aip_quran
Translation

  العربية              తెలుగు  

1. సూరా అల్ ఫాతిహా
2. సూరా అల్ బఖర
3. సూరా ఆలి ఇమ్రాన్
4. సూరా అన్ నిసా
5. సూరా అల్ మాయిద
6. సూరా అల్ అన్ ఆమ్
7. సూరా అల్ ఆరాఫ్
8. సూరా అల్ అన్ ఫాల్
9. సూరా అత్ తౌబా
10. సూరా యూనుస్
11. సూరా హూద్
12. సూరా యూసుఫ్
13. సూరా ఆర్ రాద్
14. సూరా ఇబ్రహీం
15. సూరా అల్ హిజ్ర్
16. సూరా అన్ నహ్ల్
17. సూరా బనీ ఇస్రాయీల్
18. సూరా అల్ కహఫ్
19. సూరా మర్యం
20. సూరా తాహా
21. సూరా అల్ అంబియా
22. సూరా అల్ హజ్
23. సూరా అల్ మూ ‘మినూన్
24. సూరా అన్ నూర్
25. సూరా అల్ ఫుర్ఖాన్
26. సూరా ఆష్ షుఅరా
27. సూరా అన్ నమ్ల్
28. సూరా అల్ ఖసస్
29. సూరా అల్ అన్ కబూత్
30. సూరా ఆర్ రూమ్
31. సూరా లుక్మాన్
32. సూరా అస్ సజ్ ద హ్
33. సూరా అల్ ఆహ్ జాబ్
34. సూరా సబా
35. సూరా ఫాతిర్
36. సూరా యాసీన్
37. సూరా అస్ సాఫ్ఫాత్
38. సూరా సాద్
39. సూరా అజ్ జుమర్
40. సూరా అల్ మూమిన్
41. సూరా హామీమ్ అస్ సజ్ ద హ్
42. సూరా ఆష్ షూరా
43. సూరా అజ్ జుఖ్ రుఫ్
44. సూరా అద్ దుఖాన్
45. సూరా అల్ జాసియ హ్
46. సూరా అల్ ఆహ్ ఖాఫ్
47. సూరా ముహమ్మద్
48. సూరా అల్ ఫతహ్
49. సూరా అల్ హుజురాత్
50. సూరా ఖాఫ్
51. సూరా అజ్ జారియాత్
52. సూరా అత్ తూర్
53. సూరా అన్ నజ్మ్
54. సూరా అల్ ఖమర్
55. సూరా ఆర్ రహ్మాన్
56. సూరా వాఖియహ్
57. సూరా అల్ హదీద్
58. సూరా అల్ ముజాదల హ్
59. సూరా అల్ హష్ర్
60. సూరా అల్ ముమ్ తహిన హ్
61. సూరా అస్ సఫ్
62. సూరాఅల్ జుముఅ హ్
63. సూరా అల్ మునాఫిఖూన్
64. సూరా అత్ తగాబున్
65. సూరా అత్ తలాఖ్
66. సూరా అత్ తహ్రీం
67. సూరా అల్ ముల్క్
68. సూరా అల్ ఖలమ్
69. సూరా అల్ హఖ్ఖ
70. సూరా అల్ ముఆరిజ్
71. సూరా నూహ్
72. సూరా అల్ జిన్న్
73. సూరా అల్ ముజ్జమ్మిల్
74. సూరా అల్ ముద్దస్సిర్
75. సూరా అల్ ఖియామ హ్
76. సూరా అద్ దహ్ర్
77. సూరా అల్ ముర్సలాత్
78. సూరా అన్ నబా
79. సూరా అన్ నాజి ఆత్
80. సూరా అబస
81. సూరా అత్ తక్వీర్
82. సూరా అల్ ఇన్ ఫితార్
83. సూరాఅల్ ముతఫ్ఫిఫీన్
84. సూరా అల్ ఇన్ షి ఖాక్
85. సూరా అల్ బురూజ్
86. సూరా అత్ తారిఖ్
87. సూరా అల్ ఆలా
88. సూరా అల్ గాషియ హ్
89. సూరా అల్ ఫజ్ర్
90. సూరా అల్ బలద్
91. సూరా ఆష్ షమ్స్
92. సూరా అల్ లైల్
93. సూరా అజ్ జుహా
94. సూరా ఆలమ్ నష్ర్
95. సూరా అత్ తతీన్
96. సూరా అల్ అలఖ్
97. సూరా అల్ ఖద్ర్
98. సూరా అల్ బయ్యిన హ్
99. సూరా అజ్ జిలజాల్
100. సూరా అల్ ఆదియాత్
101. సూరా అల్ ఖారియ హ్
102. సూరా అత్ తకాసుర్
103. సూరా అల్ అస్ర్
104. సూరా అల్ హుమజా హ్
105. సూరా అల్ ఫీల్
106. సూరా ఖురైష్
107. సూరా అల్ మాఊ న్
108. సూరా అల్ కౌసర్
109. సూరా అల్ ఖాఫిరూన్
110. సూరా అన్ నస్ర్
111. సూరా అల్ లహబ్
112. సూరా అల్ ఇఖ్లాస్
113. సూరా అల్ ఫలఖ్
114. సూరా అన్ నాస్

8. సూరా అల్ అన్ ఫాల్

8:1  يَسْأَلُونَكَ عَنِ الْأَنفَالِ ۖ قُلِ الْأَنفَالُ لِلَّهِ وَالرَّسُولِ ۖ فَاتَّقُوا اللَّهَ وَأَصْلِحُوا ذَاتَ بَيْنِكُمْ ۖ وَأَطِيعُوا اللَّهَ وَرَسُولَهُ إِن كُنتُم مُّؤْمِنِينَ
వారు నిన్ను యుద్ధప్రాప్తి (అన్‌ఫాల్‌) గురించి అడుగుతున్నారు. (ఓ ప్రవక్తా!) వారికి చెప్పు : “ఈ యుద్ధప్రాప్తి (అన్‌ఫాల్‌) అల్లాహ్‌కు, ప్రవక్తకు చెందినవి. కాబట్టి మీరు అల్లాహ్‌కు భయపడండి. మీ పరస్పర సంబంధాలను చక్కదిద్దుకోండి. మీరు విశ్వసించినవారే అయితే అల్లాహ్‌కూ, ఆయన ప్రవక్తకూ విధేయత చూపండి.”
8:2  إِنَّمَا الْمُؤْمِنُونَ الَّذِينَ إِذَا ذُكِرَ اللَّهُ وَجِلَتْ قُلُوبُهُمْ وَإِذَا تُلِيَتْ عَلَيْهِمْ آيَاتُهُ زَادَتْهُمْ إِيمَانًا وَعَلَىٰ رَبِّهِمْ يَتَوَكَّلُونَ
నిజమైన విశ్వాసులు ఎటువంటి వారంటే - అల్లాహ్‌ ప్రస్తావన రాగానే వారి హృదయాలు భయంతో వణుకుతాయి. అల్లాహ్‌ ఆయతులు వారి ముందు పఠించబడినపుడు, అవి వారి విశ్వాసాన్ని మరింత వృద్ధిచేస్తాయి. వారు తమ ప్రభువునే నమ్ముకుంటారు.
8:3  الَّذِينَ يُقِيمُونَ الصَّلَاةَ وَمِمَّا رَزَقْنَاهُمْ يُنفِقُونَ
వారు నమాజును నెలకొల్పుతారు. మేము వారికి ప్రసాదించిన దానిలో నుంచి (మా మార్గంలో) ఖర్చుపెడతారు.
8:4  أُولَٰئِكَ هُمُ الْمُؤْمِنُونَ حَقًّا ۚ لَّهُمْ دَرَجَاتٌ عِندَ رَبِّهِمْ وَمَغْفِرَةٌ وَرِزْقٌ كَرِيمٌ
నిజమైన విశ్వాసులంటే వీరే. వీరి కొరకు వీరి ప్రభువు వద్ద ఉన్నత స్థానాలు ఉన్నాయి. మన్నింపు ఉంది. గౌరవప్రదమైన ఆహారం ఉంది.
