aip_quran
Translation

  العربية              తెలుగు  

1. సూరా అల్ ఫాతిహా
2. సూరా అల్ బఖర
3. సూరా ఆలి ఇమ్రాన్
4. సూరా అన్ నిసా
5. సూరా అల్ మాయిద
6. సూరా అల్ అన్ ఆమ్
7. సూరా అల్ ఆరాఫ్
8. సూరా అల్ అన్ ఫాల్
9. సూరా అత్ తౌబా
10. సూరా యూనుస్
11. సూరా హూద్
12. సూరా యూసుఫ్
13. సూరా ఆర్ రాద్
14. సూరా ఇబ్రహీం
15. సూరా అల్ హిజ్ర్
16. సూరా అన్ నహ్ల్
17. సూరా బనీ ఇస్రాయీల్
18. సూరా అల్ కహఫ్
19. సూరా మర్యం
20. సూరా తాహా
21. సూరా అల్ అంబియా
22. సూరా అల్ హజ్
23. సూరా అల్ మూ ‘మినూన్
24. సూరా అన్ నూర్
25. సూరా అల్ ఫుర్ఖాన్
26. సూరా ఆష్ షుఅరా
27. సూరా అన్ నమ్ల్
28. సూరా అల్ ఖసస్
29. సూరా అల్ అన్ కబూత్
30. సూరా ఆర్ రూమ్
31. సూరా లుక్మాన్
32. సూరా అస్ సజ్ ద హ్
33. సూరా అల్ ఆహ్ జాబ్
34. సూరా సబా
35. సూరా ఫాతిర్
36. సూరా యాసీన్
37. సూరా అస్ సాఫ్ఫాత్
38. సూరా సాద్
39. సూరా అజ్ జుమర్
40. సూరా అల్ మూమిన్
41. సూరా హామీమ్ అస్ సజ్ ద హ్
42. సూరా ఆష్ షూరా
43. సూరా అజ్ జుఖ్ రుఫ్
44. సూరా అద్ దుఖాన్
45. సూరా అల్ జాసియ హ్
46. సూరా అల్ ఆహ్ ఖాఫ్
47. సూరా ముహమ్మద్
48. సూరా అల్ ఫతహ్
49. సూరా అల్ హుజురాత్
50. సూరా ఖాఫ్
51. సూరా అజ్ జారియాత్
52. సూరా అత్ తూర్
53. సూరా అన్ నజ్మ్
54. సూరా అల్ ఖమర్
55. సూరా ఆర్ రహ్మాన్
56. సూరా వాఖియహ్
57. సూరా అల్ హదీద్
58. సూరా అల్ ముజాదల హ్
59. సూరా అల్ హష్ర్
60. సూరా అల్ ముమ్ తహిన హ్
61. సూరా అస్ సఫ్
62. సూరాఅల్ జుముఅ హ్
63. సూరా అల్ మునాఫిఖూన్
64. సూరా అత్ తగాబున్
65. సూరా అత్ తలాఖ్
66. సూరా అత్ తహ్రీం
67. సూరా అల్ ముల్క్
68. సూరా అల్ ఖలమ్
69. సూరా అల్ హఖ్ఖ
70. సూరా అల్ ముఆరిజ్
71. సూరా నూహ్
72. సూరా అల్ జిన్న్
73. సూరా అల్ ముజ్జమ్మిల్
74. సూరా అల్ ముద్దస్సిర్
75. సూరా అల్ ఖియామ హ్
76. సూరా అద్ దహ్ర్
77. సూరా అల్ ముర్సలాత్
78. సూరా అన్ నబా
79. సూరా అన్ నాజి ఆత్
80. సూరా అబస
81. సూరా అత్ తక్వీర్
82. సూరా అల్ ఇన్ ఫితార్
83. సూరాఅల్ ముతఫ్ఫిఫీన్
84. సూరా అల్ ఇన్ షి ఖాక్
85. సూరా అల్ బురూజ్
86. సూరా అత్ తారిఖ్
87. సూరా అల్ ఆలా
88. సూరా అల్ గాషియ హ్
89. సూరా అల్ ఫజ్ర్
90. సూరా అల్ బలద్
91. సూరా ఆష్ షమ్స్
92. సూరా అల్ లైల్
93. సూరా అజ్ జుహా
94. సూరా ఆలమ్ నష్ర్
95. సూరా అత్ తతీన్
96. సూరా అల్ అలఖ్
97. సూరా అల్ ఖద్ర్
98. సూరా అల్ బయ్యిన హ్
99. సూరా అజ్ జిలజాల్
100. సూరా అల్ ఆదియాత్
101. సూరా అల్ ఖారియ హ్
