aip_quran
Translation

  العربية              తెలుగు  

1. సూరా అల్ ఫాతిహా
2. సూరా అల్ బఖర
3. సూరా ఆలి ఇమ్రాన్
4. సూరా అన్ నిసా
5. సూరా అల్ మాయిద
6. సూరా అల్ అన్ ఆమ్
7. సూరా అల్ ఆరాఫ్
8. సూరా అల్ అన్ ఫాల్
9. సూరా అత్ తౌబా
10. సూరా యూనుస్
11. సూరా హూద్
12. సూరా యూసుఫ్
13. సూరా ఆర్ రాద్
14. సూరా ఇబ్రహీం
15. సూరా అల్ హిజ్ర్
16. సూరా అన్ నహ్ల్
17. సూరా బనీ ఇస్రాయీల్
18. సూరా అల్ కహఫ్
19. సూరా మర్యం
20. సూరా తాహా
21. సూరా అల్ అంబియా
22. సూరా అల్ హజ్
23. సూరా అల్ మూ ‘మినూన్
24. సూరా అన్ నూర్
25. సూరా అల్ ఫుర్ఖాన్
26. సూరా ఆష్ షుఅరా
27. సూరా అన్ నమ్ల్
28. సూరా అల్ ఖసస్
29. సూరా అల్ అన్ కబూత్
30. సూరా ఆర్ రూమ్
31. సూరా లుక్మాన్
32. సూరా అస్ సజ్ ద హ్
33. సూరా అల్ ఆహ్ జాబ్
34. సూరా సబా
35. సూరా ఫాతిర్
36. సూరా యాసీన్
37. సూరా అస్ సాఫ్ఫాత్
38. సూరా సాద్
39. సూరా అజ్ జుమర్
40. సూరా అల్ మూమిన్
41. సూరా హామీమ్ అస్ సజ్ ద హ్
42. సూరా ఆష్ షూరా
43. సూరా అజ్ జుఖ్ రుఫ్
44. సూరా అద్ దుఖాన్
45. సూరా అల్ జాసియ హ్
46. సూరా అల్ ఆహ్ ఖాఫ్
47. సూరా ముహమ్మద్
48. సూరా అల్ ఫతహ్
49. సూరా అల్ హుజురాత్
50. సూరా ఖాఫ్
51. సూరా అజ్ జారియాత్
52. సూరా అత్ తూర్
53. సూరా అన్ నజ్మ్
54. సూరా అల్ ఖమర్
55. సూరా ఆర్ రహ్మాన్
56. సూరా వాఖియహ్
57. సూరా అల్ హదీద్
58. సూరా అల్ ముజాదల హ్
59. సూరా అల్ హష్ర్
60. సూరా అల్ ముమ్ తహిన హ్
61. సూరా అస్ సఫ్
62. సూరాఅల్ జుముఅ హ్
63. సూరా అల్ మునాఫిఖూన్
64. సూరా అత్ తగాబున్
65. సూరా అత్ తలాఖ్
66. సూరా అత్ తహ్రీం
67. సూరా అల్ ముల్క్
68. సూరా అల్ ఖలమ్
69. సూరా అల్ హఖ్ఖ
70. సూరా అల్ ముఆరిజ్
71. సూరా నూహ్
72. సూరా అల్ జిన్న్
73. సూరా అల్ ముజ్జమ్మిల్
74. సూరా అల్ ముద్దస్సిర్
75. సూరా అల్ ఖియామ హ్
76. సూరా అద్ దహ్ర్
77. సూరా అల్ ముర్సలాత్
78. సూరా అన్ నబా
79. సూరా అన్ నాజి ఆత్
80. సూరా అబస
81. సూరా అత్ తక్వీర్
82. సూరా అల్ ఇన్ ఫితార్
83. సూరాఅల్ ముతఫ్ఫిఫీన్
84. సూరా అల్ ఇన్ షి ఖాక్
85. సూరా అల్ బురూజ్
86. సూరా అత్ తారిఖ్
87. సూరా అల్ ఆలా
88. సూరా అల్ గాషియ హ్
89. సూరా అల్ ఫజ్ర్
90. సూరా అల్ బలద్
91. సూరా ఆష్ షమ్స్
92. సూరా అల్ లైల్
93. సూరా అజ్ జుహా
94. సూరా ఆలమ్ నష్ర్
95. సూరా అత్ తతీన్
96. సూరా అల్ అలఖ్
97. సూరా అల్ ఖద్ర్
98. సూరా అల్ బయ్యిన హ్
99. సూరా అజ్ జిలజాల్
100. సూరా అల్ ఆదియాత్
101. సూరా అల్ ఖారియ హ్
102. సూరా అత్ తకాసుర్
103. సూరా అల్ అస్ర్
104. సూరా అల్ హుమజా హ్
105. సూరా అల్ ఫీల్
106. సూరా ఖురైష్
107. సూరా అల్ మాఊ న్
108. సూరా అల్ కౌసర్
109. సూరా అల్ ఖాఫిరూన్
110. సూరా అన్ నస్ర్
111. సూరా అల్ లహబ్
112. సూరా అల్ ఇఖ్లాస్
113. సూరా అల్ ఫలఖ్
114. సూరా అన్ నాస్

76. సూరా అద్ దహ్ర్

76:1  هَلْ أَتَىٰ عَلَى الْإِنسَانِ حِينٌ مِّنَ الدَّهْرِ لَمْ يَكُن شَيْئًا مَّذْكُورًا
సుదీర్ఘమైన కాలంలో మానవుడు చెప్పుకోదగ్గ వస్తువుగా లేకుండా ఉండిన సమయం ఒకటి గడవలేదా?
