aip_quran
Translation

  العربية              తెలుగు  

1. సూరా అల్ ఫాతిహా
2. సూరా అల్ బఖర
3. సూరా ఆలి ఇమ్రాన్
4. సూరా అన్ నిసా
5. సూరా అల్ మాయిద
6. సూరా అల్ అన్ ఆమ్
7. సూరా అల్ ఆరాఫ్
8. సూరా అల్ అన్ ఫాల్
9. సూరా అత్ తౌబా
10. సూరా యూనుస్
11. సూరా హూద్
12. సూరా యూసుఫ్
13. సూరా ఆర్ రాద్
14. సూరా ఇబ్రహీం
15. సూరా అల్ హిజ్ర్
16. సూరా అన్ నహ్ల్
17. సూరా బనీ ఇస్రాయీల్
18. సూరా అల్ కహఫ్
19. సూరా మర్యం
20. సూరా తాహా
21. సూరా అల్ అంబియా
22. సూరా అల్ హజ్
23. సూరా అల్ మూ ‘మినూన్
24. సూరా అన్ నూర్
25. సూరా అల్ ఫుర్ఖాన్
26. సూరా ఆష్ షుఅరా
27. సూరా అన్ నమ్ల్
28. సూరా అల్ ఖసస్
29. సూరా అల్ అన్ కబూత్
30. సూరా ఆర్ రూమ్
31. సూరా లుక్మాన్
32. సూరా అస్ సజ్ ద హ్
33. సూరా అల్ ఆహ్ జాబ్
34. సూరా సబా
35. సూరా ఫాతిర్
36. సూరా యాసీన్
37. సూరా అస్ సాఫ్ఫాత్
38. సూరా సాద్
39. సూరా అజ్ జుమర్
40. సూరా అల్ మూమిన్
41. సూరా హామీమ్ అస్ సజ్ ద హ్
42. సూరా ఆష్ షూరా
43. సూరా అజ్ జుఖ్ రుఫ్
44. సూరా అద్ దుఖాన్
45. సూరా అల్ జాసియ హ్
46. సూరా అల్ ఆహ్ ఖాఫ్
47. సూరా ముహమ్మద్
48. సూరా అల్ ఫతహ్
49. సూరా అల్ హుజురాత్
50. సూరా ఖాఫ్
51. సూరా అజ్ జారియాత్
52. సూరా అత్ తూర్
53. సూరా అన్ నజ్మ్
54. సూరా అల్ ఖమర్
55. సూరా ఆర్ రహ్మాన్
56. సూరా వాఖియహ్
57. సూరా అల్ హదీద్
58. సూరా అల్ ముజాదల హ్
59. సూరా అల్ హష్ర్
60. సూరా అల్ ముమ్ తహిన హ్
61. సూరా అస్ సఫ్
62. సూరాఅల్ జుముఅ హ్
63. సూరా అల్ మునాఫిఖూన్
64. సూరా అత్ తగాబున్
65. సూరా అత్ తలాఖ్
66. సూరా అత్ తహ్రీం
67. సూరా అల్ ముల్క్
68. సూరా అల్ ఖలమ్
69. సూరా అల్ హఖ్ఖ
70. సూరా అల్ ముఆరిజ్
71. సూరా నూహ్
72. సూరా అల్ జిన్న్
73. సూరా అల్ ముజ్జమ్మిల్
74. సూరా అల్ ముద్దస్సిర్
75. సూరా అల్ ఖియామ హ్
76. సూరా అద్ దహ్ర్
77. సూరా అల్ ముర్సలాత్
78. సూరా అన్ నబా
79. సూరా అన్ నాజి ఆత్
80. సూరా అబస
81. సూరా అత్ తక్వీర్
82. సూరా అల్ ఇన్ ఫితార్
83. సూరాఅల్ ముతఫ్ఫిఫీన్
84. సూరా అల్ ఇన్ షి ఖాక్
85. సూరా అల్ బురూజ్
86. సూరా అత్ తారిఖ్
87. సూరా అల్ ఆలా
88. సూరా అల్ గాషియ హ్
89. సూరా అల్ ఫజ్ర్
90. సూరా అల్ బలద్
91. సూరా ఆష్ షమ్స్
92. సూరా అల్ లైల్
93. సూరా అజ్ జుహా
94. సూరా ఆలమ్ నష్ర్
95. సూరా అత్ తతీన్
96. సూరా అల్ అలఖ్
97. సూరా అల్ ఖద్ర్
98. సూరా అల్ బయ్యిన హ్
99. సూరా అజ్ జిలజాల్
100. సూరా అల్ ఆదియాత్
101. సూరా అల్ ఖారియ హ్
102. సూరా అత్ తకాసుర్
103. సూరా అల్ అస్ర్
104. సూరా అల్ హుమజా హ్
105. సూరా అల్ ఫీల్
106. సూరా ఖురైష్
107. సూరా అల్ మాఊ న్
108. సూరా అల్ కౌసర్
109. సూరా అల్ ఖాఫిరూన్
110. సూరా అన్ నస్ర్
111. సూరా అల్ లహబ్
112. సూరా అల్ ఇఖ్లాస్
113. సూరా అల్ ఫలఖ్
114. సూరా అన్ నాస్

7. సూరా అల్ ఆరాఫ్

7:1  المص
అలిఫ్‌ - లామ్‌ - మీమ్‌ - సాద్‌.
7:2  كِتَابٌ أُنزِلَ إِلَيْكَ فَلَا يَكُن فِي صَدْرِكَ حَرَجٌ مِّنْهُ لِتُنذِرَ بِهِ وَذِكْرَىٰ لِلْمُؤْمِنِينَ
ఇదొక గ్రంథం. దీని ఆధారంగా నీవు హెచ్చరించటానికిగాను ఇది నీ వద్దకు పంపబడింది. కాబట్టి (ఓ ప్రవక్తా!) దీని పట్ల నీ మనసులో ఎటువంటి సంకోచం ఉండకూడదు. విశ్వసించిన వారికి ఇది హితబోధిని (జ్ఞాపిక!).
7:3  اتَّبِعُوا مَا أُنزِلَ إِلَيْكُم مِّن رَّبِّكُمْ وَلَا تَتَّبِعُوا مِن دُونِهِ أَوْلِيَاءَ ۗ قَلِيلًا مَّا تَذَكَّرُونَ
(ప్రజలారా!) మీ ప్రభువు తరఫున మీకు వొసగబడిన దానిని మీరు అనుసరించండి. అల్లాహ్‌ను వదలి ఇతర సంరక్షకులను అనుసరించకండి. మీరు బహుకొద్దిగా మాత్రమే హితబోధను గ్రహిస్తారు.
7:4  وَكَم مِّن قَرْيَةٍ أَهْلَكْنَاهَا فَجَاءَهَا بَأْسُنَا بَيَاتًا أَوْ هُمْ قَائِلُونَ
ఎన్నో జనవాసాలను మేము రూపుమాపాము. వాటిపై మా శిక్ష రాత్రి వేళనో లేక మధ్యాహ్నం వారు విశ్రమిస్తున్న సమయంలోనో వచ్చి పడింది.
7:5  فَمَا كَانَ دَعْوَاهُمْ إِذْ جَاءَهُم بَأْسُنَا إِلَّا أَن قَالُوا إِنَّا كُنَّا ظَالِمِينَ
వారిపై మా శిక్ష వచ్చిపడినప్పుడు “మేము నిజంగానే దుర్మార్గులం” అన్న మాట తప్ప మరోమాట వారినోటి నుండి రాలేదు.
7:6  فَلَنَسْأَلَنَّ الَّذِينَ أُرْسِلَ إِلَيْهِمْ وَلَنَسْأَلَنَّ الْمُرْسَلِينَ
ఎవరి వద్దకు ప్రవక్తలు పంపబడ్డారో వారిని తప్పకుండా అడుగుతాము. ప్రవక్తలను కూడా మేము తప్పకుండా ప్రశ్నిస్తాము.
7:7  فَلَنَقُصَّنَّ عَلَيْهِم بِعِلْمٍ ۖ وَمَا كُنَّا غَائِبِينَ
మాకు ప్రతిదీ తెలుసు గనక తర్వాత వారి ముందు ఉన్నదున్నట్టు విప్పి చెబుతాము - మాకు ఏదీ తెలియకుండా లేదు.
7:8  وَالْوَزْنُ يَوْمَئِذٍ الْحَقُّ ۚ فَمَن ثَقُلَتْ مَوَازِينُهُ فَأُولَٰئِكَ هُمُ الْمُفْلِحُونَ
ఆ రోజు బరువు (తూకం) కూడా సత్యమే. ఎవరి త్రాసు బరువుగా ఉంటుందో వారే సాఫల్యం పొందేవారు.
7:9  وَمَنْ خَفَّتْ مَوَازِينُهُ فَأُولَٰئِكَ الَّذِينَ خَسِرُوا أَنفُسَهُم بِمَا كَانُوا بِآيَاتِنَا يَظْلِمُونَ
మరెవరి త్రాసు తేలికగా ఉంటుందో వారు, మా ఆయతుల పట్ల దుర్మార్గంగా ప్రవర్తించినందుకుగాను చేజేతులా నష్టాన్ని కొనితెచ్చుకునేవారు.
7:10  وَلَقَدْ مَكَّنَّاكُمْ فِي الْأَرْضِ وَجَعَلْنَا لَكُمْ فِيهَا مَعَايِشَ ۗ قَلِيلًا مَّا تَشْكُرُونَ
నిశ్చయంగా మేము మిమ్మల్ని భువిపై నివసింపజేశాము. మీ కొరకు అందులో జీవన సామగ్రిని సమకూర్చాము. అయినప్పటికీ మీరు కృతజ్ఞత తెలుపుకునేది బహు తక్కువ.
7:11  وَلَقَدْ خَلَقْنَاكُمْ ثُمَّ صَوَّرْنَاكُمْ ثُمَّ قُلْنَا لِلْمَلَائِكَةِ اسْجُدُوا لِآدَمَ فَسَجَدُوا إِلَّا إِبْلِيسَ لَمْ يَكُن مِّنَ السَّاجِدِينَ
మేము మిమ్మల్ని సృష్టించాము. మరి మేమే మీ రూపురేఖలను తీర్చిదిద్దాము. ఆ తరువాత దూతలను, “ఆదం ముందు సాష్టాంగపడండి” అని ఆదేశించాము. ఒక్క ఇబ్లీసు తప్ప అందరూ సాష్టాంగపడ్డారు. వాడు మాత్రం సాష్టాంగ పడేవారిలో చేరలేదు.
7:12  قَالَ مَا مَنَعَكَ أَلَّا تَسْجُدَ إِذْ أَمَرْتُكَ ۖ قَالَ أَنَا خَيْرٌ مِّنْهُ خَلَقْتَنِي مِن نَّارٍ وَخَلَقْتَهُ مِن طِينٍ
“నేను నిన్ను ఆజ్ఞాపించినప్పటికీ సాష్టాంగపడకుండా ఏ విషయం నిన్ను అడ్డుకుంది?” అని (అల్లాహ్‌) అడిగితే, “నేను అతనికంటే ఘనుడను. నీవు నన్ను అగ్నితో సృష్టించావు, అతన్నేమో మట్టితో చేశావు” అని ఇబ్లీసు చెప్పాడు.
7:13  قَالَ فَاهْبِطْ مِنْهَا فَمَا يَكُونُ لَكَ أَن تَتَكَبَّرَ فِيهَا فَاخْرُجْ إِنَّكَ مِنَ الصَّاغِرِينَ
“అలాగయితే నువ్వు ఆకాశం నుంచి దిగిపో. ఆకాశంలో ఉండి అహంకారం ప్రదర్శించే హక్కు నీకెంతమాత్రం లేదు. కాబట్టి ఇక్కణ్ణుంచి వెళ్ళిపో. నిశ్చయంగా నువ్వు తుచ్ఛుల కోవకు చెందినవాడవు” అని అల్లాహ్‌ అన్నాడు.
7:14  قَالَ أَنظِرْنِي إِلَىٰ يَوْمِ يُبْعَثُونَ
“అలాగయితే అందరూ తిరిగి లేపబడే రోజు వరకూ నాకు గడువు ఇవ్వు” అని ఇబ్లీసు అడిగాడు.
7:15  قَالَ إِنَّكَ مِنَ الْمُنظَرِينَ
“నీకు గడువు ఇవ్వబడింది” అని అల్లాహ్‌ చెప్పాడు.
7:16  قَالَ فَبِمَا أَغْوَيْتَنِي لَأَقْعُدَنَّ لَهُمْ صِرَاطَكَ الْمُسْتَقِيمَ
“నీవు నన్ను భ్రష్టుణ్ణి చేసిన కారణంగా నేను వీళ్ళ కోసం (అంటే మానవుల కోసం) నీ రుజుమార్గంలో (మాటువేసి) కూర్చుంటాను.
7:17  ثُمَّ لَآتِيَنَّهُم مِّن بَيْنِ أَيْدِيهِمْ وَمِنْ خَلْفِهِمْ وَعَنْ أَيْمَانِهِمْ وَعَن شَمَائِلِهِمْ ۖ وَلَا تَجِدُ أَكْثَرَهُمْ شَاكِرِينَ
ఆపైన “ముందు నుంచీ, వెనుక నుంచీ, కుడి వైపు నుంచీ, ఎడమ వైపు నుంచీ వాళ్ళపై దాడి చేస్తాను. వారిలో చాలా మందిని నీవు కృతజ్ఞులుగా పొందవు” అని ఇబ్లీసు సవాలు చేశాడు.
7:18  قَالَ اخْرُجْ مِنْهَا مَذْءُومًا مَّدْحُورًا ۖ لَّمَن تَبِعَكَ مِنْهُمْ لَأَمْلَأَنَّ جَهَنَّمَ مِنكُمْ أَجْمَعِينَ
అప్పుడు అల్లాహ్‌, “తుచ్ఛుడవై, ధూర్తుడవై ఇక్కడినుంచి వెళ్ళిపో. వారిలో ఎవరు నీ మాట వింటారో మీ అందరితోనూ నరకాన్ని నింపుతాను” అన్నాడు.
7:19  وَيَا آدَمُ اسْكُنْ أَنتَ وَزَوْجُكَ الْجَنَّةَ فَكُلَا مِنْ حَيْثُ شِئْتُمَا وَلَا تَقْرَبَا هَٰذِهِ الشَّجَرَةَ فَتَكُونَا مِنَ الظَّالِمِينَ
“ఓ ఆదమ్‌! నువ్వూ, నీ భార్య-ఇద్దరూ స్వర్గంలో ఉండండి. మరి మీరు కోరిన చోటునుంచి (మీకు నచ్చిన దాన్ని తీసుకుని) తినండి. కాని ఈ వృక్షం వద్దకు మాత్రం పోకండి. పోయారా, మీరిద్దరూ దుర్మార్గుల్లో చేరిపోతారు” (అని మేము చెప్పాము).
7:20  فَوَسْوَسَ لَهُمَا الشَّيْطَانُ لِيُبْدِيَ لَهُمَا مَا وُورِيَ عَنْهُمَا مِن سَوْآتِهِمَا وَقَالَ مَا نَهَاكُمَا رَبُّكُمَا عَنْ هَٰذِهِ الشَّجَرَةِ إِلَّا أَن تَكُونَا مَلَكَيْنِ أَوْ تَكُونَا مِنَ الْخَالِدِينَ
తరువాత షైతాను, పరస్పరం వారిరువురికి కనబడకుండా ఉన్న వారి మర్మ స్థానాలను వారి ముందు బహిర్గతం చేసే ఉద్దేశంతో వారిద్దరి ఆంతర్యాలలో దుష్ప్రేరణను రేకెత్తించాడు. “మీరు దైవదూతలై పోతారేమో, ఎల్లకాలం సజీవులుగా ఉండే వారిలో కలిసిపోతారేమోనని మీ ప్రభువు మీ ఇద్దరినీ ఈ వృక్షం వద్దకు పోకుండా వారించాడు సుమా!” అని షైతాను వారితో అన్నాడు.
7:21  وَقَاسَمَهُمَا إِنِّي لَكُمَا لَمِنَ النَّاصِحِينَ
“నేను మీ శ్రేయోభిలాషిని” అని వారిద్దరి ముందు ఒట్టేసి మరీ చెప్పాడు.
7:22  فَدَلَّاهُمَا بِغُرُورٍ ۚ فَلَمَّا ذَاقَا الشَّجَرَةَ بَدَتْ لَهُمَا سَوْآتُهُمَا وَطَفِقَا يَخْصِفَانِ عَلَيْهِمَا مِن وَرَقِ الْجَنَّةِ ۖ وَنَادَاهُمَا رَبُّهُمَا أَلَمْ أَنْهَكُمَا عَن تِلْكُمَا الشَّجَرَةِ وَأَقُل لَّكُمَا إِنَّ الشَّيْطَانَ لَكُمَا عَدُوٌّ مُّبِينٌ
ఆ విధంగా వాడు వారిద్దరినీ మోసపుచ్చి క్రిందికి తీసుకువచ్చాడు. వారిద్దరూ ఆ వృక్షం రుచి చూడగానే ఇద్దరి మర్మ స్థానాలూ ఒండొకరి ముందు బహిర్గతం అయిపోయాయి. అప్పుడు వారిరువురూ స్వర్గంలోని ఆకులను తమపై కప్పుకోసాగారు. వారి ప్రభువు వారిని పిలిచి, “మీరుభయులూ ఆ చెట్టు వద్దకు పోరాదని నేను మిమ్మల్ని వారించలేదా? షైతాను మీ బద్ధవిరోధి అని నేను మీకు ముందే చెప్పలేదా?” అన్నాడు.
7:23  قَالَا رَبَّنَا ظَلَمْنَا أَنفُسَنَا وَإِن لَّمْ تَغْفِرْ لَنَا وَتَرْحَمْنَا لَنَكُونَنَّ مِنَ الْخَاسِرِينَ
వారిద్దరూ, “మా ప్రభూ! మేము మా స్వయానికి ఎంతో అన్యాయం చేసుకున్నాము. ఇప్పుడు నీవు గనక మాకు క్షమాభిక్ష పెట్టి, మాపై దయదలచకపోతే నిశ్చయంగా మేము నష్టపోతాము” అని వేడుకున్నారు.
7:24  قَالَ اهْبِطُوا بَعْضُكُمْ لِبَعْضٍ عَدُوٌّ ۖ وَلَكُمْ فِي الْأَرْضِ مُسْتَقَرٌّ وَمَتَاعٌ إِلَىٰ حِينٍ
“దిగిపోండి. మీరు ఒండొకరికి విరోధులు. భూమిలో మీకు నివాస స్థానం ఉంటుంది. ఒక నిర్ణీత కాలం వరకూ మీరు అక్కడే లబ్ది పొందవలసి ఉంటుంది” అని సెలవిచ్చాడు.
7:25  قَالَ فِيهَا تَحْيَوْنَ وَفِيهَا تَمُوتُونَ وَمِنْهَا تُخْرَجُونَ
“మీరు అక్కడే బ్రతకాలి. అక్కడే చావాలి. మరి అక్కడి నుంచే మీరు వెలికి తీయబడతారు” అని కూడా అల్లాహ్‌ సెలవిచ్చాడు.
7:26  يَا بَنِي آدَمَ قَدْ أَنزَلْنَا عَلَيْكُمْ لِبَاسًا يُوَارِي سَوْآتِكُمْ وَرِيشًا ۖ وَلِبَاسُ التَّقْوَىٰ ذَٰلِكَ خَيْرٌ ۚ ذَٰلِكَ مِنْ آيَاتِ اللَّهِ لَعَلَّهُمْ يَذَّكَّرُونَ
ఓ ఆదం సంతతి వారలారా! మేము మీ కోసం దుస్తుల్ని దించాము. అవి మీ మర్మస్థానాలను కప్పి ఉంచటమేగాకుండా, మీ శరీరానికి శోభాయమానంగా కూడా ఉంటాయి. అయితే భయభక్తులతో కూడుకున్న దుస్తులు ఇంతకన్నా మంచివి. ఇవి వీళ్లు జ్ఞాపకముంచుకునేందుకుగాను అల్లాహ్‌ (చేసిన) సూచనలలోనివి.