102. సూరా అత్ తకాసుర్
103. సూరా అల్ అస్ర్
104. సూరా అల్ హుమజా హ్
105. సూరా అల్ ఫీల్
106. సూరా ఖురైష్
107. సూరా అల్ మాఊ న్
108. సూరా అల్ కౌసర్
109. సూరా అల్ ఖాఫిరూన్
110. సూరా అన్ నస్ర్
111. సూరా అల్ లహబ్
112. సూరా అల్ ఇఖ్లాస్
113. సూరా అల్ ఫలఖ్
114. సూరా అన్ నాస్

60. సూరా అల్ ముమ్ తహిన హ్

60:1  يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا لَا تَتَّخِذُوا عَدُوِّي وَعَدُوَّكُمْ أَوْلِيَاءَ تُلْقُونَ إِلَيْهِم بِالْمَوَدَّةِ وَقَدْ كَفَرُوا بِمَا جَاءَكُم مِّنَ الْحَقِّ يُخْرِجُونَ الرَّسُولَ وَإِيَّاكُمْ ۙ أَن تُؤْمِنُوا بِاللَّهِ رَبِّكُمْ إِن كُنتُمْ خَرَجْتُمْ جِهَادًا فِي سَبِيلِي وَابْتِغَاءَ مَرْضَاتِي ۚ تُسِرُّونَ إِلَيْهِم بِالْمَوَدَّةِ وَأَنَا أَعْلَمُ بِمَا أَخْفَيْتُمْ وَمَا أَعْلَنتُمْ ۚ وَمَن يَفْعَلْهُ مِنكُمْ فَقَدْ ضَلَّ سَوَاءَ السَّبِيلِ
విశ్వసించిన ఓ ప్రజలారా! నా శత్రువుల్ని, మీ శత్రువుల్ని మీ స్నేహితులుగా చేసుకోకండి. మీరేమో స్నేహపూర్వకంగా వారివైపు సందేశం పంపుతున్నారు. వారేమో మీ వద్దకు వచ్చిన సత్యాన్ని త్రోసిపుచ్చారు. మీ ప్రభువైన అల్లాహ్ ను మీరు విశ్వసించినందుకు వారు ప్రవక్తను, స్వయంగా మిమ్మల్ని కూడా దేశం నుండి బహిష్కరించారు. మీరు గనక నా మార్గంలో పోరాడటానికి, నా ప్రసన్నతను చూరగొనటానికి బయలుదేరిన వారైతే (మీరు వాళ్లతో స్నేహం చేయకండి). మీరు వారి వద్దకు స్నేహ సందేశాన్ని రహస్యంగా పంపిస్తారా! మీరు దాచేదీ, బహిర్గతం చేసేదీ – అంతా నాకు తెలుసు. మీలో ఎవడు ఈ కార్యకలాపాలకు పాల్పడినా అతను తిన్నని మార్గం నుండి తప్పిపోయినట్లే.
60:2  إِن يَثْقَفُوكُمْ يَكُونُوا لَكُمْ أَعْدَاءً وَيَبْسُطُوا إِلَيْكُمْ أَيْدِيَهُمْ وَأَلْسِنَتَهُم بِالسُّوءِ وَوَدُّوا لَوْ تَكْفُرُونَ
ఒకవేళ మీరు గనక వారి చేతికి చిక్కినట్లయితే, వారు మీ పట్ల బద్ధ శత్రువులుగా వ్యవహరిస్తారు. చెడు రీతిలో మీపై చేయి చేసుకుంటారు, నోరు కూడా పారేసుకుంటారు. మీరు (కూడా వారిలాగే) అవిశ్వాసానికి పాల్పడాలని కోరుకుంటారు.
60:3  لَن تَنفَعَكُمْ أَرْحَامُكُمْ وَلَا أَوْلَادُكُمْ ۚ يَوْمَ الْقِيَامَةِ يَفْصِلُ بَيْنَكُمْ ۚ وَاللَّهُ بِمَا تَعْمَلُونَ بَصِيرٌ
మీ రక్తసంబంధాలు, బంధుత్వాలు, మీ బిడ్డలు ప్రళయదినాన మీకు ఏవిధంగానూ ఉపయోగపడరు. అల్లాహ్ మీ మధ్య తీర్పు చేసేస్తాడు. మీరు చేసే పనులన్నిటిని అల్లాహ్ చూస్తూనే ఉన్నాడు.
