aip_quran
Translation

  العربية              తెలుగు  

1. సూరా అల్ ఫాతిహా
2. సూరా అల్ బఖర
3. సూరా ఆలి ఇమ్రాన్
4. సూరా అన్ నిసా
5. సూరా అల్ మాయిద
6. సూరా అల్ అన్ ఆమ్
7. సూరా అల్ ఆరాఫ్
8. సూరా అల్ అన్ ఫాల్
9. సూరా అత్ తౌబా
10. సూరా యూనుస్
11. సూరా హూద్
12. సూరా యూసుఫ్
13. సూరా ఆర్ రాద్
14. సూరా ఇబ్రహీం
15. సూరా అల్ హిజ్ర్
16. సూరా అన్ నహ్ల్
17. సూరా బనీ ఇస్రాయీల్
18. సూరా అల్ కహఫ్
19. సూరా మర్యం
20. సూరా తాహా
21. సూరా అల్ అంబియా
22. సూరా అల్ హజ్
23. సూరా అల్ మూ ‘మినూన్
24. సూరా అన్ నూర్
25. సూరా అల్ ఫుర్ఖాన్
26. సూరా ఆష్ షుఅరా
27. సూరా అన్ నమ్ల్
28. సూరా అల్ ఖసస్
29. సూరా అల్ అన్ కబూత్
30. సూరా ఆర్ రూమ్
31. సూరా లుక్మాన్
32. సూరా అస్ సజ్ ద హ్
33. సూరా అల్ ఆహ్ జాబ్
34. సూరా సబా
35. సూరా ఫాతిర్
36. సూరా యాసీన్
37. సూరా అస్ సాఫ్ఫాత్
38. సూరా సాద్
39. సూరా అజ్ జుమర్
40. సూరా అల్ మూమిన్
41. సూరా హామీమ్ అస్ సజ్ ద హ్
42. సూరా ఆష్ షూరా
43. సూరా అజ్ జుఖ్ రుఫ్
44. సూరా అద్ దుఖాన్
45. సూరా అల్ జాసియ హ్
46. సూరా అల్ ఆహ్ ఖాఫ్
47. సూరా ముహమ్మద్
48. సూరా అల్ ఫతహ్
49. సూరా అల్ హుజురాత్
50. సూరా ఖాఫ్
51. సూరా అజ్ జారియాత్
52. సూరా అత్ తూర్
53. సూరా అన్ నజ్మ్
54. సూరా అల్ ఖమర్
55. సూరా ఆర్ రహ్మాన్
56. సూరా వాఖియహ్
57. సూరా అల్ హదీద్
58. సూరా అల్ ముజాదల హ్
59. సూరా అల్ హష్ర్
60. సూరా అల్ ముమ్ తహిన హ్
61. సూరా అస్ సఫ్
62. సూరాఅల్ జుముఅ హ్
63. సూరా అల్ మునాఫిఖూన్
64. సూరా అత్ తగాబున్
65. సూరా అత్ తలాఖ్
66. సూరా అత్ తహ్రీం
67. సూరా అల్ ముల్క్
68. సూరా అల్ ఖలమ్
69. సూరా అల్ హఖ్ఖ
70. సూరా అల్ ముఆరిజ్
71. సూరా నూహ్
72. సూరా అల్ జిన్న్
73. సూరా అల్ ముజ్జమ్మిల్
74. సూరా అల్ ముద్దస్సిర్
75. సూరా అల్ ఖియామ హ్
76. సూరా అద్ దహ్ర్
77. సూరా అల్ ముర్సలాత్
78. సూరా అన్ నబా
79. సూరా అన్ నాజి ఆత్
80. సూరా అబస
81. సూరా అత్ తక్వీర్
82. సూరా అల్ ఇన్ ఫితార్
83. సూరాఅల్ ముతఫ్ఫిఫీన్
84. సూరా అల్ ఇన్ షి ఖాక్
85. సూరా అల్ బురూజ్
86. సూరా అత్ తారిఖ్
87. సూరా అల్ ఆలా
88. సూరా అల్ గాషియ హ్
89. సూరా అల్ ఫజ్ర్
90. సూరా అల్ బలద్
91. సూరా ఆష్ షమ్స్
92. సూరా అల్ లైల్
93. సూరా అజ్ జుహా
94. సూరా ఆలమ్ నష్ర్
95. సూరా అత్ తతీన్
96. సూరా అల్ అలఖ్
97. సూరా అల్ ఖద్ర్
98. సూరా అల్ బయ్యిన హ్
99. సూరా అజ్ జిలజాల్
100. సూరా అల్ ఆదియాత్
101. సూరా అల్ ఖారియ హ్
102. సూరా అత్ తకాసుర్
103. సూరా అల్ అస్ర్
104. సూరా అల్ హుమజా హ్
105. సూరా అల్ ఫీల్
106. సూరా ఖురైష్
107. సూరా అల్ మాఊ న్
108. సూరా అల్ కౌసర్
109. సూరా అల్ ఖాఫిరూన్
110. సూరా అన్ నస్ర్
111. సూరా అల్ లహబ్
112. సూరా అల్ ఇఖ్లాస్
113. సూరా అల్ ఫలఖ్
114. సూరా అన్ నాస్

5. సూరా అల్ మాయిద

5:1  يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا أَوْفُوا بِالْعُقُودِ ۚ أُحِلَّتْ لَكُم بَهِيمَةُ الْأَنْعَامِ إِلَّا مَا يُتْلَىٰ عَلَيْكُمْ غَيْرَ مُحِلِّي الصَّيْدِ وَأَنتُمْ حُرُمٌ ۗ إِنَّ اللَّهَ يَحْكُمُ مَا يُرِيدُ
ఓ విశ్వాసులారా! ప్రమాణాలను, ఒప్పందాలను నెరవేర్చండి. మీకు చదివి వినిపించబడేవి తప్ప మిగిలిన చతుష్పాద పశువులన్నీ మీ కోసం ధర్మసమ్మతం (హలాల్‌) గావించబడ్డాయి. అయితే మీరు 'ఇహ్రామ్‌' స్థితిలో ఉన్నప్పుడు వేటను ధర్మసమ్మతంగా పరిగణించకండి. నిశ్చయంగా అల్లాహ్‌ తాను కోరినది ఆజ్ఞాపిస్తాడు.
5:2  يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا لَا تُحِلُّوا شَعَائِرَ اللَّهِ وَلَا الشَّهْرَ الْحَرَامَ وَلَا الْهَدْيَ وَلَا الْقَلَائِدَ وَلَا آمِّينَ الْبَيْتَ الْحَرَامَ يَبْتَغُونَ فَضْلًا مِّن رَّبِّهِمْ وَرِضْوَانًا ۚ وَإِذَا حَلَلْتُمْ فَاصْطَادُوا ۚ وَلَا يَجْرِمَنَّكُمْ شَنَآنُ قَوْمٍ أَن صَدُّوكُمْ عَنِ الْمَسْجِدِ الْحَرَامِ أَن تَعْتَدُوا ۘ وَتَعَاوَنُوا عَلَى الْبِرِّ وَالتَّقْوَىٰ ۖ وَلَا تَعَاوَنُوا عَلَى الْإِثْمِ وَالْعُدْوَانِ ۚ وَاتَّقُوا اللَّهَ ۖ إِنَّ اللَّهَ شَدِيدُ الْعِقَابِ
విశ్వసించిన ఓ ప్రజలారా! అల్లాహ్‌ చిహ్నాలనుగానీ, ఏ నిషిద్ధ మాసాన్నిగానీ అగౌరవపరచకండి. ఖుర్బానీ నిమిత్తం కాబా గృహానికి గొనిపోబడుతున్న జంతువుల, మెడలో పట్టాలు కట్టబడి ఉన్న జంతువుల జోలికిపోకండి. అలాగే తమ ప్రభువు అనుగ్రహాన్ని, ప్రసన్నతను పొందే ఉద్దేశ్యంతో పవిత్ర గృహం (కాబా) వైపుకు వెళుతున్న వారికి అడ్డు తగలకండి. అయితే మీరు ఇహ్రామ్‌ దీక్షను విరమించిన మీదట వేటాడవచ్చు. మస్జిదె హరామ్‌కు పోకుండా (ఒకప్పుడు) మిమ్మల్ని నిలువరించిన వారి పట్ల ద్వేషం మిమ్మల్ని హద్దుమీరినవారుగా మార్చివేయరాదు. సత్కార్యాలలో, అల్లాహ్‌ భీతితో కూడిన విషయాలలో ఒండొకరికి తోడ్పడుతూ ఉండండి. పాపకార్యాలలో, దౌర్జన్యపు పనుల్లో ఎవరితోనూ సహకరించకండి. అల్లాహ్‌కు భయపడుతూ ఉండండి. నిస్సందేహంగా అల్లాహ్‌ చాలా కఠినంగా శిక్షించేవాడు.
5:3  حُرِّمَتْ عَلَيْكُمُ الْمَيْتَةُ وَالدَّمُ وَلَحْمُ الْخِنزِيرِ وَمَا أُهِلَّ لِغَيْرِ اللَّهِ بِهِ وَالْمُنْخَنِقَةُ وَالْمَوْقُوذَةُ وَالْمُتَرَدِّيَةُ وَالنَّطِيحَةُ وَمَا أَكَلَ السَّبُعُ إِلَّا مَا ذَكَّيْتُمْ وَمَا ذُبِحَ عَلَى النُّصُبِ وَأَن تَسْتَقْسِمُوا بِالْأَزْلَامِ ۚ ذَٰلِكُمْ فِسْقٌ ۗ الْيَوْمَ يَئِسَ الَّذِينَ كَفَرُوا مِن دِينِكُمْ فَلَا تَخْشَوْهُمْ وَاخْشَوْنِ ۚ الْيَوْمَ أَكْمَلْتُ لَكُمْ دِينَكُمْ وَأَتْمَمْتُ عَلَيْكُمْ نِعْمَتِي وَرَضِيتُ لَكُمُ الْإِسْلَامَ دِينًا ۚ فَمَنِ اضْطُرَّ فِي مَخْمَصَةٍ غَيْرَ مُتَجَانِفٍ لِّإِثْمٍ ۙ فَإِنَّ اللَّهَ غَفُورٌ رَّحِيمٌ
మీ కొరకు నిషేధించబడిన వస్తువులు ఇవి : మృత పశువు, రక్తం, పంది మాంసం, అల్లాహ్‌ పేరుగాక వేరితరుల పేరు ఉచ్చరించబడినది, గొంతు పిసకబడటం వల్ల చచ్చిన పశువు, దెబ్బ తగిలి చనిపోయిన పశువు, ఎత్తయిన స్థలం నుంచి క్రిందపడి చనిపోయినది లేక కొమ్ము తగలటం వల్ల చచ్చిపోయినది, క్రూరమృగాలు చీల్చి తినటం వల్ల చనిపోయిన పశువు (ఇవి మీ కొరకు హరామ్‌ గావించబడ్డాయి). కాని మీరు ఒకవేళ 'జిబహ్‌' చేస్తే అది మీ కొరకు నిషిద్ధం కాదు. అలాగే ఆస్థానాల వద్ద బలి ఇచ్చినవి కూడా నిషిద్ధమే. అదే విధంగా బాణాల ప్రయోగం ద్వారా అదృష్టాన్ని పరీక్షించుకోవటం కూడా నిషిద్ధమే. ఇవన్నీ అత్యంత నీచమైన పాప కార్యాలు. ఈ రోజు అవిశ్వాసులు మీ ధర్మం గురించి ఇక ఆశను వదులుకున్నారు. జాగ్రత్త! మీరు భయపడవలసింది వారికి కాదు, మీరు నాకు భయపడండి. ఈ రోజు మీ కొరకు మీ ధర్మాన్ని పరిపూర్ణం గావించాను. మీపై నా అనుగ్రహాన్ని పూర్తిచేశాను. ఇంకా, ఇస్లాంను మీ ధర్మంగా సమ్మతించి ఆమోదించాను. ఎవడయినా తీవ్రమయిన ఆకలి బాధతో అల్లాడిపోతూ - గత్యంతరంలేని పరిస్థితిలో పాపానికి పాల్పడే ఉద్దేశం లేకుండా ఉండి (పై వాటిలో దేన్నయినా తిన్నట్లయితే) నిస్సందేహంగా అల్లాహ్‌ క్షమించేవాడు, కనికరించేవాడూను.
5:4  يَسْأَلُونَكَ مَاذَا أُحِلَّ لَهُمْ ۖ قُلْ أُحِلَّ لَكُمُ الطَّيِّبَاتُ ۙ وَمَا عَلَّمْتُم مِّنَ الْجَوَارِحِ مُكَلِّبِينَ تُعَلِّمُونَهُنَّ مِمَّا عَلَّمَكُمُ اللَّهُ ۖ فَكُلُوا مِمَّا أَمْسَكْنَ عَلَيْكُمْ وَاذْكُرُوا اسْمَ اللَّهِ عَلَيْهِ ۖ وَاتَّقُوا اللَّهَ ۚ إِنَّ اللَّهَ سَرِيعُ الْحِسَابِ
(ఓ ప్రవక్తా!) తమ కొరకు 'హలాల్‌' (అనగా ధర్మసమ్మతం) చేయబడిన వస్తువులేవి? అని ప్రజలు నిన్ను అడుగుతున్నారు. వారికి ఇలా చెప్పు: “పరిశుద్ధమైన వస్తువులన్నీ మీ కోసం హలాల్‌ చేయబడ్డాయి. అలాగే మీరు శిక్షణ ఇచ్చిన వేట జంతువులు మీ కోసం ఏదైనా వేటాడితే (ఆ వేట మాంసాన్ని మీరు తినండి). కాని, మీరు వాటిని అల్లాహ్‌ మీకు బోధించిన పద్ధతిలో తర్ఫీదు చేసి ఉండాలి సుమా! దానిపై అల్లాహ్‌ నామాన్ని స్మరించండి. అల్లాహ్‌కు భయపడుతూ ఉండండి. నిస్సందేహంగా అల్లాహ్‌ తొందరగా లెక్క తీసుకునేవాడు.”
5:5  الْيَوْمَ أُحِلَّ لَكُمُ الطَّيِّبَاتُ ۖ وَطَعَامُ الَّذِينَ أُوتُوا الْكِتَابَ حِلٌّ لَّكُمْ وَطَعَامُكُمْ حِلٌّ لَّهُمْ ۖ وَالْمُحْصَنَاتُ مِنَ الْمُؤْمِنَاتِ وَالْمُحْصَنَاتُ مِنَ الَّذِينَ أُوتُوا الْكِتَابَ مِن قَبْلِكُمْ إِذَا آتَيْتُمُوهُنَّ أُجُورَهُنَّ مُحْصِنِينَ غَيْرَ مُسَافِحِينَ وَلَا مُتَّخِذِي أَخْدَانٍ ۗ وَمَن يَكْفُرْ بِالْإِيمَانِ فَقَدْ حَبِطَ عَمَلُهُ وَهُوَ فِي الْآخِرَةِ مِنَ الْخَاسِرِينَ
ఈ రోజు పరిశుద్ధమైన వస్తువులన్నీ మీ కోసం హలాల్‌ చేయబడ్డాయి. గ్రంథవహులు జిబహ్‌ చేసినది మీ కొరకు ధర్మసమ్మతం. మీరు జిబహ్‌ చేసినది వారి కొరకు ధర్మసమ్మతం. సౌశీల్యవతులగు ముస్లిం స్త్రీలు, మీకు పూర్వం గ్రంథం వొసగబడినవారి సౌశీల్యవతులగు స్త్రీలు కూడా మీ కొరకు హలాల్‌ అవుతారు. అయితే మీరు వారికి చెల్లించవలసిన మహర్‌ సొమ్మును చెల్లించి, వారిని వివాహబంధంలోకి తెచ్చుకోవాలి. అంతేగాని, బహిరంగంగా వ్యభిచారం చేయటం కోసం, చాటు మాటు ప్రేమకలాపాలు జరపటం కోసం వారు మీకు హలాల్‌ కారు. విశ్వాసాన్ని తిరస్కరించినవారి కర్మలు వృథా అయిపోతాయి. పరలోకంలో వారు నష్టపోయిన వారిలో చేర్తారు.
