Translation
| 57. సూరా అల్ హదీద్ 57:1 سَبَّحَ لِلَّهِ مَا فِي السَّمَاوَاتِ وَالْأَرْضِ ۖ وَهُوَ الْعَزِيزُ الْحَكِيمُ ఆకాశాలలోనూ, భూమిలోనూ ఉన్న వస్తువులన్నీ అల్లాహ్ పవిత్రతను కొనియాడుతున్నాయి. ఆయన గొప్ప శక్తిశాలి, వివేచనాశీలి. 57:2 لَهُ مُلْكُ السَّمَاوَاتِ وَالْأَرْضِ ۖ يُحْيِي وَيُمِيتُ ۖ وَهُوَ عَلَىٰ كُلِّ شَيْءٍ قَدِيرٌ భూమ్యాకాశాల సార్వభౌమత్వం ఆయనదే. జీవన్మరణాల ప్రదాత ఆయనే. ఆయన ప్రతిదీ చేయగల అధికారం గలవాడు. 57:3 هُوَ الْأَوَّلُ وَالْآخِرُ وَالظَّاهِرُ وَالْبَاطِنُ ۖ وَهُوَ بِكُلِّ شَيْءٍ عَلِيمٌ ఆయనే మొదటివాడు, చివరివాడు. ఆయనే బాహ్యం. ఆయనే నిగూఢం. ఆయన ప్రతిదీ తెలిసినవాడు. 57:4 هُوَ الَّذِي خَلَقَ السَّمَاوَاتِ وَالْأَرْضَ فِي سِتَّةِ أَيَّامٍ ثُمَّ اسْتَوَىٰ عَلَى الْعَرْشِ ۚ يَعْلَمُ مَا يَلِجُ فِي الْأَرْضِ وَمَا يَخْرُجُ مِنْهَا وَمَا يَنزِلُ مِنَ السَّمَاءِ وَمَا يَعْرُجُ فِيهَا ۖ وَهُوَ مَعَكُمْ أَيْنَ مَا كُنتُمْ ۚ وَاللَّهُ بِمَا تَعْمَلُونَ بَصِيرٌ ఆయనే భూమ్యాకాశాలను ఆరు రోజులలో సృష్టించాడు. ఆ తరువాత సింహాసనాన్ని అధిష్టించాడు. భూమి లోపలికి పోయేదీ, అందులో నుంచి బయల్పడేదీ, ఆకాశం నుంచి క్రిందికి దిగేదీ, మరందులోకి ఎక్కిపోయేదీ – అంతా ఆయనకు (బాగా)తెలుసు. మీరెక్కడ ఉన్నా ఆయన మీతోనే ఉంటాడు. మరి మీరు చేసే పనులన్నింటినీ అల్లాహ్ చూస్తూనే ఉన్నాడు. 57:5 لَّهُ مُلْكُ السَّمَاوَاتِ وَالْأَرْضِ ۚ وَإِلَى اللَّهِ تُرْجَعُ الْأُمُورُ భూమ్యాకాశాల సార్వ భౌమత్వం ఆయనదే. సమస్త వ్యవహారాలు (తీర్పు నిమిత్తం) ఆయన వైపుకే మరలించబడతాయి. 57:6 يُولِجُ اللَّيْلَ فِي النَّهَارِ وَيُولِجُ النَّهَارَ فِي اللَّيْلِ ۚ وَهُوَ عَلِيمٌ بِذَاتِ الصُّدُورِ ఆయనే రాత్రిని పగటిలోనికి ప్రవేశింపజేస్తున్నాడు, మరి ఆయనే పగటిని రాత్రిలోనికి జొప్పిస్తున్నాడు. ఆయన గుండెల్లోని గుట్టును (సయితం) బాగా ఎరిగినవాడు. 57:7 آمِنُوا بِاللَّهِ وَرَسُولِهِ وَأَنفِقُوا مِمَّا جَعَلَكُم مُّسْتَخْلَفِينَ فِيهِ ۖ فَالَّذِينَ آمَنُوا مِنكُمْ وَأَنفَقُوا لَهُمْ أَجْرٌ كَبِيرٌ మీరు అల్లాహ్ ను, ఆయన ప్రవక్తను విశ్వసించండి. అల్లాహ్ మిమ్మల్ని ఏ సంపదకైతే వారసులుగా చేశాడో అందులో నుంచి ఖర్చుచేయండి. మరి మీలో విశ్వసించి, దానధర్మాలు చేసే వారికి గొప్ప పుణ్యఫలం లభిస్తుంది. 