aip_quran
Translation

  العربية              తెలుగు  

1. సూరా అల్ ఫాతిహా
2. సూరా అల్ బఖర
3. సూరా ఆలి ఇమ్రాన్
4. సూరా అన్ నిసా
5. సూరా అల్ మాయిద
6. సూరా అల్ అన్ ఆమ్
7. సూరా అల్ ఆరాఫ్
8. సూరా అల్ అన్ ఫాల్
9. సూరా అత్ తౌబా
10. సూరా యూనుస్
11. సూరా హూద్
12. సూరా యూసుఫ్
13. సూరా ఆర్ రాద్
14. సూరా ఇబ్రహీం
15. సూరా అల్ హిజ్ర్
16. సూరా అన్ నహ్ల్
17. సూరా బనీ ఇస్రాయీల్
18. సూరా అల్ కహఫ్
19. సూరా మర్యం
20. సూరా తాహా
21. సూరా అల్ అంబియా
22. సూరా అల్ హజ్
23. సూరా అల్ మూ ‘మినూన్
24. సూరా అన్ నూర్
25. సూరా అల్ ఫుర్ఖాన్
26. సూరా ఆష్ షుఅరా
27. సూరా అన్ నమ్ల్
28. సూరా అల్ ఖసస్
29. సూరా అల్ అన్ కబూత్
30. సూరా ఆర్ రూమ్
31. సూరా లుక్మాన్
32. సూరా అస్ సజ్ ద హ్
33. సూరా అల్ ఆహ్ జాబ్
34. సూరా సబా
35. సూరా ఫాతిర్
36. సూరా యాసీన్
37. సూరా అస్ సాఫ్ఫాత్
38. సూరా సాద్
39. సూరా అజ్ జుమర్
40. సూరా అల్ మూమిన్
41. సూరా హామీమ్ అస్ సజ్ ద హ్
42. సూరా ఆష్ షూరా
43. సూరా అజ్ జుఖ్ రుఫ్
44. సూరా అద్ దుఖాన్
45. సూరా అల్ జాసియ హ్
46. సూరా అల్ ఆహ్ ఖాఫ్
47. సూరా ముహమ్మద్
48. సూరా అల్ ఫతహ్
49. సూరా అల్ హుజురాత్
50. సూరా ఖాఫ్
51. సూరా అజ్ జారియాత్
52. సూరా అత్ తూర్
53. సూరా అన్ నజ్మ్
54. సూరా అల్ ఖమర్
55. సూరా ఆర్ రహ్మాన్
56. సూరా వాఖియహ్
57. సూరా అల్ హదీద్
58. సూరా అల్ ముజాదల హ్
59. సూరా అల్ హష్ర్
60. సూరా అల్ ముమ్ తహిన హ్
61. సూరా అస్ సఫ్
62. సూరాఅల్ జుముఅ హ్
63. సూరా అల్ మునాఫిఖూన్
64. సూరా అత్ తగాబున్
65. సూరా అత్ తలాఖ్
66. సూరా అత్ తహ్రీం
67. సూరా అల్ ముల్క్
68. సూరా అల్ ఖలమ్
69. సూరా అల్ హఖ్ఖ
70. సూరా అల్ ముఆరిజ్
71. సూరా నూహ్
72. సూరా అల్ జిన్న్
73. సూరా అల్ ముజ్జమ్మిల్
74. సూరా అల్ ముద్దస్సిర్
75. సూరా అల్ ఖియామ హ్
76. సూరా అద్ దహ్ర్
77. సూరా అల్ ముర్సలాత్
78. సూరా అన్ నబా
79. సూరా అన్ నాజి ఆత్
80. సూరా అబస
81. సూరా అత్ తక్వీర్
82. సూరా అల్ ఇన్ ఫితార్
83. సూరాఅల్ ముతఫ్ఫిఫీన్
84. సూరా అల్ ఇన్ షి ఖాక్
85. సూరా అల్ బురూజ్
86. సూరా అత్ తారిఖ్
87. సూరా అల్ ఆలా
88. సూరా అల్ గాషియ హ్
89. సూరా అల్ ఫజ్ర్
90. సూరా అల్ బలద్
91. సూరా ఆష్ షమ్స్
92. సూరా అల్ లైల్
93. సూరా అజ్ జుహా
94. సూరా ఆలమ్ నష్ర్
95. సూరా అత్ తతీన్
96. సూరా అల్ అలఖ్
97. సూరా అల్ ఖద్ర్
98. సూరా అల్ బయ్యిన హ్
99. సూరా అజ్ జిలజాల్
100. సూరా అల్ ఆదియాత్
101. సూరా అల్ ఖారియ హ్
102. సూరా అత్ తకాసుర్
103. సూరా అల్ అస్ర్
104. సూరా అల్ హుమజా హ్
105. సూరా అల్ ఫీల్
106. సూరా ఖురైష్
107. సూరా అల్ మాఊ న్
108. సూరా అల్ కౌసర్
109. సూరా అల్ ఖాఫిరూన్
110. సూరా అన్ నస్ర్
111. సూరా అల్ లహబ్
112. సూరా అల్ ఇఖ్లాస్
113. సూరా అల్ ఫలఖ్
114. సూరా అన్ నాస్

