అత్యాచారాల పెరుగుదల-దాని నివారణలు


అత్యాచారం గురించి విన్న ప్రతిసారి ప్రజలు బాధితురాలు గురించి చాలా ఆవేదన వ్యక్తం చేస్తారు. దోషిని శిక్షించాలని నినాదాలు చేస్తారు.కాని కొన్ని రోజుల తరువాత వేరే వార్త రాగానే, దీన్ని అందరూ మర్చిపోతారు. అత్యాచారం(రేప్) ఘోరమైన, నీచమైన అపరాధం. ఇది రోజురోజుకీ పెరుగుతూ పోతుంది. సంఘ సంస్కర్తలు దీన్ని తగ్గించాలని చాలా దీర్ఘంగా ఉపాయాలు అన్వేషిస్తున్నారు. కాని ఎలాంటి పరివర్తన కలగడం లేదు.

 

ఏదైనా నేరాన్ని ఆపడానికి దాని మూలాధారం ఏమిటో కనుక్కోవడం అవసరం. అది తెలుసుకుని దాన్ని నివారించటానికి నిజాయితిగా ప్రయత్నించాలి.

 

దీన్ని పరిష్కరించేటప్పుడు ఎలాంటి భావోద్వేగాలకు లోను కాకూడదు. అలా చేసినచో దీని పరిష్కారం ఎన్నటికీ లభించదు. పరిష్కారాన్ని అన్వేషించడంలో ఎంత ఎక్కువ సమయం  తీసుకోబడుతుందో, అది అంతే పెరుగుతూ పోతుంది.

 

విషయసూచిక

 

గణాంకాలు

భారతీయ ప్రభుత్వం ద్వారా తాజాగా వెలువడిన గణాంకం ప్రకారం, ప్రతి 20 నిమిషాలకు భారత దేశంలో ఒక అత్యాచారం (మానభంగం) జరుగుతుంది. మానభంగం జరిగిన ప్రతి ముగ్గురిలో ఒక పిల్ల ఉంటుంది అని 2011లో NCRB(data from the National Crime Records Bureau)గణాంకం తెలియజేస్తుంది.U.S. Department of Justice's National Crime Victimization Survey– ప్రకారం ప్రతి సంవత్సరం అమెరికాలో  దాదాపు 207,754 మానభంగాలు (12 లేదా కాస్త ఎక్కువ వయసుగలవారిపై) జరుగుతున్నాయి.అమెరికాలోప్రతి రెండు నిమిషాలకు ఒక మానభంగం జరుగుతుంది.[2]

 

అమెరికాలో 6 స్త్రీలలో ఒక స్త్రీ పై మానభంగా ప్రయత్నమో లేదా మానభంగమో జరుగుతుంది. (14.8% మానభంగాలు, 2.8% మానభంగ ప్రయత్నాలు). (U.S. Department of Justice. National Crime Victimization Survey. 2006-2010). [3]

 

స్త్రీల రక్షణ గురించి ఖుర్ఆన్ లో

“ఓ ప్రవక్తా! తమపై నుంచి తమ దుప్పట్లను (క్రిందికి) వ్రేలాడేలా కప్పుకోమని నీ భార్యలకు, నీ కుమార్తెలకు, విశ్వాసులైన స్త్రీలకు చెప్పు. తద్వారా వారు చాలా తొందరగా (మర్యాదస్తులుగా) గుర్తించబడి, వేధింపుకు గురికాకుండా ఉంటారు. అల్లాహ్‌ క్షమించేవాడు, కనికరించేవాడు.” (ఖుర్ఆన్,సూరా అహజాబ్ 33:59)

 

“....దాగివున్న తమ  అలంకరణ ఇతరులకు తెలిసిపోయేలా తమ కాళ్ళను నేలపై కొడుతూ నడవరాదని వారితో చెప్పు. ముస్లింలారా! మీరంతా కలసి అల్లాహ్‌ సన్నిధిలో పశ్చాత్తాపం చెందండి. తద్వారా మీరు సాఫల్యం పొందవచ్చు.” (ఖుర్ఆన్, సూరా నూర్ 24:31)

 

