Translation
| 74. సూరా అల్ ముద్దస్సిర్ 74:1 يَا أَيُّهَا الْمُدَّثِّرُ ఓ కంబళి కప్పుకున్నవాడా! 74:2 قُمْ فَأَنذِرْ లే. (లేచి జనులను) హెచ్చరించు. 74:3 وَرَبَّكَ فَكَبِّرْ నీ ప్రభువు గొప్పతనాన్ని చాటి చెప్పు. 74:4 وَثِيَابَكَ فَطَهِّرْ నీ దుస్తులను పరిశుభ్రంగా ఉంచుకో. 74:5 وَالرُّجْزَ فَاهْجُرْ ఆశుద్ధతను వదలిపెట్టు. 74:6 وَلَا تَمْنُن تَسْتَكْثِرُ ఉపకారం చేసి ఎక్కువ (ప్రతిఫలం) పొందాలని ఆశించకు. 74:7 وَلِرَبِّكَ فَاصْبِرْ నీ ప్రభువు కొరకు ఓర్పు వహించు. 74:8 فَإِذَا نُقِرَ فِي النَّاقُورِ మరెప్పుడైతే శంఖం పూరించబడుతుందో... 74:9 فَذَٰلِكَ يَوْمَئِذٍ يَوْمٌ عَسِيرٌ ఆ రోజు చాలా గడ్డు రోజై ఉంటుంది. 74:10 عَلَى الْكَافِرِينَ غَيْرُ يَسِيرٍ అది అవిశ్వాసుల పాలిట సులభమైనది కాదు. 74:11 ذَرْنِي وَمَنْ خَلَقْتُ وَحِيدًا నన్నూ, నేను ఒంటరిగా పుట్టించిన వాడినీ వదలి పెట్టు (వాడి సంగతి నేను చూసుకుంటాను). 74:12 وَجَعَلْتُ لَهُ مَالًا مَّمْدُودًا వాడికి నేను విరివిగా సంపద ఇచ్చాను. 74:13 وَبَنِينَ شُهُودًا ఎల్లప్పుడూ వెన్నంటి ఉండే కొడుకులను కూడా (ఇచ్చాను). 74:14 وَمَهَّدتُّ لَهُ تَمْهِيدًا ఇంకా వాడి కోసం అన్ని విధాలా సుఖసౌఖ్యాల సామగ్రిని సమకూర్చాను. 74:15 ثُمَّ يَطْمَعُ أَنْ أَزِيدَ అయినా నేను వాడికి ఇంకా ... ఇంకా ప్రసాదించాలని వాడు (పిచ్చిగా) ఆశపడుతున్నాడు. 74:16 كَلَّا ۖ إِنَّهُ كَانَ لِآيَاتِنَا عَنِيدًا అలా జరగదు. వాడు మా ఆయతుల (సూచనల)కు బద్ధ విరోధిగా తయారయ్యాడు. 74:17 سَأُرْهِقُهُ صَعُودًا త్వరలోనే నేను వాణ్ణి కఠినమైన ఎత్తుకు ఎక్కిస్తాను. 74:18 إِنَّهُ فَكَّرَ وَقَدَّرَ వాడు ఆలోచించి ఒక ప్రతిపాదన చేశాడు. 74:19 فَقُتِلَ كَيْفَ قَدَّرَ వాడు నాశనం గాను! ఎటువంటి ప్రతిపాదన చేశాడు వాడు!? 74:20 ثُمَّ قُتِلَ كَيْفَ قَدَّرَ మరి వాడు నాశనమైపోను!! ఎలాంటి ప్రతిపాదన చేశాడు వాడు!? 74:21 ثُمَّ نَظَرَ తరువాత వాడు దృష్టిని సారించాడు (ఆలోచించాడు). 74:22 ثُمَّ عَبَسَ وَبَسَرَ ఆపైన నుదురు చిట్లించాడు. పాడు ముఖం పెట్టుకున్నాడు. 74:23 ثُمَّ أَدْبَرَ وَاسْتَكْبَرَ అటుపిమ్మట వీపు త్రిప్పుకున్నాడు. గర్వం ప్రదర్శించాడు. 74:24 فَقَالَ إِنْ هَٰذَا إِلَّا سِحْرٌ يُؤْثَرُ (చివరికి) ఇలా అన్నాడు : “ఇది పూర్వం నుంచీ నకలు చేయబడుతూ వస్తున్న మాయాజాలం మాత్రమే.” 74:25 إِنْ هَٰذَا إِلَّا قَوْلُ الْبَشَرِ “ఇది మానవ వాక్కు తప్ప మరేమీ కాదు.” 