aip_quran
Translation

  العربية              తెలుగు  

1. సూరా అల్ ఫాతిహా
2. సూరా అల్ బఖర
3. సూరా ఆలి ఇమ్రాన్
4. సూరా అన్ నిసా
5. సూరా అల్ మాయిద
6. సూరా అల్ అన్ ఆమ్
7. సూరా అల్ ఆరాఫ్
8. సూరా అల్ అన్ ఫాల్
9. సూరా అత్ తౌబా
10. సూరా యూనుస్
11. సూరా హూద్
12. సూరా యూసుఫ్
13. సూరా ఆర్ రాద్
14. సూరా ఇబ్రహీం
15. సూరా అల్ హిజ్ర్
16. సూరా అన్ నహ్ల్
17. సూరా బనీ ఇస్రాయీల్
18. సూరా అల్ కహఫ్
19. సూరా మర్యం
20. సూరా తాహా
21. సూరా అల్ అంబియా
22. సూరా అల్ హజ్
23. సూరా అల్ మూ ‘మినూన్
24. సూరా అన్ నూర్
25. సూరా అల్ ఫుర్ఖాన్
26. సూరా ఆష్ షుఅరా
27. సూరా అన్ నమ్ల్
28. సూరా అల్ ఖసస్
29. సూరా అల్ అన్ కబూత్
30. సూరా ఆర్ రూమ్
31. సూరా లుక్మాన్
32. సూరా అస్ సజ్ ద హ్
33. సూరా అల్ ఆహ్ జాబ్
34. సూరా సబా
35. సూరా ఫాతిర్
36. సూరా యాసీన్
37. సూరా అస్ సాఫ్ఫాత్
38. సూరా సాద్
39. సూరా అజ్ జుమర్
40. సూరా అల్ మూమిన్
41. సూరా హామీమ్ అస్ సజ్ ద హ్
42. సూరా ఆష్ షూరా
43. సూరా అజ్ జుఖ్ రుఫ్
44. సూరా అద్ దుఖాన్
45. సూరా అల్ జాసియ హ్
46. సూరా అల్ ఆహ్ ఖాఫ్
47. సూరా ముహమ్మద్
48. సూరా అల్ ఫతహ్
49. సూరా అల్ హుజురాత్
50. సూరా ఖాఫ్
51. సూరా అజ్ జారియాత్
52. సూరా అత్ తూర్
53. సూరా అన్ నజ్మ్
54. సూరా అల్ ఖమర్
55. సూరా ఆర్ రహ్మాన్
56. సూరా వాఖియహ్
57. సూరా అల్ హదీద్
58. సూరా అల్ ముజాదల హ్
59. సూరా అల్ హష్ర్
60. సూరా అల్ ముమ్ తహిన హ్
61. సూరా అస్ సఫ్
62. సూరాఅల్ జుముఅ హ్
63. సూరా అల్ మునాఫిఖూన్
64. సూరా అత్ తగాబున్
65. సూరా అత్ తలాఖ్
66. సూరా అత్ తహ్రీం
67. సూరా అల్ ముల్క్
68. సూరా అల్ ఖలమ్
69. సూరా అల్ హఖ్ఖ
70. సూరా అల్ ముఆరిజ్
71. సూరా నూహ్
72. సూరా అల్ జిన్న్
73. సూరా అల్ ముజ్జమ్మిల్
74. సూరా అల్ ముద్దస్సిర్
75. సూరా అల్ ఖియామ హ్
76. సూరా అద్ దహ్ర్
77. సూరా అల్ ముర్సలాత్
78. సూరా అన్ నబా
79. సూరా అన్ నాజి ఆత్
80. సూరా అబస
81. సూరా అత్ తక్వీర్
82. సూరా అల్ ఇన్ ఫితార్
83. సూరాఅల్ ముతఫ్ఫిఫీన్
84. సూరా అల్ ఇన్ షి ఖాక్
85. సూరా అల్ బురూజ్
86. సూరా అత్ తారిఖ్
87. సూరా అల్ ఆలా
88. సూరా అల్ గాషియ హ్
89. సూరా అల్ ఫజ్ర్
90. సూరా అల్ బలద్
