aip_quran
Translation

  العربية              తెలుగు  

1. సూరా అల్ ఫాతిహా
2. సూరా అల్ బఖర
3. సూరా ఆలి ఇమ్రాన్
4. సూరా అన్ నిసా
5. సూరా అల్ మాయిద
6. సూరా అల్ అన్ ఆమ్
7. సూరా అల్ ఆరాఫ్
8. సూరా అల్ అన్ ఫాల్
9. సూరా అత్ తౌబా
10. సూరా యూనుస్
11. సూరా హూద్
12. సూరా యూసుఫ్
13. సూరా ఆర్ రాద్
14. సూరా ఇబ్రహీం
15. సూరా అల్ హిజ్ర్
16. సూరా అన్ నహ్ల్
17. సూరా బనీ ఇస్రాయీల్
18. సూరా అల్ కహఫ్
19. సూరా మర్యం
20. సూరా తాహా
21. సూరా అల్ అంబియా
22. సూరా అల్ హజ్
23. సూరా అల్ మూ ‘మినూన్
24. సూరా అన్ నూర్
25. సూరా అల్ ఫుర్ఖాన్
26. సూరా ఆష్ షుఅరా
27. సూరా అన్ నమ్ల్
28. సూరా అల్ ఖసస్
29. సూరా అల్ అన్ కబూత్
30. సూరా ఆర్ రూమ్
31. సూరా లుక్మాన్
32. సూరా అస్ సజ్ ద హ్
33. సూరా అల్ ఆహ్ జాబ్
34. సూరా సబా
35. సూరా ఫాతిర్
36. సూరా యాసీన్
37. సూరా అస్ సాఫ్ఫాత్
38. సూరా సాద్
39. సూరా అజ్ జుమర్
40. సూరా అల్ మూమిన్
41. సూరా హామీమ్ అస్ సజ్ ద హ్
42. సూరా ఆష్ షూరా
43. సూరా అజ్ జుఖ్ రుఫ్
44. సూరా అద్ దుఖాన్
45. సూరా అల్ జాసియ హ్
46. సూరా అల్ ఆహ్ ఖాఫ్
47. సూరా ముహమ్మద్
48. సూరా అల్ ఫతహ్
49. సూరా అల్ హుజురాత్
50. సూరా ఖాఫ్
51. సూరా అజ్ జారియాత్
52. సూరా అత్ తూర్
53. సూరా అన్ నజ్మ్
54. సూరా అల్ ఖమర్
55. సూరా ఆర్ రహ్మాన్
56. సూరా వాఖియహ్
57. సూరా అల్ హదీద్
58. సూరా అల్ ముజాదల హ్
59. సూరా అల్ హష్ర్
60. సూరా అల్ ముమ్ తహిన హ్
61. సూరా అస్ సఫ్
62. సూరాఅల్ జుముఅ హ్
63. సూరా అల్ మునాఫిఖూన్
64. సూరా అత్ తగాబున్
65. సూరా అత్ తలాఖ్
66. సూరా అత్ తహ్రీం
67. సూరా అల్ ముల్క్
68. సూరా అల్ ఖలమ్
69. సూరా అల్ హఖ్ఖ
70. సూరా అల్ ముఆరిజ్
71. సూరా నూహ్
72. సూరా అల్ జిన్న్
73. సూరా అల్ ముజ్జమ్మిల్
74. సూరా అల్ ముద్దస్సిర్
75. సూరా అల్ ఖియామ హ్
76. సూరా అద్ దహ్ర్
77. సూరా అల్ ముర్సలాత్
78. సూరా అన్ నబా
79. సూరా అన్ నాజి ఆత్
80. సూరా అబస
81. సూరా అత్ తక్వీర్
82. సూరా అల్ ఇన్ ఫితార్
