Translation
| 93. సూరా అజ్ జుహా 93:1 وَالضُّحَىٰ పొద్దెక్కుతున్నప్పటి ఎండ సాక్షిగా! 93:2 وَاللَّيْلِ إِذَا سَجَىٰ కుదుటపడిన రాత్రి సాక్షిగా! 93:3 مَا وَدَّعَكَ رَبُّكَ وَمَا قَلَىٰ (ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహివ సల్లం!) నీ ప్రభువు నిన్ను వదలిపెట్టనూ లేదు, నీతో విసిగిపోనూ లేదు. 93:4 وَلَلْآخِرَةُ خَيْرٌ لَّكَ مِنَ الْأُولَىٰ నిశ్చయంగా నీ కోసం చివరి కాలం తొలికాలం కన్నా మేలైనదిగా ఉంటుంది. 93:5 وَلَسَوْفَ يُعْطِيكَ رَبُّكَ فَتَرْضَىٰ నీ ప్రభువు త్వరలోనే నీకు (గొప్ప బహుమానం) వొసగుతాడు. దాంతో నీవు సంతోషపడతావు. 93:6 أَلَمْ يَجِدْكَ يَتِيمًا فَآوَىٰ ఏమిటి, నువ్వు అనాధగా ఉండటం చూసి, ఆయన నీకు ఆశ్రయం కల్పించలేదా? 93:7 وَوَجَدَكَ ضَالًّا فَهَدَىٰ మరి నిన్ను మార్గం తెలియనివానిగా గ్రహించి, సన్మార్గం చూపలేదా? 93:8 وَوَجَدَكَ عَائِلًا فَأَغْنَىٰ ఇంకా – నిన్ను అభాగ్యునిగా పొంది భాగ్యవంతునిగా చేయలేదా? 93:9 فَأَمَّا الْيَتِيمَ فَلَا تَقْهَرْ కాబట్టి (ఓ ప్రవక్తా!) నువ్వు కూడా అనాధ పట్ల దురుసుగా ప్రవర్తించకు. 93:10 وَأَمَّا السَّائِلَ فَلَا تَنْهَرْ యాచించేవానిని కసిరికొట్టకు. 93:11 وَأَمَّا بِنِعْمَةِ رَبِّكَ فَحَدِّثْ ఇంకా నీ ప్రభువు అనుగ్రహాలను గురించి పొగుడుతూ ఉండు. ఈ తెలుగు ఖుర్ఆన్ శాంతి మార్గం పబ్లికేషన్ వారు ప్రచురించారు. వారి అనుమతితో ఈ వెబ్ పోర్టల్ పై వేయబడింది. |