Translation
| 83. సూరాఅల్ ముతఫ్ఫిఫీన్ 83:1 وَيْلٌ لِّلْمُطَفِّفِينَ (కొలతలు, తూనికల్లో ) తగ్గించి ఇచ్చే వారు నాశనమవుదురుగాక! 83:2 الَّذِينَ إِذَا اكْتَالُوا عَلَى النَّاسِ يَسْتَوْفُونَ వారు ప్రజల నుండి కొలిచి తీసుకునేటప్పుడు మాత్రం పూర్తిగా – ఖచ్చితంగా – తీసుకుంటారు. 83:3 وَإِذَا كَالُوهُمْ أَو وَّزَنُوهُمْ يُخْسِرُونَ కాని వారికి కొలచిగానీ, తూకం వేసిగానీ ఇచ్చేటప్పుడు మాత్రం తగ్గించి ఇస్తారు. 83:4 أَلَا يَظُنُّ أُولَٰئِكَ أَنَّهُم مَّبْعُوثُونَ ఏమిటి, తాము (మరణానంతరం) తిరిగి లేపబడతామన్న ఆలోచన వారికి బొత్తిగా లేదా? 83:5 لِيَوْمٍ عَظِيمٍ ఒక మహాదినాన... 83:6 يَوْمَ يَقُومُ النَّاسُ لِرَبِّ الْعَالَمِينَ ఆ రోజు జనులంతా సర్వలోకాల ప్రభువు ముందు నిలబడతారు. 83:7 كَلَّا إِنَّ كِتَابَ الْفُجَّارِ لَفِي سِجِّينٍ ముమ్మాటికీ (వారు అనుకునేది నిజం) కాదు. నిశ్చయంగా పాపాత్ముల కర్మల చిట్టా ‘సిజ్జీను’లో ఉంది. 83:8 وَمَا أَدْرَاكَ مَا سِجِّينٌ ‘సిజ్జీను’ అంటే ఏమిటో నీకేం తెలుసు? 83:9 كِتَابٌ مَّرْقُومٌ (అదొక) లిఖిత పూర్వక గ్రంథం. 83:10 وَيْلٌ يَوْمَئِذٍ لِّلْمُكَذِّبِينَ ధిక్కరించేవారికి ఆ రోజు మూడటం ఖాయం. 83:11 الَّذِينَ يُكَذِّبُونَ بِيَوْمِ الدِّينِ వారు ప్రతిఫల దినాన్ని ధిక్కరించేవారు. 83:12 وَمَا يُكَذِّبُ بِهِ إِلَّا كُلُّ مُعْتَدٍ أَثِيمٍ బరితెగించిన పాపాత్ముడు మాత్రమే దాన్ని ధిక్కరిస్తాడు. 83:13 إِذَا تُتْلَىٰ عَلَيْهِ آيَاتُنَا قَالَ أَسَاطِيرُ الْأَوَّلِينَ వాడికి మా వాక్యాలను చదివి వినిపించినప్పుడు, “ఇవి పూర్వీకుల కట్టుకథలే కదా!” అనంటాడు. 83:14 كَلَّا ۖ بَلْ ۜ رَانَ عَلَىٰ قُلُوبِهِم مَّا كَانُوا يَكْسِبُونَ అది కాదు. అసలు విషయం ఏమిటంటే వారి దురాగతాల మూలంగా వారి హృదయాలకు తుప్పుపట్టింది. 83:15 كَلَّا إِنَّهُمْ عَن رَّبِّهِمْ يَوْمَئِذٍ لَّمَحْجُوبُونَ కాదు, కాదు. ఆ రోజు వారు తమ ప్రభువును చూడకుండా ఉండే విధంగా – చాటున – ఉంచబడతారు. 83:16 ثُمَّ إِنَّهُمْ لَصَالُو الْجَحِيمِ ఆపైన వారు తప్పకుండా నరకంలోకి త్రోయబడతారు. 83:17 ثُمَّ يُقَالُ هَٰذَا الَّذِي كُنتُم بِهِ تُكَذِّبُونَ “(ఇంతకాలంగా) మీరు త్రోసిపుచ్చుతూ వచ్చిన వాస్తవం ఇదే” అని అప్పుడు వారితో అనబడుతుంది. 83:18 كَلَّا إِنَّ كِتَابَ الْأَبْرَارِ لَفِي عِلِّيِّينَ ఎన్నటికీ కాదు. నిశ్చయంగా పుణ్యాత్ముల కర్మల చిట్టా ‘ఇల్లియ్యీన్’లో ఉంది. 