Translation
| 81. సూరా అత్ తక్వీర్ 81:1 إِذَا الشَّمْسُ كُوِّرَتْ సూర్యుడు చుట్టివేయబడినప్పుడు, 81:2 وَإِذَا النُّجُومُ انكَدَرَتْ నక్షత్రాలు కాంతిహీనం అయిపోయినప్పుడు, 81:3 وَإِذَا الْجِبَالُ سُيِّرَتْ పర్వతాలు నడిపింపబడినప్పుడు, 81:4 وَإِذَا الْعِشَارُ عُطِّلَتْ పదిమాసాల సూడి ఒంటెలు (వాటి మానాన) వదలివేయబడినప్పుడు, 81:5 وَإِذَا الْوُحُوشُ حُشِرَتْ అడవి జంతువులన్నీ ఒకచోట సమీకరించబడినప్పుడు, 81:6 وَإِذَا الْبِحَارُ سُجِّرَتْ సముద్రాలు రాజేయబడినప్పుడు, 81:7 وَإِذَا النُّفُوسُ زُوِّجَتْ ఆత్మలు (వాటి తనువులతో) అనుసంధానం చేయబడినప్పుడు, 81:8 وَإِذَا الْمَوْءُودَةُ سُئِلَتْ సజీవంగా పాతిపెట్టబడిన బాలిక ప్రశ్నించబడినప్పుడు, 81:9 بِأَيِّ ذَنبٍ قُتِلَتْ ‘తను ఏ పాపం చేసిందని హతమార్చబడింది?’ అని. 81:10 وَإِذَا الصُّحُفُ نُشِرَتْ కర్మల చిట్టాలు తెరువబడినప్పుడు, 81:11 وَإِذَا السَّمَاءُ كُشِطَتْ ఆకాశం తోలు ఒలచివేయబడినప్పుడు, 81:12 وَإِذَا الْجَحِيمُ سُعِّرَتْ నరకం మండించబడినప్పుడు, 81:13 وَإِذَا الْجَنَّةُ أُزْلِفَتْ స్వర్గం చాలా దగ్గరగా తేబడినప్పుడు, 81:14 عَلِمَتْ نَفْسٌ مَّا أَحْضَرَتْ అప్పుడు (ఆ రోజు) ప్రతి ప్రాణి తాను తన వెంట తెచ్చుకున్నదేమిటో తెలుసుకుంటుంది. 81:15 فَلَا أُقْسِمُ بِالْخُنَّسِ కనుక అది కాదు. వెనక్కి జరిగే నక్షత్రాలపై నేను ప్రమాణం చేస్తున్నాను. 81:16 الْجَوَارِ الْكُنَّسِ అవి సంచరించేవి, కనుమరుగైపోయేవి. 81:17 وَاللَّيْلِ إِذَا عَسْعَسَ గడచిపోయేటప్పటి రాత్రి సాక్షిగా! 81:18 وَالصُّبْحِ إِذَا تَنَفَّسَ ప్రకాశిస్తున్నప్పటి ఉదయం సాక్షిగా (చెబుతున్నాను)! 81:19 إِنَّهُ لَقَوْلُ رَسُولٍ كَرِيمٍ నిశ్చయంగా ఇది గౌరవనీయుడైన సందేశవాహకుడు (జిబ్రయీల్) తెచ్చిన (దైవ) వాక్కు. 81:20 ذِي قُوَّةٍ عِندَ ذِي الْعَرْشِ مَكِينٍ అతడు శక్తిశాలి. అతడు సింహాసనాధిపతి (అయిన అల్లాహ్) దగ్గర ఉన్నత స్థానం కలవాడు. 81:21 مُّطَاعٍ ثَمَّ أَمِينٍ (ఊర్థ్వ లోకాలలో) అతని మాట అనుసరనీయం. అతను ఎంతో నిజాయితీపరుడు. 81:22 وَمَا صَاحِبُكُم بِمَجْنُونٍ (ఓ ప్రజలారా!) మీ ఈ సహచరుడు పిచ్చివాడు కాడు. 81:23 وَلَقَدْ رَآهُ بِالْأُفُقِ الْمُبِينِ అతనా సందేశహరుణ్ణి స్పష్టమైన గగనతలంపై చూసి ఉన్నాడు. 81:24 وَمَا هُوَ عَلَى الْغَيْبِ بِضَنِينٍ ఇంకా అతను అగోచర విషయాలను తెలియపరచడంలో పిసినారి కూడా కాడు. 81:25 وَمَا هُوَ بِقَوْلِ شَيْطَانٍ رَّجِيمٍ ఇది (ఈ ఖుర్ఆన్) శాపగ్రస్తుడైన షైతాన్ వాక్కు కూడా కాదు. 81:26 فَأَيْنَ تَذْهَبُونَ మరి మీరు ఎటుపోతున్నారు? 81:27 إِنْ هُوَ إِلَّا ذِكْرٌ لِّلْعَالَمِينَ ఇది సమస్త లోకవాసుల కొరకు హితోపదేశం. 81:28 لِمَن شَاءَ مِنكُمْ أَن يَسْتَقِيمَ (ముఖ్యంగా) మీలో రుజుమార్గాన నడవదలచిన వారి కోసం. 81:29 وَمَا تَشَاءُونَ إِلَّا أَن يَشَاءَ اللَّهُ رَبُّ الْعَالَمِينَ సర్వలోక ప్రభువు అయిన అల్లాహ్ కోరనంతవరకు మీరేదీ కోరలేరు. ఈ తెలుగు ఖుర్ఆన్ శాంతి మార్గం పబ్లికేషన్ వారు ప్రచురించారు. వారి అనుమతితో ఈ వెబ్ పోర్టల్ పై వేయబడింది. |