8:5  كَمَا أَخْرَجَكَ رَبُّكَ مِن بَيْتِكَ بِالْحَقِّ وَإِنَّ فَرِيقًا مِّنَ الْمُؤْمِنِينَ لَكَارِهُونَ
(ఈ అన్‌ఫాల్‌ వ్యవహారంలో కూడా ఇదివరకు ఉత్పన్నమైన పరిస్థితి వంటిదే ఉత్పన్నమవుతోంది. అప్పుడు) నీ ప్రభువు నిన్ను సత్యంతో నీ గృహం నుంచి బయటకు తీసుకువచ్చాడు. విశ్వసించిన వారిలోని ఒక వర్గం వారికి ఇది ఇష్టంలేదు.
8:6  يُجَادِلُونَكَ فِي الْحَقِّ بَعْدَمَا تَبَيَّنَ كَأَنَّمَا يُسَاقُونَ إِلَى الْمَوْتِ وَهُمْ يَنظُرُونَ
వారు ఈ సత్యం గురించి - అది సత్యమని స్పష్టం అయిన తరువాత కూడా - తాము మృత్యువు వైపుకు తరుమబడుతున్నట్లు, దాన్ని తాము కళ్ళారా చూస్తున్నట్లుగానే (భీతిల్లి) నీతో వాదులాటకు దిగారు.
8:7  وَإِذْ يَعِدُكُمُ اللَّهُ إِحْدَى الطَّائِفَتَيْنِ أَنَّهَا لَكُمْ وَتَوَدُّونَ أَنَّ غَيْرَ ذَاتِ الشَّوْكَةِ تَكُونُ لَكُمْ وَيُرِيدُ اللَّهُ أَن يُحِقَّ الْحَقَّ بِكَلِمَاتِهِ وَيَقْطَعَ دَابِرَ الْكَافِرِينَ
ఆ రెండు బృందాలలో ఏదో ఒక బృందం మీ చేతికి చిక్కుతుందని అల్లాహ్‌ మీకు వాగ్దానం చేసిన సమయాన్ని ఓసారి జ్ఞాపకం చేసుకోండి! అప్పుడు మీరు నిరాయుధులైన బృందం చేజిక్కాలని ఉబలాటపడ్డారు. అదే సమయంలో అల్లాహ్‌ తన ఆదేశాల ద్వారా సత్యాన్ని సత్యంగా తేటతెల్లం చేసి, అవిశ్వాసులను కూకటి వేళ్లతో పెకలించాలని సంకల్పించుకున్నాడు.
8:8  لِيُحِقَّ الْحَقَّ وَيُبْطِلَ الْبَاطِلَ وَلَوْ كَرِهَ الْمُجْرِمُونَ
అపరాధులకు ఎంతగా సహించరానిదయినా సరే సత్యం సత్యంగా, అసత్యం అసత్యంగా నిగ్గుతేలాలన్నది (ఆయన అభిమతం).
8:9  إِذْ تَسْتَغِيثُونَ رَبَّكُمْ فَاسْتَجَابَ لَكُمْ أَنِّي مُمِدُّكُم بِأَلْفٍ مِّنَ الْمَلَائِكَةِ مُرْدِفِينَ
సహాయం కోసం మీరు మీ ప్రభువును మొరపెట్టుకున్న ఆ సందర్భాన్ని కూడా జ్ఞప్తికి తెచ్చుకోండి-మరి అల్లాహ్‌ మీ మొరను ఆలకించి, “నేను వెయ్యిమంది దూతలతో మీకు సహాయం చేస్తాను. వారు ఎడతెగకుండా - ఒకరి వెనుక ఒకరు - వస్తుంటారు” అని చెప్పాడు.
8:10  وَمَا جَعَلَهُ اللَّهُ إِلَّا بُشْرَىٰ وَلِتَطْمَئِنَّ بِهِ قُلُوبُكُمْ ۚ وَمَا النَّصْرُ إِلَّا مِنْ عِندِ اللَّهِ ۚ إِنَّ اللَّهَ عَزِيزٌ حَكِيمٌ
మీకు శుభవార్తను అందించటానికీ, తద్వారా మీ మనసులు కుదుటపడటానికి అల్లాహ్‌ ఈ విధంగా తోడ్పడ్డాడు. తోడ్పాటు అనేది కేవలం అల్లాహ్‌ వద్ద నుంచే లభిస్తుంది సుమా! నిస్సందేహంగా అల్లాహ్‌ శక్తిమంతుడు, వివేక సంపన్నుడు.
8:11  إِذْ يُغَشِّيكُمُ النُّعَاسَ أَمَنَةً مِّنْهُ وَيُنَزِّلُ عَلَيْكُم مِّنَ السَّمَاءِ مَاءً لِّيُطَهِّرَكُم بِهِ وَيُذْهِبَ عَنكُمْ رِجْزَ الشَّيْطَانِ وَلِيَرْبِطَ عَلَىٰ قُلُوبِكُمْ وَيُثَبِّتَ بِهِ الْأَقْدَامَ
తన తరఫున మీకు నిశ్చింతను ప్రసాదించేందుకు అల్లాహ్‌ మీపై నిద్ర మత్తును ఆవరింపజేసిన సందర్భాన్ని కూడా ఓసారి జ్ఞాపకం చేసుకోండి! మిమ్మల్ని పరిశుభ్రపరచటానికి, షైతాను ప్రేరణలను మీ నుండి పారద్రోలటానికీ, మీకు గుండెదిటవును కలిగించటానికి, మీ కాళ్ళకు నిలకడను ప్రసాదించటానికి ఆయన (ఆ సందర్భంగా) మీపై ఆకాశం నుంచి వర్షం కురిపించాడు.
8:12  إِذْ يُوحِي رَبُّكَ إِلَى الْمَلَائِكَةِ أَنِّي مَعَكُمْ فَثَبِّتُوا الَّذِينَ آمَنُوا ۚ سَأُلْقِي فِي قُلُوبِ الَّذِينَ كَفَرُوا الرُّعْبَ فَاضْرِبُوا فَوْقَ الْأَعْنَاقِ وَاضْرِبُوا مِنْهُمْ كُلَّ بَنَانٍ
(ఆ సందర్భాన్ని కూడా ఓ సారి జ్ఞాపకం చేసుకోండి) నీ ప్రభువు దూతలను ఈ విధంగా ఆదేశించాడు : “నేను మీ వెంటే ఉన్నాను. కాబట్టి మీరు విశ్వాసులకు ధైర్యాన్ని కలిగించండి. నేను ఇప్పుడే అవిశ్వాసుల గుండెల్లో దడ పుట్టిస్తాను. మీరు వారి మెడలపై కొట్టండి. వారి వ్రేళ్ల కణుపులపై కొట్టండి.”
8:13  ذَٰلِكَ بِأَنَّهُمْ شَاقُّوا اللَّهَ وَرَسُولَهُ ۚ وَمَن يُشَاقِقِ اللَّهَ وَرَسُولَهُ فَإِنَّ اللَّهَ شَدِيدُ الْعِقَابِ
అల్లాహ్‌ను,ఆయన ప్రవక్తను ఎదిరించినందుకు వారికి శిక్ష ఇది. అల్లాహ్‌ను, ఆయన ప్రవక్తను ఎదిరించిన వారిని నిస్సందేహంగా అల్లాహ్‌ కఠినంగా శిక్షిస్తాడు.
8:14  ذَٰلِكُمْ فَذُوقُوهُ وَأَنَّ لِلْكَافِرِينَ عَذَابَ النَّارِ
కనుక (ఇహలోకంలో) ఈ శిక్షను చవిచూడండి. తిరస్కారులకు ఇక నరకాగ్ని శిక్ష ఎలాగూ తప్పదు.
8:15  يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا إِذَا لَقِيتُمُ الَّذِينَ كَفَرُوا زَحْفًا فَلَا تُوَلُّوهُمُ الْأَدْبَارَ
ఓ విశ్వసించినవారలారా! మీరు అవిశ్వాసులతో ముఖాముఖీ అయినప్పుడు వారికి వెన్నుచూపకండి.