7:27  يَا بَنِي آدَمَ لَا يَفْتِنَنَّكُمُ الشَّيْطَانُ كَمَا أَخْرَجَ أَبَوَيْكُم مِّنَ الْجَنَّةِ يَنزِعُ عَنْهُمَا لِبَاسَهُمَا لِيُرِيَهُمَا سَوْآتِهِمَا ۗ إِنَّهُ يَرَاكُمْ هُوَ وَقَبِيلُهُ مِنْ حَيْثُ لَا تَرَوْنَهُمْ ۗ إِنَّا جَعَلْنَا الشَّيَاطِينَ أَوْلِيَاءَ لِلَّذِينَ لَا يُؤْمِنُونَ
ఓ ఆదం సంతతి వారలారా! షైతాను మీ తల్లిదండ్రులను స్వర్గం నుంచి బయటికి తీయించి, వారి మర్మస్థానాలు వారికి కనిపించేలా చేయటానికి వారి దుస్తుల్ని ఎలా తొలగింపజేశాడో అలాగే వాడు మిమ్మల్ని కూడా చెరపకూడదు సుమా! వాడూ, వాడి సైన్యం, మీరు వారిని చూడలేని చోటు నుంచి మిమ్మల్ని చూస్తున్నారు. మేము అవిశ్వాసులకు షైతానులను స్నేహితులుగా చేశాము.
7:28  وَإِذَا فَعَلُوا فَاحِشَةً قَالُوا وَجَدْنَا عَلَيْهَا آبَاءَنَا وَاللَّهُ أَمَرَنَا بِهَا ۗ قُلْ إِنَّ اللَّهَ لَا يَأْمُرُ بِالْفَحْشَاءِ ۖ أَتَقُولُونَ عَلَى اللَّهِ مَا لَا تَعْلَمُونَ
వారు సిగ్గుమాలిన పని చేసినప్పుడల్లా, “మేము మా తాత ముత్తాతలను కూడా ఇలా చేస్తుండగా చూశాము. అల్లాహ్‌ కూడా మాకు ఇలాగే చేయమని ఆజ్ఞాపించాడు” అని చెబుతారు. “సిగ్గుమాలిన పనులు చెయ్యమని అల్లాహ్‌ ఎన్నటికీ ఆజ్ఞాపించడు. మీకు ఏ విషయాలైతే తెలియవో అల్లాహ్‌కు అటువంటి వాటిని ఆపాదిస్తారేమిటీ?” అని (ఓ ప్రవక్తా!) వారిని అడుగు.
7:29  قُلْ أَمَرَ رَبِّي بِالْقِسْطِ ۖ وَأَقِيمُوا وُجُوهَكُمْ عِندَ كُلِّ مَسْجِدٍ وَادْعُوهُ مُخْلِصِينَ لَهُ الدِّينَ ۚ كَمَا بَدَأَكُمْ تَعُودُونَ
(ఓ ప్రవక్తా!) ఈ విధంగా చెప్పు: నా ప్రభువు న్యాయంగురించి ఆదేశించాడు. సజ్దా చేసే ప్రతిసారీ మీ దిశ సరిగ్గా ఉండేటట్లు చూసుకోమని, ధర్మాన్ని (ఇబాదత్‌ను) కేవలం అల్లాహ్‌ కొరకే ప్రత్యేకించుకుని ఆయన్ని వేడుకోమని ఆయన ఆజ్ఞాపించాడు. మొదటిసారి అల్లాహ్‌ మిమ్మల్ని ఎలా పుట్టించాడో మలిసారి కూడా మీరు అలాగే పుట్టించబడతారు.
7:30  فَرِيقًا هَدَىٰ وَفَرِيقًا حَقَّ عَلَيْهِمُ الضَّلَالَةُ ۗ إِنَّهُمُ اتَّخَذُوا الشَّيَاطِينَ أَوْلِيَاءَ مِن دُونِ اللَّهِ وَيَحْسَبُونَ أَنَّهُم مُّهْتَدُونَ
అల్లాహ్‌ ఒక వర్గానికి సన్మార్గం చూపించాడు. మరో వర్గంపై అపమార్గం రూఢీ అయింది. వారు అల్లాహ్‌ను వదలి షైతానులను తమ స్నేహితులుగా చేసుకున్నారు. పైపెచ్చు - తాము సన్మార్గాన ఉన్నామని వారు అనుకుంటున్నారు.
7:31  يَا بَنِي آدَمَ خُذُوا زِينَتَكُمْ عِندَ كُلِّ مَسْجِدٍ وَكُلُوا وَاشْرَبُوا وَلَا تُسْرِفُوا ۚ إِنَّهُ لَا يُحِبُّ الْمُسْرِفِينَ
ఓ ఆదం సంతతివారలారా! మీరు మస్జిదుకు హాజరైన ప్రతిసారీ వస్త్రాలంకరణ పట్ల శ్రద్ధ వహించండి. తినండి, త్రాగండి. కాని మితిమీరకండి. మితిమీరిపోయే వారిని ఆయన (అల్లాహ్‌) ఇష్టపడడు.
7:32  قُلْ مَنْ حَرَّمَ زِينَةَ اللَّهِ الَّتِي أَخْرَجَ لِعِبَادِهِ وَالطَّيِّبَاتِ مِنَ الرِّزْقِ ۚ قُلْ هِيَ لِلَّذِينَ آمَنُوا فِي الْحَيَاةِ الدُّنْيَا خَالِصَةً يَوْمَ الْقِيَامَةِ ۗ كَذَٰلِكَ نُفَصِّلُ الْآيَاتِ لِقَوْمٍ يَعْلَمُونَ
(ఓ ప్రవక్తా!) వారిని అడుగు : “అల్లాహ్‌ తన దాసుల కొరకు సృజించిన అలంకార వస్తువులను, పరిశుద్ధమైన ఆహారవస్తువులను నిషేధించినదెవరు?” ప్రళయదినాన విశ్వసించిన వారికై ప్రత్యేకించబడిన ఈ వస్తువులన్నీ ఇహలోక జీవితంలో కూడా విశ్వాసుల కోసం ఉన్నాయి అని (ఓ ప్రవక్తా!) వాళ్ళకు చెప్పు. ఈ విధంగా మేము జ్ఞానసంపన్నుల కోసం మా ఆయతులన్నింటినీ విపులీకరిస్తూ ఉంటాము.
7:33  قُلْ إِنَّمَا حَرَّمَ رَبِّيَ الْفَوَاحِشَ مَا ظَهَرَ مِنْهَا وَمَا بَطَنَ وَالْإِثْمَ وَالْبَغْيَ بِغَيْرِ الْحَقِّ وَأَن تُشْرِكُوا بِاللَّهِ مَا لَمْ يُنَزِّلْ بِهِ سُلْطَانًا وَأَن تَقُولُوا عَلَى اللَّهِ مَا لَا تَعْلَمُونَ
“నా ప్రభువు నిషేధించినవి ఇవి మాత్రమే : బాహాటంగానూ, గోప్యంగానూ చేసే సిగ్గుమాలిన పనులు, పాపంతో కూడుకున్న ప్రతి విషయమూ, అన్యాయంగా ఒకరిమీద దుర్మార్గానికి ఒడిగట్టటం, అల్లాహ్‌ ఏ ప్రమాణమూ అవతరింపజేయకపోయినప్పటికీ మీరు అల్లాహ్‌కు భాగస్వామ్యం కల్పించటం, (నిజంగా అల్లాహ్‌ అన్నాడని) మీకు తెలియని విషయాన్ని మీరు అల్లాహ్‌ పేరుతో చెప్పటం (వీటిని అల్లాహ్‌ నిషేధించాడు)” అని ఓ ప్రవక్తా! వారికి చెప్పు.
7:34  وَلِكُلِّ أُمَّةٍ أَجَلٌ ۖ فَإِذَا جَاءَ أَجَلُهُمْ لَا يَسْتَأْخِرُونَ سَاعَةً ۖ وَلَا يَسْتَقْدِمُونَ
ప్రతి సమాజానికీ ఒక గడువు నిర్థారించబడి ఉంది. వారి నిర్ణీత సమయం వచ్చేసినప్పుడు ఒక్క క్షణం కూడా వారు వెనకా ముందూ కాలేరు.
7:35  يَا بَنِي آدَمَ إِمَّا يَأْتِيَنَّكُمْ رُسُلٌ مِّنكُمْ يَقُصُّونَ عَلَيْكُمْ آيَاتِي ۙ فَمَنِ اتَّقَىٰ وَأَصْلَحَ فَلَا خَوْفٌ عَلَيْهِمْ وَلَا هُمْ يَحْزَنُونَ
ఓ ఆదం సంతతివారలారా! ఒకవేళ మీలో నుంచే (నియుక్తులైన) ప్రవక్తలు మీవద్దకు వచ్చి, నా ఆదేశాలను వారు మీకు వినిపించినపుడు భయభక్తుల (తఖ్వా) వైఖరిని అవలంబించి, తమ్ము తాము సరిదిద్దుకున్న వారికి భయంగానీ, దుఃఖంగానీ ఉండదు.
7:36  وَالَّذِينَ كَذَّبُوا بِآيَاتِنَا وَاسْتَكْبَرُوا عَنْهَا أُولَٰئِكَ أَصْحَابُ النَّارِ ۖ هُمْ فِيهَا خَالِدُونَ
మరెవరయితే మా ఆదేశాలను అసత్యాలని ధిక్కరించి, వాటిపట్ల దురహంకారాన్ని ప్రదర్శిస్తారో వారు నరక వాసులవుతారు. అందులో వారు ఎల్లకాలం పడి ఉంటారు.
7:37  فَمَنْ أَظْلَمُ مِمَّنِ افْتَرَىٰ عَلَى اللَّهِ كَذِبًا أَوْ كَذَّبَ بِآيَاتِهِ ۚ أُولَٰئِكَ يَنَالُهُمْ نَصِيبُهُم مِّنَ الْكِتَابِ ۖ حَتَّىٰ إِذَا جَاءَتْهُمْ رُسُلُنَا يَتَوَفَّوْنَهُمْ قَالُوا أَيْنَ مَا كُنتُمْ تَدْعُونَ مِن دُونِ اللَّهِ ۖ قَالُوا ضَلُّوا عَنَّا وَشَهِدُوا عَلَىٰ أَنفُسِهِمْ أَنَّهُمْ كَانُوا كَافِرِينَ
అల్లాహ్‌కు అబద్ధాలను అంటగట్టేవాని కంటే లేదా ఆయన ఆయతులను అసత్యాలని కొట్టిపారేసేవాని కంటే పరమ దుర్మార్గుడెవడుంటాడు? అటువంటి వారికోసం రాసిపెట్టి ఉన్న భాగం వారికి లభించి తీరుతుంది. ఆఖరికి మా దూతలు వారి ప్రాణాలు స్వాధీనం చేసుకోవటానికి వారివద్దకు వచ్చినప్పుడు “అల్లాహ్‌ను వదలి మీరు ఆరాధిస్తూ ఉన్నవారు ఇప్పుడెక్కడున్నారు?” అని అడుగుతారు. “వారంతా మా వద్ద నుంచి మటుమాయమై పోయారు” అని వాళ్ళు చెబుతారు. తాము అవిశ్వాసులుగా ఉండేవారన్న విషయాన్ని గురించి వారు స్వయంగా సాక్ష్యమిస్తారు.
7:38  قَالَ ادْخُلُوا فِي أُمَمٍ قَدْ خَلَتْ مِن قَبْلِكُم مِّنَ الْجِنِّ وَالْإِنسِ فِي النَّارِ ۖ كُلَّمَا دَخَلَتْ أُمَّةٌ لَّعَنَتْ أُخْتَهَا ۖ حَتَّىٰ إِذَا ادَّارَكُوا فِيهَا جَمِيعًا قَالَتْ أُخْرَاهُمْ لِأُولَاهُمْ رَبَّنَا هَٰؤُلَاءِ أَضَلُّونَا فَآتِهِمْ عَذَابًا ضِعْفًا مِّنَ النَّارِ ۖ قَالَ لِكُلٍّ ضِعْفٌ وَلَٰكِن لَّا تَعْلَمُونَ
“మీకు పూర్వం గతించిన జిన్నాతు, మానవ సమూహాలతో చేరి, (వారితో పాటు) మీరు కూడా నరకంలోకి ప్రవేశించండి” అని అల్లాహ్‌ వారితో అంటాడు. వారిలోని ప్రతి సమూహమూ అందులో (నరకంలో) పడుతున్నప్పుడు, తన సహవాస సమూహానికి శాపనార్థాలు పెడుతుంది. ఆఖరికి వారంతా అందులో చేరిపోయిన తరువాత, తరువాతి వారు మొదటివారినుద్దేశించి, ”ప్రభూ! అసలు మమ్మల్ని అపమార్గం పట్టించిన వాళ్లు వీళ్ళే. కనుక వీళ్లకు రెట్టింపు నరక శిక్షను విధించు” అని అంటారు. అప్పుడు అల్లాహ్‌, “అందరికీ రెట్టింపు శిక్షే పడుతుంది. కాని ఆ సంగతి మీకు అర్థం కాదు” అంటాడు-
7:39  وَقَالَتْ أُولَاهُمْ لِأُخْرَاهُمْ فَمَا كَانَ لَكُمْ عَلَيْنَا مِن فَضْلٍ فَذُوقُوا الْعَذَابَ بِمَا كُنتُمْ تَكْسِبُونَ
మొదటివారు తమ తరువాతి వారినుద్దేశించి, “మీకు మాపై ఎలాంటి ప్రాధాన్యతా లభించలేదు. కాబట్టి మీరు కూడా మీరు సంపాదించుకున్న దానికి ప్రతిఫలంగా శిక్షను రుచి చూడండి” అంటారు.
7:40  إِنَّ الَّذِينَ كَذَّبُوا بِآيَاتِنَا وَاسْتَكْبَرُوا عَنْهَا لَا تُفَتَّحُ لَهُمْ أَبْوَابُ السَّمَاءِ وَلَا يَدْخُلُونَ الْجَنَّةَ حَتَّىٰ يَلِجَ الْجَمَلُ فِي سَمِّ الْخِيَاطِ ۚ وَكَذَٰلِكَ نَجْزِي الْمُجْرِمِينَ
ఎవరు మా ఆయతులను అసత్యాలని ధిక్కరించి, వాటి పట్ల గర్వాతిశయంతో విర్రవీగారో వారి కోసం ఆకాశ ద్వారాలు తెరువబడవు. ఒంటె సూది రంధ్రంలో నుంచి దూరిపోనంత వరకూ వారు స్వర్గంలో ప్రవేశించలేరు. అపరాధులను మేము ఈ విధంగానే శిక్షిస్తాం.
7:41  لَهُم مِّن جَهَنَّمَ مِهَادٌ وَمِن فَوْقِهِمْ غَوَاشٍ ۚ وَكَذَٰلِكَ نَجْزِي الظَّالِمِينَ
వారి క్రింద నరకాగ్నితో చేయబడిన పాన్పుఉంటుంది. పైన దుప్పటి కూడా (దానితోనే తయారైనదయి ఉంటుంది). దుర్మార్గులకు మేము విధించే శిక్ష ఇలాగే ఉంటుంది.
7:42  وَالَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ لَا نُكَلِّفُ نَفْسًا إِلَّا وُسْعَهَا أُولَٰئِكَ أَصْحَابُ الْجَنَّةِ ۖ هُمْ فِيهَا خَالِدُونَ
మరెవరు విశ్వసించి, మంచి పనులు చేశారో- ఏ వ్యక్తిపై కూడా మేము శక్తికి మించిన భారం వేయము- యదార్థానికి వారే స్వర్గవాసులు. అందులో వారు కలకాలం ఉంటారు.
7:43  وَنَزَعْنَا مَا فِي صُدُورِهِم مِّنْ غِلٍّ تَجْرِي مِن تَحْتِهِمُ الْأَنْهَارُ ۖ وَقَالُوا الْحَمْدُ لِلَّهِ الَّذِي هَدَانَا لِهَٰذَا وَمَا كُنَّا لِنَهْتَدِيَ لَوْلَا أَنْ هَدَانَا اللَّهُ ۖ لَقَدْ جَاءَتْ رُسُلُ رَبِّنَا بِالْحَقِّ ۖ وَنُودُوا أَن تِلْكُمُ الْجَنَّةُ أُورِثْتُمُوهَا بِمَا كُنتُمْ تَعْمَلُونَ
వారి ఆంతర్యాల్లో ఏ కాస్తయినా విద్వేషం ఉంటే దాన్ని మేము తొలగిస్తాము. వారి (నివాసాల) క్రింద నుంచి కాలువలు ప్రవహిస్తూ ఉంటాయి. “మమ్మల్ని ఈ స్థానం వరకూ చేర్చిన అల్లాహ్‌కు (కోట్లాది) కృతజ్ఞతలు. అల్లాహ్‌యే గనక మాకు మార్గదర్శకత్వం వహించకుండా ఉంటే మేము ఎన్నటికి కూడా ఈ స్థితికి చేరుకునే వాళ్ళంకాము. మా ప్రభువు (తరఫున వచ్చిన) ప్రవక్తలు నిజంగా సత్యాన్నే తీసుకువచ్చారు” అని వారు అంటారు. అప్పుడు వారిని పిలిచి ఇలా చెప్పబడుతుంది: “మీరు చేసుకున్న సత్కర్మలకు బదులుగా మీరు ఈ స్వర్గానికి వారసులయ్యారు.”
7:44  وَنَادَىٰ أَصْحَابُ الْجَنَّةِ أَصْحَابَ النَّارِ أَن قَدْ وَجَدْنَا مَا وَعَدَنَا رَبُّنَا حَقًّا فَهَلْ وَجَدتُّم مَّا وَعَدَ رَبُّكُمْ حَقًّا ۖ قَالُوا نَعَمْ ۚ فَأَذَّنَ مُؤَذِّنٌ بَيْنَهُمْ أَن لَّعْنَةُ اللَّهِ عَلَى الظَّالِمِينَ
స్వర్గవాసులు నరకవాసులను కేకవేసి పిలుస్తూ, “మా ప్రభువు మాకు చేసిన వాగ్దానాన్ని మేము నిజమైనదిగా పొందాము. మరి మీరు కూడా మీ ప్రభువు చేసిన వాగ్దానాన్ని నిజమైనదిగా పొందారా?” అని ప్రశ్నిస్తారు. “అవును” అని వారు సమాధానమిస్తారు. అప్పుడు ప్రకటించేవాడొకడు వారి మధ్య, “ఈ దుర్మార్గులపై అల్లాహ్‌ శాపం పడుగాక!” అని ప్రకటిస్తాడు.
7:45  الَّذِينَ يَصُدُّونَ عَن سَبِيلِ اللَّهِ وَيَبْغُونَهَا عِوَجًا وَهُم بِالْآخِرَةِ كَافِرُونَ
వారు అల్లాహ్‌ మార్గం నుంచి విముఖత చూపేవారు, అందులో వక్రతలను వెతికేవారు. పరలోకాన్ని సయితం త్రోసి పుచ్చేవారు.
7:46  وَبَيْنَهُمَا حِجَابٌ ۚ وَعَلَى الْأَعْرَافِ رِجَالٌ يَعْرِفُونَ كُلًّا بِسِيمَاهُمْ ۚ وَنَادَوْا أَصْحَابَ الْجَنَّةِ أَن سَلَامٌ عَلَيْكُمْ ۚ لَمْ يَدْخُلُوهَا وَهُمْ يَطْمَعُونَ
వారిరువురి మధ్య ఒక గోడ అడ్డుగా ఉంటుంది. 'ఆరాఫ్‌' పైన చాలామంది ఉంటారు. వారు ప్రతి ఒక్కరినీ వారి చిహ్నాలను బట్టి గుర్తుపడతారు. వారు స్వర్గవాసులను పిలిచి, “అస్సలాము అలైకుమ్‌ (మీకు శాంతి కలుగుగాక)!” అని అంటారు. ఈ ఆరాఫ్‌ వారు అప్పటికింకా స్వర్గంలో ప్రవేశించి ఉండరు. అయితే తమకూ స్వర్గం లభిస్తుందన్న ఆశతో ఉంటారు.
7:47  وَإِذَا صُرِفَتْ أَبْصَارُهُمْ تِلْقَاءَ أَصْحَابِ النَّارِ قَالُوا رَبَّنَا لَا تَجْعَلْنَا مَعَ الْقَوْمِ الظَّالِمِينَ
వారి దృష్టి నరకవాసులపై పడినప్పుడు, “ఓ ప్రభూ! మమ్మల్ని ఈ దుర్మార్గులలో చేర్చకు” అని ప్రార్థిస్తారు.
7:48  وَنَادَىٰ أَصْحَابُ الْأَعْرَافِ رِجَالًا يَعْرِفُونَهُم بِسِيمَاهُمْ قَالُوا مَا أَغْنَىٰ عَنكُمْ جَمْعُكُمْ وَمَا كُنتُمْ تَسْتَكْبِرُونَ
'ఆరాఫ్‌'పై ఉన్నవారు ఎంతోమందిని (నరకవాసుల్ని) వారి ఆనవాళ్ల ద్వారా గుర్తుపట్టి పిలుస్తూ, ఇలా అంటారు : “మీ వర్గాలుగానీ, మీ బడాయిగానీ మీకు ఏమాత్రం పనికి రాలేదే!