63. సూరా అల్ మునాఫిఖూన్

63:1  إِذَا جَاءَكَ الْمُنَافِقُونَ قَالُوا نَشْهَدُ إِنَّكَ لَرَسُولُ اللَّهِ ۗ وَاللَّهُ يَعْلَمُ إِنَّكَ لَرَسُولُهُ وَاللَّهُ يَشْهَدُ إِنَّ الْمُنَافِقِينَ لَكَاذِبُونَ
(ఓ ముహమ్మద్!) కపటులు నీ దగ్గరికి వచ్చినప్పుడు, “తమరు నిశ్చయంగా దైవప్రవక్తేనని మేము సాక్ష్యమిస్తున్నాం” అనంటారు. నీవు ముమ్మాటికీ ఆయన ప్రవక్తేనన్న సంగతి అల్లాహ్ కు తెలుసు. ఈ కపటులు పచ్చి అబద్ధాలకోరులని కూడా అల్లాహ్ సాక్ష్యమిస్తున్నాడు.
63:2  اتَّخَذُوا أَيْمَانَهُمْ جُنَّةً فَصَدُّوا عَن سَبِيلِ اللَّهِ ۚ إِنَّهُمْ سَاءَ مَا كَانُوا يَعْمَلُونَ
వారు తమ ప్రమాణాలను ఆసరాగా చేసుకున్నారు. ఆపై వారు అల్లాహ్ మార్గం నుండి ఆగిపోయారు. వారు పాల్పడే ఈ చేష్ట బహుచెడ్డది.
63:3  ذَٰلِكَ بِأَنَّهُمْ آمَنُوا ثُمَّ كَفَرُوا فَطُبِعَ عَلَىٰ قُلُوبِهِمْ فَهُمْ لَا يَفْقَهُونَ
ఎందుకంటే వారు (మొదట) విశ్వసించి, ఆ తరువాత అవిశ్వాస వైఖరికి పాల్పడ్డారు. అందువల్ల వారి హృదయాలపై సీలు వేయబడింది. ఇక వారు ఏమీ అర్ధం చేసుకో(లే)రు.
63:4  وَإِذَا رَأَيْتَهُمْ تُعْجِبُكَ أَجْسَامُهُمْ ۖ وَإِن يَقُولُوا تَسْمَعْ لِقَوْلِهِمْ ۖ كَأَنَّهُمْ خُشُبٌ مُّسَنَّدَةٌ ۖ يَحْسَبُونَ كُلَّ صَيْحَةٍ عَلَيْهِمْ ۚ هُمُ الْعَدُوُّ فَاحْذَرْهُمْ ۚ قَاتَلَهُمُ اللَّهُ ۖ أَنَّىٰ يُؤْفَكُونَ
నీవు వారిని చూసినప్పుడు వారి శరీరాకారాలు నిన్ను ఆకట్టుకుంటాయి. వారు మాట్లాడుతుంటే నువ్వు (అమితాసక్తితో) వారి మాటల్ని వింటూనే ఉండి పోతావు. ఒక రకంగా (చెప్పాలంటే) వారు గోడకు ఆనించబడిన కర్రల్లాంటివారు. (కాస్త గట్టిగా వినబడిన) ప్రతి కేకను వారు తమపై వచ్చి పడిన గండంగానే భావిస్తారు. వీరే అసలు శత్రువులు. వీరి పట్ల కాస్త జాగ్రత్తగా ఉండండి. అల్లాహ్ వీళ్ళను నాశనం చేయ! వీరు (సత్యం నుండి) ఎలా తిరిగిపోతున్నారు!?
63:5  وَإِذَا قِيلَ لَهُمْ تَعَالَوْا يَسْتَغْفِرْ لَكُمْ رَسُولُ اللَّهِ لَوَّوْا رُءُوسَهُمْ وَرَأَيْتَهُمْ يَصُدُّونَ وَهُم مُّسْتَكْبِرُونَ
“రండి, దైవప్రవక్త మీ పాపాల మన్నింపుకై ప్రార్ధిస్తాడు” అని వారితో అన్నప్పుడు, వారు తమ తలలు తిప్పుకుంటారు. మరి వారు గర్వాతిశయంతో ఆగిపోవటం నీవు చూస్తావు.
63:6  سَوَاءٌ عَلَيْهِمْ أَسْتَغْفَرْتَ لَهُمْ أَمْ لَمْ تَسْتَغْفِرْ لَهُمْ لَن يَغْفِرَ اللَّهُ لَهُمْ ۚ إِنَّ اللَّهَ لَا يَهْدِي الْقَوْمَ الْفَاسِقِينَ
