Translation
| 9. సూరా అత్ తౌబా 9:1 بَرَاءَةٌ مِّنَ اللَّهِ وَرَسُولِهِ إِلَى الَّذِينَ عَاهَدتُّم مِّنَ الْمُشْرِكِينَ మీరు ఒప్పందాలు కుదుర్చుకున్న ముష్రిక్కులతో ఇక మీదట ఎలాంటి సంబంధాలుండబోవని అల్లాహ్ తరఫున, ఆయన ప్రవక్త తరఫున ప్రకటించబడుతోంది. 9:2 فَسِيحُوا فِي الْأَرْضِ أَرْبَعَةَ أَشْهُرٍ وَاعْلَمُوا أَنَّكُمْ غَيْرُ مُعْجِزِي اللَّهِ ۙ وَأَنَّ اللَّهَ مُخْزِي الْكَافِرِينَ కనుక (ఓ ముష్రిక్కులారా!) ఇక మీరు నాలుగు మాసాల వరకు రాజ్యంలో సంచరించండి. మీరు అల్లాహ్‌ను అశక్తుణ్ణి చెయ్యలేరన్న సంగతిని బాగా తెలుసుకోండి. అల్లాహ్ అవిశ్వాసులను పరాభవం పాల్జేస్తాడు(అన్న సంగతిని కూడా మరువకండి). 9:3 وَأَذَانٌ مِّنَ اللَّهِ وَرَسُولِهِ إِلَى النَّاسِ يَوْمَ الْحَجِّ الْأَكْبَرِ أَنَّ اللَّهَ بَرِيءٌ مِّنَ الْمُشْرِكِينَ ۙ وَرَسُولُهُ ۚ فَإِن تُبْتُمْ فَهُوَ خَيْرٌ لَّكُمْ ۖ وَإِن تَوَلَّيْتُمْ فَاعْلَمُوا أَنَّكُمْ غَيْرُ مُعْجِزِي اللَّهِ ۗ وَبَشِّرِ الَّذِينَ كَفَرُوا بِعَذَابٍ أَلِيمٍ అల్లాహ్ తరఫు నుంచీ, ఆయన ప్రవక్త తరఫు నుంచీ పెద్ద హజ్ దినాన ప్రజలకు తెలియజేయునది ఏమనగా, అల్లాహ్ ముష్రిక్కులకు ఏ విధంగానూ బాధ్యుడు కాడు - ఆయన ప్రవక్త కూడా. కాబట్టి ఇప్పటికయినా మీరు పశ్చాత్తాపం చెందితే అది మీకే శ్రేయస్కరం. ఒకవేళ మీరు విముఖులైతే, మీరు ఎట్టి పరిస్థితిలోనూ అల్లాహ్‌ను ఓడించలేరన్న సంగతిని తెలుసుకోండి. (ఓ ప్రవక్తా!) అవిశ్వాసులకు వ్యధాభరితమైన శిక్ష ఉంటుందన్న శుభవార్తను వినిపించు. 9:4 إِلَّا الَّذِينَ عَاهَدتُّم مِّنَ الْمُشْرِكِينَ ثُمَّ لَمْ يَنقُصُوكُمْ شَيْئًا وَلَمْ يُظَاهِرُوا عَلَيْكُمْ أَحَدًا فَأَتِمُّوا إِلَيْهِمْ عَهْدَهُمْ إِلَىٰ مُدَّتِهِمْ ۚ إِنَّ اللَّهَ يُحِبُّ الْمُتَّقِينَ అయితే మీరు ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత మీకు ఎలాంటి నష్టం చేకూర్చడంగానీ, మీకు వ్యతిరేకంగా ఎవరికైనా సహాయం చేయటంగానీ చేయకుండా ఉన్న ముష్రిక్కులకు మాత్రం (ఈ ప్రకటన నుంచి) మినహాయింపు ఉంది. మీరు కూడా వారితోపాటు వారి ఒప్పంద గడువును పూర్తిచేయండి. నిశ్చయంగా అల్లాహ్ భయభక్తులుగల వారిని ప్రేమిస్తాడు. 9:5 فَإِذَا انسَلَخَ الْأَشْهُرُ الْحُرُمُ فَاقْتُلُوا الْمُشْرِكِينَ حَيْثُ وَجَدتُّمُوهُمْ وَخُذُوهُمْ وَاحْصُرُوهُمْ وَاقْعُدُوا لَهُمْ كُلَّ مَرْصَدٍ ۚ فَإِن تَابُوا وَأَقَامُوا الصَّلَاةَ وَآتَوُا الزَّكَاةَ فَخَلُّوا سَبِيلَهُمْ ۚ إِنَّ اللَّهَ غَفُورٌ رَّحِيمٌ మరి నిషిద్ధ (గౌరవప్రదమైన) మాసాలు గడచిపోగానే ముష్రిక్కులను ఎక్కడ కనబడితే అక్కడే చంపండి, వారిని నిర్బంధించండి, వారిని ముట్టడించండి. ప్రతి మాటు వద్ద వారికొరకు పొంచి కూర్చోండి. ఒకవేళ వారు పశ్చాత్తాపం చెంది, నమాజును నెలకొల్పితే, జకాతును విధిగా చెల్లిస్తే వారి మార్గాన వారిని వదలిపెట్టండి. నిశ్చయంగా అల్లాహ్ క్షమించేవాడు, కనికరించేవాడు. 9:6 وَإِنْ أَحَدٌ مِّنَ الْمُشْرِكِينَ اسْتَجَارَكَ فَأَجِرْهُ حَتَّىٰ يَسْمَعَ كَلَامَ اللَّهِ ثُمَّ أَبْلِغْهُ مَأْمَنَهُ ۚ ذَٰلِكَ بِأَنَّهُمْ قَوْمٌ لَّا يَعْلَمُونَ ఒకవేళ ముష్రిక్కులలోని ఏ వ్యక్తి అయినా నీ శరణు కోరితే, అతను దైవవాణి వినేంతవరకు అతనికి నువ్వు ఆశ్రయమివ్వు. ఆ తరువాత అతన్ని అతని సురక్షిత స్థానానికి చేర్చు. వారు తెలియని వారవటంచేత వారి పట్ల ఈ విధంగా వ్యవహరించాలి. 9:7 كَيْفَ يَكُونُ لِلْمُشْرِكِينَ عَهْدٌ عِندَ اللَّهِ وَعِندَ رَسُولِهِ إِلَّا الَّذِينَ عَاهَدتُّمْ عِندَ الْمَسْجِدِ الْحَرَامِ ۖ فَمَا اسْتَقَامُوا لَكُمْ فَاسْتَقِيمُوا لَهُمْ ۚ إِنَّ اللَّهَ يُحِبُّ الْمُتَّقِينَ అల్లాహ్ వద్ద, ఆయన ప్రవక్త వద్ద ముష్రిక్కులకు ఒప్పందం ఎలా సాధ్యం? అయితే మీరు మస్జిదె హరామ్ దగ్గర ఎవరితో ఒప్పందం చేసుకున్నారో వారు మీ ఒప్పందానికి కట్టుబడి ఉన్నంతవరకూ మీరు కూడా వారి ఒప్పందాన్ని గౌరవించండి. నిశ్చయంగా అల్లాహ్ భయభక్తులు గల వారిని ప్రేమిస్తాడు. 9:8 كَيْفَ وَإِن يَظْهَرُوا عَلَيْكُمْ لَا يَرْقُبُوا فِيكُمْ إِلًّا وَلَا ذِمَّةً ۚ يُرْضُونَكُم بِأَفْوَاهِهِمْ وَتَأْبَىٰ قُلُوبُهُمْ وَأَكْثَرُهُمْ فَاسِقُونَ వారి వాగ్దానాలు ఏ మేరకు నమ్మశక్యం? మీపై వారికి ఏకాస్త ఆధిక్యత లభించినా వారు మీ విషయంలో ఏ బంధుత్వాన్నీ, ఏ ఒడంబడికనూ ఖాతరుచేయరు. వారు తమ నోటి మాటలతో మిమ్మల్ని సముదాయించే ప్రయత్నం చేస్తున్నారు. కాని వారి హృదయాలు మాత్రం ఎంతకీ అంగీకరించటం లేదు. వారిలో అత్యధికులు అవిధేయులు. 9:9 اشْتَرَوْا بِآيَاتِ اللَّهِ ثَمَنًا قَلِيلًا فَصَدُّوا عَن سَبِيلِهِ ۚ إِنَّهُمْ سَاءَ مَا كَانُوا يَعْمَلُونَ వారు అల్లాహ్ వాక్కులను అతి స్వల్పమైన ధరకు అమ్మేశారు. ఆయన మార్గం నుంచి ప్రజలను ఆపారు. వారి చేష్టలు బహుచెడ్డవి. 9:10 لَا يَرْقُبُونَ فِي مُؤْمِنٍ إِلًّا وَلَا ذِمَّةً ۚ وَأُولَٰئِكَ هُمُ الْمُعْتَدُونَ ఏ ముస్లిం విషయంలోనూ వారు బంధుత్వ సంబంధాలను, ఒప్పంద మర్యాదలనూ ఏమాత్రం ఖాతరు చేయరు. హద్దులు మీరేవారు వీరే. 9:11 فَإِن تَابُوا وَأَقَامُوا الصَّلَاةَ وَآتَوُا الزَّكَاةَ فَإِخْوَانُكُمْ فِي الدِّينِ ۗ وَنُفَصِّلُ الْآيَاتِ لِقَوْمٍ يَعْلَمُونَ ఇప్పటికయినా వారు పశ్చాత్తాపం చెంది, నమాజ్‌ను నెలకొల్పుతూ, జకాత్‌ను విధిగా చెల్లించటం మొదలెడితే వారు మీ ధార్మిక సోదరులే. తెలిసినవారి కోసం మేము మా ఆయతులను ఈ విధంగా విడమరచి చెబుతున్నాము. 9:12 وَإِن نَّكَثُوا أَيْمَانَهُم مِّن بَعْدِ عَهْدِهِمْ وَطَعَنُوا فِي دِينِكُمْ فَقَاتِلُوا أَئِمَّةَ الْكُفْرِ ۙ إِنَّهُمْ لَا أَيْمَانَ لَهُمْ لَعَلَّهُمْ يَنتَهُونَ ఒకవేళ ఒప్పందం చేసుకున్న తరువాత కూడా వీళ్లు తమ ప్రమాణాలను భంగపరచి, మీ ధర్మాన్ని ఎగతాళి చేస్తే మీరు కూడా ఆ అవిశ్వాస నాయకులతో తలపడండి. ఇంక వారి ప్రమాణాలకు ఏపాటి విలువాలేదు. బహుశా (తగిన శాస్తి జరిగిన తరువాతనే) వారు (తమ దుశ్చేష్టలను) మానుకుంటారేమో. 9:13 أَلَا تُقَاتِلُونَ قَوْمًا نَّكَثُوا أَيْمَانَهُمْ وَهَمُّوا بِإِخْرَاجِ الرَّسُولِ وَهُم بَدَءُوكُمْ أَوَّلَ مَرَّةٍ ۚ أَتَخْشَوْنَهُمْ ۚ فَاللَّهُ أَحَقُّ أَن تَخْشَوْهُ إِن كُنتُم مُّؤْمِنِينَ తమ ప్రమాణాలను భంగం చేసిన వారితో, ప్రవక్తను దేశం నుంచి బహిష్కరించే పథకం వేసిన వారితో మీరు ఎందుకు యుద్ధం చేయరు?(చూడబోతే) తొలిసారి మీపై కవ్వింపు చర్యలకు ఒడిగట్టినది కూడా వారేకదా! ఏమిటీ, మీరు వారికి భయపడుతున్నారా? మీరే గనక విశ్వాసులైతే మీరు భయపడటానికి అల్లాహ్‌యే ఎక్కువ అర్హుడు. 9:14 قَاتِلُوهُمْ يُعَذِّبْهُمُ اللَّهُ بِأَيْدِيكُمْ وَيُخْزِهِمْ وَيَنصُرْكُمْ عَلَيْهِمْ وَيَشْفِ صُدُورَ قَوْمٍ مُّؤْمِنِينَ వారితో యుద్ధం చేయండి. అల్లాహ్ మీ చేతుల మీదుగా వారిని దండిస్తాడు. వారిని అవమానపరుస్తాడు. వారికి వ్యతిరేకంగా మీకు సాయం చేసి, విశ్వాసుల గుండెలను చల్లబరుస్తాడు. 9:15 وَيُذْهِبْ غَيْظَ قُلُوبِهِمْ ۗ وَيَتُوبُ اللَّهُ عَلَىٰ مَن يَشَاءُ ۗ وَاللَّهُ عَلِيمٌ حَكِيمٌ వారి హృదయాలలోని దుఃఖాన్ని, కోపాన్ని దూరం చేస్తాడు. ఆయన, తాను కోరినవారి వైపుకు కారుణ్యంతో మరలుతాడు. అల్లాహ్ ప్రతిదీ తెలిసినవాడు, వివేకవంతుడు. 9:16 أَمْ حَسِبْتُمْ أَن تُتْرَكُوا وَلَمَّا يَعْلَمِ اللَّهُ الَّذِينَ جَاهَدُوا مِنكُمْ وَلَمْ يَتَّخِذُوا مِن دُونِ اللَّهِ وَلَا رَسُولِهِ وَلَا الْمُؤْمِنِينَ وَلِيجَةً ۚ وَاللَّهُ خَبِيرٌ بِمَا تَعْمَلُونَ ఏమిటీ, మీరు ఇట్టే వదలివేయబడతారని భావిస్తున్నారా? వాస్తవానికి మీలో యోధులు ఎవరో, అల్లాహ్‌ను, ఆయన ప్రవక్తను, విశ్వాసులను తప్ప వేరొకరెవరినీ ఆప్తమిత్రులుగా చేసుకోనివారు ఎవరో అల్లాహ్ ఇంతవరకు (వేరుపరచి) చూడనే లేదు. మీరు చేసేదంతా అల్లాహ్‌కు తెలుసు. 9:17 مَا كَانَ لِلْمُشْرِكِينَ أَن يَعْمُرُوا مَسَاجِدَ اللَّهِ شَاهِدِينَ عَلَىٰ أَنفُسِهِم بِالْكُفْرِ ۚ أُولَٰئِكَ حَبِطَتْ أَعْمَالُهُمْ وَفِي النَّارِ هُمْ خَالِدُونَ ముష్రిక్కులు తాము స్వయంగా తమ అవిశ్వాసాన్ని గురించి సాక్ష్యమిస్తున్నప్పుడు వారు అల్లాహ్ మస్జిదుల నిర్వహణకు ఎంతమాత్రం తగరు. వారి కర్మలన్నీ వృథా అయిపోయాయి. శాశ్వతంగా వారు నరకాగ్నిలో ఉంటారు. 