60:4  قَدْ كَانَتْ لَكُمْ أُسْوَةٌ حَسَنَةٌ فِي إِبْرَاهِيمَ وَالَّذِينَ مَعَهُ إِذْ قَالُوا لِقَوْمِهِمْ إِنَّا بُرَآءُ مِنكُمْ وَمِمَّا تَعْبُدُونَ مِن دُونِ اللَّهِ كَفَرْنَا بِكُمْ وَبَدَا بَيْنَنَا وَبَيْنَكُمُ الْعَدَاوَةُ وَالْبَغْضَاءُ أَبَدًا حَتَّىٰ تُؤْمِنُوا بِاللَّهِ وَحْدَهُ إِلَّا قَوْلَ إِبْرَاهِيمَ لِأَبِيهِ لَأَسْتَغْفِرَنَّ لَكَ وَمَا أَمْلِكُ لَكَ مِنَ اللَّهِ مِن شَيْءٍ ۖ رَّبَّنَا عَلَيْكَ تَوَكَّلْنَا وَإِلَيْكَ أَنَبْنَا وَإِلَيْكَ الْمَصِيرُ
(ఓ ముస్లిములారా!) మీకు ఇబ్రాహీములోనూ, అతని వెంటనున్న వారిలోనూ అత్యుత్తమమైన ఆదర్శం ఉంది. వారంతా తమ జాతి వారితో స్పష్టంగా ఇలా చెప్పేశారు : “మీతోనూ, అల్లాహ్ ను వదలి మీరు పూజించే వారందరితోనూ మాకెలాంటి సంబంధం లేదు. మేము మిమ్మల్ని (మీ మిథ్య విశ్వాసాలను) తిరస్కరిస్తున్నాము. ఒకే ఒక్కడైన అల్లాహ్ ను మీరు విశ్వసించనంత వరకూ, మాకూ – మీకూ మధ్య శాశ్వతంగా విరోధం, వైషమ్యం ఏర్పడినట్లే.” అయితే ఇబ్రాహీము తన తండ్రితో, “(నాన్న!) నేను మీ మన్నింపు కోసం తప్పకుండా ప్రార్ధిస్తాను. (కాని) మీ విషయంలో నేను అల్లాహ్ సమక్షంలో అంతకంటే ఎక్కువ ఏమీ చేయలేను” అన్న మాట మాత్రం (వినయింపుతో కూడుకున్నది) – (ఇంకా వారిలా వేడుకున్నారు, “మా ప్రభూ! మేము నిన్నే నమ్ముకున్నాము. నీ వైపుకే మరలుతున్నాము. (ఎట్టకేలకు) నిన్నే చేరుకోవలసి ఉంది.
60:5  رَبَّنَا لَا تَجْعَلْنَا فِتْنَةً لِّلَّذِينَ كَفَرُوا وَاغْفِرْ لَنَا رَبَّنَا ۖ إِنَّكَ أَنتَ الْعَزِيزُ الْحَكِيمُ
“మా ప్రభూ! అవిశ్వాసుల కొరకు మమ్మల్ని పరీక్షా సాధనంగా చేయకు. ప్రభూ! మా తప్పులను క్షమించు. నిశ్చయంగా నీవు మాత్రమే సర్వాధికుడవు, వివేకవంతుడవు.”
60:6  لَقَدْ كَانَ لَكُمْ فِيهِمْ أُسْوَةٌ حَسَنَةٌ لِّمَن كَانَ يَرْجُو اللَّهَ وَالْيَوْمَ الْآخِرَ ۚ وَمَن يَتَوَلَّ فَإِنَّ اللَّهَ هُوَ الْغَنِيُّ الْحَمِيدُ
నిశ్చయంగా వారి (జీవన విధానం)లో మీకు అత్యుత్తమమైన ఆదర్శం ఉంది – ముఖ్యంగా అల్లాహ్(తో సమావేశము)ను, అంతిమదినాన్ని ఆశించే ప్రతి ఒక్కరికీ! ఒకవేళ ఎవరైనా విముఖత చూపితే (నష్టపోయేది వారే), అల్లాహ్ మాత్రం లక్ష్యపెట్టేవాడు కాడు. ఆయన సకలస్తోత్రాలకు అర్హుడు.