8:16  وَمَن يُوَلِّهِمْ يَوْمَئِذٍ دُبُرَهُ إِلَّا مُتَحَرِّفًا لِّقِتَالٍ أَوْ مُتَحَيِّزًا إِلَىٰ فِئَةٍ فَقَدْ بَاءَ بِغَضَبٍ مِّنَ اللَّهِ وَمَأْوَاهُ جَهَنَّمُ ۖ وَبِئْسَ الْمَصِيرُ
ఆ సమయంలో రణనీతిలో భాగంగా వెనక్కి తిరగటమో లేదా (తన) సైనిక దళంలో ఆశ్రయం పొందేందుకు తిరిగి రావటమో తప్పితే - (ఆ సమయంలో) శత్రువుకు వెన్నుచూపి పలాయనం చిత్తగించినవాడు దైవాగ్రహంలో చిక్కుకుంటాడు. నరకం అతని నివాసం అవుతుంది. అది అత్యంత చెడ్డ గమ్య స్థానం.
8:17  فَلَمْ تَقْتُلُوهُمْ وَلَٰكِنَّ اللَّهَ قَتَلَهُمْ ۚ وَمَا رَمَيْتَ إِذْ رَمَيْتَ وَلَٰكِنَّ اللَّهَ رَمَىٰ ۚ وَلِيُبْلِيَ الْمُؤْمِنِينَ مِنْهُ بَلَاءً حَسَنًا ۚ إِنَّ اللَّهَ سَمِيعٌ عَلِيمٌ
వాళ్ళను మీరు చంపలేదు. కాని అల్లాహ్‌ వాళ్ళను చంపాడు.(గుప్పెడు మన్నును) నువ్వు విసిరినప్పుడు, దాన్ని విసిరింది నువ్వు కాదు. అల్లాహ్‌ దాన్ని విసిరాడు. విశ్వాసుల శ్రమకు తన తరఫున మంచి ప్రతిఫలం ఇచ్చేందుకు అల్లాహ్‌ ఇలా చేశాడు. నిశ్చయంగా అల్లాహ్‌ అంతా వినేవాడు, అన్నీ తెలిసినవాడు.
8:18  ذَٰلِكُمْ وَأَنَّ اللَّهَ مُوهِنُ كَيْدِ الْكَافِرِينَ
(ఒకటైతే) ఇది జరిగిపోయింది. (రెండవదేమిటంటే) అల్లాహ్‌ అవిశ్వాసుల కుయుక్తులను బలహీనపరచదలచాడు.
8:19  إِن تَسْتَفْتِحُوا فَقَدْ جَاءَكُمُ الْفَتْحُ ۖ وَإِن تَنتَهُوا فَهُوَ خَيْرٌ لَّكُمْ ۖ وَإِن تَعُودُوا نَعُدْ وَلَن تُغْنِيَ عَنكُمْ فِئَتُكُمْ شَيْئًا وَلَوْ كَثُرَتْ وَأَنَّ اللَّهَ مَعَ الْمُؤْمِنِينَ
(ఓ సత్య తిరస్కారులారా!) మీరు తీర్పును కోరుతున్నట్లయితే, ఇదిగో, ఆ తీర్పు మీ ముందుకు వచ్చేసింది. ఇకనయినా మీరు మానుకుంటే అది మీకెంతో మంచిది. ఒకవేళ మీరు మళ్లీ అవే చేష్టలకు పాల్పడితే మేము కూడా అదేవిధంగా సమాధానం ఇవ్వవలసి వస్తుంది. మీ జన సమూహం ఎంత అధికంగా ఉన్నప్పటికీ అది మీకే విధంగానూ పనికిరాదు - అల్లాహ్‌ విశ్వాసులకు తోడుగా ఉన్నాడు.
8:20  يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا أَطِيعُوا اللَّهَ وَرَسُولَهُ وَلَا تَوَلَّوْا عَنْهُ وَأَنتُمْ تَسْمَعُونَ
ఓ విశ్వాసులారా! అల్లాహ్‌కు, ఆయన ప్రవక్తకు విధేయులై ఉండండి. అంతా వింటూనే అతని (విధేయత) పట్ల విముఖులు కాకండి.
8:21  وَلَا تَكُونُوا كَالَّذِينَ قَالُوا سَمِعْنَا وَهُمْ لَا يَسْمَعُونَ
వినకుండా (వినిపించుకోకుండా)నే “మేము విన్నాము” అని అనే వారిలా మీరు తయారవకండి.
8:22  إِنَّ شَرَّ الدَّوَابِّ عِندَ اللَّهِ الصُّمُّ الْبُكْمُ الَّذِينَ لَا يَعْقِلُونَ
తమ బుద్ధిని ఉపయోగించని చెవిటివారు, మూగవారు మాత్రమే అల్లాహ్‌ దృష్టిలో అత్యంత నీచమైన జంతువులు.
8:23  وَلَوْ عَلِمَ اللَّهُ فِيهِمْ خَيْرًا لَّأَسْمَعَهُمْ ۖ وَلَوْ أَسْمَعَهُمْ لَتَوَلَّوا وَّهُم مُّعْرِضُونَ
ఒకవేళ వారిలో ఏకాస్త మంచితనం ఉందనిపించినా అల్లాహ్‌ వారికి వినగలిగే భాగ్యం ప్రసాదించి ఉండేవాడు. ఇప్పుడు గనక వారికి వినిపిస్తే వారు నిర్లక్ష్యంగా ముఖం త్రిప్పుకుని వెళ్ళిపోతారు.
8:24  يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا اسْتَجِيبُوا لِلَّهِ وَلِلرَّسُولِ إِذَا دَعَاكُمْ لِمَا يُحْيِيكُمْ ۖ وَاعْلَمُوا أَنَّ اللَّهَ يَحُولُ بَيْنَ الْمَرْءِ وَقَلْبِهِ وَأَنَّهُ إِلَيْهِ تُحْشَرُونَ
ఓ విశ్వాసులారా! మీకు జీవితాన్నిచ్చే వస్తువు వైపుకు ప్రవక్త మిమ్మల్ని పిలిచినప్పుడు మీరు అల్లాహ్‌ మరియు ఆయన ప్రవక్త పిలుపుకు అనుకూలంగా స్పందించండి. అల్లాహ్‌ మనిషికీ- అతని మనసుకూ మధ్య అడ్డుగా వస్తాడనీ, మీరంతా ఆయన వద్దకే సమీకరించబడతారన్న సంగతిని తెలుసుకోండి.
8:25  وَاتَّقُوا فِتْنَةً لَّا تُصِيبَنَّ الَّذِينَ ظَلَمُوا مِنكُمْ خَاصَّةً ۖ وَاعْلَمُوا أَنَّ اللَّهَ شَدِيدُ الْعِقَابِ
ఏ ఉపద్రవమైతే మీలోని దుర్మార్గులకు మాత్రమే పరిమితం కాకుండా (సాధారణంగా సమాజంలోని వారినందరినీ) కబళిస్తుందో దాని బారి నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోండి. అల్లాహ్‌ చాలా కఠినంగా శిక్షించేవాడన్న సంగతిని తెలుసుకోండి!
8:26  وَاذْكُرُوا إِذْ أَنتُمْ قَلِيلٌ مُّسْتَضْعَفُونَ فِي الْأَرْضِ تَخَافُونَ أَن يَتَخَطَّفَكُمُ النَّاسُ فَآوَاكُمْ وَأَيَّدَكُم بِنَصْرِهِ وَرَزَقَكُم مِّنَ الطَّيِّبَاتِ لَعَلَّكُمْ تَشْكُرُونَ
ఒకప్పటి మీ పరిస్థితిని కాస్త జ్ఞప్తికి తెచ్చుకోండి - అప్పట్లో మీరు అవనిలో అల్ప సంఖ్యలో ఉండేవారు. మరీ బలహీనులుగా పరిగణించబడేవారు. ప్రజలు మిమ్మల్ని మట్టుబెడతారేమోనని మీరు భయంతో బిక్కుబిక్కుమంటూ ఉండేవారు. అలాంటి పరిస్థితిలో అల్లాహ్‌ మీకు ఆశ్రయమిచ్చి, తన సహాయంతో మీకు బలిమిని ఇచ్చాడు. మీకు పరిశుభ్రమైన, పరిశుద్ధమైన ఆహార వస్తువులను ప్రసాదించాడు - మీరు కృతజ్ఞులై ఉండేందుకు.
8:27  يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا لَا تَخُونُوا اللَّهَ وَالرَّسُولَ وَتَخُونُوا أَمَانَاتِكُمْ وَأَنتُمْ تَعْلَمُونَ
ఓ విశ్వాసులారా! మీరు అల్లాహ్‌కూ, ఆయన ప్రవక్తకూ (వారి హక్కుల విషయంలో) ఉద్దేశ్యపూర్వకంగా ద్రోహం తలపెట్టకండి. అప్పగింతల విషయంలో కూడా ద్రోహానికి పాల్పడకండి.
