Translation
| 55. సూరా ఆర్ రహ్మాన్ 55:1 الرَّحْمَٰنُ కరుణామయుడు (అయిన అల్లాహ్) 55:2 عَلَّمَ الْقُرْآنَ ఖుర్ఆన్ ను నేర్పాడు. 55:3 خَلَقَ الْإِنسَانَ ఆయన మనిషిని పుట్టించాడు. 55:4 عَلَّمَهُ الْبَيَانَ ఆయన అతనికి మాట్లాడటం నేర్పాడు. 55:5 الشَّمْسُ وَالْقَمَرُ بِحُسْبَانٍ సూర్యుడు, చంద్రుడు ఒక (నిర్ణీత) లెక్క ప్రకారం పోతున్నాయి. 55:6 وَالنَّجْمُ وَالشَّجَرُ يَسْجُدَانِ నక్షత్రాలు, వృక్షాలు సాష్టాంగపడుతూ ఉన్నాయి. 55:7 وَالسَّمَاءَ رَفَعَهَا وَوَضَعَ الْمِيزَانَ ఆయనే ఆకాశాన్ని ఎత్తుగా చేశాడు, ఆయనే (సమతూకం నిమిత్తం) త్రాసును ఉంచాడు. 55:8 أَلَّا تَطْغَوْا فِي الْمِيزَانِ మీరు తూకంలో వైపరీత్యానికి పాల్పడకుండా ఉండేందుకు! 55:9 وَأَقِيمُوا الْوَزْنَ بِالْقِسْطِ وَلَا تُخْسِرُوا الْمِيزَانَ తూకం సరిగ్గా – న్యాయసమ్మతంగా – ఉండేలా చూడండి. తూకంలో తగ్గించి ఇవ్వకండి. 55:10 وَالْأَرْضَ وَضَعَهَا لِلْأَنَامِ ఆయన సృష్టిరాసుల కోసం భూమిని పరచి ఉంచాడు. 55:11 فِيهَا فَاكِهَةٌ وَالنَّخْلُ ذَاتُ الْأَكْمَامِ అందులో పండ్లు ఫలాదులు, పొరలలో చుట్టబడిన ఖర్జూరాలు ఉన్నాయి. 55:12 وَالْحَبُّ ذُو الْعَصْفِ وَالرَّيْحَانُ ఊక గల ధాన్యాలు, సువాసన గల పువ్వులు కూడా ఉన్నాయి. 55:13 فَبِأَيِّ آلَاءِ رَبِّكُمَا تُكَذِّبَانِ కనుక (ఓ మనుషులు, జిన్నులారా!) మీరు మీ ప్రభువు యెక్క ఏ ఏ అనుగ్రహాలను కాదనగలరు? 55:14 خَلَقَ الْإِنسَانَ مِن صَلْصَالٍ كَالْفَخَّارِ ఆయన మనిషిని పెంకు మాదిరిగా శబ్దం చేసే మట్టితో సృజించాడు. 55:15 وَخَلَقَ الْجَانَّ مِن مَّارِجٍ مِّن نَّارٍ మరి జిన్నాతులను ఆయన అగ్ని జ్వాలలతో సృష్టించాడు. 55:16 فَبِأَيِّ آلَاءِ رَبِّكُمَا تُكَذِّبَانِ కనుక మీరు మీ ప్రభువు అనుగ్రహాలలో దేనిని త్రోసిపుచ్చగలరు? 55:17 رَبُّ الْمَشْرِقَيْنِ وَرَبُّ الْمَغْرِبَيْنِ రెండు తూర్పులకు ప్రభువు (ఆయనే), రెండు పడమరలకు ప్రభువు (కూడా ఆయనే). 55:18 فَبِأَيِّ آلَاءِ رَبِّكُمَا تُكَذِّبَانِ మరైతే (ఓ మానవ, జిన్ను వర్గీయులారా!) మీరు మీ ప్రభువు యెక్క ఏ ఏ అనుగ్రహాలను త్రోసిపుచ్చగలరు? 55:19 مَرَجَ الْبَحْرَيْنِ يَلْتَقِيَانِ రెండు సాగర జలాలు పరస్పరం కలసి ప్రవహించేలా వదలిపెట్టినవాడు ఆయనే. 