Translation
| 85. సూరా అల్ బురూజ్ 85:1 وَالسَّمَاءِ ذَاتِ الْبُرُوجِ బురుజులు గల ఆకాశం సాక్షిగా! 85:2 وَالْيَوْمِ الْمَوْعُودِ వాగ్దానం చేయబడివున్న రోజు సాక్షిగా! 85:3 وَشَاهِدٍ وَمَشْهُودٍ సాక్ష్య దినం (సమావేశమైనవారి ) సాక్షిగా! సమావేశమైన చోటు సాక్షిగా! 85:4 قُتِلَ أَصْحَابُ الْأُخْدُودِ కందకం వాళ్ళు సర్వనాశనమయ్యారు. 85:5 النَّارِ ذَاتِ الْوَقُودِ అది ఇంధనంతో బాగా మండించబడిన అగ్ని. 85:6 إِذْ هُمْ عَلَيْهَا قُعُودٌ ఆ సమయంలో వాళ్ళు (కందకం వాళ్ళు) దాని చుట్టూ కూర్చున్నారు. 85:7 وَهُمْ عَلَىٰ مَا يَفْعَلُونَ بِالْمُؤْمِنِينَ شُهُودٌ తాము విశ్వాసుల (ముస్లింల) పట్ల చేస్తున్న దాన్ని (తమాషాగా) తిలకిస్తూ ఉన్నారు. 85:8 وَمَا نَقَمُوا مِنْهُمْ إِلَّا أَن يُؤْمِنُوا بِاللَّهِ الْعَزِيزِ الْحَمِيدِ ఇంతకీ ఆ విశ్వాసులు చేసిన తప్పు – వారు సర్వశక్తుడు, స్తోత్రనీయుడైన అల్లాహ్ ను విశ్వసించటం తప్ప మరొకటి కాదు. దానికే వారు ప్రతీకారం తీర్చుకున్నారు. 85:9 الَّذِي لَهُ مُلْكُ السَّمَاوَاتِ وَالْأَرْضِ ۚ وَاللَّهُ عَلَىٰ كُلِّ شَيْءٍ شَهِيدٌ మరి వాస్తవానికి భూమ్యాకాశాల సామ్రాజ్యానికి అధిపతి (కూడా) ఆయనే. మరి అల్లాహ్ అన్నింటికీ సాక్షిగా ఉన్నాడు. 85:10 إِنَّ الَّذِينَ فَتَنُوا الْمُؤْمِنِينَ وَالْمُؤْمِنَاتِ ثُمَّ لَمْ يَتُوبُوا فَلَهُمْ عَذَابُ جَهَنَّمَ وَلَهُمْ عَذَابُ الْحَرِيقِ ఎవరైతే విశ్వసించిన పురుషులను, విశ్వసించిన స్త్రీలను వేధించి (కనీసం) పశ్చాత్తాపం (కూడా) చెందలేదో వారి కొరకు నరక యాతన సిద్ధంగా ఉంది, దహించి వేసే యాతన కూడా ఉంది. 85:11 إِنَّ الَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ لَهُمْ جَنَّاتٌ تَجْرِي مِن تَحْتِهَا الْأَنْهَارُ ۚ ذَٰلِكَ الْفَوْزُ الْكَبِيرُ అయితే విశ్వసించి, సత్కార్యాలు చేసేవారి కోసం క్రింద కాలువలు ప్రవహించే తోటలు ఉన్నాయి. ఇదే గొప్ప విజయం. 85:12 إِنَّ بَطْشَ رَبِّكَ لَشَدِيدٌ నిశ్చయంగా నీ ప్రభువు పట్టు చాలా కఠినమైనది. 85:13 إِنَّهُ هُوَ يُبْدِئُ وَيُعِيدُ ఆయనే తొలిసారి పుట్టిస్తున్నాడు. మలిసారి ప్రభవింపజేసేవాడు కూడా ఆయనే. 85:14 وَهُوَ الْغَفُورُ الْوَدُودُ ఆయనే అపారంగా క్షమించేవాడు, అమితంగా ప్రేమించేవాడు. 85:15 ذُو الْعَرْشِ الْمَجِيدُ పీఠాధిపతి ఘనత గలవాడు. 85:16 فَعَّالٌ لِّمَا يُرِيدُ తలచుకున్న దాన్ని చేసి తీరేవాడు. 85:17 هَلْ أَتَاكَ حَدِيثُ الْجُنُودِ సైనిక దళాల సంగతి గానీ నీకు చేరిందా? 85:18 فِرْعَوْنَ وَثَمُودَ (అనగా) ఫిరౌను మరియు సమూదు (దళాలు). 85:19 بَلِ الَّذِينَ كَفَرُوا فِي تَكْذِيبٍ కాని (ఈ) తిరస్కారులు మాత్రం ధిక్కార వైఖరిలోనే పడి ఉన్నారు. 85:20 وَاللَّهُ مِن وَرَائِهِم مُّحِيطٌ అల్లాహ్ కూడా వాళ్ళను అన్ని వైపుల నుండీ చుట్టుముట్టాడు. 85:21 بَلْ هُوَ قُرْآنٌ مَّجِيدٌ కాదు...అసలు ఈ ఖుర్ఆన్ మహిమాన్వితమైనది. 85:22 فِي لَوْحٍ مَّحْفُوظٍ సురక్షిత ఫలకంలో (లిఖితమై ఉంది). ఈ తెలుగు ఖుర్ఆన్ శాంతి మార్గం పబ్లికేషన్ వారు ప్రచురించారు. వారి అనుమతితో ఈ వెబ్ పోర్టల్ పై వేయబడింది. |