8:28  وَاعْلَمُوا أَنَّمَا أَمْوَالُكُمْ وَأَوْلَادُكُمْ فِتْنَةٌ وَأَنَّ اللَّهَ عِندَهُ أَجْرٌ عَظِيمٌ
మీ సిరిసంపదలు, మీ సంతానం మీ పాలిట ఒక పరీక్ష అన్న సంగతిని తెలుసుకోండి. అల్లాహ్‌ వద్ద గొప్ప పుణ్యఫలం ఉందన్న విషయాన్ని కూడా (విస్మరించకండి).
8:29  يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا إِن تَتَّقُوا اللَّهَ يَجْعَل لَّكُمْ فُرْقَانًا وَيُكَفِّرْ عَنكُمْ سَيِّئَاتِكُمْ وَيَغْفِرْ لَكُمْ ۗ وَاللَّهُ ذُو الْفَضْلِ الْعَظِيمِ
ఓ విశ్వాసులారా! మీరు గనక అల్లాహ్‌ యెడల భయభక్తులతో మెలిగినట్లయితే ఆయన మీకు నిర్ణయాత్మకమైన ఒక వస్తువును (ఫుర్‌ఖాన్‌ను) ప్రసాదిస్తాడు. మీ పాపాలను మీ నుండి దూరం చేస్తాడు. మిమ్మల్ని క్షమిస్తాడు. ఆయన గొప్ప అనుగ్రహం కలవాడు.
8:30  وَإِذْ يَمْكُرُ بِكَ الَّذِينَ كَفَرُوا لِيُثْبِتُوكَ أَوْ يَقْتُلُوكَ أَوْ يُخْرِجُوكَ ۚ وَيَمْكُرُونَ وَيَمْكُرُ اللَّهُ ۖ وَاللَّهُ خَيْرُ الْمَاكِرِينَ
(ఓ ప్రవక్తా!) సత్య తిరస్కారులు నీకు వ్యతిరేకంగా వ్యూహ రచన చేసిన సంఘటనను కూడా గుర్తుకు తెచ్చుకో. నిన్ను బందీగా పట్టుకోవాలా? లేక నిన్ను హత్య చేయాలా? లేక నిన్ను దేశం నుంచి వెళ్ళగొట్టాలా? అని వారు తమ తరఫున ఎత్తులు వేస్తుండగా, అల్లాహ్‌ పై ఎత్తులు వేస్తూ ఉన్నాడు. ఎత్తులు వేయడంలో అల్లాహ్‌ సాటిలేని మేటి.
8:31  وَإِذَا تُتْلَىٰ عَلَيْهِمْ آيَاتُنَا قَالُوا قَدْ سَمِعْنَا لَوْ نَشَاءُ لَقُلْنَا مِثْلَ هَٰذَا ۙ إِنْ هَٰذَا إِلَّا أَسَاطِيرُ الْأَوَّلِينَ
వారి ముందు మా ఆయతులను చదివి వినిపించినపుడు, “మేం విన్నాంలే. మేము గనక తలచుకుంటే ఇలాంటి మాటల్ని మేమూ చెప్పగలం. ఇవి పూర్వీకుల నుంచి వస్తున్న కట్టుకథలు తప్ప మరేమీ కావు” అంటారు.
8:32  وَإِذْ قَالُوا اللَّهُمَّ إِن كَانَ هَٰذَا هُوَ الْحَقَّ مِنْ عِندِكَ فَأَمْطِرْ عَلَيْنَا حِجَارَةً مِّنَ السَّمَاءِ أَوِ ائْتِنَا بِعَذَابٍ أَلِيمٍ
(అంతేకాదు),”ఓ అల్లాహ్‌! ఈ ఖుర్‌ఆన్‌ నిజంగా నీ తరఫు నుండే వచ్చి ఉంటే, మాపై ఆకాశం నుంచి రాళ్ళ వాన కురిపించు లేదా మాపై ఏదైనా వ్యధాభరితమైన శిక్షను తీసుకురా” అని కూడా అన్నారు.
8:33  وَمَا كَانَ اللَّهُ لِيُعَذِّبَهُمْ وَأَنتَ فِيهِمْ ۚ وَمَا كَانَ اللَّهُ مُعَذِّبَهُمْ وَهُمْ يَسْتَغْفِرُونَ
(ఓ ప్రవక్తా!) వారి మధ్య నువ్వు ఉన్నంతకాలం అల్లాహ్‌ వారిపైకి శిక్షను తీసుకురాడు. వారు క్షమాపణకై వేడుకుంటూ ఉండగా కూడా అల్లాహ్‌ వారిని శిక్షించడు.
8:34  وَمَا لَهُمْ أَلَّا يُعَذِّبَهُمُ اللَّهُ وَهُمْ يَصُدُّونَ عَنِ الْمَسْجِدِ الْحَرَامِ وَمَا كَانُوا أَوْلِيَاءَهُ ۚ إِنْ أَوْلِيَاؤُهُ إِلَّا الْمُتَّقُونَ وَلَٰكِنَّ أَكْثَرَهُمْ لَا يَعْلَمُونَ
అల్లాహ్‌ వారిని శిక్షించకుండా ఎందుకు వదలిపెట్టాలి? చూడబోతే వారు మస్జిదె హరామ్‌కు ధర్మకర్తలు (ముతవల్లీలు) కారు. అయినప్పటికీ (జనులను) మస్జిదె హరామ్‌కు రాకుండా అడ్డుకుంటున్నారు. అల్లాహ్‌ భీతిపరులు తప్ప మరొకరు దానికి ధర్మకర్తలు కాలేరు. కాని వారిలో చాలా మందికి ఈ సంగతి తెలీదు.
8:35  وَمَا كَانَ صَلَاتُهُمْ عِندَ الْبَيْتِ إِلَّا مُكَاءً وَتَصْدِيَةً ۚ فَذُوقُوا الْعَذَابَ بِمَا كُنتُمْ تَكْفُرُونَ
కాబా గృహం వద్ద వారు చేసే నమాజ్‌ ఈలలు వేయటం, చప్పట్లు చరచటం తప్ప మరొకటి కాదు. కనుక మీరు ఒడిగట్టిన తిరస్కార వైఖరికి ప్రతిఫలంగా ఈ శిక్షను చవిచూడండి.
8:36  إِنَّ الَّذِينَ كَفَرُوا يُنفِقُونَ أَمْوَالَهُمْ لِيَصُدُّوا عَن سَبِيلِ اللَّهِ ۚ فَسَيُنفِقُونَهَا ثُمَّ تَكُونُ عَلَيْهِمْ حَسْرَةً ثُمَّ يُغْلَبُونَ ۗ وَالَّذِينَ كَفَرُوا إِلَىٰ جَهَنَّمَ يُحْشَرُونَ
నిశ్చయంగా ఈ సత్య తిరస్కారులు ప్రజలను అల్లాహ్‌ మార్గంలోకి రాకుండా అడ్డుకోవటానికి తమ సంపదలను ఖర్చు పెడుతున్నారు. వారు తమ సొమ్ములను ఇలా ఖర్చుపెడుతూనే ఉంటారు. అయితే ఆ సొమ్ములే వారి పాలిట దుఃఖదాయకంగా పరిణమిస్తాయి. ఆ తరువాత వారు ఓడిపోతారు. సత్యతిరస్కారులు నరకం వైపుకు ప్రోగు చేయబడతారు.
8:37  لِيَمِيزَ اللَّهُ الْخَبِيثَ مِنَ الطَّيِّبِ وَيَجْعَلَ الْخَبِيثَ بَعْضَهُ عَلَىٰ بَعْضٍ فَيَرْكُمَهُ جَمِيعًا فَيَجْعَلَهُ فِي جَهَنَّمَ ۚ أُولَٰئِكَ هُمُ الْخَاسِرُونَ
అల్లాహ్‌ అపవిత్రులను పవిత్రుల నుంచి వేరుపరచటానికీ, అపవిత్రులను పరస్పరం కలిపి, ఒకే గుంపుగా చేసి, ఆపైన వారందరినీ నరకంలో పడవెయ్యటానికి ఇలా చేస్తాడు. పూర్తిగా నష్టపోయేవారంటే వీరే.