5:6  يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا إِذَا قُمْتُمْ إِلَى الصَّلَاةِ فَاغْسِلُوا وُجُوهَكُمْ وَأَيْدِيَكُمْ إِلَى الْمَرَافِقِ وَامْسَحُوا بِرُءُوسِكُمْ وَأَرْجُلَكُمْ إِلَى الْكَعْبَيْنِ ۚ وَإِن كُنتُمْ جُنُبًا فَاطَّهَّرُوا ۚ وَإِن كُنتُم مَّرْضَىٰ أَوْ عَلَىٰ سَفَرٍ أَوْ جَاءَ أَحَدٌ مِّنكُم مِّنَ الْغَائِطِ أَوْ لَامَسْتُمُ النِّسَاءَ فَلَمْ تَجِدُوا مَاءً فَتَيَمَّمُوا صَعِيدًا طَيِّبًا فَامْسَحُوا بِوُجُوهِكُمْ وَأَيْدِيكُم مِّنْهُ ۚ مَا يُرِيدُ اللَّهُ لِيَجْعَلَ عَلَيْكُم مِّنْ حَرَجٍ وَلَٰكِن يُرِيدُ لِيُطَهِّرَكُمْ وَلِيُتِمَّ نِعْمَتَهُ عَلَيْكُمْ لَعَلَّكُمْ تَشْكُرُونَ
ఓ విశ్వసించినవారలారా! మీరు నమాజు కొరకు లేచినప్పుడు మీ మొహాలను, మోచేతుల సమేతంగా మీ చేతులను కడుక్కోండి. మీ తలలను మసహ్‌ చేయండి, చీలమండల వరకు మీ కాళ్ళను కడుక్కోండి. ఒకవేళ మీరు లైంగిక అశుద్ధావస్థకు లోనవుతే స్నానం చేసి పరిశుద్ధులు అవ్వండి. ఒకవేళ మీరు వ్యాధిగ్రస్తులైతే లేక ప్రయాణావస్థలో ఉంటే లేక మీలో ఎవరయినా కాలకృత్యాలు తీర్చుకుని వస్తే లేక మీరు స్త్రీలతో సమాగమం జరిపి ఉంటే - అట్టి పరిస్థితిలో - నీరు లభ్యం కాకపోతే పరిశుభ్రమైన మట్టితో 'తయమ్ముమ్‌' చేసుకోండి. దాన్ని మీ మొహాలపై, చేతులపై తుడుచుకోండి. అల్లాహ్‌ మిమ్మల్ని ఎలాంటి ఇబ్బందికీ గురి చేయదలచుకోడు. మీరు కృతజ్ఞులయ్యేందుకు మిమ్మల్ని పరిశుద్ధులుగా చేసి, మీపై తన అనుగ్రహాన్ని సంపూర్ణం గావించాలన్నదే ఆయన అభిలాష!
5:7  وَاذْكُرُوا نِعْمَةَ اللَّهِ عَلَيْكُمْ وَمِيثَاقَهُ الَّذِي وَاثَقَكُم بِهِ إِذْ قُلْتُمْ سَمِعْنَا وَأَطَعْنَا ۖ وَاتَّقُوا اللَّهَ ۚ إِنَّ اللَّهَ عَلِيمٌ بِذَاتِ الصُّدُورِ
మీపై ఉన్న అల్లాహ్‌ అనుగ్రహాన్ని, ఆయన మీనుండి తీసుకున్న ప్రమాణాన్ని జ్ఞాపకం ఉంచుకోండి. అప్పుడు మీరు, “మేము విన్నాము, శిరసావహించాము” అని చెప్పి ఉన్నారు. అల్లాహ్‌కు భయపడుతూ ఉండండి. నిశ్చయంగా అల్లాహ్‌ మనసుల్లోని విషయాలు సయితం ఎరిగినవాడు.
5:8  يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا كُونُوا قَوَّامِينَ لِلَّهِ شُهَدَاءَ بِالْقِسْطِ ۖ وَلَا يَجْرِمَنَّكُمْ شَنَآنُ قَوْمٍ عَلَىٰ أَلَّا تَعْدِلُوا ۚ اعْدِلُوا هُوَ أَقْرَبُ لِلتَّقْوَىٰ ۖ وَاتَّقُوا اللَّهَ ۚ إِنَّ اللَّهَ خَبِيرٌ بِمَا تَعْمَلُونَ
ఓ విశ్వాసులారా! మీరు అల్లాహ్‌ కొరకు సత్యంపై నిలకడగా ఉండండి. న్యాయానికి సాక్షులుగా ఉండండి. ఏదైనా ఒక వర్గంతో ఉన్న విరోధం మిమ్మల్ని న్యాయవిరుద్ధతకు పాల్పడనీయకూడదు. న్యాయం చెయ్యండి. ఇది దైవభీతికి అత్యంత చేరువైనది. అల్లాహ్‌కు భయపడుతూ ఉండండి. మీరు చేసే పనులన్నీ అల్లాహ్‌కు తెలుస్తూనే ఉంటాయి.
5:9  وَعَدَ اللَّهُ الَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ ۙ لَهُم مَّغْفِرَةٌ وَأَجْرٌ عَظِيمٌ
విశ్వసించి, మంచిపనులు చేసిన వారికి గొప్ప మన్నింపుతో పాటు, గొప్ప ప్రతి ఫలం కూడా ఉందని అల్లాహ్‌ వాగ్దానం చేశాడు.
5:10  وَالَّذِينَ كَفَرُوا وَكَذَّبُوا بِآيَاتِنَا أُولَٰئِكَ أَصْحَابُ الْجَحِيمِ
మరెవరు అవిశ్వాసానికి ఒడిగట్టి, మా ఆదేశాలను ధిక్కరించారో వారే నరకవాసులు.
5:11  يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا اذْكُرُوا نِعْمَتَ اللَّهِ عَلَيْكُمْ إِذْ هَمَّ قَوْمٌ أَن يَبْسُطُوا إِلَيْكُمْ أَيْدِيَهُمْ فَكَفَّ أَيْدِيَهُمْ عَنكُمْ ۖ وَاتَّقُوا اللَّهَ ۚ وَعَلَى اللَّهِ فَلْيَتَوَكَّلِ الْمُؤْمِنُونَ
విశ్వాసులారా! అల్లాహ్‌ మీకు చేసిన ఉపకారాన్ని కాస్త జ్ఞప్తికి తెచ్చుకోండి - అప్పుడు ఒక జాతివారు మీపై చేయి చేసుకోవాలని అనుకున్నారు. అయితే అల్లాహ్‌ వారి చేతులు మీపై లేవకుండా ఆపాడు. అల్లాహ్‌కు భయపడుతూ ఉండండి. విశ్వాసులు నమ్ముకోవలసింది కూడా అల్లాహ్‌నే.
5:12  وَلَقَدْ أَخَذَ اللَّهُ مِيثَاقَ بَنِي إِسْرَائِيلَ وَبَعَثْنَا مِنْهُمُ اثْنَيْ عَشَرَ نَقِيبًا ۖ وَقَالَ اللَّهُ إِنِّي مَعَكُمْ ۖ لَئِنْ أَقَمْتُمُ الصَّلَاةَ وَآتَيْتُمُ الزَّكَاةَ وَآمَنتُم بِرُسُلِي وَعَزَّرْتُمُوهُمْ وَأَقْرَضْتُمُ اللَّهَ قَرْضًا حَسَنًا لَّأُكَفِّرَنَّ عَنكُمْ سَيِّئَاتِكُمْ وَلَأُدْخِلَنَّكُمْ جَنَّاتٍ تَجْرِي مِن تَحْتِهَا الْأَنْهَارُ ۚ فَمَن كَفَرَ بَعْدَ ذَٰلِكَ مِنكُمْ فَقَدْ ضَلَّ سَوَاءَ السَّبِيلِ
అల్లాహ్‌ ఇస్రాయీల్‌ సంతతి నుండి గట్టి వాగ్దానాన్ని తీసుకున్నాడు. వారిలో నుంచే పన్నెండు మంది నాయకులను మేము నియమించాము. ఇంకా అల్లాహ్‌ వారితో ఇలా అన్నాడు: “నిశ్చయంగా నేను మీకు తోడుగా ఉన్నాను. మీరు గనక నమాజును నెలకొల్పుతూ ఉంటే, జకాత్‌ ఇస్తూ ఉంటే, నా ప్రవక్తలను విశ్వసిస్తూ, వారిని గౌరవించి వారికి సహాయ పడితే, అల్లాహ్‌కు ఉత్తమ రుణాన్ని ఇస్తూ ఉంటే నేను మీ చెడుగులను మీ నుంచి దూరం చేస్తాను. క్రింద సెలయేళ్లు ప్రవహించే స్వర్గవనాలలోకి మిమ్మల్ని తీసుకుపోతాను. ఈ ప్రమాణం తరువాత కూడా మీలో ఎవడైనా తిరస్కార వైఖరికి పాల్పడితే అతడు రుజుమార్గం (సవావుస్సబీల్‌) నుంచి తప్పిపోయాడు.”
5:13  فَبِمَا نَقْضِهِم مِّيثَاقَهُمْ لَعَنَّاهُمْ وَجَعَلْنَا قُلُوبَهُمْ قَاسِيَةً ۖ يُحَرِّفُونَ الْكَلِمَ عَن مَّوَاضِعِهِ ۙ وَنَسُوا حَظًّا مِّمَّا ذُكِّرُوا بِهِ ۚ وَلَا تَزَالُ تَطَّلِعُ عَلَىٰ خَائِنَةٍ مِّنْهُمْ إِلَّا قَلِيلًا مِّنْهُمْ ۖ فَاعْفُ عَنْهُمْ وَاصْفَحْ ۚ إِنَّ اللَّهَ يُحِبُّ الْمُحْسِنِينَ
ఆ తరువాత వారు తమ వాగ్దానాన్ని భంగపరచిన కారణంగా మేము వారిని శపించాము. వారి హృదయాలను కఠినం చేశాము. (తత్కారణంగా) వారు పదాలను వాటి (అసలు) స్థానం నుంచి తారుమారు చేస్తున్నారు. అంతేకాదు, తమకు బోధించబడిన ఉపదేశంలో చాలా భాగం వారు మరచి పోయారు. (ఓ ప్రవక్తా!) వారు పాల్పడే ఏదో ఒక ద్రోహానికి సంబంధించిన సమాచారం నీకు అందుతూనే ఉంటుంది. అయితే వారిలో కొద్దిమంది మాత్రం అలాంటివారు కారు. అయినా సరే నువ్వు వారిని మన్నిస్తూ, ఉపేక్షిస్తూ ఉండు. నిస్సందేహంగా అల్లాహ్‌ ఉత్తమంగా వ్యవహరించేవారిని అమితంగా ప్రేమిస్తాడు.
5:14  وَمِنَ الَّذِينَ قَالُوا إِنَّا نَصَارَىٰ أَخَذْنَا مِيثَاقَهُمْ فَنَسُوا حَظًّا مِّمَّا ذُكِّرُوا بِهِ فَأَغْرَيْنَا بَيْنَهُمُ الْعَدَاوَةَ وَالْبَغْضَاءَ إِلَىٰ يَوْمِ الْقِيَامَةِ ۚ وَسَوْفَ يُنَبِّئُهُمُ اللَّهُ بِمَا كَانُوا يَصْنَعُونَ
తమను తాము 'నసారా'(క్రైస్తవులు)గా చెప్పుకునేవారి నుండి కూడా మేము వాగ్దానం తీసుకున్నాము. అయితే వారు కూడా తమకు చేయబడిన ఉపదేశంలోని ఎక్కువ భాగాన్ని విస్మరించారు. ఈ కారణంగా మేము వారి మధ్య విరోధాన్ని, విద్వేషాలను తగిలించాము. అవి ప్రళయ దినం వరకూ ఉంటాయి. వారు చేస్తూ ఉండిన పనులన్నింటినీ అల్లాహ్‌ త్వరలోనే వారికి తెలియజేస్తాడు.
5:15  يَا أَهْلَ الْكِتَابِ قَدْ جَاءَكُمْ رَسُولُنَا يُبَيِّنُ لَكُمْ كَثِيرًا مِّمَّا كُنتُمْ تُخْفُونَ مِنَ الْكِتَابِ وَيَعْفُو عَن كَثِيرٍ ۚ قَدْ جَاءَكُم مِّنَ اللَّهِ نُورٌ وَكِتَابٌ مُّبِينٌ
ఓ గ్రంథవహులారా! మీ వద్దకు మా ప్రవక్త (సఅసం) వచ్చేశాడు. మీరు కప్పిపుచ్చుతూ ఉండిన గ్రంథంలోని ఎన్నో విషయాలను అతను మీ ముందు విపులీకరిస్తున్నాడు. మరెన్నో విషయాలను ఉపేక్షిస్తున్నాడు. అల్లాహ్‌ తరఫు నుంచి మీ వద్దకు జ్యోతి వచ్చేసింది. అంటే, స్పష్టమైన గ్రంథం వచ్చేసింది.
5:16  يَهْدِي بِهِ اللَّهُ مَنِ اتَّبَعَ رِضْوَانَهُ سُبُلَ السَّلَامِ وَيُخْرِجُهُم مِّنَ الظُّلُمَاتِ إِلَى النُّورِ بِإِذْنِهِ وَيَهْدِيهِمْ إِلَىٰ صِرَاطٍ مُّسْتَقِيمٍ
దాని ద్వారా అల్లాహ్‌ తన ప్రసన్నతను అనుసరించేవారికి శాంతి మార్గాలను చూపుతాడు. తన అనుమతి మేరకు వారిని చీకట్లలో నుంచి వెలికితీసి, కాంతి వైపుకు తీసుకువస్తాడు. రుజుమార్గం వైపుకు వారికి దర్శకత్వం వహిస్తాడు.
5:17  لَّقَدْ كَفَرَ الَّذِينَ قَالُوا إِنَّ اللَّهَ هُوَ الْمَسِيحُ ابْنُ مَرْيَمَ ۚ قُلْ فَمَن يَمْلِكُ مِنَ اللَّهِ شَيْئًا إِنْ أَرَادَ أَن يُهْلِكَ الْمَسِيحَ ابْنَ مَرْيَمَ وَأُمَّهُ وَمَن فِي الْأَرْضِ جَمِيعًا ۗ وَلِلَّهِ مُلْكُ السَّمَاوَاتِ وَالْأَرْضِ وَمَا بَيْنَهُمَا ۚ يَخْلُقُ مَا يَشَاءُ ۚ وَاللَّهُ عَلَىٰ كُلِّ شَيْءٍ قَدِيرٌ
“అల్లాహ్‌ (అంటే) మర్యమ్‌ పుత్రుడైన మసీహ్‌యే” అని అన్నవారు నిస్సందేహంగా అవిశ్వాసానికి పాల్పడ్డారు. (ఓ ప్రవక్తా!) వారికి చెప్పు: “ఒకవేళ అల్లాహ్‌ మర్యమ్‌ పుత్రుడైన మసీహ్‌ని, అతని తల్లిని, భూమండలంలోని సమస్త జనులనూ నాశనం చేయదలిస్తే, ఆయన్ని అడ్డుకోగల శక్తి, అధికారం ఎవరికున్నాయి? భూమ్యాకాశాలలోనూ, వాటి మధ్యలోనూ ఉన్నవాటి సమస్త సార్వభౌమత్వానికి అధిపతి అల్లాహ్‌యే. ఆయన తాను కోరిన దాన్ని సృష్టిస్తాడు. అల్లాహ్‌ ప్రతిదీ చేయగల అధికారం కలవాడు.”
5:18  وَقَالَتِ الْيَهُودُ وَالنَّصَارَىٰ نَحْنُ أَبْنَاءُ اللَّهِ وَأَحِبَّاؤُهُ ۚ قُلْ فَلِمَ يُعَذِّبُكُم بِذُنُوبِكُم ۖ بَلْ أَنتُم بَشَرٌ مِّمَّنْ خَلَقَ ۚ يَغْفِرُ لِمَن يَشَاءُ وَيُعَذِّبُ مَن يَشَاءُ ۚ وَلِلَّهِ مُلْكُ السَّمَاوَاتِ وَالْأَرْضِ وَمَا بَيْنَهُمَا ۖ وَإِلَيْهِ الْمَصِيرُ
“మేము అల్లాహ్‌ పుత్రులం, ఆయనకు ప్రియమైన వారం” అని యూదులు, క్రైస్తవులు (నస్రానీలు) అంటారు. (ఓ ప్రవక్తా!) వారిని ఇలా అడుగు : “మరయితే మీ పాపాలకుగాను ఆయన మిమ్మల్ని ఎందుకు శిక్షిస్తున్నాడు? కాదు, మీరు కూడా ఆయన సృష్టించిన మానవ వర్గానికి చెందినవారే. ఆయన తాను కోరిన వారిని క్షమిస్తాడు, తాను కోరిన వారిని శిక్షిస్తాడు. భూమ్యా కాశాలలోనూ, వాటి మధ్యనూ ఉన్నవాటన్నింటిపై అధికారం అల్లాహ్‌దే. ఆయన వైపుకే మరలిపోవలసి ఉంది.”
5:19  يَا أَهْلَ الْكِتَابِ قَدْ جَاءَكُمْ رَسُولُنَا يُبَيِّنُ لَكُمْ عَلَىٰ فَتْرَةٍ مِّنَ الرُّسُلِ أَن تَقُولُوا مَا جَاءَنَا مِن بَشِيرٍ وَلَا نَذِيرٍ ۖ فَقَدْ جَاءَكُم بَشِيرٌ وَنَذِيرٌ ۗ وَاللَّهُ عَلَىٰ كُلِّ شَيْءٍ قَدِيرٌ
గ్రంథవహులారా! ప్రవక్తల ఆగమన క్రమంలో విరామం తర్వాత మా ప్రవక్త మీ వద్దకు వచ్చేశాడు. అతను మీకు స్పష్టంగా విడమరచి చెబుతున్నాడు. మా వద్దకు శుభవార్త అందించేవాడు, భయపెట్టేవాడు ఎవరూ రాలేదన్న మాట మీరు అనకుండా ఉండేందుకుగాను (ఈ ఏర్పాటు జరిగింది). అందుకే ఇప్పుడు నిజంగా శుభవార్త వినిపించేవాడు, భయపెట్టేవాడు మీ వద్దకు వచ్చేశాడు. అల్లాహ్‌ అన్నింటిపై అధికారం కలవాడు.