9:18 إِنَّمَا يَعْمُرُ مَسَاجِدَ اللَّهِ مَنْ آمَنَ بِاللَّهِ وَالْيَوْمِ الْآخِرِ وَأَقَامَ الصَّلَاةَ وَآتَى الزَّكَاةَ وَلَمْ يَخْشَ إِلَّا اللَّهَ ۖ فَعَسَىٰ أُولَٰئِكَ أَن يَكُونُوا مِنَ الْمُهْتَدِينَ అల్లాహ్‌ను, అంతిమ దినాన్నీ విశ్వసిస్తూ, నమాజులను నెలకొల్పుతూ, జకాత్‌ను విధిగా చెల్లిస్తూ, అల్లాహ్‌కు తప్ప వేరొకరికి భయపడనివారు మాత్రమే అల్లాహ్ మస్జిదుల నిర్వహణకు తగినవారు. సన్మార్గ భాగ్యం పొందినవారు వీరేనని ఆశించవచ్చు. 9:19 أَجَعَلْتُمْ سِقَايَةَ الْحَاجِّ وَعِمَارَةَ الْمَسْجِدِ الْحَرَامِ كَمَنْ آمَنَ بِاللَّهِ وَالْيَوْمِ الْآخِرِ وَجَاهَدَ فِي سَبِيلِ اللَّهِ ۚ لَا يَسْتَوُونَ عِندَ اللَّهِ ۗ وَاللَّهُ لَا يَهْدِي الْقَوْمَ الظَّالِمِينَ ఏమిటీ, మీరు హజ్ యాత్రీకులకు మంచినీళ్లు సరఫరా చేయటాన్ని, మస్జిదె హరామ్‌కు సేవలు చేయటాన్ని; అల్లాహ్‌ను అంతిమ దినాన్ని విశ్వసించి అల్లాహ్ మార్గంలో యుద్ధం చేసే వారితో సమానంగా పరిగణించారా? వారు అల్లాహ్ దృష్టిలో సమానులు కాజాలరు. అల్లాహ్ దుర్మార్గులకు సన్మార్గం చూపడు. 9:20 الَّذِينَ آمَنُوا وَهَاجَرُوا وَجَاهَدُوا فِي سَبِيلِ اللَّهِ بِأَمْوَالِهِمْ وَأَنفُسِهِمْ أَعْظَمُ دَرَجَةً عِندَ اللَّهِ ۚ وَأُولَٰئِكَ هُمُ الْفَائِزُونَ విశ్వసించి, వలసపోయి (హిజ్రత్ చేసి), దైవమార్గంలో తమ ధన ప్రాణాలను ఒడ్డి పోరాడినవారు మాత్రమే అల్లాహ్ సన్నిధిలో ఉన్నత శ్రేణికి చెందినవారు. సాఫల్యం పొందేవారు కూడా వీరే. 9:21 يُبَشِّرُهُمْ رَبُّهُم بِرَحْمَةٍ مِّنْهُ وَرِضْوَانٍ وَجَنَّاتٍ لَّهُمْ فِيهَا نَعِيمٌ مُّقِيمٌ వారి ప్రభువు వారికి తన కారుణ్యాన్ని, ప్రసన్నతను, (స్వర్గ) వనాలను అనుగ్రహిస్తానని శుభవార్త ఇస్తున్నాడు. అక్కడ వారి కోసం శాశ్వతమైన అనుగ్రహాలున్నాయి. 9:22 خَالِدِينَ فِيهَا أَبَدًا ۚ إِنَّ اللَّهَ عِندَهُ أَجْرٌ عَظِيمٌ వాటిలో వారు కలకాలం ఉంటారు. నిశ్చయంగా అల్లాహ్ వద్ద గొప్ప ప్రతిఫలం ఉంది. 9:23 يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا لَا تَتَّخِذُوا آبَاءَكُمْ وَإِخْوَانَكُمْ أَوْلِيَاءَ إِنِ اسْتَحَبُّوا الْكُفْرَ عَلَى الْإِيمَانِ ۚ وَمَن يَتَوَلَّهُم مِّنكُمْ فَأُولَٰئِكَ هُمُ الظَّالِمُونَ ఓ విశ్వాసులారా! మీ తండ్రులు, మీ సోదరులు విశ్వాసం కన్నా అవిశ్వాసాన్ని ఎక్కువగా ఇష్టపడుతున్నట్లయితే వారిని మీ స్నేహితులుగా చేసుకోకండి. మీలో ఎవరు వారిని అభిమానిస్తారో వారు దుర్మార్గులవుతారు. 9:24 قُلْ إِن كَانَ آبَاؤُكُمْ وَأَبْنَاؤُكُمْ وَإِخْوَانُكُمْ وَأَزْوَاجُكُمْ وَعَشِيرَتُكُمْ وَأَمْوَالٌ اقْتَرَفْتُمُوهَا وَتِجَارَةٌ تَخْشَوْنَ كَسَادَهَا وَمَسَاكِنُ تَرْضَوْنَهَا أَحَبَّ إِلَيْكُم مِّنَ اللَّهِ وَرَسُولِهِ وَجِهَادٍ فِي سَبِيلِهِ فَتَرَبَّصُوا حَتَّىٰ يَأْتِيَ اللَّهُ بِأَمْرِهِ ۗ وَاللَّهُ لَا يَهْدِي الْقَوْمَ الْفَاسِقِينَ (ఓ ప్రవక్తా!) వారికి చెప్పు: “ఒకవేళ మీ తండ్రులు, మీ కుమారులు, మీ సోదరులు, మీ భార్యలు, మీ సమీప బంధువులు, మీరు సంపాదించిన సిరిసంపదలు, కుంటుపడుతుందేమోనని మీరు భయపడే మీ వర్తకం, మీకెంతో ప్రియమైన మీ గృహాలు మీకు అల్లాహ్ కన్నా, ఆయన ప్రవక్త కన్నా, ఆయన మార్గంలో సలిపే పోరాటం కన్నా ఎక్కువ ప్రియమైనవైతే అల్లాహ్ తీసుకువచ్చే తీర్పు (శిక్ష) కొరకు ఎదురుచూడండి. అల్లాహ్ అవిధేయులకు సన్మార్గం చూపడు. 9:25 لَقَدْ نَصَرَكُمُ اللَّهُ فِي مَوَاطِنَ كَثِيرَةٍ ۙ وَيَوْمَ حُنَيْنٍ ۙ إِذْ أَعْجَبَتْكُمْ كَثْرَتُكُمْ فَلَمْ تُغْنِ عَنكُمْ شَيْئًا وَضَاقَتْ عَلَيْكُمُ الْأَرْضُ بِمَا رَحُبَتْ ثُمَّ وَلَّيْتُم مُّدْبِرِينَ లోగడ చాలా సందర్భాలలో అల్లాహ్ మీకు సహాయం చేసి ఉన్నాడు. హునైన్ యుద్ధం జరిగిన రోజున కూడా (మిమ్మల్ని ఆదుకున్నాడు). ఆ సందర్భంగా మీరు మీ అధిక సంఖ్య పై గర్వపడ్డారు. కాని ఆ సంఖ్యాబలం మీకే విధంగానూ ప్రయోజనం కలిగించలేదు. భూమి విశాలంగా ఉండి కూడా మీకోసం ఇరుకైపోయింది. అప్పుడు మీరు వెన్నుచూపి మరలిపోయారు. 9:26 ثُمَّ أَنزَلَ اللَّهُ سَكِينَتَهُ عَلَىٰ رَسُولِهِ وَعَلَى الْمُؤْمِنِينَ وَأَنزَلَ جُنُودًا لَّمْ تَرَوْهَا وَعَذَّبَ الَّذِينَ كَفَرُوا ۚ وَذَٰلِكَ جَزَاءُ الْكَافِرِينَ ఆ తరువాత అల్లాహ్ తన ప్రవక్తపై, విశ్వాసులపై తన తరఫు నుంచి స్థిమితాన్ని అవతరింపజేశాడు. మీకు కానరాని సేనలను పంపించాడు. సత్య తిరస్కారులను శిక్షించాడు. సత్యాన్ని తిరస్కరించేవారికి లభించవలసిన ప్రతిఫలం ఇదే. 9:27 ثُمَّ يَتُوبُ اللَّهُ مِن بَعْدِ ذَٰلِكَ عَلَىٰ مَن يَشَاءُ ۗ وَاللَّهُ غَفُورٌ رَّحِيمٌ ఆ తరువాత కూడా అల్లాహ్ తాను కోరినవారిని మన్నించి, వారిపై దయ చూపుతాడు. అల్లాహ్ క్షమాగుణం కలవాడు, దయామయుడు. 9:28 يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا إِنَّمَا الْمُشْرِكُونَ نَجَسٌ فَلَا يَقْرَبُوا الْمَسْجِدَ الْحَرَامَ بَعْدَ عَامِهِمْ هَٰذَا ۚ وَإِنْ خِفْتُمْ عَيْلَةً فَسَوْفَ يُغْنِيكُمُ اللَّهُ مِن فَضْلِهِ إِن شَاءَ ۚ إِنَّ اللَّهَ عَلِيمٌ حَكِيمٌ ఓ విశ్వాసులారా! ముష్రిక్కులు అశుద్ధులు. కాబట్టి ఈ ఏడాది తరువాత వారు మస్జిదె హరామ్ దరిదాపులకు కూడా రాకూడదు. ఒకవేళ మీకు దారిద్య్ర భయం ఉంటే అల్లాహ్ గనక తలిస్తే తన కృపతో మిమ్మల్ని సంపన్నులుగా చేస్తాడు. అల్లాహ్ అన్నీ తెలిసినవాడు, వివేకవంతుడు. 9:29 قَاتِلُوا الَّذِينَ لَا يُؤْمِنُونَ بِاللَّهِ وَلَا بِالْيَوْمِ الْآخِرِ وَلَا يُحَرِّمُونَ مَا حَرَّمَ اللَّهُ وَرَسُولُهُ وَلَا يَدِينُونَ دِينَ الْحَقِّ مِنَ الَّذِينَ أُوتُوا الْكِتَابَ حَتَّىٰ يُعْطُوا الْجِزْيَةَ عَن يَدٍ وَهُمْ صَاغِرُونَ అల్లాహ్‌నూ, అంతిమదినాన్నీ విశ్వసించని, అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త నిషేధించిన వస్తువులను నిషిద్ధంగా భావించని, సత్యధర్మాన్ని అవలంబించని గ్రంథవహులతో - వారు పరాభవం పాలై తమ స్వహస్తాలతో జిజ్‌యా చెల్లించనంత వరకూ యుద్ధం చేయండి. 9:30 وَقَالَتِ الْيَهُودُ عُزَيْرٌ ابْنُ اللَّهِ وَقَالَتِ النَّصَارَى الْمَسِيحُ ابْنُ اللَّهِ ۖ ذَٰلِكَ قَوْلُهُم بِأَفْوَاهِهِمْ ۖ يُضَاهِئُونَ قَوْلَ الَّذِينَ كَفَرُوا مِن قَبْلُ ۚ قَاتَلَهُمُ اللَّهُ ۚ أَنَّىٰ يُؤْفَكُونَ “ఉజైర్ అల్లాహ్ కుమారుడు” అని యూదులంటున్నారు. “మసీహ్ (ఏసు క్రీస్తు) అల్లాహ్ కుమారుడు” అని నసారా (క్రైస్తవులు) అంటున్నారు. ఇవి వారి నోటి మాటలు మాత్రమే. తమ పూర్వీకుల్లోని అవిశ్వాసులు చెప్పిన మాటలనే వీళ్ళూ అనుకరిస్తున్నారు. అల్లాహ్ వారిని నాశనం చేయుగాక! (సత్యం నుండి) వారెలా తిరిగిపోతున్నారు!? 9:31 اتَّخَذُوا أَحْبَارَهُمْ وَرُهْبَانَهُمْ أَرْبَابًا مِّن دُونِ اللَّهِ وَالْمَسِيحَ ابْنَ مَرْيَمَ وَمَا أُمِرُوا إِلَّا لِيَعْبُدُوا إِلَٰهًا وَاحِدًا ۖ لَّا إِلَٰهَ إِلَّا هُوَ ۚ سُبْحَانَهُ عَمَّا يُشْرِكُونَ వారు అల్లాహ్‌ను వదలి తమ పండితుల (అహ్‌బార్)ను, సన్యాసుల (రుహ్‌బాన్)ను తమ ప్రభువులుగా చేసుకున్నారు- మర్యమ్ కుమారుడైన మసీహ్‌ను కూడా. నిజానికి వారికి, ఒక్కడైన అల్లాహ్‌ను మాత్రమే ఆరాధించవలసిందిగా ఆజ్ఞాపించబడింది. ఆయన తప్ప మరో ఆరాధ్యదైవం లేడు. వారు నిర్థారించుకుంటున్న భాగస్వామ్యాలకు ఆయన అతీతుడు, పవిత్రుడు. 9:32 يُرِيدُونَ أَن يُطْفِئُوا نُورَ اللَّهِ بِأَفْوَاهِهِمْ وَيَأْبَى اللَّهُ إِلَّا أَن يُتِمَّ نُورَهُ وَلَوْ كَرِهَ الْكَافِرُونَ వారు అల్లాహ్ జ్యోతిని తమ నోటితో (ఊది) ఆర్పివేయాలని కోరుతున్నారు. అయితే అల్లాహ్ - అవిశ్వాసులకు ఎంతగా సహించరానిదైనా సరే - తన జ్యోతిని పరిపూర్ణం చేయకుండా వదలిపెట్టటానికి అంగీకరించడు. 9:33 هُوَ الَّذِي أَرْسَلَ رَسُولَهُ بِالْهُدَىٰ وَدِينِ الْحَقِّ لِيُظْهِرَهُ عَلَى الدِّينِ كُلِّهِ وَلَوْ كَرِهَ الْمُشْرِكُونَ ఆయనే తన ప్రవక్తకు మార్గదర్శకత్వాన్నీ, సత్యధర్మాన్నీ ఇచ్చి పంపాడు - ముష్రిక్కులకు ఎంత సహించరానిదయినా సరే, ఇతర ధర్మాలపై దానికి ఆధిక్యతను వొసగటానికి! 9:34 يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا إِنَّ كَثِيرًا مِّنَ الْأَحْبَارِ وَالرُّهْبَانِ لَيَأْكُلُونَ أَمْوَالَ النَّاسِ بِالْبَاطِلِ وَيَصُدُّونَ عَن سَبِيلِ اللَّهِ ۗ وَالَّذِينَ يَكْنِزُونَ الذَّهَبَ وَالْفِضَّةَ وَلَا يُنفِقُونَهَا فِي سَبِيلِ اللَّهِ فَبَشِّرْهُم بِعَذَابٍ أَلِيمٍ ఓ విశ్వసించిన వారలారా! పండితుల (అహ్‌బార్)లలో, సన్యాసుల (రుహ్‌బాన్)లలో చాలా మంది అక్రమంగా ప్రజల సొమ్ములను స్వాహా చేస్తున్నారు. వారిని అల్లాహ్ మార్గం నుంచి ఆపుతున్నారు. ఎవరు వెండీ, బంగారాలను పోగుచేస్తూ వాటిని దైవమార్గంలో ఖర్చు పెట్టడంలేదో వారికి బాధాకరమైన శిక్ష ఉందన్న శుభవార్తను వినిపించు. 