76:2  إِنَّا خَلَقْنَا الْإِنسَانَ مِن نُّطْفَةٍ أَمْشَاجٍ نَّبْتَلِيهِ فَجَعَلْنَاهُ سَمِيعًا بَصِيرًا
నిశ్చయంగా మేము మానవుణ్ణి పరీక్షించడానికి ఒక మిశ్రమ వీర్య బిందువుతో పుట్టించాము. మరి మేము అతణ్ణి వినేవాడుగా, చూసేవాడుగా చేశాము.
76:3  إِنَّا هَدَيْنَاهُ السَّبِيلَ إِمَّا شَاكِرًا وَإِمَّا كَفُورًا
మేమతనికి మార్గం కూడా చూపాము. ఇక వాడు కృతజ్ఞుడుగా వ్యవహరించినా లేదా కృతఘ్నుడుగా తయారైనా (వాడి ఇష్టం. మేము వాడి స్వేచ్చను హరించలేదు.)
76:4  إِنَّا أَعْتَدْنَا لِلْكَافِرِينَ سَلَاسِلَ وَأَغْلَالًا وَسَعِيرًا
అవిశ్వాసుల కోసం మేము సంకెళ్ళను, ఇనుప పట్టాలను, జ్వలించే అగ్నిని సిద్ధం చేసి ఉంచాము.
76:5  إِنَّ الْأَبْرَارَ يَشْرَبُونَ مِن كَأْسٍ كَانَ مِزَاجُهَا كَافُورًا
నిశ్చయంగా సజ్జనులు (విశ్వాసులు) ‘కాఫూర్’ కలుపబడిన మధుపాత్రలను సేవిస్తారు.
76:6  عَيْنًا يَشْرَبُ بِهَا عِبَادُ اللَّهِ يُفَجِّرُونَهَا تَفْجِيرًا
అదొక సరోవరం. దైవదాసులు దాన్నుండి (తనివి తీరా) త్రాగుతారు. (తాము కోరిన చోటికి) దాని పాయలు తీసుకుపోతారు.
76:7  يُوفُونَ بِالنَّذْرِ وَيَخَافُونَ يَوْمًا كَانَ شَرُّهُ مُسْتَطِيرًا
వారు తమ మొక్కుబడులను చెల్లిస్తుంటారు. ఏ రోజు కీడు నలువైపులా విస్తరిస్తుందో ఆ రోజు గురించి భయపడుతుంటారు.
76:8  وَيُطْعِمُونَ الطَّعَامَ عَلَىٰ حُبِّهِ مِسْكِينًا وَيَتِيمًا وَأَسِيرًا
అల్లాహ్ ప్రీతికోసం నిరుపేదలకు, అనాధులకు, ఖైదీలకు అన్నం పెడుతుంటారు.
76:9  إِنَّمَا نُطْعِمُكُمْ لِوَجْهِ اللَّهِ لَا نُرِيدُ مِنكُمْ جَزَاءً وَلَا شُكُورًا
(పైగా వారిలా అంటారు) : “మేము కేవలం అల్లాహ్ ప్రసన్నత కోసమే మీకు తినిపిస్తున్నాము. అంతేగాని మీ నుండి మేము ఎలాంటి ప్రతిఫలాన్ని గానీ, ధన్యవాదాలను గానీ ఆశించటం లేదు.”
