Translation
| 90. సూరా అల్ బలద్ 90:1 لَا أُقْسِمُ بِهَٰذَا الْبَلَدِ ఈ నగరం తోడుగా (నేను చెబుతున్నాను)! 90:2 وَأَنتَ حِلٌّ بِهَٰذَا الْبَلَدِ (ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహివ సల్లం)! నువ్వు ఈ నగరంలో స్వేచ్ఛావాసివి. 90:3 وَوَالِدٍ وَمَا وَلَدَ కన్న తండ్రి (తోడుగా), అతను కన్న సంతానం (తోడుగా చెబుతున్నాను). 90:4 لَقَدْ خَلَقْنَا الْإِنسَانَ فِي كَبَدٍ నిశ్చయంగా మేము మనిషిని నిత్య కష్టాల్లో సృష్టించాము. 90:5 أَيَحْسَبُ أَن لَّن يَقْدِرَ عَلَيْهِ أَحَدٌ ఏమిటి, తనపై ఎవరి అదుపూ, అజమాయిషీ లేదని అతను అనుకుంటున్నాడా? 90:6 يَقُولُ أَهْلَكْتُ مَالًا لُّبَدًا “నేను రాసుల కొద్దీ ధనాన్ని ఖర్చుపెట్టాను తెలుసా!” అని అతను (గొప్పలు) చెప్పుకుంటున్నాడు. 90:7 أَيَحْسَبُ أَن لَّمْ يَرَهُ أَحَدٌ ఏమిటి, తననెవరూ చూడలేదని అతను తలపోస్తున్నాడా? 90:8 أَلَمْ نَجْعَل لَّهُ عَيْنَيْنِ ఏమిటి, మేమతనికి రెండు కళ్ళు సృజించలేదా? 90:9 وَلِسَانًا وَشَفَتَيْنِ ఒక నాలుకను, రెండు పెదవులను (చేయలేదా)? 90:10 وَهَدَيْنَاهُ النَّجْدَيْنِ మరి మేమతనికి రెండు మార్గాలు కూడా చూపాము. 90:11 فَلَا اقْتَحَمَ الْعَقَبَةَ కాని అతను కఠినమైన కనుమను దాటిపోలేదు. 90:12 وَمَا أَدْرَاكَ مَا الْعَقَبَةُ కఠినమైన కనుమ అంటే ఏమిటో నీకు తెలుసా? 90:13 فَكُّ رَقَبَةٍ ఏ (బానిస లేక బానిసరాలి) మెడనైనా (బానిసత్వం నుండి) విడిపించటం. 90:14 أَوْ إِطْعَامٌ فِي يَوْمٍ ذِي مَسْغَبَةٍ లేదా ఆకలిగొన్న నాడు అన్నం పెట్టడం - 90:15 يَتِيمًا ذَا مَقْرَبَةٍ బంధుత్వంగల ఏ అనాధకు గాని, 90:16 أَوْ مِسْكِينًا ذَا مَتْرَبَةٍ మట్టిలో పడిఉన్న ఏ నిరుపేదకు గానీ (అన్నం పెట్టడం)! 90:17 ثُمَّ كَانَ مِنَ الَّذِينَ آمَنُوا وَتَوَاصَوْا بِالصَّبْرِ وَتَوَاصَوْا بِالْمَرْحَمَةِ అటుపిమ్మట, విశ్వసించి పరస్పరం సహనబోధ చేసుకుంటూ, ఒండొకరికి దయాదాక్షిణ్యాల గురించి తాకీదు చేసుకునేవారైపోవాలి. 90:18 أُولَٰئِكَ أَصْحَابُ الْمَيْمَنَةِ వీళ్ళే కుడిపక్షం వారు (భాగ్యవంతులు). 90:19 وَالَّذِينَ كَفَرُوا بِآيَاتِنَا هُمْ أَصْحَابُ الْمَشْأَمَةِ మరెవరైతే మా ఆయతుల పట్ల తిరస్కార వైఖరిని అవలంబించారో వారు దౌర్భాగ్యులు. 90:20 عَلَيْهِمْ نَارٌ مُّؤْصَدَةٌ వారిని (అన్ని వైపుల నుంచి) అగ్ని చుట్టుముట్టుతుంది. ఈ తెలుగు ఖుర్ఆన్ శాంతి మార్గం పబ్లికేషన్ వారు ప్రచురించారు. వారి అనుమతితో ఈ వెబ్ పోర్టల్ పై వేయబడింది. |