Translation
| 79. సూరా అన్ నాజి ఆత్ 79:1 وَالنَّازِعَاتِ غَرْقًا మునిగి నిర్దాక్షిణ్యంగా (ప్రాణాలు) లాక్కుపోయేవారి సాక్షిగా! 79:2 وَالنَّاشِطَاتِ نَشْطًا ముడిని విప్పి విడిపించేవారి సాక్షిగా! 79:3 وَالسَّابِحَاتِ سَبْحًا తేలియాడుతూపోయే వారి సాక్షిగా! 79:4 فَالسَّابِقَاتِ سَبْقًا వేగంగా దూసుకుపోతూ, ఒండొకరిని మించిపోయేవారి సాక్షిగా! 79:5 فَالْمُدَبِّرَاتِ أَمْرًا (తమ ప్రభువు అప్పగించిన) పనులను పకడ్బందీగా అమలుపరిచే వారి సాక్షిగా! 79:6 يَوْمَ تَرْجُفُ الرَّاجِفَةُ ఆ రోజు దద్దరిల్లేది దద్దరిల్లుతుంది. 79:7 تَتْبَعُهَا الرَّادِفَةُ మరి దాని వెనుక వచ్చేది (వెంబడిస్తూనే) వస్తుంది. 79:8 قُلُوبٌ يَوْمَئِذٍ وَاجِفَةٌ (ఎన్నో) గుండెలు ఆ రోజు భయంతో దడదడలాడుతాయి. 79:9 أَبْصَارُهَا خَاشِعَةٌ వారి చూపులు క్రిందికి వంగి ఉంటాయి. 79:10 يَقُولُونَ أَإِنَّا لَمَرْدُودُونَ فِي الْحَافِرَةِ “ఏమిటి, మేము మొదటి అవస్థలోనికే మళ్ళించబడతామా?” (అని వారు అడుగుతున్నారు.) 79:11 أَإِذَا كُنَّا عِظَامًا نَّخِرَةً “మేము కృశించిన ఎముకలుగా మారిన తరువాత కూడానా?!” (అని వారు అంటున్నారు కదూ!) 79:12 قَالُوا تِلْكَ إِذًا كَرَّةٌ خَاسِرَةٌ “మరైతే ఈ మళ్లింపు (మా పాలిట) నష్టకరమే” అని కూడా వారంటున్నారు. 79:13 فَإِنَّمَا هِيَ زَجْرَةٌ وَاحِدَةٌ అదొక (భయంకరమైన) గద్దింపు (అని మరువకండి). 79:14 فَإِذَا هُم بِالسَّاهِرَةِ (అది సంభవించగానే) వారంతా ఒక్కసారిగా మైదానంలో సమీకరించబడతారు. 79:15 هَلْ أَتَاكَ حَدِيثُ مُوسَىٰ (ఓ ప్రవక్తా!) మూసా సంగతిగాని నీ వరకు చేరిందా? 79:16 إِذْ نَادَاهُ رَبُّهُ بِالْوَادِ الْمُقَدَّسِ طُوًى అప్పుడు అతని ప్రభువు అతణ్ణి ‘తువా’ అనే పవిత్ర లోయలోకి పిలిచాడు. 79:17 اذْهَبْ إِلَىٰ فِرْعَوْنَ إِنَّهُ طَغَىٰ “నువ్వు ఫిరౌను వద్దకు వెళ్ళు. వాడు మరీ చెలరేగిపోయాడు.” 79:18 فَقُلْ هَل لَّكَ إِلَىٰ أَن تَزَكَّىٰ “నీ స్వీయ సంస్కరణకు నువ్వు సిద్ధంగా ఉన్నావా?” అని వాణ్ణి అడుగు. 79:19 وَأَهْدِيَكَ إِلَىٰ رَبِّكَ فَتَخْشَىٰ “నువ్వు భయభక్తులతో మసలుకునేందుకుగాను, నేను నీకు నీ ప్రభువు మార్గం చూపించనా!?” (అని చెప్పమని అల్లాహ్ మూసాకు ఉపదేశించాడు). 79:20 فَأَرَاهُ الْآيَةَ الْكُبْرَىٰ మరి (మూసా) అతనికి గొప్ప సూచన (మహిమ)ను చూపాడు. 79:21 فَكَذَّبَ وَعَصَىٰ కాని వాడు మాత్రం ధిక్కరించాడు, అవిధేయతకు పాల్పడ్డాడు. 79:22 ثُمَّ أَدْبَرَ يَسْعَىٰ ఆ తర్వాత తిరిగి వెళ్లి, తన సన్నాహాలు మొదలెట్టాడు. 79:23 فَحَشَرَ فَنَادَىٰ మరి అందరినీ సమావేశపరచి, ప్రకటించాడు. 79:24 فَقَالَ أَنَا رَبُّكُمُ الْأَعْلَىٰ “నేనే మీ సర్వోన్నత ప్రభువును” అన్నాడు. 79:25 فَأَخَذَهُ اللَّهُ نَكَالَ الْآخِرَةِ وَالْأُولَىٰ అందువల్ల అల్లాహ్ అతన్ని ఇహపర లోకాల శిక్షగా పట్టుకున్నాడు. 