8:38  قُل لِّلَّذِينَ كَفَرُوا إِن يَنتَهُوا يُغْفَرْ لَهُم مَّا قَدْ سَلَفَ وَإِن يَعُودُوا فَقَدْ مَضَتْ سُنَّتُ الْأَوَّلِينَ
(ఓ ప్రవక్తా!) ఈ అవిశ్వాసులకు చెప్పు : “వారు గనక మానుకుంటే గతంలో వారివల్ల జరిగిన పాపాలన్నీ క్షమించబడతాయి. ఒకవేళ వారు మళ్ళీ అదే వైఖరిని అవలంబిస్తే గత జాతులపై విధించబడిన ఉత్తర్వుల ఉపమానం ఉండనే ఉంది.”
8:39  وَقَاتِلُوهُمْ حَتَّىٰ لَا تَكُونَ فِتْنَةٌ وَيَكُونَ الدِّينُ كُلُّهُ لِلَّهِ ۚ فَإِنِ انتَهَوْا فَإِنَّ اللَّهَ بِمَا يَعْمَلُونَ بَصِيرٌ
ఫిత్నా (షిర్క్‌) సమసిపోనంత వరకూ, ధర్మం మొత్తం అల్లాహ్‌దే అయిపోనంత వరకూ వారితో పోరాడండి. ఒకవేళ వారు గనక తమ వైఖరిని మానుకుని దారికివస్తే అల్లాహ్‌ వారి కర్మలను చూస్తాడు.
8:40  وَإِن تَوَلَّوْا فَاعْلَمُوا أَنَّ اللَّهَ مَوْلَاكُمْ ۚ نِعْمَ الْمَوْلَىٰ وَنِعْمَ النَّصِيرُ
ఒకవేళ వారు (దారికి రాకుండా) తిరిగిపోతే అల్లాహ్‌యే మీ రక్షకుడని నమ్మండి. ఆయన ఉత్తమ సంరక్షకుడు, ఉత్తమ సహాయకుడూను.
8:41  وَاعْلَمُوا أَنَّمَا غَنِمْتُم مِّن شَيْءٍ فَأَنَّ لِلَّهِ خُمُسَهُ وَلِلرَّسُولِ وَلِذِي الْقُرْبَىٰ وَالْيَتَامَىٰ وَالْمَسَاكِينِ وَابْنِ السَّبِيلِ إِن كُنتُمْ آمَنتُم بِاللَّهِ وَمَا أَنزَلْنَا عَلَىٰ عَبْدِنَا يَوْمَ الْفُرْقَانِ يَوْمَ الْتَقَى الْجَمْعَانِ ۗ وَاللَّهُ عَلَىٰ كُلِّ شَيْءٍ قَدِيرٌ
మీరు అల్లాహ్‌ను, సత్యాసత్యాలను వేరుపరిచే రోజున, అనగా రెండు సైన్యాలు మార్కొనిన రోజున మేము మా దాసునిపై అవతరింపజేసిన దానిని విశ్వసించినట్లయితే - మీకు లభించిన ఎలాంటి యుద్ధప్రాప్తి అయినాసరే, అందులోని ఐదోవంతు అల్లాహ్‌కు, ఆయన ప్రవక్తకు, బంధువులకు, అనాథలకు, నిరుపేదలకు, బాటసారులకు చెందుతుందని తెలుసుకోండి. అల్లాహ్‌కు ప్రతి దానిపై అధికారం ఉంది.
8:42  إِذْ أَنتُم بِالْعُدْوَةِ الدُّنْيَا وَهُم بِالْعُدْوَةِ الْقُصْوَىٰ وَالرَّكْبُ أَسْفَلَ مِنكُمْ ۚ وَلَوْ تَوَاعَدتُّمْ لَاخْتَلَفْتُمْ فِي الْمِيعَادِ ۙ وَلَٰكِن لِّيَقْضِيَ اللَّهُ أَمْرًا كَانَ مَفْعُولًا لِّيَهْلِكَ مَنْ هَلَكَ عَن بَيِّنَةٍ وَيَحْيَىٰ مَنْ حَيَّ عَن بَيِّنَةٍ ۗ وَإِنَّ اللَّهَ لَسَمِيعٌ عَلِيمٌ
ఆ సమయంలో మీరు దగ్గరలో ఉన్న అంచున ఉన్నారు. వారు దూరాన ఉన్న అంచున ఉన్నారు. బిడారు మాత్రం మీకు దిగువన ఉంది. ఒకవేళ మీరు గనక పరస్పరం తీర్మానం చేసుకుని ఉంటే నిర్థారిత సమయానికి అక్కడ చేరుకునే విషయంలో మీరు విభేదించుకునేవారు. కాని అల్లాహ్‌, ముందే నిర్ణయించబడిన ఒక పనిని చేసి తీరటానికి - నాశనమయ్యేవాడు స్పష్టమైన ఆధారంపై నాశనమవడానికీ, బ్రతికివున్నవాడు కూడా స్పష్టమైన ప్రమాణంపై బ్రతికి ఉండడానికి గాను (ఈ విధంగా వ్యూహ రచన చేశాడు). నిశ్చయంగా అల్లాహ్‌ అంతా వినేవాడు, అన్నీ తెలిసినవాడు.
8:43  إِذْ يُرِيكَهُمُ اللَّهُ فِي مَنَامِكَ قَلِيلًا ۖ وَلَوْ أَرَاكَهُمْ كَثِيرًا لَّفَشِلْتُمْ وَلَتَنَازَعْتُمْ فِي الْأَمْرِ وَلَٰكِنَّ اللَّهَ سَلَّمَ ۗ إِنَّهُ عَلِيمٌ بِذَاتِ الصُّدُورِ
(ఓ ప్రవక్తా! ఆ సమయంలో) అల్లాహ్‌ నీ కలలో వారి సంఖ్యను అల్పంగా చేసి చూపించాడు. వారిని అధిక సంఖ్యలో చూపి ఉంటే, మీరు జడుసుకుని, ఈ వ్యవహారంలో మీరు పరస్పరం గొడవపడి ఉండేవారు. అయితే అల్లాహ్‌ (మిమ్మల్ని) కాపాడాడు. నిశ్చయంగా ఆయన గుండెల్లోని గుట్టును (సయితం) బాగా ఎరిగినవాడు.
8:44  وَإِذْ يُرِيكُمُوهُمْ إِذِ الْتَقَيْتُمْ فِي أَعْيُنِكُمْ قَلِيلًا وَيُقَلِّلُكُمْ فِي أَعْيُنِهِمْ لِيَقْضِيَ اللَّهُ أَمْرًا كَانَ مَفْعُولًا ۗ وَإِلَى اللَّهِ تُرْجَعُ الْأُمُورُ
నిర్ణయించబడిన కార్యాన్ని పూర్తి చేసేందుకు మీరు పరస్పరం మార్కొన్న సమయంలో అల్లాహ్‌, మీ కళ్లకు వారు (శత్రువులు) కొద్దిమందిగా కనిపించేలా చేశాడు. అదే సమయంలో వారి కళ్లకు కూడా మిమ్మల్ని కొద్దిమందిగానే చూపించాడు. సమస్త వ్యవహారాలూ అల్లాహ్‌ వైపుకే మళ్ళించబడతాయి.
8:45  يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا إِذَا لَقِيتُمْ فِئَةً فَاثْبُتُوا وَاذْكُرُوا اللَّهَ كَثِيرًا لَّعَلَّكُمْ تُفْلِحُونَ
ఓ విశ్వాసులారా! మీరు ఏ ప్రత్యర్థి సైన్యాన్ని అయినా ఎదుర్కోవలసి వచ్చినప్పుడు నిలకడ చూపండి. అత్యధికంగా అల్లాహ్‌ను స్మరించండి. తద్వారా మీకు విజయం ప్రాప్తించవచ్చు.