57:8 وَمَا لَكُمْ لَا تُؤْمِنُونَ بِاللَّهِ ۙ وَالرَّسُولُ يَدْعُوكُمْ لِتُؤْمِنُوا بِرَبِّكُمْ وَقَدْ أَخَذَ مِيثَاقَكُمْ إِن كُنتُم مُّؤْمِنِينَ మీరు అల్లాహ్ ను ఎందుకు విశ్వసించరు? అసలు మీకేమైపోయింది? చూడబోతే దైవప్రవక్త స్వయంగా మీ ప్రభువును విశ్వసించమని మీకు పిలుపు ఇస్తున్నాడు. మీరు నిజంగా విశ్వసించిన వారైతే ఆయన మీ నుండి గట్టి వాగ్దానం కూడా తీసుకున్నాడు (అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి). 57:9 هُوَ الَّذِي يُنَزِّلُ عَلَىٰ عَبْدِهِ آيَاتٍ بَيِّنَاتٍ لِّيُخْرِجَكُم مِّنَ الظُّلُمَاتِ إِلَى النُّورِ ۚ وَإِنَّ اللَّهَ بِكُمْ لَرَءُوفٌ رَّحِيمٌ మిమ్మల్ని కారుచీకట్ల నుంచి వెలికితీసి కాంతి వైపు తీసుకుపోవటానికి తన దాసునిపై తేటతెల్లమైన ఆయతులను అవతరింప చేసినవాడు ఆయనే (అల్లాహ్ యే). నిశ్చయంగా అల్లాహ్ మీ యెడల మృదు స్వభావి, దయాశీలి. 57:10 وَمَا لَكُمْ أَلَّا تُنفِقُوا فِي سَبِيلِ اللَّهِ وَلِلَّهِ مِيرَاثُ السَّمَاوَاتِ وَالْأَرْضِ ۚ لَا يَسْتَوِي مِنكُم مَّنْ أَنفَقَ مِن قَبْلِ الْفَتْحِ وَقَاتَلَ ۚ أُولَٰئِكَ أَعْظَمُ دَرَجَةً مِّنَ الَّذِينَ أَنفَقُوا مِن بَعْدُ وَقَاتَلُوا ۚ وَكُلًّا وَعَدَ اللَّهُ الْحُسْنَىٰ ۚ وَاللَّهُ بِمَا تَعْمَلُونَ خَبِيرٌ మీరు అల్లాహ్ మార్గంలో ఖర్చుపెట్టక పోవటానికి కారణం ఏమిటి? అసలు మీకేమయింది? వాస్తవానికి భూమ్యకాశాలలోని వారసత్వం అంతా అల్లాహ్ కే చెందుతుంది. మీలో (మక్కా) విజయానికి పూర్వం దైవమార్గంలో ఖర్చుచేసినవారు, పోరాడినవారూ – ఇతరులూ సమానులు కాలేరు. (మక్కా) విజయం తర్వాత ఖర్చుచేసి, పోరాడిన వారికంటే వీరు గొప్ప అంతస్థులు కలవారు. అయితే మేలు చేస్తానన్న అల్లాహ్ వాగ్దానం మాత్రం వీరందరికీ వర్తిస్తుంది. మీరు చేసేదంతా అల్లాహ్ కు తెలుసు. 57:11 مَّن ذَا الَّذِي يُقْرِضُ اللَّهَ قَرْضًا حَسَنًا فَيُضَاعِفَهُ لَهُ وَلَهُ أَجْرٌ كَرِيمٌ అల్లాహ్ కు ఉత్తమ (రీతిలో) రుణం ఇచ్చేవాడెవడు? దాన్ని ఆయన అతని కోసం పెంచుతూపోతాడు. అతని యెడల అది అత్యుత్తమ ప్రతిఫలంగా రూపొందుతుంది. 