9:35 يَوْمَ يُحْمَىٰ عَلَيْهَا فِي نَارِ جَهَنَّمَ فَتُكْوَىٰ بِهَا جِبَاهُهُمْ وَجُنُوبُهُمْ وَظُهُورُهُمْ ۖ هَٰذَا مَا كَنَزْتُمْ لِأَنفُسِكُمْ فَذُوقُوا مَا كُنتُمْ تَكْنِزُونَ ఏ రోజున ఈ ఖజానాను నరకాగ్నిలో కాల్చి దాంతో వారి నొసటిపై, పార్శ్వాలపై, వీపులపై వాతలు వేయడం జరుగుతుందో అప్పుడు, “ఇదీ మీరు మీ కోసం సమీకరించినది. కాబట్టి ఇప్పుడు మీ ఖజానా రుచి చూడండి” (అని వారితో అనబడుతుంది). 9:36 إِنَّ عِدَّةَ الشُّهُورِ عِندَ اللَّهِ اثْنَا عَشَرَ شَهْرًا فِي كِتَابِ اللَّهِ يَوْمَ خَلَقَ السَّمَاوَاتِ وَالْأَرْضَ مِنْهَا أَرْبَعَةٌ حُرُمٌ ۚ ذَٰلِكَ الدِّينُ الْقَيِّمُ ۚ فَلَا تَظْلِمُوا فِيهِنَّ أَنفُسَكُمْ ۚ وَقَاتِلُوا الْمُشْرِكِينَ كَافَّةً كَمَا يُقَاتِلُونَكُمْ كَافَّةً ۚ وَاعْلَمُوا أَنَّ اللَّهَ مَعَ الْمُتَّقِينَ నిశ్చయంగా నెలల సంఖ్య అల్లాహ్ దగ్గర - అల్లాహ్ గ్రంథంలో పన్నెండు మాత్రమే. ఆయన ఆకాశాలను, భూమిని సృష్టించిన రోజునుంచీ (ఈ లెక్క ఇలాగే సాగుతున్నది). వాటిలో నాలుగు మాసాలు నిషిద్ధమైనవి (గౌరవప్రదమైనవి.) ఇదే సరైన ధర్మం. కాబట్టి ఈ మాసాలలో మీకు మీరు అన్యాయం చేసుకోకండి. ముష్రిక్కులు మీ అందరితో పోరాడుతున్నట్లే మీరు కూడా వారందరితో పోరాడండి. అల్లాహ్ భయభక్తులుగల వారికి తోడుగా ఉంటాడన్న సంగతిని తెలుసుకోండి. 9:37 إِنَّمَا النَّسِيءُ زِيَادَةٌ فِي الْكُفْرِ ۖ يُضَلُّ بِهِ الَّذِينَ كَفَرُوا يُحِلُّونَهُ عَامًا وَيُحَرِّمُونَهُ عَامًا لِّيُوَاطِئُوا عِدَّةَ مَا حَرَّمَ اللَّهُ فَيُحِلُّوا مَا حَرَّمَ اللَّهُ ۚ زُيِّنَ لَهُمْ سُوءُ أَعْمَالِهِمْ ۗ وَاللَّهُ لَا يَهْدِي الْقَوْمَ الْكَافِرِينَ నెలలను ముందుకు, వెనక్కి మార్చటం ఓ అదనపు అవిశ్వాస చేష్ట. ఈ చేష్ట ద్వారా అవిశ్వాసులు మార్గభ్రష్టతలో పడవేయబడుతున్నారు. ఒక ఏడాది వారు దాన్ని ధర్మసమ్మతం చేసుకుని, మరో ఏడాది దాన్నే నిషిద్ధంగా ఖరారు చేసుకుంటారు. అల్లాహ్ నిషిద్ధ పరచిన మాసాల గణనలో సారూప్యం సాధించడానికి, అల్లాహ్ నిషేధించిన దానిని ధర్మసమ్మతం చేసుకోవటానికి (వారు ఇలా చేస్తారు). వారి దుష్టచేష్టలు వారికి అందమైనవిగా చూపబడ్డాయి. అవిశ్వాస జనులకు అల్లాహ్ సన్మార్గం చూపడు. 9:38 يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا مَا لَكُمْ إِذَا قِيلَ لَكُمُ انفِرُوا فِي سَبِيلِ اللَّهِ اثَّاقَلْتُمْ إِلَى الْأَرْضِ ۚ أَرَضِيتُم بِالْحَيَاةِ الدُّنْيَا مِنَ الْآخِرَةِ ۚ فَمَا مَتَاعُ الْحَيَاةِ الدُّنْيَا فِي الْآخِرَةِ إِلَّا قَلِيلٌ ఓ విశ్వాసులారా! “అల్లాహ్ మార్గంలో బయలుదేరండి” అని మీతో అనబడినప్పుడు మీరు నేలకు అతుక్కుపోతారేమిటి? అసలు మీకేమైపోయిందీ? మీరు పరలోకానికి బదులు ఇహలోక జీవితాన్నే కోరుకున్నారా? అయితే వినండి! ప్రాపంచిక జీవితపు సకల సామగ్రి పరలోకం ముందు అత్యల్పమైనది. 9:39 إِلَّا تَنفِرُوا يُعَذِّبْكُمْ عَذَابًا أَلِيمًا وَيَسْتَبْدِلْ قَوْمًا غَيْرَكُمْ وَلَا تَضُرُّوهُ شَيْئًا ۗ وَاللَّهُ عَلَىٰ كُلِّ شَيْءٍ قَدِيرٌ మీరు గనక (దైవమార్గంలో) బయలు దేరకపోతే అల్లాహ్ మీకు బాధాకరమైన శిక్ష విధిస్తాడు. మీకు బదులుగా మరో జాతిని (మీ స్థానంలో) తీసుకువస్తాడు. మీరు అల్లాహ్‌కు ఎంత మాత్రం నష్టం కలిగించలేరు. అల్లాహ్ అన్నింటిపై అధికారం కలవాడు. 9:40 إِلَّا تَنصُرُوهُ فَقَدْ نَصَرَهُ اللَّهُ إِذْ أَخْرَجَهُ الَّذِينَ كَفَرُوا ثَانِيَ اثْنَيْنِ إِذْ هُمَا فِي الْغَارِ إِذْ يَقُولُ لِصَاحِبِهِ لَا تَحْزَنْ إِنَّ اللَّهَ مَعَنَا ۖ فَأَنزَلَ اللَّهُ سَكِينَتَهُ عَلَيْهِ وَأَيَّدَهُ بِجُنُودٍ لَّمْ تَرَوْهَا وَجَعَلَ كَلِمَةَ الَّذِينَ كَفَرُوا السُّفْلَىٰ ۗ وَكَلِمَةُ اللَّهِ هِيَ الْعُلْيَا ۗ وَاللَّهُ عَزِيزٌ حَكِيمٌ మీరు గనక అతనికి (ప్రవక్తకు) తోడ్పడకపోతే (పోనివ్వండి), అవిశ్వాసులు దేశం నుంచి అతనిని వెళ్ళగొట్టినప్పుడు- అతను ఇద్దరిలో రెండవవాడు. వారిద్దరూ గుహలో ఉన్నప్పుడు, అతను తన సహచరునితో, “బాధపడకు. నిశ్చయంగా అల్లాహ్ మనకు తోడుగా ఉన్నాడు” అని ఓదార్చినప్పుడు అల్లాహ్‌యే వారికి తోడ్పడ్డాడు. (ఆ ఘడియలో) అల్లాహ్ తన తరఫునుంచి అతనిపై ప్రశాంతతను అవతరింపజేశాడు. మీకు కానరాని సైన్యాలతో అతన్ని ఆదుకున్నాడు. ఆయన అవిశ్వాసుల మాటను అట్టడుగు స్థితికి దిగజార్చాడు. అల్లాహ్ వాక్కు మాత్రమే సర్వోన్నతమైనది, సదా పైన ఉండేది. అల్లాహ్ సర్వాధిక్యుడు, వివేకవంతుడు. 9:41 انفِرُوا خِفَافًا وَثِقَالًا وَجَاهِدُوا بِأَمْوَالِكُمْ وَأَنفُسِكُمْ فِي سَبِيلِ اللَّهِ ۚ ذَٰلِكُمْ خَيْرٌ لَّكُمْ إِن كُنتُمْ تَعْلَمُونَ తేలిక అనిపించినాసరే, బరువు అనిపించినాసరే - బయలుదేరండి. దైవ మార్గంలో మీ ధన ప్రాణాలొడ్డి పోరాడండి. మీరు గనక తెలుసుకోగలిగితే ఇదే మీ కొరకు మేలైనది. 9:42 لَوْ كَانَ عَرَضًا قَرِيبًا وَسَفَرًا قَاصِدًا لَّاتَّبَعُوكَ وَلَٰكِن بَعُدَتْ عَلَيْهِمُ الشُّقَّةُ ۚ وَسَيَحْلِفُونَ بِاللَّهِ لَوِ اسْتَطَعْنَا لَخَرَجْنَا مَعَكُمْ يُهْلِكُونَ أَنفُسَهُمْ وَاللَّهُ يَعْلَمُ إِنَّهُمْ لَكَاذِبُونَ (ఓ ప్రవక్తా!) త్వరగా సొమ్ములు లభించి, ప్రయాణం సులభతరమై ఉంటే వాళ్లు తప్పక నీ వెనుక వచ్చి ఉండేవారే. కాని సుదీర్ఘ ప్రయాణం అనేసరికి అది వారికి దుర్భరంగా తోచింది. ఇప్పుడు వాళ్లు, “మాలోనే గనక శక్తీ స్థోమతలు ఉండి ఉంటే తప్పకుండా మీ వెంట వచ్చి ఉండేవారం” అని అల్లాహ్‌పై ఒట్టేసి మరీ చెబుతారు. వాస్తవానికి వారు తమను తాము నాశనం చేసుకుంటున్నారు. వారు అబద్ధాలకోరులన్న సంగతి అల్లాహ్‌కు బాగా తెలుసు. 9:43 عَفَا اللَّهُ عَنكَ لِمَ أَذِنتَ لَهُمْ حَتَّىٰ يَتَبَيَّنَ لَكَ الَّذِينَ صَدَقُوا وَتَعْلَمَ الْكَاذِبِينَ అల్లాహ్ నిన్ను మన్నించుగాక! నీ సమక్షంలో సత్యవంతులెవరో తేలి, అబద్ధం చెప్పేవారెవరో కూడా నువ్వు తెలుసుకోకుండానే అసలు నువ్వు వారికి అనుమతి ఎందుకిచ్చావు? 9:44 لَا يَسْتَأْذِنُكَ الَّذِينَ يُؤْمِنُونَ بِاللَّهِ وَالْيَوْمِ الْآخِرِ أَن يُجَاهِدُوا بِأَمْوَالِهِمْ وَأَنفُسِهِمْ ۗ وَاللَّهُ عَلِيمٌ بِالْمُتَّقِينَ అల్లాహ్‌ను, అంతిమ దినాన్ని విశ్వసించేవారు తమ ధన ప్రాణాలను పణంగా పెట్టి పోరాడే విషయంలో తమకు సెలవు ఇవ్వమని నిన్ను ఎట్టి పరిస్థితిలోనూ విన్నవించుకోరు. భయభక్తులు గల వారెవరో అల్లాహ్‌కు బాగా తెలుసు. 9:45 إِنَّمَا يَسْتَأْذِنُكَ الَّذِينَ لَا يُؤْمِنُونَ بِاللَّهِ وَالْيَوْمِ الْآخِرِ وَارْتَابَتْ قُلُوبُهُمْ فَهُمْ فِي رَيْبِهِمْ يَتَرَدَّدُونَ అల్లాహ్‌పై, అంతిమ దినంపై విశ్వాసం లేనివారు మాత్రమే నీ నుండి ఇలాంటి సెలవును కోరుతారు. వారి హృదయాలు సంశయానికి లోనై ఉంటాయి. వారు తమ సంశయాలు, సందేహాలలోనే ఊగిసలాడుతున్నారు. 9:46 وَلَوْ أَرَادُوا الْخُرُوجَ لَأَعَدُّوا لَهُ عُدَّةً وَلَٰكِن كَرِهَ اللَّهُ انبِعَاثَهُمْ فَثَبَّطَهُمْ وَقِيلَ اقْعُدُوا مَعَ الْقَاعِدِينَ యుద్ధానికి బయలుదేరాలన్న ఉద్దేశమే గనక వారికి ఉండి ఉంటే వారు ఎలాగయినా ప్రయాణ సామగ్రిని సమకూర్చుకుని ఉండేవారు. కాని వారు బయలుదేరటం అల్లాహ్‌కు అస్సలు ఇష్టంలేదు. అందుకే వారిని కదలకుండా ఆపేశాడు. “వెనుక ఉండిపోయే వారితోనే మీరూ ఉండిపోండి” అని వారికి చెప్పబడింది. 9:47 لَوْ خَرَجُوا فِيكُم مَّا زَادُوكُمْ إِلَّا خَبَالًا وَلَأَوْضَعُوا خِلَالَكُمْ يَبْغُونَكُمُ الْفِتْنَةَ وَفِيكُمْ سَمَّاعُونَ لَهُمْ ۗ وَاللَّهُ عَلِيمٌ بِالظَّالِمِينَ ఒకవేళ వారు మీతో కలసి బయలుదేరి ఉండినట్లయితే మీకు కీడు చేయటం తప్ప మరి దేనినీ పెంచి ఉండేవారు కారు. పైగా మీ మధ్య అదే పనిగా గుర్రాలను పరుగెత్తించేవారు. మీలో చీలికను తెచ్చే ప్రయత్నాల్లో ఉండేవారు. వారి మాటలను వినేవారు స్వయంగా మీలోనే ఉన్నారు. ఆ దుర్మార్గుల సంగతి అంతా అల్లాహ్‌కు తెలుసు. 9:48 لَقَدِ ابْتَغَوُا الْفِتْنَةَ مِن قَبْلُ وَقَلَّبُوا لَكَ الْأُمُورَ حَتَّىٰ جَاءَ الْحَقُّ وَظَهَرَ أَمْرُ اللَّهِ وَهُمْ كَارِهُونَ వారు ఇంతకు ముందు కూడా విభేదాలను సృష్టించే ప్రయత్నాలు చేశారు. నీ కార్యక్రమాలను తలక్రిందులుగా చేసే చేష్టలకు కూడా ఒడిగట్టారు. కడకు వారి ఇష్టానికి వ్యతిరేకంగా సత్యం వచ్చేసింది, దైవాజ్ఞే ఆధిపత్యం వహించింది. 