aip_quran
Translation

  العربية              తెలుగు  

1. సూరా అల్ ఫాతిహా
2. సూరా అల్ బఖర
3. సూరా ఆలి ఇమ్రాన్
4. సూరా అన్ నిసా
5. సూరా అల్ మాయిద
6. సూరా అల్ అన్ ఆమ్
7. సూరా అల్ ఆరాఫ్
8. సూరా అల్ అన్ ఫాల్
9. సూరా అత్ తౌబా
10. సూరా యూనుస్
11. సూరా హూద్
12. సూరా యూసుఫ్
13. సూరా ఆర్ రాద్
14. సూరా ఇబ్రహీం
15. సూరా అల్ హిజ్ర్
16. సూరా అన్ నహ్ల్
17. సూరా బనీ ఇస్రాయీల్
18. సూరా అల్ కహఫ్
19. సూరా మర్యం
20. సూరా తాహా
21. సూరా అల్ అంబియా
22. సూరా అల్ హజ్
23. సూరా అల్ మూ ‘మినూన్
24. సూరా అన్ నూర్
25. సూరా అల్ ఫుర్ఖాన్
26. సూరా ఆష్ షుఅరా
27. సూరా అన్ నమ్ల్
28. సూరా అల్ ఖసస్
29. సూరా అల్ అన్ కబూత్
30. సూరా ఆర్ రూమ్
31. సూరా లుక్మాన్
32. సూరా అస్ సజ్ ద హ్
33. సూరా అల్ ఆహ్ జాబ్
34. సూరా సబా
35. సూరా ఫాతిర్
36. సూరా యాసీన్
37. సూరా అస్ సాఫ్ఫాత్
38. సూరా సాద్
39. సూరా అజ్ జుమర్
40. సూరా అల్ మూమిన్
41. సూరా హామీమ్ అస్ సజ్ ద హ్
42. సూరా ఆష్ షూరా
43. సూరా అజ్ జుఖ్ రుఫ్
44. సూరా అద్ దుఖాన్
45. సూరా అల్ జాసియ హ్
46. సూరా అల్ ఆహ్ ఖాఫ్
47. సూరా ముహమ్మద్
48. సూరా అల్ ఫతహ్
49. సూరా అల్ హుజురాత్
50. సూరా ఖాఫ్
51. సూరా అజ్ జారియాత్
52. సూరా అత్ తూర్
53. సూరా అన్ నజ్మ్
54. సూరా అల్ ఖమర్
55. సూరా ఆర్ రహ్మాన్
56. సూరా వాఖియహ్
57. సూరా అల్ హదీద్
58. సూరా అల్ ముజాదల హ్
59. సూరా అల్ హష్ర్
60. సూరా అల్ ముమ్ తహిన హ్
61. సూరా అస్ సఫ్
62. సూరాఅల్ జుముఅ హ్
63. సూరా అల్ మునాఫిఖూన్
64. సూరా అత్ తగాబున్
65. సూరా అత్ తలాఖ్
66. సూరా అత్ తహ్రీం
67. సూరా అల్ ముల్క్
68. సూరా అల్ ఖలమ్
69. సూరా అల్ హఖ్ఖ
70. సూరా అల్ ముఆరిజ్
71. సూరా నూహ్
72. సూరా అల్ జిన్న్
73. సూరా అల్ ముజ్జమ్మిల్
74. సూరా అల్ ముద్దస్సిర్
75. సూరా అల్ ఖియామ హ్
76. సూరా అద్ దహ్ర్
77. సూరా అల్ ముర్సలాత్
78. సూరా అన్ నబా
79. సూరా అన్ నాజి ఆత్
80. సూరా అబస
81. సూరా అత్ తక్వీర్
82. సూరా అల్ ఇన్ ఫితార్
83. సూరాఅల్ ముతఫ్ఫిఫీన్
84. సూరా అల్ ఇన్ షి ఖాక్
85. సూరా అల్ బురూజ్
86. సూరా అత్ తారిఖ్
87. సూరా అల్ ఆలా
88. సూరా అల్ గాషియ హ్
89. సూరా అల్ ఫజ్ర్
90. సూరా అల్ బలద్
91. సూరా ఆష్ షమ్స్
92. సూరా అల్ లైల్
93. సూరా అజ్ జుహా
94. సూరా ఆలమ్ నష్ర్
95. సూరా అత్ తతీన్
96. సూరా అల్ అలఖ్
97. సూరా అల్ ఖద్ర్
98. సూరా అల్ బయ్యిన హ్
99. సూరా అజ్ జిలజాల్
100. సూరా అల్ ఆదియాత్
101. సూరా అల్ ఖారియ హ్
102. సూరా అత్ తకాసుర్
103. సూరా అల్ అస్ర్
104. సూరా అల్ హుమజా హ్
105. సూరా అల్ ఫీల్
106. సూరా ఖురైష్
107. సూరా అల్ మాఊ న్
108. సూరా అల్ కౌసర్
109. సూరా అల్ ఖాఫిరూన్
110. సూరా అన్ నస్ర్
111. సూరా అల్ లహబ్
112. సూరా అల్ ఇఖ్లాస్
113. సూరా అల్ ఫలఖ్
114. సూరా అన్ నాస్

68. సూరా అల్ ఖలమ్

68:1  ن ۚ وَالْقَلَمِ وَمَا يَسْطُرُونَ
నూన్ – కలము సాక్షిగా! వారు (దైవదూతలు) వ్రాసే వ్రాత సాక్షిగా!