83. సూరాఅల్ ముతఫ్ఫిఫీన్
84. సూరా అల్ ఇన్ షి ఖాక్
85. సూరా అల్ బురూజ్
86. సూరా అత్ తారిఖ్
87. సూరా అల్ ఆలా
88. సూరా అల్ గాషియ హ్
89. సూరా అల్ ఫజ్ర్
90. సూరా అల్ బలద్
91. సూరా ఆష్ షమ్స్
92. సూరా అల్ లైల్
93. సూరా అజ్ జుహా
94. సూరా ఆలమ్ నష్ర్
95. సూరా అత్ తతీన్
96. సూరా అల్ అలఖ్
97. సూరా అల్ ఖద్ర్
98. సూరా అల్ బయ్యిన హ్
99. సూరా అజ్ జిలజాల్
100. సూరా అల్ ఆదియాత్
101. సూరా అల్ ఖారియ హ్
102. సూరా అత్ తకాసుర్
103. సూరా అల్ అస్ర్
104. సూరా అల్ హుమజా హ్
105. సూరా అల్ ఫీల్
106. సూరా ఖురైష్
107. సూరా అల్ మాఊ న్
108. సూరా అల్ కౌసర్
109. సూరా అల్ ఖాఫిరూన్
110. సూరా అన్ నస్ర్
111. సూరా అల్ లహబ్
112. సూరా అల్ ఇఖ్లాస్
113. సూరా అల్ ఫలఖ్
114. సూరా అన్ నాస్

65. సూరా అత్ తలాఖ్

65:1  يَا أَيُّهَا النَّبِيُّ إِذَا طَلَّقْتُمُ النِّسَاءَ فَطَلِّقُوهُنَّ لِعِدَّتِهِنَّ وَأَحْصُوا الْعِدَّةَ ۖ وَاتَّقُوا اللَّهَ رَبَّكُمْ ۖ لَا تُخْرِجُوهُنَّ مِن بُيُوتِهِنَّ وَلَا يَخْرُجْنَ إِلَّا أَن يَأْتِينَ بِفَاحِشَةٍ مُّبَيِّنَةٍ ۚ وَتِلْكَ حُدُودُ اللَّهِ ۚ وَمَن يَتَعَدَّ حُدُودَ اللَّهِ فَقَدْ ظَلَمَ نَفْسَهُ ۚ لَا تَدْرِي لَعَلَّ اللَّهَ يُحْدِثُ بَعْدَ ذَٰلِكَ أَمْرًا
ఓ ప్రవక్తా! (నీ అనుచర సమాజానికి చెప్పు) మీరు మీ స్త్రీలకు విడాకులు ఇస్తున్నప్పుడు వారి గడువు (ఇద్దత్) ప్రకారం విడాకులివ్వండి. ‘గడువు’ (రుతువు)ను లెక్కిస్తూ ఉండండి. మీ ప్రభువైన అల్లాహ్ కు భయపడుతూ ఉండండి. మీరు వారిని వారి ఇండ్ల నుండి గెంటివేయకండి, వారు సయితం వెళ్లిపోకూడదు. ఒకవేళ వారు బాహాటంగా ఏదైనా నీతిబాహ్యమైన చేష్టకు ఒడిగడితే (అప్పుడు వెళ్ళగొట్టవచ్చు). ఇవి అల్లాహ్ నిర్ధారించిన హద్దులు. ఎవరైతే అల్లాహ్ విధించిన హద్దులను అతిక్రమిస్తాడో అతడు తన స్వయానికే అన్యాయం చేసుకున్నవాడవుతాడు. నీకు తెలీదు – బహుశా అల్లాహ్ దీని తరువాత ఏదైనా కొత్త పరిస్థితిని కల్పిస్తాడేమో!