7:49  أَهَٰؤُلَاءِ الَّذِينَ أَقْسَمْتُمْ لَا يَنَالُهُمُ اللَّهُ بِرَحْمَةٍ ۚ ادْخُلُوا الْجَنَّةَ لَا خَوْفٌ عَلَيْكُمْ وَلَا أَنتُمْ تَحْزَنُونَ
'అల్లాహ్‌ వీళ్లపై దయచూపడు' అని మీరు ప్రమాణాలు చేసి చెప్పేవారు వీరేనా?” అని అడుగుతారు. అప్పుడు “స్వర్గంలో ప్రవేశించండి. ఇక మీకు భయంగానీ, దుఃఖంగానీ ఉండదు” అని వారితో అనబడుతుంది.
7:50  وَنَادَىٰ أَصْحَابُ النَّارِ أَصْحَابَ الْجَنَّةِ أَنْ أَفِيضُوا عَلَيْنَا مِنَ الْمَاءِ أَوْ مِمَّا رَزَقَكُمُ اللَّهُ ۚ قَالُوا إِنَّ اللَّهَ حَرَّمَهُمَا عَلَى الْكَافِرِينَ
నరకవాసులు స్వర్గవాసులను పిలుస్తూ, “మాపైన కొద్దిగా నీళ్ళయినా పోయండి లేదా అల్లాహ్‌ మీకు ప్రసాదించిన దాంట్లోంచి ఏ కాస్తయినా ఇటు పడేయండి” అని ప్రాధేయ పడతారు. దానికి సమాధానంగా వారు, “ఈ రెండింటినీ అల్లాహ్‌ అవిశ్వాసుల కొరకు నిషేధించాడు” అని అంటారు.
7:51  الَّذِينَ اتَّخَذُوا دِينَهُمْ لَهْوًا وَلَعِبًا وَغَرَّتْهُمُ الْحَيَاةُ الدُّنْيَا ۚ فَالْيَوْمَ نَنسَاهُمْ كَمَا نَسُوا لِقَاءَ يَوْمِهِمْ هَٰذَا وَمَا كَانُوا بِآيَاتِنَا يَجْحَدُونَ
వారు ఇహలోకంలో మతధర్మాన్ని ఆటగా, తమాషాగా తీసుకున్నారు. ఇహలోక జీవితం వారిని మోసానికి గురిచేసింది. కాబట్టి వారు ఈనాటి సమావేశాన్ని విస్మరించినట్లే, మా ఆయతులను త్రోసిపుచ్చినట్లే ఈ రోజు మేము (కూడా) వీళ్లను విస్మరిస్తాము.
7:52  وَلَقَدْ جِئْنَاهُم بِكِتَابٍ فَصَّلْنَاهُ عَلَىٰ عِلْمٍ هُدًى وَرَحْمَةً لِّقَوْمٍ يُؤْمِنُونَ
మేము ఈ జనుల వద్దకు, మా సంపూర్ణ జ్ఞానంతో బహుస్పష్టంగా విశదీకరించిన గ్రంథాన్ని చేరవేశాము. విశ్వసించినవారికి అది మార్గదర్శక సాధనం మరియు కారుణ్యం.
7:53  هَلْ يَنظُرُونَ إِلَّا تَأْوِيلَهُ ۚ يَوْمَ يَأْتِي تَأْوِيلُهُ يَقُولُ الَّذِينَ نَسُوهُ مِن قَبْلُ قَدْ جَاءَتْ رُسُلُ رَبِّنَا بِالْحَقِّ فَهَل لَّنَا مِن شُفَعَاءَ فَيَشْفَعُوا لَنَا أَوْ نُرَدُّ فَنَعْمَلَ غَيْرَ الَّذِي كُنَّا نَعْمَلُ ۚ قَدْ خَسِرُوا أَنفُسَهُمْ وَضَلَّ عَنْهُم مَّا كَانُوا يَفْتَرُونَ
ఈ గ్రంథంలో తెలియజేయబడిన తుదిఫలితం ఎప్పుడు వస్తుందా అని మాత్రమే తప్ప మరో దానికోసం వీరు నిరీక్షించటం లేదు. ఏ రోజున దీని తుది ఫలితం వచ్చేస్తుందో ఆ రోజు, ముందు నుంచీ దీనిని విస్మరిస్తూ వచ్చినవారే ఇలా అంటారు: “మా ప్రభువు (తరఫున నియుక్తులైన) ప్రవక్తలు నిజంగానే సత్య బద్ధమైన విషయాలు తెచ్చారు. ఇప్పుడు మా కోసం సిఫారసు చేసే సిఫారసుదారులెవరయినా మాకు లభిస్తారా? లేదా లోగడ మేము చేసిన (చెడు) కర్మలకు భిన్నమైన కర్మలు చేసేందుకు మళ్లీ మేము (ఇహలోకానికి) తిరిగి పంపబడతామా?” - నిస్సందేహంగా వీళ్లు తమ స్వయానికి నష్టం చేకూర్చుకున్నారు. వీళ్లు కల్పిస్తూ వచ్చిన విషయాలన్నీ వీళ్ల నుంచి మటుమాయం అయ్యాయి.
7:54  إِنَّ رَبَّكُمُ اللَّهُ الَّذِي خَلَقَ السَّمَاوَاتِ وَالْأَرْضَ فِي سِتَّةِ أَيَّامٍ ثُمَّ اسْتَوَىٰ عَلَى الْعَرْشِ يُغْشِي اللَّيْلَ النَّهَارَ يَطْلُبُهُ حَثِيثًا وَالشَّمْسَ وَالْقَمَرَ وَالنُّجُومَ مُسَخَّرَاتٍ بِأَمْرِهِ ۗ أَلَا لَهُ الْخَلْقُ وَالْأَمْرُ ۗ تَبَارَكَ اللَّهُ رَبُّ الْعَالَمِينَ
నిస్సందేహంగా అల్లాహ్‌యే మీ ప్రభువు. ఆయన ఆకాశాలను, భూమిని ఆరు రోజులలో సృష్టించాడు. ఆ తరువాత సింహాసనంపై (అర్ష్‌పై) ఆసీనుడయ్యాడు. ఆయన రాత్రిని పగటిపై కప్పివేస్తాడు. అది దాన్ని వేగంగా వెంబడిస్తూ వస్తుంది. ఇంకా ఆయన సూర్యచంద్రులను, నక్షత్రాలను తన ఆజ్ఞకు కట్టుబడి ఉండే విధంగా సృష్టించాడు. వినండి! సృష్టి ప్రక్రియ ఆయన స్వంతం. ఆజ్ఞాపన ఆయన సొత్తు. సకల లోకాల ప్రభువైన అల్లాహ్‌ అపారమైన శుభాలు కలవాడు.
7:55  ادْعُوا رَبَّكُمْ تَضَرُّعًا وَخُفْيَةً ۚ إِنَّهُ لَا يُحِبُّ الْمُعْتَدِينَ
మీరు మీ ప్రభువును కడు దీనంగా వేడుకోండి. గోప్యంగా కూడా విన్నవించుకోండి. హద్దు మీరిపోయే వారిని ఆయన సుతరామూ ఇష్టపడడు.
7:56  وَلَا تُفْسِدُوا فِي الْأَرْضِ بَعْدَ إِصْلَاحِهَا وَادْعُوهُ خَوْفًا وَطَمَعًا ۚ إِنَّ رَحْمَتَ اللَّهِ قَرِيبٌ مِّنَ الْمُحْسِنِينَ
సంస్కరణ జరిగిన తరువాత భూమిపై కల్లోలాన్ని సృష్టించకండి. భయపడుతూ, ఆశపడుతూ అల్లాహ్‌ను ఆరాధించండి. నిస్సందేహంగా అల్లాహ్‌ కారుణ్యం సజ్జనులకు చాలా దగ్గరే ఉంది.
7:57  وَهُوَ الَّذِي يُرْسِلُ الرِّيَاحَ بُشْرًا بَيْنَ يَدَيْ رَحْمَتِهِ ۖ حَتَّىٰ إِذَا أَقَلَّتْ سَحَابًا ثِقَالًا سُقْنَاهُ لِبَلَدٍ مَّيِّتٍ فَأَنزَلْنَا بِهِ الْمَاءَ فَأَخْرَجْنَا بِهِ مِن كُلِّ الثَّمَرَاتِ ۚ كَذَٰلِكَ نُخْرِجُ الْمَوْتَىٰ لَعَلَّكُمْ تَذَكَّرُونَ
తన కారుణ్య జల్లు కురిసేముందు గాలులను శుభవార్త సూచకంగా పంపేది ఆయనే. ఆఖరికి అవి బరువైన మేఘాలను ఎత్తుకున్నప్పుడు, మేము ఆ మేఘాలను నిర్జీవంగా పడివున్న ఏదేని ప్రదేశం వైపుకు తరలిస్తాము. ఆపైన ఆ మేఘాల ద్వారా వర్షాన్ని కురిపిస్తాము. ఆ వర్షపు నీటి ద్వారా అన్నిరకాల పండ్లు ఫలాలను ఉత్పన్నం చేస్తాము. మృతులను కూడా మేము ఇలాగే లేపి నిలబెడతాము. మీరు (నీతిని) గ్రహించేటందుకు గాను(మేము ఇన్ని విధాలుగా విషయాన్ని విడమరచి చెబుతున్నాము సుమా!).
7:58  وَالْبَلَدُ الطَّيِّبُ يَخْرُجُ نَبَاتُهُ بِإِذْنِ رَبِّهِ ۖ وَالَّذِي خَبُثَ لَا يَخْرُجُ إِلَّا نَكِدًا ۚ كَذَٰلِكَ نُصَرِّفُ الْآيَاتِ لِقَوْمٍ يَشْكُرُونَ
మంచి నేల తన ప్రభువు ఆదేశానుసారం పుష్కలమైన పంటనిస్తుంది. (దీనికి భిన్నంగా) చెడ్డ నేల చాలా తక్కువ ఉత్పత్తిని మాత్రమే ఇస్తుంది. ఈ విధంగా మేము కృతజ్ఞులై ఉండేవారి కోసం నిదర్శనాలను పలు విధాలుగా విశ్లేషించి చెబుతాము.
7:59  لَقَدْ أَرْسَلْنَا نُوحًا إِلَىٰ قَوْمِهِ فَقَالَ يَا قَوْمِ اعْبُدُوا اللَّهَ مَا لَكُم مِّنْ إِلَٰهٍ غَيْرُهُ إِنِّي أَخَافُ عَلَيْكُمْ عَذَابَ يَوْمٍ عَظِيمٍ
మేము నూహ్‌ (అలైహిస్సలాం)ను అతని జాతి వద్దకు పంపాము. అప్పుడతను, “ఓ నా జాతి ప్రజలారా! మీరు అల్లాహ్‌ను ఆరాధించండి. ఆయన తప్ప వేరెవరూ మీ ఆరాధనకు అర్హులు కారు. మీ విషయంలో ఒక మహాదినం నాటి శిక్ష గురించి నాకు భయంగా ఉంది” అన్నాడు.
7:60  قَالَ الْمَلَأُ مِن قَوْمِهِ إِنَّا لَنَرَاكَ فِي ضَلَالٍ مُّبِينٍ
దానికి అతని జాతి పెద్దలు, “నువ్వు స్పష్టమైన అపమార్గానికి గురైనట్లు మాకు కనిపిస్తోంది” అన్నారు.
7:61  قَالَ يَا قَوْمِ لَيْسَ بِي ضَلَالَةٌ وَلَٰكِنِّي رَسُولٌ مِّن رَّبِّ الْعَالَمِينَ
“ఓ నా జాతి వారలారా! నేనేమాత్రం దారి తప్పలేదు. నిజానికి నేను సర్వలోక ప్రభువు తరఫున పంపబడిన ప్రవక్తను.
7:62  أُبَلِّغُكُمْ رِسَالَاتِ رَبِّي وَأَنصَحُ لَكُمْ وَأَعْلَمُ مِنَ اللَّهِ مَا لَا تَعْلَمُونَ
“నా ప్రభువు సందేశాన్ని మీకు అందజేస్తున్నాను. నేను మీ మేలుకోరేవాడిని. మీకు తెలియని విషయాలు అల్లాహ్‌ తరఫు నుంచి నాకు తెలుసు.
7:63  أَوَعَجِبْتُمْ أَن جَاءَكُمْ ذِكْرٌ مِّن رَّبِّكُمْ عَلَىٰ رَجُلٍ مِّنكُمْ لِيُنذِرَكُمْ وَلِتَتَّقُوا وَلَعَلَّكُمْ تُرْحَمُونَ
“ఏమిటీ? మిమ్మల్ని హెచ్చరించటానికి, మీరు భయభక్తుల వైఖరిని అవలంబించి తద్వారా మీరు కరుణించబడేటందుకు మీ వద్దకు స్వయంగా మీ నుంచే ఒక వ్యక్తి ద్వారా మీ ప్రభువు తరఫు నుండి 'ఉపదేశం' అందటం మిమ్మల్ని ఆశ్చర్యంలో ముంచెత్తిందా?” అని (నూహ్‌) అన్నాడు.
7:64  فَكَذَّبُوهُ فَأَنجَيْنَاهُ وَالَّذِينَ مَعَهُ فِي الْفُلْكِ وَأَغْرَقْنَا الَّذِينَ كَذَّبُوا بِآيَاتِنَا ۚ إِنَّهُمْ كَانُوا قَوْمًا عَمِينَ
అయినప్పటికీ వాళ్లు ఆయన (మాట)ను అసత్యమని ధిక్కరించారు. మేము నూహును, నావలో అతని వెంట ఉన్న అతని సహచరులను రక్షించి, మా ఆయతులను ధిక్కరించిన వారందరినీ ముంచి వేశాము. నిశ్చయంగా వారు మరీ గ్రుడ్డి జనులుగా వ్యవహరించారు.
7:65  وَإِلَىٰ عَادٍ أَخَاهُمْ هُودًا ۗ قَالَ يَا قَوْمِ اعْبُدُوا اللَّهَ مَا لَكُم مِّنْ إِلَٰهٍ غَيْرُهُ ۚ أَفَلَا تَتَّقُونَ
మేము ఆద్‌జాతి వద్దకు వారి సోదరుడైన హూద్‌ను పంపాము. “నా జాతి ప్రజలారా! మీరు అల్లాహ్‌ను ఆరాధించండి. ఆయన తప్ప మీకు మరో ఆరాధ్య దైవం లేడు. మరలాంటప్పుడు మీరు భయపడరా?” అని అతను చెప్పాడు.
7:66  قَالَ الْمَلَأُ الَّذِينَ كَفَرُوا مِن قَوْمِهِ إِنَّا لَنَرَاكَ فِي سَفَاهَةٍ وَإِنَّا لَنَظُنُّكَ مِنَ الْكَاذِبِينَ
దానికి అతని జాతిలోని అవిశ్వాస సర్దారులు, “నువ్వు మాకు తెలివి తక్కువ వానిలా కనిపిస్తున్నావు. పైగా నువ్వు అబద్ధాల కోరువని మా అభిప్రాయం” అన్నారు.
7:67  قَالَ يَا قَوْمِ لَيْسَ بِي سَفَاهَةٌ وَلَٰكِنِّي رَسُولٌ مِّن رَّبِّ الْعَالَمِينَ
“ఓ నా జాతివారలారా! నాలో ఏ మాత్రం తెలివితక్కువ తనం లేదు. నేను సకల లోకాల ప్రభువు తరఫున పంపబడిన ప్రవక్తను.
7:68  أُبَلِّغُكُمْ رِسَالَاتِ رَبِّي وَأَنَا لَكُمْ نَاصِحٌ أَمِينٌ
“నా ప్రభువు సందేశాలను మీకు చేరవేసేవాణ్ణి. మీరు నమ్మదగ్గ మీ శ్రేయోభిలాషిని.
7:69  أَوَعَجِبْتُمْ أَن جَاءَكُمْ ذِكْرٌ مِّن رَّبِّكُمْ عَلَىٰ رَجُلٍ مِّنكُمْ لِيُنذِرَكُمْ ۚ وَاذْكُرُوا إِذْ جَعَلَكُمْ خُلَفَاءَ مِن بَعْدِ قَوْمِ نُوحٍ وَزَادَكُمْ فِي الْخَلْقِ بَسْطَةً ۖ فَاذْكُرُوا آلَاءَ اللَّهِ لَعَلَّكُمْ تُفْلِحُونَ
“ఏమిటీ, మిమ్మల్ని హెచ్చరించటానికి స్వయంగా మీనుండే ఒక వ్యక్తి ద్వారా, మీ ప్రభువు తరఫునుండి మీ వద్దకు హితోపదేశం రావటం మీకు ఆశ్చర్యం కలిగించిందా? అల్లాహ్‌ మిమ్మల్ని నూహ్‌ జాతి అనంతరం వారసులుగా చేసి, మీకు ఎక్కువ శరీర సౌష్ఠవాన్ని ప్రసాదించిన సంగతిని గుర్తుంచుకోండి. అల్లాహ్‌ అనుగ్రహాలను జ్ఞాపకం చేసుకుంటూ ఉండండి. తద్వారా మీరు సాఫల్యం పొందుతారు” అని హూద్‌ బోధపరచాడు.
7:70  قَالُوا أَجِئْتَنَا لِنَعْبُدَ اللَّهَ وَحْدَهُ وَنَذَرَ مَا كَانَ يَعْبُدُ آبَاؤُنَا ۖ فَأْتِنَا بِمَا تَعِدُنَا إِن كُنتَ مِنَ الصَّادِقِينَ
“మేము అల్లాహ్‌ను మాత్రమే ఆరాధించాలనీ, మా తాత ముత్తాతలు పూజిస్తూ వచ్చిన వాటిని వదలివేయమని (చెప్పటానికేనా) నువ్వు మా వద్దకు వచ్చింది? ఒకవేళ నువ్వు సత్యవంతుడవే అయితే ఏ శిక్షను గురించి నువ్వు మమ్మల్ని బెదిరిస్తున్నావో దాన్ని మా వద్దకు రప్పించు చూద్దాం” అని వారు అన్నారు.
7:71  قَالَ قَدْ وَقَعَ عَلَيْكُم مِّن رَّبِّكُمْ رِجْسٌ وَغَضَبٌ ۖ أَتُجَادِلُونَنِي فِي أَسْمَاءٍ سَمَّيْتُمُوهَا أَنتُمْ وَآبَاؤُكُم مَّا نَزَّلَ اللَّهُ بِهَا مِن سُلْطَانٍ ۚ فَانتَظِرُوا إِنِّي مَعَكُم مِّنَ الْمُنتَظِرِينَ
అప్పుడు హూద్‌ ఇలా అన్నాడు : “ఇక మీ ప్రభువు శిక్ష, ఆయన ఆగ్రహం మీపై విరుచుకుపడినట్లే. ఏమిటీ, మీరూ మీ తాతముత్తాతలూ కల్పించుకున్న పేర్ల విషయంలో నాతో గొడవపడుతున్నారా? వాటి గురించి (అవి ఆరాధ్య దైవాలని నిర్థారించే) ఏ ప్రమాణాన్నీ అల్లాహ్‌ అవతరింపజెయ్యలేదు. కాబట్టి మీరూ నిరీక్షించండి, మీతోపాటు నేను కూడా నిరీక్షిస్తాను.”
7:72  فَأَنجَيْنَاهُ وَالَّذِينَ مَعَهُ بِرَحْمَةٍ مِّنَّا وَقَطَعْنَا دَابِرَ الَّذِينَ كَذَّبُوا بِآيَاتِنَا ۖ وَمَا كَانُوا مُؤْمِنِينَ
ఎట్టకేలకు మేము అతన్నీ, అతని సహచరులను మా కృపతో కాపాడాము. అయితే మా ఆయతులు అబద్ధాలంటూ కొట్టి పారేసినవారి వేరును త్రెంచివేశాము. వారు ఎట్టి పరిస్థితిలోనూ విశ్వసించేవారు కారు.