55:20 بَيْنَهُمَا بَرْزَخٌ لَّا يَبْغِيَانِ అయితే ఆ రెండింటి మధ్య ఒక అడ్డు తెర ఉంది. దాన్ని అవి దాటిపోవు. 55:21 فَبِأَيِّ آلَاءِ رَبِّكُمَا تُكَذِّبَانِ కాబట్టి మీరు మీ ప్రభువు అనుగ్రహాలలో దేనిని నిరాకరించగలరు? 55:22 يَخْرُجُ مِنْهُمَا اللُّؤْلُؤُ وَالْمَرْجَانُ ఆ రెండింటి నుంచి ముత్యాలు, పగడాలు బయల్పడుతున్నై. 55:23 فَبِأَيِّ آلَاءِ رَبِّكُمَا تُكَذِّبَانِ కాబట్టి మీరు మీ ప్రభువు అనుగ్రహాలలో దేనిని నిరాకరించగలరు? 55:24 وَلَهُ الْجَوَارِ الْمُنشَآتُ فِي الْبَحْرِ كَالْأَعْلَامِ సముద్రాలలో పర్వతాల్లా ఎత్తుగా ఉండి రాకపోకలు సాగిస్తున్న ఓడలు కూడా ఆయనవే. 55:25 فَبِأَيِّ آلَاءِ رَبِّكُمَا تُكَذِّبَانِ కాబట్టి మీరు మీ ప్రభువు అనుగ్రహాలలో దేనిని నిరాకరించగలరు? 55:26 كُلُّ مَنْ عَلَيْهَا فَانٍ భూమండలం పై ఉన్నవారంతా నశించి పోవలసినవారే. 55:27 وَيَبْقَىٰ وَجْهُ رَبِّكَ ذُو الْجَلَالِ وَالْإِكْرَامِ ఎప్పటికీ మిగిలి ఉండేది ఘనత, గౌరవం గల నీ ప్రభువు అస్తిత్వం మాత్రమే. 55:28 فَبِأَيِّ آلَاءِ رَبِّكُمَا تُكَذِّبَانِ కాబట్టి మీరు మీ ప్రభువు అనుగ్రహాలలో దేనిని నిరాకరించగలరు? 55:29 يَسْأَلُهُ مَن فِي السَّمَاوَاتِ وَالْأَرْضِ ۚ كُلَّ يَوْمٍ هُوَ فِي شَأْنٍ ఆకాశాలలో, భూమిలో ఉన్నవారంతా (తమ అవసరాలు తీరడానికి) ఆయన్నే అర్థిస్తున్నారు. ప్రతి దినం ఆయన ఓ (వినూత్న) వైభవంతో వెలుగొందుతూ ఉంటాడు. 55:30 فَبِأَيِّ آلَاءِ رَبِّكُمَا تُكَذِّبَانِ కాబట్టి మీరు మీ ప్రభువు అనుగ్రహాలలో దేనిని నిరాకరించగలరు? 55:31 سَنَفْرُغُ لَكُمْ أَيُّهَ الثَّقَلَانِ (జిన్ను జాతికి, మనుజ జాతికి చెందిన) ఓ ఇరువర్గాల వారలారా! అతి త్వరలోనే మేము తీరికతో మీ సంగతి చూస్తాము. 55:32 فَبِأَيِّ آلَاءِ رَبِّكُمَا تُكَذِّبَانِ కాబట్టి మీరు మీ ప్రభువు అనుగ్రహాలలో దేనిని నిరాకరించగలరు? 55:33 يَا مَعْشَرَ الْجِنِّ وَالْإِنسِ إِنِ اسْتَطَعْتُمْ أَن تَنفُذُوا مِنْ أَقْطَارِ السَّمَاوَاتِ وَالْأَرْضِ فَانفُذُوا ۚ لَا تَنفُذُونَ إِلَّا بِسُلْطَانٍ ఓ జిన్నుల, మానవుల సమూహానికి చెందినవారలారా! మీలో ఎవరికైనా భూమ్యాకాశాల అంచుల నుండి పారిపోయే శక్తి ఉంటే పారిపోయి చూడండి! అధికారం లేకుండా మీరు ఎట్టి పరిస్థితిలోనూ పోలేరు. 55:34 فَبِأَيِّ آلَاءِ رَبِّكُمَا تُكَذِّبَانِ కాబట్టి మీరు మీ ప్రభువు అనుగ్రహాలలో దేనిని నిరాకరించగలరు? 