అంతిమదినంపై విశ్వాసం- BELIEF IN THE LAST DAY


అంతిమ దినం నాడు మానవాళి మొత్తం ఒక చోట జమ చేయబడుతుంది. అక్కడ వారి కార్యాల గురించి ప్రశ్నించబడుతుంది. వాటికి (కార్యాలకు) అనుగుణంగా ప్రతిఫలం (శిక్ష లేదా బహుమానం) లభిస్తుంది. దీన్ని అంతిమ దినం అనడానికి కారణం ఇది ఆఖరి రోజు, దీని తరువాత మరో రోజు ఉండదు. ఆ తరువాత స్వర్గవాసులు ఎల్లకాలం అందులోనే ఉంటారు మరియు నరక వాసులు ఎల్లకాలం అందులోనే ఉంటారు. [1]

 

అంతిమ దినం పై విశ్వాసం అంటే, దాని గురించి అల్లాహ్ ఖుర్ఆన్ లో చెప్పింది మరియు దైవప్రవక్త తన బోధనల ద్వారా చెప్పింది పూర్తిగా నమ్మడం (మరణం తరువాత ఇలా తప్పకుండా జరిగి తీరుతుందని నమ్మడం). ఇందులో అంతిమ దినానికి ముందు జరిగే సూచనలను నమ్మడం; మరణం సమీపించినప్పుడు మానవునిపై జరిగే పరిణామాలు; మరణం తరువాత జరిగే పరిణామాలు, సమాధిలోని పరీక్ష (బహుమానం లేదా శిక్ష), శంఖం ఊదబడటం, ప్రళయం సంభవించడం, ప్రళయం నాటి సంఘటనలు, స్వర్గం మరియు దాని శుభాలు, స్వర్గంలో అల్లాహ్ ను చూడడం అన్నిటికంటే పెద్ద సంతోషం, నరకం మరియు దాని శిక్షలు, అందులో ఉన్నవారు అల్లాహ్ ను చూడలేకపోవడం పెద్ద దురదృష్టం మొదలైనవి ఉన్నాయి. [అలాం అల్ సున్నహ్ అల్ మంషూరహ్, 110; షర్ అల్ ఉసూల్ అల్ సలాత, 98-103] [2]   

 

విషయసూచిక

 

ఖుర్ఆన్

ప్రాపంచిక జీవితం ఒక రోజు తప్పకుండా అంతమవుతుంది అని విశ్వసించాలి. అల్లాహ్ ఇలా అంటున్నాడు:“భూమండలం పై ఉన్నవారంతా నశించి పోవలసినవారే.” [ఖుర్ఆన్ సూరా రహ్మాన్ 55:26] అల్లాహ్ ఈ ప్రపంచాన్ని అంతం చేయాలని అనుకున్నప్పుడు, అల్లాహ్ ఇస్రాఫీల్ అనే దైవదూతను శంఖం ఊదమని ఆజ్ఞాపిస్తాడు. ఆ సమయంలో భూమిపై ఉన్నదంతా నశించిపోతుంది. అల్లాహ్ ఇస్రాఫీల్ ను మరోసారి శంఖం ఊదమని ఆజ్ఞాపిస్తాడు. అప్పుడు ఆదం అలైహిస్సలాం నుండి అప్పటి వరకు మరణించినవారంతా తమ సమాధుల నుండి తమ శరీరాలతో లేచి నిలబడుతారు. అల్లాహ్ ఖుర్ఆన్ లో ఇలా అన్నాడు: “మరి శంఖం ఊదబడగానే ఆకాశాలలో, భూమిలో ఉన్న వారంతా స్పృహ తప్పి పడిపోతారు -  కాని  అల్లాహ్‌ కోరిన వారు మాత్రం (స్పృహ కోల్పోరు)!  మళ్లీ శంఖం పూరించబడగానే వారంతా  ఒక్కసారిగా లేచి  చూస్తూ ఉంటారు.” [ఖుర్ఆన్ సూరా జుమర్ 39:68]

 

 

