Translation
| 95. సూరా అత్ తతీన్ 95:1 وَالتِّينِ وَالزَّيْتُونِ అత్తి పండు సాక్షిగా! ఆలివు సాక్షిగా! 95:2 وَطُورِ سِينِينَ సినాయ్ పర్వతం సాక్షిగా! 95:3 وَهَٰذَا الْبَلَدِ الْأَمِينِ శాంతియుతమైన ఈ నగరం (మక్కా) సాక్షిగా! 95:4 لَقَدْ خَلَقْنَا الْإِنسَانَ فِي أَحْسَنِ تَقْوِيمٍ నిశ్చయంగా మేము మానవుణ్ణి అత్యుత్తమమైన ఆకృతిలో సృజించాము. 95:5 ثُمَّ رَدَدْنَاهُ أَسْفَلَ سَافِلِينَ అటుపిమ్మట అతణ్ణి అధమాతి అధమ స్థానానికి మళ్ళించాము. 95:6 إِلَّا الَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ فَلَهُمْ أَجْرٌ غَيْرُ مَمْنُونٍ అయితే విశ్వసించి, ఆ పైన మంచి పనులు చేసిన వారికి మాత్రం ఎన్నటికీ తరగని పుణ్యఫలం ఉంది. 95:7 فَمَا يُكَذِّبُكَ بَعْدُ بِالدِّينِ మరైతే (ఓ మానవుడా!) ప్రతిఫల దినాన్ని ధిక్కరించమని ఏ వస్తువు నిన్ను పురమాయిస్తున్నది. 95:8 أَلَيْسَ اللَّهُ بِأَحْكَمِ الْحَاكِمِينَ ఏమిటి, అధికారులందరికంటే అల్లాహ్ గొప్ప అధికారి కాడా? ఈ తెలుగు ఖుర్ఆన్ శాంతి మార్గం పబ్లికేషన్ వారు ప్రచురించారు. వారి అనుమతితో ఈ వెబ్ పోర్టల్ పై వేయబడింది. |