5:20  وَإِذْ قَالَ مُوسَىٰ لِقَوْمِهِ يَا قَوْمِ اذْكُرُوا نِعْمَةَ اللَّهِ عَلَيْكُمْ إِذْ جَعَلَ فِيكُمْ أَنبِيَاءَ وَجَعَلَكُم مُّلُوكًا وَآتَاكُم مَّا لَمْ يُؤْتِ أَحَدًا مِّنَ الْعَالَمِينَ
మూసా తన జాతి వారినుద్దేశించి చెప్పిన విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి : “ఓ నా జాతి ప్రజలారా! అల్లాహ్‌ మీకు చేసిన ఉపకారాన్ని కాస్త మననం చేసుకోండి - ఆయన మీలో ప్రవక్తల్ని నియమించాడు. మిమ్మల్ని రాజులుగా చేశాడు. లోకవాసులలో ఎవరికీ ప్రసాదించని దానిని మీకు ప్రసాదించాడు.”
5:21  يَا قَوْمِ ادْخُلُوا الْأَرْضَ الْمُقَدَّسَةَ الَّتِي كَتَبَ اللَّهُ لَكُمْ وَلَا تَرْتَدُّوا عَلَىٰ أَدْبَارِكُمْ فَتَنقَلِبُوا خَاسِرِينَ
“నా జాతివారలారా! అల్లాహ్‌ మీకు రాసిపెట్టిన ఈ పవిత్ర ప్రదేశంలో ప్రవేశించండి. వెన్నుచూపి మరలిపోకండి. వెన్నుచూపి మరలిపోయారంటే మీరే నష్టపోతారు.”
5:22  قَالُوا يَا مُوسَىٰ إِنَّ فِيهَا قَوْمًا جَبَّارِينَ وَإِنَّا لَن نَّدْخُلَهَا حَتَّىٰ يَخْرُجُوا مِنْهَا فَإِن يَخْرُجُوا مِنْهَا فَإِنَّا دَاخِلُونَ
దానికి వారు ఇలా బదులిచ్చారు : “మూసా! అక్కడ మహాబలవంతులు ఉన్నారు. వారక్కణ్ణుంచి వెళ్ళిపోనంత వరకూ మేము అందులో ప్రవేశించేది లేదు. ఒకవేళ వారు వెళ్ళిపోతే మాత్రం, మేము తప్పకుండా అందులోకి ప్రవేశిస్తాము.”
5:23  قَالَ رَجُلَانِ مِنَ الَّذِينَ يَخَافُونَ أَنْعَمَ اللَّهُ عَلَيْهِمَا ادْخُلُوا عَلَيْهِمُ الْبَابَ فَإِذَا دَخَلْتُمُوهُ فَإِنَّكُمْ غَالِبُونَ ۚ وَعَلَى اللَّهِ فَتَوَكَّلُوا إِن كُنتُم مُّؤْمِنِينَ
అప్పుడు, అల్లాహ్‌కు భయపడే వారిలో ఆయన అనుగ్రహం పొందిన ఇద్దరు ఇలా అన్నారు : “మీరు వారిని ఎదుర్కోవటానికి (కనీసం) ద్వారం లోపలికైనా ప్రవేశించండి. మీరు లోపలికి ప్రవేశిస్తే చాలు, మీరే ఆధిక్యత పొందుతారు. మీరు విశ్వాసులే అయితే అల్లాహ్‌నే నమ్మండి.”
5:24  قَالُوا يَا مُوسَىٰ إِنَّا لَن نَّدْخُلَهَا أَبَدًا مَّا دَامُوا فِيهَا ۖ فَاذْهَبْ أَنتَ وَرَبُّكَ فَقَاتِلَا إِنَّا هَاهُنَا قَاعِدُونَ
(కాని ఈ మాటల్ని వారు లక్ష్య పెట్టలేదు). “ఓ మూసా! వారు అక్కడ ఉన్నంత వరకూ మేము సుతరామూ అక్కడికి వెళ్ళబోము. నువ్వూ, నీ ప్రభువూ పోయి ఉభయులూ వారితో పోరాడండి. మేమిక్కడే కూర్చుని ఉంటాము” అని వారు చెప్పారు.
5:25  قَالَ رَبِّ إِنِّي لَا أَمْلِكُ إِلَّا نَفْسِي وَأَخِي ۖ فَافْرُقْ بَيْنَنَا وَبَيْنَ الْقَوْمِ الْفَاسِقِينَ
అప్పుడు మూసా ఇలా విన్నవించుకున్నాడు: “ప్రభూ! నాకు నా స్వయంపైనా, నా సోదరునిపైన మాత్రమే అధికారం ఉంది. కాబట్టి నువ్వు మమ్మల్ని - ఈ అవిధేయులను వేరు చెయ్యి.”
5:26  قَالَ فَإِنَّهَا مُحَرَّمَةٌ عَلَيْهِمْ ۛ أَرْبَعِينَ سَنَةً ۛ يَتِيهُونَ فِي الْأَرْضِ ۚ فَلَا تَأْسَ عَلَى الْقَوْمِ الْفَاسِقِينَ
అప్పుడు అల్లాహ్‌ ఇలా అన్నాడు: “ఇక ఈ భూమి వారి కోసం నలభై సంవత్సరాల దాకా నిషేధించబడింది. వారు ఎక్కడా నిలువ నీడ లేకుండా నేలపై తచ్చాడుతూ తిరుగుతుంటారు. కనుక నువ్వు ఈ అవిధేయ జనుల విషయంలో దుఃఖించకు.”
5:27  وَاتْلُ عَلَيْهِمْ نَبَأَ ابْنَيْ آدَمَ بِالْحَقِّ إِذْ قَرَّبَا قُرْبَانًا فَتُقُبِّلَ مِنْ أَحَدِهِمَا وَلَمْ يُتَقَبَّلْ مِنَ الْآخَرِ قَالَ لَأَقْتُلَنَّكَ ۖ قَالَ إِنَّمَا يَتَقَبَّلُ اللَّهُ مِنَ الْمُتَّقِينَ
(ఓ ముహమ్మద్‌-స!) ఆదం యొక్క ఇద్దరు కుమారుల వృత్తాంతాన్ని కూడా వారికి యధాతథంగా వినిపించు. వారిరువురూ దైవానికి నజరానా సమర్పించగా, వారిలో ఒకరి నజరానా స్వీకరించబడింది. మరొకరిది స్వీకరించబడలేదు. అప్పుడు రెండవతను, “నేను నిన్ను చంపేస్తాను” అన్నాడు. దానికి సమాధానంగా మొదటివాడు, “అల్లాహ్‌ భీతిపరుల నజరానాను మాత్రమే స్వీకరిస్తాడు -
5:28  لَئِن بَسَطتَ إِلَيَّ يَدَكَ لِتَقْتُلَنِي مَا أَنَا بِبَاسِطٍ يَدِيَ إِلَيْكَ لِأَقْتُلَكَ ۖ إِنِّي أَخَافُ اللَّهَ رَبَّ الْعَالَمِينَ
“నువ్వు నన్ను చంపటానికి చెయ్యి ఎత్తినా, నేను మాత్రం నిన్ను చంపే ఉద్దేశంతో చెయ్యి ఎత్తను. నేను సకల లోకాల ప్రభువైన అల్లాహ్‌కు భయపడుతున్నాను.
5:29  إِنِّي أُرِيدُ أَن تَبُوءَ بِإِثْمِي وَإِثْمِكَ فَتَكُونَ مِنْ أَصْحَابِ النَّارِ ۚ وَذَٰلِكَ جَزَاءُ الظَّالِمِينَ
“నువ్వు నీ పాపంతో పాటు, నా పాపం కూడా నీ నెత్తిన పెట్టుకుని నరక వాసుల్లో చేరిపోవాలని కోరుకుంటాను (గాని నేను మాత్రం ఆ పాపానికి ఒడిగట్టలేను). దుర్మార్గులకు ప్రతిఫలం ఇదే” అని అన్నాడు.
5:30  فَطَوَّعَتْ لَهُ نَفْسُهُ قَتْلَ أَخِيهِ فَقَتَلَهُ فَأَصْبَحَ مِنَ الْخَاسِرِينَ
తర్వాత అతని మనసు తన సోదరుని హత్యకే పురికొల్పింది. అతణ్ణి హత్యచేసి అతడు నష్టపోయిన వారిలో చేరిపోయాడు.
5:31  فَبَعَثَ اللَّهُ غُرَابًا يَبْحَثُ فِي الْأَرْضِ لِيُرِيَهُ كَيْفَ يُوَارِي سَوْءَةَ أَخِيهِ ۚ قَالَ يَا وَيْلَتَا أَعَجَزْتُ أَنْ أَكُونَ مِثْلَ هَٰذَا الْغُرَابِ فَأُوَارِيَ سَوْءَةَ أَخِي ۖ فَأَصْبَحَ مِنَ النَّادِمِينَ
ఆ తరువాత సోదరుని శవాన్ని ఎలా దాచాలో అతనికి చూపించటానికి అల్లాహ్‌ ఒక కాకిని పంపాడు. అది నేలను త్రవ్వసాగింది. అతను (ఆ దృశ్యాన్ని చూసి,) “అయ్యో! నా సోదరుని శవాన్ని దాచే విషయంలో నేను ఈ కాకిపాటి వాణ్ణి కూడా కాలేకపోయానే” అంటూ సిగ్గుతో కుమిలిపోయాడు.
5:32  مِنْ أَجْلِ ذَٰلِكَ كَتَبْنَا عَلَىٰ بَنِي إِسْرَائِيلَ أَنَّهُ مَن قَتَلَ نَفْسًا بِغَيْرِ نَفْسٍ أَوْ فَسَادٍ فِي الْأَرْضِ فَكَأَنَّمَا قَتَلَ النَّاسَ جَمِيعًا وَمَنْ أَحْيَاهَا فَكَأَنَّمَا أَحْيَا النَّاسَ جَمِيعًا ۚ وَلَقَدْ جَاءَتْهُمْ رُسُلُنَا بِالْبَيِّنَاتِ ثُمَّ إِنَّ كَثِيرًا مِّنْهُم بَعْدَ ذَٰلِكَ فِي الْأَرْضِ لَمُسْرِفُونَ
ఈ కారణంగానే మేము ఇస్రాయీలు సంతతిపై ఈ ఫర్మానా విధించాము: “ఎవరయినా ఒకరి హత్యకు ప్రతీకారంగా కాకుండా, భూమిలో కల్లోలాన్ని రేకెత్తించినందుకు కాకుండా, అకారణంగా ఎవరినయినా చంపినట్లయితే అతడు సమస్త మానవులను చంపినవాడవుతాడు. అలాగే ఎవరయినా ఒకరి ప్రాణాన్ని రక్షిస్తే అతడు సమస్త మానవుల ప్రాణాలను రక్షించిన వాడవుతాడు.” వారి వద్దకు మా ప్రవక్తలెందరో స్పష్టమయిన నిదర్శనాలను తీసుకువచ్చారు. కాని ఆ తరువాత కూడా వారిలో చాలా మంది అవనిలో దుర్మార్గం, దౌర్జన్యాలకు పాల్పడేవారు ఉన్నారు.
5:33  إِنَّمَا جَزَاءُ الَّذِينَ يُحَارِبُونَ اللَّهَ وَرَسُولَهُ وَيَسْعَوْنَ فِي الْأَرْضِ فَسَادًا أَن يُقَتَّلُوا أَوْ يُصَلَّبُوا أَوْ تُقَطَّعَ أَيْدِيهِمْ وَأَرْجُلُهُم مِّنْ خِلَافٍ أَوْ يُنفَوْا مِنَ الْأَرْضِ ۚ ذَٰلِكَ لَهُمْ خِزْيٌ فِي الدُّنْيَا ۖ وَلَهُمْ فِي الْآخِرَةِ عَذَابٌ عَظِيمٌ
ఎవరు అల్లాహ్‌తోనూ, ఆయన ప్రవక్తతోనూ పోరాడుతారో, భూమిలో కల్లోలాన్ని రేకెత్తిస్తూ తిరుగుతుంటారో వారు వధించబడాలి. లేదా ఉరి కంబం ఎక్కించబడాలి. లేదా ఎదురుగా వారి కాళ్లు చేతులు ఖండించబడాలి. లేదా వారిని దేశం నుంచి బహిష్కరించాలి. ఇది ఇహలోకంలో వారికి కలగవలసిన పరాభవం. పరలోకంలో వారికి విధించబడే శిక్ష (ఇంతకన్నా) ఘోరంగా ఉంటుంది.
5:34  إِلَّا الَّذِينَ تَابُوا مِن قَبْلِ أَن تَقْدِرُوا عَلَيْهِمْ ۖ فَاعْلَمُوا أَنَّ اللَّهَ غَفُورٌ رَّحِيمٌ
కాని వారిలో ఎవరయినా మీ అదుపులోకి రాకముందే పశ్చాత్తాపపడితే, అల్లాహ్‌ అమితంగా క్షమించేవాడు, అపారంగా కరుణించేవాడని తెలుసుకోండి.
5:35  يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا اتَّقُوا اللَّهَ وَابْتَغُوا إِلَيْهِ الْوَسِيلَةَ وَجَاهِدُوا فِي سَبِيلِهِ لَعَلَّكُمْ تُفْلِحُونَ
విశ్వసించిన ఓ ప్రజలారా! అల్లాహ్‌కు భయపడుతూ ఉండండి. ఆయన సామీప్యాన్ని పొందే సాధనం వెతకండి. ఆయన మార్గంలో(యుద్ధ ప్రాతిపదికన) కృషి సలపండి. తద్వారా మీరు సాఫల్యం పొందవచ్చు.
5:36  إِنَّ الَّذِينَ كَفَرُوا لَوْ أَنَّ لَهُم مَّا فِي الْأَرْضِ جَمِيعًا وَمِثْلَهُ مَعَهُ لِيَفْتَدُوا بِهِ مِنْ عَذَابِ يَوْمِ الْقِيَامَةِ مَا تُقُبِّلَ مِنْهُمْ ۖ وَلَهُمْ عَذَابٌ أَلِيمٌ
తిరస్కార వైఖరిని అవలంబించిన వారివద్ద భూమిలో ఉన్న సంపద మొత్తం, ఇంకా అంతే సంపద దానితోపాటు ఉండి, ఆ మొత్తం సంపదను వారు ప్రళయ దినపు శిక్షనుంచి తప్పించుకోవటానికి పరిహారంగా ఇవ్వదలచినా - అది వారి నుండి స్వీకరింపజాలదు. వారికి బాధాకరమైన శిక్ష ఉంటుంది.
5:37  يُرِيدُونَ أَن يَخْرُجُوا مِنَ النَّارِ وَمَا هُم بِخَارِجِينَ مِنْهَا ۖ وَلَهُمْ عَذَابٌ مُّقِيمٌ
వారు నరకాగ్ని నుంచి బయటపడాలని పరితపిస్తారు. కాని వారు దాన్నుంచి బయటికి రాలేరు. వారి కోసం శాశ్వితమైన శిక్ష ఉంటుంది.
5:38  وَالسَّارِقُ وَالسَّارِقَةُ فَاقْطَعُوا أَيْدِيَهُمَا جَزَاءً بِمَا كَسَبَا نَكَالًا مِّنَ اللَّهِ ۗ وَاللَّهُ عَزِيزٌ حَكِيمٌ
దొంగతనం చేసినది - పురుషుడైనా, స్త్రీ అయినా - ఉభయుల చేతులూ నరకండి. అది వారు చేసిన దానికి ప్రతిఫలం. అల్లాహ్‌ తరఫున విధించబడిన శిక్ష. అల్లాహ్‌ సర్వాధిక్యుడు, వివేచనాశీలి కూడా.
5:39  فَمَن تَابَ مِن بَعْدِ ظُلْمِهِ وَأَصْلَحَ فَإِنَّ اللَّهَ يَتُوبُ عَلَيْهِ ۗ إِنَّ اللَّهَ غَفُورٌ رَّحِيمٌ
పాపం చేసిన తరువాత పశ్చాత్తాపం చెంది, తన నడవడికను సరిదిద్దుకున్నవాని వైపుకు అల్లాహ్‌ కారుణ్యంతో మరలుతాడు. నిస్సందేహంగా అల్లాహ్‌ క్షమాభిక్షపెట్టేవాడు, కరుణించేవాడూను.
