Translation
| 99. సూరా అజ్ జిలజాల్ 99:1 إِذَا زُلْزِلَتِ الْأَرْضُ زِلْزَالَهَا భూమి చాలా తీవ్రమైన తన ప్రకంపనలతో కంపింపజేయబడినప్పుడు, 99:2 وَأَخْرَجَتِ الْأَرْضُ أَثْقَالَهَا మరి భూమి తన బరువులన్నింటినీ తీసి బయట పడవేసినప్పుడు, 99:3 وَقَالَ الْإِنسَانُ مَا لَهَا “అరె! దీనికేమైపోయిందీ?” అని మనిషి (కలవరపడుతూ)అంటాడు. 99:4 يَوْمَئِذٍ تُحَدِّثُ أَخْبَارَهَا ఆ రోజు భూమి తన సంగతులన్నీ వివరిస్తుంది. 99:5 بِأَنَّ رَبَّكَ أَوْحَىٰ لَهَا ఎందుకంటే నీ ప్రభువు దానికి, ఆ మేరకు ఆజ్ఞాపించి ఉంటాడు. 99:6 يَوْمَئِذٍ يَصْدُرُ النَّاسُ أَشْتَاتًا لِّيُرَوْا أَعْمَالَهُمْ ఆ రోజు జనులు – వారి కర్మలు వారికి చూపబడేందుకుగాను – వేర్వేరు బృందాలుగా తరలి వస్తారు. 99:7 فَمَن يَعْمَلْ مِثْقَالَ ذَرَّةٍ خَيْرًا يَرَهُ కనుక ఎవడు అణుమాత్రం సత్కార్యం చేసినా దాన్ని అతను చూసుకుంటాడు. 99:8 وَمَن يَعْمَلْ مِثْقَالَ ذَرَّةٍ شَرًّا يَرَهُ మరెవడు అణుమాత్రం దుష్కార్యం చేసినా దాన్ని అతను చూసుకుంటాడు. ఈ తెలుగు ఖుర్ఆన్ శాంతి మార్గం పబ్లికేషన్ వారు ప్రచురించారు. వారి అనుమతితో ఈ వెబ్ పోర్టల్ పై వేయబడింది. |