aip_quran
Translation

  العربية              తెలుగు  

1. సూరా అల్ ఫాతిహా
2. సూరా అల్ బఖర
3. సూరా ఆలి ఇమ్రాన్
4. సూరా అన్ నిసా
5. సూరా అల్ మాయిద
6. సూరా అల్ అన్ ఆమ్
7. సూరా అల్ ఆరాఫ్
8. సూరా అల్ అన్ ఫాల్
9. సూరా అత్ తౌబా
10. సూరా యూనుస్
11. సూరా హూద్
12. సూరా యూసుఫ్
13. సూరా ఆర్ రాద్
14. సూరా ఇబ్రహీం
15. సూరా అల్ హిజ్ర్
16. సూరా అన్ నహ్ల్
17. సూరా బనీ ఇస్రాయీల్
18. సూరా అల్ కహఫ్
19. సూరా మర్యం
20. సూరా తాహా
21. సూరా అల్ అంబియా
22. సూరా అల్ హజ్
23. సూరా అల్ మూ ‘మినూన్
24. సూరా అన్ నూర్
25. సూరా అల్ ఫుర్ఖాన్
26. సూరా ఆష్ షుఅరా
27. సూరా అన్ నమ్ల్
28. సూరా అల్ ఖసస్
29. సూరా అల్ అన్ కబూత్
30. సూరా ఆర్ రూమ్
31. సూరా లుక్మాన్
32. సూరా అస్ సజ్ ద హ్
33. సూరా అల్ ఆహ్ జాబ్
34. సూరా సబా
35. సూరా ఫాతిర్
36. సూరా యాసీన్
37. సూరా అస్ సాఫ్ఫాత్
38. సూరా సాద్
39. సూరా అజ్ జుమర్
40. సూరా అల్ మూమిన్
41. సూరా హామీమ్ అస్ సజ్ ద హ్
42. సూరా ఆష్ షూరా
43. సూరా అజ్ జుఖ్ రుఫ్
44. సూరా అద్ దుఖాన్
45. సూరా అల్ జాసియ హ్
46. సూరా అల్ ఆహ్ ఖాఫ్
47. సూరా ముహమ్మద్
48. సూరా అల్ ఫతహ్
49. సూరా అల్ హుజురాత్
50. సూరా ఖాఫ్
51. సూరా అజ్ జారియాత్
52. సూరా అత్ తూర్
53. సూరా అన్ నజ్మ్
54. సూరా అల్ ఖమర్
55. సూరా ఆర్ రహ్మాన్
56. సూరా వాఖియహ్
57. సూరా అల్ హదీద్
58. సూరా అల్ ముజాదల హ్
59. సూరా అల్ హష్ర్
60. సూరా అల్ ముమ్ తహిన హ్
61. సూరా అస్ సఫ్
62. సూరాఅల్ జుముఅ హ్
63. సూరా అల్ మునాఫిఖూన్
64. సూరా అత్ తగాబున్
65. సూరా అత్ తలాఖ్
66. సూరా అత్ తహ్రీం
67. సూరా అల్ ముల్క్
68. సూరా అల్ ఖలమ్
69. సూరా అల్ హఖ్ఖ
70. సూరా అల్ ముఆరిజ్
71. సూరా నూహ్
72. సూరా అల్ జిన్న్
73. సూరా అల్ ముజ్జమ్మిల్
74. సూరా అల్ ముద్దస్సిర్
75. సూరా అల్ ఖియామ హ్
76. సూరా అద్ దహ్ర్
77. సూరా అల్ ముర్సలాత్
78. సూరా అన్ నబా
79. సూరా అన్ నాజి ఆత్
80. సూరా అబస
81. సూరా అత్ తక్వీర్
82. సూరా అల్ ఇన్ ఫితార్
83. సూరాఅల్ ముతఫ్ఫిఫీన్
84. సూరా అల్ ఇన్ షి ఖాక్
85. సూరా అల్ బురూజ్