5:40  أَلَمْ تَعْلَمْ أَنَّ اللَّهَ لَهُ مُلْكُ السَّمَاوَاتِ وَالْأَرْضِ يُعَذِّبُ مَن يَشَاءُ وَيَغْفِرُ لِمَن يَشَاءُ ۗ وَاللَّهُ عَلَىٰ كُلِّ شَيْءٍ قَدِيرٌ
ఆకాశాల మరియు భూమి యొక్క రాజ్యాధికారం అల్లాహ్‌దే నన్న సంగతి నీకు తెలియదా? ఆయన తాను తలచిన వారిని శిక్షిస్తాడు, తాను తలచినవారిని క్షమిస్తాడు. అల్లాహ్‌ అన్నింటిపై తిరుగులేని అధికారం కలవాడు.
5:41  يَا أَيُّهَا الرَّسُولُ لَا يَحْزُنكَ الَّذِينَ يُسَارِعُونَ فِي الْكُفْرِ مِنَ الَّذِينَ قَالُوا آمَنَّا بِأَفْوَاهِهِمْ وَلَمْ تُؤْمِن قُلُوبُهُمْ ۛ وَمِنَ الَّذِينَ هَادُوا ۛ سَمَّاعُونَ لِلْكَذِبِ سَمَّاعُونَ لِقَوْمٍ آخَرِينَ لَمْ يَأْتُوكَ ۖ يُحَرِّفُونَ الْكَلِمَ مِن بَعْدِ مَوَاضِعِهِ ۖ يَقُولُونَ إِنْ أُوتِيتُمْ هَٰذَا فَخُذُوهُ وَإِن لَّمْ تُؤْتَوْهُ فَاحْذَرُوا ۚ وَمَن يُرِدِ اللَّهُ فِتْنَتَهُ فَلَن تَمْلِكَ لَهُ مِنَ اللَّهِ شَيْئًا ۚ أُولَٰئِكَ الَّذِينَ لَمْ يُرِدِ اللَّهُ أَن يُطَهِّرَ قُلُوبَهُمْ ۚ لَهُمْ فِي الدُّنْيَا خِزْيٌ ۖ وَلَهُمْ فِي الْآخِرَةِ عَذَابٌ عَظِيمٌ
ఓ ప్రవక్తా! అవిశ్వాసంలో ముందుకు దూసుకుపోయే వారిని చూసి నువ్వు దుఃఖించకు. తాము ముస్లిములమేనని వారు నోటితో పలికినాసరే - వాస్తవానికి వారి హృదయాలు విశ్వాస పూరితం కావు (వాటిలో కాపట్యం ఉంది). కాగా; యూదుల్లోని కొందరు తప్పుడు మాటలను ఆసక్తితో చెవియొగ్గి వింటారు. ఇంకా ఇంతవరకూ నీ వద్దకు రాని వారి కోసం గూఢచారులుగా వ్యవహరిస్తున్నారు. వారు పదాల అసలు సందర్భాన్ని విడిచిపెట్టి, వాటిని తారుమారు చేస్తారు. “మీకు ఈ ఆదేశమే గనక ఇవ్వబడితే దాన్ని స్వీకరించండి. ఈ ఆదేశం గనక లభించకపోతే దూరంగా ఉండండి” అని (ప్రజలకు) చెబుతారు. అల్లాహ్‌ ఎవరినయినా వినాశాని (ఫిత్నా)కి లోను చేయదలిస్తే అల్లాహ్‌కు ప్రతిగా నీకు వారిపై ఏ అధికారం ఉండదు. అల్లాహ్‌ పరిశుద్ధ పరచదలచుకోలేనిది ఇటువంటి వారి హృదయాలనే. వారికి ఇహలోకంలోనూ పరాభవం ఉంటుంది, పరలోకంలో కూడా వారికి ఘోర శిక్ష తప్పదు.
5:42  سَمَّاعُونَ لِلْكَذِبِ أَكَّالُونَ لِلسُّحْتِ ۚ فَإِن جَاءُوكَ فَاحْكُم بَيْنَهُمْ أَوْ أَعْرِضْ عَنْهُمْ ۖ وَإِن تُعْرِضْ عَنْهُمْ فَلَن يَضُرُّوكَ شَيْئًا ۖ وَإِنْ حَكَمْتَ فَاحْكُم بَيْنَهُم بِالْقِسْطِ ۚ إِنَّ اللَّهَ يُحِبُّ الْمُقْسِطِينَ
వీరు చెవియొగ్గి అబద్ధాలు వినేవారు, నిషిద్ధమైన సొమ్ము (హరాం) చాలా ఎక్కువగా తినేవారు. ఒకవేళ వారు (తమ గొడవలను) నీ వద్దకు తీసుకువస్తే, నీకిష్టముంటే వారి మధ్య తీర్పు చెప్పు, లేదంటే విముఖతను తెలుపు. ఒకవేళ నువ్వు వారినుంచి ముఖం త్రిప్పుకున్నా వారు నీకెలాంటి హానీ కలిగించలేరు. ఒకవేళ నువ్వు (వారి వ్యవహారాలపై), తీర్పు చెబితే వారిమధ్య న్యాయసమ్మతంగా తీర్పు చెప్పు. నిస్సందేహంగా అల్లాహ్‌ న్యాయశీలురను ప్రేమిస్తాడు.
5:43  وَكَيْفَ يُحَكِّمُونَكَ وَعِندَهُمُ التَّوْرَاةُ فِيهَا حُكْمُ اللَّهِ ثُمَّ يَتَوَلَّوْنَ مِن بَعْدِ ذَٰلِكَ ۚ وَمَا أُولَٰئِكَ بِالْمُؤْمِنِينَ
దైవాదేశాలు పొందుపరచబడి వున్న తౌరాతు గ్రంథం తమ వద్ద ఉన్నప్పటికీ వారు నిన్ను ఎట్లా న్యాయనిర్ణేతగా చేసుకుంటున్నారు? (ఇది ఆశ్చర్యకరం కదూ?!) ఆ తరువాత మళ్ళీ తిరిగిపోతున్నారు. యదార్థమేమిటంటే వారసలు విశ్వాసులే కారు.
5:44  إِنَّا أَنزَلْنَا التَّوْرَاةَ فِيهَا هُدًى وَنُورٌ ۚ يَحْكُمُ بِهَا النَّبِيُّونَ الَّذِينَ أَسْلَمُوا لِلَّذِينَ هَادُوا وَالرَّبَّانِيُّونَ وَالْأَحْبَارُ بِمَا اسْتُحْفِظُوا مِن كِتَابِ اللَّهِ وَكَانُوا عَلَيْهِ شُهَدَاءَ ۚ فَلَا تَخْشَوُا النَّاسَ وَاخْشَوْنِ وَلَا تَشْتَرُوا بِآيَاتِي ثَمَنًا قَلِيلًا ۚ وَمَن لَّمْ يَحْكُم بِمَا أَنزَلَ اللَّهُ فَأُولَٰئِكَ هُمُ الْكَافِرُونَ
మేము తౌరాతు గ్రంథాన్ని అవతరింపజేశాము. అందులో మార్గదర్శకత్వము, జ్యోతీ ఉండేవి. ఈ తౌరాతు ఆధారంగానే ముస్లిములైన ప్రవక్తలు, రబ్బానీలు, ధర్మవేత్తలు యూదుల సమస్యలను పరిష్కరించేవారు. ఎందుకంటే దేవుని ఈ గ్రంథాన్ని రక్షించవలసిందిగా వారికి ఆజ్ఞాపించటం జరిగింది. దీనికి వారు సాక్షులుగా ఉండేవారు. కాబట్టి మీరు మనుషులకు భయపడకండి. నాకు మాత్రమే భయపడండి. నా వాక్యాలను కొద్దిపాటి వెలకు అమ్ముకోకండి. ఎవరు అల్లాహ్‌ అవతరింపజేసిన వహీ ప్రకారం తీర్పు చెయ్యరో వారే (కరడుగట్టిన) అవిశ్వాసులు.
5:45  وَكَتَبْنَا عَلَيْهِمْ فِيهَا أَنَّ النَّفْسَ بِالنَّفْسِ وَالْعَيْنَ بِالْعَيْنِ وَالْأَنفَ بِالْأَنفِ وَالْأُذُنَ بِالْأُذُنِ وَالسِّنَّ بِالسِّنِّ وَالْجُرُوحَ قِصَاصٌ ۚ فَمَن تَصَدَّقَ بِهِ فَهُوَ كَفَّارَةٌ لَّهُ ۚ وَمَن لَّمْ يَحْكُم بِمَا أَنزَلَ اللَّهُ فَأُولَٰئِكَ هُمُ الظَّالِمُونَ
మేము తౌరాతు గ్రంథంలో యూదుల కోసం ఒక శాసనాన్ని లిఖించాము: (దీని ప్రకారం) ప్రాణానికి బదులు ప్రాణం, కన్నుకు బదులు కన్ను, ముక్కుకు బదులు ముక్కు, చెవికి బదులు చెవి, పంటికి బదులు పన్ను. అలాగే కొన్ని ప్రత్యేక గాయాల కోసం కూడా (సరిసమానంగా) ప్రతీకారం ఉంది. కాని ఎవరయినా క్షమాభిక్ష పెడితే అది అతని పాలిట పరిహారం (కప్ఫారా) అవుతుంది. అల్లాహ్‌ అవతరింపజేసిన దానికనుగుణంగా తీర్పు ఇవ్వనివారే దుర్మార్గులు.
5:46  وَقَفَّيْنَا عَلَىٰ آثَارِهِم بِعِيسَى ابْنِ مَرْيَمَ مُصَدِّقًا لِّمَا بَيْنَ يَدَيْهِ مِنَ التَّوْرَاةِ ۖ وَآتَيْنَاهُ الْإِنجِيلَ فِيهِ هُدًى وَنُورٌ وَمُصَدِّقًا لِّمَا بَيْنَ يَدَيْهِ مِنَ التَّوْرَاةِ وَهُدًى وَمَوْعِظَةً لِّلْمُتَّقِينَ
ఆ ప్రవక్తల తరువాత మేము మర్యమ్‌ కుమారుడగు ఈసాను పంపాము. అతను తనకు పూర్వం వచ్చిన తౌరాతు గ్రంథాన్ని సత్యమని ధృవీకరించేవాడు. మేమతనికి ఇంజీలు గ్రంథాన్ని వొసగాము. అందులో మార్గదర్శకత్వమూ, జ్యోతీ ఉండేవి. అది తనకు ముందున్న తౌరాతు గ్రంథాన్ని ధృవీకరించేది. అంతేకాదు, అది దైవభీతి కలవారికి ఆసాంతం మార్గదర్శిని మరియు హితబోధిని కూడా.
5:47  وَلْيَحْكُمْ أَهْلُ الْإِنجِيلِ بِمَا أَنزَلَ اللَّهُ فِيهِ ۚ وَمَن لَّمْ يَحْكُم بِمَا أَنزَلَ اللَّهُ فَأُولَٰئِكَ هُمُ الْفَاسِقُونَ
ఇంజీలు గ్రంథం గలవారు కూడా, అల్లాహ్‌ ఇంజీలులో అవతరింపజేసిన దానికనుగుణంగానే తీర్పు చెయ్యాలి. అల్లాహ్‌ అవతరింపజేసిన దాని ప్రకారం తీర్పుచెయ్యని వారే పాపాత్ములు.
5:48  وَأَنزَلْنَا إِلَيْكَ الْكِتَابَ بِالْحَقِّ مُصَدِّقًا لِّمَا بَيْنَ يَدَيْهِ مِنَ الْكِتَابِ وَمُهَيْمِنًا عَلَيْهِ ۖ فَاحْكُم بَيْنَهُم بِمَا أَنزَلَ اللَّهُ ۖ وَلَا تَتَّبِعْ أَهْوَاءَهُمْ عَمَّا جَاءَكَ مِنَ الْحَقِّ ۚ لِكُلٍّ جَعَلْنَا مِنكُمْ شِرْعَةً وَمِنْهَاجًا ۚ وَلَوْ شَاءَ اللَّهُ لَجَعَلَكُمْ أُمَّةً وَاحِدَةً وَلَٰكِن لِّيَبْلُوَكُمْ فِي مَا آتَاكُمْ ۖ فَاسْتَبِقُوا الْخَيْرَاتِ ۚ إِلَى اللَّهِ مَرْجِعُكُمْ جَمِيعًا فَيُنَبِّئُكُم بِمَا كُنتُمْ فِيهِ تَخْتَلِفُونَ
ఇంకా (ఓ ప్రవక్తా!) మేము నీ వైపుకు ఈ గ్రంథాన్ని సత్య సమేతంగా అవతరింపజేశాము. అది తనకన్నా ముందు వచ్చిన గ్రంథాలను సత్యమని ధృవీకరిస్తుంది, వాటిని పరిరక్షిస్తుంది. కాబట్టి నువ్వు వారి పరస్పర వ్యవహారాలపై అల్లాహ్‌ అవతరింపజేసిన ఈ గ్రంథానికనుగుణంగానే తీర్పు చెయ్యి. నీ వద్దకు వచ్చిన ఈ సత్యాన్ని వీడి, వారి మనోవాంఛలను అనుసరించకు. మీలో ప్రతి ఒక్కరి కోసం మేము ఒక విధానాన్ని, మార్గాన్నీ నిర్ధారించాము. అల్లాహ్‌యే గనక తలిస్తే మీ అందరినీ ఒకే సమాజంగా చేసి ఉండేవాడు. అయితే మీకు వొసగబడిన దానిలో మిమ్మల్ని పరీక్షించాలన్నది ఆయన అభిలాష. కాబట్టి మీరు సత్కార్యాలు చేయటంలో త్వరపడండి. మీరంతా మరలిపోవలసింది అల్లాహ్‌ వైపుకే. ఆ తరువాత ఆయన, మీరు పరస్పరం విభేదించుకునే విషయాల గురించి మీకు (తన తీర్పు) తెలియజేస్తాడు.
5:49  وَأَنِ احْكُم بَيْنَهُم بِمَا أَنزَلَ اللَّهُ وَلَا تَتَّبِعْ أَهْوَاءَهُمْ وَاحْذَرْهُمْ أَن يَفْتِنُوكَ عَن بَعْضِ مَا أَنزَلَ اللَّهُ إِلَيْكَ ۖ فَإِن تَوَلَّوْا فَاعْلَمْ أَنَّمَا يُرِيدُ اللَّهُ أَن يُصِيبَهُم بِبَعْضِ ذُنُوبِهِمْ ۗ وَإِنَّ كَثِيرًا مِّنَ النَّاسِ لَفَاسِقُونَ
(ఓ ప్రవక్తా!) అల్లాహ్‌ అవతరింపజేసిన దానికనుగుణంగానే నీవు వారి మధ్య తీర్పు చేయి. వాళ్ళ కోరికలను ఎంత మాత్రం అనుసరించకు. అల్లాహ్‌ నీ వైపుకు అవతరింపజేసిన ఏదేని ఆజ్ఞ విషయంలో వారు నిన్ను ప్రక్కదారి పట్టించకుండా నీవు చాలా అప్రమత్తంగా ఉండు. ఒకవేళ వారు విముఖత చూపితే, వారు ఒడిగట్టిన కొన్ని పాపాలకుగాను వారికి శిక్ష విధించాలన్నదే అల్లాహ్‌ సంకల్పం అని తెలుసుకో. ప్రజల్లో చాలా మంది అవిధేయులే ఉంటారు.
5:50  أَفَحُكْمَ الْجَاهِلِيَّةِ يَبْغُونَ ۚ وَمَنْ أَحْسَنُ مِنَ اللَّهِ حُكْمًا لِّقَوْمٍ يُوقِنُونَ
ఏమిటీ, వారు మళ్ళీ అజ్ఞాన (కాల)పు తీర్పు కోరుతున్నారా? నమ్మకం గల వారి కోసం అల్లాహ్‌ కన్నా ఉత్తమ తీర్పు ఇవ్వగల వాడెవడుంటాడు?
5:51  يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا لَا تَتَّخِذُوا الْيَهُودَ وَالنَّصَارَىٰ أَوْلِيَاءَ ۘ بَعْضُهُمْ أَوْلِيَاءُ بَعْضٍ ۚ وَمَن يَتَوَلَّهُم مِّنكُمْ فَإِنَّهُ مِنْهُمْ ۗ إِنَّ اللَّهَ لَا يَهْدِي الْقَوْمَ الظَّالِمِينَ
ఓ విశ్వసించినవారలారా! యూదులను, నసారాను (అంటే క్రైస్తవులను) స్నేహితులుగా చేసుకోకండి. వారు ఒండొకరికి స్నేహితులు. మీలో ఎవరయినాసరే వారితో చెలిమిచేస్తే అతడు కూడా వారిలో ఒకడుగానే భావించబడతాడు. నిశ్చయంగా దుర్మార్గులకు అల్లాహ్‌ సన్మార్గం చూపడు.