57:12 يَوْمَ تَرَى الْمُؤْمِنِينَ وَالْمُؤْمِنَاتِ يَسْعَىٰ نُورُهُم بَيْنَ أَيْدِيهِمْ وَبِأَيْمَانِهِم بُشْرَاكُمُ الْيَوْمَ جَنَّاتٌ تَجْرِي مِن تَحْتِهَا الْأَنْهَارُ خَالِدِينَ فِيهَا ۚ ذَٰلِكَ هُوَ الْفَوْزُ الْعَظِيمُ ఆ రోజు (ప్రళయదినాన) విశ్వాసులైన పురుషులను, విశ్వాసులైన స్త్రీలను నీవు చూస్తావు. వారి కాంతి వారికి ముందు వైపున, కుడి వైపున పరిగెడుతూ ఉంటుంది. “ఈ రోజు మీకో శుభవార్త! క్రింద కాలువలు ప్రవహించే స్వర్గవనాలు మీ కోసం ఉన్నాయి. అందులో మీరు కలకాలం ఉంటారు. ఇదే గొప్ప సాఫల్యం!” (అని వారితో అనబడుతుంది). 57:13 يَوْمَ يَقُولُ الْمُنَافِقُونَ وَالْمُنَافِقَاتُ لِلَّذِينَ آمَنُوا انظُرُونَا نَقْتَبِسْ مِن نُّورِكُمْ قِيلَ ارْجِعُوا وَرَاءَكُمْ فَالْتَمِسُوا نُورًا فَضُرِبَ بَيْنَهُم بِسُورٍ لَّهُ بَابٌ بَاطِنُهُ فِيهِ الرَّحْمَةُ وَظَاهِرُهُ مِن قِبَلِهِ الْعَذَابُ ఆ రోజు కపటులైన పురుషులు, కపటులైన స్త్రీలు విశ్వాసులనుద్దేశించి, “కాస్త మాకోసం ఆగండి! మేము కూడా మీ కాంతి నుండి కాస్త లబ్దిపొందుతాం” అని అంటారు. “మీరు వెనక్కి మరలండి. వెలుతురును అక్కడే వెతుక్కోండి” అని వారికి సమాధానం ఇవ్వబడుతుంది. మరి వారి మధ్య ఒక అడ్డుగోడ ఏర్పరచబడుతుంది. అందులో ఒక ద్వారం కూడా ఉంటుంది. దాని లోపలి వైపు కారుణ్యం ఉంటుంది. బయటి వైపు మాత్రం యాతన ఉంటుంది. 57:14 يُنَادُونَهُمْ أَلَمْ نَكُن مَّعَكُمْ ۖ قَالُوا بَلَىٰ وَلَٰكِنَّكُمْ فَتَنتُمْ أَنفُسَكُمْ وَتَرَبَّصْتُمْ وَارْتَبْتُمْ وَغَرَّتْكُمُ الْأَمَانِيُّ حَتَّىٰ جَاءَ أَمْرُ اللَّهِ وَغَرَّكُم بِاللَّهِ الْغَرُورُ వీళ్ళు (కపటులు) వారిని (విశ్వాసులను) బిగ్గరగా పిలుస్తూ, “మేము మీ వెంటలేమా?!” అనంటారు. దానికి వారు, “అవును. మా వెంట ఉన్న సంగతి నిజమే. కాని మీరు మీ ఆత్మలను వంచించుకున్నారు. (మా పై గడ్డుకాలం రావాలని) ఎదురు చూశారు. సందేహాలలో ఊగిసలాడారు. పనికిమాలిన మీ అభిలాషలే మిమ్మల్ని దగా చేశాయి. ఎట్టకేలకు దైవాజ్ఞ రానే వచ్చింది. అల్లాహ్ విషయంలో మోసగించినవాడు (షైతాన్), మిమ్మల్ని (కడ దాకా) మోసంలోనే ఉంచాడు.” 