9:49 وَمِنْهُم مَّن يَقُولُ ائْذَن لِّي وَلَا تَفْتِنِّي ۚ أَلَا فِي الْفِتْنَةِ سَقَطُوا ۗ وَإِنَّ جَهَنَّمَ لَمُحِيطَةٌ بِالْكَافِرِينَ “నాకు అనుమతి ఇవ్వండి. నన్ను పరీక్షకు గురి చేయకండి” అని వారిలో ఒకడంటాడు. తెలుసుకోండి! వారు పరీక్షకు గురయ్యే ఉన్నారు. నిశ్చయంగా నరకం అవిశ్వాసులను చుట్టు ముట్టేస్తుంది. 9:50 إِن تُصِبْكَ حَسَنَةٌ تَسُؤْهُمْ ۖ وَإِن تُصِبْكَ مُصِيبَةٌ يَقُولُوا قَدْ أَخَذْنَا أَمْرَنَا مِن قَبْلُ وَيَتَوَلَّوا وَّهُمْ فَرِحُونَ నీకు ఏదైనా మేలు కలిగితే వారికి అది బాధ కలిగిస్తుంది. ఒకవేళ మీపై ఏదైనా ఆపద వస్తే “(అలాంటిదేదో జరుగుతుందనే) మేము ముందుగానే జాగ్రత్త పడ్డామ”ని చెబుతూ, సంబరపడుతూ వెళ్ళిపోతారు. 9:51 قُل لَّن يُصِيبَنَا إِلَّا مَا كَتَبَ اللَّهُ لَنَا هُوَ مَوْلَانَا ۚ وَعَلَى اللَّهِ فَلْيَتَوَكَّلِ الْمُؤْمِنُونَ “అల్లాహ్ మాకు రాసిపెట్టినది తప్ప మరొకటి మాకు జరగదు. ఆయనే మా సంరక్షకుడు. విశ్వాసులైనవారు అల్లాహ్‌నే నమ్ముకోవాలి” అని (ఓప్రవక్తా!) వారికిచెప్పు. 9:52 قُلْ هَلْ تَرَبَّصُونَ بِنَا إِلَّا إِحْدَى الْحُسْنَيَيْنِ ۖ وَنَحْنُ نَتَرَبَّصُ بِكُمْ أَن يُصِيبَكُمُ اللَّهُ بِعَذَابٍ مِّنْ عِندِهِ أَوْ بِأَيْدِينَا ۖ فَتَرَبَّصُوا إِنَّا مَعَكُم مُّتَرَبِّصُونَ (ఓ ప్రవక్తా!) వారికి చెప్పు: “మీరు మా విషయంలో దేనికోసం ఎదురుచూస్తున్నారో అది రెండు మేళ్ళలో ఒకటి తప్ప మరొకటేముంది? కాగా; మీ విషయంలో మేమూ నిరీక్షిస్తున్నాము- అల్లాహ్ తాను స్వయంగానయినా మిమ్మల్ని శిక్షిస్తాడు లేదా మా చేతుల మీదుగానయినా (శిక్ష విధిస్తాడు) కాబట్టి మీరూ ఎదురు చూస్తూ ఉండండి. మరోవైపు మేమూ మీతోపాటే ఎదురు చూస్తూ ఉంటాము.” 9:53 قُلْ أَنفِقُوا طَوْعًا أَوْ كَرْهًا لَّن يُتَقَبَّلَ مِنكُمْ ۖ إِنَّكُمْ كُنتُمْ قَوْمًا فَاسِقِينَ వారికి చెప్పు: “మీరు ఇష్టపూర్వకంగా ఖర్చుపెట్టినా, ఇష్టం లేకుండా ఖర్చుపెట్టినా అది ఎట్టి పరిస్థితిలోనూ స్వీకారయోగ్యమవదు. నిశ్చయంగా మీరు అవిధేయులే.” 9:54 وَمَا مَنَعَهُمْ أَن تُقْبَلَ مِنْهُمْ نَفَقَاتُهُمْ إِلَّا أَنَّهُمْ كَفَرُوا بِاللَّهِ وَبِرَسُولِهِ وَلَا يَأْتُونَ الصَّلَاةَ إِلَّا وَهُمْ كُسَالَىٰ وَلَا يُنفِقُونَ إِلَّا وَهُمْ كَارِهُونَ వారు పెట్టే ఖర్చు స్వీకరించబడక పోవటానికి కారణం ఇది తప్ప మరొకటేమీ కాదు: వారు అల్లాహ్‌ను, ఆయన ప్రవక్తను తిరస్కరించారు. ఒకవేళ వారు నమాజుకు వచ్చినా బద్దకంతో వస్తారు. (దైవ మార్గంలో) ఖర్చుపెట్టినా అయిష్టంగానే ఖర్చుపెడతారు. 9:55 فَلَا تُعْجِبْكَ أَمْوَالُهُمْ وَلَا أَوْلَادُهُمْ ۚ إِنَّمَا يُرِيدُ اللَّهُ لِيُعَذِّبَهُم بِهَا فِي الْحَيَاةِ الدُّنْيَا وَتَزْهَقَ أَنفُسُهُمْ وَهُمْ كَافِرُونَ వారి సిరిసంపదలు, సంతానం నిన్ను ఆశ్చర్యానికి లోనుచేయకూడదు. వాటి ద్వారా ప్రాపంచిక జీవితంలోనే వారిని శిక్షించాలనీ, సత్యాన్ని తిరస్కరించిన స్థితిలోనే వారి ప్రాణాలు పోవాలని అల్లాహ్ కోరుతున్నాడు. 9:56 وَيَحْلِفُونَ بِاللَّهِ إِنَّهُمْ لَمِنكُمْ وَمَا هُم مِّنكُمْ وَلَٰكِنَّهُمْ قَوْمٌ يَفْرَقُونَ “మేము మీతోనే ఉన్నాము” అని వారు అల్లాహ్ మీద ఒట్టేసి మరీ చెబుతున్నారు. వాస్తవానికి వారు మీ వారు కారు. వారసలు పిరికిపందలు. 9:57 لَوْ يَجِدُونَ مَلْجَأً أَوْ مَغَارَاتٍ أَوْ مُدَّخَلًا لَّوَلَّوْا إِلَيْهِ وَهُمْ يَجْمَحُونَ వారికి రక్షణా స్థలంగానీ, గుహలుగానీ, తలదూర్చే చిన్న బిలంగానీ - ఏది కనిపించినా వారు దాని వైపుకు పగ్గాలు త్రెంచుకుని పారిపోతారు. 9:58 وَمِنْهُم مَّن يَلْمِزُكَ فِي الصَّدَقَاتِ فَإِنْ أُعْطُوا مِنْهَا رَضُوا وَإِن لَّمْ يُعْطَوْا مِنْهَا إِذَا هُمْ يَسْخَطُونَ దానాల పంపిణీ విషయంలో నిన్ను నిందించేవారు కూడా వారిలో ఉన్నారు. అందులో నుంచి వారికి లభిస్తే సంతోషిస్తారు. లభించకపోతే వెంటనే కోపాన్ని వెళ్ళగ్రక్కుతారు. 9:59 وَلَوْ أَنَّهُمْ رَضُوا مَا آتَاهُمُ اللَّهُ وَرَسُولُهُ وَقَالُوا حَسْبُنَا اللَّهُ سَيُؤْتِينَا اللَّهُ مِن فَضْلِهِ وَرَسُولُهُ إِنَّا إِلَى اللَّهِ رَاغِبُونَ అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త ఇచ్చిన దానితో తృప్తి చెంది, “మాకు అల్లాహ్ చాలు. అల్లాహ్ తన కృపతో మాకు మరింత అనుగ్రహిస్తాడు. ఆయన ప్రవక్త కూడా మాకు వొసగుతాడు. మేము మాత్రం అల్లాహ్‌పైనే ఆశలు పెట్టుకున్నాము” అని వారు చెప్పి ఉంటే (ఎంత బావుండేది)! 9:60 إِنَّمَا الصَّدَقَاتُ لِلْفُقَرَاءِ وَالْمَسَاكِينِ وَالْعَامِلِينَ عَلَيْهَا وَالْمُؤَلَّفَةِ قُلُوبُهُمْ وَفِي الرِّقَابِ وَالْغَارِمِينَ وَفِي سَبِيلِ اللَّهِ وَابْنِ السَّبِيلِ ۖ فَرِيضَةً مِّنَ اللَّهِ ۗ وَاللَّهُ عَلِيمٌ حَكِيمٌ దానాలను కేవలం నిరుపేదల కొరకూ, అభాగ్య జీవుల కొరకు, వాటి వసూళ్ల కోసం నియమితులైన వారికొరకు, హృదయాలను ఆకట్టుకోవలసి ఉన్నవారి కొరకు, మెడలను విడిపించటానికీ, రుణగ్రస్తుల కొరకూ, దైవమార్గం కొరకూ, బాటసారుల కొరకూ వెచ్చించాలి. ఇది అల్లాహ్ తరఫున నిర్ణయించబడిన ఒక విధి. అల్లాహ్ మహాజ్ఞాని, మహావివేకి. 9:61 وَمِنْهُمُ الَّذِينَ يُؤْذُونَ النَّبِيَّ وَيَقُولُونَ هُوَ أُذُنٌ ۚ قُلْ أُذُنُ خَيْرٍ لَّكُمْ يُؤْمِنُ بِاللَّهِ وَيُؤْمِنُ لِلْمُؤْمِنِينَ وَرَحْمَةٌ لِّلَّذِينَ آمَنُوا مِنكُمْ ۚ وَالَّذِينَ يُؤْذُونَ رَسُولَ اللَّهِ لَهُمْ عَذَابٌ أَلِيمٌ ప్రవక్తను బాధించేవారు కూడా వారిలో కొందరున్నారు. “ఈయన చెప్పుడు మాటలు వినేవాడు” అని వారంటున్నారు. వారికి చెప్పు: “ఆ వినేవాడు మీ మేలును కోరేవాడే. అతడు అల్లాహ్‌ను విశ్వసిస్తాడు. ముస్లింల మాటల్ని నమ్ముతాడు. మీలో విశ్వసించిన వారి యెడల అతడు కారుణ్యమూర్తి. దైవప్రవక్త (సఅసం)ను బాధించే వారికి బాధాకరమైన శిక్ష ఖాయం.” 9:62 يَحْلِفُونَ بِاللَّهِ لَكُمْ لِيُرْضُوكُمْ وَاللَّهُ وَرَسُولُهُ أَحَقُّ أَن يُرْضُوهُ إِن كَانُوا مُؤْمِنِينَ మిమ్మల్నిసంతోషపెట్టడానికి వారు మీ ముందు అల్లాహ్‌పై ప్రమాణాలు చేస్తూ పోతారు. వారు విశ్వాసులే గనక అయితే వారి ఈ సంతోషపెట్టే ధోరణికి అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త అందరికంటే ఎక్కువ హక్కుదారులు. 9:63 أَلَمْ يَعْلَمُوا أَنَّهُ مَن يُحَادِدِ اللَّهَ وَرَسُولَهُ فَأَنَّ لَهُ نَارَ جَهَنَّمَ خَالِدًا فِيهَا ۚ ذَٰلِكَ الْخِزْيُ الْعَظِيمُ ఎవడు అల్లాహ్‌ను, ఆయన ప్రవక్తను ఎదిరిస్తాడో అతని కొరకు నరకాగ్ని (కాచుకొని) ఉంటుందనీ, అందులో అతను కలకాలం ఉండవలసి వస్తుందనీ, అది ఘోరపరాభవమనీ వారికి తెలియదా? 9:64 يَحْذَرُ الْمُنَافِقُونَ أَن تُنَزَّلَ عَلَيْهِمْ سُورَةٌ تُنَبِّئُهُم بِمَا فِي قُلُوبِهِمْ ۚ قُلِ اسْتَهْزِئُوا إِنَّ اللَّهَ مُخْرِجٌ مَّا تَحْذَرُونَ తమ గుండెల్లో దాగివున్న గుట్టును రట్టుచేసే సూరా ఏదైనా (ముస్లిములపై) అవతరిస్తుందేమోనన్న భయం ఈ కపటులను అనుక్షణం వెంటాడుతూ ఉంటుంది. (ప్రవక్తా!) వారికి చెప్పు: మీరు ఎగతాళి చేస్తూనే ఉండండి. దేని గురించి మీరు భయపడుతున్నారో దాన్ని అల్లాహ్ ఎలాగూ బయటపెట్టనున్నాడు. 9:65 وَلَئِن سَأَلْتَهُمْ لَيَقُولُنَّ إِنَّمَا كُنَّا نَخُوضُ وَنَلْعَبُ ۚ قُلْ أَبِاللَّهِ وَآيَاتِهِ وَرَسُولِهِ كُنتُمْ تَسْتَهْزِئُونَ (మీరు చెప్పుకుంటూ ఉన్న విషయం ఏమిటి? అని) నువ్వు వారిని అడిగితే, “అబ్బే ఏమీలేదు. ఏదో సరదాగా, నవ్వులాటకు ఇలా చెప్పుకుంటున్నాము” అని వారంటారు. “ఏమిటీ, మీరు అల్లాహ్‌తో, ఆయన ఆయతులతో, ఆయన ప్రవక్తలతో పరిహాసమాడుతున్నారా? అని అడుగు. 9:66 لَا تَعْتَذِرُوا قَدْ كَفَرْتُم بَعْدَ إِيمَانِكُمْ ۚ إِن نَّعْفُ عَن طَائِفَةٍ مِّنكُمْ نُعَذِّبْ طَائِفَةً بِأَنَّهُمْ كَانُوا مُجْرِمِينَ “మీరింక సాకులు చెప్పకండి. మీరు విశ్వసించిన తరువాత అవిశ్వాసానికి ఒడిగట్టారు. ఒకవేళ మేము మీలో కొందరిని మన్నించినా, మరికొందరిని వారి నేరాలకుగాను కఠినంగా శిక్షిస్తాము” అని (ఓప్రవక్తా!) వారికి చెప్పు. 9:67 الْمُنَافِقُونَ وَالْمُنَافِقَاتُ بَعْضُهُم مِّن بَعْضٍ ۚ يَأْمُرُونَ بِالْمُنكَرِ وَيَنْهَوْنَ عَنِ الْمَعْرُوفِ وَيَقْبِضُونَ أَيْدِيَهُمْ ۚ نَسُوا اللَّهَ فَنَسِيَهُمْ ۗ إِنَّ الْمُنَافِقِينَ هُمُ الْفَاسِقُونَ కపటులైన పురుషులూ, స్త్రీలూ- వారంతా ఒక్కటే. వారు చెడు విషయాల గురించి ఆజ్ఞాపించి, మంచి విషయాల నుంచి ఆపుతారు. తమ గుప్పెళ్ళను మూసి ఉంచుతారు. వారు అల్లాహ్‌ను విస్మరించారు. అందుకే అల్లాహ్ కూడా వారిని విస్మరించాడు. నిశ్చయంగా కపటులే పాపాత్ములు (అవిధేయులు). 