అంతిమదినంపై విశ్వాసంలో మూడు భాగాలున్నాయి 

1. పునరుత్థానము పై విశ్వాసము

శంఖం రెండోసారి ఊదబడినప్పుడు, పునరుత్థానం జరుగుతుంది. ఆ తరువాత, అల్లాహ్ మానవులందరినీ ప్రశ్నిస్తాడు. అల్లాహ్ ఇలా అన్నాడు: “ఏవిధంగామేముమొదటిసారిసృష్టించామోఅదేవిధంగామలిసారికూడాచేస్తాము. ఈవాగ్దానాన్నినెరవేర్చేబాధ్యతమాపైనఉంది. దాన్నిమేముతప్పకుండానెరవేరుస్తాము.” [ఖుర్ఆన్ సూరా అంబియా 21:104]

 

పునరుత్థానం జరగడం తధ్యం అని ఖుర్ఆన్ మరియు దైవప్రవక్త సున్నతుల ద్వారా దృఢపరచబడింది. ఖుర్ఆన్ లో ఇలా ఉంది: “మరి ఆ తరువాత మీరంతా తప్పకుండా మరణిస్తారు.మరి ప్రళయ దినాన మీరంతా నిశ్చయంగా లేపబడతారు.”[ఖుర్ఆన్ సూరా మోమినూన్ 23:15-16]

 

ముస్లింలందరూ ఏకగ్రీవంగా ప్రళయదినాన్ని ధ్రువపరిచారు. ఇది అల్లాహ్ వివేకము. అల్లాహ్ ప్రవక్తలను తన ఆదేశాలతో ప్రతి సమాజంలో పంపించాడు. అందువల్ల, ఆయన మానవులను ప్రళయంనాడు ప్రశ్నిస్తాడు. అల్లాహ్ ఇలా అన్నాడు: “మేము  మిమ్మల్ని  ఏదో  ఆషామాషీగా  (అర్థరహితంగా) పుట్టించామనీ,  మీరు మా దగ్గరకు మరలిరావటం అనేది జరగని పని అని అనుకున్నారా?” [ఖుర్ఆన్ సూరా మోమినూన్ 23:115]

 

“(ఓ  ప్రవక్తా!)   నీపై   ఖుర్‌ఆన్‌ను అవతరింపజేసినవాడు   నిన్ను  తిరిగి పూర్వస్థలానికి చేర్చనున్నాడు. ఈ విధంగా చెప్పు:  సన్మార్గాన్ని తీసుకువచ్చిన వారెవరో నా ప్రభువుకు బాగా తెలుసు. స్పష్టమైన  అపమార్గంలో  పడిఉన్నదెవరో  కూడా  ఆయనకు తెలుసు.” [ఖుర్ఆన్ సూరా ఖసస్ 28:85]

 

2. లెక్క తీసుకునే విషయంపై విశ్వాసం

అంతిమ దినాన ప్రతి దైవదాసునికి తన కర్మల ఆధారంగా మంచి ప్రతిఫలం లేదా శిక్ష లభిస్తుంది. ఈ వాస్తవము ఖుర్ఆన్ మరియు దైవప్రవక్త సున్నత్ ల ద్వారా ధృవీకరించబడింది. అల్లాహ్ ఇలా అన్నాడు: “ఎట్టి పరిస్థితిలోనూ వారు మా వద్దకే తిరిగి రావలసి ఉన్నది. మరి వారి నుండి లెక్క తీసుకునే బాధ్యత మాపైనే ఉంది.” [ఖుర్ఆన్ సూరా ఘాషియ 88:25,26]

 

“సత్కార్యం చేసినవాని సత్కార్యానికి పదిరెట్లు లభిస్తాయి.దుష్కార్యానికి  ఒడిగట్టిన  వాని దుష్కార్యానికి  దానికి సరిపడా శిక్ష మాత్రమే విధించబడుతుంది.వారికి ఎలాంటి  అన్యాయం జరగదు.” [ఖుర్ఆన్ సూరా అనామ్ 6:160]

 