“మీరు (అల్లాహ్‌కు) భయపడేవారే అయితే సుతిమెత్తని శైలిలో మాట్లాడకండి. దాని వల్ల  హృదయంలో (దురాలోచనా) రోగం  ఉన్నవాడు  అత్యాశకు పోవచ్చు. కనుక మాట్లాడితే  ఉత్తమ రీతిలోనే మాట్లాడండి.” (ఖుర్ఆన్, సూరా అహజాబ్ 33:32)

 

“ఎవరు అల్లాహ్‌తోనూ, ఆయన ప్రవక్తతోనూ పోరాడుతారో, భూమిలో కల్లోలాన్ని రేకెత్తిస్తూ తిరుగుతుంటారో వారు వధించబడాలి. లేదా ఉరి కంబం ఎక్కించబడాలి. లేదా ఎదురుగా వారి   కాళ్లు చేతులు ఖండించబడాలి.   లేదా  వారిని దేశం నుంచి  బహిష్కరించాలి. ఇది  ఇహలోకంలో వారికి కలగవలసిన పరాభవం.  పరలోకంలో వారికి  విధించబడే శిక్ష (ఇంతకన్నా) ఘోరంగా ఉంటుంది.” (ఖుర్ఆన్, సూరా మాయిదా 5:33)

 

హదీస్

వాయిల్ ఇబ్న్ హుజ్ర్ ఉల్లేఖనం ప్రకారం: “దైవప్రవక్త సల్లల్లాహు అలైహివసల్లం కాలంలో ఒక స్త్రీ నమాజ్ కోసం బయటవెళ్లినప్పుడు, ఒకతను ఆమెపై అత్యాచారం చేశాడు. ఆ తరువాత ఆమె అరుపులకు అతను పారిపోయాడు. కొద్ది సేపటికి ఒక మనిషి అటు వచ్చాడు. అత్యాచారానికి గురి అయిన స్త్రీ అతనితో జరిగినదంతా చెప్పింది.ఆ తరువాత కొందరు వలస దారులు అటు వచ్చారు. బాధితురాలు వారితో కూడా జరిగింది చెప్పింది. ఆ వలసదారులు అత్యాచారానికి పాల్పడిన వ్యక్తిని ఆమె వద్దకు తీసుకువచ్చారు.

 

ఆమె ఇతనే అని అతన్ని గుర్తుపట్టింది. అప్పుడు అతన్ని దైవప్రవక్త సల్లల్లాహు అలైహివసల్లం దగ్గరికి తీసుకువచ్చారు.దైవప్రవక్త సల్లల్లాహు అలైహివసల్లం తన తీర్పును వెల్లడించబోతుండగా, ఆ వ్యక్తి ‘ఔను, ఆమెపై అత్యాచారం చేసింది నేనే’ అని ఒప్పుకున్నాడు.

 

దైవప్రవక్త సల్లల్లాహు అలైహివసల్లం ఆ బాధితురాలితో ఇలా అన్నారు: “నువ్వు వెళ్ళిపో. అల్లాహ్ నిన్ను క్షమించాడు.” దాని తరువాత ఆ అత్యాచారి గురించి ఇలా అన్నారు: “అతణ్ణి రాళ్ళతో కొట్టి చంపేయండి.” ఇంకా ఇలా అన్నారు, “అతను నిజాయితిగా తన తప్పును ఒప్పుకుని, క్షమాపణ వేడుకున్నాడు. ఒకవేళ ఇదే విధంగా మదీనా వాసులు కూడా క్షమాపణ కోరి ఉంటే, వారి క్షమాపణ మన్నించబడేది.” (సునన్ అబూ దావూద్ 4366) (అరబిక్ 4379)

 

ప్రస్తుత స్థితి

ప్రస్తుత స్థితిని దృష్టిలో ఉంచుకుని ఈ సమస్యకు పరిష్కారాన్ని వెతుకుదాం. ఈ విధంగా మన స్త్రీలను– సమాజపు ఆణిముత్యాలను- గౌరవిద్దాం.

