Translation
| 86. సూరా అత్ తారిఖ్ 86:1 وَالسَّمَاءِ وَالطَّارِقِ ఆకాశం సాక్షిగా! రాత్రి చీకటిలో ప్రస్ఫుటమయ్యే దాని సాక్షిగా! 86:2 وَمَا أَدْرَاكَ مَا الطَّارِقُ రాత్రిపూట ప్రస్ఫుటమయ్యేదేమిటో నీకు తెలుసా? 86:3 النَّجْمُ الثَّاقِبُ అది ప్రకాశించే నక్షత్రం. 86:4 إِن كُلُّ نَفْسٍ لَّمَّا عَلَيْهَا حَافِظٌ తనను కనిపెట్టుకుని ఉండే దూత లేకుండా ఏ ప్రాణి లేదు. 86:5 فَلْيَنظُرِ الْإِنسَانُ مِمَّ خُلِقَ ఇక మానవుడు, తాను దేంతో పుట్టించబడ్డాడో చూసుకోవాలి. 86:6 خُلِقَ مِن مَّاءٍ دَافِقٍ అతను ఎగిసిపడే నీటితో పుట్టించబడ్డాడు. 86:7 يَخْرُجُ مِن بَيْنِ الصُّلْبِ وَالتَّرَائِبِ అది వెన్నెముక, ఛాతీభాగం మధ్య నుండి వెలువడుతుంది. 86:8 إِنَّهُ عَلَىٰ رَجْعِهِ لَقَادِرٌ నిశ్చయంగా ఆయన, అతణ్ణి తిరిగి రప్పించుకునే శక్తిని కూడా కలిగి ఉన్నాడు. 86:9 يَوْمَ تُبْلَى السَّرَائِرُ ఆ రోజు లోగుట్టులన్నీ (రట్టయి) పలికించబడతాయి. 86:10 فَمَا لَهُ مِن قُوَّةٍ وَلَا نَاصِرٍ అప్పుడు అతనికంటూ ఏ (అధికార) బలమూ ఉండదు. ఏ సహాయకుడూ ఉండడు. 86:11 وَالسَّمَاءِ ذَاتِ الرَّجْعِ వర్షం గల ఆకాశం సాక్షిగా! 86:12 وَالْأَرْضِ ذَاتِ الصَّدْعِ బీటలు వారే భూమి సాక్షిగా! 86:13 إِنَّهُ لَقَوْلٌ فَصْلٌ నిశ్చయంగా ఇది (ఈ ఖుర్ఆన్) నిర్ణాయకమైన వాక్కు. 86:14 وَمَا هُوَ بِالْهَزْلِ ఇదేదో ఆషామాషీ విషయం కాదు. 86:15 إِنَّهُمْ يَكِيدُونَ كَيْدًا వీళ్ళు (ఈ అవిశ్వాసులు) కొన్ని పన్నాగాలు పన్నుతున్నారు. 86:16 وَأَكِيدُ كَيْدًا నేను కూడా ఒక పన్నాగం పన్నుతున్నాను. 86:17 فَمَهِّلِ الْكَافِرِينَ أَمْهِلْهُمْ رُوَيْدًا కాబట్టి (ఓ ప్రవక్తా!) నువ్వు అవిశ్వాసులకు కాస్త విడుపు ఇవ్వు. కొన్నాళ్ళ పాటు వారిని వదలిపెట్టు. ఈ తెలుగు ఖుర్ఆన్ శాంతి మార్గం పబ్లికేషన్ వారు ప్రచురించారు. వారి అనుమతితో ఈ వెబ్ పోర్టల్ పై వేయబడింది. |