“మేము  ప్రళయ  దినాన  న్యాయంగా  తూచే  త్రాసులను నెలకొల్పుతాము.  మరి  ఏ ప్రాణికీ  రవంత  అన్యాయం  కూడా జరగదు. ఒకవేళ ఆవగింజంత ఆచరణ ఉన్నా మేము  దానిని హాజరు పరుస్తాము. లెక్క తీసుకోవటానికి మేము చాలు.” [ఖుర్ఆన్ సూరా అంబియా 21:47]

 

దైవప్రవక్త ఇలా అన్నారు: అల్లాహ్ విశ్వాసిని తన దగ్గరకు తీసుకు వస్తాడు. అతన్ని (అతని చెడు కర్మలు కనిపించకుండా) అందరిముందు కాపాడుతాడు. అల్లాహ్ ఇలా అంటాడు: “నీకు ఫలానా (చెడు) కార్యం గుర్తుందా?” దానికి మనిషి ఇలా అంటాడు, “ఔను ఓ అల్లాహ్!” తన చెడు కార్యాల గురించి అల్లాహ్ ప్రస్తావించినప్పుడు, అతను తను నాశనం అయిపోయానుఅని ఊహిస్తుండగా, అల్లాహ్ ఇలా అంటాడు, “నేను నీ జీవితకాలంలోనే నిన్ను భద్రపరిచాను (ఇతరులకు నీ చెడు కార్యాలు తెలియకుండా). ఈ రోజు దాని నుండి నిన్ను క్షమిస్తున్నాను.” ఆ తరువాత అతని కర్మల పత్రం అతనికి ఇవ్వబడుతుంది. అవిశ్వాసులు మరియు కపట విశ్వాసులు అందరిముందు పిలవబడుతారు: “వీరు తమ ప్రభువు అయిన అల్లాహ్ ను త్రోసిపుచ్చారు (ఆయన తన ప్రవక్తల ద్వారా పంపించిన సందేశాన్ని అనుసరించలేదు). కావున వారిపై అల్లాహ్ శాపం పడుతుంది.” [సహీహ్ బుఖారీ, సహీహ్ ముస్లిం]

 

ఎవరైతే మంచి పని చేయాలని ఆశించి, దాన్ని నెరవేర్చితే, వారికి అల్లాహ్ పది రెట్ల నుంచి ఏడువందల రేట్లు లేదా అంతకంటే ఎక్కువ పుణ్యం ప్రసాదిస్తాడు. ఎవరైనా చెడు కార్యం చేయాలని పూనుకొని, దాన్ని చేస్తే, అల్లాహ్ అతని ఖాతాలో ఒక చెడు కార్యం మాత్రమే వ్రాస్తాడు.” [సహీహ్ బుఖారీ, సహీహ్ ముస్లిం 237]

 

లెక్క తీసుకునే రోజు (అంతిమదినం) వచ్చి తీరుతుందని ముస్లింలు విశ్వసిస్తారు. ఇది అల్లాహ్ వివేకం. ఆయన దైవగ్రంథాలను, దైవప్రవక్తలను మానవుల కోసం పంపించాడు మరియు వాటిని స్వీకరించి, అనుసరించి, విధేయత చూపాలని ఆదేశించాడు. వాటిని (దైవగ్రంథాలను, దైవప్రవక్తలను) త్రోసిపుచ్చిన వారితో యుద్ధం చేయండి. వారి రక్తాన్ని కళ్ళజూడడం తప్పు కాదుమరియు వారి పిల్లలను, స్త్రీలను స్వాధీన పరచుకొండి.లెక్క తీసుకునే రోజు లేనిచో,ఈ ఆజ్ఞ వల్ల ఎలాంటి ప్రయోజనము ఉండదు. ఇలాంటి పనికి మాలిన పనులకు  అల్లాహ్ అతీతుడు. ఖుర్ఆన్ లో ఇలా అనబడింది: “ఎవరివద్దకు   ప్రవక్తలు  పంపబడ్డారోవారినితప్పకుండా   అడుగుతాముప్రవక్తలను   కూడా    మేము   తప్పకుండాప్రశ్నిస్తాము.మాకుప్రతిదీ  తెలుసు  గనక   తర్వాత  వారి  ముందు  ఉన్నదున్నట్టువిప్పిచెబుతాము- మాకుఏదీతెలియకుండాలేదు.[ఖుర్ఆన్ సూరా ఆరాఫ్ 7:6,7]