7:73  وَإِلَىٰ ثَمُودَ أَخَاهُمْ صَالِحًا ۗ قَالَ يَا قَوْمِ اعْبُدُوا اللَّهَ مَا لَكُم مِّنْ إِلَٰهٍ غَيْرُهُ ۖ قَدْ جَاءَتْكُم بَيِّنَةٌ مِّن رَّبِّكُمْ ۖ هَٰذِهِ نَاقَةُ اللَّهِ لَكُمْ آيَةً ۖ فَذَرُوهَا تَأْكُلْ فِي أَرْضِ اللَّهِ ۖ وَلَا تَمَسُّوهَا بِسُوءٍ فَيَأْخُذَكُمْ عَذَابٌ أَلِيمٌ
ఇంకా మేము సమూదు జాతి వద్దకు వారి సోదరుడైన సాలిహ్‌ (అలైహిస్సలాం) ను పంపాము. అతడు (తన వారినుద్దేశించి), “ఓ నా జాతి ప్రజలారా! మీరు అల్లాహ్‌ను ఆరాధించండి. ఆయన తప్ప మరొకరెవరూ మీకు ఆరాధ్యులు కారు. మీ వద్దకు మీ ప్రభువు వద్ద నుంచి ఒక స్పష్టమైన నిదర్శనం వచ్చేసింది. ఇది అల్లాహ్‌ యొక్క ఆడ ఒంటె. ఇది మీ కోసం ఒక సూచనగా ఉంది. కాబట్టి దేవుని భూమిపై మేతమేస్తూ తిరగటానికి దాన్ని వదలిపెట్టండి. దురుద్దేశంతో దాన్ని తాకకండి. (ఒకవేళ మీరు గనక ఈ మాటను ఖాతరు చేయకపోతే) బాధాకరమైన శిక్ష ఒకటి మిమ్మల్ని పట్టుకుంటుంది.
7:74  وَاذْكُرُوا إِذْ جَعَلَكُمْ خُلَفَاءَ مِن بَعْدِ عَادٍ وَبَوَّأَكُمْ فِي الْأَرْضِ تَتَّخِذُونَ مِن سُهُولِهَا قُصُورًا وَتَنْحِتُونَ الْجِبَالَ بُيُوتًا ۖ فَاذْكُرُوا آلَاءَ اللَّهِ وَلَا تَعْثَوْا فِي الْأَرْضِ مُفْسِدِينَ
“మీరు (మీ గతాన్ని గురించి) కాస్త గుర్తుకు తెచ్చుకోండి- ఆదు జాతి అనంతరం అల్లాహ్‌ మిమ్మల్ని వారసులుగా చేశాడు. మీకు భూమిపై నివాసాన్ని ప్రసాదించగా, దాని మైదానంపై మీరు భవనాలు నిర్మిస్తున్నారు. కొండలను తొలచి వాటిలో గృహాలు నిర్మించుకుంటున్నారు. కనుక మీరు అల్లాహ్‌ అనుగ్రహాలను జ్ఞాపకం చేసుకోండి. భువిపై సంక్షోభాన్ని సృష్టించకండి.”
7:75  قَالَ الْمَلَأُ الَّذِينَ اسْتَكْبَرُوا مِن قَوْمِهِ لِلَّذِينَ اسْتُضْعِفُوا لِمَنْ آمَنَ مِنْهُمْ أَتَعْلَمُونَ أَنَّ صَالِحًا مُّرْسَلٌ مِّن رَّبِّهِ ۚ قَالُوا إِنَّا بِمَا أُرْسِلَ بِهِ مُؤْمِنُونَ
జాతిలోని గర్విష్టులైన సర్దారులు విశ్వసించిన బలహీన వర్గాల వారిని, “సాలిహ్‌ తన ప్రభువు తరఫున పంపబడిన ప్రవక్తేనన్న విషయం నిజంగానే మీకు తెలుసా?” అని అడిగారు. దానికి వారు, “నిస్సందేహంగా! ఆయనకు ఇచ్చి పంపబడిన దానిపై మాకు పూర్తి నమ్మకం ఉంది” అని సమాధానమిచ్చారు.
7:76  قَالَ الَّذِينَ اسْتَكْبَرُوا إِنَّا بِالَّذِي آمَنتُم بِهِ كَافِرُونَ
“అయితే మీరు నమ్మే విషయాన్ని మేము త్రోసిపుచ్చుతున్నాం” అని ఆ అహంకారులు అన్నారు.
7:77  فَعَقَرُوا النَّاقَةَ وَعَتَوْا عَنْ أَمْرِ رَبِّهِمْ وَقَالُوا يَا صَالِحُ ائْتِنَا بِمَا تَعِدُنَا إِن كُنتَ مِنَ الْمُرْسَلِينَ
తరువాత, వారు ఆడ ఒంటెను చంపేశారు. తమ ప్రభువు ఆజ్ఞ పట్ల తలబిరుసుతనం ప్రదర్శించారు. “ఓ సాలిహ్‌! నిజంగానే నువ్వు దైవప్రవక్తవైతే, మమ్మల్ని బెదిరిస్తూ వచ్చిన దానిని మాపైకి తీసుకురా!” అని అన్నారు.
7:78  فَأَخَذَتْهُمُ الرَّجْفَةُ فَأَصْبَحُوا فِي دَارِهِمْ جَاثِمِينَ
అంతే, భూకంపం వారిని పట్టుకుంది. వాళ్లు తమ ఇండ్లలో బోర్లాపడి, అలాగే ఉండిపోయారు.
7:79  فَتَوَلَّىٰ عَنْهُمْ وَقَالَ يَا قَوْمِ لَقَدْ أَبْلَغْتُكُمْ رِسَالَةَ رَبِّي وَنَصَحْتُ لَكُمْ وَلَٰكِن لَّا تُحِبُّونَ النَّاصِحِينَ
అప్పుడు సాలిహ్‌ (అలైహిస్సలాం) వారి నుండి ముఖం త్రిప్పుకుని, “నా జాతి ప్రజలారా! నా ప్రభువు సందేశాన్ని నేను మీకు అందజేశాను. మీ శ్రేయాన్ని అభిలషించాను. కాని మీకు శ్రేయోభిలాషులంటే ఇష్టం లేకపోయింది” అని చెబుతూ వెళ్ళి పోయారు.
7:80  وَلُوطًا إِذْ قَالَ لِقَوْمِهِ أَتَأْتُونَ الْفَاحِشَةَ مَا سَبَقَكُم بِهَا مِنْ أَحَدٍ مِّنَ الْعَالَمِينَ
మేము లూతు (అలైహిస్సలామ్‌)ను పంపాము. అతను తన జాతివారిని ఉద్దేశించి, “మీరు ఇంత సిగ్గుమాలిన చేష్టకు పాల్పడుతున్నారేమిటి? మీకు పూర్వం లోకంలో ఎవరూ ఇలాంటి పాడు పని చెయ్యలేదే!
7:81  إِنَّكُمْ لَتَأْتُونَ الرِّجَالَ شَهْوَةً مِّن دُونِ النِّسَاءِ ۚ بَلْ أَنتُمْ قَوْمٌ مُّسْرِفُونَ
“అయ్యో! మీరు స్త్రీలను వదలి, పురుషులతో కామవాంఛ తీర్చుకుంటున్నారా?! అసలు మీరు మరీ బరితెగించి వ్యవహరిస్తున్నారు” అని అన్నారు.
7:82  وَمَا كَانَ جَوَابَ قَوْمِهِ إِلَّا أَن قَالُوا أَخْرِجُوهُم مِّن قَرْيَتِكُمْ ۖ إِنَّهُمْ أُنَاسٌ يَتَطَهَّرُونَ
దానికి అతని జాతి వారు ఇచ్చిన జవాబు ఇదే: “వీళ్లను మీ బస్తీ నుంచి వెళ్లగొట్టండి. మహా పవిత్రులట వీళ్ళు.”
7:83  فَأَنجَيْنَاهُ وَأَهْلَهُ إِلَّا امْرَأَتَهُ كَانَتْ مِنَ الْغَابِرِينَ
అప్పుడు మేము లూత్‌ (అలైహిస్సలాం)ను, అతని ఇంటి వారిని కాపాడాము. అతని భార్యను తప్ప! ఆమె దైవశిక్షకు గురయినవారితో ఉండిపోయింది.
7:84  وَأَمْطَرْنَا عَلَيْهِم مَّطَرًا ۖ فَانظُرْ كَيْفَ كَانَ عَاقِبَةُ الْمُجْرِمِينَ
మేము వారిపై ఒక ప్రత్యేకమైన వర్షాన్ని కురిపించాము. చూడు! ఆ అపరాధులకు పట్టిన గతేమిటో!
7:85  وَإِلَىٰ مَدْيَنَ أَخَاهُمْ شُعَيْبًا ۗ قَالَ يَا قَوْمِ اعْبُدُوا اللَّهَ مَا لَكُم مِّنْ إِلَٰهٍ غَيْرُهُ ۖ قَدْ جَاءَتْكُم بَيِّنَةٌ مِّن رَّبِّكُمْ ۖ فَأَوْفُوا الْكَيْلَ وَالْمِيزَانَ وَلَا تَبْخَسُوا النَّاسَ أَشْيَاءَهُمْ وَلَا تُفْسِدُوا فِي الْأَرْضِ بَعْدَ إِصْلَاحِهَا ۚ ذَٰلِكُمْ خَيْرٌ لَّكُمْ إِن كُنتُم مُّؤْمِنِينَ
ఇంకా మేము మద్‌యన్‌ (వైపుకు) వారి సోదరుడైన షుఐబ్‌ (అలైహిస్సలాం)ను పంపాము. అతను (తన జాతివారినుద్దేశించి), “నా జాతి వారలారా! మీరు అల్లాహ్‌ను మాత్రమే ఆరాధించండి. ఆయన తప్ప మీరు ఆరాధించదగిన వేరొక దైవం లేడు. మీ వద్దకు మీ ప్రభువు తరఫు నుంచి స్పష్టమయిన నిదర్శనం వచ్చేసింది. కాబట్టి మీరు కొలతలు, తూనికలలో ఖచ్చితంగా (పూర్తిగా) వ్యవహరించండి. ప్రజలకు వారి వస్తువులను తగ్గించి ఇవ్వకండి. సంస్కరణ జరిగిన తరువాత భూమిలో అల్లకల్లోలాన్ని సృష్టించకండి. మీరు గనక నమ్మేవారే అయితే మీ మేలు ఇందులోనే ఉంది.
7:86  وَلَا تَقْعُدُوا بِكُلِّ صِرَاطٍ تُوعِدُونَ وَتَصُدُّونَ عَن سَبِيلِ اللَّهِ مَنْ آمَنَ بِهِ وَتَبْغُونَهَا عِوَجًا ۚ وَاذْكُرُوا إِذْ كُنتُمْ قَلِيلًا فَكَثَّرَكُمْ ۖ وَانظُرُوا كَيْفَ كَانَ عَاقِبَةُ الْمُفْسِدِينَ
“అల్లాహ్‌ను విశ్వసించేవారిని బెదిరించే ఉద్దేశంతో, అల్లాహ్‌ మార్గం నుంచి అడ్డుకునే ఆలోచనతో, అందులో వక్రతలను వెతుకుతూ రహదారుల్లో కూర్చోకండి. మీరు అల్ప సంఖ్యలో ఉండగా అల్లాహ్‌ మీ జనసంఖ్యను అధికం చేసిన సంగతిని కాస్త గుర్తుచేసుకోండి. కల్లోలాన్ని రేకెత్తించే వారి కథ ఎలా ముగిసిందో కూడా చూడండి!
7:87  وَإِن كَانَ طَائِفَةٌ مِّنكُمْ آمَنُوا بِالَّذِي أُرْسِلْتُ بِهِ وَطَائِفَةٌ لَّمْ يُؤْمِنُوا فَاصْبِرُوا حَتَّىٰ يَحْكُمَ اللَّهُ بَيْنَنَا ۚ وَهُوَ خَيْرُ الْحَاكِمِينَ
“అల్లాహ్‌ నాకిచ్చి పంపిన సందేశాన్ని మీలో కొందరు విశ్వసించగా, మరికొందరు విశ్వసించలేదు. కాబట్టి అల్లాహ్‌ మన మధ్య తీర్పుచేసే వరకూ ఓపిక పట్టండి. ఆయన అందరిలోకెల్లా అత్యుత్తమంగా తీర్పు చెప్పేవాడు.”
7:88  قَالَ الْمَلَأُ الَّذِينَ اسْتَكْبَرُوا مِن قَوْمِهِ لَنُخْرِجَنَّكَ يَا شُعَيْبُ وَالَّذِينَ آمَنُوا مَعَكَ مِن قَرْيَتِنَا أَوْ لَتَعُودُنَّ فِي مِلَّتِنَا ۚ قَالَ أَوَلَوْ كُنَّا كَارِهِينَ
దురహంకారులైన అతని జాతి సర్దారులు (అతన్నుద్దేశించి), “ఓ షుఐబ్‌! మీరంతా మా మతంలోకి తిరిగి వచ్చేస్తే సరి! లేకపోతే నిన్నూ, నీతోపాటు విశ్వసించినవారిని మా పురము నుంచి వెళ్ళగొడతాం” అని హెచ్చరించారు. దీనికి సమాధానంగా షుఐబ్‌ ఇలా అన్నారు: “ఏమిటీ, ఆ మతం మాకే మాత్రం ఇష్టం లేకపోయినా మేమందులో కలసి పోవలసిందేనా?!”
7:89  قَدِ افْتَرَيْنَا عَلَى اللَّهِ كَذِبًا إِنْ عُدْنَا فِي مِلَّتِكُم بَعْدَ إِذْ نَجَّانَا اللَّهُ مِنْهَا ۚ وَمَا يَكُونُ لَنَا أَن نَّعُودَ فِيهَا إِلَّا أَن يَشَاءَ اللَّهُ رَبُّنَا ۚ وَسِعَ رَبُّنَا كُلَّ شَيْءٍ عِلْمًا ۚ عَلَى اللَّهِ تَوَكَّلْنَا ۚ رَبَّنَا افْتَحْ بَيْنَنَا وَبَيْنَ قَوْمِنَا بِالْحَقِّ وَأَنتَ خَيْرُ الْفَاتِحِينَ
“అల్లాహ్‌ మమ్మల్ని మీ ధర్మం నుంచి విముక్తి కలిగించిన తరువాత మళ్లీ మేము గనక అందులోకే వచ్చి కలసిపోతే, మేము అల్లాహ్‌కు పెద్ద అబద్ధాన్ని అంటగట్టిన వాళ్ళం అవుతాము. మీ మతంలోకి మేము తిరిగి రావటమనేది జరగదు - మా ప్రభువైన అల్లాహ్‌ రాసిపెట్టినదయితే అది వేరే విషయం. మా ప్రభువు జ్ఞానం అన్నింటినీ ఆవరించి ఉంది. మేము అల్లాహ్‌నే నమ్ముకున్నాము. ఓ ప్రభూ! మాకూ - మా జాతివారికీ మధ్య న్యాయంగా తీర్పు చెయ్యి. నీవు అందరికన్నా ఉత్తమంగా తీర్పు చేసేవాడవు.”
7:90  وَقَالَ الْمَلَأُ الَّذِينَ كَفَرُوا مِن قَوْمِهِ لَئِنِ اتَّبَعْتُمْ شُعَيْبًا إِنَّكُمْ إِذًا لَّخَاسِرُونَ
అతని జాతిలోని అవిశ్వాస నాయకులు, “మీరు గనక షుఐబ్‌ మార్గంలో పోయారంటే తీవ్రంగా నష్టపోతారు!” అని హెచ్చరించారు.
7:91  فَأَخَذَتْهُمُ الرَّجْفَةُ فَأَصْبَحُوا فِي دَارِهِمْ جَاثِمِينَ
అంతే, భూకంపం వాళ్ళను కబళించింది. దాంతో వారు తమ ఇళ్లల్లో బోర్లాపడినట్లే ఉండిపోయారు.
7:92  الَّذِينَ كَذَّبُوا شُعَيْبًا كَأَن لَّمْ يَغْنَوْا فِيهَا ۚ الَّذِينَ كَذَّبُوا شُعَيْبًا كَانُوا هُمُ الْخَاسِرِينَ
షుఐబును ధిక్కరించినవారి పరిస్థితి ఆ ఇండ్లలో వారెప్పుడూ నివసించనే లేదన్నట్టుగా మారిపోయింది. షుఐబును ధిక్కరించినవారే నష్టపోయారు.
7:93  فَتَوَلَّىٰ عَنْهُمْ وَقَالَ يَا قَوْمِ لَقَدْ أَبْلَغْتُكُمْ رِسَالَاتِ رَبِّي وَنَصَحْتُ لَكُمْ ۖ فَكَيْفَ آسَىٰ عَلَىٰ قَوْمٍ كَافِرِينَ
అప్పుడు షుఐబ్‌ వాళ్లనుండి ముఖం తిప్పుకొని మరలిపోతూ, ”ఓ నా జాతి జనులారా! నా ప్రభువు ఆదేశాలను నేను మీకు అందజేశాను. నిత్యం మీ బాగోగులను కోరుకున్నాను. అలాం టప్పుడు ఈ తిరస్కారుల (దుర్గతి)పై నేనెందుకు బాధపడాలి?” అని అన్నారు.
7:94  وَمَا أَرْسَلْنَا فِي قَرْيَةٍ مِّن نَّبِيٍّ إِلَّا أَخَذْنَا أَهْلَهَا بِالْبَأْسَاءِ وَالضَّرَّاءِ لَعَلَّهُمْ يَضَّرَّعُونَ
మేము ఏ ప్రవక్తను ఏ బస్తీలో పంపినా అక్కడి జనులు అణకువతో మెలగాలన్న ఉద్దేశంతో వారిని అభాగ్యానికి, అనారోగ్య స్థితికీ లోను చేశాము.
7:95  ثُمَّ بَدَّلْنَا مَكَانَ السَّيِّئَةِ الْحَسَنَةَ حَتَّىٰ عَفَوا وَّقَالُوا قَدْ مَسَّ آبَاءَنَا الضَّرَّاءُ وَالسَّرَّاءُ فَأَخَذْنَاهُم بَغْتَةً وَهُمْ لَا يَشْعُرُونَ
ఆ తరువాత వారి దురవస్థను మంచి స్థితిగా మార్చాము. వారు బాగా అభివృద్ధి చెందినప్పుడు, “(ఇదేమీ కొత్త విషయం కాదు) మా తాతముత్తాతలకు కూడా కష్టసుఖాలు ఎదురయ్యాయి” అని అన్నారు. అప్పుడు మేము వారిని అకస్మాత్తుగా పట్టుకున్నాము. (తమకు ఆ పరిస్థితి ఎదురవుతుందని) వాళ్లకు ఏమాత్రం తెలియదు.
7:96  وَلَوْ أَنَّ أَهْلَ الْقُرَىٰ آمَنُوا وَاتَّقَوْا لَفَتَحْنَا عَلَيْهِم بَرَكَاتٍ مِّنَ السَّمَاءِ وَالْأَرْضِ وَلَٰكِن كَذَّبُوا فَأَخَذْنَاهُم بِمَا كَانُوا يَكْسِبُونَ
ఈ బస్తీలో నివసించే వాళ్ళేగనక విశ్వసించి, భయభక్తులతో మెలగి ఉన్నట్లయితే మేము వాళ్ల కోసం భూమ్యాకాశాల శుభాల(ద్వారాల)ను తెరచేవాళ్ళం. కాని వాళ్ళు ధిక్కారానికి పాల్పడ్డారు. అందువల్ల వారి (చెడు) సంపాదనకు కారణంగా మేము వాళ్ళను పట్టుకున్నాము.
7:97  أَفَأَمِنَ أَهْلُ الْقُرَىٰ أَن يَأْتِيَهُم بَأْسُنَا بَيَاتًا وَهُمْ نَائِمُونَ
అయినప్పటికీ ఈ బస్తీల వాళ్లు రాత్రివేళ నిద్రపోతున్నప్పుడు తమపై మా శిక్ష వచ్చిపడదని నిశ్చింతగా ఉన్నారా?
7:98  أَوَأَمِنَ أَهْلُ الْقُرَىٰ أَن يَأْتِيَهُم بَأْسُنَا ضُحًى وَهُمْ يَلْعَبُونَ
ఏమిటీ, పొద్దెక్కుతుండగా తాము ఆటపాటల్లో నిమగ్నులై ఉన్నప్పుడు (హటాత్తుగా) మా ఆపద విరుచుకుపడుతుందన్న భయం ఈ బస్తీల వాళ్లకు బొత్తిగా లేదా?
7:99  أَفَأَمِنُوا مَكْرَ اللَّهِ ۚ فَلَا يَأْمَنُ مَكْرَ اللَّهِ إِلَّا الْقَوْمُ الْخَاسِرُونَ
ఏమిటీ, వాళ్ళు దేవుని ఈ వ్యూహం గురించి నిశ్చింతగా ఉన్నారా? నష్టపోయే వారు తప్ప మరొకరెవరూ దేవుని వ్యూహం గురించి నిర్లక్ష్యంగా ఉండరు.
7:100  أَوَلَمْ يَهْدِ لِلَّذِينَ يَرِثُونَ الْأَرْضَ مِن بَعْدِ أَهْلِهَا أَن لَّوْ نَشَاءُ أَصَبْنَاهُم بِذُنُوبِهِمْ ۚ وَنَطْبَعُ عَلَىٰ قُلُوبِهِمْ فَهُمْ لَا يَسْمَعُونَ
ఏమిటీ, అక్కడి ప్రజల వినాశం తరువాత భూమికి వారసులు అయిన వాళ్లకి (ఆ సంఘటనలు) కనువిప్పు కలిగించలేదా? మేము గనక తలచుకుంటే వారిని వారి పాపాల మూలంగా నాశనం చేయగలమనీ? వారి హృదయాలపై (తిరస్కార) ముద్ర వేసేస్తే ఇక వారు ఏమీ వినలేరనీ?