65:2  فَإِذَا بَلَغْنَ أَجَلَهُنَّ فَأَمْسِكُوهُنَّ بِمَعْرُوفٍ أَوْ فَارِقُوهُنَّ بِمَعْرُوفٍ وَأَشْهِدُوا ذَوَيْ عَدْلٍ مِّنكُمْ وَأَقِيمُوا الشَّهَادَةَ لِلَّهِ ۚ ذَٰلِكُمْ يُوعَظُ بِهِ مَن كَانَ يُؤْمِنُ بِاللَّهِ وَالْيَوْمِ الْآخِرِ ۚ وَمَن يَتَّقِ اللَّهَ يَجْعَل لَّهُ مَخْرَجًا
మరి ఆ స్త్రీలు తమ గడువు (ఇద్దత్)కు చేరుకున్నప్పుడు వారిని ఉత్తమ రీతిలో మీ వివాహబంధంలోనైనా ఉంచుకోండి. లేదంటే ఉత్తమరీతిలో వారిని వేర్పరచటమైనా చేయండి. మీలోని న్యాయశీలురైన ఇద్దరు వ్యక్తుల్ని సాక్షులుగా పెట్టుకోండి. అల్లాహ్ కొరకు సరైన సాక్ష్యాన్ని నెలకొల్పండి. అల్లాహ్ ను, అంతిమదినాన్ని విశ్వసించేవారికి ఇందు మూలంగా ఉపదేశించబడుతోంది. ఎవడైతే అల్లాహ్ కు భయపడుతూ మసలుకుంటాడో అతనికి అల్లాహ్ (ఈ సంక్షోభం నుండి) బయటపడే మార్గం కల్పిస్తాడు.
65:3  وَيَرْزُقْهُ مِنْ حَيْثُ لَا يَحْتَسِبُ ۚ وَمَن يَتَوَكَّلْ عَلَى اللَّهِ فَهُوَ حَسْبُهُ ۚ إِنَّ اللَّهَ بَالِغُ أَمْرِهِ ۚ قَدْ جَعَلَ اللَّهُ لِكُلِّ شَيْءٍ قَدْرًا
అతను ఊహించనైనాలేని చోటు నుండి అతనికి ఉపాధిని సమకూరుస్తాడు. అల్లాహ్ పై భారం మోపిన వానికి అల్లాహ్ యే చాలు. అల్లాహ్ తన కార్యాన్ని చేసి తీరుతాడు. అల్లాహ్ ప్రతి విషయానికీ ఒక లెక్కను నిర్ధారించాడు.
65:4  وَاللَّائِي يَئِسْنَ مِنَ الْمَحِيضِ مِن نِّسَائِكُمْ إِنِ ارْتَبْتُمْ فَعِدَّتُهُنَّ ثَلَاثَةُ أَشْهُرٍ وَاللَّائِي لَمْ يَحِضْنَ ۚ وَأُولَاتُ الْأَحْمَالِ أَجَلُهُنَّ أَن يَضَعْنَ حَمْلَهُنَّ ۚ وَمَن يَتَّقِ اللَّهَ يَجْعَل لَّهُ مِنْ أَمْرِهِ يُسْرًا
మీ స్త్రీలలో ముట్టుపై ఆశ వదులుకున్న వారి విషయంలో మీకేదైనా సందేహముంటే, వారి గడువు మూడు నెలలు. రజస్వల (రుతుస్రావం మొదలు) కాని వారి గడువు కూడా అంతే. గర్భవతుల గడువు వారి ప్రసవం అయ్యేవరకు ఉంటుంది. ఎవడు అల్లాహ్ కు భయపడతాడో అతనికి అల్లాహ్ అతని వ్యవహారంలో అన్ని విధాలా సౌలభ్యం కల్పిస్తాడు.