68:2  مَا أَنتَ بِنِعْمَةِ رَبِّكَ بِمَجْنُونٍ
(ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహివ సల్లం) నీ ప్రభువు అనుగ్రహం వల్ల నీవు పిచ్చివాడవు కావు.
68:3  وَإِنَّ لَكَ لَأَجْرًا غَيْرَ مَمْنُونٍ
నిశ్చయంగా నీకు ఎన్నటికీ తరగని పుణ్యఫలం లభిస్తుంది.
68:4  وَإِنَّكَ لَعَلَىٰ خُلُقٍ عَظِيمٍ
ఇంకా, నీవు నైతికంగా అత్యున్నత స్థానంలో ఉన్నావు.
68:5  فَسَتُبْصِرُ وَيُبْصِرُونَ
కాబట్టి (త్వరలోనే) నీవూ చూస్తావు, వారూ చూసుకుంటారు,
68:6  بِأَييِّكُمُ الْمَفْتُونُ
మీలో మతి స్థిమితం లేనివారెవరో! (అందరూ చూస్తారు.)
68:7  إِنَّ رَبَّكَ هُوَ أَعْلَمُ بِمَن ضَلَّ عَن سَبِيلِهِ وَهُوَ أَعْلَمُ بِالْمُهْتَدِينَ
తన మార్గం నుండి తప్పిపోయిన వారెవరో నీ ప్రభువుకు బాగా తెలుసు. సన్మార్గం పొందిన వారెవరో కూడా ఆయనకు బాగా తెలుసు.
68:8  فَلَا تُطِعِ الْمُكَذِّبِينَ
కాబట్టి నువ్వు ధిక్కారుల మాట వినకు.
68:9  وَدُّوا لَوْ تُدْهِنُ فَيُدْهِنُونَ
నువ్వు కాస్త మెత్తబడితే, తాము కూడా మెతకవైఖరి అవలంబించవచ్చునని వారు కోరుతున్నారు.
68:10  وَلَا تُطِعْ كُلَّ حَلَّافٍ مَّهِينٍ
నువ్వు అదే పనిగా ప్రమాణాలు చేసే తుచ్చుని మాట వినకు.
68:11  هَمَّازٍ مَّشَّاءٍ بِنَمِيمٍ
– వాడు (ఎంతసేపటికీ) చులకనగా మాట్లాడతాడు, చాడీలు చెబుతాడు.
68:12  مَّنَّاعٍ لِّلْخَيْرِ مُعْتَدٍ أَثِيمٍ
మంచి పనులను అడ్డుకుంటాడు, బరితెగించిపోయే పాపాత్ముడు వాడు.
68:13  عُتُلٍّ بَعْدَ ذَٰلِكَ زَنِيمٍ
మిక్కిలి కర్కశుడు, వీటన్నింటికీ తోడు కళంకితుడు.
68:14  أَن كَانَ ذَا مَالٍ وَبَنِينَ
ఇంతకీ వాడి తలబిరుసుతనానికి కారణం వాడికి సిరిసంపదలు, పుత్ర సంతానం ఉండటమే. (కాబట్టి నువ్వు అతణ్ణి అనుసరించకు).