 

 

3. స్వర్గం మరియు నరకం పై విశ్వాసం

ఇవి (స్వర్గ నరకాలు) శాశ్వతమైనవి. స్వర్గాన్ని అల్లాహ్ తన నిజాయితీపరులైన విశ్వాసుల కొరకు సిద్ధం చేశాడు. వారు అల్లాహ్ ను మరియు దైవప్రవక్త ను మనస్ఫూర్తిగా విశ్వసిస్తారు మరియు విధేయత చూపుతారు. స్వర్గంలో లెక్కలేనన్ని అల్లాహ్ అనుగ్రహాలు ఉంటాయి. వాటిని ఏ కన్ను చూడలేదు, ఏ చెవి వినలేదు, ఏ మనస్సు ఊహించలేదు.

 

అల్లాహ్ ఇలా అన్నాడు: “అయితే విశ్వసించి, సత్కార్యాలు చేసినవారు; నిశ్చయంగా సృష్టిలో వారే అందరికన్నా ఉత్తములు. వారికి ప్రతిఫలంగా వారి ప్రభువు దగ్గర శాశ్వతమైన స్వర్గ వనాలున్నాయి. వాటి క్రింద కాలువలు ప్రవహిస్తూ ఉంటాయి. వాటిలో వారు కలకాలం ఉంటారు. అల్లాహ్ వారి పట్ల ప్రసన్నుడయ్యాడు. వారు అల్లాహ్ పట్ల సంతోషపడ్డారు. ఈ అనుగ్రహ భాగ్యం తన ప్రభువుకు భయపడే వానికి మాత్రమే.” [ఖుర్ఆన్ సూరా బయ్యినహ్ 98:7-8]

 

 “వారు చేసిన కర్మలకు ప్రతిఫలంగా, వారి కళ్లకు చలువనిచ్చే ఎలాంటి  సామగ్రిని  మేము  దాచిపెట్టామో (దాని గురించి) ఏ ప్రాణికీ తెలియదు.” [ఖుర్ఆన్ సూరా సజ్దా 32:17]

 

నరకాన్ని అల్లాహ్ తన అవిశ్వాస దాసుల కొరకు శిక్షగా తయారుచేశాడు. వీరు అల్లాహ్ ను మరియు ఆయన ప్రవక్తలను ధిక్కరించారు మరియు అవిధేయత చూపారు. నరకంలో లభించే శిక్షల గురించి మానవుడు ఊహించలేడు. అల్లాహ్ ఇలా అన్నాడు: “అవిశ్వాసుల కొరకు సిద్ధం చేయబడిన నరకాగ్నికి భయపడండి.” [ఖుర్ఆన్ సూరా ఆలి ఇమ్రాన్ 3:131]

 

“(అయితే  సత్యాన్ని నిరాకరించిన)  దుర్మార్గుల  కోసం మేము అగ్నిని  సిద్ధం చేసి  ఉంచాము. దాని కీలలు వారిని చుట్టుముడ తాయి. ఒకవేళ వారు  సహాయం (ఉపశమనం, నీళ్లు) అడిగితే, నూనె మడ్డిలాంటి నీటితో  వారికి  సహాయం  అందజేయబడుతుంది.  అది   ముఖాలను  మాడ్చివేస్తుంది.  అత్యంత అసహ్యకరమైన నీరు అది! అత్యంత దుర్భరమైన నివాసం  (నరకం)  అది!!” [ఖుర్ఆన్ సూరా కహఫ్ 18:29]

 

అల్లాహ్‌ అవిశ్వాసులను శపించాడు.  ఇంకా వారి కోసం మండే అగ్నిని సిద్ధం చేసి ఉంచాడు. అందులో  వారు  ఎల్లకాలం పడి ఉంటారు. వారు ఏ సంరక్షకుణ్ణీ, సహాయకుణ్ణీ పొందలేరు. ఆ రోజు వారి ముఖాలు అగ్నిలో అటూ ఇటూ పొర్లింపబడతాయి.  అప్పుడు వారు,  "అయ్యో!  మేము అల్లాహ్‌కు,  ప్రవక్తకు విధేయత చూపి  ఉంటే  ఎంత  బావుండేది?" అని అంటారు. [ఖుర్ఆన్ సూరా అహజాబ్ 33:64-66]