7:101  تِلْكَ الْقُرَىٰ نَقُصُّ عَلَيْكَ مِنْ أَنبَائِهَا ۚ وَلَقَدْ جَاءَتْهُمْ رُسُلُهُم بِالْبَيِّنَاتِ فَمَا كَانُوا لِيُؤْمِنُوا بِمَا كَذَّبُوا مِن قَبْلُ ۚ كَذَٰلِكَ يَطْبَعُ اللَّهُ عَلَىٰ قُلُوبِ الْكَافِرِينَ
ఈ బస్తీల గాథలను స్థూలంగా మేము నీకు వివరిస్తున్నాము. వాళ్ళందరి వద్దకూ వారి ప్రవక్తలు స్పష్టమయిన మహిమలను తీసుకువచ్చారు. అయితే మొదట్లో ఒకసారి వారు త్రోసి పుచ్చిన దానిని తరువాత విశ్వసించేవారు కాదు. ఈ విధంగా అల్లాహ్‌ తిరస్కారుల హృదయాలపై ముద్ర వేసేస్తాడు.
7:102  وَمَا وَجَدْنَا لِأَكْثَرِهِم مِّنْ عَهْدٍ ۖ وَإِن وَجَدْنَا أَكْثَرَهُمْ لَفَاسِقِينَ
వారిలో చాలామందిని మేము మాట నిలుపుకునేవారుగా చూడలేదు. వారిలో చాలామందిని మేము అవిధేయులుగానే పొందాము.
7:103  ثُمَّ بَعَثْنَا مِن بَعْدِهِم مُّوسَىٰ بِآيَاتِنَا إِلَىٰ فِرْعَوْنَ وَمَلَئِهِ فَظَلَمُوا بِهَا ۖ فَانظُرْ كَيْفَ كَانَ عَاقِبَةُ الْمُفْسِدِينَ
వారి తర్వాత మేము మూసా (అలైహిస్సలాం)కు మా సూచనలిచ్చి ఫిరౌను వద్దకు, అతని అధికారుల వద్దకు పంపాము. కాని వారు మా సూచనల పట్ల చాలా ఘోరంగా ప్రవర్తించారు. అయితే చూడు! ఆ కల్లోల జనకులకు ఏ గతి పట్టిందో!
7:104  وَقَالَ مُوسَىٰ يَا فِرْعَوْنُ إِنِّي رَسُولٌ مِّن رَّبِّ الْعَالَمِينَ
మూసా (అలైహిస్సలాం) ఇలా అన్నాడు : “ఓ ఫిరౌన్‌! నేను సర్వలోక ప్రభువు తరఫున పంపబడిన ప్రవక్తను.
7:105  حَقِيقٌ عَلَىٰ أَن لَّا أَقُولَ عَلَى اللَّهِ إِلَّا الْحَقَّ ۚ قَدْ جِئْتُكُم بِبَيِّنَةٍ مِّن رَّبِّكُمْ فَأَرْسِلْ مَعِيَ بَنِي إِسْرَائِيلَ
అల్లాహ్‌ పేరుతో సత్యాన్ని తప్ప మరేమాట అయినా చెప్పటం నాకేమాత్రం శోభించదు, నేను మీ దగ్గరకు మీ ప్రభువు వద్దనుంచి స్పష్టమైన సూచనను కూడా తీసుకువచ్చాను. కాబట్టి ఇస్రాయీలు వంశీయులను నాతో పంపు.”
7:106  قَالَ إِن كُنتَ جِئْتَ بِآيَةٍ فَأْتِ بِهَا إِن كُنتَ مِنَ الصَّادِقِينَ
దానికి ఫిరౌను, “ఒకవేళ నువ్వు ఏదన్నా మహిమను తెచ్చివుంటే, నీ వాదనలో నువ్వు సత్యవంతుడవే అయితే, దాన్ని ప్రదర్శించు” అన్నాడు.
7:107  فَأَلْقَىٰ عَصَاهُ فَإِذَا هِيَ ثُعْبَانٌ مُّبِينٌ
అతను (మూసా) తన చేతి కర్రను పడవేశాడు. తక్షణం అది స్పష్టమైన సర్పంగా మారిపోయింది.
7:108  وَنَزَعَ يَدَهُ فَإِذَا هِيَ بَيْضَاءُ لِلنَّاظِرِينَ
తర్వాత అతను తన చేతిని బయటికి తీయగానే, ప్రేక్షకులందరికీ అది ధగధగా మెరిసిపోతున్నట్టు కనిపించింది.
7:109  قَالَ الْمَلَأُ مِن قَوْمِ فِرْعَوْنَ إِنَّ هَٰذَا لَسَاحِرٌ عَلِيمٌ
(ఈ పరిస్థితిని గమనించిన) ఫిరౌను జాతి సర్దారులు, “నిజంగానే ఇతగాడు మహా నైపుణ్యంగల మాంత్రికుడే” అన్నారు.
7:110  يُرِيدُ أَن يُخْرِجَكُم مِّنْ أَرْضِكُمْ ۖ فَمَاذَا تَأْمُرُونَ
“మిమ్మల్ని మీ భూమి (దేశం) నుంచి వెళ్ళగొట్టాలని ఇతను కోరుతున్నాడు. ఇప్పుడేం చేయాలనుకుంటున్నారో మీరే చెప్పండి” (అని సంప్రతింపులు చేసుకున్నారు.)
7:111  قَالُوا أَرْجِهْ وَأَخَاهُ وَأَرْسِلْ فِي الْمَدَائِنِ حَاشِرِينَ
వారిలా అన్నారు : “(ఓ ఫిరౌన్‌!) తమరు ఇతనికీ ఇతని సోదరునికీ కొంత గడువు ఇవ్వండి. ఈలోగా సమీకరించే భటులను వివిధ పట్టణాలలోకి పంపించండి.
7:112  يَأْتُوكَ بِكُلِّ سَاحِرٍ عَلِيمٍ
వారు నిపుణులైన మాంత్రికులందరిని తీసుకువస్తారు.”
7:113  وَجَاءَ السَّحَرَةُ فِرْعَوْنَ قَالُوا إِنَّ لَنَا لَأَجْرًا إِن كُنَّا نَحْنُ الْغَالِبِينَ
ఆ విధంగా మాంత్రికులు ఫిరౌను వద్దకు వచ్చారు, “మేము గనక గెలిస్తే మాకేదైనా పారితోషికం లభిస్తుందా?” అని విన్నవించుకున్నారు.
7:114  قَالَ نَعَمْ وَإِنَّكُمْ لَمِنَ الْمُقَرَّبِينَ
“ఔను, అంతేకాదు, మీరు నా సన్నిహితుల్లో చేరుతారు” అని ఫిరౌను అన్నాడు.
7:115  قَالُوا يَا مُوسَىٰ إِمَّا أَن تُلْقِيَ وَإِمَّا أَن نَّكُونَ نَحْنُ الْمُلْقِينَ
అప్పుడా మాంత్రికులు, “ఓ మూసా! నువ్వు పడవేస్తావా? లేక మమ్మల్నే పడవేయమంటావా?!” అని ప్రశ్నించారు.
7:116  قَالَ أَلْقُوا ۖ فَلَمَّا أَلْقَوْا سَحَرُوا أَعْيُنَ النَّاسِ وَاسْتَرْهَبُوهُمْ وَجَاءُوا بِسِحْرٍ عَظِيمٍ
“మీరే పడవెయ్యండి” అని మూసా బదులిచ్చాడు. అప్పుడు ఆ మాంత్రికులు (తమ త్రాళ్ళను) పడవేసి ప్రజలకు కనికట్టు చేశారు. వారందరినీ భీతావహస్థితికి లోనుచేసి ఓ పెద్ద మాయాజాలాన్ని ప్రదర్శించారు.
7:117  وَأَوْحَيْنَا إِلَىٰ مُوسَىٰ أَنْ أَلْقِ عَصَاكَ ۖ فَإِذَا هِيَ تَلْقَفُ مَا يَأْفِكُونَ
అప్పుడు, “నీ చేతి కర్రను పడవెయ్యి” అని మేము మూసాను ఆదేశించాము. చేతిలోని కర్రను పడవెయ్యగానే అది వారి (కనికట్టు) క్రీడా విన్యాసాలను మింగేయసాగింది.
7:118  فَوَقَعَ الْحَقُّ وَبَطَلَ مَا كَانُوا يَعْمَلُونَ
ఈ విధంగా సత్యం తేటతెల్లమయింది. వారు చేసినదంతా అసత్యంగా మిగిలిపోయింది.
7:119  فَغُلِبُوا هُنَالِكَ وَانقَلَبُوا صَاغِرِينَ
వారు (ఫిరౌను, అతని తొత్తులు) ఓడిపోయి, పరాభవంపాలై వెనుతిరిగారు.
7:120  وَأُلْقِيَ السَّحَرَةُ سَاجِدِينَ
అయితే మాంత్రికులు మాత్రం సాష్టాంగపడిపోయారు.
7:121  قَالُوا آمَنَّا بِرَبِّ الْعَالَمِينَ
“సర్వలోకాలకూ ప్రభువు అయిన వానిని విశ్వసించాము” అని పలికారు.
7:122  رَبِّ مُوسَىٰ وَهَارُونَ
అంటే, మూసా, హారూనుల ప్రభువును (విశ్వసించాము అన్నారు).
7:123  قَالَ فِرْعَوْنُ آمَنتُم بِهِ قَبْلَ أَنْ آذَنَ لَكُمْ ۖ إِنَّ هَٰذَا لَمَكْرٌ مَّكَرْتُمُوهُ فِي الْمَدِينَةِ لِتُخْرِجُوا مِنْهَا أَهْلَهَا ۖ فَسَوْفَ تَعْلَمُونَ
“ఏమిటీ, నా అనుమతి పొందకుండానే మీరితన్ని విశ్వసిస్తారా? ముమ్మాటికీ ఇదంతా ఈ నగరం నుంచి ప్రజలను వెళ్ళగొట్టేందుకు మీరందరూ కలిసి పన్నిన పన్నాగమే. అసలు సంగతి మీకు ఇప్పుడు తెలుస్తుంది.
7:124  لَأُقَطِّعَنَّ أَيْدِيَكُمْ وَأَرْجُلَكُم مِّنْ خِلَافٍ ثُمَّ لَأُصَلِّبَنَّكُمْ أَجْمَعِينَ
“నేను ఒక ప్రక్క నుంచి మీ చేతిని, మరో ప్రక్కనుంచి మీ కాలినీ నరుకుతాను. ఆ తరువాత మిమ్మల్నందరినీ ఉరి తీస్తాను” అని అన్నాడు ఫిరౌన్‌.
7:125  قَالُوا إِنَّا إِلَىٰ رَبِّنَا مُنقَلِبُونَ
దానికి వారిలా అన్నారు : “మేము (చనిపోయి) ఎలాగూ మా ప్రభువు వద్దకు చేరుకోవలసిన వారమే.
7:126  وَمَا تَنقِمُ مِنَّا إِلَّا أَنْ آمَنَّا بِآيَاتِ رَبِّنَا لَمَّا جَاءَتْنَا ۚ رَبَّنَا أَفْرِغْ عَلَيْنَا صَبْرًا وَتَوَفَّنَا مُسْلِمِينَ
“మా ప్రభువు సూచనలు మా వద్దకు వచ్చినప్పుడు, వాటిని విశ్వసించటం తప్ప మాలో నీకు కనిపించిన దోషం ఏమిటీ? ఓ ప్రభూ! మాపై సహనాన్ని కురిపించు. నీకు విధేయులు (ముస్లింలు)గా ఉన్న స్థితిలోనే మరణాన్ని వొసగు!”
7:127  وَقَالَ الْمَلَأُ مِن قَوْمِ فِرْعَوْنَ أَتَذَرُ مُوسَىٰ وَقَوْمَهُ لِيُفْسِدُوا فِي الْأَرْضِ وَيَذَرَكَ وَآلِهَتَكَ ۚ قَالَ سَنُقَتِّلُ أَبْنَاءَهُمْ وَنَسْتَحْيِي نِسَاءَهُمْ وَإِنَّا فَوْقَهُمْ قَاهِرُونَ
ఫిరౌను జాతి సర్దారులు (తమ చక్రవర్తినుద్దేశించి), “ఏమిటీ, నువ్వు మూసా (అలైహిస్సలాం)ను, అతని జాతి వారిని రాజ్యంలో కల్లోలం వ్యాపింపజేయటానికి, నిన్నూ, నీ ఆరాధ్య దైవాలను పరిత్యజించటానికి వదలిపెడతావా?” అన్నారు. దానికి ఫిరౌను, “మేము ఇప్పుడే వాళ్ల మగపిల్లలను చంపేయటం మొదలుపెడ్తాము. వారి ఆడవారిని మాత్రం బ్రతకనిస్తాము. వాళ్ళపై మాకు అన్ని విధాలా తిరుగులేని అధికారం ఉంది” అని బదులిచ్చాడు.
7:128  قَالَ مُوسَىٰ لِقَوْمِهِ اسْتَعِينُوا بِاللَّهِ وَاصْبِرُوا ۖ إِنَّ الْأَرْضَ لِلَّهِ يُورِثُهَا مَن يَشَاءُ مِنْ عِبَادِهِ ۖ وَالْعَاقِبَةُ لِلْمُتَّقِينَ
మూసా తన జాతి వారితో, “అల్లాహ్‌ సహాయాన్ని అర్థించండి, సహనం వహించండి. ఈ భూమి అల్లాహ్‌ది. తన దాసులలో తాను కోరిన వారిని ఆయన దీనికి వారసులుగా చేస్తాడు. అల్లాహ్‌కు భయపడే వారికే ఎట్టకేలకు అంతిమ విజయం లభిస్తుంది” అన్నాడు.
7:129  قَالُوا أُوذِينَا مِن قَبْلِ أَن تَأْتِيَنَا وَمِن بَعْدِ مَا جِئْتَنَا ۚ قَالَ عَسَىٰ رَبُّكُمْ أَن يُهْلِكَ عَدُوَّكُمْ وَيَسْتَخْلِفَكُمْ فِي الْأَرْضِ فَيَنظُرَ كَيْفَ تَعْمَلُونَ
అతని జాతివారు, “మేము సదా పీడించబడ్డాము - నీవు రాకముందూ, నీవు వచ్చిన తరువాత కూడా(మేము పీడించబడుతున్నాము)” అన్నారు. “త్వరలోనే అల్లాహ్‌ మీ శత్రువును తుదముట్టించి, మిమ్మల్ని భూమికి ప్రతినిధులుగా చేస్తాడు. ఆ తరువాత మీ ప్రవర్తన ఎలా ఉంటుందో చూస్తాడు” అని మూసా వారిని ఓదార్చాడు.
7:130  وَلَقَدْ أَخَذْنَا آلَ فِرْعَوْنَ بِالسِّنِينَ وَنَقْصٍ مِّنَ الثَّمَرَاتِ لَعَلَّهُمْ يَذَّكَّرُونَ
మేము ఫిరౌను జనులను - గుణపాఠం గ్రహిస్తారన్న ఉద్దేశంతో - దుర్భిక్షానికీ, పండ్లు ఫలాల ఉత్పత్తుల కొరతకూ గురిచేసి పరీక్షించాము.
7:131  فَإِذَا جَاءَتْهُمُ الْحَسَنَةُ قَالُوا لَنَا هَٰذِهِ ۖ وَإِن تُصِبْهُمْ سَيِّئَةٌ يَطَّيَّرُوا بِمُوسَىٰ وَمَن مَّعَهُ ۗ أَلَا إِنَّمَا طَائِرُهُمْ عِندَ اللَّهِ وَلَٰكِنَّ أَكْثَرَهُمْ لَا يَعْلَمُونَ
(వారి గుణం ఎటువంటిదంటే) మేలు కలిగినపుడు 'ఇది మాకు తగినదే' అని అనేవారు. కీడు కలిగినప్పుడు దానిని, “మూసా మరియు అతని సహవాసుల మూలంగా కలిగిన దరిద్రం”గా చెప్పుకునేవారు. వినండి! వారి దరిద్రం అల్లాహ్‌ వద్ద ఉంది. కాని వారిలోని అధికులకు ఆ సంగతి తెలియదు.
7:132  وَقَالُوا مَهْمَا تَأْتِنَا بِهِ مِنْ آيَةٍ لِّتَسْحَرَنَا بِهَا فَمَا نَحْنُ لَكَ بِمُؤْمِنِينَ
“నీవు మాపై మంత్ర ప్రయోగం చేయడానికి ఎటువంటి (అద్భుత) సూచనను తెచ్చినా మేము నీ మాటను నమ్మము గాక నమ్మము” అని వారు (మూసాకు) చెప్పేశారు.
7:133  فَأَرْسَلْنَا عَلَيْهِمُ الطُّوفَانَ وَالْجَرَادَ وَالْقُمَّلَ وَالضَّفَادِعَ وَالدَّمَ آيَاتٍ مُّفَصَّلَاتٍ فَاسْتَكْبَرُوا وَكَانُوا قَوْمًا مُّجْرِمِينَ
ఆ తరువాత మేము వారిపై తుఫానును, మిడతల దండును పంపాము. ధాన్యపు పురుగులను, కప్పల రక్తాన్నీ వదిలాము. వాస్తవానికి ఇవన్నీ స్పష్టమయిన మహిమలు. అయినప్పటికీ వారు అహంకారాన్ని చూపారు. అసలు విషయం ఏమిటంటే వారు అపరాధజనులు.
7:134  وَلَمَّا وَقَعَ عَلَيْهِمُ الرِّجْزُ قَالُوا يَا مُوسَى ادْعُ لَنَا رَبَّكَ بِمَا عَهِدَ عِندَكَ ۖ لَئِن كَشَفْتَ عَنَّا الرِّجْزَ لَنُؤْمِنَنَّ لَكَ وَلَنُرْسِلَنَّ مَعَكَ بَنِي إِسْرَائِيلَ
వారిపై ఏదన్నా ఆపద వచ్చిపడినప్పుడు, “ఓ మూసా! నీకు నీ ప్రభువు చేసిన వాగ్దానం గురించి మా కోసం నీ ప్రభువును ప్రార్థించు. ఈ ఆపదను గనక నువ్వు మానుంచి దూరం చేస్తే మేము నిన్ను తప్పకుండా విశ్వసిస్తాము. ఇస్రాయీలు సంతతి వారిని కూడా (విడుదల చేసి) నీతో పంపిస్తాము” అని అనేవారు.
7:135  فَلَمَّا كَشَفْنَا عَنْهُمُ الرِّجْزَ إِلَىٰ أَجَلٍ هُم بَالِغُوهُ إِذَا هُمْ يَنكُثُونَ
ఆ తరువాత మేము వారు చేరుకోవలసిన ఒక నిర్ణీత గడువు వరకూ ఆ ఆపదను వారి నుంచి తొలగించగానే ఆడిన మాటను తప్పేవారు.
7:136  فَانتَقَمْنَا مِنْهُمْ فَأَغْرَقْنَاهُمْ فِي الْيَمِّ بِأَنَّهُمْ كَذَّبُوا بِآيَاتِنَا وَكَانُوا عَنْهَا غَافِلِينَ
ఆ తర్వాత మేము వారికి ప్రతీకారం చేశాము. వారిని సముద్రంలో ముంచి వేశాము. ఎందుకంటే, వారు మా ఆయతులను అసత్యాలని ధిక్కరించేవారు, వాటి పట్ల బొత్తిగా నిర్లక్ష్యం వహించేవారు.
7:137  وَأَوْرَثْنَا الْقَوْمَ الَّذِينَ كَانُوا يُسْتَضْعَفُونَ مَشَارِقَ الْأَرْضِ وَمَغَارِبَهَا الَّتِي بَارَكْنَا فِيهَا ۖ وَتَمَّتْ كَلِمَتُ رَبِّكَ الْحُسْنَىٰ عَلَىٰ بَنِي إِسْرَائِيلَ بِمَا صَبَرُوا ۖ وَدَمَّرْنَا مَا كَانَ يَصْنَعُ فِرْعَوْنُ وَقَوْمُهُ وَمَا كَانُوا يَعْرِشُونَ
అత్యంత బలహీన వర్గంగా పరిగణించబడే జనులను మేము ఆ భూభాగంలోని తూర్పుపడమరలకు వారసులుగా చేశాము. అందులో శుభాలు నింపాము. ఈ విధంగా ఇస్రాయీలు సంతతివారు పాటించిన సహనం మూలంగా, నీ ప్రభువు వారి విషయంలో చేసిన మంచి వాగ్దానం నెరవేరింది. ఇంకా ఫిరౌనూ, అతని జాతివారూ చేసిన నిర్మాణాలనూ, లేపిన భవనాలనూ మేము నేలమట్టం చేసేశాము.