5:52  فَتَرَى الَّذِينَ فِي قُلُوبِهِم مَّرَضٌ يُسَارِعُونَ فِيهِمْ يَقُولُونَ نَخْشَىٰ أَن تُصِيبَنَا دَائِرَةٌ ۚ فَعَسَى اللَّهُ أَن يَأْتِيَ بِالْفَتْحِ أَوْ أَمْرٍ مِّنْ عِندِهِ فَيُصْبِحُوا عَلَىٰ مَا أَسَرُّوا فِي أَنفُسِهِمْ نَادِمِينَ
మరి హృదయాలలో (కాపట్య) రోగం ఉన్నవారు పదేపదే వారి వైపుకు పరుగెత్తటం నీవు చూస్తావు. అంతేకాదు, “మాపై ఏ ఆపద వచ్చిపడుతుందోనని మేము భయపడుతున్నాము” అని వారంటారు. అయితే త్వరలోనే అల్లాహ్‌ విజయాన్ని చేకూర్చవచ్చు లేక తనవద్ద నుంచి దేన్నయినా అనుగ్రహించవచ్చు. అప్పుడు వారు తమ ఆంతర్యాల్లో దాచిపెట్టిన విషయాలపై పశ్చాత్తాపపడతారు.
5:53  وَيَقُولُ الَّذِينَ آمَنُوا أَهَٰؤُلَاءِ الَّذِينَ أَقْسَمُوا بِاللَّهِ جَهْدَ أَيْمَانِهِمْ ۙ إِنَّهُمْ لَمَعَكُمْ ۚ حَبِطَتْ أَعْمَالُهُمْ فَأَصْبَحُوا خَاسِرِينَ
విశ్వాసులు (వారి ఈ పరిస్థితిని చూసి), “మేము మీతోనే ఉన్నామని అదేపనిగా అల్లాహ్‌ పేర కఠోర ప్రమాణాలు చేసి చెప్పింది వీళ్ళేనా?!” అని అంటారు. వీళ్ళ సత్కార్యాలన్నీ వృథా అయ్యాయి. ఆ విధంగా వీరు (ఘోరంగా) నష్టపోయారు.
5:54  يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا مَن يَرْتَدَّ مِنكُمْ عَن دِينِهِ فَسَوْفَ يَأْتِي اللَّهُ بِقَوْمٍ يُحِبُّهُمْ وَيُحِبُّونَهُ أَذِلَّةٍ عَلَى الْمُؤْمِنِينَ أَعِزَّةٍ عَلَى الْكَافِرِينَ يُجَاهِدُونَ فِي سَبِيلِ اللَّهِ وَلَا يَخَافُونَ لَوْمَةَ لَائِمٍ ۚ ذَٰلِكَ فَضْلُ اللَّهِ يُؤْتِيهِ مَن يَشَاءُ ۚ وَاللَّهُ وَاسِعٌ عَلِيمٌ
ఓ విశ్వాసులారా! మీలో ఎవరయినాసరే తమ ధర్మం నుంచి తిరిగిపోతే (పోవచ్చు), అల్లాహ్‌ త్వరలోనే మరో జాతి వారిని తీసుకువస్తాడు. అల్లాహ్‌ వారిని ప్రేమిస్తాడు, వారు అల్లాహ్‌ను ప్రేమిస్తారు. వారు విశ్వాసుల పట్ల మృదు స్వభావులుగానూ, అవిశ్వాసుల పట్ల కఠినులుగానూ ఉంటారు. వారు అల్లాహ్‌ మార్గంలో పోరాడుతారు. నిందించేవారి నిందలను వారు ఏమాత్రం పట్టించుకోరు. ఇది అల్లాహ్‌ అనుగ్రహం. ఆయన తాను కోరిన వారికి దీన్ని ప్రసాదిస్తాడు. అల్లాహ్‌ విస్తృతి కలవాడు, జ్ఞాన సంపన్నుడు.
5:55  إِنَّمَا وَلِيُّكُمُ اللَّهُ وَرَسُولُهُ وَالَّذِينَ آمَنُوا الَّذِينَ يُقِيمُونَ الصَّلَاةَ وَيُؤْتُونَ الزَّكَاةَ وَهُمْ رَاكِعُونَ
(ముస్లిములారా!) వాస్తవానికి మీ స్నేహితులు అల్లాహ్‌, ఆయన ప్రవక్త, ఇంకా నమాజును నెలకొల్పే, జకాతును చెల్లించే, రుకూ చేసే (ఆరాధనలో అణకువను కలిగి ఉండే) విశ్వాసులు మాత్రమే.
5:56  وَمَن يَتَوَلَّ اللَّهَ وَرَسُولَهُ وَالَّذِينَ آمَنُوا فَإِنَّ حِزْبَ اللَّهِ هُمُ الْغَالِبُونَ
అల్లాహ్‌ను, ఆయన ప్రవక్తను, విశ్వాసులను మిత్రులుగా చేసుకున్నవారు, అల్లాహ్‌ పక్షంవారే విజయం పొందుతారన్న విషయాన్ని తెలుసుకోవాలి.
5:57  يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا لَا تَتَّخِذُوا الَّذِينَ اتَّخَذُوا دِينَكُمْ هُزُوًا وَلَعِبًا مِّنَ الَّذِينَ أُوتُوا الْكِتَابَ مِن قَبْلِكُمْ وَالْكُفَّارَ أَوْلِيَاءَ ۚ وَاتَّقُوا اللَّهَ إِن كُنتُم مُّؤْمِنِينَ
ఓ విశ్వాసులారా! మీకు పూర్వం గ్రంథం వొసగబడిన వారిలో మీ ధర్మాన్ని నవ్వులాటగా, వినోదంగా చేసుకున్న వారినిగానీ, అవిశ్వాసులనుగానీ మీ స్నేహితులుగా చేసుకోకండి. మీరే గనక నిజమయిన విశ్వాసులైతే అల్లాహ్‌కు భయపడుతూ ఉండండి.
5:58  وَإِذَا نَادَيْتُمْ إِلَى الصَّلَاةِ اتَّخَذُوهَا هُزُوًا وَلَعِبًا ۚ ذَٰلِكَ بِأَنَّهُمْ قَوْمٌ لَّا يَعْقِلُونَ
మీరు నమాజు కోసం పిలిచినప్పుడు వారు దాన్ని నవ్వులాటగా, తమాషాగా చేసుకుంటారు. ఎందుకంటే వారు బొత్తిగా బుద్ధిలేనివారు.
5:59  قُلْ يَا أَهْلَ الْكِتَابِ هَلْ تَنقِمُونَ مِنَّا إِلَّا أَنْ آمَنَّا بِاللَّهِ وَمَا أُنزِلَ إِلَيْنَا وَمَا أُنزِلَ مِن قَبْلُ وَأَنَّ أَكْثَرَكُمْ فَاسِقُونَ
(ఓ ప్రవక్తా!) వారికి చెప్పు : “ఓ గ్రంథవహులారా!(అంటే ఓ యూదులారా, క్రైస్తవులారా!) మేము అల్లాహ్‌ను, మావైపుకు అవతరింపజేయబడిన దానినీ, దానికి పూర్వం అవతరింపజేయబడిన దానిని విశ్వసిస్తున్నామన్న కారణంతో, ఇంకా మీలో అత్యధికులు అపమార్గాన ఉన్న కారణంతోనే కదా మీరు మాతో వైరవైఖరిని అవలంబిస్తున్నది?”
5:60  قُلْ هَلْ أُنَبِّئُكُم بِشَرٍّ مِّن ذَٰلِكَ مَثُوبَةً عِندَ اللَّهِ ۚ مَن لَّعَنَهُ اللَّهُ وَغَضِبَ عَلَيْهِ وَجَعَلَ مِنْهُمُ الْقِرَدَةَ وَالْخَنَازِيرَ وَعَبَدَ الطَّاغُوتَ ۚ أُولَٰئِكَ شَرٌّ مَّكَانًا وَأَضَلُّ عَن سَوَاءِ السَّبِيلِ
వారికి చెప్పు : “అల్లాహ్‌ వద్ద దీనికన్నా చెడు ప్రతిఫలం పొందేవారు ఎవరో నేను మీకు తెలుపనా? అల్లాహ్‌ శాపానికి గురైనవారు, ఆయన ఆగ్రహానికి పాత్రులైనవారు - వారిలో కొందరిని ఆయన కోతులుగా, పందులుగా చేశాడు - ఇంకా మిథ్యా దైవాలను పూజించినవారు. అత్యంత అథమశ్రేణికి చెందినవారు వీరే. రుజుమార్గం నుంచి బహుదూరం వెళ్ళి పోయినవారు కూడా వీరే.
5:61  وَإِذَا جَاءُوكُمْ قَالُوا آمَنَّا وَقَد دَّخَلُوا بِالْكُفْرِ وَهُمْ قَدْ خَرَجُوا بِهِ ۚ وَاللَّهُ أَعْلَمُ بِمَا كَانُوا يَكْتُمُونَ
వారు మీ వద్దకు వచ్చినప్పుడు, “మేము విశ్వసించాము” అని అంటారు. నిజానికి వారు అవిశ్వాసంతోనే వచ్చారు. మరి ఆ అవిశ్వాసంతోనే తిరిగి వెళ్ళిపోయారు. వారు దాచిపెట్టే దాన్ని అల్లాహ్‌ బాగా ఎరుగు.
5:62  وَتَرَىٰ كَثِيرًا مِّنْهُمْ يُسَارِعُونَ فِي الْإِثْمِ وَالْعُدْوَانِ وَأَكْلِهِمُ السُّحْتَ ۚ لَبِئْسَ مَا كَانُوا يَعْمَلُونَ
వారిలో చాలామందిని నీవు చూస్తావు, వారు పాపకార్యాల వైపుకు, దౌర్జన్యం వైపుకు, అధర్మమయిన సొమ్మును స్వాహా చేయటం వైపుకు ఎగబడుతూ ఉంటారు. వారు చేసే ఈ చేష్టలన్నీ పరమ చెడ్డవి.
5:63  لَوْلَا يَنْهَاهُمُ الرَّبَّانِيُّونَ وَالْأَحْبَارُ عَن قَوْلِهِمُ الْإِثْمَ وَأَكْلِهِمُ السُّحْتَ ۚ لَبِئْسَ مَا كَانُوا يَصْنَعُونَ
వారు ఇలాంటి పాపిష్టిమాటలు చెప్పకుండా, అధర్మమైన సొమ్మును తినకుండా వారి మతాచార్యులు, పండితులు వారిని ఎందుకు ఆపరు? వారు చేస్తున్నది చాలా చెడ్డ పని.
5:64  وَقَالَتِ الْيَهُودُ يَدُ اللَّهِ مَغْلُولَةٌ ۚ غُلَّتْ أَيْدِيهِمْ وَلُعِنُوا بِمَا قَالُوا ۘ بَلْ يَدَاهُ مَبْسُوطَتَانِ يُنفِقُ كَيْفَ يَشَاءُ ۚ وَلَيَزِيدَنَّ كَثِيرًا مِّنْهُم مَّا أُنزِلَ إِلَيْكَ مِن رَّبِّكَ طُغْيَانًا وَكُفْرًا ۚ وَأَلْقَيْنَا بَيْنَهُمُ الْعَدَاوَةَ وَالْبَغْضَاءَ إِلَىٰ يَوْمِ الْقِيَامَةِ ۚ كُلَّمَا أَوْقَدُوا نَارًا لِّلْحَرْبِ أَطْفَأَهَا اللَّهُ ۚ وَيَسْعَوْنَ فِي الْأَرْضِ فَسَادًا ۚ وَاللَّهُ لَا يُحِبُّ الْمُفْسِدِينَ
“అల్లాహ్‌ చేతులు కట్టివేయబడి ఉన్నాయి” అని యూదులు అన్నారు. నిజానికి వారి చేతులే కట్టివేయబడ్డాయి. వారు అన్న ఈ మాట మూలంగా వారిని శపించటం జరిగింది. నిజానికి అల్లాహ్‌ చేతులు రెండూ విశాలంగా ఉన్నాయి. తాను తలచుకున్న విధంగా ఆయన ఖర్చుపెడుతున్నాడు. నీపైన నీ ప్రభువు తరఫు నుంచి అవతరించిన సందేశం వారిలోని చాలా మందిలో తలబిరుసుతనాన్ని, తిరస్కారభావాన్నే వృద్ధి చేస్తుంది. ఇంకా, మేము వారి మధ్య ప్రళయదినం వరకూ విరోధం, విద్వేషం ఉండేలా చేశాము. వారు యుద్ధాగ్నిని రాజేసినప్పుడల్లా, అల్లాహ్‌ దాన్ని ఆర్పివేస్తాడు. వారు భూమిలో కల్లోలాన్ని రేకెత్తిస్తూ తిరుగుతుంటారు. కాగా; అల్లాహ్‌ కల్లోల జనకులను ఎంతమాత్రం ప్రేమించడు.
5:65  وَلَوْ أَنَّ أَهْلَ الْكِتَابِ آمَنُوا وَاتَّقَوْا لَكَفَّرْنَا عَنْهُمْ سَيِّئَاتِهِمْ وَلَأَدْخَلْنَاهُمْ جَنَّاتِ النَّعِيمِ
ఒకవేళ ఈ గ్రంథవహులే గనక విశ్వసించి, భయభక్తులతో కూడుకున్న (తఖ్వా) విధానాన్ని అవలంబించినట్లయితే, మేము వారి పాపాలన్నింటినీ వారి నుంచి దూరంచేసి, సుఖ సౌఖ్యాలతో కూడుకున్న స్వర్గవనాలలో వారికి తప్పకుండా ప్రవేశం కల్పించేవారము.
5:66  وَلَوْ أَنَّهُمْ أَقَامُوا التَّوْرَاةَ وَالْإِنجِيلَ وَمَا أُنزِلَ إِلَيْهِم مِّن رَّبِّهِمْ لَأَكَلُوا مِن فَوْقِهِمْ وَمِن تَحْتِ أَرْجُلِهِم ۚ مِّنْهُمْ أُمَّةٌ مُّقْتَصِدَةٌ ۖ وَكَثِيرٌ مِّنْهُمْ سَاءَ مَا يَعْمَلُونَ
వారు గనక తౌరాతుకూ, ఇంజీలుకూ, తమ ప్రభువు తరఫున తమ వద్దకు పంపబడిన దానికి కట్టుబడి ఉంటే వారు తమపై నుంచీ, క్రింది నుంచీ పుష్కలంగా ఉపాధిని పొందుతూ, హాయిగా తినేవారు. వారిలో ఒక వర్గం మాత్రం మధ్యేమార్గం అవలంబిస్తుంది. కాని వారిలోని అత్యధికులు చేసే పనులు చాలా చెడ్డవి.
5:67  يَا أَيُّهَا الرَّسُولُ بَلِّغْ مَا أُنزِلَ إِلَيْكَ مِن رَّبِّكَ ۖ وَإِن لَّمْ تَفْعَلْ فَمَا بَلَّغْتَ رِسَالَتَهُ ۚ وَاللَّهُ يَعْصِمُكَ مِنَ النَّاسِ ۗ إِنَّ اللَّهَ لَا يَهْدِي الْقَوْمَ الْكَافِرِينَ
ఓ ప్రవక్తా! నీ ప్రభువు తరఫు నుంచి నీపై అవతరింపజేయబడిన దానిని (ప్రజలకు) అందజెయ్యి. ఒకవేళ నువ్వు గనక ఈ పని చెయ్యకపోతే, దైవప్రవక్తగా నీవు నీ ధర్మాన్ని నిర్వర్తించని వాడవవుతావు. అల్లాహ్‌ నిన్ను ప్రజల (కీడు) నుంచి కాపాడుతాడు. నిశ్చయంగా అల్లాహ్‌ తిరస్కారులకు సన్మార్గం చూపడు.
5:68  قُلْ يَا أَهْلَ الْكِتَابِ لَسْتُمْ عَلَىٰ شَيْءٍ حَتَّىٰ تُقِيمُوا التَّوْرَاةَ وَالْإِنجِيلَ وَمَا أُنزِلَ إِلَيْكُم مِّن رَّبِّكُمْ ۗ وَلَيَزِيدَنَّ كَثِيرًا مِّنْهُم مَّا أُنزِلَ إِلَيْكَ مِن رَّبِّكَ طُغْيَانًا وَكُفْرًا ۖ فَلَا تَأْسَ عَلَى الْقَوْمِ الْكَافِرِينَ
(ఓ ప్రవక్తా!) వారికి చెప్పు: “ఓ గ్రంథవహులారా! మీరు తౌరాతునూ, ఇంజీలునూ, మీ ప్రభువు తరఫున మీ వద్దకు పంపబడిన దానినీ (మీ జీవితాలలో) నెలకొల్పనంతవరకూ మీరు ఏ ధర్మంపైనా లేనట్లే.” నీ ప్రభువు తరఫున నీపై అవతరింపజేయబడినది వారిలోని అనేకుల తలబిరుసుతనాన్ని, తిరస్కార వైఖరిని మరింత అధికం చేస్తుంది. కనుక నీవు ఈ తిరస్కారులపై దిగులు చెందకు.