76:10  إِنَّا نَخَافُ مِن رَّبِّنَا يَوْمًا عَبُوسًا قَمْطَرِيرًا
“నిశ్చయంగా మేము మా ప్రభువు తరఫున సంభవించే అత్యంత కఠినమైన, సుదీర్ఘమైన రోజు గురించి భయపడుతున్నాము.”
76:11  فَوَقَاهُمُ اللَّهُ شَرَّ ذَٰلِكَ الْيَوْمِ وَلَقَّاهُمْ نَضْرَةً وَسُرُورًا
అందువల్ల అల్లాహ్ వారిని ఆనాటి కీడు నుండి రక్షించి,” వారికి ఉల్లాసాన్నీ, ఆహ్లాదాన్నీ వొసగాడు.
76:12  وَجَزَاهُم بِمَا صَبَرُوا جَنَّةً وَحَرِيرًا
వారి సహనానికి బదులుగా వారికి స్వర్గాన్నీ , పట్టువస్త్రాలను ప్రసాదించాడు.
76:13  مُّتَّكِئِينَ فِيهَا عَلَى الْأَرَائِكِ ۖ لَا يَرَوْنَ فِيهَا شَمْسًا وَلَا زَمْهَرِيرًا
వారక్కడ దిండ్లకు ఆనుకొని పీఠాలపై కూర్చుని ఉంటారు. అక్కడ వారు సూర్య తాపాన్ని గానీ, చలి తీవ్రతను గానీ చూడరు.
76:14  وَدَانِيَةً عَلَيْهِمْ ظِلَالُهَا وَذُلِّلَتْ قُطُوفُهَا تَذْلِيلًا
స్వర్గవనాల నీడలు వారిపై పడుతూ ఉంటాయి. వాటి పండ్ల గుత్తులు క్రిందికి వ్రేలాడుతూ (అందుబాటులో) ఉంటాయి.
76:15  وَيُطَافُ عَلَيْهِم بِآنِيَةٍ مِّن فِضَّةٍ وَأَكْوَابٍ كَانَتْ قَوَارِيرَا
వారి సేవలో వెండి పాత్రలు, గాజు గిన్నెలు తిప్పబడుతూ ఉంటాయి.
76:16  قَوَارِيرَ مِن فِضَّةٍ قَدَّرُوهَا تَقْدِيرًا
ఆ గాజు గిన్నెలు కూడా వెండివై ఉంటాయి. వాటిని (నింపేవారు) ఒక అంచనా ప్రకారం సరిగ్గా నింపి ఉంటారు.
76:17  وَيُسْقَوْنَ فِيهَا كَأْسًا كَانَ مِزَاجُهَا زَنجَبِيلًا
వారికక్కడ సొంటి కలిపిన మధు పాత్రలు త్రాగడానికి ఇవ్వబడతాయి -
76:18  عَيْنًا فِيهَا تُسَمَّىٰ سَلْسَبِيلًا
స్వర్గంలోని ఒక సెలయేరు నుండి. దాని పేరు సల్ సబీల్.
76:19  وَيَطُوفُ عَلَيْهِمْ وِلْدَانٌ مُّخَلَّدُونَ إِذَا رَأَيْتَهُمْ حَسِبْتَهُمْ لُؤْلُؤًا مَّنثُورًا
వారి చుట్టూ (నవ నవలాడే) పిన్న వయస్కులైన అబ్బాయిలు తిరుగాడుతూ ఉంటారు. వాళ్ళు నిత్యం అబ్బాయిలుగానే ఉంటారు. నీవు వారిని చూసినప్పుడు చెదిరిన ముత్యాలా! అని భావిస్తావు.
76:20  وَإِذَا رَأَيْتَ ثَمَّ رَأَيْتَ نَعِيمًا وَمُلْكًا كَبِيرًا
నువ్వు అక్కడ ఎటు చూసినా గొప్ప అనుగ్రహాలు, మహా సామ్రాజ్య వైభవమే కానవస్తాయి.
76:21  عَالِيَهُمْ ثِيَابُ سُندُسٍ خُضْرٌ وَإِسْتَبْرَقٌ ۖ وَحُلُّوا أَسَاوِرَ مِن فِضَّةٍ وَسَقَاهُمْ رَبُّهُمْ شَرَابًا طَهُورًا
వారి శరీరాలపై పచ్చని, నాణ్యమైన సన్నని సిల్కు వస్త్రాలు, దళసరి పట్టు వస్త్రాలే ఉంటాయి. ఇంకా, వారికి వెండి కంకణాలు – ఆభరణంగా – తొడిగింపబడతాయి. వారి ప్రభువు వారికి స్వచ్చమైన, పరిశుద్ధమైన మధువును త్రాగిస్తాడు.