86. సూరా అత్ తారిఖ్
87. సూరా అల్ ఆలా
88. సూరా అల్ గాషియ హ్
89. సూరా అల్ ఫజ్ర్
90. సూరా అల్ బలద్
91. సూరా ఆష్ షమ్స్
92. సూరా అల్ లైల్
93. సూరా అజ్ జుహా
94. సూరా ఆలమ్ నష్ర్
95. సూరా అత్ తతీన్
96. సూరా అల్ అలఖ్
97. సూరా అల్ ఖద్ర్
98. సూరా అల్ బయ్యిన హ్
99. సూరా అజ్ జిలజాల్
100. సూరా అల్ ఆదియాత్
101. సూరా అల్ ఖారియ హ్
102. సూరా అత్ తకాసుర్
103. సూరా అల్ అస్ర్
104. సూరా అల్ హుమజా హ్
105. సూరా అల్ ఫీల్
106. సూరా ఖురైష్
107. సూరా అల్ మాఊ న్
108. సూరా అల్ కౌసర్
109. సూరా అల్ ఖాఫిరూన్
110. సూరా అన్ నస్ర్
111. సూరా అల్ లహబ్
112. సూరా అల్ ఇఖ్లాస్
113. సూరా అల్ ఫలఖ్
114. సూరా అన్ నాస్

73. సూరా అల్ ముజ్జమ్మిల్

73:1  يَا أَيُّهَا الْمُزَّمِّلُ
ఓ వస్త్రమును కప్పుకున్నవాడా!
73:2  قُمِ اللَّيْلَ إِلَّا قَلِيلًا
కొద్దిసేపు మినహా రాత్రంతా (నమాజులో) నిలబడు.
73:3  نِّصْفَهُ أَوِ انقُصْ مِنْهُ قَلِيلًا
సగం రాత్రి లేదా దానికంటే కొంచెం తక్కువ చేసుకో.
73:4  أَوْ زِدْ عَلَيْهِ وَرَتِّلِ الْقُرْآنَ تَرْتِيلًا
లేదా దానిని మరికొద్దిగా పెంచుకో. ఖుర్ఆన్ ను మాత్రం బాగా – ఆగి ఆగి నింపాదిగా (స్పష్టంగా) పఠించు.
73:5  إِنَّا سَنُلْقِي عَلَيْكَ قَوْلًا ثَقِيلًا
నిశ్చయంగా మేము నీపై ఒక బరువైన వాక్కును వేయనున్నాము.
73:6  إِنَّ نَاشِئَةَ اللَّيْلِ هِيَ أَشَدُّ وَطْئًا وَأَقْوَمُ قِيلًا
నిశ్చయంగా రాత్రివేళ లేవటం మనో స్థిమితానికి ఎంతో ఉపయుక్తమైనది. మాట సూటిగా వెలువడటానికి అది ఎంతో అనువైనది.
73:7  إِنَّ لَكَ فِي النَّهَارِ سَبْحًا طَوِيلًا
నిశ్చయంగా పగటిపూట నీకు సుదీర్ఘమైన వ్యాపకాలున్నాయి.
73:8  وَاذْكُرِ اسْمَ رَبِّكَ وَتَبَتَّلْ إِلَيْهِ تَبْتِيلًا
అందుకే నీవు నీ ప్రభువు నామాన్ని స్మరిస్తూ ఉండు. అన్నింటినీ వదలి ఆయన వైపే మనసును లగ్నం చేయి.
73:9  رَّبُّ الْمَشْرِقِ وَالْمَغْرِبِ لَا إِلَٰهَ إِلَّا هُوَ فَاتَّخِذْهُ وَكِيلًا
ఆయన తూర్పు - పడమరలకు ప్రభువు. ఆయన తప్ప వేరొక ఆరాధ్య దైవం లేడు. కాబట్టి నీవు ఆయన్నే నీ కార్యసాధకునిగా చేసుకో.
