్రమే ఆరాధించడం, ఈ విషయాన్ని ఆయా ప్రవక్తల అనుచరులు కూడా విశ్వసించేవారు.


ప్రవక్త ముహమ్మద్  సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు:అల్లాహ్ సుబ్ హానహు వత’ఆల లక్ష ఇరవై నాలుగు వేల మంది ప్రవక్తలను పంపించారు. వారిలో 315 మంది సందేశహరులు,ముస్నద్ అహ్మద్ 21552, 21546.

 

ఖుర్ఆన్

అల్లాహ్ సుబ్ హానహు వత’ఆల సందేశహరులను మరియు ప్రవక్తలను పంపారు. వారికి అల్లాహ్ సుబ్ హానహు వత’ఆల దగ్గర నుండి ప్రజలకు భోదింooచమన్న సందేశం ఇదే, “అల్లాహ్ సుబ్ హానహు వత’ఆల ను ఆరాధించండి, ఇతరులను ఆరాధించడం మానివేయండి”.


నీకు పూర్వం మేము ఏ ప్రవక్తను పంపినా, నేను (అల్లాహ్ సుబ్ హానహు వత’ఆల )  తప్ప మరో ఆరాధ్యుడు లేడు, కనుక మీరు నన్నే ఆరాధించండి” అనే సందేశాన్ని(వహీని) అతనికి పంపాము.ఖుర్ఆన్ సూరా అంబియా 21:25


ముస్లింలు ప్రవక్తలు భోదింoచినా దేవుని  వాక్యాలను మరియు వారి ప్రవచనాలను విశ్వసించి అల్లాహ్ సుబ్ హానహు వత’ఆల  ను ఎలా ఆరాధించాలో మరియు ఉత్తమమైన జీవితాన్ని ఎలా కొనసాగించాలో తెలుసుకోగలుగుతారు. దేవుడు ఒక్కడే,  పూర్వకాలక్రమం నుంచి ఆయన  చెప్పిన సందేశము ఒక్కటే. ప్రవక్తలు ఇస్లాం సందేశం ఏమని అందజేశారంటే – మనిషికి తన జీవితంలో  శాంతి లభించాలంటే  ఆ వ్యక్తి తన జీవితకాలంలో తనకు తాను  అల్లాహ్ సుబ్ హానహు వత’ఆల కు సమర్పించుకోవాలి. ఆయననే విశ్వసించాలి, ఆయన భోదిoచిన  విషయాలపైన స్థిరంగా వుండాలి. .  

 

ఆధారాలు

http://www.islamic-dictionary.com/index.php?word=alayhi+salam


Stories of the Prophets by IbnKathir


ఇంకా చూడండి : ఇస్లాం లో ప్రవక్తలు; ఇస్లాం లో శాంతి
 

769 Views
మమ్మల్ని సరిచేయండి లేదా మిమ్మల్ని సరిచేసుకోండి
.
వ్యాఖ్యలు
పేజీ యొక్క టాప్