9:68 وَعَدَ اللَّهُ الْمُنَافِقِينَ وَالْمُنَافِقَاتِ وَالْكُفَّارَ نَارَ جَهَنَّمَ خَالِدِينَ فِيهَا ۚ هِيَ حَسْبُهُمْ ۚ وَلَعَنَهُمُ اللَّهُ ۖ وَلَهُمْ عَذَابٌ مُّقِيمٌ కపటులైన పురుషులకూ, స్త్రీలకూ, ఇంకా అవిశ్వాసులకూ అల్లాహ్ నరకాగ్ని గురించి వాగ్దానం చేసి వున్నాడు. అందులో వారు సదా పడి ఉంటారు. వారికి తగినది కూడా అదేను. వారిపై అల్లాహ్ యొక్క శాపం పడింది. వారికొరకు శాశ్వితమైన శిక్ష ఉంది. 9:69 كَالَّذِينَ مِن قَبْلِكُمْ كَانُوا أَشَدَّ مِنكُمْ قُوَّةً وَأَكْثَرَ أَمْوَالًا وَأَوْلَادًا فَاسْتَمْتَعُوا بِخَلَاقِهِمْ فَاسْتَمْتَعْتُم بِخَلَاقِكُمْ كَمَا اسْتَمْتَعَ الَّذِينَ مِن قَبْلِكُم بِخَلَاقِهِمْ وَخُضْتُمْ كَالَّذِي خَاضُوا ۚ أُولَٰئِكَ حَبِطَتْ أَعْمَالُهُمْ فِي الدُّنْيَا وَالْآخِرَةِ ۖ وَأُولَٰئِكَ هُمُ الْخَاسِرُونَ (కపటులారా! చూడబోతే మీ పరిస్థితి కూడా) మీ పూర్వీకుల మాదిరిగానే ఉంది. వారు మీకన్నా బలవంతులు. మీకన్నా ఎక్కువ సిరిసంపదలు, సంతానం కలవారు. వారు తమవంతు భాగ్యాన్ని వాడుకున్నారు, మీరు కూడా మీవంతు భాగ్యాన్ని జుర్రుకున్నారు, మీ పూర్వీకులు తమ వంతు భాగ్యాన్ని జుర్రుకున్నట్లు. వారి మాదిరిగానే మీరు కూడా వేళాకోళపు వాదనల్లో పడ్డారు. వారి కర్మలు ప్రపంచంలోనూ, పరలోకంలోనూ వృధా అయిపోయాయి. నష్టానికి గురైన వారంటే వీరే. 9:70 أَلَمْ يَأْتِهِمْ نَبَأُ الَّذِينَ مِن قَبْلِهِمْ قَوْمِ نُوحٍ وَعَادٍ وَثَمُودَ وَقَوْمِ إِبْرَاهِيمَ وَأَصْحَابِ مَدْيَنَ وَالْمُؤْتَفِكَاتِ ۚ أَتَتْهُمْ رُسُلُهُم بِالْبَيِّنَاتِ ۖ فَمَا كَانَ اللَّهُ لِيَظْلِمَهُمْ وَلَٰكِن كَانُوا أَنفُسَهُمْ يَظْلِمُونَ ఏమిటీ, వారికి తమ పూర్వీకులైన నూహ్ జాతివారి, ఆద్ సమూద్ జాతివారి, ఇబ్రాహీమ్ జాతివారి, మద్‌యన్ వారి, తలక్రిందులుగా చేయబడిన బస్తీలవారి సమాచారం అందలేదా? వారి వద్దకు వారి ప్రవక్తలు నిదర్శనాలను తీసుకువచ్చారు. అల్లాహ్ వారికెలాంటి అన్యాయం చేయలేదు. వారు తమ స్వయానికి తామే అన్యాయం చేసుకున్నారు. 9:71 وَالْمُؤْمِنُونَ وَالْمُؤْمِنَاتُ بَعْضُهُمْ أَوْلِيَاءُ بَعْضٍ ۚ يَأْمُرُونَ بِالْمَعْرُوفِ وَيَنْهَوْنَ عَنِ الْمُنكَرِ وَيُقِيمُونَ الصَّلَاةَ وَيُؤْتُونَ الزَّكَاةَ وَيُطِيعُونَ اللَّهَ وَرَسُولَهُ ۚ أُولَٰئِكَ سَيَرْحَمُهُمُ اللَّهُ ۗ إِنَّ اللَّهَ عَزِيزٌ حَكِيمٌ విశ్వాసులైన పురుషులూ, విశ్వాసులైన స్త్రీలూ – వారంతా ఒండొకరికి మిత్రులుగా (సహాయకులుగా, చేదోడు వాదోడుగా) ఉంటారు. వారు మంచిని గురించి ఆజ్ఞాపిస్తారు. చెడుల నుంచి వారిస్తారు. నమాజులను నెలకొల్పుతారు, జకాత్‌ను చెల్లిస్తారు. అల్లాహ్‌కు, ఆయన ప్రవక్తకు విధేయులై ఉంటారు. అల్లాహ్ అతిత్వరలో తన కారుణ్యాన్ని కురిపించేది వీరిపైనే. నిస్సందేహంగా అల్లాహ్ సర్వాధిక్యుడు, వివేచనాశీలి. 9:72 وَعَدَ اللَّهُ الْمُؤْمِنِينَ وَالْمُؤْمِنَاتِ جَنَّاتٍ تَجْرِي مِن تَحْتِهَا الْأَنْهَارُ خَالِدِينَ فِيهَا وَمَسَاكِنَ طَيِّبَةً فِي جَنَّاتِ عَدْنٍ ۚ وَرِضْوَانٌ مِّنَ اللَّهِ أَكْبَرُ ۚ ذَٰلِكَ هُوَ الْفَوْزُ الْعَظِيمُ విశ్వసించిన ఇలాంటి స్త్రీ పురుషులకు, క్రింద కాలువలు ప్రవహించే స్వర్గవనాలను ప్రసాదిస్తానని అల్లాహ్ వాగ్దానం చేశాడు. అక్కడ వారు కలకాలం ఉంటారు. శాశ్వతంగా ఉండే స్వర్గవనాలలో పరిశుభ్రమైన మేడలు వారి కొరకు ఉంటాయి. వీటన్నింటికన్నా గొప్పదైన అల్లాహ్ ప్రసన్నత వారికి లభిస్తుంది. గొప్ప సాఫల్యం అంటే ఇదే. 9:73 يَا أَيُّهَا النَّبِيُّ جَاهِدِ الْكُفَّارَ وَالْمُنَافِقِينَ وَاغْلُظْ عَلَيْهِمْ ۚ وَمَأْوَاهُمْ جَهَنَّمُ ۖ وَبِئْسَ الْمَصِيرُ ఓ ప్రవక్తా! అవిశ్వాసులతో, కపటులతో పోరాడుతూ ఉండు. వారి పాలిట కఠినంగా ప్రవర్తించు. వారి అసలు నివాసస్థలం నరకమే. అది అత్యంత చెడ్డస్థలం. 9:74 يَحْلِفُونَ بِاللَّهِ مَا قَالُوا وَلَقَدْ قَالُوا كَلِمَةَ الْكُفْرِ وَكَفَرُوا بَعْدَ إِسْلَامِهِمْ وَهَمُّوا بِمَا لَمْ يَنَالُوا ۚ وَمَا نَقَمُوا إِلَّا أَنْ أَغْنَاهُمُ اللَّهُ وَرَسُولُهُ مِن فَضْلِهِ ۚ فَإِن يَتُوبُوا يَكُ خَيْرًا لَّهُمْ ۖ وَإِن يَتَوَلَّوْا يُعَذِّبْهُمُ اللَّهُ عَذَابًا أَلِيمًا فِي الدُّنْيَا وَالْآخِرَةِ ۚ وَمَا لَهُمْ فِي الْأَرْضِ مِن وَلِيٍّ وَلَا نَصِيرٍ “మేమలా చెప్పలేద”ని వారు ప్రమాణాలు చేసి చెబుతున్నారు. యదార్థానికి అవిశ్వాస వాక్కు వారి నోట వెలువడింది. ఇస్లాంను స్వీకరించిన తరువాత వారు కుఫ్ర్‌కు (తిరస్కారానికి) ఒడిగట్టారు. వారు చేయలేకపోయిన దానిని గురించి కూడా నిశ్చయించుకున్నారు. అల్లాహ్, ఆయన ప్రవక్త (సఅసం) తమ చలువతో వారిని సంపన్నులుగా చేసినందుకే వారు ఈ విధంగా ప్రతీకారం తీర్చుకుంటున్నారు. వారు ఇప్పటికైనా పశ్చాత్తాపం చెందితే అది వారికొరకు శ్రేయస్కరం అవుతుంది. ఒకవేళ వారు ముఖం త్రిప్పుకున్నట్లయితే ప్రపంచంలోనూ, పరలోకంలోనూ అల్లాహ్ వారికి వ్యధాభరితమైన శిక్షకు గురి చేస్తాడు. భూమండలంలో వారిని సమర్థించేవాడు, సహాయపడే వాడెవడూ ఉండడు. 9:75 وَمِنْهُم مَّنْ عَاهَدَ اللَّهَ لَئِنْ آتَانَا مِن فَضْلِهِ لَنَصَّدَّقَنَّ وَلَنَكُونَنَّ مِنَ الصَّالِحِينَ “ఒకవేళ అల్లాహ్ తన కృపతో మాకు సంపదను వొసగినట్లయితే మేము తప్పకుండా దాన ధర్మాలు చేసి, సద్వర్తనుల్లో చేరతాము” అని అల్లాహ్‌తో వాగ్దానం చేసిన వారు కూడా వారిలో ఉన్నారు. 9:76 فَلَمَّا آتَاهُم مِّن فَضْلِهِ بَخِلُوا بِهِ وَتَوَلَّوا وَّهُم مُّعْرِضُونَ కాని అల్లాహ్ తన కృపతో వారికి కలిమిని ప్రసాదించగా, వారు అందులో పిసినారితనం ప్రదర్శించసాగారు. మాటను దాటవేస్తూ, ముఖం చాటేశారు. 9:77 فَأَعْقَبَهُمْ نِفَاقًا فِي قُلُوبِهِمْ إِلَىٰ يَوْمِ يَلْقَوْنَهُ بِمَا أَخْلَفُوا اللَّهَ مَا وَعَدُوهُ وَبِمَا كَانُوا يَكْذِبُونَ ఫలితం ఏమయిందంటే, అల్లాహ్‌తో చేసిన వాగ్దానానికి విరుద్ధంగా ప్రవర్తించిన కారణంగానూ, అబద్ధాలు చెబుతూ ఉన్నందుకుగానూ అల్లాహ్ వారి హృదయాలలో కాపట్యాన్ని ఉంచాడు. అల్లాహ్‌ను కలుసుకునే రోజు వరకూ అది వారిలో ఉంటుంది. 9:78 أَلَمْ يَعْلَمُوا أَنَّ اللَّهَ يَعْلَمُ سِرَّهُمْ وَنَجْوَاهُمْ وَأَنَّ اللَّهَ عَلَّامُ الْغُيُوبِ ఏమిటీ, తమలోగుట్టు గురించి, తమ గుసగుసల గురించి అల్లాహ్‌కు అంతా తెలుసుననీ, అల్లాహ్ అగోచర విషయాలన్నింటినీ ఎరిగినవాడనీ వారికి తెలియదా? 9:79 الَّذِينَ يَلْمِزُونَ الْمُطَّوِّعِينَ مِنَ الْمُؤْمِنِينَ فِي الصَّدَقَاتِ وَالَّذِينَ لَا يَجِدُونَ إِلَّا جُهْدَهُمْ فَيَسْخَرُونَ مِنْهُمْ ۙ سَخِرَ اللَّهُ مِنْهُمْ وَلَهُمْ عَذَابٌ أَلِيمٌ విశాలమనసుతో దానధర్మాలు చేసే విశ్వాసులను నిందించేవారిని, (అల్లాహ్ మార్గంలో ఇచ్చేందుకు) తాము చెమటోడ్చి సంపాదించినది తప్ప మరేదీ తమ వద్దలేని వారిని అవహేళన చేస్తూ మాట్లాడేవారిని అల్లాహ్ కూడా ఆట పట్టిస్తాడు. వారికోసం వ్యధాభరితమైన శిక్ష ఉంది. 9:80 اسْتَغْفِرْ لَهُمْ أَوْ لَا تَسْتَغْفِرْ لَهُمْ إِن تَسْتَغْفِرْ لَهُمْ سَبْعِينَ مَرَّةً فَلَن يَغْفِرَ اللَّهُ لَهُمْ ۚ ذَٰلِكَ بِأَنَّهُمْ كَفَرُوا بِاللَّهِ وَرَسُولِهِ ۗ وَاللَّهُ لَا يَهْدِي الْقَوْمَ الْفَاسِقِينَ (ఓ ప్రవక్తా!) వారి మన్నింపు కోసం నీవు వేడుకున్నా, వేడుకోకపోయినా ఒక్కటే. ఒకవేళ నువ్వు డెబ్భైసార్లు వారి మన్నింపుకోసం వేడుకున్నా సరే అల్లాహ్ క్షమించడుగాక క్షమించడు. ఎందుకంటే, వారు అల్లాహ్ పట్లా, ఆయన ప్రవక్త పట్లా తిరస్కార వైఖరిని అవలంబించారు. ఇటువంటి అవిధేయులకు అల్లాహ్ సన్మార్గం చూపడు. 9:81 فَرِحَ الْمُخَلَّفُونَ بِمَقْعَدِهِمْ خِلَافَ رَسُولِ اللَّهِ وَكَرِهُوا أَن يُجَاهِدُوا بِأَمْوَالِهِمْ وَأَنفُسِهِمْ فِي سَبِيلِ اللَّهِ وَقَالُوا لَا تَنفِرُوا فِي الْحَرِّ ۗ قُلْ نَارُ جَهَنَّمَ أَشَدُّ حَرًّا ۚ لَّوْ كَانُوا يَفْقَهُونَ వెనుక ఉండి పోయినవారు, దైవప్రవక్త (సఅసం) వెళ్ళిన తరువాత, తాము ఆ విధంగా (ఇంట్లో) ఉండిపోయినందుకు సంబరపడ్డారు. దైవమార్గంలో తమ ధన ప్రాణాలొడ్డి పోరాడటం వారికి బొత్తిగా ఇష్టంలేదు. పై పెచ్చు ”ఇంత తీవ్రమైన ఎండ వేడిలో బయలుదేరకండి” అని అన్నారు. (ఓ ప్రవక్తా!) “నరకాగ్ని ఇంతకన్నా ఎక్కువ వేడిగా ఉంటుంది” అని వారికి చెప్పు. ఆ సంగతిని వారు గ్రహిస్తే ఎంత బావుండు! 