55:35 يُرْسَلُ عَلَيْكُمَا شُوَاظٌ مِّن نَّارٍ وَنُحَاسٌ فَلَا تَنتَصِرَانِ (ఒకవేళ మీరు అవిధేయతకు పాల్పడినట్లయితే) మీపైకి మండే అగ్నిజ్వాలలు, ధూమకెరటాలు పంపబడతాయి. దాన్నుంచి మీరు తప్పించుకోలేరు. 55:36 فَبِأَيِّ آلَاءِ رَبِّكُمَا تُكَذِّبَانِ కాబట్టి మీరు మీ ప్రభువు అనుగ్రహాలలో దేనిని నిరాకరించగలరు? 55:37 فَإِذَا انشَقَّتِ السَّمَاءُ فَكَانَتْ وَرْدَةً كَالدِّهَانِ మరెప్పుడైతే ఆకాశం చీలిపోయి, ఎర్రని చర్మంలా తయారవుతుందో (ఆ స్థితిని ఓ సారి నెమరు వేసుకోండి!) 55:38 فَبِأَيِّ آلَاءِ رَبِّكُمَا تُكَذِّبَانِ కాబట్టి మీరు మీ ప్రభువు అనుగ్రహాలలో దేనిని నిరాకరించగలరు? 55:39 فَيَوْمَئِذٍ لَّا يُسْأَلُ عَن ذَنبِهِ إِنسٌ وَلَا جَانٌّ ఆ రోజు ఏ మనిషికీ, ఏ జిన్నుకూ అతని పాపాల గురించి ప్రశ్నించవలసిన అగత్యం ఉండదు. 55:40 فَبِأَيِّ آلَاءِ رَبِّكُمَا تُكَذِّبَانِ కాబట్టి మీరు మీ ప్రభువు అనుగ్రహాలలో దేనిని నిరాకరించగలరు? 55:41 يُعْرَفُ الْمُجْرِمُونَ بِسِيمَاهُمْ فَيُؤْخَذُ بِالنَّوَاصِي وَالْأَقْدَامِ అపరాధులు తమ వాలకాన్ని (నలుపు ఆవరించిన తమ ముఖాలను) బట్టే పసిగట్టబడతారు. మరి వారు తమ నుదుటి జుట్టు ద్వారా, పాదాల ద్వారా పట్టుకోబడతారు. 55:42 فَبِأَيِّ آلَاءِ رَبِّكُمَا تُكَذِّبَانِ కాబట్టి మీరు మీ ప్రభువు అనుగ్రహాలలో దేనిని నిరాకరించగలరు? 55:43 هَٰذِهِ جَهَنَّمُ الَّتِي يُكَذِّبُ بِهَا الْمُجْرِمُونَ నేరస్థులు అబద్ధమని కొట్టిపారేసిన నరకం ఇదే. 55:44 يَطُوفُونَ بَيْنَهَا وَبَيْنَ حَمِيمٍ آنٍ వారు దీనికీ (నరకానికీ) - సలసలా కాగే నీళ్ళకు మధ్య తచ్చాడుతూ ఉంటారు. 55:45 فَبِأَيِّ آلَاءِ رَبِّكُمَا تُكَذِّبَانِ కాబట్టి మీరు మీ ప్రభువు అనుగ్రహాలలో దేనిని నిరాకరించగలరు? 55:46 وَلِمَنْ خَافَ مَقَامَ رَبِّهِ جَنَّتَانِ తమ ప్రభువు ఎదుట నిలబడవలసి ఉందనే భయం కలిగి ఉండేవారికి రెండు తోటలుంటాయి. 55:47 فَبِأَيِّ آلَاءِ رَبِّكُمَا تُكَذِّبَانِ కాబట్టి మీరు మీ ప్రభువు అనుగ్రహాలలో దేనిని నిరాకరించగలరు? 55:48 ذَوَاتَا أَفْنَانٍ (అవి రెండూ) శాఖోపశాఖలుగా విస్తరించి ఉంటాయి. 55:49 فَبِأَيِّ آلَاءِ رَبِّكُمَا تُكَذِّبَانِ కాబట్టి మీరు మీ ప్రభువు అనుగ్రహాలలో దేనిని నిరాకరించగలరు? 