57:15 فَالْيَوْمَ لَا يُؤْخَذُ مِنكُمْ فِدْيَةٌ وَلَا مِنَ الَّذِينَ كَفَرُوا ۚ مَأْوَاكُمُ النَّارُ ۖ هِيَ مَوْلَاكُمْ ۖ وَبِئْسَ الْمَصِيرُ ఏమైనా ఈ రోజు మీనుండి గానీ, అవిశ్వాసుల నుండి గానీ పరిహారం తీసుకోబడదు. మీ అందరి నివాస స్థలం నరకాగ్నే. అదే మీ నేస్తం. అది మహా చెడ్డ గమ్యస్థానం. 57:16 أَلَمْ يَأْنِ لِلَّذِينَ آمَنُوا أَن تَخْشَعَ قُلُوبُهُمْ لِذِكْرِ اللَّهِ وَمَا نَزَلَ مِنَ الْحَقِّ وَلَا يَكُونُوا كَالَّذِينَ أُوتُوا الْكِتَابَ مِن قَبْلُ فَطَالَ عَلَيْهِمُ الْأَمَدُ فَقَسَتْ قُلُوبُهُمْ ۖ وَكَثِيرٌ مِّنْهُمْ فَاسِقُونَ ఏమిటీ, విశ్వాసుల హృదయాలు అల్లాహ్ జ్ఞాపకం పట్ల, ఆయన అవతరింపజేసిన సత్యం పట్ల మెత్తబడే సమయం ఇంకా వారికి ఆసన్నం కాలేదా? వీరికి మునుపు గ్రంథం వొసగబడిన వారి మాదిరిగా వీరు కాకూడదు. మరి ఆ గ్రంథవహులపై ఒక సుదీర్ఘకాలం గడచిపోయేసరికి వారి హృదయాలు కఠినమై పోయాయి. వారిలో చాలామంది అవిధేయులు. 57:17 اعْلَمُوا أَنَّ اللَّهَ يُحْيِي الْأَرْضَ بَعْدَ مَوْتِهَا ۚ قَدْ بَيَّنَّا لَكُمُ الْآيَاتِ لَعَلَّكُمْ تَعْقِلُونَ బాగా తెలుసుకోండి! భూమి మృతి చెందిన మీదట, అల్లాహ్ యే దానిని తిరిగి బ్రతికిస్తున్నాడు. మీరు అర్ధం చేసుకునేటందుకు మేము మా సూచనలను బాగా విడమరచి చెప్పాము. 57:18 إِنَّ الْمُصَّدِّقِينَ وَالْمُصَّدِّقَاتِ وَأَقْرَضُوا اللَّهَ قَرْضًا حَسَنًا يُضَاعَفُ لَهُمْ وَلَهُمْ أَجْرٌ كَرِيمٌ నిశ్చయంగా దానధర్మాలు చేసే పురుషులు, దానధర్మాలు చేసే స్త్రీలు, అల్లాహ్ కు (చిత్తశుద్ధితో) మంచి ఋణం ఇచ్చేవారు – వారు ఇచ్చినది వారి కొరకు పెంచబడుతుంది. మరి వారి కొరకు గౌరవప్రదమైన ప్రతిఫలం ఉంది. 57:19 وَالَّذِينَ آمَنُوا بِاللَّهِ وَرُسُلِهِ أُولَٰئِكَ هُمُ الصِّدِّيقُونَ ۖ وَالشُّهَدَاءُ عِندَ رَبِّهِمْ لَهُمْ أَجْرُهُمْ وَنُورُهُمْ ۖ وَالَّذِينَ كَفَرُوا وَكَذَّبُوا بِآيَاتِنَا أُولَٰئِكَ أَصْحَابُ الْجَحِيمِ మరెవరైతే అల్లాహ్ ను, ఆయన ప్రవక్తను విశ్వసిస్తారో వారే తమ ప్రభువు దగ్గర సత్యవంతులు, సాక్షులు. వారికొరకు వారి పుణ్యఫలం కూడా ఉంటుంది. వారి జ్యోతి కూడా ఉంటుంది. మరెవరైతే అవిశ్వాసులై మా సూచనలను ధిక్కరించారో వారే నరకవాసులవుతారు. 