(ఓ ప్రవక్తా!) వారి క్షమాపణ కొరకు నువ్వు ప్రార్ధించినా, ప్రార్ధించకపోయినా ఒక్కటే – అల్లాహ్ ఎట్టి పరిస్థితిలోనూ వారిని క్షమించడు. నిశ్చయంగా అల్లాహ్ (ఇలాంటి) అవిధేయులకు సన్మార్గం చూపడు.
63:7  هُمُ الَّذِينَ يَقُولُونَ لَا تُنفِقُوا عَلَىٰ مَنْ عِندَ رَسُولِ اللَّهِ حَتَّىٰ يَنفَضُّوا ۗ وَلِلَّهِ خَزَائِنُ السَّمَاوَاتِ وَالْأَرْضِ وَلَٰكِنَّ الْمُنَافِقِينَ لَا يَفْقَهُونَ
“దైవప్రవక్త వెంట ఉన్నవారిపై ఏమీ ఖర్చుపెట్టకండి. చివరికి వారంతట వారే చెల్లాచెదురైపోతారు” అని చెప్పేది కూడా వీరే. యదార్ధానికి భూమ్యాకాశాలలోని నిధినిక్షేపాలన్నీ అల్లాహ్ యాజమాన్యంలోనివే. కాని కపటులు అర్ధం చేసుకోవటం లేదు.
63:8  يَقُولُونَ لَئِن رَّجَعْنَا إِلَى الْمَدِينَةِ لَيُخْرِجَنَّ الْأَعَزُّ مِنْهَا الْأَذَلَّ ۚ وَلِلَّهِ الْعِزَّةُ وَلِرَسُولِهِ وَلِلْمُؤْمِنِينَ وَلَٰكِنَّ الْمُنَافِقِينَ لَا يَعْلَمُونَ
“మనం గనక మదీనా నగరానికి తిరిగి వెళ్ళినట్లయితే, గౌరవనీయుడు అల్పుణ్ణి అక్కణ్ణుంచి వెళ్ళగొడతాడు” అని వారు అంటున్నారు. నిజానికి గౌరవమైతే అల్లాహ్ కు, ఆయన ప్రవక్తకు, విశ్వాసులకే చెందుతుంది. కాని ఈ కపటులు తెలుసుకోవటం లేదు.
63:9  يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا لَا تُلْهِكُمْ أَمْوَالُكُمْ وَلَا أَوْلَادُكُمْ عَن ذِكْرِ اللَّهِ ۚ وَمَن يَفْعَلْ ذَٰلِكَ فَأُولَٰئِكَ هُمُ الْخَاسِرُونَ
ఓ విశ్వాసులారా! మీ సిరిసంపదలు, మీ సంతానం మిమ్మల్ని అల్లాహ్ ధ్యానం నుండి మరల్చరాదు. ఎవరైతే అలా చేస్తారో వారే నష్టపోయేవారు.
63:10  وَأَنفِقُوا مِن مَّا رَزَقْنَاكُم مِّن قَبْلِ أَن يَأْتِيَ أَحَدَكُمُ الْمَوْتُ فَيَقُولَ رَبِّ لَوْلَا أَخَّرْتَنِي إِلَىٰ أَجَلٍ قَرِيبٍ فَأَصَّدَّقَ وَأَكُن مِّنَ الصَّالِحِينَ
మీలో ఎవరికైనా చావు వచ్చి, “నా ప్రభూ! నాకు మరికొంత గడువు ఎందుకు ఇవ్వలేదు? (ఇస్తే) నేను కూడా దానధర్మాలు చేసి సజ్జనులలో చేరేవాణ్ణి కదా!” అని (కడుదీనంగా) పలికే దుస్థితి దాపురించకముందే మేము మీకు ప్రసాదించిన దాని నుండి (మా మార్గంలో) ఖర్చు చేయండి.
63:11  وَلَن يُؤَخِّرَ اللَّهُ نَفْسًا إِذَا جَاءَ أَجَلُهَا ۚ وَاللَّهُ خَبِيرٌ بِمَا تَعْمَلُونَ
ఏ ప్రాణికైనా, దాని నిర్ధారిత సమయం ఆసన్నమైందంటే, ఇక అల్లాహ్ ఎట్టి పరిస్థితిలోనూ దానికి గడువు ఇవ్వడు. మీరు చేసేదంతా అల్లాహ్ కు తెలుసు.


ఈ తెలుగు ఖుర్ఆన్ శాంతి మార్గం పబ్లికేషన్ వారు ప్రచురించారు. వారి అనుమతితో ఈ వెబ్ పోర్టల్ పై వేయబడింది.