Translation
| 72. సూరా అల్ జిన్న్ 72:1 قُلْ أُوحِيَ إِلَيَّ أَنَّهُ اسْتَمَعَ نَفَرٌ مِّنَ الْجِنِّ فَقَالُوا إِنَّا سَمِعْنَا قُرْآنًا عَجَبًا (ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహివ సల్లం!) వారికి చెప్పు: నాకు దివ్యవాణి (వహీ) ద్వారా ఇలా తెలియజేయబడింది – జిన్నుల సమూహం ఒకటి (ఖుర్ఆన్ ను ) విన్నది. వారు (తమ వాళ్లతో) ఇలా అన్నారు: “మేమొక అద్భుతమైన ఖుర్ఆన్ ను విన్నాము.” 72:2 يَهْدِي إِلَى الرُّشْدِ فَآمَنَّا بِهِ ۖ وَلَن نُّشْرِكَ بِرَبِّنَا أَحَدًا “అది సన్మార్గం వైపు దర్శకత్వం వహిస్తోంది. అందుకే మేము దానిని విశ్వసించాము. ఇక నుంచి మేము ఎవరినీ – ఎన్నటికీ – మా ప్రభువుకు సహవర్తుల్ని కల్పించము.” 72:3 وَأَنَّهُ تَعَالَىٰ جَدُّ رَبِّنَا مَا اتَّخَذَ صَاحِبَةً وَلَا وَلَدًا “ఇంకా – మా ప్రభువు మహిమ అత్యున్నతమైనది. ఆయన తన కోసం (ఎవరినీ) భార్యగాగానీ, కొడుకుగాగానీ చేసుకోలేదు.” 72:4 وَأَنَّهُ كَانَ يَقُولُ سَفِيهُنَا عَلَى اللَّهِ شَطَطًا “ఇంకా – మనలోని మూర్ఖుడు అల్లాహ్ గురించి సత్యవిరుద్ధమైన మాటలు పలికే వాడు.” 72:5 وَأَنَّا ظَنَنَّا أَن لَّن تَقُولَ الْإِنسُ وَالْجِنُّ عَلَى اللَّهِ كَذِبًا “మనుషులైనా, జిన్నులైనా అల్లాహ్ కు అబద్ధాలు అంటగట్టడం అనేది అసంభవమని మనం అనుకున్నాము.” 72:6 وَأَنَّهُ كَانَ رِجَالٌ مِّنَ الْإِنسِ يَعُوذُونَ بِرِجَالٍ مِّنَ الْجِنِّ فَزَادُوهُمْ رَهَقًا “అసలు విషయం ఏమిటంటే కొందరు మనుషులు కొందరు జిన్నాతుల శరణు వేడేవారు. ఈ కారణంగా జిన్నాతుల పొగరు మరింత పెరిగిపోయింది.” 72:7 وَأَنَّهُمْ ظَنُّوا كَمَا ظَنَنتُمْ أَن لَّن يَبْعَثَ اللَّهُ أَحَدًا “అల్లాహ్ ఎవరినీ పంపడని (లేక ఎవరినీ తిరిగి బ్రతికించడని) మీరు తలపోసినట్లుగానే మనుషులు కూడా తలపోశారు.” 72:8 وَأَنَّا لَمَسْنَا السَّمَاءَ فَوَجَدْنَاهَا مُلِئَتْ حَرَسًا شَدِيدًا وَشُهُبًا “మేము ఆకాశంలో బాగా వెదికాము. అది అప్రమత్తులైన పహరాదారులతో, అగ్నిజ్వాలలతో నిండి ఉండటం చూశాము.” 72:9 وَأَنَّا كُنَّا نَقْعُدُ مِنْهَا مَقَاعِدَ لِلسَّمْعِ ۖ فَمَن يَسْتَمِعِ الْآنَ يَجِدْ لَهُ شِهَابًا رَّصَدًا “లోగడ మనం విషయాలు వినటానికి ఆకాశంలో పలుచోట్ల (మాటేసి) కూర్చునే వాళ్ళం. ఇప్పుడు ఎవరైనా చెవి యోగ్గి వినదలిస్తే, తన కోసం కాచుకుని ఉన్న అగ్నిజ్వాలను అతను పొందుతున్నాడు.” 