Translation
| 82. సూరా అల్ ఇన్ ఫితార్ 82:1 إِذَا السَّمَاءُ انفَطَرَتْ ఆకాశం చీలిపోయినప్పుడు, 82:2 وَإِذَا الْكَوَاكِبُ انتَثَرَتْ నక్షత్రాలు రాలి (పడి) పోయినప్పుడు, 82:3 وَإِذَا الْبِحَارُ فُجِّرَتْ సముద్రాలు ఉప్పొంగినప్పుడు, 82:4 وَإِذَا الْقُبُورُ بُعْثِرَتْ సమాధులు పెళ్ళగించబడినప్పుడు, 82:5 عَلِمَتْ نَفْسٌ مَّا قَدَّمَتْ وَأَخَّرَتْ (అప్పుడు) ప్రతి ఒక్కనికీ తాను ముందుకు పంపుకున్నదీ, వెనుక వదలి పెట్టినదీ (అంతా) తెలిసివస్తుంది. 82:6 يَا أَيُّهَا الْإِنسَانُ مَا غَرَّكَ بِرَبِّكَ الْكَرِيمِ ఓ మానవుడా! ఉదాత్తుడైన నీ ప్రభువు పట్ల ఏ విషయం నిన్ను మోసంలో పడవేసింది? 82:7 الَّذِي خَلَقَكَ فَسَوَّاكَ فَعَدَلَكَ (యదార్థానికి) ఆయనే నిన్ను పుట్టించాడు, నిన్ను చక్కగా తీర్చిదిద్దాడు, ఆపైన నిన్ను తగు రీతిలో పొందికగా మలిచాడు. 82:8 فِي أَيِّ صُورَةٍ مَّا شَاءَ رَكَّبَكَ తాను కోరిన ఆకారంలో నిన్ను కూర్చాడు. 82:9 كَلَّا بَلْ تُكَذِّبُونَ بِالدِّينِ ఎన్నటికీ కాదు, మీరైతే శిక్షా బహుమానాల దినాన్ని ధిక్కరిస్తున్నారు. 82:10 وَإِنَّ عَلَيْكُمْ لَحَافِظِينَ నిశ్చయంగా మీ పైన పర్యవేక్షకులు నియమితులై ఉన్నారు. 82:11 كِرَامًا كَاتِبِينَ (వారు మీ కర్మలను నమోదు చేసే) గౌరవనీయులైన లేఖకులు. 82:12 يَعْلَمُونَ مَا تَفْعَلُونَ మీరు చేసేదంతా వారికి తెలుసు సుమా! 82:13 إِنَّ الْأَبْرَارَ لَفِي نَعِيمٍ నిశ్చయంగా పుణ్యాత్ములు (స్వర్గ) సుఖాలలో ఉంటారు. 82:14 وَإِنَّ الْفُجَّارَ لَفِي جَحِيمٍ మరి నిశ్చయంగా పాపాత్ములు నరకాగ్నిలో ఉంటారు. 82:15 يَصْلَوْنَهَا يَوْمَ الدِّينِ ప్రతిఫల దినాన వారు అందులోకి ప్రవేశిస్తారు. 82:16 وَمَا هُمْ عَنْهَا بِغَائِبِينَ వారు దాన్నుండి ఎన్నటికీ అదృశ్యం కాలేరు. 82:17 وَمَا أَدْرَاكَ مَا يَوْمُ الدِّينِ ఆ ప్రతిఫల దినం ఎటువంటిదో నీకేం తెలుసు? 82:18 ثُمَّ مَا أَدْرَاكَ مَا يَوْمُ الدِّينِ మరి ఆ ప్రతిఫల దినం ఎటువంటిదో (దాని గురించి)నీకేం తెలుసు? 82:19 يَوْمَ لَا تَمْلِكُ نَفْسٌ لِّنَفْسٍ شَيْئًا ۖ وَالْأَمْرُ يَوْمَئِذٍ لِّلَّهِ ఆ రోజు ఏ జీవీ మరో జీవి కోసం ఏమీ చెయ్యజాలదు. ఆ రోజు సమస్త వ్యవహారాలు (అధికారాలన్నీ) అల్లాహ్ వద్దనే ఉంటాయి. ఈ తెలుగు ఖుర్ఆన్ శాంతి మార్గం పబ్లికేషన్ వారు ప్రచురించారు. వారి అనుమతితో ఈ వెబ్ పోర్టల్ పై వేయబడింది. |