91. సూరా ఆష్ షమ్స్
92. సూరా అల్ లైల్
93. సూరా అజ్ జుహా
94. సూరా ఆలమ్ నష్ర్
95. సూరా అత్ తతీన్
96. సూరా అల్ అలఖ్
97. సూరా అల్ ఖద్ర్
98. సూరా అల్ బయ్యిన హ్
99. సూరా అజ్ జిలజాల్
100. సూరా అల్ ఆదియాత్
101. సూరా అల్ ఖారియ హ్
102. సూరా అత్ తకాసుర్
103. సూరా అల్ అస్ర్
104. సూరా అల్ హుమజా హ్
105. సూరా అల్ ఫీల్
106. సూరా ఖురైష్
107. సూరా అల్ మాఊ న్
108. సూరా అల్ కౌసర్
109. సూరా అల్ ఖాఫిరూన్
110. సూరా అన్ నస్ర్
111. సూరా అల్ లహబ్
112. సూరా అల్ ఇఖ్లాస్
113. సూరా అల్ ఫలఖ్
114. సూరా అన్ నాస్

77. సూరా అల్ ముర్సలాత్

77:1  وَالْمُرْسَلَاتِ عُرْفًا
నిరాఘాటంగా వేగంతో వీచే పెనుగాలుల సాక్షిగా!
77:2  فَالْعَاصِفَاتِ عَصْفًا
మరి ప్రచండ వేగంతో వీచే పెనుగాలుల సాక్షిగా!
77:3  وَالنَّاشِرَاتِ نَشْرًا
మేఘాలను లేపి చెల్లాచెదురు చేసే గాలుల సాక్షిగా!
77:4  فَالْفَارِقَاتِ فَرْقًا
మరి (సత్యాసత్యాలను) వేరుపరచే వా(టి)రి సాక్షిగా!
77:5  فَالْمُلْقِيَاتِ ذِكْرًا
జ్ఞాపికను తీసుకువచ్చే దూతల సాక్షిగా!
77:6  عُذْرًا أَوْ نُذْرًا
సాకులు లేకుండా చేయటానికి, హెచ్చరించటానికి.
77:7  إِنَّمَا تُوعَدُونَ لَوَاقِعٌ
ఏ విషయం గురించి మీకు వాగ్దానం చేయబడుతున్నదో అది వచ్చి తీరుతుంది.
77:8  فَإِذَا النُّجُومُ طُمِسَتْ
నక్షత్రాలు కాంతిహీనం అయిపోయినప్పుడు...
77:9  وَإِذَا السَّمَاءُ فُرِجَتْ
ఆకాశం బద్దలైపోయినప్పుడు ....
77:10  وَإِذَا الْجِبَالُ نُسِفَتْ
పర్వతాలు తునాతునకలుగా చేసి ఎగుర వేయబడినప్పుడు...
77:11  وَإِذَا الرُّسُلُ أُقِّتَتْ
ప్రవక్తలందరూ నిర్ధారిత సమయంలో హాజరుపరచబడినప్పుడు....
77:12  لِأَيِّ يَوْمٍ أُجِّلَتْ
ఏ రోజు కోసం (వారందరిని) వాయిదా వేసినట్టు?
77:13  لِيَوْمِ الْفَصْلِ
తీర్పుదినం కోసం!
77:14  وَمَا أَدْرَاكَ مَا يَوْمُ الْفَصْلِ
తీర్పుదినం ఏమిటో నీకేం తెలుసు?
77:15  وَيْلٌ يَوْمَئِذٍ لِّلْمُكَذِّبِينَ
ధిక్కార వైఖరిని అవలంబించే వారికి ఆ రోజు వినాశం ఖాయం.
77:16  أَلَمْ نُهْلِكِ الْأَوَّلِينَ
ఏమిటి, మేము పూర్వీకులను అంతమొందించలేదా?
77:17  ثُمَّ نُتْبِعُهُمُ الْآخِرِينَ
మరి మేము వారి తర్వాత వెనుకటి తరాల వారిని తీసుకు వచ్చాము.
