aip_quran
Translation

  العربية              తెలుగు  

1. సూరా అల్ ఫాతిహా
2. సూరా అల్ బఖర
3. సూరా ఆలి ఇమ్రాన్
4. సూరా అన్ నిసా
5. సూరా అల్ మాయిద
6. సూరా అల్ అన్ ఆమ్
7. సూరా అల్ ఆరాఫ్
8. సూరా అల్ అన్ ఫాల్
9. సూరా అత్ తౌబా
10. సూరా యూనుస్
11. సూరా హూద్
12. సూరా యూసుఫ్
13. సూరా ఆర్ రాద్
14. సూరా ఇబ్రహీం
15. సూరా అల్ హిజ్ర్
16. సూరా అన్ నహ్ల్
17. సూరా బనీ ఇస్రాయీల్
18. సూరా అల్ కహఫ్
19. సూరా మర్యం
20. సూరా తాహా
21. సూరా అల్ అంబియా
22. సూరా అల్ హజ్
23. సూరా అల్ మూ ‘మినూన్
24. సూరా అన్ నూర్
25. సూరా అల్ ఫుర్ఖాన్
26. సూరా ఆష్ షుఅరా
27. సూరా అన్ నమ్ల్
28. సూరా అల్ ఖసస్
29. సూరా అల్ అన్ కబూత్
30. సూరా ఆర్ రూమ్
31. సూరా లుక్మాన్
32. సూరా అస్ సజ్ ద హ్
33. సూరా అల్ ఆహ్ జాబ్
34. సూరా సబా
35. సూరా ఫాతిర్
36. సూరా యాసీన్
37. సూరా అస్ సాఫ్ఫాత్
38. సూరా సాద్
39. సూరా అజ్ జుమర్
40. సూరా అల్ మూమిన్
41. సూరా హామీమ్ అస్ సజ్ ద హ్
42. సూరా ఆష్ షూరా
43. సూరా అజ్ జుఖ్ రుఫ్
44. సూరా అద్ దుఖాన్
45. సూరా అల్ జాసియ హ్
46. సూరా అల్ ఆహ్ ఖాఫ్
47. సూరా ముహమ్మద్
48. సూరా అల్ ఫతహ్
49. సూరా అల్ హుజురాత్
50. సూరా ఖాఫ్
51. సూరా అజ్ జారియాత్
52. సూరా అత్ తూర్
53. సూరా అన్ నజ్మ్
54. సూరా అల్ ఖమర్
55. సూరా ఆర్ రహ్మాన్
56. సూరా వాఖియహ్
57. సూరా అల్ హదీద్
58. సూరా అల్ ముజాదల హ్
59. సూరా అల్ హష్ర్
60. సూరా అల్ ముమ్ తహిన హ్
61. సూరా అస్ సఫ్
62. సూరాఅల్ జుముఅ హ్
63. సూరా అల్ మునాఫిఖూన్
64. సూరా అత్ తగాబున్
65. సూరా అత్ తలాఖ్
66. సూరా అత్ తహ్రీం
67. సూరా అల్ ముల్క్
68. సూరా అల్ ఖలమ్
69. సూరా అల్ హఖ్ఖ
70. సూరా అల్ ముఆరిజ్
71. సూరా నూహ్
72. సూరా అల్ జిన్న్
73. సూరా అల్ ముజ్జమ్మిల్
74. సూరా అల్ ముద్దస్సిర్
75. సూరా అల్ ఖియామ హ్
76. సూరా అద్ దహ్ర్
77. సూరా అల్ ముర్సలాత్
78. సూరా అన్ నబా
79. సూరా అన్ నాజి ఆత్
80. సూరా అబస
81. సూరా అత్ తక్వీర్
82. సూరా అల్ ఇన్ ఫితార్
83. సూరాఅల్ ముతఫ్ఫిఫీన్
84. సూరా అల్ ఇన్ షి ఖాక్
85. సూరా అల్ బురూజ్
86. సూరా అత్ తారిఖ్
87. సూరా అల్ ఆలా
88. సూరా అల్ గాషియ హ్
89. సూరా అల్ ఫజ్ర్
90. సూరా అల్ బలద్
91. సూరా ఆష్ షమ్స్
92. సూరా అల్ లైల్
93. సూరా అజ్ జుహా
94. సూరా ఆలమ్ నష్ర్
95. సూరా అత్ తతీన్
96. సూరా అల్ అలఖ్
97. సూరా అల్ ఖద్ర్
98. సూరా అల్ బయ్యిన హ్
99. సూరా అజ్ జిలజాల్
100. సూరా అల్ ఆదియాత్
101. సూరా అల్ ఖారియ హ్
102. సూరా అత్ తకాసుర్
103. సూరా అల్ అస్ర్
104. సూరా అల్ హుమజా హ్
105. సూరా అల్ ఫీల్
106. సూరా ఖురైష్
107. సూరా అల్ మాఊ న్
108. సూరా అల్ కౌసర్
109. సూరా అల్ ఖాఫిరూన్
110. సూరా అన్ నస్ర్
111. సూరా అల్ లహబ్
112. సూరా అల్ ఇఖ్లాస్
113. సూరా అల్ ఫలఖ్
114. సూరా అన్ నాస్