7:138  وَجَاوَزْنَا بِبَنِي إِسْرَائِيلَ الْبَحْرَ فَأَتَوْا عَلَىٰ قَوْمٍ يَعْكُفُونَ عَلَىٰ أَصْنَامٍ لَّهُمْ ۚ قَالُوا يَا مُوسَى اجْعَل لَّنَا إِلَٰهًا كَمَا لَهُمْ آلِهَةٌ ۚ قَالَ إِنَّكُمْ قَوْمٌ تَجْهَلُونَ
మేము ఇస్రాయీలు సంతతివారిని సముద్రం దాటించాము. వారు సాగిపోతున్న దారిలో, తమ విగ్రహాలను అంటి పెట్టుకుని ఉన్న ఒక జాతి ప్రజలు వారికి కనిపించారు. “ఓ మూసా! వీళ్లకు ఈ ఆరాధ్య దైవాలు ఉన్నట్లు మాక్కూడా ఒక దేముణ్ణి చేసిపెట్టవా?!” అని వారు కోరారు. దానికి మూసా, “నిజంగానే మీరు మూర్ఖజనులు” అన్నాడు.
7:139  إِنَّ هَٰؤُلَاءِ مُتَبَّرٌ مَّا هُمْ فِيهِ وَبَاطِلٌ مَّا كَانُوا يَعْمَلُونَ
“వీళ్ళు ఏ పనిలో నిమగ్నులై ఉన్నారో అది నాశనం చేయబడుతుంది. వీళ్ళు చేస్తున్న ఈ పని ఒక మిథ్య”(అని అన్నాడు).
7:140  قَالَ أَغَيْرَ اللَّهِ أَبْغِيكُمْ إِلَٰهًا وَهُوَ فَضَّلَكُمْ عَلَى الْعَالَمِينَ
“ఏమిటీ, అల్లాహ్‌ను కాదని నేను మీకోసం మరో ఆరాధ్య దైవాన్ని అన్వేషించాలా? మరి చూడబోతే ఆయన మీకు సమస్త లోకవాసులపై ప్రాధాన్యతను ఇచ్చి ఉన్నాడు” అని కూడా మూసా (అలైహిస్సలాం) అన్నాడు.
7:141  وَإِذْ أَنجَيْنَاكُم مِّنْ آلِ فِرْعَوْنَ يَسُومُونَكُمْ سُوءَ الْعَذَابِ ۖ يُقَتِّلُونَ أَبْنَاءَكُمْ وَيَسْتَحْيُونَ نِسَاءَكُمْ ۚ وَفِي ذَٰلِكُم بَلَاءٌ مِّن رَّبِّكُمْ عَظِيمٌ
మేము మిమ్మల్ని ఫిరౌనీయుల నుండి విముక్తి కల్పించిన సందర్భాన్ని కాస్త జ్ఞాపకం చేసుకోండి - వాళ్ళు మిమ్మల్ని విపరీతమైన యాతనలకు గురిచేసేవారు. మీ కుమారులను చంపేసి, మీ స్త్రీలను మాత్రం బ్రతకనిచ్చేవారు. అందులో మీకు మీ ప్రభువు తరఫున పెద్ద పరీక్ష ఉండింది.
7:142  وَوَاعَدْنَا مُوسَىٰ ثَلَاثِينَ لَيْلَةً وَأَتْمَمْنَاهَا بِعَشْرٍ فَتَمَّ مِيقَاتُ رَبِّهِ أَرْبَعِينَ لَيْلَةً ۚ وَقَالَ مُوسَىٰ لِأَخِيهِ هَارُونَ اخْلُفْنِي فِي قَوْمِي وَأَصْلِحْ وَلَا تَتَّبِعْ سَبِيلَ الْمُفْسِدِينَ
మేము మూసా (అలైహిస్సలాం)కు ముఫ్ఫై రాత్రుల వాగ్దానం చేశాము. అదనంగా మరో పది రాత్రులతో వాటిని సంపూర్ణం చేశాము. ఆ విధంగా ప్రభువు నిర్థారించిన పూర్తి గడువు నలభై రాత్రులు అయింది. అప్పుడు మూసా (అలైహిస్సలాం) తన సోదరుడైన హారూనునుద్దేశించి, “నేను వెళ్ళాక నా జాతి ప్రజలలో నీవు నాకు ప్రాతినిధ్యం వహించు. వీళ్ళను తీర్చిదిద్దుతూ ఉండు. విచ్ఛిన్నకారుల అభిప్రాయాలను అనుసరించకు” అని చెప్పారు.
7:143  وَلَمَّا جَاءَ مُوسَىٰ لِمِيقَاتِنَا وَكَلَّمَهُ رَبُّهُ قَالَ رَبِّ أَرِنِي أَنظُرْ إِلَيْكَ ۚ قَالَ لَن تَرَانِي وَلَٰكِنِ انظُرْ إِلَى الْجَبَلِ فَإِنِ اسْتَقَرَّ مَكَانَهُ فَسَوْفَ تَرَانِي ۚ فَلَمَّا تَجَلَّىٰ رَبُّهُ لِلْجَبَلِ جَعَلَهُ دَكًّا وَخَرَّ مُوسَىٰ صَعِقًا ۚ فَلَمَّا أَفَاقَ قَالَ سُبْحَانَكَ تُبْتُ إِلَيْكَ وَأَنَا أَوَّلُ الْمُؤْمِنِينَ
మేము నిర్థారించిన సమయానికి మూసా (అలైహిస్సలాం) వచ్చి, అతని ప్రభువు అతనితో సంభాషించిన తర్వాత అతను, “నా ప్రభూ! నాకు నీ దర్శనం కలిగించు. నేను ఓసారి నిన్ను చూస్తాను” అని విన్నవించుకోగా, “ఎట్టి పరిస్థితిలోనూ నువ్వు నన్ను చూడలేవు. అయితే అదిగో! ఆ కొండ వైపు దృష్టిని సారించు. అది గనక యధాస్థితిలో ఉండగలిగితే నువ్వు కూడా నన్ను చూడగలుగుతావు” అని ఆయన సెలవిచ్చాడు. ఆ తరువాత అతని ప్రభువు తేజస్సు ఆ కొండపై ప్రసరించగానే ఆ తేజస్సు దాన్ని తుత్తునియలు చేసేసింది. మూసా స్పృహతప్పి పడిపోయాడు. స్పృహలోకి రాగానే, “(ప్రభూ!) నీవు పరమ పవిత్రుడవు. నేను నీ సన్నిధిలో పశ్చాత్తాపపడుతున్నాను. అందరి కన్నా ముందు నేనే నిన్ను విశ్వసిస్తున్నాను” అని మనవి చేసుకున్నాడు.
7:144  قَالَ يَا مُوسَىٰ إِنِّي اصْطَفَيْتُكَ عَلَى النَّاسِ بِرِسَالَاتِي وَبِكَلَامِي فَخُذْ مَا آتَيْتُكَ وَكُن مِّنَ الشَّاكِرِينَ
“ఓ మూసా! నిన్ను ప్రవక్తగా ఎన్నుకుని, నీతో సంభాషించి జనులపై నీకు ప్రాధాన్యతనిచ్చాను. కాబట్టి నేను ఇచ్చిన దానిని పుచ్చుకో. కృతజ్ఞుడవై ఉండు” అని అల్లాహ్‌ సెలవిచ్చాడు.
7:145  وَكَتَبْنَا لَهُ فِي الْأَلْوَاحِ مِن كُلِّ شَيْءٍ مَّوْعِظَةً وَتَفْصِيلًا لِّكُلِّ شَيْءٍ فَخُذْهَا بِقُوَّةٍ وَأْمُرْ قَوْمَكَ يَأْخُذُوا بِأَحْسَنِهَا ۚ سَأُرِيكُمْ دَارَ الْفَاسِقِينَ
మరి మేము మూసాకు పలకలపై అన్ని రకాల ఉపదేశాలనూ, అన్ని విషయాలకు సంబంధించిన వివరాలను వ్రాసి ఇచ్చాము. అతనికి ఇలా ఉపదేశించాము: “ఇక నువ్వు వీటిని చాలా గట్టిగా పట్టుకో. వీటిలోని ఉత్తమ ఆదేశాలను పాలించమని నీ జాతి వారికి ఆజ్ఞాపించు. అతి త్వరలోనే దుర్మార్గుల స్థానాన్ని మీకు చూపిస్తాను.
7:146  سَأَصْرِفُ عَنْ آيَاتِيَ الَّذِينَ يَتَكَبَّرُونَ فِي الْأَرْضِ بِغَيْرِ الْحَقِّ وَإِن يَرَوْا كُلَّ آيَةٍ لَّا يُؤْمِنُوا بِهَا وَإِن يَرَوْا سَبِيلَ الرُّشْدِ لَا يَتَّخِذُوهُ سَبِيلًا وَإِن يَرَوْا سَبِيلَ الْغَيِّ يَتَّخِذُوهُ سَبِيلًا ۚ ذَٰلِكَ بِأَنَّهُمْ كَذَّبُوا بِآيَاتِنَا وَكَانُوا عَنْهَا غَافِلِينَ
ఏ హక్కూ లేకుండా భూమిపై గర్వాన్ని ప్రదర్శించేవారిని నా ఆదేశాల నుంచి మరలిస్తాను. ఒకవేళ సూచనలన్నింటినీ తిలకించినా కూడా వారు వాటిని విశ్వసించరు. సరైన మార్గం వారికి కానవస్తే వారు దానిని తమ మార్గంగా చేసుకోరు. పెడదారి కనిపిస్తే మాత్రం దాన్ని తమ మార్గంగా చేసుకుంటారు. మా ఆయతులను ధిక్కరించి, వాటిపట్ల నిర్లక్ష్య వైఖరిని కనబరచటం వల్ల వారికీ దురవస్థ పట్టింది.
7:147  وَالَّذِينَ كَذَّبُوا بِآيَاتِنَا وَلِقَاءِ الْآخِرَةِ حَبِطَتْ أَعْمَالُهُمْ ۚ هَلْ يُجْزَوْنَ إِلَّا مَا كَانُوا يَعْمَلُونَ
ఇంకా మా ఆయతులను, అంతిమ దినాన కలుసుకునే విషయాన్ని అసత్యాలని తిరస్కరించిన వారి కర్మలన్నీ వృథా అయిపోయాయి. వారికి వారు చేస్తూ ఉండినదాని (శిక్షే) ఇవ్వబడుతుంది.”
7:148  وَاتَّخَذَ قَوْمُ مُوسَىٰ مِن بَعْدِهِ مِنْ حُلِيِّهِمْ عِجْلًا جَسَدًا لَّهُ خُوَارٌ ۚ أَلَمْ يَرَوْا أَنَّهُ لَا يُكَلِّمُهُمْ وَلَا يَهْدِيهِمْ سَبِيلًا ۘ اتَّخَذُوهُ وَكَانُوا ظَالِمِينَ
మూసా జాతివారు అతను వెళ్ళిన తర్వాత తమ నగలతో ఆవుదూడ విగ్రహాన్ని తయారుచేసి, దానిని తమ ఆరాధ్య దైవంగా కొలవసాగారు. అందులో నుంచి ఒకలాంటి శబ్దం వచ్చేది. అది తమతో మాట్లాడలేదనీ, తమకు ఏ దారీ చూపదనీ వారు ఆలోచించలేదా? అయినప్పటికీ వారు దాన్ని ఆరాధ్య దైవంగా ఖరారు చేసుకున్నారు. చాలా పెద్ద అన్యాయానికి పాల్పడ్డారు.
7:149  وَلَمَّا سُقِطَ فِي أَيْدِيهِمْ وَرَأَوْا أَنَّهُمْ قَدْ ضَلُّوا قَالُوا لَئِن لَّمْ يَرْحَمْنَا رَبُّنَا وَيَغْفِرْ لَنَا لَنَكُونَنَّ مِنَ الْخَاسِرِينَ
తమకు పశ్చాత్తాపం కలిగి, తాము నిజంగానే మార్గభ్రష్టతకు లోనయ్యామన్న సంగతి అర్థమయ్యాక వారు, సిగ్గుపడ్డారు. ”మా ప్రభువే గనక మాపై దయజూపకపోతే, మా తప్పును మన్నించకపోతే మేము ఘోరంగా నష్టపోతాము” అని అన్నారు.
7:150  وَلَمَّا رَجَعَ مُوسَىٰ إِلَىٰ قَوْمِهِ غَضْبَانَ أَسِفًا قَالَ بِئْسَمَا خَلَفْتُمُونِي مِن بَعْدِي ۖ أَعَجِلْتُمْ أَمْرَ رَبِّكُمْ ۖ وَأَلْقَى الْأَلْوَاحَ وَأَخَذَ بِرَأْسِ أَخِيهِ يَجُرُّهُ إِلَيْهِ ۚ قَالَ ابْنَ أُمَّ إِنَّ الْقَوْمَ اسْتَضْعَفُونِي وَكَادُوا يَقْتُلُونَنِي فَلَا تُشْمِتْ بِيَ الْأَعْدَاءَ وَلَا تَجْعَلْنِي مَعَ الْقَوْمِ الظَّالِمِينَ
మూసా (అలైహిస్సలాం) తన జాతి వారి వద్దకు కోపంతో, విచారంతో తిరిగివచ్చి, “నేను వెళ్ళగానే ఇంత చెడ్డ నిర్వాకానికి పాల్పడతారా? మీ ప్రభువు ఆజ్ఞలు అందకముందే మీరు తొందరపడ్డారా?” అని చెప్పి, (చేతిలోని) పలకలను విసురుగా ఓ ప్రక్కన పెట్టేసి, తన సోదరుని జుత్తు పట్టుకుని తన వైపుకు ఈడ్వ సాగాడు. అప్పుడు హారూను (అలైహిస్సలాం), “ఓ నా తల్లి పుత్రుడా! వీళ్ళు నన్ను ఏ మాత్రం లెక్క చేయలేదు. నన్ను చంపేయటానికి కూడా సిద్ధమయ్యారు. కాబట్టి నా స్థితిపై శత్రువులు నవ్వుకునేలా చేయకు. నన్ను ఈ దుర్మార్గుల వర్గంలో జమకట్టకు” అని సంజాయిషీ ఇచ్చారు.
7:151  قَالَ رَبِّ اغْفِرْ لِي وَلِأَخِي وَأَدْخِلْنَا فِي رَحْمَتِكَ ۖ وَأَنتَ أَرْحَمُ الرَّاحِمِينَ
అప్పుడు, “ఓ ప్రభూ! నన్నూ, నా సోదరుణ్ణి క్షమించు. మా ఇద్దరినీ నీ కారుణ్యంలో చేర్చుకో. నువ్వు కరుణించే వారందరిలో కెల్లా గొప్ప కరుణామయుడవు” అని (మూసా) వేడుకున్నాడు.
7:152  إِنَّ الَّذِينَ اتَّخَذُوا الْعِجْلَ سَيَنَالُهُمْ غَضَبٌ مِّن رَّبِّهِمْ وَذِلَّةٌ فِي الْحَيَاةِ الدُّنْيَا ۚ وَكَذَٰلِكَ نَجْزِي الْمُفْتَرِينَ
ఆవుదూడను పూజించిన వారిపై అతి త్వరలోనే వారి ప్రభువు తరఫు నుంచి ఆగ్రహం, అవమానం - ప్రాపంచిక జీవితంలోనే - పడుతుంది. అసత్యాలను అల్లేవారిని మేము ఈ విధంగానే శిక్షిస్తాము.
7:153  وَالَّذِينَ عَمِلُوا السَّيِّئَاتِ ثُمَّ تَابُوا مِن بَعْدِهَا وَآمَنُوا إِنَّ رَبَّكَ مِن بَعْدِهَا لَغَفُورٌ رَّحِيمٌ
మరెవరయితే తప్పు చేసిన తరువాత పశ్చాత్తాపం చెంది, విశ్వసిస్తారో వారిని నీ ప్రభువు - ఈ పశ్చాత్తాపం తరువాత- క్షమిస్తాడు, కనికరిస్తాడు.
7:154  وَلَمَّا سَكَتَ عَن مُّوسَى الْغَضَبُ أَخَذَ الْأَلْوَاحَ ۖ وَفِي نُسْخَتِهَا هُدًى وَرَحْمَةٌ لِّلَّذِينَ هُمْ لِرَبِّهِمْ يَرْهَبُونَ
కోపం చల్లారిన తరువాత మూసా (అలైహిస్సలాం) పలకలను ఎత్తుకున్నాడు. వాటిపై రాయబడి ఉన్నదానిలో తమ ప్రభువుకు భయపడేవారి కొరకు సన్మార్గమూ, కారుణ్యమూ ఉండినవి.
7:155  وَاخْتَارَ مُوسَىٰ قَوْمَهُ سَبْعِينَ رَجُلًا لِّمِيقَاتِنَا ۖ فَلَمَّا أَخَذَتْهُمُ الرَّجْفَةُ قَالَ رَبِّ لَوْ شِئْتَ أَهْلَكْتَهُم مِّن قَبْلُ وَإِيَّايَ ۖ أَتُهْلِكُنَا بِمَا فَعَلَ السُّفَهَاءُ مِنَّا ۖ إِنْ هِيَ إِلَّا فِتْنَتُكَ تُضِلُّ بِهَا مَن تَشَاءُ وَتَهْدِي مَن تَشَاءُ ۖ أَنتَ وَلِيُّنَا فَاغْفِرْ لَنَا وَارْحَمْنَا ۖ وَأَنتَ خَيْرُ الْغَافِرِينَ
మేము నిర్థారించిన సమయం కోసం మూసా (అలైహిస్సలాం) తన జాతికి చెందిన డెబ్భై మందిని ఎన్నుకున్నాడు. మరి వారిని భూకంపం కబళించినప్పుడు మూసా (అలైహిస్సలాం) ఇలా నివేదించుకున్నాడు : “నా ప్రభూ! నీవు గనక తలచుకుని ఉంటే ఇంతకు ముందే వీళ్ళనూ, నన్నూ తుదముట్టించి ఉండేవాడివి. ఏమిటీ (ప్రభూ!) మాలోని కొంతమంది అవివేకులు చేసిన పనికి మమ్మల్నందరినీ నాశనం చేస్తావా? ఈ సంఘటన వాస్తవానికి నీ తరఫున పెట్టబడిన ఒక పరీక్ష. ఇలాంటి పరీక్షల ద్వారా నీవు కోరిన వారిని అపమార్గానికి గురిచేసి, నీవు కోరిన వారిని సన్మార్గంపై నిలపగలవు. నువ్వే మా సంరక్షకుడవు. కనుక మాకు క్షమాభిక్ష పెట్టు. మాపై దయజూపు. నీవు క్షమించే వారందరిలోకీ ఉత్తమ క్షమాశీలివి.
7:156  وَاكْتُبْ لَنَا فِي هَٰذِهِ الدُّنْيَا حَسَنَةً وَفِي الْآخِرَةِ إِنَّا هُدْنَا إِلَيْكَ ۚ قَالَ عَذَابِي أُصِيبُ بِهِ مَنْ أَشَاءُ ۖ وَرَحْمَتِي وَسِعَتْ كُلَّ شَيْءٍ ۚ فَسَأَكْتُبُهَا لِلَّذِينَ يَتَّقُونَ وَيُؤْتُونَ الزَّكَاةَ وَالَّذِينَ هُم بِآيَاتِنَا يُؤْمِنُونَ
మా కోసం ప్రపంచంలోనూ, పరలోకంలో కూడా మేలును వ్రాయి. మేము నీ వైపుకే మరలాము.”(సమాధానంగా అల్లాహ్‌ ఈ విధంగా) సెలవిచ్చాడు : “నేను కోరిన వారికి మాత్రమే శిక్ష విధిస్తాను. అయితే నా కారుణ్యం అన్ని వస్తువులనూ ఆవరించి ఉంది. భయభక్తుల వైఖరిని అవలంబిస్తూ, జకాతును చెల్లిస్తూ, మా ఆయతులను విశ్వసించేవారి పేర ఈ కారుణ్యాన్ని తప్పకుండా వ్రాస్తాను.”
