Translation
| 62. సూరాఅల్ జుముఅ హ్ 62:1 يُسَبِّحُ لِلَّهِ مَا فِي السَّمَاوَاتِ وَمَا فِي الْأَرْضِ الْمَلِكِ الْقُدُّوسِ الْعَزِيزِ الْحَكِيمِ భూమ్యాకాశాలలో ఉన్న వస్తువులన్నీ సార్వభౌముడు, పరిశుద్ధుడు, శక్తిశాలి, వివేచనాశీలి అయిన అల్లాహ్ పవిత్రతను కొనియాడుతున్నాయి. 62:2 هُوَ الَّذِي بَعَثَ فِي الْأُمِّيِّينَ رَسُولًا مِّنْهُمْ يَتْلُو عَلَيْهِمْ آيَاتِهِ وَيُزَكِّيهِمْ وَيُعَلِّمُهُمُ الْكِتَابَ وَالْحِكْمَةَ وَإِن كَانُوا مِن قَبْلُ لَفِي ضَلَالٍ مُّبِينٍ ఆయనే నిరక్షరాస్యులైన జనులలో – స్వయంగా వారిలోనుంచే ఒక ప్రవక్తను ప్రభవింపజేశాడు. అతడు వారికి దేవుని వాక్యాలను చదివి వినిపిస్తున్నాడు. వారిని పరిశుద్ధపరుస్తున్నాడు, వారికి గ్రంథాన్నీ, వివేకాన్ని బోధిస్తున్నాడు. అంతకు ముందు వారు స్పష్టమైన మార్గవిహీనతకు లోనైఉండేవారు. 62:3 وَآخَرِينَ مِنْهُمْ لَمَّا يَلْحَقُوا بِهِمْ ۚ وَهُوَ الْعَزِيزُ الْحَكِيمُ ఇంకా వారితో చేరని ఇతరుల కొరకు కూడా (ఆ ప్రవక్తను ప్రభవింపజేశాడు). ఆయన (అల్లాహ్) గొప్ప శక్తిశాలి, వివేచనాశీలి. 62:4 ذَٰلِكَ فَضْلُ اللَّهِ يُؤْتِيهِ مَن يَشَاءُ ۚ وَاللَّهُ ذُو الْفَضْلِ الْعَظِيمِ ఇది అల్లాహ్ అనుగ్రహం. ఆయన తాను కోరిన వారికి దీనిని ప్రసాదిస్తాడు. అల్లాహ్ గొప్ప అనుగ్రహం కలవాడు. 62:5 مَثَلُ الَّذِينَ حُمِّلُوا التَّوْرَاةَ ثُمَّ لَمْ يَحْمِلُوهَا كَمَثَلِ الْحِمَارِ يَحْمِلُ أَسْفَارًا ۚ بِئْسَ مَثَلُ الْقَوْمِ الَّذِينَ كَذَّبُوا بِآيَاتِ اللَّهِ ۚ وَاللَّهُ لَا يَهْدِي الْقَوْمَ الظَّالِمِينَ తౌరాతు గ్రంథం ప్రకారం ఆచరించాలని ఆదేశించబడినప్పటికీ, దానికి అనుగుణంగా ఆచరించనివారి ఉపమానం ఎన్నో గ్రంథాలు (వీపుపై) మోపబడిన గాడిదలాంటిది. అల్లాహ్ వాక్యాలను ధిక్కరించినవారి దృష్టాంతం చాలా చెడ్డది. దుర్మార్గ జనులకు అల్లాహ్ సన్మార్గం చూపడు. 62:6 قُلْ يَا أَيُّهَا الَّذِينَ هَادُوا إِن زَعَمْتُمْ أَنَّكُمْ أَوْلِيَاءُ لِلَّهِ مِن دُونِ النَّاسِ فَتَمَنَّوُا الْمَوْتَ إِن كُنتُمْ صَادِقِينَ (ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహివ సల్లం!) వారికి ఈ విధంగా చెప్పు: “ఓ యూద జనులారా! ఇతర జనుల కన్నా మీరే అల్లాహ్ కు ప్రియమైన వారన్నది మీ తలంపు అయితే, మీరు చావును కోరుకోండి. మీరు మీ వాదనలో సత్యవంతులే అయితే (ఈ సవాలును స్వీకరించండి).” 