68:15  إِذَا تُتْلَىٰ عَلَيْهِ آيَاتُنَا قَالَ أَسَاطِيرُ الْأَوَّلِينَ
వాడి ముందు మా ఆయతులను పఠించినప్పుడు, “ఇవి పూర్వీకుల కట్టు కథలంటూ” తేలిగ్గా కొట్టిపారేస్తాడు.
68:16  سَنَسِمُهُ عَلَى الْخُرْطُومِ
ఇక మేము త్వరలోనే వాడి తొండం (ముక్కు)పై వాత వేస్తాము.
68:17  إِنَّا بَلَوْنَاهُمْ كَمَا بَلَوْنَا أَصْحَابَ الْجَنَّةِ إِذْ أَقْسَمُوا لَيَصْرِمُنَّهَا مُصْبِحِينَ
మేము తోటవారిని పరీక్షించినట్లే వీరిని (మక్కావారిని) కూడా పరీక్షించాము. అప్పుడా తోట యజమానులు “తెల్లవారే సరికల్లా ఆ తోట పండ్లను కోసుకుంటాము”అని ప్రతిన బూనారు.
68:18  وَلَا يَسْتَثْنُونَ
మరి వారు, “ఇన్ షా అల్లాహ్ (అల్లాహ్ తలచినట్లయితే)” అని అనలేదు.
68:19  فَطَافَ عَلَيْهَا طَائِفٌ مِّن رَّبِّكَ وَهُمْ نَائِمُونَ
అంతే! వారు నిద్రపోతుండగానే నీ ప్రభువు తరఫున ఒక ఆపద దాన్ని చుట్టుముట్టి పోయింది.
68:20  فَأَصْبَحَتْ كَالصَّرِيمِ
అంతే, ఆ తోట కోతకోసిన చేను మాదిరిగా అయిపోయింది.
68:21  فَتَنَادَوْا مُصْبِحِينَ
తెల్లవారగానే వారు ఒండొకరిని పిలవసాగారు.
68:22  أَنِ اغْدُوا عَلَىٰ حَرْثِكُمْ إِن كُنتُمْ صَارِمِينَ
“పండ్లు కోసుకోవాలనే ఉంటే మీ పొలానికి ఉదయం పెందలాడే పదండి” (అని చెప్పారు).
68:23  فَانطَلَقُوا وَهُمْ يَتَخَافَتُونَ
మరి వారు మెల్లిగా ఇలా మాట్లాడుకుంటూపోయారు.
68:24  أَن لَّا يَدْخُلَنَّهَا الْيَوْمَ عَلَيْكُم مِّسْكِينٌ
“ఈ రోజు ఏ బీదవాడు కూడా మీ వద్దకు జొరబడి రాకూడదు సుమా!”
68:25  وَغَدَوْا عَلَىٰ حَرْدٍ قَادِرِينَ
ఆ విధంగా మితిమీరిన ధీమాతో తెలతెలవారుతుండగా వారు గబా గబా అక్కడికి చేరుకున్నారు.
68:26  فَلَمَّا رَأَوْهَا قَالُوا إِنَّا لَضَالُّونَ
కాని తీరా తోటను చూసినప్పుడు “నిశ్చయంగా మనం దారి తప్పి వచ్చాం” అన్నారు.
68:27  بَلْ نَحْنُ مَحْرُومُونَ
“కాదు, కాదు. మనం సర్వమూ కోల్పోయాం” అని పలికారు.
68:28  قَالَ أَوْسَطُهُمْ أَلَمْ أَقُل لَّكُمْ لَوْلَا تُسَبِّحُونَ
వారందరిలో కాస్త మంచివాడు “మీరు అల్లాహ్ పవిత్రతను ఎందుకు కొనియాడరు?! అని నేను మీతో అనలేదా?” అన్నాడు.
68:29  قَالُوا سُبْحَانَ رَبِّنَا إِنَّا كُنَّا ظَالِمِينَ
అప్పుడు వారందరూ (తేరుకుని), “మన ప్రభువు పరమ పవిత్రుడు. నిజానికి మనమే దుర్మార్గులం” అని పలికారు.