73:10  وَاصْبِرْ عَلَىٰ مَا يَقُولُونَ وَاهْجُرْهُمْ هَجْرًا جَمِيلًا
వారు చెప్పే మాటలపై ఓర్పు వహించు. హుందాగా వారి నుండి నిష్క్రమించు.
73:11  وَذَرْنِي وَالْمُكَذِّبِينَ أُولِي النَّعْمَةِ وَمَهِّلْهُمْ قَلِيلًا
ధిక్కార వైఖరికి ఒడిగట్టిన ఈ శ్రీమంతుల సంగతిని నాకు వదలి పెట్టు. వారికి మరికొంత గడువును ఇవ్వు.
73:12  إِنَّ لَدَيْنَا أَنكَالًا وَجَحِيمًا
నిశ్చయంగా మా దగ్గర (వారి కొరకు) సంకెళ్ళు ఉన్నాయి. (భగ భగ మండే) నరకాగ్ని ఉంది.
73:13  وَطَعَامًا ذَا غُصَّةٍ وَعَذَابًا أَلِيمًا
గొంతులో ఇరుక్కుపోయే ఆహారం, అత్యంత బాధాకరమైన శిక్షా ఉన్నాయి.
73:14  يَوْمَ تَرْجُفُ الْأَرْضُ وَالْجِبَالُ وَكَانَتِ الْجِبَالُ كَثِيبًا مَّهِيلًا
ఏ రోజున భూమి, పర్వతాలు తీవ్రంగా కంపిస్తాయో, పర్వతాలు ఇసుక తిప్పలు మాదిరిగా అయిపోతాయో (ఆ రోజు ఈ శిక్ష పడుతుంది.)
73:15  إِنَّا أَرْسَلْنَا إِلَيْكُمْ رَسُولًا شَاهِدًا عَلَيْكُمْ كَمَا أَرْسَلْنَا إِلَىٰ فِرْعَوْنَ رَسُولًا
మేము ఫిరౌను వద్దకు ప్రవక్తను పంపినట్లే మీ వద్దకు కూడా మీపై సాక్షిగా ఉండటానికి ఒక ప్రవక్తను పంపాము.
73:16  فَعَصَىٰ فِرْعَوْنُ الرَّسُولَ فَأَخَذْنَاهُ أَخْذًا وَبِيلًا
మరి ఫిరౌను ఆ ప్రవక్త మాట వినలేదు. అందువల్ల మేమతన్ని చాలా కఠినంగా పట్టుకున్నాము.
73:17  فَكَيْفَ تَتَّقُونَ إِن كَفَرْتُمْ يَوْمًا يَجْعَلُ الْوِلْدَانَ شِيبًا
ఒకవేళ మీరు కూడా తిరస్కరించినట్లయితే పసివాళ్ళను సయితం పండు ముసలివాళ్ళుగా మార్చివేసే ఆ రోజు నుండి మీరెలా తప్పించుకుంటారు?
73:18  السَّمَاءُ مُنفَطِرٌ بِهِ ۚ كَانَ وَعْدُهُ مَفْعُولًا
(ఆ రోజు) ఆకాశం బ్రద్దలైపోతుంది. అల్లాహ్ చేసిన ఈ వాగ్దానం జరిగి తీరుతుంది.
73:19  إِنَّ هَٰذِهِ تَذْكِرَةٌ ۖ فَمَن شَاءَ اتَّخَذَ إِلَىٰ رَبِّهِ سَبِيلًا
నిశ్చయంగా ఇదొక ఉపదేశం. ఇక కోరినవారు తమ ప్రభువు వైపు వెళ్ళే మార్గాన్ని అవలంబించవచ్చు.