60:7  عَسَى اللَّهُ أَن يَجْعَلَ بَيْنَكُمْ وَبَيْنَ الَّذِينَ عَادَيْتُم مِّنْهُم مَّوَدَّةً ۚ وَاللَّهُ قَدِيرٌ ۚ وَاللَّهُ غَفُورٌ رَّحِيمٌ
బహుశా అల్లాహ్ మీకూ – మీ విరోధులకు మధ్య స్నేహాన్ని ఏర్పరచినా ఆశ్చర్యపోనవసరం లేదు. అల్లాహ్ కు అన్నీ సాధ్యమే. అల్లాహ్ (అపారంగా) క్షమించేవాడు, కనికరించేవాడు.
60:8  لَّا يَنْهَاكُمُ اللَّهُ عَنِ الَّذِينَ لَمْ يُقَاتِلُوكُمْ فِي الدِّينِ وَلَمْ يُخْرِجُوكُم مِّن دِيَارِكُمْ أَن تَبَرُّوهُمْ وَتُقْسِطُوا إِلَيْهِمْ ۚ إِنَّ اللَّهَ يُحِبُّ الْمُقْسِطِينَ
ధర్మం విషయంలో మీపై కాలుదువ్వకుండా, మిమ్మల్ని మీ ఇల్లూ వాకిలి నుండి వెళ్ళగొట్టకుండా ఉన్న వారితో మీరు సద్వ్యవహారం చేయటాన్ని, వారికి న్యాయం చేయటాన్ని అల్లాహ్ ఎంత మాత్రం విరోధించడు. పైగా అల్లాహ్ న్యాయం చేసే వారిని ప్రేమిస్తాడు.
60:9  إِنَّمَا يَنْهَاكُمُ اللَّهُ عَنِ الَّذِينَ قَاتَلُوكُمْ فِي الدِّينِ وَأَخْرَجُوكُم مِّن دِيَارِكُمْ وَظَاهَرُوا عَلَىٰ إِخْرَاجِكُمْ أَن تَوَلَّوْهُمْ ۚ وَمَن يَتَوَلَّهُمْ فَأُولَٰئِكَ هُمُ الظَّالِمُونَ
ధర్మం విషయంలో మీపై కయ్యానికి కాలుదువ్వి, మిమ్మల్ని మీ ఇల్లూ వాకిళ్ళ నుండి వెళ్ళగొట్టినవారితో, మిమ్మల్ని వెళ్ళగొట్టడంలో ఇతరులకు సహాయపడిన వారితో స్నేహసంబంధాలు ఏర్పరచుకోవటాన్ని మాత్రమే అల్లాహ్ వారిస్తున్నాడు. అలాంటి వారితో కుమ్మక్కు అయినవారే దుర్మార్గులు.
60:10  يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا إِذَا جَاءَكُمُ الْمُؤْمِنَاتُ مُهَاجِرَاتٍ فَامْتَحِنُوهُنَّ ۖ اللَّهُ أَعْلَمُ بِإِيمَانِهِنَّ ۖ فَإِنْ عَلِمْتُمُوهُنَّ مُؤْمِنَاتٍ فَلَا تَرْجِعُوهُنَّ إِلَى الْكُفَّارِ ۖ لَا هُنَّ حِلٌّ لَّهُمْ وَلَا هُمْ يَحِلُّونَ لَهُنَّ ۖ وَآتُوهُم مَّا أَنفَقُوا ۚ وَلَا جُنَاحَ عَلَيْكُمْ أَن تَنكِحُوهُنَّ إِذَا آتَيْتُمُوهُنَّ أُجُورَهُنَّ ۚ وَلَا تُمْسِكُوا بِعِصَمِ الْكَوَافِرِ وَاسْأَلُوا مَا أَنفَقْتُمْ وَلْيَسْأَلُوا مَا أَنفَقُوا ۚ ذَٰلِكُمْ حُكْمُ اللَّهِ ۖ يَحْكُمُ بَيْنَكُمْ ۚ وَاللَّهُ عَلِيمٌ حَكِيمٌ
ఓ విశ్వాసులారా! విశ్వసించిన స్త్రీలు మీ వద్దకు వలస వచ్చినప్పుడు మీరు వారిని పరీక్షించండి. (ఆ విషయానికి వస్తే) వారి విశ్వాసం గురించి అల్లాహ్ కు బాగా తెలుసు. వారు గనక విశ్వాసపాత్రులని మీకు అనిపిస్తే వారిని అవిశ్వాసుల వద్దకు తిప్పి పంపకండి. ఈ స్త్రీలు వారికి ధర్మ సమ్మతం కారు. వారు ఈ స్త్రీలకు కూడా ధర్మ సమ్మతం కాజాలరు. అవిశ్వాసులు ఖర్చు చేసినది వారికి చెల్లించండి. తద్వారా మీరు ఈ స్త్రీలకు మహార్ సొమ్మును చెల్లించి వారిని వివాహమాడటం ఏమాత్రం దోషం కాదు. విశ్వసించని స్త్రీల మానాన్ని మీ వివాహ బంధంలో ఉంచకండి. మీరు ఖర్చుపెట్టినది అడిగి తీసేసుకోండి. అటు అవిశ్వాసులు కూడా వారు ఖర్చు చేసినది అడిగి తీసేసుకోవాలి. ఇది అల్లాహ్ ఆజ్ఞ (తీర్పు). దీన్ని ఆయన మీ మధ్య విధించాడు. అల్లాహ్ మహా జ్ఞాని, మహావివేకి.
