Translation
| 64. సూరా అత్ తగాబున్ 64:1 يُسَبِّحُ لِلَّهِ مَا فِي السَّمَاوَاتِ وَمَا فِي الْأَرْضِ ۖ لَهُ الْمُلْكُ وَلَهُ الْحَمْدُ ۖ وَهُوَ عَلَىٰ كُلِّ شَيْءٍ قَدِيرٌ భూమ్యాకాశాలలో ఉన్నవన్నీ అల్లాహ్ పవిత్రతను కొనియాడుతున్నాయి. సర్వసత్తాధికారం ఆయనదే. స్తోత్రం ఆయనకే శోభాయమానం. అయన అన్నింటిపై అధికారం కలవాడు. 64:2 هُوَ الَّذِي خَلَقَكُمْ فَمِنكُمْ كَافِرٌ وَمِنكُم مُّؤْمِنٌ ۚ وَاللَّهُ بِمَا تَعْمَلُونَ بَصِيرٌ మిమ్మల్ని సృష్టించినవాడు ఆయనే. మరి మీలో కొందరు అవిశ్వాసులుగా ఉంటె మరి కొందరు విశ్వాసులుగా ఉన్నారు. మీరు చేసేదంతా అల్లాహ్ చూస్తూనే ఉన్నాడు. 64:3 خَلَقَ السَّمَاوَاتِ وَالْأَرْضَ بِالْحَقِّ وَصَوَّرَكُمْ فَأَحْسَنَ صُوَرَكُمْ ۖ وَإِلَيْهِ الْمَصِيرُ అయన ఆకాశాలనూ, భూమినీ (న్యాయంతో), సమతూకం (సత్యం)తో సృష్టించాడు. మరి (అయన) మీ రూపు రేఖలను తీర్చిదిద్దాడు. మీకు చాల మంచి రూపమిచ్చాడు. కడకు చేరుకోవలసింది అయన వద్దకే. 64:4 يَعْلَمُ مَا فِي السَّمَاوَاتِ وَالْأَرْضِ وَيَعْلَمُ مَا تُسِرُّونَ وَمَا تُعْلِنُونَ ۚ وَاللَّهُ عَلِيمٌ بِذَاتِ الصُّدُورِ భూమ్యాకాశాలలో ఉండే వాటన్నింటి గురించి ఆయనకు తెలుసు. మీరు దాచేదీ బహిర్గతం చేసేదీ (అంతా) ఆయనకు తెలుసు. అల్లాహ్ గుండెల్లోని గుట్టును సయితం ఎరిగినవాడు. 64:5 أَلَمْ يَأْتِكُمْ نَبَأُ الَّذِينَ كَفَرُوا مِن قَبْلُ فَذَاقُوا وَبَالَ أَمْرِهِمْ وَلَهُمْ عَذَابٌ أَلِيمٌ ఏమిటి, ఇంతకుమునుపు తిరస్కార వైఖరికి పాల్పడిన వారి సమాచారం మీకు చేరలేదా? వారు తమ ఆగడాల దుష్పరిణామాన్ని చవిచూశారు. వారి కొరకు బాధాకరమైన శిక్ష ఉన్నది. 64:6 ذَٰلِكَ بِأَنَّهُ كَانَت تَّأْتِيهِمْ رُسُلُهُم بِالْبَيِّنَاتِ فَقَالُوا أَبَشَرٌ يَهْدُونَنَا فَكَفَرُوا وَتَوَلَّوا ۚ وَّاسْتَغْنَى اللَّهُ ۚ وَاللَّهُ غَنِيٌّ حَمِيدٌ ఎందుకంటే, వారి దగ్గరకు వారి ప్రవక్తలు స్పష్టమైన నిదర్శనాలను తీసుకువచ్చినప్పుడు, “ఏమిటీ, మానవమాత్రులు మాకు మార్గదర్శకత్వం వహిస్తారా?” అని వారు (చులకనగా) మాట్లాడారు. ఆ విధంగా వారు (సత్యాన్ని) తిరస్కరించారు. ముఖాలు త్రిప్పుకున్నారు. మరి అల్లాహ్ కూడా వారిని పట్టించుకోలేదు. అల్లాహ్ నిరపేక్షాపరుడు. అన్ని విధాలా ప్రశంసనీయుడు. 