83. సూరాఅల్ ముతఫ్ఫిఫీన్

83:1  وَيْلٌ لِّلْمُطَفِّفِينَ
(కొలతలు, తూనికల్లో ) తగ్గించి ఇచ్చే వారు నాశనమవుదురుగాక!
83:2  الَّذِينَ إِذَا اكْتَالُوا عَلَى النَّاسِ يَسْتَوْفُونَ
వారు ప్రజల నుండి కొలిచి తీసుకునేటప్పుడు మాత్రం పూర్తిగా – ఖచ్చితంగా – తీసుకుంటారు.
83:3  وَإِذَا كَالُوهُمْ أَو وَّزَنُوهُمْ يُخْسِرُونَ
కాని వారికి కొలచిగానీ, తూకం వేసిగానీ ఇచ్చేటప్పుడు మాత్రం తగ్గించి ఇస్తారు.
83:4  أَلَا يَظُنُّ أُولَٰئِكَ أَنَّهُم مَّبْعُوثُونَ
ఏమిటి, తాము (మరణానంతరం) తిరిగి లేపబడతామన్న ఆలోచన వారికి బొత్తిగా లేదా?
83:5  لِيَوْمٍ عَظِيمٍ
ఒక మహాదినాన...
83:6  يَوْمَ يَقُومُ النَّاسُ لِرَبِّ الْعَالَمِينَ
ఆ రోజు జనులంతా సర్వలోకాల ప్రభువు ముందు నిలబడతారు.
83:7  كَلَّا إِنَّ كِتَابَ الْفُجَّارِ لَفِي سِجِّينٍ
ముమ్మాటికీ (వారు అనుకునేది నిజం) కాదు. నిశ్చయంగా పాపాత్ముల కర్మల చిట్టా ‘సిజ్జీను’లో ఉంది.
83:8  وَمَا أَدْرَاكَ مَا سِجِّينٌ
‘సిజ్జీను’ అంటే ఏమిటో నీకేం తెలుసు?
83:9  كِتَابٌ مَّرْقُومٌ
(అదొక) లిఖిత పూర్వక గ్రంథం.
83:10  وَيْلٌ يَوْمَئِذٍ لِّلْمُكَذِّبِينَ
ధిక్కరించేవారికి ఆ రోజు మూడటం ఖాయం.
83:11  الَّذِينَ يُكَذِّبُونَ بِيَوْمِ الدِّينِ
వారు ప్రతిఫల దినాన్ని ధిక్కరించేవారు.
83:12  وَمَا يُكَذِّبُ بِهِ إِلَّا كُلُّ مُعْتَدٍ أَثِيمٍ
బరితెగించిన పాపాత్ముడు మాత్రమే దాన్ని ధిక్కరిస్తాడు.
83:13  إِذَا تُتْلَىٰ عَلَيْهِ آيَاتُنَا قَالَ أَسَاطِيرُ الْأَوَّلِينَ
వాడికి మా వాక్యాలను చదివి వినిపించినప్పుడు, “ఇవి పూర్వీకుల కట్టుకథలే కదా!” అనంటాడు.
83:14  كَلَّا ۖ بَلْ ۜ رَانَ عَلَىٰ قُلُوبِهِم مَّا كَانُوا يَكْسِبُونَ
అది కాదు. అసలు విషయం ఏమిటంటే వారి దురాగతాల మూలంగా వారి హృదయాలకు తుప్పుపట్టింది.
83:15  كَلَّا إِنَّهُمْ عَن رَّبِّهِمْ يَوْمَئِذٍ لَّمَحْجُوبُونَ
కాదు, కాదు. ఆ రోజు వారు తమ ప్రభువును చూడకుండా ఉండే విధంగా – చాటున – ఉంచబడతారు.
83:16  ثُمَّ إِنَّهُمْ لَصَالُو الْجَحِيمِ
ఆపైన వారు తప్పకుండా నరకంలోకి త్రోయబడతారు.
83:17  ثُمَّ يُقَالُ هَٰذَا الَّذِي كُنتُم بِهِ تُكَذِّبُونَ
“(ఇంతకాలంగా) మీరు త్రోసిపుచ్చుతూ వచ్చిన వాస్తవం ఇదే” అని అప్పుడు వారితో అనబడుతుంది.
83:18  كَلَّا إِنَّ كِتَابَ الْأَبْرَارِ لَفِي عِلِّيِّينَ
ఎన్నటికీ కాదు. నిశ్చయంగా పుణ్యాత్ముల కర్మల చిట్టా ‘ఇల్లియ్యీన్’లో ఉంది.
83:19  وَمَا أَدْرَاكَ مَا عِلِّيُّونَ