65:5  ذَٰلِكَ أَمْرُ اللَّهِ أَنزَلَهُ إِلَيْكُمْ ۚ وَمَن يَتَّقِ اللَّهَ يُكَفِّرْ عَنْهُ سَيِّئَاتِهِ وَيُعْظِمْ لَهُ أَجْرًا
ఇది అల్లాహ్ ఆజ్ఞ. దీన్ని ఆయన మీ వైపు అవతరింపజేశాడు. ఎవడు అల్లాహ్ కు భయపడతాడో అతని పాపాలను అల్లాహ్ అతని నుండి రూపుమాపుతాడు. అతనికి గొప్ప పుణ్యఫలాన్ని వొసగుతాడు.
65:6  أَسْكِنُوهُنَّ مِنْ حَيْثُ سَكَنتُم مِّن وُجْدِكُمْ وَلَا تُضَارُّوهُنَّ لِتُضَيِّقُوا عَلَيْهِنَّ ۚ وَإِن كُنَّ أُولَاتِ حَمْلٍ فَأَنفِقُوا عَلَيْهِنَّ حَتَّىٰ يَضَعْنَ حَمْلَهُنَّ ۚ فَإِنْ أَرْضَعْنَ لَكُمْ فَآتُوهُنَّ أُجُورَهُنَّ ۖ وَأْتَمِرُوا بَيْنَكُم بِمَعْرُوفٍ ۖ وَإِن تَعَاسَرْتُمْ فَسَتُرْضِعُ لَهُ أُخْرَىٰ
మీ స్థోమత మేరకు మీరు ఉండే చోటే (విడాకులు పొందిన) ఆ మహిళలను కూడా ఉండనివ్వండి. వారిని ఇబ్బందులపాలు చేసే ఉద్దేశంతో బాధించకండి. ఒకవేళ వారు గర్భవతులై ఉంటే, వారు శిశువును కనే వరకు వారికి ఖర్చులు ఇస్తూ ఉండండి. ఆ తరువాత వారు – మీ అభ్యర్ధన పై – బిడ్డకు పాలిచ్చినట్లయితే వారికి వారి ప్రతిఫలాన్ని ముట్టజెప్పండి. ధర్మానుసారం పరస్పరం సంప్రదించుకోండి. ఒకవేళ మీరు పరస్పరం గొడవపడినట్లయితే అతని కోరికపై మరొకామె బిడ్డకు పాలుపడుతుంది.
65:7  لِيُنفِقْ ذُو سَعَةٍ مِّن سَعَتِهِ ۖ وَمَن قُدِرَ عَلَيْهِ رِزْقُهُ فَلْيُنفِقْ مِمَّا آتَاهُ اللَّهُ ۚ لَا يُكَلِّفُ اللَّهُ نَفْسًا إِلَّا مَا آتَاهَا ۚ سَيَجْعَلُ اللَّهُ بَعْدَ عُسْرٍ يُسْرًا
స్థోమత ఉన్నవాడు తన స్థోమతకు తగ్గట్టుగా ఖర్చుచేయాలి. మరెవరికయితే అతని ఉపాధి కుదించబడిందో, అతను అల్లాహ్ తనకు ప్రసాదించిన దానిలో నుంచి (తన స్థాయికి తగ్గట్టుగానే) ఖర్చుపెట్టాలి. అల్లాహ్ ఏ ప్రాణిపైనా దానికి ఇచ్చిన దానికంటే ఎక్కువ భారం మోపడు. అల్లాహ్ ఇబ్బందుల తరువాత సౌలభ్యాన్ని కూడా కల్పిస్తాడు.
65:8  وَكَأَيِّن مِّن قَرْيَةٍ عَتَتْ عَنْ أَمْرِ رَبِّهَا وَرُسُلِهِ فَحَاسَبْنَاهَا حِسَابًا شَدِيدًا وَعَذَّبْنَاهَا عَذَابًا نُّكْرًا
ఎన్నో జనపదాలవారు తమ ప్రభువు ఆజ్ఞపట్ల, ఆయన ప్రవక్తల పట్ల తిరుగుబాటు ధోరణిని అవలంబించిన కారణంగా మేము కూడా వారి నుండి కటినంగా లెక్క తీసుకున్నాము. కానరాని రీతిలో వారిని దెబ్బతీశాము.