 

 1. వాతావరణం: ప్రస్తుత వాతావరణంలో స్త్రీ పురుషులు చాలా కలిసిమెలిసి ఉంటున్నారు. ఒకరికి ఇంకొకరి రహస్యాలు సయితం తెలిసిపోతున్నాయి. ఇంత దగ్గరవడం పాపాలకు దారి తీస్తుంది. ప్రస్తుత సమాజంలో ఆడ-మగ స్నేహాలు సర్వసామాన్యమైపోయాయి.ప్రకృతి పరంగా పురుషునికి లైంగిక వాంఛ స్త్రీ కన్నా ఎక్కువ ఉంటుంది. పురుషుడు స్త్రీ వైపు తొందరగా ఆకర్షితుడవుతాడు. దీని వల్ల నేరం జరిగే అవకాశం ఉంటుంది. అందువల్ల మనకు కీడు కలుగజేసే విషయాలకు మనము దూరంగా ఉండాలి.
   
 2. విద్య: మన విద్యా విధానం చాల అధ్వాన్నంగా ఉంది. ఇందులో మహిళ నిరాడంబరంగా, సచ్చీలంగా ఉండాలన్నా కుదరదు. స్త్రీ పురుషుల మధ్య ఎలాంటి వివక్షత లేదు. అత్యాచారాలు పెరగడానికి ఇది కూడా ఒక కారణం.
   
 3. ప్రవర్తన: ఇలాంటి నేరాలు సమాజంలో సర్వసామాన్యమై పోవడం వల్ల, దీని పట్ల ఉండాల్సిన విరక్తి, భయం ప్రజల్లో సన్నగిల్లింది.
   
 4. వయసు మీరాక వివాహాలు చేయడం: ఈ రోజుల్లో స్వేచ్ఛ పేరుతో పెళ్ళిళ్ళు వయసు దాటాక చేయడం ఓ రివాజు అయిపొయింది. ఇలాంటి పరిస్థితిలో స్త్రీలైనా, పురుషులైనా తమ మనోవాంఛలను అణచుకోలేక, ఈ తప్పుడు కార్యానికి పాల్పడుతున్నారు.

   
 5. అశ్లీల చిత్రాలు: ఇలాంటి వాటి వల్ల యువకుల్లోని సామర్ధ్యత దెబ్బతింటుంది. ఇది ఎంత సాధారణమై పోయిందంటే, ఓ విద్యార్ధి/విద్యార్థిని తన జ్ఞానాన్ని పెంపొందించుకునే నిమిత్తం గూగుల్ పై పరిశోధన చేయడానికి వెళితే, అశ్లీల చిత్రాల వెబ్ సైట్ లు అనేకం కనిపిస్తాయి. ఇలా ఈ వెబ్ సైట్ లు నడిపేవారు, యువతను చాలా తేలిగ్గా తమ వైపుకు మరల్చుకుంటున్నారు. ఇలాంటి వెబ్ సైట్ లను మూసివేయడం, నిషేధించడం ఒకటే దీనికి పరిష్కారం.
   
 6. వస్త్రధారణ: నేటి వస్త్రధారణ, ప్రత్యేకంగా స్త్రీలది చాలా ఘోరంగా తయారయింది. ఒక్కోసారి శరీరపు సగభాగం, అందులోనూ మర్మాంగాలు ఇతరులకు కనిపించేలా ఉంటున్నాయి. ఇలాంటి పరిస్థితిలో పురుషులు స్త్రీల వైపుకు ఆకర్షితులవడంలో ఆశ్చర్యం లేదు. దీనివల్ల మానభంగాలు పెరుగుతూ పోతాయి.
   
 7. శిక్ష: నేరానితో పోలిస్తే, ఈ నేరానికి ఇవ్వబడే శిక్ష చాలా చిన్నది. మన చట్టంలో ఉన్న లోపాల వల్ల, తీర్పువెలువడి ముద్దాయి శిక్షించబడే వరకు సంవత్సరాలు గడచిపోతాయి. అంతవరకూ నేరస్థుడు సమాజంలో ఎలాంటి భయం లేకుండా తిరుగుతూ ఉంటాడు. పాశ్చాత్య దేశాల్లో నేరస్థునికి ఇవ్వబడే శిక్ష చాలా స్వల్పం. దీనివల్ల అతడు మళ్ళి మానభంగానికి పాల్పడడానికి భయపడడు.
   