5:69  إِنَّ الَّذِينَ آمَنُوا وَالَّذِينَ هَادُوا وَالصَّابِئُونَ وَالنَّصَارَىٰ مَنْ آمَنَ بِاللَّهِ وَالْيَوْمِ الْآخِرِ وَعَمِلَ صَالِحًا فَلَا خَوْفٌ عَلَيْهِمْ وَلَا هُمْ يَحْزَنُونَ
ముస్లిములైనా, యూదులైనా, సాబియీలైనా, నసారా (క్రైస్తవులు) అయినా- ఎవరయినా సరే- వారు గనక అల్లాహ్‌ను, అంతిమ దినాన్ని విశ్వసించి, సదాచరణ చేసినట్లయితే వారికెలాంటి భయంగానీ, చింతగానీ ఉండబోదు.
5:70  لَقَدْ أَخَذْنَا مِيثَاقَ بَنِي إِسْرَائِيلَ وَأَرْسَلْنَا إِلَيْهِمْ رُسُلًا ۖ كُلَّمَا جَاءَهُمْ رَسُولٌ بِمَا لَا تَهْوَىٰ أَنفُسُهُمْ فَرِيقًا كَذَّبُوا وَفَرِيقًا يَقْتُلُونَ
మేము ఇస్రాయీలు సంతతి వారి నుండి గట్టి వాగ్దానం తీసుకున్నాము. వారి వద్దకు ప్రవక్తలను పంపాము. కాని వారి మనోభీష్టానికి విరుద్ధమైన ఆదేశాలను ప్రవక్తలు వారి వద్దకు తీసుకువచ్చినప్పుడల్లా వారు ప్రవక్తలలో కొందరిని ధిక్కరించారు, మరికొందరిని హత్య చేస్తూ ఉన్నారు.
5:71  وَحَسِبُوا أَلَّا تَكُونَ فِتْنَةٌ فَعَمُوا وَصَمُّوا ثُمَّ تَابَ اللَّهُ عَلَيْهِمْ ثُمَّ عَمُوا وَصَمُّوا كَثِيرٌ مِّنْهُمْ ۚ وَاللَّهُ بَصِيرٌ بِمَا يَعْمَلُونَ
తమకు ఏ ఉపద్రవమూ సంభవించదని వారు తలపోశారు. ఈ కారణంగా వారు గుడ్డివారుగా, చెవిటివారుగా ప్రవర్తించారు. అయితే ఆ తరువాత అల్లాహ్‌ వారి పశ్చాత్తాపాన్ని అంగీకరించాడు. కాని ఆ తరువాత కూడా వారిలో చాలామంది అంధులు, బధిరులు అయిపోయారు. అల్లాహ్‌ వారి చేష్టలన్నింటినీ చూస్తూనే ఉన్నాడు.
5:72  لَقَدْ كَفَرَ الَّذِينَ قَالُوا إِنَّ اللَّهَ هُوَ الْمَسِيحُ ابْنُ مَرْيَمَ ۖ وَقَالَ الْمَسِيحُ يَا بَنِي إِسْرَائِيلَ اعْبُدُوا اللَّهَ رَبِّي وَرَبَّكُمْ ۖ إِنَّهُ مَن يُشْرِكْ بِاللَّهِ فَقَدْ حَرَّمَ اللَّهُ عَلَيْهِ الْجَنَّةَ وَمَأْوَاهُ النَّارُ ۖ وَمَا لِلظَّالِمِينَ مِنْ أَنصَارٍ
“అల్లాహ్‌ (అంటే) మర్యమ్‌ కుమారుడగు మసీహ్‌యే” అని చెప్పినవారు నిస్సందేహంగా అవిశ్వాసానికి పాల్పడినట్లే. యదార్థానికి మసీహ్‌ ఖుద్దుగా వారితో ఇలా పలికాడు : “ఓ ఇస్రాయీలు వంశస్థులారా! నాకూ, మీకూ ప్రభువైన అల్లాహ్‌ను మాత్రమే పూజించండి.” ఎవడు అల్లాహ్‌కు సహవర్తులుగా ఇతరులను కల్పించాడో అలాంటి వానికోసం అల్లాహ్‌ స్వర్గాన్ని నిషేధించాడని తెలుసుకోండి. అతని నివాసం నరకాగ్ని. దుర్మార్గులకు సహాయపడే వాడెవడూ ఉండడు.
5:73  لَّقَدْ كَفَرَ الَّذِينَ قَالُوا إِنَّ اللَّهَ ثَالِثُ ثَلَاثَةٍ ۘ وَمَا مِنْ إِلَٰهٍ إِلَّا إِلَٰهٌ وَاحِدٌ ۚ وَإِن لَّمْ يَنتَهُوا عَمَّا يَقُولُونَ لَيَمَسَّنَّ الَّذِينَ كَفَرُوا مِنْهُمْ عَذَابٌ أَلِيمٌ
“అల్లాహ్‌ ముగ్గురిలో మూడవవాడు” అని అన్నవారు కూడా ముమ్మాటికీ తిరస్కారానికి (కుఫ్ర్‌కు) పాల్పడినట్లే. వాస్తవానికి ఒక్కడైన అల్లాహ్‌ తప్ప మరో ఆరాధ్య దైవం లేనేలేడు. ఒకవేళ వారు గనక తమ ఈ మాటలను మానుకోకపోతే, వారిలో తిరస్కారవైఖరిపై ఉండే వారికి బాధాకరమైన శిక్ష తప్పకుండా అంటుకుంటుంది.
5:74  أَفَلَا يَتُوبُونَ إِلَى اللَّهِ وَيَسْتَغْفِرُونَهُ ۚ وَاللَّهُ غَفُورٌ رَّحِيمٌ
వారు అల్లాహ్‌ వైపునకు మరలరా? క్షమాపణ కోసం ఆయన్ని వేడుకోరా? అల్లాహ్‌ అపారంగా క్షమించేవాడు, అమితంగా కరుణించేవాడు కూడా.
5:75  مَّا الْمَسِيحُ ابْنُ مَرْيَمَ إِلَّا رَسُولٌ قَدْ خَلَتْ مِن قَبْلِهِ الرُّسُلُ وَأُمُّهُ صِدِّيقَةٌ ۖ كَانَا يَأْكُلَانِ الطَّعَامَ ۗ انظُرْ كَيْفَ نُبَيِّنُ لَهُمُ الْآيَاتِ ثُمَّ انظُرْ أَنَّىٰ يُؤْفَكُونَ
మర్యమ్‌ కుమారుడైన మసీహ్‌ ఒక ప్రవక్త తప్ప మరేమీ కాడు. ఆయనకు మునుపు కూడా ఎంతోమంది ప్రవక్తలు గతించారు. ఆయన తల్లి సద్వర్తనురాలు. ఆ తల్లీ కొడుకులిరువురూ అన్నం తినేవారే. చూడు, మేము వారి ముందు ఏ విధంగా నిదర్శనాలను విశదీకరిస్తున్నామో! అయినా వారు ఎలా తిరిగి పోతున్నారో చూడు!
5:76  قُلْ أَتَعْبُدُونَ مِن دُونِ اللَّهِ مَا لَا يَمْلِكُ لَكُمْ ضَرًّا وَلَا نَفْعًا ۚ وَاللَّهُ هُوَ السَّمِيعُ الْعَلِيمُ
వారితో ఇలా చెప్పు : ఏమిటీ, మీరు అల్లాహ్‌ను కాదని మీకు నష్టంగానీ, లాభంగానీ చేకూర్చే అధికారంలేని వారిని ఆరాధిస్తున్నారా? అల్లాహ్‌ మాత్రమే అన్నీ వినేవాడు, సర్వమూ తెలిసినవాడు.
5:77  قُلْ يَا أَهْلَ الْكِتَابِ لَا تَغْلُوا فِي دِينِكُمْ غَيْرَ الْحَقِّ وَلَا تَتَّبِعُوا أَهْوَاءَ قَوْمٍ قَدْ ضَلُّوا مِن قَبْلُ وَأَضَلُّوا كَثِيرًا وَضَلُّوا عَن سَوَاءِ السَّبِيلِ
ఇలా చెప్పేయి : “ఓ గ్రంథవహులారా! మీరు మీ ధర్మంలో అన్యాయంగా హద్దులు మీరకండి. పూర్వం తాము మార్గం నుంచి తప్పడమేగాక, ఎంతో మందిని మార్గం నుంచి తప్పించి రుజుమార్గ భ్రష్టులైనవారి మనోవాంఛలను అనుసరించకండి.”
5:78  لُعِنَ الَّذِينَ كَفَرُوا مِن بَنِي إِسْرَائِيلَ عَلَىٰ لِسَانِ دَاوُودَ وَعِيسَى ابْنِ مَرْيَمَ ۚ ذَٰلِكَ بِمَا عَصَوا وَّكَانُوا يَعْتَدُونَ
ఇస్రాయీలు సంతతిలోని అవిశ్వాసులు దావూదు నోట, మర్యమ్‌ పుత్రుడైన ఈసా నోట శపించబడ్డారు. ఎందుకంటే వారు అవిధేయతకు పాల్పడేవారు. హద్దుమీరి ప్రవర్తించేవారు.
5:79  كَانُوا لَا يَتَنَاهَوْنَ عَن مُّنكَرٍ فَعَلُوهُ ۚ لَبِئْسَ مَا كَانُوا يَفْعَلُونَ
వారు, తాము చేసే చెడు పనుల నుండి ఒండొకరిని నిరోధించేవారు కారు. వారు చేస్తూ ఉండినది బహుచెడ్డది.
5:80  تَرَىٰ كَثِيرًا مِّنْهُمْ يَتَوَلَّوْنَ الَّذِينَ كَفَرُوا ۚ لَبِئْسَ مَا قَدَّمَتْ لَهُمْ أَنفُسُهُمْ أَن سَخِطَ اللَّهُ عَلَيْهِمْ وَفِي الْعَذَابِ هُمْ خَالِدُونَ
వారిలో చాలామందిని నీవు చూస్తావు, వారు అవిశ్వాసులతో స్నేహసంబంధాలు పెట్టుకుంటారు. వారు తమ స్వయం కోసం ఏదయితే ముందుకు పంపుకున్నారో అది చాలా చెడ్డది. అందుకే అల్లాహ్‌ వారిపట్ల అప్రసన్నుడయ్యాడు. వారు కలకాలం శిక్షలో పడి ఉంటారు.
5:81  وَلَوْ كَانُوا يُؤْمِنُونَ بِاللَّهِ وَالنَّبِيِّ وَمَا أُنزِلَ إِلَيْهِ مَا اتَّخَذُوهُمْ أَوْلِيَاءَ وَلَٰكِنَّ كَثِيرًا مِّنْهُمْ فَاسِقُونَ
వారికి అల్లాహ్‌ పట్ల, ప్రవక్త పట్ల, ప్రవక్తపై అవతరింపజేయబడిన దానిపట్ల విశ్వాసమే గనక ఉంటే వారు అవిశ్వాసులను స్నేహితులుగా చేసుకునేవారే కాదు. కాని వారిలో చాలా మంది దైవవిధేయతకు దూరమైపోయారు.
5:82  لَتَجِدَنَّ أَشَدَّ النَّاسِ عَدَاوَةً لِّلَّذِينَ آمَنُوا الْيَهُودَ وَالَّذِينَ أَشْرَكُوا ۖ وَلَتَجِدَنَّ أَقْرَبَهُم مَّوَدَّةً لِّلَّذِينَ آمَنُوا الَّذِينَ قَالُوا إِنَّا نَصَارَىٰ ۚ ذَٰلِكَ بِأَنَّ مِنْهُمْ قِسِّيسِينَ وَرُهْبَانًا وَأَنَّهُمْ لَا يَسْتَكْبِرُونَ
విశ్వాసుల పట్ల శత్రుత్వంలో అందరికన్నా ఎక్కువగా కరడు గట్టినవారు యూదులు మరియు ముష్రిక్కులని నీవు తెలుసుకుంటావు. ఇక విశ్వాసులతో స్నేహం విషయానికి వస్తే “మేము సహాయకులం (నసారా లేక క్రైస్తవులం)” అని చెప్పుకునే వారిని నీవు ఎక్కువ సన్నిహితులుగా చూస్తావు. ఎందుకంటే వారిలో పండితులు, భవబంధాలకు దూరంగా ఉండే మతాచార్యులు ఉన్నారు. ఇంకో విషయం ఏమిటంటే వారు అహంకారం చూపరు.
5:83  وَإِذَا سَمِعُوا مَا أُنزِلَ إِلَى الرَّسُولِ تَرَىٰ أَعْيُنَهُمْ تَفِيضُ مِنَ الدَّمْعِ مِمَّا عَرَفُوا مِنَ الْحَقِّ ۖ يَقُولُونَ رَبَّنَا آمَنَّا فَاكْتُبْنَا مَعَ الشَّاهِدِينَ
ప్రవక్తపై అవతరించిన దానిని వారు విన్నప్పుడు, సత్యాన్ని గ్రహించిన కారణంగా వారి కళ్ళ నుంచి కన్నీరు ప్రవహించటం నీవు గమనిస్తావు. వారిలా అంటారు: “మా ప్రభూ! మేము విశ్వసించాము. కాబట్టి మా పేర్లను కూడా ధృవీకరించేవారితో పాటు వ్రాసుకో.
5:84  وَمَا لَنَا لَا نُؤْمِنُ بِاللَّهِ وَمَا جَاءَنَا مِنَ الْحَقِّ وَنَطْمَعُ أَن يُدْخِلَنَا رَبُّنَا مَعَ الْقَوْمِ الصَّالِحِينَ
“మేము అల్లాహ్‌ను, మా వద్దకు వచ్చిన సత్యాన్ని విశ్వసించకుండా ఉండటానికి ఇక మా వద్ద మిగిలిన సాకు ఏముంది? మా ప్రభువు మమ్మల్ని సజ్జనుల సహచర్యంలో చేరుస్తాడన్న ఆశ మాకుంది.”
5:85  فَأَثَابَهُمُ اللَّهُ بِمَا قَالُوا جَنَّاتٍ تَجْرِي مِن تَحْتِهَا الْأَنْهَارُ خَالِدِينَ فِيهَا ۚ وَذَٰلِكَ جَزَاءُ الْمُحْسِنِينَ
వారు ఈ విధంగా పలికినందుకుగాను అల్లాహ్‌ వారికి క్రింద కాలువలు ప్రవహించే స్వర్గవనాలను ప్రసాదిస్తాడు. వారందులో కలకాలం ఉంటారు. సజ్జనులకు ఇలాంటి ప్రతిఫలమే లభిస్తుంది.
5:86  وَالَّذِينَ كَفَرُوا وَكَذَّبُوا بِآيَاتِنَا أُولَٰئِكَ أَصْحَابُ الْجَحِيمِ
ఇకపోతే తిరస్కార వైఖరికి పాల్పడి, మా ఆయతులను ధిక్కరించేవారు - వారే నరకవాసులు.
5:87  يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا لَا تُحَرِّمُوا طَيِّبَاتِ مَا أَحَلَّ اللَّهُ لَكُمْ وَلَا تَعْتَدُوا ۚ إِنَّ اللَّهَ لَا يُحِبُّ الْمُعْتَدِينَ
విశ్వసించిన ఓ ప్రజలారా! అల్లాహ్‌ మీ కోసం ధర్మసమ్మతం (హలాల్‌) చేసిన పవిత్రమైన వస్తువులను మీ అంతట మీరుగా నిషేధించుకోకండి. మితిమీరి పోకండి. నిశ్చయంగా అల్లాహ్‌ మితిమీరి పోయేవారిని ఇష్టపడడు.
5:88  وَكُلُوا مِمَّا رَزَقَكُمُ اللَّهُ حَلَالًا طَيِّبًا ۚ وَاتَّقُوا اللَّهَ الَّذِي أَنتُم بِهِ مُؤْمِنُونَ
అల్లాహ్‌ మీకు ప్రసాదించిన వాటిలో నుంచి ధర్మసమ్మతమైన, పరిశుద్ధమైన పదార్థాలను భుజించండి. మీరు విశ్వసించే అల్లాహ్‌కు భయపడండి.