8:46  وَأَطِيعُوا اللَّهَ وَرَسُولَهُ وَلَا تَنَازَعُوا فَتَفْشَلُوا وَتَذْهَبَ رِيحُكُمْ ۖ وَاصْبِرُوا ۚ إِنَّ اللَّهَ مَعَ الصَّابِرِينَ
ఇంకా మీరందరూ అల్లాహ్‌కూ, ఆయన ప్రవక్తకూ విధేయులై ఉండండి. పరస్పరం గొడవ పడకండి. అలా చేస్తే (గొడవపడ్డారంటే) మీరు పిరికివారై పోతారు. మీ శక్తి సన్నగిల్లిపోతుంది. అందుకే సహన స్థయిర్యాలను పాటించండి. స్థయిర్యం కనబరచే వారికి అల్లాహ్‌ తోడుగా ఉంటాడు.
8:47  وَلَا تَكُونُوا كَالَّذِينَ خَرَجُوا مِن دِيَارِهِم بَطَرًا وَرِئَاءَ النَّاسِ وَيَصُدُّونَ عَن سَبِيلِ اللَّهِ ۚ وَاللَّهُ بِمَا يَعْمَلُونَ مُحِيطٌ
అహంకారాన్ని ప్రదర్శిస్తూ, ప్రజల ముందు తమ బడాయిని చాటుకుంటూ తమ ఇండ్ల నుంచి బయలుదేరిన వారి మాదిరిగా, అల్లాహ్‌ మార్గం నుండి ప్రజలను ఆపే వారిలాగా మీరు తయారవకండి. వారి ఆగడాలపై అల్లాహ్‌ పట్టు బిగించనున్నాడు.
8:48  وَإِذْ زَيَّنَ لَهُمُ الشَّيْطَانُ أَعْمَالَهُمْ وَقَالَ لَا غَالِبَ لَكُمُ الْيَوْمَ مِنَ النَّاسِ وَإِنِّي جَارٌ لَّكُمْ ۖ فَلَمَّا تَرَاءَتِ الْفِئَتَانِ نَكَصَ عَلَىٰ عَقِبَيْهِ وَقَالَ إِنِّي بَرِيءٌ مِّنكُمْ إِنِّي أَرَىٰ مَا لَا تَرَوْنَ إِنِّي أَخَافُ اللَّهَ ۚ وَاللَّهُ شَدِيدُ الْعِقَابِ
ఆ సమయంలో షైతాను వారి కార్యకలాపాలను వారికి ఎంతో రమణీయమైనవిగా చేసి చూపాడు. “ఈ రోజు మిమ్మల్ని ఓడించేవాడు జనులలో ఎవడూలేడు. నేను సయితం మీకు అండగా ఉన్నాను!” అని చెప్పాడు. కాని తీరా ఆ ఇరుపక్షాలు పరస్పరం ఎదురుపడినప్పుడు వాడు తన మడమలపై వెనుతిరిగి పోయాడు. “ఈ వ్యవహారంలో మీతో నాకెలాంటి సంబంధంలేదు. మీరు చూడనిది నేను చూస్తున్నాను. నేను అల్లాహ్‌కు భయపడుతున్నాను. అల్లాహ్‌ చాలా కఠినంగా శిక్షించేవాడు” అని అన్నాడు.
8:49  إِذْ يَقُولُ الْمُنَافِقُونَ وَالَّذِينَ فِي قُلُوبِهِم مَّرَضٌ غَرَّ هَٰؤُلَاءِ دِينُهُمْ ۗ وَمَن يَتَوَكَّلْ عَلَى اللَّهِ فَإِنَّ اللَّهَ عَزِيزٌ حَكِيمٌ
ఆ సందర్భంగా కపటులు, హృదయాలలో రోగం ఉన్న వారు కూడా ఇలా అన్నారు : “వీళ్ళ ధర్మం వీళ్ళని మోసంలో పడవేసింది.” కాని ఎవరు అల్లాహ్‌ను నమ్ముకున్నారో నిశ్చయంగా అల్లాహ్‌ సర్వాధిక్యుడు, వివేకవంతుడు (అని తెలుసుకోవాలి).
8:50  وَلَوْ تَرَىٰ إِذْ يَتَوَفَّى الَّذِينَ كَفَرُوا ۙ الْمَلَائِكَةُ يَضْرِبُونَ وُجُوهَهُمْ وَأَدْبَارَهُمْ وَذُوقُوا عَذَابَ الْحَرِيقِ
(ఓ ప్రవక్తా!) దూతలు సత్యతిరస్కారుల ప్రాణాలు తీస్తూ ఉన్నప్పటి దృశ్యాన్ని నువ్వు చూడగలిగితే ఎంత బావుండు! వారు వాళ్ల ముఖాలపై, పిరుదులపై కొడుతూ ఉంటారు. ఇంకా ఇలా అంటూ ఉంటారు : “ఇదిగో, దహించివేసే శిక్షను చవి చూడండి.
8:51  ذَٰلِكَ بِمَا قَدَّمَتْ أَيْدِيكُمْ وَأَنَّ اللَّهَ لَيْسَ بِظَلَّامٍ لِّلْعَبِيدِ
“ఇది మీ చేతులు ముందుగానే చేసి పంపుకున్న పాపానికి ప్రతిఫలం. అంతేగాని అల్లాహ్‌ తన దాసులకు అన్యాయం చేసేవాడు కాడు.”
8:52  كَدَأْبِ آلِ فِرْعَوْنَ ۙ وَالَّذِينَ مِن قَبْلِهِمْ ۚ كَفَرُوا بِآيَاتِ اللَّهِ فَأَخَذَهُمُ اللَّهُ بِذُنُوبِهِمْ ۗ إِنَّ اللَّهَ قَوِيٌّ شَدِيدُ الْعِقَابِ
(వీళ్ల ధోరణి) ఫిరౌను అనుయాయుల, వారి పూర్వీకుల ధోరణిని పోలి ఉన్నది. వారు అల్లాహ్‌ ఆయతులను తిరస్కరించగా, అల్లాహ్‌ వారి పాపాల కారణంగా వారిని పట్టుకున్నాడు. నిస్సందేహంగా అల్లాహ్‌ బలవంతుడు, కఠినంగా శిక్షించేవాడూను.
8:53  ذَٰلِكَ بِأَنَّ اللَّهَ لَمْ يَكُ مُغَيِّرًا نِّعْمَةً أَنْعَمَهَا عَلَىٰ قَوْمٍ حَتَّىٰ يُغَيِّرُوا مَا بِأَنفُسِهِمْ ۙ وَأَنَّ اللَّهَ سَمِيعٌ عَلِيمٌ
ఇలా ఎందుకు జరుగుతుందంటే, అల్లాహ్‌ ఏ జాతివారికైనా అనుగ్రహాన్ని ప్రసాదించిన తర్వాత వారు స్వయంగా తమకు తామై తమ స్థితిని మార్చుకుంటేనే తప్ప అల్లాహ్‌ తాను ప్రసాదించిన అనుగ్రహాన్ని మార్చడు. నిశ్చయంగా అల్లాహ్‌ అంతా వినేవాడు, అన్నీ తెలిసినవాడు
8:54  كَدَأْبِ آلِ فِرْعَوْنَ ۙ وَالَّذِينَ مِن قَبْلِهِمْ ۚ كَذَّبُوا بِآيَاتِ رَبِّهِمْ فَأَهْلَكْنَاهُم بِذُنُوبِهِمْ وَأَغْرَقْنَا آلَ فِرْعَوْنَ ۚ وَكُلٌّ كَانُوا ظَالِمِينَ
(వీళ్ళ పోకడ) ఫిరౌను అనుచరుల, వారి పూర్వీకుల పోకడను పోలి ఉన్నది - వారు తమ ప్రభువు నిదర్శనాలను ధిక్కరించారు. అప్పుడు మేము వారి పాపాల కారణంగా వారిని నాశనం చేశాము. ఫిరౌనీయులను ముంచివేశాము. వారంతా దుర్మార్గులే.
8:55  إِنَّ شَرَّ الدَّوَابِّ عِندَ اللَّهِ الَّذِينَ كَفَرُوا فَهُمْ لَا يُؤْمِنُونَ
సత్యాన్ని తిరస్కరించి, ఎన్నటికీ దానిని విశ్వసించకుండా ఉండేవారే అల్లాహ్‌ దృష్టిలో అత్యంత హీనమైన జంతువులు.