 

అంతిమదినంపై విశ్వాసం యొక్క వివరాలు

అంతిమదినంపై విశ్వాసంలో అల్లాహ్ మరియు దైవప్రవక్త చెప్పిన ప్రతి దానిని మనస్ఫూర్తిగా నమ్మాలి:

 

1. బర్జఖ్ (మరణం నుంచి ప్రళయం వరకు గల కాలం) జీవితాన్ని విశ్వసించాలి:

ఇది (బర్జఖ్) మానవుని మరణం నుంచి ప్రళయం వరకు ఉంటుంది. ఈ జీవితకాలంలో (సమయంలో) విశ్వాసి చాల ప్రశాంతంగా ఉంటాడు మరియు అవిశ్వాసి శిక్షను పొందుతాడు. అల్లాహ్ ఇలా అన్నాడు: (ఇదిగో)  అగ్ని -  దాని  ఎదుట  వారు  ప్రతి  ఉదయం, సాయంత్రం రప్పించబడుతుంటారు.  మరి  ప్రళయం సంభవించిననాడు, "ఫిరౌను జనులను దుర్భరమైన శిక్షలో పడవేయండి"  (అని సెలవీయబడుతుంది). [ఖుర్ఆన్ సూరా మోమిన్ 40:46]

 

2. లెక్క తీసుకునే విషయంపై విశ్వాసం

అల్లాహ్ మానవులను ప్రళయ దినాన ఒకచోట సమీకరిస్తాడు. అప్పుడు ప్రజలు నగ్నంగా, ఒట్టికాళ్ళతో, సున్తీ చేయబడని స్థితిలో వస్తారు. అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: తాము మరణించిన పిదప తిరిగి బ్రతికించబడటం అనేది ఎట్టి పరిస్థితిలోనూ జరగని పని అని అవిశ్వాసులు తలపోస్తున్నారు. (ఓ ప్రవక్తా!) వారికి చెప్పు : “ఎందుకు జరగదు? నా ప్రభువు తోడు! మీరు తప్పకుండా మళ్ళి లేపబడతారు. మీరు చేసినదంతా మీకు తెలియపరచబడుతుంది. ఇలా చేయటం అల్లాహ్ కు చాలా తేలిక.” [ఖుర్ఆన్ సూరా తఘాబున్ 64:7]

 

3. ఒకచోట జమ అవడంపై విశ్వాసం

అల్లాహ్ మానవులందరినీ ఒకచోట జమచేసి లెక్క తీసుకుంటాడు. అల్లాహ్ ఇలా అన్నాడు: “మేము పర్వతాలను  నడిపిస్తాము, నువ్వు  ఆ రోజున  భూమిని చదును చేయబడి ఉన్నట్లుగా చూస్తావు.  జనులందరినీ మేము (ఒకచోట) సమీకరిస్తాము.   వారిలో  ఏ  ఒక్కరినీ వదలి పెట్టము.” [ఖుర్ఆన్ సూరా కహఫ్ 18:47]

 

4. అల్లాహ్ ముందు ప్రజలు తమ హోదా (కర్మల అంతస్తు) ప్రకారం తేబడుతారు అని విశ్వసించడం

అల్లాహ్ ఇలా అన్నాడు: వారంతా నీ  ప్రభువు సమక్షంలో వరుసగా నిలబెట్టబడతారు. "నిశ్చయంగా - మేము  మిమ్మల్ని మొదటిసారి పుట్టించినట్లుగానే  మీరు   మా  వద్దకు వచ్చేశారు. కాని మీరు మాత్రం, మేమెన్నటికీ  మీ  కోసం  వాగ్దాన  సమయం నిర్ధారించము అనే తలపోసేవారు." [ఖుర్ఆన్ సూరా కహఫ్ 18:48]