68:30  فَأَقْبَلَ بَعْضُهُمْ عَلَىٰ بَعْضٍ يَتَلَاوَمُونَ
ఆ తరువాత వారు ఒండొకరి వైపు తిరిగి పరస్పరం నిందించుకోసాగారు.
68:31  قَالُوا يَا وَيْلَنَا إِنَّا كُنَّا طَاغِينَ
“మా పాడుగాను! నిశ్చయంగా మనం హద్దుమీరి పోయాము.”
68:32  عَسَىٰ رَبُّنَا أَن يُبْدِلَنَا خَيْرًا مِّنْهَا إِنَّا إِلَىٰ رَبِّنَا رَاغِبُونَ
“మన ప్రభువు మనకు ఈ తోట స్థానంలో ఇంతకన్నా మంచి తోటను ప్రసాదించవచ్చు. కాబట్టి ఇప్పుడు మనం మన ప్రభువు వైపునకే మరలుదాం” అని అన్నారు.
68:33  كَذَٰلِكَ الْعَذَابُ ۖ وَلَعَذَابُ الْآخِرَةِ أَكْبَرُ ۚ لَوْ كَانُوا يَعْلَمُونَ
ఇలాగే వచ్చిపడుతుంది విపత్తు. పరలోక విపత్తు అయితే ఇంతకన్నా పెద్దది. వారు దీన్ని తెలుసుకుంటే ఎంత బావుండు!
68:34  إِنَّ لِلْمُتَّقِينَ عِندَ رَبِّهِمْ جَنَّاتِ النَّعِيمِ
నిశ్చయంగా దైవభీతి పరాయణుల కోసం వారి ప్రభువు దగ్గర అనుగ్రహభరితమైన స్వర్గ వనాలున్నాయి.
68:35  أَفَنَجْعَلُ الْمُسْلِمِينَ كَالْمُجْرِمِينَ
ఏమిటి? మేము దైవవిధేయులను (ముస్లిములను) అపరాధుల సరసన నిలబెడతామా?
68:36  مَا لَكُمْ كَيْفَ تَحْكُمُونَ
అసలు మీకేమయింది? ఈ విధంగా ఎలా నిర్ణయించుకుంటున్నారు?
68:37  أَمْ لَكُمْ كِتَابٌ فِيهِ تَدْرُسُونَ
ఏమిటీ, మీ వద్ద మీరు చదివే పుస్తకం ఏదైనా ఉందా?
68:38  إِنَّ لَكُمْ فِيهِ لَمَا تَخَيَّرُونَ
అందులో మీరు కోరినదల్లా మీకు దొరుకుతుందని రాసి ఉందా?
68:39  أَمْ لَكُمْ أَيْمَانٌ عَلَيْنَا بَالِغَةٌ إِلَىٰ يَوْمِ الْقِيَامَةِ ۙ إِنَّ لَكُمْ لَمَا تَحْكُمُونَ
లేక మీరు తీర్మానించుకున్నదల్లా మీకు లభ్యమయ్యేట్టు, ప్రళయదినం వరకూ ఉండే ప్రమాణాలు గాని మీరు మా నుండి తీసుకున్నారా?
68:40  سَلْهُمْ أَيُّهُم بِذَٰلِكَ زَعِيمٌ
వారిలో ఎవరు ఈ విషయానికి బాధ్యులుగా ఉంటారో అడుగు.
68:41  أَمْ لَهُمْ شُرَكَاءُ فَلْيَأْتُوا بِشُرَكَائِهِمْ إِن كَانُوا صَادِقِينَ
ఏమిటి, వారి భాగస్థులుగాని ఎవరైనా ఉన్నారా? (ఒకవేళ ఉంటే), వారు సత్యవంతులైనట్లయితే తమ తమ భాగస్వాములను తీసుకురావాలి.
68:42  يَوْمَ يُكْشَفُ عَن سَاقٍ وَيُدْعَوْنَ إِلَى السُّجُودِ فَلَا يَسْتَطِيعُونَ
ఏ రోజున పిక్క విప్పబడుతుందో, అప్పుడు వారు సాష్టాంగ ప్రణామం (సజ్దా) కొరకు పిలవబడతారు. కాని వారు సాష్టాంగ పడలేరు.