83:19 وَمَا أَدْرَاكَ مَا عِلِّيُّونَ ‘ఇల్లియ్యీన్’ గురించి నీకేం తెలుసు? 83:20 كِتَابٌ مَّرْقُومٌ (అదొక) లిఖితపూర్వక గ్రంథం. 83:21 يَشْهَدُهُ الْمُقَرَّبُونَ సామీప్యం పొందినవారు (దైవదూతలు) దాన్ని కనిపెట్టుకుని ఉంటారు. 83:22 إِنَّ الْأَبْرَارَ لَفِي نَعِيمٍ నిశ్చయంగా పుణ్యాత్ములు (స్వర్గ) సుఖాలలో ఉంటారు. 83:23 عَلَى الْأَرَائِكِ يَنظُرُونَ (దర్జాగా) ఆసనాలపై కూర్చుని (పరిసరాలను) వీక్షిస్తూ ఉంటారు. 83:24 تَعْرِفُ فِي وُجُوهِهِمْ نَضْرَةَ النَّعِيمِ వారి ముఖాలపై ఉట్టిపడే సుఖసౌఖ్యాల కళను నువ్వు (ఇట్టే) గుర్తుపడతావు. 83:25 يُسْقَوْنَ مِن رَّحِيقٍ مَّخْتُومٍ సీలువేయబడిన స్వచ్చమైన మధువు వారికి త్రాపించబడుతుంది. 83:26 خِتَامُهُ مِسْكٌ ۚ وَفِي ذَٰلِكَ فَلْيَتَنَافَسِ الْمُتَنَافِسُونَ పైగా అది కస్తూరితో కూడుకున్న ముద్ర (సీలు). మరి పోటీపడేవారు ఈ విషయంలో పోటీపడాలి. 83:27 وَمِزَاجُهُ مِن تَسْنِيمٍ అందులో ‘తస్నీం’ కలిసి ఉంటుంది. 83:28 عَيْنًا يَشْرَبُ بِهَا الْمُقَرَّبُونَ అదొక సెలయేరు సామీప్యం పొందిన సజ్జనులు ఆ విశిష్ట పానీయాన్ని సేవిస్తారు. 83:29 إِنَّ الَّذِينَ أَجْرَمُوا كَانُوا مِنَ الَّذِينَ آمَنُوا يَضْحَكُونَ అపరాధులు విశ్వాసుల స్థితిపై (చులకనగా) నవ్వేవారు. 83:30 وَإِذَا مَرُّوا بِهِمْ يَتَغَامَزُونَ వారి దగ్గర నుండి వెళుతున్నప్పుడు, పరస్పరం కన్నుగీటి మరీ సైగలు చేసేవారు. 83:31 وَإِذَا انقَلَبُوا إِلَىٰ أَهْلِهِمُ انقَلَبُوا فَكِهِينَ తమ వారి వద్దకు తిరిగి వెళ్ళినప్పుడు కూడా (విశ్వాసులను గురించి) వేళాకోళం చేస్తూనే వెళ్ళేవారు. 83:32 وَإِذَا رَأَوْهُمْ قَالُوا إِنَّ هَٰؤُلَاءِ لَضَالُّونَ వారిని (విశ్వాసులను) చూసినప్పుడల్లా, “నిశ్చయంగా వీళ్ళు పెడదారి పట్టార”ని అనేవారు. 83:33 وَمَا أُرْسِلُوا عَلَيْهِمْ حَافِظِينَ ఇంతకీ వాళ్ళు (అవిశ్వాసులు) వారిపై (విశ్వాసులపై) కావలి వాళ్ళుగా చేసి పంపబడలేదు కదా! 83:34 فَالْيَوْمَ الَّذِينَ آمَنُوا مِنَ الْكُفَّارِ يَضْحَكُونَ మరి ఈ రోజు విశ్వాసులు అవిశ్వాసుల స్థితిపై నవ్వుతారు. 83:35 عَلَى الْأَرَائِكِ يَنظُرُونَ ఎత్తైన ఆసనాలపై కూర్చుని చూస్తూ ఉంటారు. 83:36 هَلْ ثُوِّبَ الْكُفَّارُ مَا كَانُوا يَفْعَلُونَ ఏం?! ఈ అవిశ్వాసులు, తాము చేసుకున్న దానికి పూర్తి ప్రతిఫలం పొందారు కదా! ఈ తెలుగు ఖుర్ఆన్ శాంతి మార్గం పబ్లికేషన్ వారు ప్రచురించారు. వారి అనుమతితో ఈ వెబ్ పోర్టల్ పై వేయబడింది. |