57:20 اعْلَمُوا أَنَّمَا الْحَيَاةُ الدُّنْيَا لَعِبٌ وَلَهْوٌ وَزِينَةٌ وَتَفَاخُرٌ بَيْنَكُمْ وَتَكَاثُرٌ فِي الْأَمْوَالِ وَالْأَوْلَادِ ۖ كَمَثَلِ غَيْثٍ أَعْجَبَ الْكُفَّارَ نَبَاتُهُ ثُمَّ يَهِيجُ فَتَرَاهُ مُصْفَرًّا ثُمَّ يَكُونُ حُطَامًا ۖ وَفِي الْآخِرَةِ عَذَابٌ شَدِيدٌ وَمَغْفِرَةٌ مِّنَ اللَّهِ وَرِضْوَانٌ ۚ وَمَا الْحَيَاةُ الدُّنْيَا إِلَّا مَتَاعُ الْغُرُورِ బాగా తెలుసుకోండి! ఈ ప్రాపంచిక జీవితం ఒక ఆట, తమాషా, అలంకార ప్రాయం, పరస్పరం బడాయిని చాటుకోవటం, సిరిసంపదలు, సంతానం విషయంలో ఒండొకరిని మించిపోవడానికి ప్రయత్నించటం మాత్రమే. (దీని) ఉపమానం వర్షపు నీరు లాంటిది. దానివల్ల మొలచిన పైరు రైతులను అలరిస్తుంది. మరి ఆ పంట ఎండిపోగానే అది పసుపువన్నెగా మారిపోవటం నీవు చూస్తావు. ఆ తరువాత అది పొట్టు పొట్టుగా తయారవుతుంది. మరి పరలోకంలో మాత్రం తీవ్రమైన శిక్ష ఉంది, అల్లాహ్ తరఫున క్షమాపణ, ఆయన ప్రీతి కూడా ఉంది. మొత్తానికి ప్రాపంచిక జీవితం మభ్యపెట్టే వస్తువు తప్ప మరేమీ కాదు. 57:21 سَابِقُوا إِلَىٰ مَغْفِرَةٍ مِّن رَّبِّكُمْ وَجَنَّةٍ عَرْضُهَا كَعَرْضِ السَّمَاءِ وَالْأَرْضِ أُعِدَّتْ لِلَّذِينَ آمَنُوا بِاللَّهِ وَرُسُلِهِ ۚ ذَٰلِكَ فَضْلُ اللَّهِ يُؤْتِيهِ مَن يَشَاءُ ۚ وَاللَّهُ ذُو الْفَضْلِ الْعَظِيمِ (రండి!) మీ ప్రభువు క్షమాభిక్ష వైపు పరుగెత్తండి. ఇంకా, భూమ్యాకాశాలంత వెడల్పు గల స్వర్గం వైపు పరుగిడండి. అల్లాహ్ ను, ఆయన ప్రవక్తలను విశ్వసించే వారికోసం అది తయారు చేయబడింది. ఇది అల్లాహ్ అనుగ్రహం! ఆయన దీనిని తాను కోరిన వారికి ఇస్తాడు. అల్లాహ్ గొప్ప అనుగ్రహం కలవాడు. 57:22 مَا أَصَابَ مِن مُّصِيبَةٍ فِي الْأَرْضِ وَلَا فِي أَنفُسِكُمْ إِلَّا فِي كِتَابٍ مِّن قَبْلِ أَن نَّبْرَأَهَا ۚ إِنَّ ذَٰلِكَ عَلَى اللَّهِ يَسِيرٌ ఏ ఆపద అయినాసరే – అది భూమిలో వచ్చేదైనా, స్వయంగా మీ ప్రాణాలపైకి వచ్చేదైనా – మేము దానిని పుట్టించకమునుపే అదొక ప్రత్యేక గ్రంథంలో వ్రాయబడి ఉంది. ఇలా