‘ఇల్లియ్యీన్’ గురించి నీకేం తెలుసు?
83:20  كِتَابٌ مَّرْقُومٌ
(అదొక) లిఖితపూర్వక గ్రంథం.
83:21  يَشْهَدُهُ الْمُقَرَّبُونَ
సామీప్యం పొందినవారు (దైవదూతలు) దాన్ని కనిపెట్టుకుని ఉంటారు.
83:22  إِنَّ الْأَبْرَارَ لَفِي نَعِيمٍ
నిశ్చయంగా పుణ్యాత్ములు (స్వర్గ) సుఖాలలో ఉంటారు.
83:23  عَلَى الْأَرَائِكِ يَنظُرُونَ
(దర్జాగా) ఆసనాలపై కూర్చుని (పరిసరాలను) వీక్షిస్తూ ఉంటారు.
83:24  تَعْرِفُ فِي وُجُوهِهِمْ نَضْرَةَ النَّعِيمِ
వారి ముఖాలపై ఉట్టిపడే సుఖసౌఖ్యాల కళను నువ్వు (ఇట్టే) గుర్తుపడతావు.
83:25  يُسْقَوْنَ مِن رَّحِيقٍ مَّخْتُومٍ
సీలువేయబడిన స్వచ్చమైన మధువు వారికి త్రాపించబడుతుంది.
83:26  خِتَامُهُ مِسْكٌ ۚ وَفِي ذَٰلِكَ فَلْيَتَنَافَسِ الْمُتَنَافِسُونَ
పైగా అది కస్తూరితో కూడుకున్న ముద్ర (సీలు). మరి పోటీపడేవారు ఈ విషయంలో పోటీపడాలి.
83:27  وَمِزَاجُهُ مِن تَسْنِيمٍ
అందులో ‘తస్నీం’ కలిసి ఉంటుంది.
83:28  عَيْنًا يَشْرَبُ بِهَا الْمُقَرَّبُونَ
అదొక సెలయేరు సామీప్యం పొందిన సజ్జనులు ఆ విశిష్ట పానీయాన్ని సేవిస్తారు.
83:29  إِنَّ الَّذِينَ أَجْرَمُوا كَانُوا مِنَ الَّذِينَ آمَنُوا يَضْحَكُونَ
అపరాధులు విశ్వాసుల స్థితిపై (చులకనగా) నవ్వేవారు.
83:30  وَإِذَا مَرُّوا بِهِمْ يَتَغَامَزُونَ
వారి దగ్గర నుండి వెళుతున్నప్పుడు, పరస్పరం కన్నుగీటి మరీ సైగలు చేసేవారు.
83:31  وَإِذَا انقَلَبُوا إِلَىٰ أَهْلِهِمُ انقَلَبُوا فَكِهِينَ
తమ వారి వద్దకు తిరిగి వెళ్ళినప్పుడు కూడా (విశ్వాసులను గురించి) వేళాకోళం చేస్తూనే వెళ్ళేవారు.
83:32  وَإِذَا رَأَوْهُمْ قَالُوا إِنَّ هَٰؤُلَاءِ لَضَالُّونَ
వారిని (విశ్వాసులను) చూసినప్పుడల్లా, “నిశ్చయంగా వీళ్ళు పెడదారి పట్టార”ని అనేవారు.
83:33  وَمَا أُرْسِلُوا عَلَيْهِمْ حَافِظِينَ
ఇంతకీ వాళ్ళు (అవిశ్వాసులు) వారిపై (విశ్వాసులపై) కావలి వాళ్ళుగా చేసి పంపబడలేదు కదా!
83:34  فَالْيَوْمَ الَّذِينَ آمَنُوا مِنَ الْكُفَّارِ يَضْحَكُونَ
మరి ఈ రోజు విశ్వాసులు అవిశ్వాసుల స్థితిపై నవ్వుతారు.
83:35  عَلَى الْأَرَائِكِ يَنظُرُونَ
ఎత్తైన ఆసనాలపై కూర్చుని చూస్తూ ఉంటారు.
83:36  هَلْ ثُوِّبَ الْكُفَّارُ مَا كَانُوا يَفْعَلُونَ
ఏం?! ఈ అవిశ్వాసులు, తాము చేసుకున్న దానికి పూర్తి ప్రతిఫలం పొందారు కదా!


ఈ తెలుగు ఖుర్ఆన్ శాంతి మార్గం పబ్లికేషన్ వారు ప్రచురించారు. వారి అనుమతితో ఈ వెబ్ పోర్టల్ పై వేయబడింది.