9:82 فَلْيَضْحَكُوا قَلِيلًا وَلْيَبْكُوا كَثِيرًا جَزَاءً بِمَا كَانُوا يَكْسِبُونَ కాబట్టి ఇప్పుడు వారు తమ నిర్వాకానికి (లభించే) ప్రతిఫలంపై బహుకొద్దిగా నవ్వాలి, చాలా ఎక్కువగా ఏడ్వాలి. 9:83 فَإِن رَّجَعَكَ اللَّهُ إِلَىٰ طَائِفَةٍ مِّنْهُمْ فَاسْتَأْذَنُوكَ لِلْخُرُوجِ فَقُل لَّن تَخْرُجُوا مَعِيَ أَبَدًا وَلَن تُقَاتِلُوا مَعِيَ عَدُوًّا ۖ إِنَّكُمْ رَضِيتُم بِالْقُعُودِ أَوَّلَ مَرَّةٍ فَاقْعُدُوا مَعَ الْخَالِفِينَ ఒకవేళ అల్లాహ్ నిన్ను వారిలోని ఏ వర్గం వద్దకైనా తిరిగి తీసుకువెళితే, అప్పుడు వారు నీవద్దకు వచ్చి, యుద్ధ మైదానానికి రావటానికి నీ అనుమతి గనక అడిగితే, “ఇక మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ నాతో కలసి రాలేరు. నాతో కలసి శత్రువులతో పోరాడనూలేరు. మీరు తొలిసారే కూర్చుని ఉండటానికి ఇష్టపడ్డారు. కాబట్టి మీరు ఇప్పుడు కూడా వెనుక ఉండి పోయేవారిలోనే కూర్చుని ఉండండి” అని చెప్పెయ్యి. 9:84 وَلَا تُصَلِّ عَلَىٰ أَحَدٍ مِّنْهُم مَّاتَ أَبَدًا وَلَا تَقُمْ عَلَىٰ قَبْرِهِ ۖ إِنَّهُمْ كَفَرُوا بِاللَّهِ وَرَسُولِهِ وَمَاتُوا وَهُمْ فَاسِقُونَ వారిలో ఎవడైనా చస్తే నువ్వు వాడి అంత్యక్రియల నమాజు కూడా ఎన్నటికీ చేయకు. వాడి సమాధి వద్ద కూడా నిలబడకు. వారు అల్లాహ్‌ను, ఆయన ప్రవక్తను తిరస్కరించిన వారు. వారు చచ్చేవరకూ దుష్టులుగా, అవిధేయులుగానే ఉన్నారు. 9:85 وَلَا تُعْجِبْكَ أَمْوَالُهُمْ وَأَوْلَادُهُمْ ۚ إِنَّمَا يُرِيدُ اللَّهُ أَن يُعَذِّبَهُم بِهَا فِي الدُّنْيَا وَتَزْهَقَ أَنفُسُهُمْ وَهُمْ كَافِرُونَ వారి ఆస్తి పాస్తులను, సంతానాన్ని చూసి నువ్వు ఆశ్చర్యపోకూడదు. వారిని ఈ వస్తువుల ద్వారా ఇహలోకంలోనే శిక్షించాలనీ, ప్రాణాలు పోయే దాకా వారు అవిశ్వాసులుగానే ఉండాలనీ అల్లాహ్ కోరుతున్నాడు. 9:86 وَإِذَا أُنزِلَتْ سُورَةٌ أَنْ آمِنُوا بِاللَّهِ وَجَاهِدُوا مَعَ رَسُولِهِ اسْتَأْذَنَكَ أُولُو الطَّوْلِ مِنْهُمْ وَقَالُوا ذَرْنَا نَكُن مَّعَ الْقَاعِدِينَ “అల్లాహ్‌ను విశ్వసించండి, ఆయన ప్రవక్తతో కలసి పోరాడండి” అని ఆజ్ఞాపించే సూరా అవతరింపజేయబడినప్పుడు వారిలోని శ్రీమంతుల వర్గం ఒకటి నీ దగ్గరకు వచ్చి, “మమ్మల్ని కూర్చుని ఉండేవారితో పాటే ఉండనివ్వండి” అంటూ అనుమతి కోరుతుంది. 9:87 رَضُوا بِأَن يَكُونُوا مَعَ الْخَوَالِفِ وَطُبِعَ عَلَىٰ قُلُوبِهِمْ فَهُمْ لَا يَفْقَهُونَ వారు ఇండ్లల్లో ఉండే ఆడవారి వెంట ఉండటానికే ఇష్టపడ్డారు. వారి హృదయాలపై ముద్ర వేయబడింది. కాబట్టి ఇప్పుడు ఏ విషయమూ వారికి అర్థం కాదు. 9:88 لَٰكِنِ الرَّسُولُ وَالَّذِينَ آمَنُوا مَعَهُ جَاهَدُوا بِأَمْوَالِهِمْ وَأَنفُسِهِمْ ۚ وَأُولَٰئِكَ لَهُمُ الْخَيْرَاتُ ۖ وَأُولَٰئِكَ هُمُ الْمُفْلِحُونَ కాని స్వయంగా ప్రవక్తనూ, ఆయనతో పాటు విశ్వసించిన వారినీ చూడండి; వారు తమ ధన ప్రాణాలతో దైవమార్గంలో పోరాడుతున్నారు. కాబట్టి మేళ్లు గలవారు వీరే. సాఫల్యభాగ్యం పొందేవారు కూడా వీరే. 9:89 أَعَدَّ اللَّهُ لَهُمْ جَنَّاتٍ تَجْرِي مِن تَحْتِهَا الْأَنْهَارُ خَالِدِينَ فِيهَا ۚ ذَٰلِكَ الْفَوْزُ الْعَظِيمُ వీరి కోసమే అల్లాహ్, క్రింద కాలువలు ప్రవహించే స్వర్గవనాలను సిద్ధంచేసి ఉంచాడు. వాటిలో వారు శాశ్వతంగా ఉంటారు. గొప్ప విజయభాగ్యం అంటే ఇదే. 9:90 وَجَاءَ الْمُعَذِّرُونَ مِنَ الْأَعْرَابِ لِيُؤْذَنَ لَهُمْ وَقَعَدَ الَّذِينَ كَذَبُوا اللَّهَ وَرَسُولَهُ ۚ سَيُصِيبُ الَّذِينَ كَفَرُوا مِنْهُمْ عَذَابٌ أَلِيمٌ పల్లెవాసుల్లోని సాకులు చెప్పేవాళ్లు కూడా తమకు (యుద్ధం నుంచి) సెలవు ఇవ్వమని కోరుతూ వచ్చారు. అల్లాహ్‌తోనూ, ఆయన ప్రవక్తతోనూ అబద్దాలాడిన వారు ఎలాగూ కూర్చొనే ఉండిపోయారు. వారిలో అవిశ్వాస పోకడను ప్రదర్శించిన వారికి బాధాకరమైన శిక్ష తప్పదు. 9:91 لَّيْسَ عَلَى الضُّعَفَاءِ وَلَا عَلَى الْمَرْضَىٰ وَلَا عَلَى الَّذِينَ لَا يَجِدُونَ مَا يُنفِقُونَ حَرَجٌ إِذَا نَصَحُوا لِلَّهِ وَرَسُولِهِ ۚ مَا عَلَى الْمُحْسِنِينَ مِن سَبِيلٍ ۚ وَاللَّهُ غَفُورٌ رَّحِيمٌ బలహీనులపై, రోగపీడితులపై, ఖర్చు పెట్టడానికి తమ వద్ద ఏమీలేని వారిపై – ఏ దోషమూ లేదు. అయితే వారు అల్లాహ్ పట్ల, ఆయన ప్రవక్త పట్ల శ్రేయోభిలాషులై ఉండాలి. అలాంటి సజ్జనులపై ఆరోపణలకు ఏ ఆస్కారమూ లేదు. అల్లాహ్ అపారంగా క్షమించేవాడు, కరుణించేవాడూను. 9:92 وَلَا عَلَى الَّذِينَ إِذَا مَا أَتَوْكَ لِتَحْمِلَهُمْ قُلْتَ لَا أَجِدُ مَا أَحْمِلُكُمْ عَلَيْهِ تَوَلَّوا وَّأَعْيُنُهُمْ تَفِيضُ مِنَ الدَّمْعِ حَزَنًا أَلَّا يَجِدُوا مَا يُنفِقُونَ నీ వద్దకు వచ్చి, తమకు వాహనాలు సమకూర్చమని విన్నవించుకునే వారిపై కూడా ఎలాంటి ఆక్షేపణలకు ఆస్కారంలేదు. “మీకు ఇవ్వటానికి నా వద్ద ఏ వాహనమూ లేదు” అని నువ్వు వారికి చెప్పినప్పుడు వారు దుఃఖవదనులౌతారు. వారి కళ్లల్లో నుంచి కన్నీరు ఉబికి వస్తుండగా (క్లిష్ట పరిస్థితిలో) ఖర్చుపెట్టడానికి తమ వద్ద ఏమీ లేనందుకు వారు విలపిస్తూ తిరిగి వెళ్ళిపోతారు. 9:93 إِنَّمَا السَّبِيلُ عَلَى الَّذِينَ يَسْتَأْذِنُونَكَ وَهُمْ أَغْنِيَاءُ ۚ رَضُوا بِأَن يَكُونُوا مَعَ الْخَوَالِفِ وَطَبَعَ اللَّهُ عَلَىٰ قُلُوبِهِمْ فَهُمْ لَا يَعْلَمُونَ స్థితిమంతులై ఉండి కూడా నీ నుండి అనుమతిని కోరేవారిపై మాత్రం దోషం ఉంది. వారు ఇంటి పట్టున ఉండే ఆడవారి వెంట ఉండటానికే ఇష్టపడ్డారు. వారి హృదయాలపై అల్లాహ్ ముద్రవేశాడు. అందువల్ల వారు తెలుసుకోలేకపోతున్నారు. 9:94 يَعْتَذِرُونَ إِلَيْكُمْ إِذَا رَجَعْتُمْ إِلَيْهِمْ ۚ قُل لَّا تَعْتَذِرُوا لَن نُّؤْمِنَ لَكُمْ قَدْ نَبَّأَنَا اللَّهُ مِنْ أَخْبَارِكُمْ ۚ وَسَيَرَى اللَّهُ عَمَلَكُمْ وَرَسُولُهُ ثُمَّ تُرَدُّونَ إِلَىٰ عَالِمِ الْغَيْبِ وَالشَّهَادَةِ فَيُنَبِّئُكُم بِمَا كُنتُمْ تَعْمَلُونَ మీరు వారి వద్దకు తిరిగి వెళ్ళినప్పుడు, వారు మీ దగ్గరకు వచ్చి సాకులు చెబుతారు. (ఓ ప్రవక్తా!) వారితో ఇలా అను : “సాకులు చెప్పకండి. మీరు చెప్పే ఏ మాటనూ మేము నమ్మబోము. మీ సమాచారమంతా అల్లాహ్ మాకు తెలియజేశాడు. ఇక మీదట కూడా అల్లాహ్, ఆయన ప్రవక్త మీ కార్యకలాపాలను గమనిస్తూనే ఉంటారు. తరువాత మీరంతా గోచరాగోచర విషయాలన్నీ తెలిసిన వాని వైపుకు మరలింపబడతారు. మరి మీరు ఏమేమి చేస్తూ ఉండేవారో ఆయన మీకు తెలుపుతాడు.” 9:95 سَيَحْلِفُونَ بِاللَّهِ لَكُمْ إِذَا انقَلَبْتُمْ إِلَيْهِمْ لِتُعْرِضُوا عَنْهُمْ ۖ فَأَعْرِضُوا عَنْهُمْ ۖ إِنَّهُمْ رِجْسٌ ۖ وَمَأْوَاهُمْ جَهَنَّمُ جَزَاءً بِمَا كَانُوا يَكْسِبُونَ మీరు వారి వద్దకు తిరిగి వెళ్ళినప్పుడు, మీరు వారిని వారి మానాన వదలి పెడతారన్న ఉద్దేశంతో, వారు మీ ముందు అల్లాహ్‌పై ప్రమాణాలు చేయటం మొదలెడతారు. కాబట్టి మీరు వాళ్ళను వాళ్ళమానాన వదలిపెట్టండి. వాళ్ళు పరమ అశుద్ధులు. వారు సంపాదించుకున్న దానికి ప్రతిఫలంగా వారి నివాస స్థానం నరకం అవుతుంది. 9:96 يَحْلِفُونَ لَكُمْ لِتَرْضَوْا عَنْهُمْ ۖ فَإِن تَرْضَوْا عَنْهُمْ فَإِنَّ اللَّهَ لَا يَرْضَىٰ عَنِ الْقَوْمِ الْفَاسِقِينَ మీరు వారి పట్ల ప్రసన్నులవుతారన్న ఉద్దేశంతోనే వారు ప్రమాణాలు చేస్తారు. ఒకవేళ మీరు వారి పట్ల ప్రసన్నులైనా అల్లాహ్ మాత్రం ఆ అవిధేయులపట్ల ప్రసన్నుడు అవడు. 9:97 الْأَعْرَابُ أَشَدُّ كُفْرًا وَنِفَاقًا وَأَجْدَرُ أَلَّا يَعْلَمُوا حُدُودَ مَا أَنزَلَ اللَّهُ عَلَىٰ رَسُولِهِ ۗ وَاللَّهُ عَلِيمٌ حَكِيمٌ పల్లెటూరి బైతులు అవిశ్వాసం, కాపట్యంలో మరింత కరడు గట్టినవారు. అల్లాహ్ తన ప్రవక్తపై అవతరింపజేసిన ఆదేశాల గురించి వారికి తెలియకుండా ఉండే అవకాశాలు ఎక్కువ. అల్లాహ్ మహాజ్ఞాని, గొప్ప వివేకవంతుడు. 9:98 وَمِنَ الْأَعْرَابِ مَن يَتَّخِذُ مَا يُنفِقُ مَغْرَمًا وَيَتَرَبَّصُ بِكُمُ الدَّوَائِرَ ۚ عَلَيْهِمْ دَائِرَةُ السَّوْءِ ۗ وَاللَّهُ سَمِيعٌ عَلِيمٌ తాము ఖర్చు పెట్టేదంతా ఒక విధంగా తమపై విధించబడిన జరిమానా అని భావించే వారు కూడా ఈ పల్లెవాసులలో కొందరున్నారు. మీపై చెడ్డకాలం ఎప్పుడు వస్తుందా! అని వారు ఎదురుచూస్తున్నారు. చెడ్డకాలం వాళ్లపైనే వచ్చిపడుతుంది. అల్లాహ్ అంతా వినేవాడు, అన్నీ ఎరిగినవాడు. 