చేయటం అల్లాహ్ కు చాలా తేలిక. 57:23 لِّكَيْلَا تَأْسَوْا عَلَىٰ مَا فَاتَكُمْ وَلَا تَفْرَحُوا بِمَا آتَاكُمْ ۗ وَاللَّهُ لَا يُحِبُّ كُلَّ مُخْتَالٍ فَخُورٍ పోయే దానిపై మీరు దుఖించకుండా, ప్రసాదించబడిన దానిపై మిడిసిపడకుండా ఉండాలని (మీకీ సంగతి తెలియజేయబడింది). అదిరిపడే ఏ అహంభావినీ అల్లాహ్ ఇష్టపడడు సుమా! 57:24 الَّذِينَ يَبْخَلُونَ وَيَأْمُرُونَ النَّاسَ بِالْبُخْلِ ۗ وَمَن يَتَوَلَّ فَإِنَّ اللَّهَ هُوَ الْغَنِيُّ الْحَمِيدُ వారెలాంటి వారంటే తాము (స్వయంగా) పిసినారితనం చూపటమే గాక ఇతరులను (కూడా) పిసినారితనానికి పురికొల్పుతారు. ఎవడు (అల్లాహ్ మార్గం నుండి) ముఖం త్రిప్పుకుని పోయినా అల్లాహ్ అక్కరలేనివాడు, స్తోత్రనీయుడన్న సంగతిని అతను గుర్తుంచుకోవాలి. 57:25 لَقَدْ أَرْسَلْنَا رُسُلَنَا بِالْبَيِّنَاتِ وَأَنزَلْنَا مَعَهُمُ الْكِتَابَ وَالْمِيزَانَ لِيَقُومَ النَّاسُ بِالْقِسْطِ ۖ وَأَنزَلْنَا الْحَدِيدَ فِيهِ بَأْسٌ شَدِيدٌ وَمَنَافِعُ لِلنَّاسِ وَلِيَعْلَمَ اللَّهُ مَن يَنصُرُهُ وَرُسُلَهُ بِالْغَيْبِ ۚ إِنَّ اللَّهَ قَوِيٌّ عَزِيزٌ నిశ్చయంగా మేము మా ప్రవక్తలకు స్పష్టమైన నిదర్శనాలను ఇచ్చి పంపాము. వారితో పాటు గ్రంథాన్ని, ధర్మకాటాను కూడా అవతరింపజేశాము – ప్రజలు న్యాయంపై నిలిచి ఉండటానికి! ఇంకా మేము ఇనుమును కూడా అవతరింపజేశాము. అందులో చాలా బలం ఉంది, జనుల కొరకు (ఇతరత్రా) ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఇంకా – చూడకుండానే తనకు, తన ప్రవక్తలకు తోడ్పడే వారెవరో అల్లాహ్ తెలుసుకోదలిచాడు. నిస్సందేహంగా అల్లాహ్ మహాబలుడు, తిరుగులేనివాడు. 57:26 وَلَقَدْ أَرْسَلْنَا نُوحًا وَإِبْرَاهِيمَ وَجَعَلْنَا فِي ذُرِّيَّتِهِمَا النُّبُوَّةَ وَالْكِتَابَ ۖ فَمِنْهُم مُّهْتَدٍ ۖ وَكَثِيرٌ مِّنْهُمْ فَاسِقُونَ మేము నూహును, ఇబ్రాహీమును ప్రవక్తలుగా చేసి పంపాము. మరి వారిద్దరి సంతతిలో ప్రవక్త పదవిని, గ్రంథ పరంపరను ఉంచాము. అయితే వారిలో కొందరు సన్మార్గ భాగ్యం పొందగా, అత్యధికులు అవిధేయులయ్యారు. 