74:26 سَأُصْلِيهِ سَقَرَ నేను త్వరలోనే వాణ్ణి నరకాగ్నికి ఆహుతి చేస్తాను. 74:27 وَمَا أَدْرَاكَ مَا سَقَرُ ఆ నరకాగ్ని ఎటువంటిదో నీకేం తెలుసు? 74:28 لَا تُبْقِي وَلَا تَذَرُ అది (ఏ పాపాత్ముణ్ణి) మిగల్చదు, (దేనినీ కాలకుండా) వదలి పెట్టదు. 74:29 لَوَّاحَةٌ لِّلْبَشَرِ (మనుషుల) చర్మాన్ని మాడ్చివేస్తుంది. 74:30 عَلَيْهَا تِسْعَةَ عَشَرَ దానిపై పందొమ్మిది మంది (దైవదూతలు నియమితులై) ఉన్నారు. 74:31 وَمَا جَعَلْنَا أَصْحَابَ النَّارِ إِلَّا مَلَائِكَةً ۙ وَمَا جَعَلْنَا عِدَّتَهُمْ إِلَّا فِتْنَةً لِّلَّذِينَ كَفَرُوا لِيَسْتَيْقِنَ الَّذِينَ أُوتُوا الْكِتَابَ وَيَزْدَادَ الَّذِينَ آمَنُوا إِيمَانًا ۙ وَلَا يَرْتَابَ الَّذِينَ أُوتُوا الْكِتَابَ وَالْمُؤْمِنُونَ ۙ وَلِيَقُولَ الَّذِينَ فِي قُلُوبِهِم مَّرَضٌ وَالْكَافِرُونَ مَاذَا أَرَادَ اللَّهُ بِهَٰذَا مَثَلًا ۚ كَذَٰلِكَ يُضِلُّ اللَّهُ مَن يَشَاءُ وَيَهْدِي مَن يَشَاءُ ۚ وَمَا يَعْلَمُ جُنُودَ رَبِّكَ إِلَّا هُوَ ۚ وَمَا هِيَ إِلَّا ذِكْرَىٰ لِلْبَشَرِ మేము నరకపాలకులుగా దైవదూతలను మాత్రమే ఉంచాము. ఇంకా మేము వారి (19) సంఖ్యను అవిశ్వాసులను పరీక్షించటానికి మాత్రమే నిర్ధారించాము. గ్రంథవహులకు నమ్మకం కుదరటానికి, విశ్వాసులు తమ విశ్వాసంలో మరింత ముందంజ వేయటానికి, గ్రంథవహులు, విశ్వసించినవారు సందేహానికి గురికాకుండా ఉండటానికి మేమిలా చేశాము. ఇంకా – హృదయాలలో రోగమున్నవారు, అవిశ్వాసులు, “ఇంతకీ ఈ (19) దృష్టాంతం ద్వారా అల్లాహ్ ఏం చెప్పదలిచాడు?” అని చెప్పటానికి కూడా (మేము ఈ విధంగా చేశాము). ఈ విధంగా అల్లాహ్ తాను కోరినవారిని పెడదారి పట్టిస్తాడు, తను కోరిన వారికి సన్మార్గం చూపుతాడు. నీ ప్రభువు సైన్యాలను స్వయంగా ఆయన తప్ప మరెవరూ ఎరుగరు. ఈ (నరక) వృత్తాంతం మానవ మాత్రుల బోధనార్ధం ప్రస్తావించబడింది. 74:32 كَلَّا وَالْقَمَرِ నిజం చెబుతున్నాను. చంద్రుని సాక్షిగా! 74:33 وَاللَّيْلِ إِذْ أَدْبَرَ తి(త)రిగి పోతున్న రాత్రి సాక్షిగా! 74:34 وَالصُّبْحِ إِذَا أَسْفَرَ ప్రకాశమానమైన ఉదయం సాక్షిగా! 74:35 إِنَّهَا لَإِحْدَى الْكُبَرِ నిశ్చయంగా అది (ఆ నరకం) చాలా పెద్ద విషయం. 74:36 نَذِيرًا لِّلْبَشَرِ మానవులకు ఒక హెచ్చరిక! 74:37 لِمَن شَاءَ مِنكُمْ أَن يَتَقَدَّمَ أَوْ يَتَأَخَّرَ మీలో ముందంజ వేయదలిచే ప్రతి ఒక్కరికీ, వెనుక ఉండిపోదలిచే ప్రతి ఒక్కరికీ. 