9:99 وَمِنَ الْأَعْرَابِ مَن يُؤْمِنُ بِاللَّهِ وَالْيَوْمِ الْآخِرِ وَيَتَّخِذُ مَا يُنفِقُ قُرُبَاتٍ عِندَ اللَّهِ وَصَلَوَاتِ الرَّسُولِ ۚ أَلَا إِنَّهَا قُرْبَةٌ لَّهُمْ ۚ سَيُدْخِلُهُمُ اللَّهُ فِي رَحْمَتِهِ ۗ إِنَّ اللَّهَ غَفُورٌ رَّحِيمٌ మరి ఈ పల్లె జనులలోనే అల్లాహ్‌ను, అంతిమదినాన్ని విశ్వసించేవారు కూడా ఉన్నారు. తాము ఖర్చుపెట్టే సొమ్మును దైవసామీప్యం పొందే, దైవప్రవక్త వేడుకోలుకు (దుఆకు) సాధనంగా ఉపయోగపడే వస్తువుగా వారు తలపోస్తారు. తెలుసుకోండి! వారు చేసే ఈ ఖర్చు నిశ్చయంగా వారి యెడల సామీప్య సాధనం అవుతుంది. అల్లాహ్ తప్పకుండా వారిని తన కారుణ్యంలో చేర్చుకుంటాడు. నిస్సందేహంగా అల్లాహ్ క్షమాశీలుడు, దయామయుడు. 9:100 وَالسَّابِقُونَ الْأَوَّلُونَ مِنَ الْمُهَاجِرِينَ وَالْأَنصَارِ وَالَّذِينَ اتَّبَعُوهُم بِإِحْسَانٍ رَّضِيَ اللَّهُ عَنْهُمْ وَرَضُوا عَنْهُ وَأَعَدَّ لَهُمْ جَنَّاتٍ تَجْرِي تَحْتَهَا الْأَنْهَارُ خَالِدِينَ فِيهَا أَبَدًا ۚ ذَٰلِكَ الْفَوْزُ الْعَظِيمُ ముహాజిర్లలో, అన్సార్లలో ప్రప్రథమంగా ముందంజ వేసిన వారితోనూ, తరువాత చిత్తశుద్ధితో వారిని అనుసరించిన వారితోనూ అల్లాహ్ ప్రసన్నుడయ్యాడు. వారు అల్లాహ్ పట్ల ప్రసన్నులయ్యారు. క్రింద కాలువలు ప్రవహించే స్వర్గవనాలను అల్లాహ్ వారికోసం సిద్ధం చేసి ఉంచాడు. వాటిలో వారు కలకాలం ఉంటారు. గొప్ప సాఫల్యం అంటే ఇదే. 9:101 وَمِمَّنْ حَوْلَكُم مِّنَ الْأَعْرَابِ مُنَافِقُونَ ۖ وَمِنْ أَهْلِ الْمَدِينَةِ ۖ مَرَدُوا عَلَى النِّفَاقِ لَا تَعْلَمُهُمْ ۖ نَحْنُ نَعْلَمُهُمْ ۚ سَنُعَذِّبُهُم مَّرَّتَيْنِ ثُمَّ يُرَدُّونَ إِلَىٰ عَذَابٍ عَظِيمٍ ఇకపోతే; మీ చుట్టుప్రక్కల ఉండే పల్లెవాసులలోనూ, మదీనాలో నివసించేవారిలోనూ కొందరు వంచకులు (మునాఫిక్‌లు) ఉన్నారు. వారు వంచనలో మహామొండివారు. (ఓ ప్రవక్తా!) నువ్వు వారిని ఎరుగవు. వారెవరో మాకు తెలుసు. మేము వారికి రెట్టింపు శిక్షను విధిస్తాము. అనంతరం వారు ఘోరమైన శిక్ష వైపుకు తరలించబడతారు. 9:102 وَآخَرُونَ اعْتَرَفُوا بِذُنُوبِهِمْ خَلَطُوا عَمَلًا صَالِحًا وَآخَرَ سَيِّئًا عَسَى اللَّهُ أَن يَتُوبَ عَلَيْهِمْ ۚ إِنَّ اللَّهَ غَفُورٌ رَّحِيمٌ తమ తప్పులను ఒప్పుకున్నవారు మరికొందరున్నారు. వారు మిశ్రమమైన కర్మలు చేశారు – కొన్ని సత్కార్యాలు, కొన్ని దుష్కార్యాలు! అల్లాహ్ వారి పశ్చాత్తాపాన్ని స్వీకరిస్తాడన్న ఆశ ఉంది. నిశ్చయంగా అల్లాహ్ అపారంగా క్షమించేవాడు, అమితంగా కరుణించేవాడు. 9:103 خُذْ مِنْ أَمْوَالِهِمْ صَدَقَةً تُطَهِّرُهُمْ وَتُزَكِّيهِم بِهَا وَصَلِّ عَلَيْهِمْ ۖ إِنَّ صَلَاتَكَ سَكَنٌ لَّهُمْ ۗ وَاللَّهُ سَمِيعٌ عَلِيمٌ (ఓ ప్రవక్తా!) నువ్వు వారిని పరిశుద్ధపరచటానికీ, వారిని తీర్చిదిద్దటానికీ వారి సంపదల నుంచి దానాలను తీసుకో. వారి బాగోగులకోసం ప్రార్థించు. నిస్సందేహంగా నీ ప్రార్థన (దుఆ) వల్ల వారికి శాంతి లభిస్తుంది. అల్లాహ్ అంతావినేవాడు, అన్నీ తెలిసినవాడు. 9:104 أَلَمْ يَعْلَمُوا أَنَّ اللَّهَ هُوَ يَقْبَلُ التَّوْبَةَ عَنْ عِبَادِهِ وَيَأْخُذُ الصَّدَقَاتِ وَأَنَّ اللَّهَ هُوَ التَّوَّابُ الرَّحِيمُ ఏమిటీ, అల్లాహ్‌యే తన దాసుల పశ్చాత్తాపాన్ని స్వీకరిస్తాడనీ, దానధర్మాలను ఆమోదిస్తాడనీ, పశ్చాత్తాపాన్ని అంగీకరించటంలోనూ, దయజూపటంలోనూ అల్లాహ్‌యే మేటి అనీ వారికి తెలియదా? 9:105 وَقُلِ اعْمَلُوا فَسَيَرَى اللَّهُ عَمَلَكُمْ وَرَسُولُهُ وَالْمُؤْمِنُونَ ۖ وَسَتُرَدُّونَ إِلَىٰ عَالِمِ الْغَيْبِ وَالشَّهَادَةِ فَيُنَبِّئُكُم بِمَا كُنتُمْ تَعْمَلُونَ (ఓ ప్రవక్తా!) వారికి చెప్పు : “మీ పనులు మీరు చేస్తూపోండి. మీ పనులను అల్లాహ్ స్వయంగా చూస్తాడు. ఆయన ప్రవక్త మరియు విశ్వాసులు కూడా (చూస్తారు). గోప్యమైన వాటినీ, బహిరంగమైన వాటినీ ఎరిగిన వాని వద్దకు మీరు ఎలాగూ మరలక తప్పదు. మీరు చేస్తూ ఉన్న దాన్నంతటినీ ఆయన మీకు తెలియజేస్తాడు. 9:106 وَآخَرُونَ مُرْجَوْنَ لِأَمْرِ اللَّهِ إِمَّا يُعَذِّبُهُمْ وَإِمَّا يَتُوبُ عَلَيْهِمْ ۗ وَاللَّهُ عَلِيمٌ حَكِيمٌ ఇంకా కొందరున్నారు – వాళ్ల వ్యవహారం దైవాదేశం వచ్చేవరకూ వాయిదా వేయబడింది. అల్లాహ్ వారిని శిక్షించనూవచ్చు లేదా క్షమించనూవచ్చు. అల్లాహ్ అన్నీతెలిసినవాడు, వివేకవంతుడు. 9:107 وَالَّذِينَ اتَّخَذُوا مَسْجِدًا ضِرَارًا وَكُفْرًا وَتَفْرِيقًا بَيْنَ الْمُؤْمِنِينَ وَإِرْصَادًا لِّمَنْ حَارَبَ اللَّهَ وَرَسُولَهُ مِن قَبْلُ ۚ وَلَيَحْلِفُنَّ إِنْ أَرَدْنَا إِلَّا الْحُسْنَىٰ ۖ وَاللَّهُ يَشْهَدُ إِنَّهُمْ لَكَاذِبُونَ (కపటులలో) మరి కొంతమంది కూడా ఉన్నారు – కీడు కలిగించే, అవిశ్వాసంతో కూడిన మాటలు చెప్పుకునే ఉద్దేశంతో, విశ్వాసుల మధ్య చీలికను తెచ్చే లక్ష్యంతో, అంతకు మునుపు అల్లాహ్‌ను, ఆయన ప్రవక్తను వ్యతిరేకించిన వ్యక్తికి ఆసరా ఇచ్చే ఆలోచనతో వారు ఒక మస్జిదును నిర్మించారు. (ఈ కట్టడాన్నినిర్మించటంలో) తమ ఉద్దేశం మేలుచేయటం తప్ప మరొకటి కాదని వారు ప్రమాణాలు చేస్తారు. వారు అబద్ధాలకోరులన్న విషయానికి అల్లాహ్‌యే సాక్షి. 9:108 لَا تَقُمْ فِيهِ أَبَدًا ۚ لَّمَسْجِدٌ أُسِّسَ عَلَى التَّقْوَىٰ مِنْ أَوَّلِ يَوْمٍ أَحَقُّ أَن تَقُومَ فِيهِ ۚ فِيهِ رِجَالٌ يُحِبُّونَ أَن يَتَطَهَّرُوا ۚ وَاللَّهُ يُحِبُّ الْمُطَّهِّرِينَ నువ్వు ఎన్నడూ అందులో నిలబడకు. అయితే తొలినాటి నుంచే భయభక్తుల పునాదిపై నిర్మించబడిన మస్జిదు నువ్వు నిలబడటానికి అన్ని విధాలా తగినది. బాగా పరిశుద్ధతను పొందటాన్ని ఇష్టపడే వారు అందులో ఉన్నారు. బాగా పరిశుద్ధతను పాటించేవారిని అల్లాహ్ ప్రేమిస్తాడు. 9:109 أَفَمَنْ أَسَّسَ بُنْيَانَهُ عَلَىٰ تَقْوَىٰ مِنَ اللَّهِ وَرِضْوَانٍ خَيْرٌ أَم مَّنْ أَسَّسَ بُنْيَانَهُ عَلَىٰ شَفَا جُرُفٍ هَارٍ فَانْهَارَ بِهِ فِي نَارِ جَهَنَّمَ ۗ وَاللَّهُ لَا يَهْدِي الْقَوْمَ الظَّالِمِينَ తన కట్టడాన్ని దైవభీతి, దైవప్రసన్నతల పునాదిపై కట్టిన వాడు ఉత్తముడా? లేక కూలిపోవటానికి సిద్ధంగా ఉన్న ఏదైనా లోయ యొక్క డొల్ల అంచున తన కట్టడాన్నికట్టిన వాడు ఉత్తముడా? అటు పిమ్మట అది అతనితో పాటే నరకాగ్నిలో పడిపోయింది. ఇలాంటి దుర్మార్గులకు అల్లాహ్ సన్మార్గం చూపడు. 9:110 لَا يَزَالُ بُنْيَانُهُمُ الَّذِي بَنَوْا رِيبَةً فِي قُلُوبِهِمْ إِلَّا أَن تَقَطَّعَ قُلُوبُهُمْ ۗ وَاللَّهُ عَلِيمٌ حَكِيمٌ (తమ మనసుల్లోని) అనుమానం మూలంగా వారు కట్టిన ఆకట్టడం నిత్యం వారి హృదయాలను (ముల్లు మాదిరిగా) కెలుకుతూనే ఉంటుంది. వారి హృదయాలు పగిలి తునాతునకలై పోతే అది వేరే విషయం. అల్లాహ్ అన్నీ తెలిసినవాడు, వివేకసంపన్నుడు. 9:111 إِنَّ اللَّهَ اشْتَرَىٰ مِنَ الْمُؤْمِنِينَ أَنفُسَهُمْ وَأَمْوَالَهُم بِأَنَّ لَهُمُ الْجَنَّةَ ۚ يُقَاتِلُونَ فِي سَبِيلِ اللَّهِ فَيَقْتُلُونَ وَيُقْتَلُونَ ۖ وَعْدًا عَلَيْهِ حَقًّا فِي التَّوْرَاةِ وَالْإِنجِيلِ وَالْقُرْآنِ ۚ وَمَنْ أَوْفَىٰ بِعَهْدِهِ مِنَ اللَّهِ ۚ فَاسْتَبْشِرُوا بِبَيْعِكُمُ الَّذِي بَايَعْتُم بِهِ ۚ وَذَٰلِكَ هُوَ الْفَوْزُ الْعَظِيمُ నిస్సందేహంగా అల్లాహ్ ముస్లింల నుండి, వారి ధన ప్రాణాలను స్వర్గానికి బదులుగా కొన్నాడు. వారు అల్లాహ్ మార్గంలో పోరాడుతారు; చంపుతారు, చంపబడతారు. దీనిపై తౌరాతులోనూ, ఇంజీలులోనూ, ఖుర్‌ఆన్‌లోనూ సత్యమైన వాగ్దానం చేయబడింది. వాగ్దానాన్ని నెరవేర్చటంలో అల్లాహ్‌ను మించిన వాడెవడుంటాడు? కాబట్టి మీరు ఖరారు చేసిన ఈ వర్తకానికిగాను సంబరపడండి. ఘనవిజయం అంటే ఇదే. 9:112 التَّائِبُونَ الْعَابِدُونَ الْحَامِدُونَ السَّائِحُونَ الرَّاكِعُونَ السَّاجِدُونَ الْآمِرُونَ بِالْمَعْرُوفِ وَالنَّاهُونَ عَنِ الْمُنكَرِ وَالْحَافِظُونَ لِحُدُودِ اللَّهِ ۗ وَبَشِّرِ الْمُؤْمِنِينَ వారు ఎలాంటి వారంటే; (దైవసన్నిధిలో) పశ్చాత్తాపం చెందుతూ, ఆరాధనలు చేస్తూ ఉంటారు, అల్లాహ్ స్తోత్రం చేస్తారు, ఉపవాసాలుంటారు (లేక అల్లాహ్ మార్గంలో భూమి మీద సంచారం చేస్తూ ఉంటారు), అల్లాహ్ సమక్షంలో వంగుతూ, సాష్టాంగపడుతూ ఉంటారు. మంచి పనుల గురించి ప్రబోధిస్తూ, చెడు విషయాల నుంచి నిరోధిస్తూ ఉంటారు. ఇంకా అల్లాహ్ నిర్థారించిన హద్దులను కాపాడుతారు. ఇలాంటి విశ్వాసులకు (ఓ ప్రవక్తా!) శుభవార్తను వినిపించు. 