Translation
| 87. సూరా అల్ ఆలా 87:1 سَبِّحِ اسْمَ رَبِّكَ الْأَعْلَى (ఓ ప్రవక్తా!) సర్వోన్నతుడైన నీ ప్రభువు నామం యెక్క పవిత్రతను కొనియాడు. 87:2 الَّذِي خَلَقَ فَسَوَّىٰ ఆయనే సృష్టించాడు, మరి ఆపైన తీర్చిదిద్దాడు. 87:3 وَالَّذِي قَدَّرَ فَهَدَىٰ ఆయనే (కావలసిన వాటిని తగురీతిలో) నిర్ధారించాడు. పిదప మార్గం చూపించాడు. 87:4 وَالَّذِي أَخْرَجَ الْمَرْعَىٰ మరి ఆయనే పచ్చిక బయళ్ళను ఉత్పన్నం చేశాడు. 87:5 فَجَعَلَهُ غُثَاءً أَحْوَىٰ ఆపైన వాటిని నల్లని చెత్తకుప్పగా చేసేశాడు. 87:6 سَنُقْرِئُكَ فَلَا تَنسَىٰ మేము నిన్ను చదివిస్తాము – మరి నువ్వు దానిని మరువలేవు. 87:7 إِلَّا مَا شَاءَ اللَّهُ ۚ إِنَّهُ يَعْلَمُ الْجَهْرَ وَمَا يَخْفَىٰ అయితే అల్లాహ్ తలచినది మాత్రం (మరువగలవు). ఆయన బహిర్గతమయ్యే దానినీ, గోప్యంగా ఉన్నదానినీ ఎరిగినవాడు. 87:8 وَنُيَسِّرُكَ لِلْيُسْرَىٰ (ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహివ సల్లం!) మేము నీకు సౌలభ్యాన్ని సమకూరుస్తాము. 87:9 فَذَكِّرْ إِن نَّفَعَتِ الذِّكْرَىٰ కనుక నీవు ఉపదేశం లాభదాయకం అయితే, ఉపదేశిస్తూ ఉండు. 87:10 سَيَذَّكَّرُ مَن يَخْشَىٰ (అల్లాహ్ పట్ల) భయమున్నవాడు ఉపదేశాన్ని గ్రహిస్తాడు. 87:11 وَيَتَجَنَّبُهَا الْأَشْقَى దౌర్భాగ్యుడు మాత్రమే దాన్ని దాట వేస్తాడు. 87:12 الَّذِي يَصْلَى النَّارَ الْكُبْرَىٰ వాడు పెద్ద (ఘోరమైన) అగ్నిలోకి ప్రవేశిస్తాడు. 87:13 ثُمَّ لَا يَمُوتُ فِيهَا وَلَا يَحْيَىٰ వాడందులో చావనైనా చావడు, బ్రతకనైనా బ్రతకడు. (రెంటికీ మధ్య దుర్భరస్థితిలో ఉంటాడు). 87:14 قَدْ أَفْلَحَ مَن تَزَكَّىٰ పవిత్రుడైనవాడు ఖచ్చితంగా సాఫల్యం పొందాడు. 87:15 وَذَكَرَ اسْمَ رَبِّهِ فَصَلَّىٰ అతను తన ప్రభువు నామాన్ని స్మరించాడు. నమాజు ఆచరించాడు. 87:16 بَلْ تُؤْثِرُونَ الْحَيَاةَ الدُّنْيَا కాని మీరు మాత్రం ప్రాపంచిక జీవితానికే ప్రాముఖ్యమిస్తున్నారు. 87:17 وَالْآخِرَةُ خَيْرٌ وَأَبْقَىٰ వాస్తవానికి పరలోకం ఎంతో మేలైనది, ఎప్పటికీ మిగిలి ఉండేది. 87:18 إِنَّ هَٰذَا لَفِي الصُّحُفِ الْأُولَىٰ ఈ విషయాలు మునుపటి గ్రంథాలలోనూ ఉన్నాయి. 87:19 صُحُفِ إِبْرَاهِيمَ وَمُوسَىٰ (అంటే) ఇబ్రాహీము, మూసాల గ్రంథాలలో! ఈ తెలుగు ఖుర్ఆన్ శాంతి మార్గం పబ్లికేషన్ వారు ప్రచురించారు. వారి అనుమతితో ఈ వెబ్ పోర్టల్ పై వేయబడింది. |