 8. నిబంధనలు/ ప్రమాణములు: ప్రజలు నైతిక విలువలను మరచిపోయారు. వారికి మంచి చెడుల బేధం కూడా తెలియడం లేదు. నేటి పిల్లలు అర్ధరాత్రి దాకా విందుల్లో, వినోదాల్లో గడుపుతున్నారు.అయిననూ వారి తల్లిదండ్రులు వారిని వారించడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో మానభంగాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నేటి సమాజంలో ప్రమాణాలు, నైతిక విలువలు పడిపోయాయి. చెడును చెడుగా భావించటం లేదు.[4]

 

ఇస్లాంలో అత్యాచారం ఘోరమైన నేరం

“అరబీ పదం ‘ఇఘ్ తిసాబ్’ అంటే, ఎవరినైనా బలవంతంగా తీసుకోవడం. నేటి సమాజంలో ప్రత్యేకంగా స్త్రీపై జరిగే అత్యాచారానికి ఈ పదాన్ని వాడుతున్నారు.

 

ఇస్లాం మానభంగాన్ని హరాం (నిషేధించింది) చేసింది. దీనికి కఠినాతి కఠినమైన శిక్ష సూచించింది. ఇస్లామీయ చట్టం మహిళను పూర్తిగా రక్షిస్తుంది. ఇస్లాం స్త్రీలకు నీతిబాహ్యమైన వస్త్రధారణను నిషేధించింది. స్త్రీ మహరం (పెళ్లి చేసుకోలేని వ్యక్తి)లేకుండా ప్రయాణించడాన్ని కూడా నిషేధించింది.మహరం కాని వ్యక్తితో చేయి కలపడాన్ని కూడా నిషేధించింది. ఇస్లాం యువతీ యువకులను తొందరగా పెళ్లి చేసుకోమని ప్రోత్సహిస్తుంది. ఇస్లాంలోని ఈ నిబంధనల వల్ల మానభంగానికి దారి తీసేదారులన్నీ మూసుకుపోతాయి. అందుకే ఇస్లామీయ దేశాలలో మానభంగాలు చాలా తక్కువగా, అదీ ఎప్పుడో ఒకసారి జరుగుతాయి. ఇస్లాం మానభంగానికి మరియు వ్యభిచారానికి ఒకే శిక్ష విధిస్తుంది. అదేమిటంటే, పెళ్లి అయిన వారికి రాళ్ళతో కొట్టి చంపాలి, పెళ్లి కాని వారికి వంద కొరడా దెబ్బలు కొట్టి, ఒక సంవత్సరం పాటు బహిష్కరించాలి.

 

సూచన: శిక్షను విధించేవాడు ఆ ప్రదేశానికి చెందిన నిర్ణయాధికారి అయిఉండాలి లేదా అక్కడి చట్టం ప్రకారం అమలు జరగాలి. ఎవరంటే వారు చట్టాన్ని తమ చేతుల్లో తీసుకోరాదు.

 

ఖుర్ఆన్ ప్రకారం అత్యాచారానికి పాల్పడిన వానికి మరణశిక్ష

إِنَّمَا جَزَاءُ الَّذِينَ يُحَارِبُونَ اللَّهَ وَرَسُولَهُ وَيَسْعَوْنَ فِي الْأَرْضِ فَسَادًا أَن يُقَتَّلُوا أَوْ يُصَلَّبُوا أَوْ تُقَطَّعَ أَيْدِيهِمْ وَأَرْجُلُهُم مِّنْ خِلَافٍ أَوْ يُنفَوْا مِنَ الْأَرْضِ ۚذَٰلِكَ لَهُمْ خِزْيٌ فِي الدُّنْيَا ۖوَلَهُمْ فِي الْآخِرَةِ عَذَابٌ عَظِيمٌ

 