9:113 مَا كَانَ لِلنَّبِيِّ وَالَّذِينَ آمَنُوا أَن يَسْتَغْفِرُوا لِلْمُشْرِكِينَ وَلَوْ كَانُوا أُولِي قُرْبَىٰ مِن بَعْدِ مَا تَبَيَّنَ لَهُمْ أَنَّهُمْ أَصْحَابُ الْجَحِيمِ ముష్రిక్కులు బంధువులైనా సరే, వారు నరకవాసులని స్పష్టమైపోయిన తరువాత వారి మన్నింపుకోసం దైవాన్ని వేడుకోవటం ప్రవక్తకుగానీ, విశ్వాసులకుగానీ ఎంత మాత్రం తగదు. 9:114 وَمَا كَانَ اسْتِغْفَارُ إِبْرَاهِيمَ لِأَبِيهِ إِلَّا عَن مَّوْعِدَةٍ وَعَدَهَا إِيَّاهُ فَلَمَّا تَبَيَّنَ لَهُ أَنَّهُ عَدُوٌّ لِّلَّهِ تَبَرَّأَ مِنْهُ ۚ إِنَّ إِبْرَاهِيمَ لَأَوَّاهٌ حَلِيمٌ మరి ఇబ్రాహీము (అలైహిస్సలాం) తన తండ్రి మన్నింపుకై ప్రార్థించాడంటే, అతను తండ్రికిచ్చిన మాటప్రకారం అలా చేశాడు. అయితే అతని తండ్రి అల్లాహ్ విరోధి అని స్పష్టమవగానే అతని పట్ల విసిగిపోయాడు. నిశ్చయంగా ఇబ్రాహీము (అలైహిస్సలాం) మృదుమనస్కుడు, సహనశీలి. 9:115 وَمَا كَانَ اللَّهُ لِيُضِلَّ قَوْمًا بَعْدَ إِذْ هَدَاهُمْ حَتَّىٰ يُبَيِّنَ لَهُم مَّا يَتَّقُونَ ۚ إِنَّ اللَّهَ بِكُلِّ شَيْءٍ عَلِيمٌ అల్లాహ్ ఏ జాతికైనా సన్మార్గం చూపిన తరువాత – ఆ జాతి ప్రజలు మానుకోవలసిన విషయాలను వారికి విడమరచి చెప్పనంతవరకూ – వారిని అపమార్గానికిలోను చేయడు. నిశ్చయంగా అల్లాహ్‌కు ప్రతిదీ తెలుసు. 9:116 إِنَّ اللَّهَ لَهُ مُلْكُ السَّمَاوَاتِ وَالْأَرْضِ ۖ يُحْيِي وَيُمِيتُ ۚ وَمَا لَكُم مِّن دُونِ اللَّهِ مِن وَلِيٍّ وَلَا نَصِيرٍ నిస్సందేహంగా భూమ్యాకాశాల సామ్రాజ్యం అల్లాహ్‌దే. జీవింపజేసేదీ, మరణాన్ని ప్రసాదించేదీ ఆయనే. అల్లాహ్ తప్ప మీకు మరో సంరక్షకుడుగానీ, సహాయకుడుగానీ లేడు. 9:117 لَّقَد تَّابَ اللَّهُ عَلَى النَّبِيِّ وَالْمُهَاجِرِينَ وَالْأَنصَارِ الَّذِينَ اتَّبَعُوهُ فِي سَاعَةِ الْعُسْرَةِ مِن بَعْدِ مَا كَادَ يَزِيغُ قُلُوبُ فَرِيقٍ مِّنْهُمْ ثُمَّ تَابَ عَلَيْهِمْ ۚ إِنَّهُ بِهِمْ رَءُوفٌ رَّحِيمٌ ప్రవక్త వైపుకు, కష్టకాలంలో ప్రవక్తను వెన్నంటివున్న ముహాజిర్ల, అన్సార్ల వైపుకు అల్లాహ్ (దయాభావంతో) మరలాడు, వారిలో కొందరి హృదయాలు తడబాటుకు లోనైనప్పుడు, తర్వాత ఆయన వారి పొరపాటును మన్నించాడు. నిశ్చయంగా ఆయన వారియెడల వాత్సల్యం కలవాడు, కరుణామయుడు. 9:118 وَعَلَى الثَّلَاثَةِ الَّذِينَ خُلِّفُوا حَتَّىٰ إِذَا ضَاقَتْ عَلَيْهِمُ الْأَرْضُ بِمَا رَحُبَتْ وَضَاقَتْ عَلَيْهِمْ أَنفُسُهُمْ وَظَنُّوا أَن لَّا مَلْجَأَ مِنَ اللَّهِ إِلَّا إِلَيْهِ ثُمَّ تَابَ عَلَيْهِمْ لِيَتُوبُوا ۚ إِنَّ اللَّهَ هُوَ التَّوَّابُ الرَّحِيمُ ఏ 'ముగ్గురి' వ్యవహారం వాయిదా వేయబడిందో వారివైపుకు కూడా (అల్లాహ్ దయతో మరలాడు). భూమి విశాలంగా ఉండి కూడా వారికి ఇరుకైపోయింది. వారి ప్రాణాలు కూడా వారికి భారమై పోయాయి. అల్లాహ్ పట్టునుంచి తమను కాపాడుకోవటానికి ఆయన వైపుకు మరలటం తప్ప మార్గాంతరం లేదని వారు గ్రహించారు. ఇక మీదట కూడా వారు ఈ విధంగా మరలివచ్చేటందుకుగాను అల్లాహ్ వారివైపుకు మరలాడు. నిశ్చయంగా అల్లాహ్ అమితంగా పశ్చాత్తాపాన్ని స్వీకరించేవాడు, అపారంగా కరుణించేవాడూను. 9:119 يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا اتَّقُوا اللَّهَ وَكُونُوا مَعَ الصَّادِقِينَ ఓ విశ్వాసులారా! అల్లాహ్‌కు భయపడండి. సత్యవంతుల వెంట ఉండండి. 9:120 مَا كَانَ لِأَهْلِ الْمَدِينَةِ وَمَنْ حَوْلَهُم مِّنَ الْأَعْرَابِ أَن يَتَخَلَّفُوا عَن رَّسُولِ اللَّهِ وَلَا يَرْغَبُوا بِأَنفُسِهِمْ عَن نَّفْسِهِ ۚ ذَٰلِكَ بِأَنَّهُمْ لَا يُصِيبُهُمْ ظَمَأٌ وَلَا نَصَبٌ وَلَا مَخْمَصَةٌ فِي سَبِيلِ اللَّهِ وَلَا يَطَئُونَ مَوْطِئًا يَغِيظُ الْكُفَّارَ وَلَا يَنَالُونَ مِنْ عَدُوٍّ نَّيْلًا إِلَّا كُتِبَ لَهُم بِهِ عَمَلٌ صَالِحٌ ۚ إِنَّ اللَّهَ لَا يُضِيعُ أَجْرَ الْمُحْسِنِينَ దైవప్రవక్తను విడిచి వెనుక ఉండి పోవటం మదీనాలో నివసించే వారికి గానీ, చుట్టుప్రక్కల నివసించే పల్లెటూరి వాళ్ళకుగానీ ఏ మాత్రం శోభాయమానం కాదు. తమ ప్రాణాలను ఆయన ప్రాణంకన్నా మిన్నగా భావించటం కూడా వారికి తగదు. ఎందుకంటే దైవమార్గంలో వారికి దాహం అయినా, అలసట కలిగినా, ఆకలైనా, అవిశ్వాసులను కోపం తెప్పించే స్థలం గుండా వారు సాగిపోయినా, శత్రువుల సంగతి చూసుకున్నా- వాటన్నింటిపై వారి పేర సత్కార్యం లిఖించబడుతుంది. ఎట్టి పరిస్థితిలోనూ అల్లాహ్ సద్వర్తనుల పుణ్యఫలాన్ని వృధా కానివ్వడు. 9:121 وَلَا يُنفِقُونَ نَفَقَةً صَغِيرَةً وَلَا كَبِيرَةً وَلَا يَقْطَعُونَ وَادِيًا إِلَّا كُتِبَ لَهُمْ لِيَجْزِيَهُمُ اللَّهُ أَحْسَنَ مَا كَانُوا يَعْمَلُونَ అలాగే వారు (దైవ మార్గంలో) చిన్నమొత్తంలో ఖర్చు చేసినా, పెద్ద మొత్తంలో ఖర్చు చేసినా, ఏ లోయను దాటివెళ్ళినా - అల్లాహ్ వారి సత్కార్యాలకు అత్యుత్తమ ప్రతిఫలం ప్రసాదించే నిమిత్తం – అవన్నీ వారి పేర వ్రాయబడ్డాయి. 9:122 وَمَا كَانَ الْمُؤْمِنُونَ لِيَنفِرُوا كَافَّةً ۚ فَلَوْلَا نَفَرَ مِن كُلِّ فِرْقَةٍ مِّنْهُمْ طَائِفَةٌ لِّيَتَفَقَّهُوا فِي الدِّينِ وَلِيُنذِرُوا قَوْمَهُمْ إِذَا رَجَعُوا إِلَيْهِمْ لَعَلَّهُمْ يَحْذَرُونَ విశ్వాసులందరూ (పోరాటానికి) బయలుదేరవలసిన అవసరంలేదు. కాబట్టి వారి ప్రతి పెద్ద సమూహంలో నుంచి ఒక చిన్న సమూహం బయలుదేరి (తేచాలు. మిగిలినవారు) ధర్మావగాహనను పెంపొందించుకుని, వారు తమ వద్దకు తిరిగి వచ్చినప్పుడు, వారు భయభక్తులను అలవరచుకునేందుకుగాను వారికి భయబోధ చేయాల్సింది. కాని ఇలా ఎందుకు జరగలేదు? 9:123 يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا قَاتِلُوا الَّذِينَ يَلُونَكُم مِّنَ الْكُفَّارِ وَلْيَجِدُوا فِيكُمْ غِلْظَةً ۚ وَاعْلَمُوا أَنَّ اللَّهَ مَعَ الْمُتَّقِينَ ఓ విశ్వాసులారా! మీ పరిసరాలలో ఉన్న అవిశ్వాసులతో పోరాడండి. వారు మీలోని కాఠిన్యాన్ని చవి చూడాలి. అల్లాహ్ భయభక్తులు గలవారికి తోడుగా ఉన్నాడని తెలుసుకోండి. 9:124 وَإِذَا مَا أُنزِلَتْ سُورَةٌ فَمِنْهُم مَّن يَقُولُ أَيُّكُمْ زَادَتْهُ هَٰذِهِ إِيمَانًا ۚ فَأَمَّا الَّذِينَ آمَنُوا فَزَادَتْهُمْ إِيمَانًا وَهُمْ يَسْتَبْشِرُونَ ఏదైనా ఒక సూరా అవతరించినప్పుడల్లా కపటుల్లోని కొందరు, “ఈ సూరా మీలో ఎవరి విశ్వాసాన్ని వృద్ధి పరచింది?” అని (వెటకారంగా) అడుగుతారు. విశ్వాసుల విశ్వాసాన్ని ఈ సూరా వృద్ధి చేసింది. దానిపై వారు సంతోషిస్తున్నారు. 9:125 وَأَمَّا الَّذِينَ فِي قُلُوبِهِم مَّرَضٌ فَزَادَتْهُمْ رِجْسًا إِلَىٰ رِجْسِهِمْ وَمَاتُوا وَهُمْ كَافِرُونَ కాగా; ఎవరి హృదయాలు రోగగ్రస్తమై ఉన్నాయో వారి అశుద్ధతలో ఈ సూరా మరింత అశుద్ధతను పెంచింది. ఆఖరికి వారు అవిశ్వాస స్థితిలోనే చచ్చారు. 9:126 أَوَلَا يَرَوْنَ أَنَّهُمْ يُفْتَنُونَ فِي كُلِّ عَامٍ مَّرَّةً أَوْ مَرَّتَيْنِ ثُمَّ لَا يَتُوبُونَ وَلَا هُمْ يَذَّكَّرُونَ ఏమిటీ, ప్రతి ఏటా ఒకటి లేక రెండుసార్లు తాము ఏదో ఒక ఆపదలో చిక్కుకుపోవటాన్ని వారు గమనించటంలేదా? అయినా సరే వారు పశ్చాత్తాపం చెందటంగానీ, గుణపాఠం నేర్చుకోవటంగానీ జరగటం లేదు. 9:127 وَإِذَا مَا أُنزِلَتْ سُورَةٌ نَّظَرَ بَعْضُهُمْ إِلَىٰ بَعْضٍ هَلْ يَرَاكُم مِّنْ أَحَدٍ ثُمَّ انصَرَفُوا ۚ صَرَفَ اللَّهُ قُلُوبَهُم بِأَنَّهُمْ قَوْمٌ لَّا يَفْقَهُونَ ఏదైనా సూరా అవతరించినప్పుడు వారు ఒకరినొకరు చూసుకుంటారు. “ఎవడైనా (ముస్లిం) మిమ్మల్ని చూడటం లేదు కదా!”(అన్నది ఆ చూపులకు అర్థం). ఆ తరువాత (నెమ్మదిగా) వెళ్లిపోతారు. అల్లాహ్ వారి హృదయాలను త్రిప్పేశాడు. ఎందుకంటే వారు బొత్తిగా అర్థం చేసుకోనివారు. 9:128 لَقَدْ جَاءَكُمْ رَسُولٌ مِّنْ أَنفُسِكُمْ عَزِيزٌ عَلَيْهِ مَا عَنِتُّمْ حَرِيصٌ عَلَيْكُم بِالْمُؤْمِنِينَ رَءُوفٌ رَّحِيمٌ మీ దగ్గరకు స్వయంగా మీలోనుంచే ఒక ప్రవక్త వచ్చాడు. మీకు కష్టం కలిగించే ప్రతిదీ అతనికి బాధ కలిగిస్తుంది. అతను మీ మేలును ఎంతగానో కోరుకుంటున్నాడు. విశ్వాసుల యెడల అతను వాత్సల్యం కలవాడు, దయామయుడు. 9:129 فَإِن تَوَلَّوْا فَقُلْ حَسْبِيَ اللَّهُ لَا إِلَٰهَ إِلَّا هُوَ ۖ عَلَيْهِ تَوَكَّلْتُ ۖ وَهُوَ رَبُّ الْعَرْشِ الْعَظِيمِ ఇక వారు గనక వైముఖ్యధోరణిని కనబరుస్తే “నాకు అల్లాహ్ చాలు. ఆయన తప్ప వేరొక ఆరాధ్యుడు లేనేలేడు. నేను మాత్రం ఆయన్నే నమ్ముకున్నాను. ఆయన మహోన్నతమైన పీఠానికి (అర్ష్‌కు) అధిపతి” అని (ఓ ప్రవక్తా!) వారికి చెప్పు. ఈ తెలుగు ఖుర్ఆన్ శాంతి మార్గం పబ్లికేషన్ వారు ప్రచురించారు. వారి అనుమతితో ఈ వెబ్ పోర్టల్ పై వేయబడింది. |