5:89  لَا يُؤَاخِذُكُمُ اللَّهُ بِاللَّغْوِ فِي أَيْمَانِكُمْ وَلَٰكِن يُؤَاخِذُكُم بِمَا عَقَّدتُّمُ الْأَيْمَانَ ۖ فَكَفَّارَتُهُ إِطْعَامُ عَشَرَةِ مَسَاكِينَ مِنْ أَوْسَطِ مَا تُطْعِمُونَ أَهْلِيكُمْ أَوْ كِسْوَتُهُمْ أَوْ تَحْرِيرُ رَقَبَةٍ ۖ فَمَن لَّمْ يَجِدْ فَصِيَامُ ثَلَاثَةِ أَيَّامٍ ۚ ذَٰلِكَ كَفَّارَةُ أَيْمَانِكُمْ إِذَا حَلَفْتُمْ ۚ وَاحْفَظُوا أَيْمَانَكُمْ ۚ كَذَٰلِكَ يُبَيِّنُ اللَّهُ لَكُمْ آيَاتِهِ لَعَلَّكُمْ تَشْكُرُونَ
మీరు చేసే అర్థంలేని ప్రమాణాలను గురించి అల్లాహ్‌ మిమ్మల్ని నిలదీయడు. అయితే మీరు పటిష్టపరచిన ప్రమాణాలను గురించి ఆయన మిమ్మల్ని తప్పకుండా నిలదీస్తాడు. (అటువంటి ప్రమాణభంగానికి మీరు చెల్లించవలసిన) పరిహారం ఏమిటంటే, మీరు మీ ఇంటి వారికి పెట్టే మధ్యరకపు అన్నం పది మంది పేదలకు తినిపించాలి లేదా వారికి బట్టలుపెట్టాలి లేదా ఒక బానిసకో, బానిసరాలికో స్వేచ్ఛనొసగాలి. ఇవేవీ చేయలేనివారు మూడు రోజులపాటు ఉపవాసం పాటించాలి - మీరు ప్రమాణాలు చేసినప్పుడు (వాటిని భంగపరచినందుకు గాను ఇచ్చే) ప్రమాణాల పరిహారం ఇది. అందుకే మీరు ప్రమాణాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ విధంగా మీరు కృతజ్ఞతాపూర్వకంగా మసలుకునేందుకుగాను అల్లాహ్‌ మీకోసం తన ఆదేశాలను తేటతెల్లం చేస్తున్నాడు.
5:90  يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا إِنَّمَا الْخَمْرُ وَالْمَيْسِرُ وَالْأَنصَابُ وَالْأَزْلَامُ رِجْسٌ مِّنْ عَمَلِ الشَّيْطَانِ فَاجْتَنِبُوهُ لَعَلَّكُمْ تُفْلِحُونَ
ఓ విశ్వసించిన వారలారా! సారాయి, జూదం, బలిపీఠాలు, జోస్యం కోసం వాడే బాణాలు- ఇవన్నీ పరమ జుగుప్సాకరమైన విషయాలు, షైతాన్‌ చేష్టలు. కాబట్టి వాటికి దూరంగా ఉండండి. మీరలా చేస్తే సాఫల్యం పొందవచ్చు.
5:91  إِنَّمَا يُرِيدُ الشَّيْطَانُ أَن يُوقِعَ بَيْنَكُمُ الْعَدَاوَةَ وَالْبَغْضَاءَ فِي الْخَمْرِ وَالْمَيْسِرِ وَيَصُدَّكُمْ عَن ذِكْرِ اللَّهِ وَعَنِ الصَّلَاةِ ۖ فَهَلْ أَنتُم مُّنتَهُونَ
సారాయి, జూదాల ద్వారా మీ మధ్య విరోధాన్ని, ద్వేషాన్ని సృజించాలనీ, అల్లాహ్‌ స్మరణ నుంచీ, నమాజు నుంచీ మిమ్మల్ని దూరంగా ఉంచాలని షైతాను కోరుకుంటున్నాడు. కనుక ఇకనయినా వాటిని మానుకోండి.
5:92  وَأَطِيعُوا اللَّهَ وَأَطِيعُوا الرَّسُولَ وَاحْذَرُوا ۚ فَإِن تَوَلَّيْتُمْ فَاعْلَمُوا أَنَّمَا عَلَىٰ رَسُولِنَا الْبَلَاغُ الْمُبِينُ
అల్లాహ్‌కు విధేయత చూపండి. ఆయన ప్రవక్తకు విధేయత చూపండి. (చెడుల పట్ల) కడు జాగ్రత్తగా ఉండండి. ఒకవేళ మీరు గనక విముఖత చూపితే, మా ప్రవక్తపై ఉన్న బాధ్యతల్లా స్పష్టంగా విషయాన్ని అందజేయటం వరకేనని తెలుసుకోండి.
5:93  لَيْسَ عَلَى الَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ جُنَاحٌ فِيمَا طَعِمُوا إِذَا مَا اتَّقَوا وَّآمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ ثُمَّ اتَّقَوا وَّآمَنُوا ثُمَّ اتَّقَوا وَّأَحْسَنُوا ۗ وَاللَّهُ يُحِبُّ الْمُحْسِنِينَ
విశ్వసించి, సత్కార్యాలు చేసేవారు (ఇంతకు మునుపు) తిన్నదానికి, తాగినదానికి వారిపై ఎటువంటి పాపం ఉండదు. కాకపోతే వారు ఇక మీదట భయభక్తులతో మెలగాలి, విశ్వసించి మంచిపనులు చెయ్యాలి. మళ్లీ భయభక్తుల వైఖరిని అవలంబించాలి, విశ్వసించాలి. మళ్ళీ అల్లాహ్‌కు భయపడుతూ సద్వర్తనులుగా మసలుకోవాలి. ఇటువంటి సద్వర్తనులనే అల్లాహ్‌ ప్రేమిస్తాడు.
5:94  يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا لَيَبْلُوَنَّكُمُ اللَّهُ بِشَيْءٍ مِّنَ الصَّيْدِ تَنَالُهُ أَيْدِيكُمْ وَرِمَاحُكُمْ لِيَعْلَمَ اللَّهُ مَن يَخَافُهُ بِالْغَيْبِ ۚ فَمَنِ اعْتَدَىٰ بَعْدَ ذَٰلِكَ فَلَهُ عَذَابٌ أَلِيمٌ
విశ్వాసులారా! మీ చేతులకూ, మీ ఈటెలకూ అందుబాటులో ఉన్న కొన్ని వేట జంతువుల ద్వారా అల్లాహ్‌ మిమ్మల్ని పరీక్షిస్తాడు, తనను చూడకుండానే తనకు భయపడేవారెవరో తెలుసుకోవాలని. దీని తరువాత కూడా హద్దు మీరి ప్రవర్తించే వారికి వ్యధాభరితమైన శిక్ష ఉంటుంది.
5:95  يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا لَا تَقْتُلُوا الصَّيْدَ وَأَنتُمْ حُرُمٌ ۚ وَمَن قَتَلَهُ مِنكُم مُّتَعَمِّدًا فَجَزَاءٌ مِّثْلُ مَا قَتَلَ مِنَ النَّعَمِ يَحْكُمُ بِهِ ذَوَا عَدْلٍ مِّنكُمْ هَدْيًا بَالِغَ الْكَعْبَةِ أَوْ كَفَّارَةٌ طَعَامُ مَسَاكِينَ أَوْ عَدْلُ ذَٰلِكَ صِيَامًا لِّيَذُوقَ وَبَالَ أَمْرِهِ ۗ عَفَا اللَّهُ عَمَّا سَلَفَ ۚ وَمَنْ عَادَ فَيَنتَقِمُ اللَّهُ مِنْهُ ۗ وَاللَّهُ عَزِيزٌ ذُو انتِقَامٍ
ఓ విశ్వాసులారా! మీరు ఇహ్రాము స్థితిలో ఉన్నప్పుడు వేట జంతువులను చంపకండి. మీలో ఎవరైనా ఉద్దేశ్యపూర్వకంగా దానిని చంపినట్లయితే అతడు తాను చంపిన జంతువుకు సమానమైన జంతువును పరిహారంగా చెల్లించటం అవశ్యం. దానిని మీలోని ఇరువురు న్యాయశీలురు నిర్ణయించాలి. పరిహారంగా యివ్వబడే జంతువును ఖుర్బానీ నిమిత్తం కాబా వద్దకు చేర్చాలి. లేదా ఆ పాపానికి పరిహారంగా కొంతమంది పేదలకు అన్నం పెట్టాలి. లేదా దానికి సమానంగా ఉపవాసం పాటించాలి. తాను పాల్పడిన చేష్టకు ఫలితాన్ని చవిచూసేందుకు (ఈ విధంగా నిర్థారించబడింది). గతంలో జరిగిన దాన్ని అల్లాహ్‌ మన్నించాడు. ఇకమీదట కూడా ఎవరయినా అలా చేస్తే అల్లాహ్‌ ప్రతీకారం చేస్తాడు. అల్లాహ్‌ సర్వాధిక్యుడు, ప్రతీకారం చేసేవాడూను.
5:96  أُحِلَّ لَكُمْ صَيْدُ الْبَحْرِ وَطَعَامُهُ مَتَاعًا لَّكُمْ وَلِلسَّيَّارَةِ ۖ وَحُرِّمَ عَلَيْكُمْ صَيْدُ الْبَرِّ مَا دُمْتُمْ حُرُمًا ۗ وَاتَّقُوا اللَّهَ الَّذِي إِلَيْهِ تُحْشَرُونَ
సముద్రపు జంతువులను వేటాడటం, దాని ఆహారం మీకొరకు ధర్మసమ్మతం గావించబడింది. మీ ప్రయోజనం కోసం, ప్రయాణీకుల కోసం కూడా. అయితే మీరు ఇహ్రాము స్థితిలో ఉన్నంతవరకూ భూమిపై వేటాడటం నిషేధించబడింది. అల్లాహ్‌కు భయపడండి. ఆయన వద్దకే మీరంతా సమీకరించబడతారు.
5:97  جَعَلَ اللَّهُ الْكَعْبَةَ الْبَيْتَ الْحَرَامَ قِيَامًا لِّلنَّاسِ وَالشَّهْرَ الْحَرَامَ وَالْهَدْيَ وَالْقَلَائِدَ ۚ ذَٰلِكَ لِتَعْلَمُوا أَنَّ اللَّهَ يَعْلَمُ مَا فِي السَّمَاوَاتِ وَمَا فِي الْأَرْضِ وَأَنَّ اللَّهَ بِكُلِّ شَيْءٍ عَلِيمٌ
గౌరవప్రద గృహమైన 'కాబా'ను అల్లాహ్‌ మానవ మనుగడ సాధనంగా చేశాడు. ఇంకా నిషిద్ధ మాసాన్నీ, హదీ పశువును (హరమ్‌ క్షేత్రంలో ఖుర్బానీ ఇవ్వబడే జంతువులను), మెడలలో పట్టాలు వేసిన జంతువులను కూడా. ఆకాశాలలో, భూమిలో ఉన్న సమస్త వస్తువుల గురించి అల్లాహ్‌కు తెలుసనీ, ఆయన ప్రతిదీ క్షుణ్ణంగా ఎరిగినవాడన్న సంగతి మీకు తెలియడానికిగాను ఆయన ఇలా చేశాడు.
5:98  اعْلَمُوا أَنَّ اللَّهَ شَدِيدُ الْعِقَابِ وَأَنَّ اللَّهَ غَفُورٌ رَّحِيمٌ
తెలుసుకోండి! అల్లాహ్‌ శిక్షించటంలో కఠినుడు. దాంతో పాటు అల్లాహ్‌ అపారంగా క్షమించేవాడు, కనికరించేవాడు కూడా.
5:99  مَّا عَلَى الرَّسُولِ إِلَّا الْبَلَاغُ ۗ وَاللَّهُ يَعْلَمُ مَا تُبْدُونَ وَمَا تَكْتُمُونَ
సందేశాన్ని అందజేయటం వరకే ప్రవక్త బాధ్యత. మీరు వెల్లడించేదీ, దాచి పెట్టేదీ - అంతా అల్లాహ్‌కు తెలుసు.
5:100  قُل لَّا يَسْتَوِي الْخَبِيثُ وَالطَّيِّبُ وَلَوْ أَعْجَبَكَ كَثْرَةُ الْخَبِيثِ ۚ فَاتَّقُوا اللَّهَ يَا أُولِي الْأَلْبَابِ لَعَلَّكُمْ تُفْلِحُونَ
(ఓ ప్రవక్తా!) వారికి చెప్పు: అపవిత్రత యొక్క ఆధిక్యత నీకు ఎంత బాగా తోచినప్పటికీ అపవిత్రము - పవిత్రము ఎన్నటికీ సమానం కాలేవు. కనుక ఓ వివేకవంతులారా! అల్లాహ్‌కు భయపడుతూ ఉండండి, తద్వారా మీరు సాఫల్యం పొందవచ్చు.
5:101  يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا لَا تَسْأَلُوا عَنْ أَشْيَاءَ إِن تُبْدَ لَكُمْ تَسُؤْكُمْ وَإِن تَسْأَلُوا عَنْهَا حِينَ يُنَزَّلُ الْقُرْآنُ تُبْدَ لَكُمْ عَفَا اللَّهُ عَنْهَا ۗ وَاللَّهُ غَفُورٌ حَلِيمٌ
ఓ విశ్వాసులారా! మీకు గనక విడమరచి చెబితే మీకు బాధ కలిగించేటటువంటి విషయాలను గురించి అడగకండి. అయితే ఖుర్‌ఆన్‌ అవతరించే సమయంలో మీరు వాటిని గురించి ప్రశ్నిస్తే అవి మీకు విడమరచి చెప్పబడతాయి. ఇంత వరకు వేసిన ప్రశ్నలను అల్లాహ్‌ మన్నించాడు. అల్లాహ్‌ అమితంగా క్షమించేవాడు, సహనశీలుడు కూడా.
5:102  قَدْ سَأَلَهَا قَوْمٌ مِّن قَبْلِكُمْ ثُمَّ أَصْبَحُوا بِهَا كَافِرِينَ
మీ పూర్వీకుల్లో కూడా కొందరు ఇలాంటి విషయాలను అడిగారు. మరి ఆ విషయాలను తిరస్కరించింది కూడా వారే.
5:103  مَا جَعَلَ اللَّهُ مِن بَحِيرَةٍ وَلَا سَائِبَةٍ وَلَا وَصِيلَةٍ وَلَا حَامٍ ۙ وَلَٰكِنَّ الَّذِينَ كَفَرُوا يَفْتَرُونَ عَلَى اللَّهِ الْكَذِبَ ۖ وَأَكْثَرُهُمْ لَا يَعْقِلُونَ
అల్లాహ్‌ 'బహీరా'ను గానీ, 'సాయిబా'ను గానీ, 'వసీలా'ను గానీ, 'హామ్‌'ను గానీ ఏర్పరచలేదు. అయినప్పటికీ అవిశ్వాసులు అల్లాహ్‌కు అబద్ధాన్ని అంటగడుతున్నారు. వారిలో చాలా మంది అవివేకులు.
5:104  وَإِذَا قِيلَ لَهُمْ تَعَالَوْا إِلَىٰ مَا أَنزَلَ اللَّهُ وَإِلَى الرَّسُولِ قَالُوا حَسْبُنَا مَا وَجَدْنَا عَلَيْهِ آبَاءَنَا ۚ أَوَلَوْ كَانَ آبَاؤُهُمْ لَا يَعْلَمُونَ شَيْئًا وَلَا يَهْتَدُونَ
“అల్లాహ్‌ అవతరింపజేసిన ఆదేశాల వైపుకు, ప్రవక్త వైపుకు రండి” అని వారితో అన్నప్పుడు, “మా తాత ముత్తాతలు అవలంబిస్తూ ఉండగా మేము చూసిన విధానమే మాకు చాలు” అని వారంటారు. ఏమిటీ? వారి తాత ముత్తాతలకు ఏమీ తెలీకపోయినప్పటికీ, వారు సన్మార్గంలో నడవనప్పటికీ వీరు వాళ్లనే అనుసరిస్తారా?
5:105  يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا عَلَيْكُمْ أَنفُسَكُمْ ۖ لَا يَضُرُّكُم مَّن ضَلَّ إِذَا اهْتَدَيْتُمْ ۚ إِلَى اللَّهِ مَرْجِعُكُمْ جَمِيعًا فَيُنَبِّئُكُم بِمَا كُنتُمْ تَعْمَلُونَ
ఓ విశ్వసించినవారలారా! మీరు మీ గురించి జాగ్రత్త పడండి. మీరు గనక సన్మార్గంలో నడుస్తున్నట్లయితే దారి తప్పిన వారు మీకు ఎలాంటి నష్టం కలిగించజాలరు. మీరంతా అల్లాహ్‌ వద్దకే మరలిపోవలసి ఉంది. అప్పుడు ఆయన మీరు చేసిన కర్మలన్నింటినీ మీకు తెలుపుతాడు.