76:22  إِنَّ هَٰذَا كَانَ لَكُمْ جَزَاءً وَكَانَ سَعْيُكُم مَّشْكُورًا
ఇది మీ కర్మలకు బదులుగా ఇవ్వబడిన ప్రతిఫలం. మీ కృషి స్వీకరించబడింది (గుర్తించబడింది అని వారితో అనబడుతుంది).”
76:23  إِنَّا نَحْنُ نَزَّلْنَا عَلَيْكَ الْقُرْآنَ تَنزِيلًا
నిశ్చయంగా మేము నీపై ఖుర్ఆన్ ను అంచెల వారీగా అవతరింపజేశాము.
76:24  فَاصْبِرْ لِحُكْمِ رَبِّكَ وَلَا تُطِعْ مِنْهُمْ آثِمًا أَوْ كَفُورًا
కాబట్టి (ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహివ సల్లం!) నువ్వు నీ ప్రభువు ఆదేశం పై స్థిరంగా ఉండు. వారిలోని ఏ పాపాత్ముని , మరే కృతఘ్నుని మాట వినకు.
76:25  وَاذْكُرِ اسْمَ رَبِّكَ بُكْرَةً وَأَصِيلًا
నీ ప్రభువు నామాన్ని ఉదయం, సాయంత్రం స్మరిస్తూ ఉండు.
76:26  وَمِنَ اللَّيْلِ فَاسْجُدْ لَهُ وَسَبِّحْهُ لَيْلًا طَوِيلًا
రాత్రి వేళ ఆయన సన్నిధిలో సాష్టాంగ పడుతూ ఉండు. రాత్రి చాలాసేపు ఆయన పవిత్రతను కొనియాడు.
76:27  إِنَّ هَٰؤُلَاءِ يُحِبُّونَ الْعَاجِلَةَ وَيَذَرُونَ وَرَاءَهُمْ يَوْمًا ثَقِيلًا
వీళ్ళు తొందరగా లభించే దాని (ప్రపంచం)పై మోజు పడుతున్నారు. తమ వెనుక ఒక బరువైన దినాన్ని వదలి వేస్తున్నారు.
76:28  نَّحْنُ خَلَقْنَاهُمْ وَشَدَدْنَا أَسْرَهُمْ ۖ وَإِذَا شِئْنَا بَدَّلْنَا أَمْثَالَهُمْ تَبْدِيلًا
(మరి చూడబోతే) వీరిని పుట్టించింది , వీళ్ళ కీళ్ళను దృఢపరచినది మేమే. మరి మేము తలచుకున్నప్పుడల్లా వీరికి బదులుగా వీరిలాంటి వారిని తీసుకురాగలము.
76:29  إِنَّ هَٰذِهِ تَذْكِرَةٌ ۖ فَمَن شَاءَ اتَّخَذَ إِلَىٰ رَبِّهِ سَبِيلًا
నిశ్చయంగా ఇదొక ఉపదేశం. ఇక కోరినవారు తమ ప్రభువు మార్గాన్ని అవలంబించవచ్చు.
76:30  وَمَا تَشَاءُونَ إِلَّا أَن يَشَاءَ اللَّهُ ۚ إِنَّ اللَّهَ كَانَ عَلِيمًا حَكِيمًا
అల్లాహ్ కోరనిదే మీరు కోరలేరు. నిశ్చయంగా అల్లాహ్ అన్నీ తెలిసినవాడు, వివేచనాపరుడు.
76:31  يُدْخِلُ مَن يَشَاءُ فِي رَحْمَتِهِ ۚ وَالظَّالِمِينَ أَعَدَّ لَهُمْ عَذَابًا أَلِيمًا
ఆయన తాను కోరిన వారిని తన కారుణ్య పరిధిలోకి తీసుకుంటాడు. దుర్మార్గుల కోసం ఆయన బాధాకరమైన శిక్షను సిద్ధం చేసి ఉంచాడు.


ఈ తెలుగు ఖుర్ఆన్ శాంతి మార్గం పబ్లికేషన్ వారు ప్రచురించారు. వారి అనుమతితో ఈ వెబ్ పోర్టల్ పై వేయబడింది.