73:20  إِنَّ رَبَّكَ يَعْلَمُ أَنَّكَ تَقُومُ أَدْنَىٰ مِن ثُلُثَيِ اللَّيْلِ وَنِصْفَهُ وَثُلُثَهُ وَطَائِفَةٌ مِّنَ الَّذِينَ مَعَكَ ۚ وَاللَّهُ يُقَدِّرُ اللَّيْلَ وَالنَّهَارَ ۚ عَلِمَ أَن لَّن تُحْصُوهُ فَتَابَ عَلَيْكُمْ ۖ فَاقْرَءُوا مَا تَيَسَّرَ مِنَ الْقُرْآنِ ۚ عَلِمَ أَن سَيَكُونُ مِنكُم مَّرْضَىٰ ۙ وَآخَرُونَ يَضْرِبُونَ فِي الْأَرْضِ يَبْتَغُونَ مِن فَضْلِ اللَّهِ ۙ وَآخَرُونَ يُقَاتِلُونَ فِي سَبِيلِ اللَّهِ ۖ فَاقْرَءُوا مَا تَيَسَّرَ مِنْهُ ۚ وَأَقِيمُوا الصَّلَاةَ وَآتُوا الزَّكَاةَ وَأَقْرِضُوا اللَّهَ قَرْضًا حَسَنًا ۚ وَمَا تُقَدِّمُوا لِأَنفُسِكُم مِّنْ خَيْرٍ تَجِدُوهُ عِندَ اللَّهِ هُوَ خَيْرًا وَأَعْظَمَ أَجْرًا ۚ وَاسْتَغْفِرُوا اللَّهَ ۖ إِنَّ اللَّهَ غَفُورٌ رَّحِيمٌ
(ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహివ సల్లం!) నువ్వు ఒక్కోసారి మూడింట రెండు వంతుల రాత్రి కంటే కొంచెం తక్కువ, ఒక్కోసారి సగం రాత్రి, ఒక్కోసారి మూడింట ఒక వంతు రాత్రి ఆరాధనలో నిలబడుతున్నావనీ, నీ సహచరుల్లోని ఒక వర్గం కూడా ఇలాగే చేస్తుందన్న సంగతి నీ ప్రభువుకు బాగా తెలుసు. రేయింబవళ్ళ లెక్కను ఖచ్చితంగా మదించగలవాడు అల్లాహ్ మాత్రమే. ఎట్టి పరిస్థితిలోనూ మీరు దీనిని నిర్వర్తించలేరని ఆయనకు తెలుసు. అందుకే ఆయన మీపై దయదలిచాడు. కాబట్టి మీరు ఖుర్ఆన్ లో సులభంగా పఠించగలిగినంత భాగాన్ని పఠించండి. మీలో కొందరు వ్యాధి గ్రస్తులుంటారనీ, మరి కొందరు భువిలో సంచరించి దైవానుగ్రహాన్ని (అంటే ఉపాధిని) అన్వేషించేవారున్నారనీ, ఇంకా కొందరు దైవమార్గంలో యుద్ధం చేసేవారు కూడా ఉంటారని ఆయనకు తెలుసు. కాబట్టి మీరు సులువుగా పఠించగలిగినంత ఖుర్ఆన్ ను పఠించండి. నమాజును నెలకొల్పండి. జకాత్ ను ఇస్తూ ఉండండి. అల్లాహ్ కు మంచి రుణం ఇవ్వండి. మీరు మీ కోసం ఏ మంచిని (పుణ్యకార్యాన్ని) ముందుగా పంపినా, దాన్ని అల్లాహ్ దగ్గర అత్యుత్తమ పుణ్య ఫలం రూపంలో అత్యధికంగా పొందుతారు. క్షమాపణకై అల్లాహ్ ను అర్ధిస్తూ ఉండండి. నిశ్చయంగా అల్లాహ్ గొప్ప క్షమాశీలి, దయాశీలి.


ఈ తెలుగు ఖుర్ఆన్ శాంతి మార్గం పబ్లికేషన్ వారు ప్రచురించారు. వారి అనుమతితో ఈ వెబ్ పోర్టల్ పై వేయబడింది.