65:9  فَذَاقَتْ وَبَالَ أَمْرِهَا وَكَانَ عَاقِبَةُ أَمْرِهَا خُسْرًا
అంతే! వారు తమ కర్మల దుష్ఫలితాన్ని చవిచూశారు. చివరకు వారికి మిగిలింది తీవ్రనష్టమే.
65:10  أَعَدَّ اللَّهُ لَهُمْ عَذَابًا شَدِيدًا ۖ فَاتَّقُوا اللَّهَ يَا أُولِي الْأَلْبَابِ الَّذِينَ آمَنُوا ۚ قَدْ أَنزَلَ اللَّهُ إِلَيْكُمْ ذِكْرًا
వారి కోసం అల్లాహ్ కటినమైన శిక్షను సిద్ధపరచి ఉంచాడు. కనుక విశ్వసించిన ఓ విజ్ఞులారా! అల్లాహ్ కు భయపడండి. నిశ్చయంగా అల్లాహ్ మీ వైపు హితబోధను పంపాడు.
65:11  رَّسُولًا يَتْلُو عَلَيْكُمْ آيَاتِ اللَّهِ مُبَيِّنَاتٍ لِّيُخْرِجَ الَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ مِنَ الظُّلُمَاتِ إِلَى النُّورِ ۚ وَمَن يُؤْمِن بِاللَّهِ وَيَعْمَلْ صَالِحًا يُدْخِلْهُ جَنَّاتٍ تَجْرِي مِن تَحْتِهَا الْأَنْهَارُ خَالِدِينَ فِيهَا أَبَدًا ۖ قَدْ أَحْسَنَ اللَّهُ لَهُ رِزْقًا
(అనగా) అల్లాహ్ యెక్క స్పష్టమైన వాక్యాలను (ఆదేశాలను) చదివి వినిపించి, విశ్వసించి సత్కార్యాలు చేసినవారిని ఆయన కారు చీకట్లలో నుండి వెలుగులోనికి తీసుకువచ్చేందుకు ఒక ప్రవక్తను పంపాడు. మరెవరైతే అల్లాహ్ ను విశ్వసించి సదాచరణ చేస్తారో వారిని అల్లాహ్ క్రింద కాలువలు ప్రవహించే (స్వర్గ) వనాలలో ప్రవేశింపజేస్తాడు. వాటిలో వారు కలకాలం ఉంటారు. నిశ్చయంగా అల్లాహ్ అతనికి అత్యుత్తమమైన ఉపాధిని వొసగాడు.
65:12  اللَّهُ الَّذِي خَلَقَ سَبْعَ سَمَاوَاتٍ وَمِنَ الْأَرْضِ مِثْلَهُنَّ يَتَنَزَّلُ الْأَمْرُ بَيْنَهُنَّ لِتَعْلَمُوا أَنَّ اللَّهَ عَلَىٰ كُلِّ شَيْءٍ قَدِيرٌ وَأَنَّ اللَّهَ قَدْ أَحَاطَ بِكُلِّ شَيْءٍ عِلْمًا
అల్లాహ్ – ఆయనే సప్తాకాశాలను, అలాంటివే భూములను సృష్టించినవాడు. ఆయన ఆజ్ఞ వాటి మధ్య అవతరిస్తుంది – అల్లాహ్ అన్నింటిపై అధికారం కలిగి ఉన్నాడనీ, ఇంకా అల్లాహ్ తన జ్ఞానంతో అన్నింటినీ పరివేష్టించి ఉన్నాడని మీరు తెలుసుకోవటానికి.


ఈ తెలుగు ఖుర్ఆన్ శాంతి మార్గం పబ్లికేషన్ వారు ప్రచురించారు. వారి అనుమతితో ఈ వెబ్ పోర్టల్ పై వేయబడింది.