7:157  الَّذِينَ يَتَّبِعُونَ الرَّسُولَ النَّبِيَّ الْأُمِّيَّ الَّذِي يَجِدُونَهُ مَكْتُوبًا عِندَهُمْ فِي التَّوْرَاةِ وَالْإِنجِيلِ يَأْمُرُهُم بِالْمَعْرُوفِ وَيَنْهَاهُمْ عَنِ الْمُنكَرِ وَيُحِلُّ لَهُمُ الطَّيِّبَاتِ وَيُحَرِّمُ عَلَيْهِمُ الْخَبَائِثَ وَيَضَعُ عَنْهُمْ إِصْرَهُمْ وَالْأَغْلَالَ الَّتِي كَانَتْ عَلَيْهِمْ ۚ فَالَّذِينَ آمَنُوا بِهِ وَعَزَّرُوهُ وَنَصَرُوهُ وَاتَّبَعُوا النُّورَ الَّذِي أُنزِلَ مَعَهُ ۙ أُولَٰئِكَ هُمُ الْمُفْلِحُونَ
ఈ సందేశహరుణ్ణి, నిరక్షరాసి అయిన ఈ ప్రవక్తను అనుసరించేవారు (కరుణించబడతారు), అతని ప్రస్తావన తమ వద్ద ఉన్న తౌరాతు, ఇంజీలు గ్రంథాలలో లిఖితపూర్వకంగా లభిస్తుంది. ఆ ప్రవక్త మంచిని చెయ్యమని వారికి ఆదేశిస్తాడు. చెడుల నుంచి వారిస్తాడు. పరిశుద్ధమైన వస్తువులను ధర్మ సమ్మతంగా ప్రకటిస్తాడు. అశుద్ధమైన వాటిని నిషిద్ధంగా ఖరారు చేస్తాడు. వారిపై ఉన్న బరువులను దించుతాడు. వారికి వేయబడి వున్న సంకెళ్లను (విప్పుతాడు). కనుక ఎవరు ఈ ప్రవక్తను విశ్వసించి, అతనికి ఆదరువుగా నిలుస్తారో, తోడ్పాటునందిస్తారో, ఇంకా అతనితోపాటు పంపబడిన జ్యోతిని అనుసరిస్తారో వారే సాఫల్యం పొందేవారు.
7:158  قُلْ يَا أَيُّهَا النَّاسُ إِنِّي رَسُولُ اللَّهِ إِلَيْكُمْ جَمِيعًا الَّذِي لَهُ مُلْكُ السَّمَاوَاتِ وَالْأَرْضِ ۖ لَا إِلَٰهَ إِلَّا هُوَ يُحْيِي وَيُمِيتُ ۖ فَآمِنُوا بِاللَّهِ وَرَسُولِهِ النَّبِيِّ الْأُمِّيِّ الَّذِي يُؤْمِنُ بِاللَّهِ وَكَلِمَاتِهِ وَاتَّبِعُوهُ لَعَلَّكُمْ تَهْتَدُونَ
(ఓ ముహమ్మద్‌!) వారికి చెప్పు : “ఓ ప్రజలారా! నేను భూమ్యాకాశాల సామ్రాజ్యానికి అధిపతి అయిన అల్లాహ్‌ తరఫున మీ అందరి వద్దకు పంపబడిన ప్రవక్తను. ఆయన తప్ప మరో ఆరాధ్యుడు లేడు. ఆయనే బ్రతికించేవాడు, ఆయనే మరణాన్ని ఇచ్చేవాడు. కనుక అల్లాహ్‌ను విశ్వసించండి. సందేశహరుడు, నిరక్షరాసి అయిన ఆయన ప్రవక్తను కూడా విశ్వసించండి - ఆ ప్రవక్త అల్లాహ్‌ను మరియు ఆయన ఆదేశాలను విశ్వసిస్తాడు. అతన్ని అనుసరించండి. తద్వారా మీరు సన్మార్గం పొందుతారు.”
7:159  وَمِن قَوْمِ مُوسَىٰ أُمَّةٌ يَهْدُونَ بِالْحَقِّ وَبِهِ يَعْدِلُونَ
మూసా జాతి వారిలో సత్యం ప్రకారం మార్గదర్శకత్వం వహించే, సత్యాన్ననుసరించి న్యాయ నిర్ణయాలు గైకొనే వర్గం కూడా ఒకటుంది.
7:160  وَقَطَّعْنَاهُمُ اثْنَتَيْ عَشْرَةَ أَسْبَاطًا أُمَمًا ۚ وَأَوْحَيْنَا إِلَىٰ مُوسَىٰ إِذِ اسْتَسْقَاهُ قَوْمُهُ أَنِ اضْرِب بِّعَصَاكَ الْحَجَرَ ۖ فَانبَجَسَتْ مِنْهُ اثْنَتَا عَشْرَةَ عَيْنًا ۖ قَدْ عَلِمَ كُلُّ أُنَاسٍ مَّشْرَبَهُمْ ۚ وَظَلَّلْنَا عَلَيْهِمُ الْغَمَامَ وَأَنزَلْنَا عَلَيْهِمُ الْمَنَّ وَالسَّلْوَىٰ ۖ كُلُوا مِن طَيِّبَاتِ مَا رَزَقْنَاكُمْ ۚ وَمَا ظَلَمُونَا وَلَٰكِن كَانُوا أَنفُسَهُمْ يَظْلِمُونَ
మేము (మూసా జాతి) వారిని పన్నెండు తెగలుగా విభజించి, వేర్వేరు సమూహాలుగా చేశాము. మూసా జాతి వారు అతన్ని నీళ్ళు అడిగినప్పుడు, “నీ చేతి కర్రను ఫలానా రాతిపై కొట్టు” అని మేమతన్ని ఆదేశించాము. అంతే! (అతను కర్రతో కొట్టగానే) ఆ రాతి బండ నుంచి పన్నెండు ఊటలు చిమ్ముకువచ్చాయి. ప్రతి తెగవారూ తాము నీళ్లు తాగవలసిన చోటును తెలుసుకున్నారు. మేము వారిపై మబ్బుల ద్వారా నీడను కల్పించాము. వారిపై 'మన్న సల్వా'లను (ఆహారంగా) దించాము. “మేము మీకు ప్రసాదించిన పరిశుద్ధమైన పదార్థాలను తినండి” (అని వారికి చెప్పాము.) అయితే వారు (కృతఘ్నతకు పాల్పడి) మాకు చేకూర్చిన నష్టం ఏమీలేదు. వారు తమ స్వయానికే నష్టం చేకూర్చుకునేవారు.
7:161  وَإِذْ قِيلَ لَهُمُ اسْكُنُوا هَٰذِهِ الْقَرْيَةَ وَكُلُوا مِنْهَا حَيْثُ شِئْتُمْ وَقُولُوا حِطَّةٌ وَادْخُلُوا الْبَابَ سُجَّدًا نَّغْفِرْ لَكُمْ خَطِيئَاتِكُمْ ۚ سَنَزِيدُ الْمُحْسِنِينَ
“మీరు ఈ పట్నంలోకి పోయి నివసించండి, అక్కడ మీరు కోరిన చోటినుంచి తీసుకుని తినండి. 'హిత్తతున్‌' అని పలుకుతూ, సాష్టాంగపడుతూ ద్వారం గుండా ప్రవేశించండి. మేము మీ తప్పులను క్షమిస్తాము. సత్కార్యాలు చేసేవారికి మరింతగా అనుగ్రహిస్తాము” అని వారికి ఆజ్ఞాపించబడినప్పుడు,
7:162  فَبَدَّلَ الَّذِينَ ظَلَمُوا مِنْهُمْ قَوْلًا غَيْرَ الَّذِي قِيلَ لَهُمْ فَأَرْسَلْنَا عَلَيْهِمْ رِجْزًا مِّنَ السَّمَاءِ بِمَا كَانُوا يَظْلِمُونَ
వారిలోని దుర్మార్గులు తమకు ఇవ్వబడిన వాక్కును మరొక మాటతో మార్చివేశారు. అందువల్ల మేము వారిపై ఆకాశం నుంచి ఆపదను పంపాము. ఎందుకంటే వారు చాలా అన్యాయంగా ప్రవర్తించేవారు.
7:163  وَاسْأَلْهُمْ عَنِ الْقَرْيَةِ الَّتِي كَانَتْ حَاضِرَةَ الْبَحْرِ إِذْ يَعْدُونَ فِي السَّبْتِ إِذْ تَأْتِيهِمْ حِيتَانُهُمْ يَوْمَ سَبْتِهِمْ شُرَّعًا وَيَوْمَ لَا يَسْبِتُونَ ۙ لَا تَأْتِيهِمْ ۚ كَذَٰلِكَ نَبْلُوهُم بِمَا كَانُوا يَفْسُقُونَ
(ఓ ప్రవక్తా!) సముద్ర తీరాన నివసించిన బస్తీ ప్రజల స్థితిగతులను గురించి వారిని (యూదులను) అడుగు. వారు శనివారం నాటి విషయంలో హద్దుమీరి ప్రవర్తించేవారు. మరి ఆ శనివారం నాడే చేపలు పైపైకి తేలియాడుతూ వారి ముందుకు వచ్చేవి. శనివారం కాని దినాలలో అవి వారి ముందుకు వచ్చేవి కావు. వారి అవిధేయత మూలంగా మేము వారిని ఈ విధంగా పరీక్షకు గురి చేసేవారము.
7:164  وَإِذْ قَالَتْ أُمَّةٌ مِّنْهُمْ لِمَ تَعِظُونَ قَوْمًا ۙ اللَّهُ مُهْلِكُهُمْ أَوْ مُعَذِّبُهُمْ عَذَابًا شَدِيدًا ۖ قَالُوا مَعْذِرَةً إِلَىٰ رَبِّكُمْ وَلَعَلَّهُمْ يَتَّقُونَ
ఇంకా వారిలో ఒక వర్గం (మంచిని ప్రబోధించే వారినుద్దేశించి), “అల్లాహ్‌ నాశనం చేయబోయే లేక కఠినంగా శిక్షించబోయేవారికి ఎందుకు (అనవసరంగా) ఉపదేశిస్తారు?” అని చెప్పగా, “మీ ప్రభువు సమక్షంలో సంజాయిషీ ఇవ్వగలిగే స్థితిలో ఉండటానికి (ఈ పని చేస్తున్నాము). అలాగే బహుశా ఈ జనులు (దైవాగ్రహానికి) భయపడినా భయపడవచ్చు” అని వారు సమాధానమిచ్చారు.
7:165  فَلَمَّا نَسُوا مَا ذُكِّرُوا بِهِ أَنجَيْنَا الَّذِينَ يَنْهَوْنَ عَنِ السُّوءِ وَأَخَذْنَا الَّذِينَ ظَلَمُوا بِعَذَابٍ بَئِيسٍ بِمَا كَانُوا يَفْسُقُونَ
మరి వారికి చేస్తూ వచ్చిన హితబోధను వారు విస్మరించినప్పుడు, ఆ చెడు పోకడ నుంచి వారిస్తూ వచ్చిన వారిని మేము రక్షించి, దుర్మార్గానికి పాల్పడిన వారందరినీ వారి అవిధేయతల కారణంగా ఒక కఠినమైన శిక్షతో పట్టుకున్నాము.
7:166  فَلَمَّا عَتَوْا عَن مَّا نُهُوا عَنْهُ قُلْنَا لَهُمْ كُونُوا قِرَدَةً خَاسِئِينَ
అనగా వారు, తమకు వారించబడిన విషయంపై బరి తెగించి పోయినప్పుడు, “ఇక మీరు నీచులైన కోతులుగా మారిపొండి” అని అన్నాము.
7:167  وَإِذْ تَأَذَّنَ رَبُّكَ لَيَبْعَثَنَّ عَلَيْهِمْ إِلَىٰ يَوْمِ الْقِيَامَةِ مَن يَسُومُهُمْ سُوءَ الْعَذَابِ ۗ إِنَّ رَبَّكَ لَسَرِيعُ الْعِقَابِ ۖ وَإِنَّهُ لَغَفُورٌ رَّحِيمٌ
ప్రళయదినం వరకూ యూదులను తీవ్ర యాతనకు గురి చేస్తూ ఉండేవారిని వారిపై విధిస్తాను అని నీ ప్రభువు ప్రకటించిన విషయం స్మరించదగినది. నిస్సందేహంగా నీ ప్రభువు శిక్షించటంలో వడిగలవాడు. నిస్సందేహంగా ఆయన క్షమించేవాడు, కనికరించేవాడు కూడా.
7:168  وَقَطَّعْنَاهُمْ فِي الْأَرْضِ أُمَمًا ۖ مِّنْهُمُ الصَّالِحُونَ وَمِنْهُمْ دُونَ ذَٰلِكَ ۖ وَبَلَوْنَاهُم بِالْحَسَنَاتِ وَالسَّيِّئَاتِ لَعَلَّهُمْ يَرْجِعُونَ
మేము వారిని (యూదులను) భూమండలంపై అనేక వర్గాలుగా చీల్చి (చెల్లాచెదురుగా చేసి) ఉంచాము. వారిలో కొందరు సజ్జనులూ మరియు తద్భిన్నంగా ఉండేవారు కూడా ఉన్నారు. బహుశా వారు మరలి వస్తారేమోనని మేము వారిని మంచి స్థితిలోనూ, దుస్థితిలోనూ పరీక్షించాము.
7:169  فَخَلَفَ مِن بَعْدِهِمْ خَلْفٌ وَرِثُوا الْكِتَابَ يَأْخُذُونَ عَرَضَ هَٰذَا الْأَدْنَىٰ وَيَقُولُونَ سَيُغْفَرُ لَنَا وَإِن يَأْتِهِمْ عَرَضٌ مِّثْلُهُ يَأْخُذُوهُ ۚ أَلَمْ يُؤْخَذْ عَلَيْهِم مِّيثَاقُ الْكِتَابِ أَن لَّا يَقُولُوا عَلَى اللَّهِ إِلَّا الْحَقَّ وَدَرَسُوا مَا فِيهِ ۗ وَالدَّارُ الْآخِرَةُ خَيْرٌ لِّلَّذِينَ يَتَّقُونَ ۗ أَفَلَا تَعْقِلُونَ
మరి వారి తరువాత వారికి వారసులైనవారు వారి నుంచి గ్రంథాన్ని పొందారు. వారు తుచ్ఛమైన ఐహిక సంపదను తీసుకుంటున్నారు. పైగా, “మేము తప్పకుండా క్షమించబడతాము” అని అంటున్నారు. అలాంటి సొమ్మే మళ్లీ లభిస్తే మళ్లీ దాన్ని కూడా తీసేసుకుంటారు. అల్లాహ్‌ పేరుతో సత్యం తప్ప మరోమాట చెప్పకూడదని గ్రంథంలో ఉన్నటువంటి ప్రమాణం వారి నుండి తీసుకోబడలేదా? (మరి చూడబోతే) అందులో (గ్రంథంలో) ఉన్న దానిని వారు స్వయంగా చదివారు. భయభక్తులు కలిగి ఉండేవారి కోసం పరలోక నిలయం ఎంతో మేలైనది. మరి ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకోరేమిటీ?
7:170  وَالَّذِينَ يُمَسِّكُونَ بِالْكِتَابِ وَأَقَامُوا الصَّلَاةَ إِنَّا لَا نُضِيعُ أَجْرَ الْمُصْلِحِينَ
ఎవరు గ్రంథానికి కట్టుబడి ఉంటూ, నమాజులను నెలకొల్పుతూ ఉన్నారో అట్టి సంస్కర్తల పుణ్య ఫలాన్ని మేము వృథా చేయము.
7:171  وَإِذْ نَتَقْنَا الْجَبَلَ فَوْقَهُمْ كَأَنَّهُ ظُلَّةٌ وَظَنُّوا أَنَّهُ وَاقِعٌ بِهِمْ خُذُوا مَا آتَيْنَاكُم بِقُوَّةٍ وَاذْكُرُوا مَا فِيهِ لَعَلَّكُمْ تَتَّقُونَ
మేము పర్వతాన్ని పైకెత్తి కప్పు మాదిరిగా వారిపై నిలిపిన సంఘటన కూడా గుర్తుచేసుకోదగినదే. అది తమపైన పడటం ఖాయం అని వారంతా అనుకున్నారు. (ఆ సమయంలో మేము వారితో), “మేము మీకు వొసగిన దానిని (గ్రంథాన్ని) గట్టిగా పట్టుకోండి. ఇందలి ఆదేశాలను జ్ఞాపకముంచుకోండి. తద్వారా మీరు దైవ భీతిపరులు (ముత్తఖీన్‌) అవుతారు” (అని చెప్పాము).
7:172  وَإِذْ أَخَذَ رَبُّكَ مِن بَنِي آدَمَ مِن ظُهُورِهِمْ ذُرِّيَّتَهُمْ وَأَشْهَدَهُمْ عَلَىٰ أَنفُسِهِمْ أَلَسْتُ بِرَبِّكُمْ ۖ قَالُوا بَلَىٰ ۛ شَهِدْنَا ۛ أَن تَقُولُوا يَوْمَ الْقِيَامَةِ إِنَّا كُنَّا عَنْ هَٰذَا غَافِلِينَ
నీ ప్రభువు ఆదం సంతతి వీపుల నుండి వారి సంతానాన్ని తీసి, స్వయంగా వారినే వారికి సాక్షులుగా పెట్టి, “నేను మీ ప్రభువును కానా?” అని అడిగినప్పుడు “ఎందుకు కావు? (నువ్వే మా ప్రభువువి). ఈ విషయానికి మేమంతా సాక్షులుగా ఉన్నాం” అని వారు చెప్పారు. 'దీని గురించి మాకేమీ తెలియదు' అని ప్రళయ దినాన మీరు అనకుండా ఉండటానికీ
7:173  أَوْ تَقُولُوا إِنَّمَا أَشْرَكَ آبَاؤُنَا مِن قَبْلُ وَكُنَّا ذُرِّيَّةً مِّن بَعْدِهِمْ ۖ أَفَتُهْلِكُنَا بِمَا فَعَلَ الْمُبْطِلُونَ
లేదా “మొదట్లో మా పూర్వీకులు షిర్కుకు పాల్పడ్డారు. మేము వారి తరువాతివారి సంతతిలో పుట్టినవారము. ఆ దుర్జనులు చేసిన పాపానికి నువ్వు మమ్మల్ని వినాశానికి గురిచేస్తావా?!” అని మీరు అనకుండా ఉండటానికిగాను (మేము ముందే మీ నుండి ఈ విధంగా ఖరారు చేయించాము.)
7:174  وَكَذَٰلِكَ نُفَصِّلُ الْآيَاتِ وَلَعَلَّهُمْ يَرْجِعُونَ
వారు మరలివస్తారేమోనని మేము ఈ విధంగా ఆయతులను విడమరచి చెబుతున్నాము.
7:175  وَاتْلُ عَلَيْهِمْ نَبَأَ الَّذِي آتَيْنَاهُ آيَاتِنَا فَانسَلَخَ مِنْهَا فَأَتْبَعَهُ الشَّيْطَانُ فَكَانَ مِنَ الْغَاوِينَ
(ఓ ప్రవక్తా!) మేము మా ఆయతులను ప్రసాదించగా, వాటినుండి తిరిగిపోయిన వాని వృత్తాంతాన్ని వారికి చదివి వినిపించు. చివరకు షైతాను అతని వెంటపడగా, అతడు మార్గభ్రష్టులలో చేరిపోయాడు.
7:176  وَلَوْ شِئْنَا لَرَفَعْنَاهُ بِهَا وَلَٰكِنَّهُ أَخْلَدَ إِلَى الْأَرْضِ وَاتَّبَعَ هَوَاهُ ۚ فَمَثَلُهُ كَمَثَلِ الْكَلْبِ إِن تَحْمِلْ عَلَيْهِ يَلْهَثْ أَوْ تَتْرُكْهُ يَلْهَث ۚ ذَّٰلِكَ مَثَلُ الْقَوْمِ الَّذِينَ كَذَّبُوا بِآيَاتِنَا ۚ فَاقْصُصِ الْقَصَصَ لَعَلَّهُمْ يَتَفَكَّرُونَ
మేము గనక తలిస్తే ఈ ఆయతుల వల్ల అతనికి ఔన్నత్యాన్ని ప్రసాదించి ఉండేవారం. కాని అతనేమో ప్రపంచం వైపుకే మ్రొగ్గాడు. తన మనోవాంఛలనే అనుసరించసాగాడు. అందువల్ల అతని పరిస్థితి కుక్క పరిస్థితిలా తయారయింది. నువ్వు దాన్ని తరిమినా అది నాలుకను బయటపెట్టి రొప్పుతూ ఉంటుంది. దాన్ని దాని మానాన వదలి పెట్టినా (నాలుక తీసి) రొప్పుతూనే ఉంటుంది. మా ఆయతులను అసత్యాలని త్రోసిపుచ్చిన వారి పరిస్థితి కూడా ఇలాంటిదే. కాబట్టి నువ్వు వారికి ఈ గాథలను వినిపిస్తూ ఉండు. బహుశా అలాగైనా వారు యోచన చేస్తారేమో!