64:7 زَعَمَ الَّذِينَ كَفَرُوا أَن لَّن يُبْعَثُوا ۚ قُلْ بَلَىٰ وَرَبِّي لَتُبْعَثُنَّ ثُمَّ لَتُنَبَّؤُنَّ بِمَا عَمِلْتُمْ ۚ وَذَٰلِكَ عَلَى اللَّهِ يَسِيرٌ తాము మరణించిన పిదప తిరిగి బ్రతికించబడటం అనేది ఎట్టి పరిస్థితిలోనూ జరగని పని అని అవిశ్వాసులు తలపోస్తున్నారు. (ఓ ప్రవక్తా!) వారికి చెప్పు : “ఎందుకు జరగదు? నా ప్రభువు తోడు! మీరు తప్పకుండా మళ్ళి లేపబడతారు. మీరు చేసినదంతా మీకు తెలియపరచబడుతుంది. ఇలా చేయటం అల్లాహ్ కు చాలా తేలిక.” 64:8 فَآمِنُوا بِاللَّهِ وَرَسُولِهِ وَالنُّورِ الَّذِي أَنزَلْنَا ۚ وَاللَّهُ بِمَا تَعْمَلُونَ خَبِيرٌ కాబట్టి మీరు అల్లాహ్ ను, ఆయన ప్రవక్తను, మేము అవతరింపజేసిన జ్యోతిని విశ్వసించండి. మీరు చేసే ప్రతి పనిని అల్లాహ్ కనిపెట్టుకుని ఉన్నాడు. 64:9 يَوْمَ يَجْمَعُكُمْ لِيَوْمِ الْجَمْعِ ۖ ذَٰلِكَ يَوْمُ التَّغَابُنِ ۗ وَمَن يُؤْمِن بِاللَّهِ وَيَعْمَلْ صَالِحًا يُكَفِّرْ عَنْهُ سَيِّئَاتِهِ وَيُدْخِلْهُ جَنَّاتٍ تَجْرِي مِن تَحْتِهَا الْأَنْهَارُ خَالِدِينَ فِيهَا أَبَدًا ۚ ذَٰلِكَ الْفَوْزُ الْعَظِيمُ ఏ రోజున ఆయన మిమ్మల్నందరినీ సమీకరణ జరిగే రోజుకై సమీకరిస్తాడో అది గెలుపోటముల రోజై ఉంటుంది. ఎవరైతే అల్లాహ్ ను విశ్వసించి, సదాచరణ చేస్తారో అల్లాహ్ వారి పాపాలను వారి నుండి దూరం చేస్తాడు. క్రింద కాలువలు ప్రవహించే (స్వర్గ) తోటలలో వారికి ప్రవేశం కల్పిస్తాడు. వారందులో కలకాలం ఉంటారు. గొప్ప సాఫల్యం ఇదే. 64:10 وَالَّذِينَ كَفَرُوا وَكَذَّبُوا بِآيَاتِنَا أُولَٰئِكَ أَصْحَابُ النَّارِ خَالِدِينَ فِيهَا ۖ وَبِئْسَ الْمَصِيرُ మరెవరైతే తిరస్కారానికి పాల్పడ్డారో, మా ఆయతులను ధిక్కరించారో వారే నరకవాసులు. వారు నరకంలో కలకాలం ఉంటారు. అది చాలా చెడ్డ గమ్యస్థానం. 64:11 مَا أَصَابَ مِن مُّصِيبَةٍ إِلَّا بِإِذْنِ اللَّهِ ۗ وَمَن يُؤْمِن بِاللَّهِ يَهْدِ قَلْبَهُ ۚ وَاللَّهُ بِكُلِّ شَيْءٍ عَلِيمٌ అల్లాహ్ అనుమతి లేనిదే ఏ ఆపదా రాదు. ఎవడు అల్లాహ్ ను విశ్వసిస్తాడో అతని హృదయానికి అల్లాహ్ (సరైన దిశలో) మార్గదర్శకత్వం వహిస్తాడు. అల్లాహ్ అన్ని విషయాలూ తెలిసినవాడు. 