 

5. మానవుని అవయవాలు సాక్ష్యమిస్తాయి అని విశ్వసించడం

అల్లాహ్ ఇలా అన్నాడు: ఆ విధంగా వారు నరకాగ్నికి చాలా సమీపంలోకి రాగానే వారి చెవులు, వారి కళ్లు,  వారి  చర్మాలు  సయితం వారు చేస్తూ ఉండిన పనుల గురించి  సాక్ష్యమిస్తాయి. "మీరు మాకు వ్యతిరేకంగా ఎందుకు సాక్ష్యమిచ్చారు?"  అని  వారు తమ చర్మాలనుద్దేశించి  అడుగుతారు.  "అన్ని వస్తువులకూ మాట్లాడే శక్తిని ఇచ్చిన అల్లాహ్‌యే మాకూ మాట్లాడే  శక్తిని ప్రసాదించాడు.  ఆయనే  మిమ్మల్ని తొలిసారి పుట్టించాడు.   మరి   ఆయన వైపునకే  మీరంతా మరలించబడతారు"  అని సమాధానమిస్తాయి. "మీరు రహస్యంగా (చెడుపనులకు) పాల్పడుతున్నప్పుడు మీ చెవులు, మీ  కళ్లు,   మీ  చర్మాలు మీకు వ్యతిరేకంగా సాక్ష్యమిస్తాయన్న  ఆలోచన మీకు  ఉండేది కాదు.  పైగా మీరు  చేసే చాలా పనులు  అల్లాహ్‌కు కూడా తెలియవని  అనుకునేవారు." [ఖుర్ఆన్ సూరా ఫుస్సిలత్ 41:20-22]

 

6. ప్రతి ఒక్కరు ప్రశ్నించబడుతారు అని విశ్వసించడం

అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: "అయితే కాస్త  వాళ్ళను ఆపండి. వారికి (కొన్ని ముఖ్యమైన) ప్రశ్నలు వేయాల్సివుంది. "అవును, మీకేమైపోయిందీ? (ఇప్పుడు) మీరు ఒండొకరికి సహాయం చేసుకోవటం  లేదేమిటి?"  (అని వారు ప్రశ్నించబడ తారు). అది కాదు. ఈ రోజు (వారందరూ) ఆత్మసమర్పణ  చేసుకున్నారు. [ఖుర్ఆన్ సూరా సాఫ్ఫాత్ 37:24-26]

 

7. సిరాత్ (వంతెన)పై నుండి ప్రతి ఒక్కరు నడవాల్సి ఉంటుంది అని విశ్వసించడం

అల్లాహ్ ఇలా అన్నాడు: “మీలోని ప్రతి ఒక్కరూ అక్కడికి రావలసిందే. ఇది నీ ప్రభువు చేసిన తిరుగులేని నిర్ణయం. దాన్ని నిర్వర్తించే  బాధ్యత ఆయనపై ఉంది.” [ఖుర్ఆన్ సూరా మర్యం 19:71]

 

8. కర్మలు తూచబడుతాయి అని విశ్వసించడం

అల్లాహ్ మానవులను లెక్క తీసుకోవడానికి ఒకచోట సమీకరిస్తాడు. మంచి పనులు చేసినవారిని, వారు అల్లాహ్ ను విశ్వసించినందుకు మరియు దైవప్రవక్తలను అనుసరించినందుకు ఉత్తమ ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాడు. చెడు కర్మలు చేసిన వారిని అల్లాహ్ శిక్షిస్తాడు. అల్లాహ్ ఇలా అన్నాడు: “మేము  ప్రళయ  దినాన  న్యాయంగా  తూచే  త్రాసులనునెలకొల్పుతాము.  మరి  ఏ ప్రాణికీ  రవంత  అన్యాయం  కూడా జరగదు. ఒకవేళ ఆవగింజంత ఆచరణ ఉన్నా మేము  దానిని హాజరు పరుస్తాము. లెక్క తీసుకోవటానికి మేము చాలు.” [ఖుర్ఆన్ సూరా అంబియా 21:47]

   

9. పత్రాలుఅందజేయబడుతాయిఅనివిశ్వసించడం

అల్లాహ్ ఇలా అన్నాడు: “(ఆ సమయంలో) ఎవరి కర్మల పత్రం అతని కుడిచేతికి ఇవ్వబడుతుందో - 

అతని నుండి తేలికపాటి లెక్క తీసుకోబడుతుంది. అతను తనవారి వైపు సంబరపడుతూ వెళతాడు.