68:43  خَاشِعَةً أَبْصَارُهُمْ تَرْهَقُهُمْ ذِلَّةٌ ۖ وَقَدْ كَانُوا يُدْعَوْنَ إِلَى السُّجُودِ وَهُمْ سَالِمُونَ
వారి చూపులు క్రిందికి వంగి ఉంటాయి. అవమానం వారిని క్రమ్ముకుంటూ ఉంటుంది. వారు మంచి స్థితిలో (క్షేమంగా) ఉన్నప్పుడు కూడా సాష్టాంగ ప్రణామాల కోసం పిలువబడేవారు.
68:44  فَذَرْنِي وَمَن يُكَذِّبُ بِهَٰذَا الْحَدِيثِ ۖ سَنَسْتَدْرِجُهُم مِّنْ حَيْثُ لَا يَعْلَمُونَ
సరే! ఇక నన్నూ, ఈ విషయాన్ని ధిక్కరించేవారిని వదలి పెట్టు. మేము వారిని, వారికి ఏ మాత్రం తట్టని రీతిలో క్రమ క్రమంగా (పతనం వైపు) లాగుతూ పోతున్నాము.
68:45  وَأُمْلِي لَهُمْ ۚ إِنَّ كَيْدِي مَتِينٌ
నేను వారికి కొంత గడువు ఇస్తాను. నిశ్చయంగా నా వ్యూహం చాలా గట్టిది.
68:46  أَمْ تَسْأَلُهُمْ أَجْرًا فَهُم مِّن مَّغْرَمٍ مُّثْقَلُونَ
(ఓ ప్రవక్తా!) నువ్వు వారి దగ్గర ఏదన్నా వేతనం అడుగుతున్నావా, మరి దాని భారంతో వారు కృంగిపోతున్నారా?
68:47  أَمْ عِندَهُمُ الْغَيْبُ فَهُمْ يَكْتُبُونَ
పోనీ, వారి వద్ద రహస్య జ్ఞానం ఉందా? తద్వారా వారు లిఖిస్తున్నారా?
68:48  فَاصْبِرْ لِحُكْمِ رَبِّكَ وَلَا تَكُن كَصَاحِبِ الْحُوتِ إِذْ نَادَىٰ وَهُوَ مَكْظُومٌ
కనుక (ఓ ప్రవక్తా!) నీవు నీ ప్రభువు నిర్ణయం జరిగేవరకూ ఓపికపట్టు. చేపవాని మాదిరిగా అయిపోకు. అప్పుడతను దుఖితుడై మమ్మల్ని మొర పెట్టుకున్నాడు.
68:49  لَّوْلَا أَن تَدَارَكَهُ نِعْمَةٌ مِّن رَّبِّهِ لَنُبِذَ بِالْعَرَاءِ وَهُوَ مَذْمُومٌ
అతని ప్రభువు అనుగ్రహమే గనక అతనికి తోడ్పడకుండా ఉంటే నిశ్చయంగా అతను నిందార్హ స్థితిలో, కటిక మైదానంలోకి విసిరివేయబడేవాడు.
68:50  فَاجْتَبَاهُ رَبُّهُ فَجَعَلَهُ مِنَ الصَّالِحِينَ
అయితే అతని ప్రభువు అతణ్ణి (మళ్ళి) ఎన్నుకున్నాడు. అతణ్ణి సజ్జనులలో చేర్చాడు.
68:51  وَإِن يَكَادُ الَّذِينَ كَفَرُوا لَيُزْلِقُونَكَ بِأَبْصَارِهِمْ لَمَّا سَمِعُوا الذِّكْرَ وَيَقُولُونَ إِنَّهُ لَمَجْنُونٌ
ఈ అవిశ్వాసులు ఖుర్ఆన్ ను విన్నప్పుడల్లా తమ వాడి చూపులతో నిన్ను జారించి పడవేసినట్లే ఉంటారు. ఖచ్చితంగా ఇతడు పిచ్చివాడే” అని అంటారు.
68:52  وَمَا هُوَ إِلَّا ذِكْرٌ لِّلْعَالَمِينَ
నిజానికి ఇది (ఈ ఖుర్ఆన్) సకల లోకాల వారికి ఆసాంతం హితబోధిని.


ఈ తెలుగు ఖుర్ఆన్ శాంతి మార్గం పబ్లికేషన్ వారు ప్రచురించారు. వారి అనుమతితో ఈ వెబ్ పోర్టల్ పై వేయబడింది.