77:18  كَذَٰلِكَ نَفْعَلُ بِالْمُجْرِمِينَ
మేము నేరస్తుల (పాపాత్ముల) పట్ల ఇలాగే వ్యవహరిస్తాం.
77:19  وَيْلٌ يَوْمَئِذٍ لِّلْمُكَذِّبِينَ
ధిక్కార వైఖరిని అవలంబించే వారికి ఆ రోజు వినాశం ఖాయం.
77:20  أَلَمْ نَخْلُقكُّم مِّن مَّاءٍ مَّهِينٍ
ఏమిటి, మేము మిమ్మల్ని అల్పమైన నీళ్ళతో (వీర్యబిందువుతో) సృష్టించలేదా?
77:21  فَجَعَلْنَاهُ فِي قَرَارٍ مَّكِينٍ
ఆ తరువాత దానిని ఒక పటిష్టమైన, సురక్షితమైన చోట ఉంచాము -
77:22  إِلَىٰ قَدَرٍ مَّعْلُومٍ
ఒక నిర్ణీత కాలం వరకు.
77:23  فَقَدَرْنَا فَنِعْمَ الْقَادِرُونَ
మేము తగురీతిలో లెక్క వేశాము. ఆహా! మేము ఎంత ఖచ్చితంగా లెక్కించే శక్తి గలవారమో!
77:24  وَيْلٌ يَوْمَئِذٍ لِّلْمُكَذِّبِينَ
ధిక్కార వైఖరిని అవలంబించే వారికి ఆ రోజు వినాశం ఖాయం.
77:25  أَلَمْ نَجْعَلِ الْأَرْضَ كِفَاتًا
ఏమిటి, మేము భూమిని తనలో ఇమిడ్చుకునేదిగా చేయలేదా?
77:26  أَحْيَاءً وَأَمْوَاتًا
సజీవ మరియు నిర్జీవ స్థితుల్లో.
77:27  وَجَعَلْنَا فِيهَا رَوَاسِيَ شَامِخَاتٍ وَأَسْقَيْنَاكُم مَّاءً فُرَاتًا
ఇంకా మేమందులో ఎత్తైన, బ్రహ్మాండమైన పర్వతాలను ప్రతిష్టించాము. మీ దాహాన్ని తీర్చే మంచి నీరును మీకు త్రాపాము.
77:28  وَيْلٌ يَوْمَئِذٍ لِّلْمُكَذِّبِينَ
ధిక్కార వైఖరిని అవలంబించే వారికి ఆ రోజు వినాశం ఖాయం.
77:29  انطَلِقُوا إِلَىٰ مَا كُنتُم بِهِ تُكَذِّبُونَ
“మీరు ధిక్కరిస్తూ ఉన్న ఆ నరకం వైపే పదండి!”
77:30  انطَلِقُوا إِلَىٰ ظِلٍّ ذِي ثَلَاثِ شُعَبٍ
“మూడు పాయలుగా చీలిన ఆ నీడ వైపు పదండి!!”
77:31  لَّا ظَلِيلٍ وَلَا يُغْنِي مِنَ اللَّهَبِ
నిజానికి అది మీకు నీడనూ ఇవ్వదు, అగ్ని జ్వాలల నుండి మీకు రక్షణనూ ఇవ్వదు.
77:32  إِنَّهَا تَرْمِي بِشَرَرٍ كَالْقَصْرِ
నిశ్చయంగా నరకం మేడలు, మిద్దెలంతటి నిప్పు రవ్వలను విసురుతుంది.
77:33  كَأَنَّهُ جِمَالَتٌ صُفْرٌ
అవి పసుపు పచ్చని ఒంటెల మాదిరిగా ఉంటాయి.
77:34  وَيْلٌ يَوْمَئِذٍ لِّلْمُكَذِّبِينَ
ధిక్కార వైఖరిని అవలంబించే వారికి ఆ రోజు వినాశం ఖాయం.
77:35  هَٰذَا يَوْمُ لَا يَنطِقُونَ
ఆ రోజు వారు మాట్లాడనూ లేరు.