మరెవరి కర్మల పత్రం అతని వీపు వెనుక నుండి ఇవ్వబడుతుందో అతను చావు కోసం కేకలు వేస్తాడు.

మరి (అతను) మండే నరకాగ్నిలోకి ప్రవేశిస్తాడు.” [ఖుర్ఆన్ సూరా ఇన్షిఖాఖ్ 84:7-12]

 

10. ప్రజలుస్వర్గంలేదానరకంలోశాశ్వతమైనజీవితంగడపాలిఅనివిశ్వసించడం

అల్లాహ్ ఇలా అన్నాడు: “గ్రంథవహులలో తిరస్కారవైఖరికి పాల్పడినవారు, బహుదైవారాధకులు తప్పకుండా నరకాగ్నికి ఆహుతి అవుతారు. వారందులో కలకాలం ఉంటారు. వారు సృష్టితాలలో అందరికంటే చెడ్డవారు. అయితే విశ్వసించి, సత్కార్యాలు చేసినవారు; నిశ్చయంగా సృష్టిలో వారే అందరికన్నా ఉత్తములు. వారికి ప్రతిఫలంగా వారి ప్రభువు దగ్గర శాశ్వతమైన స్వర్గ వనాలున్నాయి. వాటి క్రింద కాలువలు ప్రవహిస్తూ ఉంటాయి. వాటిలో వారు కలకాలం ఉంటారు. అల్లాహ్ వారి పట్ల ప్రసన్నుడయ్యాడు. వారు అల్లాహ్ పట్ల సంతోషపడ్డారు. ఈ అనుగ్రహ భాగ్యం తన ప్రభువుకు భయపడే వానికి మాత్రమే.”  [ఖుర్ఆన్ సూరా బయ్యినహ్ 98:6-8]

 

అంతిమదినంపై విశ్వసించడం యొక్క విశిష్టతలు

  1. ఒక మనిషి ఆ రోజు గురించి అలోచించి -మంచి పనులు చేస్తాడు, ఇతరులతో మంచి పనుల్లో పోటీపడుతాడు, పాపాల నుండి దూరంగా ఉంటాడు మరియు అల్లాహ్ శిక్షకు భయపడుతాడు. 
     
  2. వారికి (విస్వాసులకు) ఈ ప్రపంచంలో దొరకనిది, పరలోకంలో అల్లాహ్ ప్రసాదిస్తాడని తెలుసు గనక, దీని ద్వారా వారి మనోబలం పెరుగుతుంది.
     
  3. ఇది విశ్వాసులను అవిశ్వాసుల నుండి వేరు పరుస్తుంది. [3]

 

ఇంకా చూడండి

AllahUnique aspect of hereafterParadiseHellSigns of the HourHarut and MarutLife after DeathPurpose of Lifeఅల్లాహ్; స్వర్గం; నరకం; ప్రళయం తరువాతి జీవితం; జీవిత ధ్యేయం;

 

ఆధారాలు

[1] http://www.ahya.org/amm/modules.php?name=Content&pa=showpage&pid=25 (ఇంగ్లీష్)

[2] http://en.islamway.net/article/8553 (ఇంగ్లీష్)

[3] http://www.ahya.org/amm/modules.php?name=Content&pa=showpage&pid=25 (ఇంగ్లీష్)

[4] http://www.1ststepsinislam.com/en/belief-in-angels.aspx (ఇంగ్లీష్)

 

467 Views
మమ్మల్ని సరిచేయండి లేదా మిమ్మల్ని సరిచేసుకోండి
.
వ్యాఖ్యలు
పేజీ యొక్క టాప్