7:177  سَاءَ مَثَلًا الْقَوْمُ الَّذِينَ كَذَّبُوا بِآيَاتِنَا وَأَنفُسَهُمْ كَانُوا يَظْلِمُونَ
మా ఆయతులను అసత్యాలని ధిక్కరిస్తూ, తమ స్వయానికి నష్టం చేకూర్చుకునే ప్రజల పరిస్థితి కూడా చాలా చెడ్డది.
7:178  مَن يَهْدِ اللَّهُ فَهُوَ الْمُهْتَدِي ۖ وَمَن يُضْلِلْ فَأُولَٰئِكَ هُمُ الْخَاسِرُونَ
అల్లాహ్‌ ఎవడికి సన్మార్గం చూపుతాడో అతడే సన్మార్గం పొందినవాడవుతాడు. మరెవరిని ఆయన అపమార్గం పట్టిస్తాడో వారే నష్టపోయినవారవుతారు.
7:179  وَلَقَدْ ذَرَأْنَا لِجَهَنَّمَ كَثِيرًا مِّنَ الْجِنِّ وَالْإِنسِ ۖ لَهُمْ قُلُوبٌ لَّا يَفْقَهُونَ بِهَا وَلَهُمْ أَعْيُنٌ لَّا يُبْصِرُونَ بِهَا وَلَهُمْ آذَانٌ لَّا يَسْمَعُونَ بِهَا ۚ أُولَٰئِكَ كَالْأَنْعَامِ بَلْ هُمْ أَضَلُّ ۚ أُولَٰئِكَ هُمُ الْغَافِلُونَ
ఎంతోమంది జిన్నులను, మానవులను మేము నరకం కోసం పుట్టించాము. వారికి హృదయాలున్నాయి. కాని వాటితో వారు ఆలోచించరు. వారికి కళ్లున్నాయి. కాని వాటితో వారు చూడరు. వారికి చెవులున్నాయి. కాని వాటితో వారు వినరు. వారు పశువుల్లాంటివారు. కాదు, వాటికన్నా ఎక్కువగానే దారి తప్పారు. పరధ్యానంలో పడిపోయిన వారంటే వీరే.
7:180  وَلِلَّهِ الْأَسْمَاءُ الْحُسْنَىٰ فَادْعُوهُ بِهَا ۖ وَذَرُوا الَّذِينَ يُلْحِدُونَ فِي أَسْمَائِهِ ۚ سَيُجْزَوْنَ مَا كَانُوا يَعْمَلُونَ
అల్లాహ్‌కు మంచి మంచి పేర్లున్నాయి. కాబట్టి మీరు ఆ పేర్లతో ఆయన్నే పిలవండి. ఆయన పేర్ల విషయంలో వక్రంగా వాదించే వారిని వదలిపెట్టండి. వారు చేస్తూ ఉండినదానికి వారు తప్పకుండా శిక్షించబడతారు.
7:181  وَمِمَّنْ خَلَقْنَا أُمَّةٌ يَهْدُونَ بِالْحَقِّ وَبِهِ يَعْدِلُونَ
మేము సృష్టించిన వారిలో సత్యానికనుగుణంగా మార్గదర్శకత్వం వహించే, సత్యాన్ననుసరించి న్యాయంచేసే మానవ సముదాయం కూడా ఒకటుంది.
7:182  وَالَّذِينَ كَذَّبُوا بِآيَاتِنَا سَنَسْتَدْرِجُهُم مِّنْ حَيْثُ لَا يَعْلَمُونَ
మా ఆయతులను అసత్యాలని ధిక్కరించిన వారిని మేము- వారికి తెలియకుండానే - క్రమక్రమంగా (మా ఉచ్చులో) బిగిస్తూ పోతాము.
7:183  وَأُمْلِي لَهُمْ ۚ إِنَّ كَيْدِي مَتِينٌ
వారికి కొంత గడువును ఇస్తున్నాను. నిశ్చయంగా నా వ్యూహం ఎంతో పకడ్బందీగా ఉంటుంది.
7:184  أَوَلَمْ يَتَفَكَّرُوا ۗ مَا بِصَاحِبِهِم مِّن جِنَّةٍ ۚ إِنْ هُوَ إِلَّا نَذِيرٌ مُّبِينٌ
ఏమిటీ, తమ సహవాసిపై ఏ మాత్రం ఉన్మాద ప్రభావం లేదన్న విషయాన్ని గురించి వారు ఆలోచించలేదా? అతను స్పష్టంగా హెచ్చరించేవాడు మాత్రమే (అతను ఎంతమాత్రం ఉన్మాది కాడు).
7:185  أَوَلَمْ يَنظُرُوا فِي مَلَكُوتِ السَّمَاوَاتِ وَالْأَرْضِ وَمَا خَلَقَ اللَّهُ مِن شَيْءٍ وَأَنْ عَسَىٰ أَن يَكُونَ قَدِ اقْتَرَبَ أَجَلُهُمْ ۖ فَبِأَيِّ حَدِيثٍ بَعْدَهُ يُؤْمِنُونَ
ఏమిటి, ఆకాశాల మరియు భూమి యొక్క వ్యవస్థను, అల్లాహ్‌ సృష్టించిన ఇతర వస్తువులను వారు గమనించలేదా? వారి కాలం దగ్గరపడి ఉండవచ్చునన్న సంగతిని గురించి కూడా వారు ఆలోచించలేదా? మరి ఖుర్‌ఆన్‌ తరువాత, వారు విశ్వసించే ఇంకొక వస్తువు ఏముంటుంది?
7:186  مَن يُضْلِلِ اللَّهُ فَلَا هَادِيَ لَهُ ۚ وَيَذَرُهُمْ فِي طُغْيَانِهِمْ يَعْمَهُونَ
అల్లాహ్‌ అపమార్గాన వదలి పెట్టేసిన వారిని సన్మార్గం పైకి ఎవరూ తీసుకురాలేరు. వారు తమ తలబిరుసుతనంలోనే తచ్చాడుతూ ఉండేలా అల్లాహ్‌ వారిని వదలివేస్తాడు.
7:187  يَسْأَلُونَكَ عَنِ السَّاعَةِ أَيَّانَ مُرْسَاهَا ۖ قُلْ إِنَّمَا عِلْمُهَا عِندَ رَبِّي ۖ لَا يُجَلِّيهَا لِوَقْتِهَا إِلَّا هُوَ ۚ ثَقُلَتْ فِي السَّمَاوَاتِ وَالْأَرْضِ ۚ لَا تَأْتِيكُمْ إِلَّا بَغْتَةً ۗ يَسْأَلُونَكَ كَأَنَّكَ حَفِيٌّ عَنْهَا ۖ قُلْ إِنَّمَا عِلْمُهَا عِندَ اللَّهِ وَلَٰكِنَّ أَكْثَرَ النَّاسِ لَا يَعْلَمُونَ
“ఇంతకీ ఆ ఘడియ ఎప్పుడొస్తుందీ?' అని వారు నిన్ను ప్రళయం గురించి అడుగుతున్నారు కదూ! “ఆ జ్ఞానం మాత్రం నా ప్రభువు వద్దనే ఉంది. ఆ సమయం ఆసన్నమైనపుడు ఆయన మాత్రమే దాన్ని ప్రత్యక్షపరుస్తాడు. అది ఆకాశాలలోనూ, భూమిలోనూ మహా బరువైనది (విపత్కరమైన సంఘటన)గా ఉంటుంది. అది అకస్మాత్తుగానే మీపై వచ్చిపడుతుంది” అని (ఓ ప్రవక్తా!) వారికి చెప్పు. నీవు దాని గురించి పరిశోధన చేసి కనుగొన్నట్లే వారు నిన్ను అడుగుతున్నారు. “దాని జ్ఞానం కేవలం అల్లాహ్‌ వద్ద మాత్రమే ఉంది. కాని చాలా మంది ఈ విషయాన్ని తెలుసుకోరు” అని వారికి చెప్పు.
7:188  قُل لَّا أَمْلِكُ لِنَفْسِي نَفْعًا وَلَا ضَرًّا إِلَّا مَا شَاءَ اللَّهُ ۚ وَلَوْ كُنتُ أَعْلَمُ الْغَيْبَ لَاسْتَكْثَرْتُ مِنَ الْخَيْرِ وَمَا مَسَّنِيَ السُّوءُ ۚ إِنْ أَنَا إِلَّا نَذِيرٌ وَبَشِيرٌ لِّقَوْمٍ يُؤْمِنُونَ
(ఓ ప్రవక్తా! వారికి) చెప్పు: “అల్లాహ్‌ తలచినంత మాత్రమే తప్ప నేను సయితం నా కోసం లాభంగానీ, నష్టంగానీ చేకూర్చుకునే అధికారం నాకు లేదు. నాకే గనక అగోచర విషయాలు తెలిసివుంటే నేనెన్నో ప్రయోజనాలు పొంది ఉండేవాణ్ణి. ఏ నష్టమూ నాకు వాటిల్లేది కాదు. నిజానికి నేను విశ్వసించే వారికి హెచ్చరించేవాణ్ణి, శుభవార్తలు అందజేసేవాణ్ణి మాత్రమే.”
7:189  هُوَ الَّذِي خَلَقَكُم مِّن نَّفْسٍ وَاحِدَةٍ وَجَعَلَ مِنْهَا زَوْجَهَا لِيَسْكُنَ إِلَيْهَا ۖ فَلَمَّا تَغَشَّاهَا حَمَلَتْ حَمْلًا خَفِيفًا فَمَرَّتْ بِهِ ۖ فَلَمَّا أَثْقَلَت دَّعَوَا اللَّهَ رَبَّهُمَا لَئِنْ آتَيْتَنَا صَالِحًا لَّنَكُونَنَّ مِنَ الشَّاكِرِينَ
ఆ అల్లాహ్‌యే మిమ్మల్ని ఒకే ప్రాణి (వ్యక్తి) నుంచి పుట్టించాడు. మరి అతని నుండే అతని జంటను కూడా సృష్టించాడు - అతనా జంట ద్వారా ప్రశాంతతను పొందటానికి! ఆ తరువాత అతను తన సహధర్మచారిణితో సమాగమం జరపగా ఆమె ఒక తేలికైన భారం దాల్చింది (గర్భవతి అయింది). ఆమె ఆ భారాన్ని మోసుకుంటూ తిరిగేది. మరి భారం అధికమైనప్పుడు భార్యాభర్తలిరువురూ తమ ప్రభువైన అల్లాహ్‌ను, “నీవు గనక మాకు ఏ లోపమూ లేని బిడ్డను ప్రసాదిస్తే మేము నీకు తప్పకుండా కృతజ్ఞులమై ఉంటామ”ని ప్రార్థించసాగారు.
7:190  فَلَمَّا آتَاهُمَا صَالِحًا جَعَلَا لَهُ شُرَكَاءَ فِيمَا آتَاهُمَا ۚ فَتَعَالَى اللَّهُ عَمَّا يُشْرِكُونَ
మరి అల్లాహ్‌ వారికి (ఏ లోపమూ లేని) బిడ్డను ప్రసాదించగానే, ఆ 'ప్రసాదితం'లో వారిద్దరూ ఆయనకు భాగస్వాముల్ని కల్పించటం మొదలెట్టారు. వారు చేసే ఈ భాగస్వామ్య చేష్టలకు అల్లాహ్‌ అతీతుడు, ఉన్నతుడు.
7:191  أَيُشْرِكُونَ مَا لَا يَخْلُقُ شَيْئًا وَهُمْ يُخْلَقُونَ
ఏమిటీ, ఏ వస్తువునూ సృష్టించలేని వారినీ, వారే స్వయంగా ఒకరి చేత సృష్టించబడిన వారిని వీళ్లు (అల్లాహ్‌కు) భాగస్వాములుగా నిలబెడుతున్నారా?
7:192  وَلَا يَسْتَطِيعُونَ لَهُمْ نَصْرًا وَلَا أَنفُسَهُمْ يَنصُرُونَ
వారు వీళ్ళకు ఏ సహాయమూ చేయలేరు. కనీసం తమకు తాము కూడా సహాయం చేసుకోలేరు.
7:193  وَإِن تَدْعُوهُمْ إِلَى الْهُدَىٰ لَا يَتَّبِعُوكُمْ ۚ سَوَاءٌ عَلَيْكُمْ أَدَعَوْتُمُوهُمْ أَمْ أَنتُمْ صَامِتُونَ
ఒకవేళ మీరు వారిని సన్మార్గం వైపుకు పిలిస్తే వారు మీ మాట వినరు. మీరు వారిని పిలిచినా, మౌనం వహించినా ఒక్కటే.
7:194  إِنَّ الَّذِينَ تَدْعُونَ مِن دُونِ اللَّهِ عِبَادٌ أَمْثَالُكُمْ ۖ فَادْعُوهُمْ فَلْيَسْتَجِيبُوا لَكُمْ إِن كُنتُمْ صَادِقِينَ
మీరు అల్లాహ్‌ను వదలి ఎవరెవరిని మొరపెట్టుకుంటున్నారో వారంతా మీలాంటి దాసులే. మీరు మొరపెట్టుకుంటూనే ఉండండి. (ఈ బహుదైవోపాసనలో) మీరు గనక సత్యవంతులయితే వారు మీ మొరలను ఆలకించి వాటికి సమాధానం ఇవ్వాలి.
7:195  أَلَهُمْ أَرْجُلٌ يَمْشُونَ بِهَا ۖ أَمْ لَهُمْ أَيْدٍ يَبْطِشُونَ بِهَا ۖ أَمْ لَهُمْ أَعْيُنٌ يُبْصِرُونَ بِهَا ۖ أَمْ لَهُمْ آذَانٌ يَسْمَعُونَ بِهَا ۗ قُلِ ادْعُوا شُرَكَاءَكُمْ ثُمَّ كِيدُونِ فَلَا تُنظِرُونِ
ఏమిటి, వారు నడవగలగటానికి వారికేమయినా కాళ్లున్నాయా? వారు దేనినయినా పట్టుకోవటానికి వారికి చేతులున్నాయా? చూడగలగటానికి వారికి కళ్లున్నాయా? వినగలగటానికి వారికి చెవులున్నాయా? (ఓ ప్రవక్తా!) వారికి చెప్పు : “మీరు మీ భాగస్వాములందర్నీ పిలుచుకోండి. మరి మీరంతా కలసి నాకు కీడు కలిగించే వ్యూహాన్నీ రచించండి. నాకు కొద్దిపాటి గడువు కూడా ఇవ్వకండి.”
7:196  إِنَّ وَلِيِّيَ اللَّهُ الَّذِي نَزَّلَ الْكِتَابَ ۖ وَهُوَ يَتَوَلَّى الصَّالِحِينَ
“ఈ గ్రంథాన్ని అవతరింపజేసిన అల్లాహ్‌యే ముమ్మాటికీ నా సహాయకుడు. సజ్జనులైన దాసుల రక్షకుడు ఆయనే.”
7:197  وَالَّذِينَ تَدْعُونَ مِن دُونِهِ لَا يَسْتَطِيعُونَ نَصْرَكُمْ وَلَا أَنفُسَهُمْ يَنصُرُونَ
“కాగా; మీరు అల్లాహ్‌ను వదలి ఎవరిని పిలుస్తున్నారో వారు మీకు సహాయపడలేరు. తమ స్వయానికి కూడా వారు సహాయం చేసుకోలేరు.
7:198  وَإِن تَدْعُوهُمْ إِلَى الْهُدَىٰ لَا يَسْمَعُوا ۖ وَتَرَاهُمْ يَنظُرُونَ إِلَيْكَ وَهُمْ لَا يُبْصِرُونَ
“ఒకవేళ మీరు వారికేదయినా చెప్పటానికి పిలిచినా వారు మీ మాటను వినలేరు. వారు నిన్ను చూస్తున్నట్లుగానే నీకు కనిపిస్తుంది. కాని వాస్తవానికి వారసలు ఏమీ చూడలేరు.”
7:199  خُذِ الْعَفْوَ وَأْمُرْ بِالْعُرْفِ وَأَعْرِضْ عَنِ الْجَاهِلِينَ
(ప్రవక్తా!) మన్నింపుల వైఖరిని అవలంబించు. మంచిని ప్రబోధిస్తూ ఉండు. మూర్ఖులను పట్టించుకోకు.
7:200  وَإِمَّا يَنزَغَنَّكَ مِنَ الشَّيْطَانِ نَزْغٌ فَاسْتَعِذْ بِاللَّهِ ۚ إِنَّهُ سَمِيعٌ عَلِيمٌ
షైతాను తరఫు నుంచి ఏదైనా దుష్ప్రేరణ కలిగినట్లయితే అల్లాహ్‌ శరణు వేడుకో. నిశ్చయంగా ఆయన బాగా వినేవాడు, తెలిసినవాడూను.
7:201  إِنَّ الَّذِينَ اتَّقَوْا إِذَا مَسَّهُمْ طَائِفٌ مِّنَ الشَّيْطَانِ تَذَكَّرُوا فَإِذَا هُم مُّبْصِرُونَ
నిశ్చయంగా అల్లాహ్‌ భీతిపరులు (ముత్తఖీన్‌) తమకు ఎప్పుడైనా షైతాన్‌ తరఫు నుంచి చెడు ఆలోచన తట్టినప్పుడు వారు (తమ ప్రభువు యొక్క ఔన్నత్య) స్మరణలో నిమగ్నులై పోతారు. దాంతో వెంటనే వారికి కనువిప్పు కలుగుతుంది.
7:202  وَإِخْوَانُهُمْ يَمُدُّونَهُمْ فِي الْغَيِّ ثُمَّ لَا يُقْصِرُونَ
ఇక షైతానుల సోదరులను వారు మార్గవిహీనత వైపుకు లాక్కుపోతుంటారు. (వారిని భ్రష్టు పట్టించటంలో) ఏ లోటూ రానివ్వరు.
7:203  وَإِذَا لَمْ تَأْتِهِم بِآيَةٍ قَالُوا لَوْلَا اجْتَبَيْتَهَا ۚ قُلْ إِنَّمَا أَتَّبِعُ مَا يُوحَىٰ إِلَيَّ مِن رَّبِّي ۚ هَٰذَا بَصَائِرُ مِن رَّبِّكُمْ وَهُدًى وَرَحْمَةٌ لِّقَوْمٍ يُؤْمِنُونَ
నీవు వారి ముందు ఏదైనా మహిమను ప్రదర్శించకపోతే,”నువ్వీ మహిమను ఎందుకు తేలేదు?” అని వారంటారు. “నా ప్రభువు తరఫునుంచి నాకు పంపబడిన ఆదేశాన్ని మాత్రమే నేను అనుసరిస్తాను. విశ్వసించేవారికి ఇందులో (దివ్య ఖుర్‌ఆన్‌లో) మీ ప్రభువు తరఫు నుంచి ఎన్నో నిదర్శనాలున్నాయి. ఇది మార్గదర్శకత్వం మరియు కారుణ్యం “ అని ఓ ప్రవక్తా! వారికి తెలియజెయ్యి.
7:204  وَإِذَا قُرِئَ الْقُرْآنُ فَاسْتَمِعُوا لَهُ وَأَنصِتُوا لَعَلَّكُمْ تُرْحَمُونَ
దివ్య ఖుర్‌ఆన్‌ పారాయణం జరుగుతున్నప్పుడు దానిని శ్రద్ధగా వినండి, నిశ్శబ్దంగా ఉండండి. తద్వారా మీరు కరుణించబడవచ్చు.
7:205  وَاذْكُر رَّبَّكَ فِي نَفْسِكَ تَضَرُّعًا وَخِيفَةً وَدُونَ الْجَهْرِ مِنَ الْقَوْلِ بِالْغُدُوِّ وَالْآصَالِ وَلَا تَكُن مِّنَ الْغَافِلِينَ
నీవు నీ మనసులోనే - కడు వినమ్రతతో, భయంతో - నీ ప్రభువును స్మరించు. ఉదయం, సాయంత్రం బిగ్గరగా కాకుండా మెల్లగా నోటితో కూడా (స్మరించు). విస్మరించే వారిలో చేరిపోకు.
7:206  إِنَّ الَّذِينَ عِندَ رَبِّكَ لَا يَسْتَكْبِرُونَ عَنْ عِبَادَتِهِ وَيُسَبِّحُونَهُ وَلَهُ يَسْجُدُونَ ۩
నీ ప్రభువుకు చేరువలో ఉన్నవారు ఆయన ఆరాధన పట్ల గర్వాతిశయంతో మెలగరు. పైగా వారు (అణకువతో) ఆయన పవిత్రతను కొనియాడుతూ, ఆయన ముందు సాష్టాంగపడుతూ ఉంటారు.


ఈ తెలుగు ఖుర్ఆన్ శాంతి మార్గం పబ్లికేషన్ వారు ప్రచురించారు. వారి అనుమతితో ఈ వెబ్ పోర్టల్ పై వేయబడింది.