57:27 ثُمَّ قَفَّيْنَا عَلَىٰ آثَارِهِم بِرُسُلِنَا وَقَفَّيْنَا بِعِيسَى ابْنِ مَرْيَمَ وَآتَيْنَاهُ الْإِنجِيلَ وَجَعَلْنَا فِي قُلُوبِ الَّذِينَ اتَّبَعُوهُ رَأْفَةً وَرَحْمَةً وَرَهْبَانِيَّةً ابْتَدَعُوهَا مَا كَتَبْنَاهَا عَلَيْهِمْ إِلَّا ابْتِغَاءَ رِضْوَانِ اللَّهِ فَمَا رَعَوْهَا حَقَّ رِعَايَتِهَا ۖ فَآتَيْنَا الَّذِينَ آمَنُوا مِنْهُمْ أَجْرَهُمْ ۖ وَكَثِيرٌ مِّنْهُمْ فَاسِقُونَ మరి వారి వెనుకే మేము మా ప్రవక్తలను నిరంతరం పంపసాగాము. వారి తరువాత మర్యం కుమారుడైన ఈసాను పంపాము. అతనికి ఇంజీలు గ్రంథాన్ని వొసగాము. అతన్ని అనుసరించే వారి హృదయాలలో మృదుత్వాన్ని, జాలిని సృజించాము. మరైతే సన్యాసత్వాన్ని (రహ్ బానియత్) వారంతట వారే ఆవిష్కరించారు. మేము మాత్రం దీనిని వారిపై విధించలేదు. దైవప్రీతిని తప్ప! మరి వారు దానికి తగురీతిలో కట్టుబడి ఉండలేకపోయారు. అయినప్పటికీ మేము వారిలో విశ్వసించిన వారికి వారి పుణ్య ఫలాన్ని ప్రసాదించాము. వారిలో అధికులు మాత్రం అవిధేయులుగా తయారయ్యారు. 57:28 يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا اتَّقُوا اللَّهَ وَآمِنُوا بِرَسُولِهِ يُؤْتِكُمْ كِفْلَيْنِ مِن رَّحْمَتِهِ وَيَجْعَل لَّكُمْ نُورًا تَمْشُونَ بِهِ وَيَغْفِرْ لَكُمْ ۚ وَاللَّهُ غَفُورٌ رَّحِيمٌ ఓ విశ్వాసులారా! అల్లాహ్ కు భయపడండి. అతని ప్రవక్తను విశ్వసించండి. అల్లాహ్ మీకు తన కారుణ్యం నుంచి రెట్టింపు భాగాన్ని ప్రసాదిస్తాడు. ఇంకా మీకు జ్యోతిని అనుగ్రహిస్తాడు. దాని వెలుగులో మీరు నడుస్తారు. ఆయన మీ పాపాలను కూడా క్షమిస్తాడు. అల్లాహ్ గొప్ప క్షమాశీలి, దయాశీలి. 57:29 لِّئَلَّا يَعْلَمَ أَهْلُ الْكِتَابِ أَلَّا يَقْدِرُونَ عَلَىٰ شَيْءٍ مِّن فَضْلِ اللَّهِ ۙ وَأَنَّ الْفَضْلَ بِيَدِ اللَّهِ يُؤْتِيهِ مَن يَشَاءُ ۚ وَاللَّهُ ذُو الْفَضْلِ الْعَظِيمِ దైవానుగ్రహంలోని ఏ భాగంపై కూడా తమకెలాంటి అధికారం లేదని, అనుగ్రహమంతా దేవుని చేతిలోనే ఉందని, ఆయన తను కోరిన వారికి దాన్ని ప్రసాదిస్తాడని గ్రంథ ప్రజలు తెలుసుకోవాలని (ఆయన ఈ విధంగా చేశాడు). అల్లాహ్ గొప్ప అనుగ్రహం కలవాడు. ఈ తెలుగు ఖుర్ఆన్ శాంతి మార్గం పబ్లికేషన్ వారు ప్రచురించారు. వారి అనుమతితో ఈ వెబ్ పోర్టల్ పై వేయబడింది. |