8:56  الَّذِينَ عَاهَدتَّ مِنْهُمْ ثُمَّ يَنقُضُونَ عَهْدَهُمْ فِي كُلِّ مَرَّةٍ وَهُمْ لَا يَتَّقُونَ
నువ్వు వారితో ఒప్పందం చేసుకున్నావు. అయినా వారు తమ ఒప్పందాన్ని పదే పదే ఉల్లంఘిస్తున్నారు. పైపెచ్చు ఏమాత్రం భయపడటం లేదు.
8:57  فَإِمَّا تَثْقَفَنَّهُمْ فِي الْحَرْبِ فَشَرِّدْ بِهِم مَّنْ خَلْفَهُمْ لَعَلَّهُمْ يَذَّكَّرُونَ
కాబట్టి యుద్ధంలో నువ్వు ఎప్పుడైనా వారిపై ఆధిక్యం పొందితే వారి వెనుక ఉన్నవారు సయితం బెంబేలెత్తి పారిపోయేలా వారిని గట్టిగా వాయించు. ఆ విధంగానయినా వారికి బుద్ధిరావచ్చు.
8:58  وَإِمَّا تَخَافَنَّ مِن قَوْمٍ خِيَانَةً فَانبِذْ إِلَيْهِمْ عَلَىٰ سَوَاءٍ ۚ إِنَّ اللَّهَ لَا يُحِبُّ الْخَائِنِينَ
ఒకవేళ ఏ జాతి వారైనా నమ్మక ద్రోహానికి పాల్పడవచ్చన్న భయం నీకు కలిగితే - సరిసమానంగా - వారి ఒప్పందాన్ని వారి ముందు విసిరివెయ్యి. నమ్మక ద్రోహం చేసేవారిని అల్లాహ్‌ ఎంతమాత్రం ఇష్టపడడు.
8:59  وَلَا يَحْسَبَنَّ الَّذِينَ كَفَرُوا سَبَقُوا ۚ إِنَّهُمْ لَا يُعْجِزُونَ
తాము (శిక్ష నుండి తప్పించుకుని) ముందుకు సాగిపోయామని అవిశ్వాసులు ఎన్నడూ తలపోయరాదు. ఎట్టి పరిస్థితిలోనూ వారు మమ్మల్ని అశక్తుల్ని చేయలేరు.
8:60  وَأَعِدُّوا لَهُم مَّا اسْتَطَعْتُم مِّن قُوَّةٍ وَمِن رِّبَاطِ الْخَيْلِ تُرْهِبُونَ بِهِ عَدُوَّ اللَّهِ وَعَدُوَّكُمْ وَآخَرِينَ مِن دُونِهِمْ لَا تَعْلَمُونَهُمُ اللَّهُ يَعْلَمُهُمْ ۚ وَمَا تُنفِقُوا مِن شَيْءٍ فِي سَبِيلِ اللَّهِ يُوَفَّ إِلَيْكُمْ وَأَنتُمْ لَا تُظْلَمُونَ
మీరు వాళ్లను ఎదుర్కోవటానికి శాయశక్తులా బలాన్ని కూడగట్టుకోవటం ద్వారా, కట్టివుంచిన గుఱ్ఱాల ద్వారా సన్నద్ధులై ఉండండి. ఈ సన్నాహాల ద్వారా మీరు అల్లాహ్‌ విరోధులను, మీ విరోధులను, మీకు తెలియకుండా ఉన్న - కాని అల్లాహ్‌కు మాత్రం బాగా తెలిసిన - ఇతర శత్రువులను కూడా భయకంపితుల్ని చేయవచ్చు. అల్లాహ్‌ మార్గంలో మీరు వెచ్చించేదంతా మీకు పూర్తిగా తిరిగి ఇవ్వబడుతుంది. మీకెలాంటి అన్యాయమూ జరగదు.
8:61  وَإِن جَنَحُوا لِلسَّلْمِ فَاجْنَحْ لَهَا وَتَوَكَّلْ عَلَى اللَّهِ ۚ إِنَّهُ هُوَ السَّمِيعُ الْعَلِيمُ
ఒకవేళ వారు సంధివైపు మొగ్గు చూపితే (ఓ ప్రవక్తా!) నువ్వు కూడా సంధి వైపుకు మొగ్గుచూపు. అల్లాహ్‌పై భారం మోపు. నిశ్చయంగా ఆయన అంతా వినేవాడు, అన్నీ తెలిసినవాడు.
8:62  وَإِن يُرِيدُوا أَن يَخْدَعُوكَ فَإِنَّ حَسْبَكَ اللَّهُ ۚ هُوَ الَّذِي أَيَّدَكَ بِنَصْرِهِ وَبِالْمُؤْمِنِينَ
ఒకవేళ వారు నిన్ను మోసగించదలిస్తే, నీకు అల్లాహ్‌ చాలు. ఆయనే తన సహాయం ద్వారానూ, విశ్వాసుల ద్వారానూ నీకు తోడ్పడ్డాడు.
8:63  وَأَلَّفَ بَيْنَ قُلُوبِهِمْ ۚ لَوْ أَنفَقْتَ مَا فِي الْأَرْضِ جَمِيعًا مَّا أَلَّفْتَ بَيْنَ قُلُوبِهِمْ وَلَٰكِنَّ اللَّهَ أَلَّفَ بَيْنَهُمْ ۚ إِنَّهُ عَزِيزٌ حَكِيمٌ
వారి హృదయాలలో పరస్పరం ప్రేమానురాగాలను పొందుపరచినది కూడా ఆయనే. భూమిలో వున్న సమస్తాన్నీ ఖర్చుపెట్టినా నువ్వు పరస్పరం వారి హృదయాలను కలపలేక పోయేవాడవు. అల్లాహ్‌యే వారి మనసులను కలిపాడు. నిశ్చయంగా ఆయన సర్వాధిక్యుడు, వివేచనాశీలి.
8:64  يَا أَيُّهَا النَّبِيُّ حَسْبُكَ اللَّهُ وَمَنِ اتَّبَعَكَ مِنَ الْمُؤْمِنِينَ
ఓ ప్రవక్తా! నీకూ, నిన్ను అనుసరించే విశ్వాసులకూ అల్లాహ్‌యే చాలు.
8:65  يَا أَيُّهَا النَّبِيُّ حَرِّضِ الْمُؤْمِنِينَ عَلَى الْقِتَالِ ۚ إِن يَكُن مِّنكُمْ عِشْرُونَ صَابِرُونَ يَغْلِبُوا مِائَتَيْنِ ۚ وَإِن يَكُن مِّنكُم مِّائَةٌ يَغْلِبُوا أَلْفًا مِّنَ الَّذِينَ كَفَرُوا بِأَنَّهُمْ قَوْمٌ لَّا يَفْقَهُونَ
ఓ ప్రవక్తా! విశ్వాసులను యుద్ధానికై ప్రేరేపించు. మీలో గనక ధైర్య స్థయిర్యాలు గలవారు ఇరవైమంది ఉంటే, వారు రెండొందల మందిని జయిస్తారు. ఒకవేళ మీలో వందమంది ఉంటే వారు వెయ్యిమంది అవిశ్వాసులను జయిస్తారు. ఎందుకంటే వారు (అవిశ్వాసులు) అవివేకులు.
8:66  الْآنَ خَفَّفَ اللَّهُ عَنكُمْ وَعَلِمَ أَنَّ فِيكُمْ ضَعْفًا ۚ فَإِن يَكُن مِّنكُم مِّائَةٌ صَابِرَةٌ يَغْلِبُوا مِائَتَيْنِ ۚ وَإِن يَكُن مِّنكُمْ أَلْفٌ يَغْلِبُوا أَلْفَيْنِ بِإِذْنِ اللَّهِ ۗ وَاللَّهُ مَعَ الصَّابِرِينَ
సరే, అల్లాహ్‌ ఇప్పుడు మీ బరువును తగ్గిస్తున్నాడు. మీలో బలహీనత ఉన్న సంగతి ఆయనకు బాగా తెలుసు. కనుక మీలో వందమంది ధైర్యస్థయిర్యాలు గలవారుంటే వారు రెండొందల మందిని ఓడిస్తారు. ఒకవేళ మీలో గనక వెయ్యి మంది ఉంటే వారు దైవాజ్ఞానుసారం రెండువేల మందిని ఓడిస్తారు. అల్లాహ్‌ ధైర్యస్థయిర్యాలు గలవారికి తోడుగా ఉంటాడు.