62:7 وَلَا يَتَمَنَّوْنَهُ أَبَدًا بِمَا قَدَّمَتْ أَيْدِيهِمْ ۚ وَاللَّهُ عَلِيمٌ بِالظَّالِمِينَ వారు తమ చేజేతులా చేసుకున్న అకృత్యాల కారణంగా వారెన్నటికీ చావును కోరుకోరు. దుర్మార్గుల సంగతి అల్లాహ్ కు బాగా తెలుసు. 62:8 قُلْ إِنَّ الْمَوْتَ الَّذِي تَفِرُّونَ مِنْهُ فَإِنَّهُ مُلَاقِيكُمْ ۖ ثُمَّ تُرَدُّونَ إِلَىٰ عَالِمِ الْغَيْبِ وَالشَّهَادَةِ فَيُنَبِّئُكُم بِمَا كُنتُمْ تَعْمَلُونَ వారికి చెప్పు : “ఏ చావు నుండి మీరు పారిపోతున్నారో అది మిమ్మల్ని చేరుకోవటం ఖాయం. ఆ తరువాత మీరు రహస్య, బహిర్గత విషయాలను ఎరిగిన వాని సమక్షంలోకి తరలించబడతారు. మరి ఆయన మీరు చేస్తూ ఉండిన పనులన్నింటినీ మీకు తెలియజెపుతాడు.” 62:9 يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا إِذَا نُودِيَ لِلصَّلَاةِ مِن يَوْمِ الْجُمُعَةِ فَاسْعَوْا إِلَىٰ ذِكْرِ اللَّهِ وَذَرُوا الْبَيْعَ ۚ ذَٰلِكُمْ خَيْرٌ لَّكُمْ إِن كُنتُمْ تَعْلَمُونَ ఓ విశ్వాసులారా! శుక్రవారం నాడు నమాజు కొరకు అజాన్ (పిలుపు) ఇవ్వబడినప్పుడు, మీరు అల్లాహ్ ధ్యానం వైపు పరుగెత్తండి. క్రయవిక్రయాలను వదలి పెట్టండి. మీరు గనక తెలుసుకోగలిగితే ఇది మీ కొరకు ఎంతో మేలైనది. 62:10 فَإِذَا قُضِيَتِ الصَّلَاةُ فَانتَشِرُوا فِي الْأَرْضِ وَابْتَغُوا مِن فَضْلِ اللَّهِ وَاذْكُرُوا اللَّهَ كَثِيرًا لَّعَلَّكُمْ تُفْلِحُونَ మరి నమాజు ముగిసిన తరువాత భూమిలో విస్తరించి, దైవానుగ్రహాన్ని అన్వేషించండి. ఎక్కువగా అల్లాహ్ ను స్మరిస్తూ ఉండండి. తద్వారా మీరు సాఫల్యం పొందవచ్చు. 62:11 وَإِذَا رَأَوْا تِجَارَةً أَوْ لَهْوًا انفَضُّوا إِلَيْهَا وَتَرَكُوكَ قَائِمًا ۚ قُلْ مَا عِندَ اللَّهِ خَيْرٌ مِّنَ اللَّهْوِ وَمِنَ التِّجَارَةِ ۚ وَاللَّهُ خَيْرُ الرَّازِقِينَ (జనుల పరిస్థితి ఎలా ఉందంటే) ఎప్పుడు ఏ వ్యాపార వస్తువు అమ్మబడుతున్నట్లు చూసినా, ఏ వినోద వస్తువు కానవచ్చినా వారు దాని వైపుకు పరుగెడుతున్నారు. నిన్ను నిలబడి ఉన్న స్థితిలోనే విడిచిపోతున్నారు. వారికి చెప్పు : “అల్లాహ్ దగ్గర ఏదైతే ఉందో అది వినోదం కన్నా, వర్తకం కన్నా ఎంతో మేలైనది. అల్లాహ్ ఉపాధి ప్రదాతలలోకెల్లా ఉత్తముడు.” ఈ తెలుగు ఖుర్ఆన్ శాంతి మార్గం పబ్లికేషన్ వారు ప్రచురించారు. వారి అనుమతితో ఈ వెబ్ పోర్టల్ పై వేయబడింది. |