79:26 إِنَّ فِي ذَٰلِكَ لَعِبْرَةً لِّمَن يَخْشَىٰ నిశ్చయంగా ఇందులో దైవభీతిగల ప్రతి ఒక్కరికీ గొప్ప గుణపాఠం ఉంది. 79:27 أَأَنتُمْ أَشَدُّ خَلْقًا أَمِ السَّمَاءُ ۚ بَنَاهَا ఏమిటి, మిమ్మల్ని సృష్టించటం కష్టంతో కూడుకున్న పనా? లేక ఆకాశాన్నా? ఆయనే (అల్లాహ్ యే) దానిని నిర్మించాడు. 79:28 رَفَعَ سَمْكَهَا فَسَوَّاهَا ఆయనే దాని కప్పును బాగా ఎత్తుగా చేశాడు. మరి దానిని తీర్చిదిద్దాడు. 79:29 وَأَغْطَشَ لَيْلَهَا وَأَخْرَجَ ضُحَاهَا దాని రాత్రిని చీకటిమయంగా చేశాడు, దాని పగటిని (వెలుతురుగా) బయల్పరిచాడు. 79:30 وَالْأَرْضَ بَعْدَ ذَٰلِكَ دَحَاهَا తరువాత భూమిని సుగమం చేశాడు. 79:31 أَخْرَجَ مِنْهَا مَاءَهَا وَمَرْعَاهَا అందులో నుంచి దాని నీళ్ళను, దాని పచ్చికను వెలికి తీశాడు. 79:32 وَالْجِبَالَ أَرْسَاهَا ఇంకా, పర్వతాలను (స్థిరంగా) పాతి పెట్టాడు. 79:33 مَتَاعًا لَّكُمْ وَلِأَنْعَامِكُمْ ఇదంతా మీ కోసమూను, మీ పశువుల ప్రయోజనం కోసమే. 79:34 فَإِذَا جَاءَتِ الطَّامَّةُ الْكُبْرَىٰ మరెప్పుడైతే ఆ మహా విపత్తు (ప్రళయం) వచ్చిపడుతుందో... 79:35 يَوْمَ يَتَذَكَّرُ الْإِنسَانُ مَا سَعَىٰ ఆ రోజు మనిషి తాను చేసిన దాన్ని నెమరు వేసుకుంటాడు. 79:36 وَبُرِّزَتِ الْجَحِيمُ لِمَن يَرَىٰ ప్రతి చూపరి ముందూ నరకం బహిర్గతం చేయబడుతుంది. 79:37 فَأَمَّا مَن طَغَىٰ కాబట్టి ఎవడు తలబిరుసుగా వ్యవహరించాడో, 79:38 وَآثَرَ الْحَيَاةَ الدُّنْيَا మరి ప్రాపంచిక జీవితానికే ప్రాధాన్యం ఇచ్చాడో, 79:39 فَإِنَّ الْجَحِيمَ هِيَ الْمَأْوَىٰ అతని నివాసం నరకమే అవుతుంది. 79:40 وَأَمَّا مَنْ خَافَ مَقَامَ رَبِّهِ وَنَهَى النَّفْسَ عَنِ الْهَوَىٰ మరెవడు తన ప్రభువు ఎదుట నిలబడే విషయమై భయపడ్డాడో, ఇంకా తన మనసును చెడు వాంఛల నుండి ఆపుకున్నాడో, 79:41 فَإِنَّ الْجَنَّةَ هِيَ الْمَأْوَىٰ అతని నివాసం స్వర్గమవుతుంది. 79:42 يَسْأَلُونَكَ عَنِ السَّاعَةِ أَيَّانَ مُرْسَاهَا వారు ప్రళయం గురించి, ‘ఇంతకీ అదెప్పుడు సంభవిస్తుంది?’ అని నిన్ను అడుగుతున్నారు కదూ! 79:43 فِيمَ أَنتَ مِن ذِكْرَاهَا ఆ వివరణతో అసలు నీకేం సంబంధం (ఉందనీ?) 79:44 إِلَىٰ رَبِّكَ مُنتَهَاهَا ఆ సంగతి (దాని పరిజ్ఞానం) పూర్తిగా నీ ప్రభువు వైపే మరలుతుంది (కదా!) 79:45 إِنَّمَا أَنتَ مُنذِرُ مَن يَخْشَاهَا నువ్వు మాత్రం దానికి భయపడేవారిని హెచ్చరించే వాడివి మాత్రమే. 79:46 كَأَنَّهُمْ يَوْمَ يَرَوْنَهَا لَمْ يَلْبَثُوا إِلَّا عَشِيَّةً أَوْ ضُحَاهَا వారు దానిని ప్రత్యక్షంగా చూసిన నాడు, తాము (ప్రపంచంలో) కేవలం ఒక దినములో అంత్య భాగమో లేక దాని ఆరంభ భాగమో ఉండి ఉంటామని వారికి అనిపిస్తుంది. ఈ తెలుగు ఖుర్ఆన్ శాంతి మార్గం పబ్లికేషన్ వారు ప్రచురించారు. వారి అనుమతితో ఈ వెబ్ పోర్టల్ పై వేయబడింది. |