8:67  مَا كَانَ لِنَبِيٍّ أَن يَكُونَ لَهُ أَسْرَىٰ حَتَّىٰ يُثْخِنَ فِي الْأَرْضِ ۚ تُرِيدُونَ عَرَضَ الدُّنْيَا وَاللَّهُ يُرِيدُ الْآخِرَةَ ۗ وَاللَّهُ عَزِيزٌ حَكِيمٌ
రాజ్యంలో బాగా రక్తపాతంతో కూడిన యుద్ధం జరగనంత వరకూ యుద్ధ ఖైదీలను తన వద్ద ఉంచుకోవటం ఏ ప్రవక్తకూ తగదు. మీరు ప్రాపంచిక సంపదలను కోరుకుంటున్నారు. కాని అల్లాహ్‌ (మీ కోసం) పరలోకాన్ని కోరుకుంటున్నాడు. అల్లాహ్‌ సర్వాధిక్యుడు, వివేకవంతుడు.
8:68  لَّوْلَا كِتَابٌ مِّنَ اللَّهِ سَبَقَ لَمَسَّكُمْ فِيمَا أَخَذْتُمْ عَذَابٌ عَظِيمٌ
ఒకవేళ ముందు నుంచే అల్లాహ్‌ వద్ద ఆ విషయం రాసి ఉండకపోతే, మీరు తీసుకున్న దానిపై మీకు పెద్ద శిక్షపడి ఉండేది.
8:69  فَكُلُوا مِمَّا غَنِمْتُمْ حَلَالًا طَيِّبًا ۚ وَاتَّقُوا اللَّهَ ۚ إِنَّ اللَّهَ غَفُورٌ رَّحِيمٌ
కాబట్టి, మీరు పొందిన ధర్మబద్ధమైన, పరిశుద్ధమైన యుద్ధ ప్రాప్తిని నిస్సంకోచంగా తినండి. అల్లాహ్‌కు భయపడుతూ ఉండండి. నిశ్చయంగా అల్లాహ్‌ క్షమించేవాడు, కనికరించేవాడూను.
8:70  يَا أَيُّهَا النَّبِيُّ قُل لِّمَن فِي أَيْدِيكُم مِّنَ الْأَسْرَىٰ إِن يَعْلَمِ اللَّهُ فِي قُلُوبِكُمْ خَيْرًا يُؤْتِكُمْ خَيْرًا مِّمَّا أُخِذَ مِنكُمْ وَيَغْفِرْ لَكُمْ ۗ وَاللَّهُ غَفُورٌ رَّحِيمٌ
ఓ ప్రవక్తా! మీ అధీనంలోవున్న ఖైదీలతో ఇలా చెప్పు: “అల్లాహ్‌ మీ హృదయాలలో ఏ కాస్త మంచి సంకల్పాన్ని చూసినా, మీ నుండి పుచ్చుకున్న దానికన్నా మేలైన దాన్నే మీకు ప్రసాదిస్తాడు. మీ తప్పుల్ని కూడా క్షమిస్తాడు. అల్లాహ్‌ క్షమించేవాడు, కరుణించేవాడు.”
8:71  وَإِن يُرِيدُوا خِيَانَتَكَ فَقَدْ خَانُوا اللَّهَ مِن قَبْلُ فَأَمْكَنَ مِنْهُمْ ۗ وَاللَّهُ عَلِيمٌ حَكِيمٌ
ఒకవేళ వారు నీకు ద్రోహం చేయాలని అనుకుంటే, ఇంతకు ముందు వారు అల్లాహ్‌కే ద్రోహం తలపెట్టారు. ఎట్టకేలకు ఆయన వాళ్లను నీకప్పగించాడు. అల్లాహ్‌ అన్నీ తెలిసినవాడు, వివేకవంతుడు.
8:72  إِنَّ الَّذِينَ آمَنُوا وَهَاجَرُوا وَجَاهَدُوا بِأَمْوَالِهِمْ وَأَنفُسِهِمْ فِي سَبِيلِ اللَّهِ وَالَّذِينَ آوَوا وَّنَصَرُوا أُولَٰئِكَ بَعْضُهُمْ أَوْلِيَاءُ بَعْضٍ ۚ وَالَّذِينَ آمَنُوا وَلَمْ يُهَاجِرُوا مَا لَكُم مِّن وَلَايَتِهِم مِّن شَيْءٍ حَتَّىٰ يُهَاجِرُوا ۚ وَإِنِ اسْتَنصَرُوكُمْ فِي الدِّينِ فَعَلَيْكُمُ النَّصْرُ إِلَّا عَلَىٰ قَوْمٍ بَيْنَكُمْ وَبَيْنَهُم مِّيثَاقٌ ۗ وَاللَّهُ بِمَا تَعْمَلُونَ بَصِيرٌ
ఎవరు విశ్వసించి, వలసపోయారో, అల్లాహ్‌ మార్గంలో తమ ధనప్రాణాల ద్వారా పోరాడారో వారూ, వారికి ఆశ్రయమిచ్చి సహాయపడినవారూ - వారంతా ఒండొకరికి మిత్రులు. మరెవరు విశ్వసించినప్పటికీ (తమ ఇల్లూ వాకిలిని విడిచి) వలసపోలేదో, వారు వలసపోయి మీ వద్దకు రానంతవరకూ వారితో మీకెలాంటి స్నేహబంధం లేదు. కాకపోతే ధార్మిక వ్యవహారాలలో వారెప్పుడు మీ సహాయం కోరినా, మీరు వారికి సహాయపడటం అవసరం. అయితే మీతో ఒప్పందం చేసుకున్నవారికి వ్యతిరేకంగా మాత్రం కాదు. మీరు చేసే పనులన్నింటినీ అల్లాహ్‌ చూస్తూనే ఉన్నాడు.
8:73  وَالَّذِينَ كَفَرُوا بَعْضُهُمْ أَوْلِيَاءُ بَعْضٍ ۚ إِلَّا تَفْعَلُوهُ تَكُن فِتْنَةٌ فِي الْأَرْضِ وَفَسَادٌ كَبِيرٌ
అవిశ్వాసులు ఒండొకరికి మిత్రులు. ఒకవేళ మీరు కూడా అలా ఉండకపోతే భువిలో ఉపద్రవం (ఫిత్నా) మొదలవుతుంది. పెద్ద కల్లోలమే చెలరేగుతుంది.
8:74  وَالَّذِينَ آمَنُوا وَهَاجَرُوا وَجَاهَدُوا فِي سَبِيلِ اللَّهِ وَالَّذِينَ آوَوا وَّنَصَرُوا أُولَٰئِكَ هُمُ الْمُؤْمِنُونَ حَقًّا ۚ لَّهُم مَّغْفِرَةٌ وَرِزْقٌ كَرِيمٌ
ఎవరు విశ్వసించి, స్వస్థలాన్ని విడిచి వలసపోయారో, అల్లాహ్‌ మార్గంలో పోరాటం సలిపారో, మరెవరు (వారికి) ఆశ్రయమిచ్చి ఆదుకున్నారో - వారే నిజమయిన విశ్వాసులు. వారి కొరకు మన్నింపూ ఉంది, గౌరవప్రదమయిన ఉపాధి కూడా ఉంది.
8:75  وَالَّذِينَ آمَنُوا مِن بَعْدُ وَهَاجَرُوا وَجَاهَدُوا مَعَكُمْ فَأُولَٰئِكَ مِنكُمْ ۚ وَأُولُو الْأَرْحَامِ بَعْضُهُمْ أَوْلَىٰ بِبَعْضٍ فِي كِتَابِ اللَّهِ ۗ إِنَّ اللَّهَ بِكُلِّ شَيْءٍ عَلِيمٌ
మరెవరు ఆ తరువాత విశ్వసించి, వలసపోయారో, మీతో కలసి పోరాడారో- వారు కూడా మీవారే. కాని దైవాజ్ఞ ప్రకారం వారిలో కొందరు మరికొందరికి బంధుత్వ సంబంధాల కారణంగా ఎక్కువ సన్నిహితులు. నిశ్చయంగా అల్లాహ్‌ ప్రతిదీ తెలిసినవాడు.


ఈ తెలుగు ఖుర్ఆన్ శాంతి మార్గం పబ్లికేషన్ వారు ప్రచురించారు. వారి అనుమతితో ఈ వెబ్ పోర్టల్ పై వేయబడింది.