Translation
| 97. సూరా అల్ ఖద్ర్ 97:1 إِنَّا أَنزَلْنَاهُ فِي لَيْلَةِ الْقَدْرِ నిశ్చయంగా మేము దీనిని (ఈ ఖుర్ఆనును) ఘనమైన రాత్రి యందు అవతరింపజేశాము. 97:2 وَمَا أَدْرَاكَ مَا لَيْلَةُ الْقَدْرِ ఘనమైన రాత్రి గురించి నువ్వేమనుకున్నావు? 97:3 لَيْلَةُ الْقَدْرِ خَيْرٌ مِّنْ أَلْفِ شَهْرٍ ఘనమైన రాత్రి వెయ్యి నెలల కంటే కూడా మేలైనది. 97:4 تَنَزَّلُ الْمَلَائِكَةُ وَالرُّوحُ فِيهَا بِإِذْنِ رَبِّهِم مِّن كُلِّ أَمْرٍ ఆ రాత్రి యందు దైవదూతలు, ఆత్మ (జిబ్రయీల్) తమ ప్రభువు ఉత్తర్వుపై సమస్త విషయాల (నిర్వహణ) నిమిత్తం (దివి నుంచి భూమికి) దిగివస్తారు. 97:5 سَلَامٌ هِيَ حَتَّىٰ مَطْلَعِ الْفَجْرِ ఆ రాత్రి అసాంతం శాంతియుతమైనది – తెల్లవారే వరకూ (అది ఉంటుంది). ఈ తెలుగు ఖుర్ఆన్ శాంతి మార్గం పబ్లికేషన్ వారు ప్రచురించారు. వారి అనుమతితో ఈ వెబ్ పోర్టల్ పై వేయబడింది. |