Translation
| 88. సూరా అల్ గాషియ హ్ 88:1 هَلْ أَتَاكَ حَدِيثُ الْغَاشِيَةِ క్రమ్ముకునే ఆపద సంగతిగాని నీకు చేరిందా? 88:2 وُجُوهٌ يَوْمَئِذٍ خَاشِعَةٌ ఆ రోజు ఎన్నో ముఖాలు అవమానంతో పాలిపోయి ఉంటాయి. 88:3 عَامِلَةٌ نَّاصِبَةٌ శ్రమిస్తూ, అలసి సొలసి ఉంటాయి. 88:4 تَصْلَىٰ نَارًا حَامِيَةً వారు మండే అగ్నికి ఆహుతి అవుతారు. 88:5 تُسْقَىٰ مِنْ عَيْنٍ آنِيَةٍ వారికి ఉడికే చెలమ నీరు త్రాగించబడుతుంది. 88:6 لَّيْسَ لَهُمْ طَعَامٌ إِلَّا مِن ضَرِيعٍ వారికి తినడానికి ముండ్ల చెట్టు తప్ప వేరొకటి ఆహారంగా దొరకదు. 88:7 لَّا يُسْمِنُ وَلَا يُغْنِي مِن جُوعٍ అది వారిని లావుగానూ చేయదు, వారి ఆకలిని కూడా తీర్చదు. 88:8 وُجُوهٌ يَوْمَئِذٍ نَّاعِمَةٌ మరెన్నో ముఖాలు ఆనాడు నవనవలాడుతూ ఉంటాయి. 88:9 لِّسَعْيِهَا رَاضِيَةٌ వారు తమ కృషిపై సంతోషంతో ఉంటారు. 88:10 فِي جَنَّةٍ عَالِيَةٍ ఉన్నతమైన స్వర్గంలో ఉంటారు. 88:11 لَّا تَسْمَعُ فِيهَا لَاغِيَةً వారక్కడ ఎలాంటి అపసవ్యమైన మాట వినరు. 88:12 فِيهَا عَيْنٌ جَارِيَةٌ అందులో (అద్భుతంగా) ప్రవహించే ఒక సెలయేరు ఉంటుంది. 88:13 فِيهَا سُرُرٌ مَّرْفُوعَةٌ (ఇంకా) అందులో (రాజసం ఉట్టిపడే) ఎత్తైన పీఠాలు వేయబడి ఉంటాయి. 88:14 وَأَكْوَابٌ مَّوْضُوعَةٌ వారికెదురుగా (మధు) పాత్రలు పేర్చబడి ఉంటాయి. 88:15 وَنَمَارِقُ مَصْفُوفَةٌ వరుసగా వేయబడిన దిండ్లు ఉంటాయి. 88:16 وَزَرَابِيُّ مَبْثُوثَةٌ అన్ని వైపులా పట్టు తివాచీలు పరచబడి ఉంటాయి. 88:17 أَفَلَا يَنظُرُونَ إِلَى الْإِبِلِ كَيْفَ خُلِقَتْ ఏమిటి, ఒంటెలు ఎలా సృష్టించబడ్డాయో వారు చూడటం లేదా? 88:18 وَإِلَى السَّمَاءِ كَيْفَ رُفِعَتْ ఆకాశం ఎలా ఎత్తుగా చేయబడిందో వారు గమనించటం లేదా? 88:19 وَإِلَى الْجِبَالِ كَيْفَ نُصِبَتْ పర్వతాలు ఎలా పాతిపెట్టబడ్డాయో తిలకించటం లేదా? 88:20 وَإِلَى الْأَرْضِ كَيْفَ سُطِحَتْ భూమి ఎలా (విశాలంగా) పరచబడి ఉన్నదో వారు వీక్షించటం లేదా? 88:21 فَذَكِّرْ إِنَّمَا أَنتَ مُذَكِّرٌ కనుక (ఓ ప్రవక్తా!) నీవు మాత్రం బోధపరుస్తూ ఉండు. నీవు హితబోధ చేసేవాడివి మాత్రమే. 88:22 لَّسْتَ عَلَيْهِم بِمُصَيْطِرٍ నీవు వారిపై కావలివాడవు కావు. 88:23 إِلَّا مَن تَوَلَّىٰ وَكَفَرَ అయితే విముఖత చూపి, తిరస్కరించినవాణ్ణి, 88:24 فَيُعَذِّبُهُ اللَّهُ الْعَذَابَ الْأَكْبَرَ అల్లాహ్ అతనికి చాలా పెద్ద శిక్ష విధిస్తాడు. 88:25 إِنَّ إِلَيْنَا إِيَابَهُمْ ఎట్టి పరిస్థితిలోనూ వారు మా వద్దకే తిరిగి రావలసి ఉన్నది. 88:26 ثُمَّ إِنَّ عَلَيْنَا حِسَابَهُم మరి వారి నుండి లెక్క తీసుకునే బాధ్యత మాపైనే ఉంది. ఈ తెలుగు ఖుర్ఆన్ శాంతి మార్గం పబ్లికేషన్ వారు ప్రచురించారు. వారి అనుమతితో ఈ వెబ్ పోర్టల్ పై వేయబడింది. |