74:38 كُلُّ نَفْسٍ بِمَا كَسَبَتْ رَهِينَةٌ ప్రతి వ్యక్తీ తాను చేసుకున్నదానికి (తాను చేసిన కర్మలకు) ప్రతిగా తాకట్టుగా ఉన్నాడు. 74:39 إِلَّا أَصْحَابَ الْيَمِينِ కుడి పక్షం వారు తప్ప! 74:40 فِي جَنَّاتٍ يَتَسَاءَلُونَ వారు (స్వర్గ) వనాలలో (కూర్చొని) అడుగుతూ ఉంటారు, 74:41 عَنِ الْمُجْرِمِينَ అపరాధుల గురించి. 74:42 مَا سَلَكَكُمْ فِي سَقَرَ “ఇంతకీ ఏ విషయం మిమ్మల్ని నరకానికి తీసుకు వచ్చింది?” (అని ప్రశ్నిస్తారు). 74:43 قَالُوا لَمْ نَكُ مِنَ الْمُصَلِّينَ వారిలా సమాధానమిస్తారు : “మేము నమాజు చేసే వారము కాము.” 74:44 وَلَمْ نَكُ نُطْعِمُ الْمِسْكِينَ “నిరుపేదలకు అన్నం పెట్టే వారమూ కాము.” 74:45 وَكُنَّا نَخُوضُ مَعَ الْخَائِضِينَ “పైగా, మేము పిడివాదన చేసే వారితో (తిరస్కారులతో) చేరి, వాదోపవాదాలలో మునిగి ఉండేవారం.” 74:46 وَكُنَّا نُكَذِّبُ بِيَوْمِ الدِّينِ “ప్రతిఫల దినాన్ని ధిక్కరించేవాళ్ళం.” 74:47 حَتَّىٰ أَتَانَا الْيَقِينُ “తుదకు మాకు మరణం వచ్చేసింది.” 74:48 فَمَا تَنفَعُهُمْ شَفَاعَةُ الشَّافِعِينَ మరి సిఫారసు చేసేవారి సిఫారసు వారికి ఏమాత్రం ఉపయోగపడదు. 74:49 فَمَا لَهُمْ عَنِ التَّذْكِرَةِ مُعْرِضِينَ ఇంతకీ వారికేమైపోయిందనీ, వారెందుకిలా హితబోధ నుండి ముఖం త్రిప్పుకుని పోతున్నారు? 74:50 كَأَنَّهُمْ حُمُرٌ مُّسْتَنفِرَةٌ వారు బెదిరి (పారి)పోయే అడవి గాడిదల్లా ఉన్నారే!? 74:51 فَرَّتْ مِن قَسْوَرَةٍ అవి సింహాన్ని చూసి పారిపోతుంటాయి. 74:52 بَلْ يُرِيدُ كُلُّ امْرِئٍ مِّنْهُمْ أَن يُؤْتَىٰ صُحُفًا مُّنَشَّرَةً పైగా వారిలోని ప్రతి వ్యక్తీ, తనకు ప్రకాశిత ‘సహీఫాలు’ (ప్రతులు) ఇవ్వబడాలని కోరుకుంటున్నాడు. 74:53 كَلَّا ۖ بَل لَّا يَخَافُونَ الْآخِرَةَ అలా జరగనేరదు. వారసలు పరలోకానికి భయపడటం లేదు. 74:54 كَلَّا إِنَّهُ تَذْكِرَةٌ ముమ్మాటికీ కాదు (వాస్తవమేమిటంటే) ఈ ఖుర్ఆన్ ఒక హితబోధిని. 74:55 فَمَن شَاءَ ذَكَرَهُ కాబట్టి ఇక కోరినవారు దీనిద్వారా ఉపదేశం గ్రహించవచ్చు. 74:56 وَمَا يَذْكُرُونَ إِلَّا أَن يَشَاءَ اللَّهُ ۚ هُوَ أَهْلُ التَّقْوَىٰ وَأَهْلُ الْمَغْفِرَةِ అయితే అల్లాహ్ తలచినప్పుడు మాత్రమే వారు హితబోధను ఆస్వాదించగలరు. వారు భయపడవలసింది ఆయనకు మాత్రమే. క్షమాభిక్ష పెట్టడం కూడా ఆయనకే చెల్లు. ఈ తెలుగు ఖుర్ఆన్ శాంతి మార్గం పబ్లికేషన్ వారు ప్రచురించారు. వారి అనుమతితో ఈ వెబ్ పోర్టల్ పై వేయబడింది. |