77:36  وَلَا يُؤْذَنُ لَهُمْ فَيَعْتَذِرُونَ
సంజాయిషీ ఇచ్చుకొనే అనుమతి కూడా వారికి ఇవ్వబడదు.
77:37  وَيْلٌ يَوْمَئِذٍ لِّلْمُكَذِّبِينَ
ధిక్కార వైఖరిని అవలంబించే వారికి ఆ రోజు వినాశం ఖాయం.
77:38  هَٰذَا يَوْمُ الْفَصْلِ ۖ جَمَعْنَاكُمْ وَالْأَوَّلِينَ
ఇది నిర్ణయ దినం. (దీని కోసం) మేము మిమ్మల్నీ, మీ పూర్వీకులందరినీ సమీకరించాము.
77:39  فَإِن كَانَ لَكُمْ كَيْدٌ فَكِيدُونِ
మరి మీరు నా నుండి (తప్పించుకునే) ఎత్తుగడ ఏదైనా వేయదలిస్తే వేయండి.
77:40  وَيْلٌ يَوْمَئِذٍ لِّلْمُكَذِّبِينَ
ధిక్కార వైఖరిని అవలంబించే వారికి ఆ రోజు వినాశం ఖాయం.
77:41  إِنَّ الْمُتَّقِينَ فِي ظِلَالٍ وَعُيُونٍ
నిశ్చయంగా దైవభీతిపరులు చల్లని నీడలలో, (సల్లగసాగే) సెలయేరుల మధ్య ఉంటారు.
77:42  وَفَوَاكِهَ مِمَّا يَشْتَهُونَ
ఇంకా, తాము మెచ్చిన పండ్లు, ఫలాల మధ్య (హాయిగా) ఉంటారు.
77:43  كُلُوا وَاشْرَبُوا هَنِيئًا بِمَا كُنتُمْ تَعْمَلُونَ
“మీరు చేసుకున్న కర్మలకు ప్రతిఫలంగా హాయిగా తినండి, త్రాగండి” (అని వారితో అనబడుతుంది).
77:44  إِنَّا كَذَٰلِكَ نَجْزِي الْمُحْسِنِينَ
నిశ్చయంగా మేము సదాచార సంపన్నులకు ఇటువంటి ప్రతిఫలాన్నే ఇస్తాము.
77:45  وَيْلٌ يَوْمَئِذٍ لِّلْمُكَذِّبِينَ
ధిక్కార వైఖరిని అవలంబించే వారికి ఆ రోజు వినాశం ఖాయం.
77:46  كُلُوا وَتَمَتَّعُوا قَلِيلًا إِنَّكُم مُّجْرِمُونَ
(ఓ ధిక్కార జనులారా! మీరు ప్రాపంచిక జీవితంలో) అంతో ఇంతో తినండి, లబ్దిని పొందండి. మీరెలాగూ నేరస్థులే.
77:47  وَيْلٌ يَوْمَئِذٍ لِّلْمُكَذِّبِينَ
ధిక్కార వైఖరిని అవలంబించే వారికి ఆ రోజు వినాశం ఖాయం.
77:48  وَإِذَا قِيلَ لَهُمُ ارْكَعُوا لَا يَرْكَعُونَ
(దైవ సన్నిధిలో) “వినయపూర్వకంగా తలవంచండి” అని వారితో అన్నప్పుడు వారు తలవంచరు.
77:49  وَيْلٌ يَوْمَئِذٍ لِّلْمُكَذِّبِينَ
ధిక్కార వైఖరిని అవలంబించే వారికి ఆ రోజు వినాశం ఖాయం.
77:50  فَبِأَيِّ حَدِيثٍ بَعْدَهُ يُؤْمِنُونَ
ఇక ఈ (ఖుర్ఆన్) విషయం తరువాత వారు విశ్వసించటానికి ఏం ఉంది(ట)?


ఈ తెలుగు ఖుర్ఆన్ శాంతి మార్గం పబ్లికేషన్ వారు ప్రచురించారు. వారి అనుమతితో ఈ వెబ్ పోర్టల్ పై వేయబడింది.