64:12 وَأَطِيعُوا اللَّهَ وَأَطِيعُوا الرَّسُولَ ۚ فَإِن تَوَلَّيْتُمْ فَإِنَّمَا عَلَىٰ رَسُولِنَا الْبَلَاغُ الْمُبِينُ (ప్రజలారా!) మీరు అల్లాహ్ కు విధేయత చూపండి. ప్రవక్త మాటను వినండి. ఒకవేళ మీరు విముఖత చూపితే, మా ప్రవక్త బాధ్యతల్లా స్పష్టంగా విషయాన్ని చేరవేయటమే. 64:13 اللَّهُ لَا إِلَٰهَ إِلَّا هُوَ ۚ وَعَلَى اللَّهِ فَلْيَتَوَكَّلِ الْمُؤْمِنُونَ అల్లాహ్! ఆయన తప్ప మరో ఆరాధ్య దైవం లేనేలేడు. విశ్వసించిన వారు అల్లాహ్ ను మాత్రమే నమ్ముకోవాలి. 64:14 يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا إِنَّ مِنْ أَزْوَاجِكُمْ وَأَوْلَادِكُمْ عَدُوًّا لَّكُمْ فَاحْذَرُوهُمْ ۚ وَإِن تَعْفُوا وَتَصْفَحُوا وَتَغْفِرُوا فَإِنَّ اللَّهَ غَفُورٌ رَّحِيمٌ ఓ విశ్వాసులారా! మీ భార్యలలో, మీ బిడ్డలలో కొందరు మీకు శత్రువులు. కాబట్టి వారి పట్ల అప్రమత్తంగా ఉండండి. ఒకవేళ మీరు గనక ఉపేక్షించి, క్షమించి, సడలింపుల వైఖరిని అవలంబించినట్లయితే అల్లాహ్ క్షమించేవాడు, దయదలిచేవాడు. 64:15 إِنَّمَا أَمْوَالُكُمْ وَأَوْلَادُكُمْ فِتْنَةٌ ۚ وَاللَّهُ عِندَهُ أَجْرٌ عَظِيمٌ మీ సిరిసంపదలు, మీ సంతానం నిజానికి మీ పాలిట ఒక పరీక్ష. గొప్ప ప్రతిఫలమయితే అల్లాహ్ వద్ద ఉన్నది. 64:16 فَاتَّقُوا اللَّهَ مَا اسْتَطَعْتُمْ وَاسْمَعُوا وَأَطِيعُوا وَأَنفِقُوا خَيْرًا لِّأَنفُسِكُمْ ۗ وَمَن يُوقَ شُحَّ نَفْسِهِ فَأُولَٰئِكَ هُمُ الْمُفْلِحُونَ కాబట్టి శాయశక్తులా మీరు అల్లాహ్ కు భయపడుతూ ఉండండి. (ఆజ్ఞలను) వినండి, విధేయత చూపండి. (దైవమార్గంలో) ఖర్చు చేస్తూ ఉండండి. ఇది స్వయంగా మీకే శ్రేయస్కరం. ఎవరైతే తమ ఆత్మ లోభత్వం నుండి రక్షించబడ్డారో వారే సాఫల్య భాగ్యం పొందినవారు. 64:17 إِن تُقْرِضُوا اللَّهَ قَرْضًا حَسَنًا يُضَاعِفْهُ لَكُمْ وَيَغْفِرْ لَكُمْ ۚ وَاللَّهُ شَكُورٌ حَلِيمٌ మీరు గనక అల్లాహ్ కు మంచి రుణం ఇస్తే (అంటే అల్లాహ్ మార్గంలో ఖర్చు పెడితే) దాన్ని ఆయన మీ కొరకు పెంచుతూపోతాడు. మీ పాపాలను కూడా క్షమిస్తాడు. అల్లాహ్ (తన దాసుల సేవలను) గుర్తించేవాడు, సహనశీలుడు. 64:18 عَالِمُ الْغَيْبِ وَالشَّهَادَةِ الْعَزِيزُ الْحَكِيمُ ఆయన రహస్య, బహిర్గత విషయాలు తెలిసినవాడు. సర్వాధిక్యుడు, వివేకవంతుడు. ఈ తెలుగు ఖుర్ఆన్ శాంతి మార్గం పబ్లికేషన్ వారు ప్రచురించారు. వారి అనుమతితో ఈ వెబ్ పోర్టల్ పై వేయబడింది. |