72:10 وَأَنَّا لَا نَدْرِي أَشَرٌّ أُرِيدَ بِمَن فِي الْأَرْضِ أَمْ أَرَادَ بِهِمْ رَبُّهُمْ رَشَدًا “ఇంకా – భూమిలో ఉన్న వారి కోసం ఏదైనా కీడు తలపెట్టబడినదో లేక వారి ప్రభువు వారికి సన్మార్గ భాగ్యం ప్రసాదించగోరుతున్నాడో మాకు తెలియదు.” 72:11 وَأَنَّا مِنَّا الصَّالِحُونَ وَمِنَّا دُونَ ذَٰلِكَ ۖ كُنَّا طَرَائِقَ قِدَدًا “ఇంకా ఏమిటంటే – మనలో కొందరు సజ్జనులుంటే మరికొందరు తద్భిన్నంగా ఉన్నారు. మన దారులు వేర్వేరుగా ఉన్నాయి.” 72:12 وَأَنَّا ظَنَنَّا أَن لَّن نُّعْجِزَ اللَّهَ فِي الْأَرْضِ وَلَن نُّعْجِزَهُ هَرَبًا “మనం భూమిలో అల్లాహ్ ను అశక్తుణ్ణి చేయటం గానీ, పారిపోయి (ఊర్థ్వలోకాల్లో) ఆయన్ని ఓడించటంగాని మనవల్ల కాని పని అని మాకర్ధమైపోయింది.” 72:13 وَأَنَّا لَمَّا سَمِعْنَا الْهُدَىٰ آمَنَّا بِهِ ۖ فَمَن يُؤْمِن بِرَبِّهِ فَلَا يَخَافُ بَخْسًا وَلَا رَهَقًا “మేము మాత్రం సన్మార్గ బోధను వినగానే దానిని విశ్వసించాం. ఇక ఎవడు తన ప్రభువును విశ్వసించినా అతనికి ఎలాంటి నష్టంగానీ, అన్యాయంగానీ జరుగుతుందన్న భయం ఉండదు.” 72:14 وَأَنَّا مِنَّا الْمُسْلِمُونَ وَمِنَّا الْقَاسِطُونَ ۖ فَمَنْ أَسْلَمَ فَأُولَٰئِكَ تَحَرَّوْا رَشَدًا “ఇంకా – మనలో కొందరు ముస్లింలై (దైవవిధేయులై)ఉంటే, మరికొందరు సన్మార్గం నుండి తొలగి ఉన్నారు. కనుక విధేయతా వైఖరిని అవలంబించినవారు సన్మార్గాన్ని అన్వేషించుకున్నారు.” 72:15 وَأَمَّا الْقَاسِطُونَ فَكَانُوا لِجَهَنَّمَ حَطَبًا “సన్మార్గం నుండి తొలగిపోయి, అపవాదానికి లోనైనవారు – నరకానికి ఇంధనం అవుతారు.” 72:16 وَأَن لَّوِ اسْتَقَامُوا عَلَى الطَّرِيقَةِ لَأَسْقَيْنَاهُم مَّاءً غَدَقًا ఇంకా (ఓ ప్రవక్తా! వారికి చెప్పు): వీరు గనక సన్మార్గంపై నిలకడగా ఉంటే మేము వారికి పుష్కలంగా నీళ్ళు త్రాగించి ఉండేవారం. 72:17 لِّنَفْتِنَهُمْ فِيهِ ۚ وَمَن يُعْرِضْ عَن ذِكْرِ رَبِّهِ يَسْلُكْهُ عَذَابًا صَعَدًا తద్వారా వారిని ఈ విషయంలో పరీక్షించటానికి! మరెవడు తన ప్రభువు ధ్యానం నుండి ముఖం త్రిప్పుకుంటాడో అతణ్ణి అల్లాహ్ కఠినమైన శిక్షకు లోను చేస్తాడు. 72:18 وَأَنَّ الْمَسَاجِدَ لِلَّهِ فَلَا تَدْعُوا مَعَ اللَّهِ أَحَدًا ఇంకా – మస్జిదులు కేవలం అల్లాహ్ కొరకే ప్రత్యేకించబడ్డాయి. కాబట్టి (వాటిలో) అల్లాహ్ తో పాటు ఇతరులెవరినీ పిలవకండి. 72:19 وَأَنَّهُ لَمَّا قَامَ عَبْدُ اللَّهِ يَدْعُوهُ كَادُوا يَكُونُونَ عَلَيْهِ لِبَدًا అల్లాహ్ దాసుడు (ముహమ్మద్) అల్లాహ్ ను మాత్రమే ఆరాధించటానికి నిలబడినప్పుడు ఈ మూక అమాంతం అతనిపై విరుచుకుపడినట్లే ఉంటుంది. 