60:11  وَإِن فَاتَكُمْ شَيْءٌ مِّنْ أَزْوَاجِكُمْ إِلَى الْكُفَّارِ فَعَاقَبْتُمْ فَآتُوا الَّذِينَ ذَهَبَتْ أَزْوَاجُهُم مِّثْلَ مَا أَنفَقُوا ۚ وَاتَّقُوا اللَّهَ الَّذِي أَنتُم بِهِ مُؤْمِنُونَ
ఒకవేళ మీ భార్యలలో ఎవరైనా మీ అదుపాజ్ఞలను ఉల్లంఘించి అవిశ్వాసుల వద్దకు చేరితే, ఆ తరువాత బదులు తీర్చుకునే వంతు మీకు వస్తే, ఎవరి స్త్రీలు వెళ్ళిపోయారో వారికి, వారు ఖర్చుచేసినంత సొమ్మును చెల్లించండి. మీరు విశ్వసించినటువంటి అల్లాహ్ కు భయపడుతూ ఉండండి.
60:12  يَا أَيُّهَا النَّبِيُّ إِذَا جَاءَكَ الْمُؤْمِنَاتُ يُبَايِعْنَكَ عَلَىٰ أَن لَّا يُشْرِكْنَ بِاللَّهِ شَيْئًا وَلَا يَسْرِقْنَ وَلَا يَزْنِينَ وَلَا يَقْتُلْنَ أَوْلَادَهُنَّ وَلَا يَأْتِينَ بِبُهْتَانٍ يَفْتَرِينَهُ بَيْنَ أَيْدِيهِنَّ وَأَرْجُلِهِنَّ وَلَا يَعْصِينَكَ فِي مَعْرُوفٍ ۙ فَبَايِعْهُنَّ وَاسْتَغْفِرْ لَهُنَّ اللَّهَ ۖ إِنَّ اللَّهَ غَفُورٌ رَّحِيمٌ
ఓ ప్రవక్తా! విశ్వసించిన స్త్రీలు నీ వద్దకు వచ్చి, తాము ఎవరినీ అల్లాహ్ కు భాగస్వామ్యం కల్పించబోము అనీ, దొంగతనం చేయబోము అనీ, వ్యభిచారానికి పాల్పడబోము అనీ, తమ సంతానాన్ని చంపబోము అనీ, తమ కాళ్ళు చేతుల మధ్య నుండి ఎలాంటి అభాండాన్నీ కల్పించబోము అనీ, ఏ సత్కార్యంలోనూ నీకు అవిధేయత చూపబోము అని ప్రమాణం చేస్తే నువ్వు వారి చేత ప్రమాణం చేయించు. వారి క్షమాపణ కొరకు అల్లాహ్ ను ప్రార్ధించు. నిశ్చయంగా అల్లాహ్ క్షమాశీలి, దయాశీలి.
60:13  يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا لَا تَتَوَلَّوْا قَوْمًا غَضِبَ اللَّهُ عَلَيْهِمْ قَدْ يَئِسُوا مِنَ الْآخِرَةِ كَمَا يَئِسَ الْكُفَّارُ مِنْ أَصْحَابِ الْقُبُورِ
ఓ విశ్వాసులారా! మీరు అల్లాహ్ ఆగ్రహానికి గురైన వారితో స్నేహం చేయకండి. చచ్చి సమాధుల్లో పడిఉన్న వారిపట్ల అవిశ్వాసులు ఎలా ఆశలు వదులుకున్నారో అలాగే వారు కూడా పరలోకం పట్ల ఆశ వదులుకున్నారు.


ఈ తెలుగు ఖుర్ఆన్ శాంతి మార్గం పబ్లికేషన్ వారు ప్రచురించారు. వారి అనుమతితో ఈ వెబ్ పోర్టల్ పై వేయబడింది.