5:106  يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا شَهَادَةُ بَيْنِكُمْ إِذَا حَضَرَ أَحَدَكُمُ الْمَوْتُ حِينَ الْوَصِيَّةِ اثْنَانِ ذَوَا عَدْلٍ مِّنكُمْ أَوْ آخَرَانِ مِنْ غَيْرِكُمْ إِنْ أَنتُمْ ضَرَبْتُمْ فِي الْأَرْضِ فَأَصَابَتْكُم مُّصِيبَةُ الْمَوْتِ ۚ تَحْبِسُونَهُمَا مِن بَعْدِ الصَّلَاةِ فَيُقْسِمَانِ بِاللَّهِ إِنِ ارْتَبْتُمْ لَا نَشْتَرِي بِهِ ثَمَنًا وَلَوْ كَانَ ذَا قُرْبَىٰ ۙ وَلَا نَكْتُمُ شَهَادَةَ اللَّهِ إِنَّا إِذًا لَّمِنَ الْآثِمِينَ
ఓ విశ్వాసులారా! మీలో ఎవరికయినా మరణ సమయం దగ్గరపడి, అతడు విల్లు చెప్పదలచినప్పుడు మీలోని ఇద్దరు వ్యక్తులు సాక్షులుగా ఉండటం భావ్యం. ఆ ఇద్దరు వ్యక్తులూ ధర్మచింతన గలవారై ఉండాలి. (వారు మీ వారై ఉండాలి). లేదా మీరు ప్రయాణావస్థలో ఉండి, మీకు మరణ విపత్తు దాపురిస్తే అన్యులిద్దరిని కూడా సాక్షులుగా తీసుకోవచ్చు. ఒకవేళ మీకు అనుమానం కలిగితే నమాజు అనంతరం ఆ ఇద్దరినీ ఆపుకోండి. మరి వారిద్దరూ దేవునిపై ప్రమాణం చేసి ఇలా చెప్పాలి: “మేము స్వప్రయోజనం కోసం ప్రమాణాలను అమ్ముకునేవాళ్ళం కాము. (మేము సాక్ష్యమిచ్చే వ్యక్తి) మా బంధువు అయినాసరే (మేము నిష్పక్షపాతంగానే వ్యవహరిస్తాము). అల్లాహ్‌ యొక్క సాక్ష్యాన్ని మేము దాచి పెట్టము. ఒకవేళ మేమలా చేస్తే ఘోరమైన పాపానికి పాల్పడిన వారమవుతాము.”
5:107  فَإِنْ عُثِرَ عَلَىٰ أَنَّهُمَا اسْتَحَقَّا إِثْمًا فَآخَرَانِ يَقُومَانِ مَقَامَهُمَا مِنَ الَّذِينَ اسْتَحَقَّ عَلَيْهِمُ الْأَوْلَيَانِ فَيُقْسِمَانِ بِاللَّهِ لَشَهَادَتُنَا أَحَقُّ مِن شَهَادَتِهِمَا وَمَا اعْتَدَيْنَا إِنَّا إِذًا لَّمِنَ الظَّالِمِينَ
ఆ తరువాత ఆ ఇద్దరు సాక్షులు ఏదయినా పాపానికి పాల్పడ్డారని తెలిస్తే, ఎవరికి వ్యతిరేకంగానయితే పాపం జరిగిందో వారిలో (మృతునికి) చాలా దగ్గరి వారైన ఇద్దరు వ్యక్తులు ముందుకు వచ్చి ఆ ఇద్దరి స్థానంలో నిలబడి, “వారిద్దరి సాక్ష్యం కన్నా మా సాక్ష్యం ఎక్కువ సత్యబద్ధమైనది. ఈ విషయంలో మేము ఎలాంటి అతిక్రమణకూ పాల్పడటం లేదు. మేమే గనక అలా చేస్తే పరమ దుర్మార్గులమవుతాము” అని అల్లాహ్‌పై ప్రమాణం చేసి చెప్పాలి.
5:108  ذَٰلِكَ أَدْنَىٰ أَن يَأْتُوا بِالشَّهَادَةِ عَلَىٰ وَجْهِهَا أَوْ يَخَافُوا أَن تُرَدَّ أَيْمَانٌ بَعْدَ أَيْمَانِهِمْ ۗ وَاتَّقُوا اللَّهَ وَاسْمَعُوا ۗ وَاللَّهُ لَا يَهْدِي الْقَوْمَ الْفَاسِقِينَ
ఈ పద్ధతివల్ల వారు యథాతథంగా సాక్ష్యమిస్తారనీ, తాము ప్రమాణాలు చేసిన తరువాత ప్రమాణాలు తమకు వ్యతిరేకంగా పరిణమిస్తాయన్న భయం వారికి ఉంటుందని ఆశించబడుతోంది. అల్లాహ్‌కు భయపడుతూ ఉండండి. వినండి! అల్లాహ్‌ అవిధేయ జనులకు సన్మార్గం చూపడు.
5:109  يَوْمَ يَجْمَعُ اللَّهُ الرُّسُلَ فَيَقُولُ مَاذَا أُجِبْتُمْ ۖ قَالُوا لَا عِلْمَ لَنَا ۖ إِنَّكَ أَنتَ عَلَّامُ الْغُيُوبِ
ఏ రోజున అల్లాహ్‌ ప్రవక్తలందరినీ సమావేశపరచి, “మీకు ఏం సమాధానం లభించింది?” అని అడుగుతాడో ఆ రోజు, “మాకేమీ తెలియదు. నిశ్చయంగా రహస్య విషయాల గురించి పరిపూర్ణ జ్ఞానం కలవాడవు నువ్వే” అని వారంటారు.
5:110  إِذْ قَالَ اللَّهُ يَا عِيسَى ابْنَ مَرْيَمَ اذْكُرْ نِعْمَتِي عَلَيْكَ وَعَلَىٰ وَالِدَتِكَ إِذْ أَيَّدتُّكَ بِرُوحِ الْقُدُسِ تُكَلِّمُ النَّاسَ فِي الْمَهْدِ وَكَهْلًا ۖ وَإِذْ عَلَّمْتُكَ الْكِتَابَ وَالْحِكْمَةَ وَالتَّوْرَاةَ وَالْإِنجِيلَ ۖ وَإِذْ تَخْلُقُ مِنَ الطِّينِ كَهَيْئَةِ الطَّيْرِ بِإِذْنِي فَتَنفُخُ فِيهَا فَتَكُونُ طَيْرًا بِإِذْنِي ۖ وَتُبْرِئُ الْأَكْمَهَ وَالْأَبْرَصَ بِإِذْنِي ۖ وَإِذْ تُخْرِجُ الْمَوْتَىٰ بِإِذْنِي ۖ وَإِذْ كَفَفْتُ بَنِي إِسْرَائِيلَ عَنكَ إِذْ جِئْتَهُم بِالْبَيِّنَاتِ فَقَالَ الَّذِينَ كَفَرُوا مِنْهُمْ إِنْ هَٰذَا إِلَّا سِحْرٌ مُّبِينٌ
అప్పుడు అల్లాహ్‌ ఈ విధంగా అడుగుతాడు : “మర్యమ్‌ కుమారుడవైన ఓ ఈసా! నేను నీకూ, నీ తల్లికి ప్రసాదించిన అనుగ్రహాన్ని జ్ఞప్తికి తెచ్చుకో. అప్పుడు రూహుల్‌ ఖుదుస్‌ ద్వారా నేను నీకు సహాయం చేశాను. నీవు ఊయలలో ఉన్నప్పుడు, పెద్దవాడైన తరువాత కూడా ప్రజలతో మాట్లాడేవాడివి. అప్పుడు నేను నీకు గ్రంథాన్నీ, వివేకాన్నీ తౌరాతునూ, ఇంజీలునూ నేర్పాను. అప్పుడు నీవు నా అనుమతితో, మట్టితో పక్షి ఆకారం లాంటి దాన్ని తయారుచేసి, అందులోకి ఊదగానే నా అనుమతితో అది (నిజంగానే) పక్షి అయిపోయేది. అలాగే నీవు నా అనుమతితో పుట్టుగుడ్డినీ, కుష్టు రోగినీ బాగుచేసేవాడివి. నా అనుమతితో మృతులను లేపి నిలబెట్టే వాడివి. నీవు స్పష్టమైన నిదర్శనాలతో ఇస్రాయీలు వంశీయుల వద్దకు వచ్చినపుడు, 'ఇది స్పష్టమైన మాయాజాలం తప్ప మరేమీ కాదు' అని వారిలోని సత్య తిరస్కారులు చెప్పారు. ఆ సమయంలో మేము వారిని నీ నుంచి ఆపాము.
5:111  وَإِذْ أَوْحَيْتُ إِلَى الْحَوَارِيِّينَ أَنْ آمِنُوا بِي وَبِرَسُولِي قَالُوا آمَنَّا وَاشْهَدْ بِأَنَّنَا مُسْلِمُونَ
“మీరు నన్నూ, నా ప్రవక్తనూ విశ్వసించండి” అని నేను హవారీలకు ఆజ్ఞాపించినప్పుడు, “మేము విశ్వసించాము, మేము పూర్తిగా విధేయులమయ్యాము అన్నదానికి నువ్వు సాక్షిగా ఉండు” అని వారన్నారు.
5:112  إِذْ قَالَ الْحَوَارِيُّونَ يَا عِيسَى ابْنَ مَرْيَمَ هَلْ يَسْتَطِيعُ رَبُّكَ أَن يُنَزِّلَ عَلَيْنَا مَائِدَةً مِّنَ السَّمَاءِ ۖ قَالَ اتَّقُوا اللَّهَ إِن كُنتُم مُّؤْمِنِينَ
“మర్యమ్‌ కుమారుడవైన ఓ ఈసా! నీ ప్రభువు మా కోసం ఆహార పదార్థాలతో నిండిన ఒక పళ్లాన్ని ఆకాశం నుంచి దింపగలడా?” అని హవారీలు అడిగిన సందర్భం జ్ఞాపకం చేసుకోదగినది. అప్పుడు ఈసా, “మీరే గనక విశ్వాసులైతే అల్లాహ్‌కు భయపడండి” అన్నాడు.
5:113  قَالُوا نُرِيدُ أَن نَّأْكُلَ مِنْهَا وَتَطْمَئِنَّ قُلُوبُنَا وَنَعْلَمَ أَن قَدْ صَدَقْتَنَا وَنَكُونَ عَلَيْهَا مِنَ الشَّاهِدِينَ
దానికి వారిలా అన్నారు: “అందులోని ఆహారాన్ని తినాలని, తద్వారా మా మనసులు సంతృప్తి చెందాలనీ, నీవు మాకు చెప్పిన దంతా సత్యమనే నమ్మకం మాలో మరింత పెరగాలనీ, మేము సాక్ష్యమిచ్చేవారం కాగలగాలనీ కోరుకుంటున్నాము.”
5:114  قَالَ عِيسَى ابْنُ مَرْيَمَ اللَّهُمَّ رَبَّنَا أَنزِلْ عَلَيْنَا مَائِدَةً مِّنَ السَّمَاءِ تَكُونُ لَنَا عِيدًا لِّأَوَّلِنَا وَآخِرِنَا وَآيَةً مِّنكَ ۖ وَارْزُقْنَا وَأَنتَ خَيْرُ الرَّازِقِينَ
అప్పుడు మర్యమ్‌ కుమారుడగు ఈసా ఇలా వేడుకున్నాడు : “ఓ అల్లాహ్‌! మా ప్రభూ! ఆకాశం నుంచి మాపై ఆహారంతో నిండిన పళ్లాన్ని దించు. అది మా కొరకు, అనగా మాలోని తొలివారు, తుది వారందరికీ సంతోషకరమైన విషయం (పండుగ) కావాలి. ఇంకా నీ తరఫున అది ఒక సూచన కాగలగాలి. నీవు మాకు ఆహారం ప్రసాదించు. నీవు అందరికన్నా శ్రేష్ఠమైన ఆహార ప్రదాతవు.”
5:115  قَالَ اللَّهُ إِنِّي مُنَزِّلُهَا عَلَيْكُمْ ۖ فَمَن يَكْفُرْ بَعْدُ مِنكُمْ فَإِنِّي أُعَذِّبُهُ عَذَابًا لَّا أُعَذِّبُهُ أَحَدًا مِّنَ الْعَالَمِينَ
దానికి అల్లాహ్‌ ఇలా జవాబిచ్చాడు: “సరే, ఆ ఆహారాన్ని నేను మీపై అవతరింపజేస్తాను. మరి ఆ తరువాత కూడా మీలో ఎవరయినా అవిశ్వాసానికి పాల్పడితే లోకంలో ఎవరికీ విధించనటువంటి శిక్షను వారికి విధిస్తాను.”
5:116  وَإِذْ قَالَ اللَّهُ يَا عِيسَى ابْنَ مَرْيَمَ أَأَنتَ قُلْتَ لِلنَّاسِ اتَّخِذُونِي وَأُمِّيَ إِلَٰهَيْنِ مِن دُونِ اللَّهِ ۖ قَالَ سُبْحَانَكَ مَا يَكُونُ لِي أَنْ أَقُولَ مَا لَيْسَ لِي بِحَقٍّ ۚ إِن كُنتُ قُلْتُهُ فَقَدْ عَلِمْتَهُ ۚ تَعْلَمُ مَا فِي نَفْسِي وَلَا أَعْلَمُ مَا فِي نَفْسِكَ ۚ إِنَّكَ أَنتَ عَلَّامُ الْغُيُوبِ
(ఆ తరువాత) “మర్యమ్‌ పుత్రుడవైన ఓ ఈసా! అల్లాహ్‌ను వదలి నన్నూ, నా తల్లిని ఆరాధ్య దైవాలుగా చేసుకోండి అని గాని నీవు ప్రజలకు చెప్పావా?” అని అల్లాహ్‌ (నిలదీసి) అడిగే సందర్భం కూడా స్మరించుకోదగినదే. అప్పుడు ఈసా ఇలా విన్నవించుకుంటారు: “(ఓ అల్లాహ్‌!) నిన్ను పరమ పవిత్రునిగా భావిస్తున్నాను. ఏ మాటను అనే హక్కు నాకు లేదో అలాంటి మాటను అనటం నాకేమాత్రం తగదు. ఒకవేళ నేను గనక అలాంటిదేదైనా అని ఉంటే అది నీకు తెలిసి ఉండేది. నా మనసులో ఏముందో కూడా నీకు తెలుసు. కాని నీలో ఏముందో నాకు తెలీదు. నిశ్చయంగా నీవు సమస్త గుప్త విషయాలను ఎరిగినవాడవు.
5:117  مَا قُلْتُ لَهُمْ إِلَّا مَا أَمَرْتَنِي بِهِ أَنِ اعْبُدُوا اللَّهَ رَبِّي وَرَبَّكُمْ ۚ وَكُنتُ عَلَيْهِمْ شَهِيدًا مَّا دُمْتُ فِيهِمْ ۖ فَلَمَّا تَوَفَّيْتَنِي كُنتَ أَنتَ الرَّقِيبَ عَلَيْهِمْ ۚ وَأَنتَ عَلَىٰ كُلِّ شَيْءٍ شَهِيدٌ
'నా ప్రభువూ, మీ ప్రభువూ అయిన అల్లాహ్‌ను మాత్రమే ఆరాధించండి' అని నీవు చెప్పమని ఆజ్ఞాపించిన విషయం తప్ప మరో మాటను నేను వారికి చెప్పలేదు. నేను వారిమధ్య ఉన్నంత కాలం వారిపై సాక్షిగా ఉన్నాను. నీవు నన్ను పైకి లేపుకున్న తరువాత నువ్వే వారిని కనిపెట్టుకుని ఉన్నావు. వాస్తవానికి అన్ని విషయాలను కనిపెట్టుకుని ఉండేవాడవు నువ్వే.
5:118  إِن تُعَذِّبْهُمْ فَإِنَّهُمْ عِبَادُكَ ۖ وَإِن تَغْفِرْ لَهُمْ فَإِنَّكَ أَنتَ الْعَزِيزُ الْحَكِيمُ
“ఒకవేళ నీవు వారిని శిక్షించినట్లయితే వారు నీ దాసులు. నీవు గనక వారిని క్షమించినట్లయితే నిశ్చయంగా నీవు సర్వాధిక్యుడవు, వివేచనాపరుడవు.”
5:119  قَالَ اللَّهُ هَٰذَا يَوْمُ يَنفَعُ الصَّادِقِينَ صِدْقُهُمْ ۚ لَهُمْ جَنَّاتٌ تَجْرِي مِن تَحْتِهَا الْأَنْهَارُ خَالِدِينَ فِيهَا أَبَدًا ۚ رَّضِيَ اللَّهُ عَنْهُمْ وَرَضُوا عَنْهُ ۚ ذَٰلِكَ الْفَوْزُ الْعَظِيمُ
అల్లాహ్‌ ఈ విధంగా సెలవిస్తాడు: “ఈ రోజు సత్యవంతులకు వారి సత్యం ప్రయోజనకరమవుతుంది. క్రింద కాలువలు ప్రవహించే (స్వర్గ) వనాలు వారికి ప్రాప్తిస్తాయి. అందులో వారు కలకాలం ఉంటారు. అల్లాహ్‌ వారి పట్ల ప్రసన్నుడయ్యాడు. వారు అల్లాహ్‌ పట్ల సంతుష్టులయ్యారు. వాస్తవానికి గొప్ప సాఫల్యమంటే ఇదే.
5:120  لِلَّهِ مُلْكُ السَّمَاوَاتِ وَالْأَرْضِ وَمَا فِيهِنَّ ۚ وَهُوَ عَلَىٰ كُلِّ شَيْءٍ قَدِيرٌ
ఆకాశాలు, భూమి, ఇంకా వాటిలో ఉన్న సమస్త వస్తువుల ఆధిపత్యం అల్లాహ్‌దే. ఆయన అన్నింటిపై అధికారం కలవాడు.


ఈ తెలుగు ఖుర్ఆన్ శాంతి మార్గం పబ్లికేషన్ వారు ప్రచురించారు. వారి అనుమతితో ఈ వెబ్ పోర్టల్ పై వేయబడింది.