72:20 قُلْ إِنَّمَا أَدْعُو رَبِّي وَلَا أُشْرِكُ بِهِ أَحَدًا (ఓ ప్రవక్తా!) “నేనైతే కేవలం నా ప్రభువునే మొరపెట్టుకుంటాను, ఆయనకు సహవర్తులుగా ఎవరినీ చేర్చను” అని చెప్పు. 72:21 قُلْ إِنِّي لَا أَمْلِكُ لَكُمْ ضَرًّا وَلَا رَشَدًا “మీకు కీడు (నష్టం)గానీ, మేలు (లాభం)గానీ చేకూర్చే అధికారం నాకు లేదు” అని (ఓ ప్రవక్తా!) చెప్పు. 72:22 قُلْ إِنِّي لَن يُجِيرَنِي مِنَ اللَّهِ أَحَدٌ وَلَنْ أَجِدَ مِن دُونِهِ مُلْتَحَدًا “అల్లాహ్ పట్టు నుండి నన్నెవరూ రక్షించలేరు. నేను ఆయన ఆశ్రయం తప్ప వేరొకరి ఆశ్రయాన్ని పొందలేను” అని (ఓ ప్రవక్తా! వారికి) చెప్పు. 72:23 إِلَّا بَلَاغًا مِّنَ اللَّهِ وَرِسَالَاتِهِ ۚ وَمَن يَعْصِ اللَّهَ وَرَسُولَهُ فَإِنَّ لَهُ نَارَ جَهَنَّمَ خَالِدِينَ فِيهَا أَبَدًا “అయితే నా బాధ్యతల్లా అల్లాహ్ వాణిని, ఆయన సందేశాలను (ప్రజలకు) అందజేయటమే. ఇక ఇప్పుడు ఎవరైనా అల్లాహ్ మాటను, అతని ప్రవక్త మాటను వినకపోతే వారికొరకు నరకాగ్ని ఉంది. అందులో వారు కలకాలం ఉంటారు.” 72:24 حَتَّىٰ إِذَا رَأَوْا مَا يُوعَدُونَ فَسَيَعْلَمُونَ مَنْ أَضْعَفُ نَاصِرًا وَأَقَلُّ عَدَدًا ఎట్టకేలకు – వారికి వాగ్దానం చేయబడుతున్నది వారు చూసుకున్నప్పుడు, ఎవరి సహాయకులు బలహీనులో, ఎవరి సమూహం అతి తక్కువగా ఉందో వారే తెలుసుకుంటారు. 72:25 قُلْ إِنْ أَدْرِي أَقَرِيبٌ مَّا تُوعَدُونَ أَمْ يَجْعَلُ لَهُ رَبِّي أَمَدًا (ఓ ప్రవక్తా! వారికి) చెప్పు : “మీతో వాగ్దానం చేయబడుతున్న విషయం (శిక్ష) సమీపంలోనే ఉందో లేక నా ప్రభువు దానికోసం దూరపు గడువును నిర్ణయిస్తాడో నాకు తెలియదు.” 72:26 عَالِمُ الْغَيْبِ فَلَا يُظْهِرُ عَلَىٰ غَيْبِهِ أَحَدًا ఆయన అగోచర జ్ఞానం కలవాడు. తన అగోచర విషయాలను ఆయన ఎవరికీ తెలుపడు.... 72:27 إِلَّا مَنِ ارْتَضَىٰ مِن رَّسُولٍ فَإِنَّهُ يَسْلُكُ مِن بَيْنِ يَدَيْهِ وَمِنْ خَلْفِهِ رَصَدًا ......తాను ఇష్టపడిన ప్రవక్తకు తప్ప! అయితే ఆ ప్రవక్తకు ముందూ, వెనుకా కూడా తన పహరాదారులను నియమిస్తాడు. 72:28 لِّيَعْلَمَ أَن قَدْ أَبْلَغُوا رِسَالَاتِ رَبِّهِمْ وَأَحَاطَ بِمَا لَدَيْهِمْ وَأَحْصَىٰ كُلَّ شَيْءٍ عَدَدًا వారు తమ ప్రభువు సందేశాన్ని అందజేశారని తెలియటానికి (ఈ ఏర్పాటు జరిగింది). ఆయన వారి పరిసరాలన్నింటినీ పరివేష్టించి, ఒక్కో వస్తువును లెక్కపెట్టి ఉంచాడు. ఈ తెలుగు ఖుర్ఆన్ శాంతి మార్గం పబ్లికేషన్ వారు ప్రచురించారు. వారి అనుమతితో ఈ వెబ్ పోర్టల్ పై వేయబడింది. |