Translation
| 91. సూరా ఆష్ షమ్స్ 91:1 وَالشَّمْسِ وَضُحَاهَا సూర్యుని సాక్షిగా! దాని ఎండ సాక్షిగా! 91:2 وَالْقَمَرِ إِذَا تَلَاهَا (సూర్యుణ్ణి) వెంబడిస్తూ వచ్చేటప్పటి చంద్రుని సాక్షిగా! 91:3 وَالنَّهَارِ إِذَا جَلَّاهَا (సూర్యుణ్ణి) దేదీప్యమానం చేసినప్పటి పగటి సాక్షిగా! 91:4 وَاللَّيْلِ إِذَا يَغْشَاهَا (సూరీడును) క్రమ్ముకున్నప్పటి రాత్రి సాక్షిగా! 91:5 وَالسَّمَاءِ وَمَا بَنَاهَا ఆకాశం సాక్షిగా! దాని (అద్భుత) నిర్మాణం సాక్షిగా! 91:6 وَالْأَرْضِ وَمَا طَحَاهَا భూమి సాక్షిగా! దాన్ని సుగమం చేసిన ప్రక్రియ సాక్షిగా! 91:7 وَنَفْسٍ وَمَا سَوَّاهَا ఆత్మ సాక్షిగా! దాన్ని తీర్చిదిద్దిన వాని సాక్షిగా! 91:8 فَأَلْهَمَهَا فُجُورَهَا وَتَقْوَاهَا మరి (ఆయన) దానికి చెడునూ, చెడు నుంచి తప్పించుకుని మసలుకునే ప్రేరణను ఇచ్చాడు. 91:9 قَدْ أَفْلَحَ مَن زَكَّاهَا దానిని (అంతరాత్మను, మనసును) పరిశుద్ధ పరచుకున్నవాడు సాఫల్యం పొందాడు. 91:10 وَقَدْ خَابَ مَن دَسَّاهَا దాన్ని అణచి పెట్టినవాడు నష్టపోయాడు. 91:11 كَذَّبَتْ ثَمُودُ بِطَغْوَاهَا సమూదు (జాతి) వారు తమ పొగరు మూలంగా (వారి ప్రవక్తను) ధిక్కరించారు. 91:12 إِذِ انبَعَثَ أَشْقَاهَا అప్పుడు వారిలోని ఒక పెద్ద దౌర్భాగ్యుడు (వారి తలబిరుసుపోకడలకు సారధిగా) నిలబడ్డాడు. 91:13 فَقَالَ لَهُمْ رَسُولُ اللَّهِ نَاقَةَ اللَّهِ وَسُقْيَاهَا “మీరు దేవుని ఈ ఆడ ఒంటె విషయంలో, దాని నీళ్ళ వంతు విషయంలో జాగ్రత్తగా ఉండండి” అని దైవప్రవక్త వారిని హెచ్చరించాడు. 91:14 فَكَذَّبُوهُ فَعَقَرُوهَا فَدَمْدَمَ عَلَيْهِمْ رَبُّهُم بِذَنبِهِمْ فَسَوَّاهَا కాని వారు మాత్రం తమ ప్రవక్త (మాటల)ను త్రోసిపుచ్చి, దాని గిట్టెలను నరికి (చంపేశారు). అంతే! వారి ప్రభువు వారి దురాగతాల కారణంగా వారిపై వినాశాన్ని పంపాడు. వారందరినీ సమానం (నేలమట్టం) చేశాడు. 91:15 وَلَا يَخَافُ عُقْبَاهَا దాని పరిణామాలను గురించి ఆయన ఏమాత్రం భయపడడు. ఈ తెలుగు ఖుర్ఆన్ శాంతి మార్గం పబ్లికేషన్ వారు ప్రచురించారు. వారి అనుమతితో ఈ వెబ్ పోర్టల్ పై వేయబడింది. |