“ఎవరు అల్లాహ్‌తోనూ, ఆయన ప్రవక్తతోనూ పోరాడుతారో, భూమిలో కల్లోలాన్ని రేకెత్తిస్తూ తిరుగుతుంటారో వారు వధించబడాలి. లేదా ఉరి కంబం ఎక్కించబడాలి. లేదా వ్యతిరేకంగా వారి   కాళ్లు చేతులు నరికించబడాలి.లేదా వారిని దేశం నుంచి బహిష్కరించాలి. ఇది ఇహలోకంలో వారికి కలగవలసిన పరాభవం. పరలోకంలో వారికి విధించబడే శిక్ష (ఇంతకన్నా) ఘోరంగా ఉంటుంది.” (ఖుర్ఆన్, సూరా అహజాబ్5:33)

 

అత్యాచారంపై ముస్లిమేతరుల వీక్షణ

మాటలు కాదు, చేతల ద్వారా నిరూపించే సమయం వచ్చేసింది అని కాంగ్రేస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ అన్నారు. అత్యాచారానికి పాల్పడిన వ్యక్తికి కఠినాతి కఠినమైన శిక్ష విధించాలని కూడా ఆమె అన్నారు.

http://zeenews.india.com/news/nation/delhi-rape-case-as-it-happened_843357.html

  

అత్యాచారానికి పాల్పడిన వ్యక్తికి మరణ శిక్ష విధించాలని BJP డిమాండు చేసింది. లోక్ సభా అధ్యక్షురాలు సుష్మా స్వరాజ్ కూడా మరణ శిక్ష విధించాలని అన్నారు. చిన్న పిల్లల్ని మానభంగం చేసిన వారికి ఉరి శిక్ష విధించాలని రాజ్య సభ సభ్యులు కోరారు.

http://articles.timesofindia.indiatimes.com/2013-04-23/india/38761893_1_child-rapists-capital-punishment-death-penalty

http://news.in.msn.com/national/delhi-gang-rape-sushma-swaraj-demands-capital-punishment-for-rapists

http://www.dnaindia.com/india/1778880/report-delhi-gang-rape-sushma-swaraj-demands-capital-punishment-for-rapists

 

ది నేషనల్ కమిషన్ ఫర్ వుమెన్ తొమ్మిది విభాగాల్లో సమీక్ష అవసరం అని గుర్తించింది. అవి

అత్యాచారానికి పాల్పడిన వ్యక్తికి మరణ శిక్ష విధించాలి.

http://www.legalindia.in/rape-laws-in-india

 

కఠినాతి కఠినమైన శిక్ష విధించాలనే బిల్లును భారతదేశ పార్లమెంట్ లో జారీ చేసింది. (కరుణా నంది, సుప్రిమ్ కోర్ట్

లాయర్)

http://www.bbc.co.uk/news/world-asia-india-21950197

 

సమీక్ష

సౌదీ అరేబియా మరియు కొన్ని దేశాలు మానభంగానికి పాల్పడిన వారికి మరణశిక్ష విధిస్తాయి. కొందరు దీన్ని అనాగరిక చర్య అంటారు. కాని, అత్యాచారానికి గురిఅయిన బాధితురాలి సంబంధీకులు మాత్రం, మరణ శిక్ష లేదా దానికన్నా పెద్ద శిక్ష విధించాలని కోరుతారు. ప్రపంచపు నేర గణాంకాల ప్రకారం, ఇతర దేశాలతో పోలిస్తే, ఇస్లామీయ చట్టాన్ని అనుసరించే దేశాలలో ఇలాంటి నేరాలు చాలా తక్కువగా జరుగుతాయి.[6]

 

ఆధారాలు

[1] [4] http://www.passionatewriters.org/2011/12/increasing-rape-cases-obvious-reasons.html(ఇంగ్లీష్)

[2] http://www.rainn.org/statistics(ఇంగ్లీష్)

[3] http://www.hindustantimes.com/India-news/NewDelhi/Where-rapists-roam-free/Article1-942211.aspx(ఇంగ్లీష్)

[5] http://islamqa.info/en/ref/72338(ఇంగ్లీష్)

[6] http://www.nationmaster.com/compare/Saudi-Arabia/United-States/Crime(ఇంగ్లీష్)

ఫుట్ నోట్ 1,5 లేదు

 

2017 Views
మమ్మల్ని సరిచేయండి లేదా మిమ్మల్ని సరిచేసుకోండి
.
వ్యాఖ్యలు
పేజీ యొక్క టాప్