55:50 فِيهِمَا عَيْنَانِ تَجْرِيَانِ మరి ఆ రెండు తోటలలోనూ రెండు సెలయేరులు ప్రవహిస్తూ ఉంటాయి. 55:51 فَبِأَيِّ آلَاءِ رَبِّكُمَا تُكَذِّبَانِ కాబట్టి మీరు మీ ప్రభువు అనుగ్రహాలలో దేనిని నిరాకరించగలరు? 55:52 فِيهِمَا مِن كُلِّ فَاكِهَةٍ زَوْجَانِ ఆ రెండు తోటలలోనూ ప్రతి పండు యెక్క రెండేసి రకాలు ఉంటాయి. 55:53 فَبِأَيِّ آلَاءِ رَبِّكُمَا تُكَذِّبَانِ కాబట్టి మీరు మీ ప్రభువు అనుగ్రహాలలో దేనిని నిరాకరించగలరు? 55:54 مُتَّكِئِينَ عَلَىٰ فُرُشٍ بَطَائِنُهَا مِنْ إِسْتَبْرَقٍ ۚ وَجَنَى الْجَنَّتَيْنِ دَانٍ వారు (స్వర్గవాసులు) దళసరి పట్టు వస్త్రపు అస్తరుగల పరుపులపై దిండ్లకు ఆనుకుని (దర్జాగా) ఆసీనులై ఉంటారు. ఆ రెండు తోటల పండ్లు ఫలాలు (వారికి) మరీ దగ్గరగా ఉంటాయి. 55:55 فَبِأَيِّ آلَاءِ رَبِّكُمَا تُكَذِّبَانِ కాబట్టి మీరు మీ ప్రభువు అనుగ్రహాలలో దేనిని నిరాకరించగలరు? 55:56 فِيهِنَّ قَاصِرَاتُ الطَّرْفِ لَمْ يَطْمِثْهُنَّ إِنسٌ قَبْلَهُمْ وَلَا جَانٌّ వాటి మధ్య (బిడియంతో) చూపులు క్రిందికి వాలి ఉండే స్వర్గ కన్యలుంటారు. వీరికి పూర్వం ఆ స్వర్గ కన్యలను ఏ మానవుడుగానీ, ఏ జిన్నుగానీ ముట్టుకొని ఉండడు. 55:57 فَبِأَيِّ آلَاءِ رَبِّكُمَا تُكَذِّبَانِ కాబట్టి మీరు మీ ప్రభువు అనుగ్రహాలలో దేనిని నిరాకరించగలరు? 55:58 كَأَنَّهُنَّ الْيَاقُوتُ وَالْمَرْجَانُ ఆ స్వర్గకన్యలు (అందచందాల రీత్యా స్వచ్చమైన) కెంపులు, పగడాల మాదిరిగా ఉంటారు. 55:59 فَبِأَيِّ آلَاءِ رَبِّكُمَا تُكَذِّبَانِ కాబట్టి మీరు మీ ప్రభువు అనుగ్రహాలలో దేనిని నిరాకరించగలరు? 55:60 هَلْ جَزَاءُ الْإِحْسَانِ إِلَّا الْإِحْسَانُ సద్వ్యవహారానికి ప్రతిఫలం సద్వ్యవహారం గాక మరేం కాగలదు? 55:61 فَبِأَيِّ آلَاءِ رَبِّكُمَا تُكَذِّبَانِ కాబట్టి మీరు మీ ప్రభువు అనుగ్రహాలలో దేనిని నిరాకరించగలరు? 55:62 وَمِن دُونِهِمَا جَنَّتَانِ ఈ రెండు తోటలే గాకుండా మరో రెండు తోటలు కూడా ఉన్నాయి. 55:63 فَبِأَيِّ آلَاءِ رَبِّكُمَا تُكَذِّبَانِ కాబట్టి మీరు మీ ప్రభువు అనుగ్రహాలలో దేనిని నిరాకరించగలరు? 55:64 مُدْهَامَّتَانِ అవి రెండూను గుబురుగా, (రంగులో) ముదురు ఆకుపచ్చగా ఉంటాయి. 55:65 فَبِأَيِّ آلَاءِ رَبِّكُمَا تُكَذِّبَانِ కాబట్టి మీరు మీ ప్రభువు అనుగ్రహాలలో దేనిని నిరాకరించగలరు? 55:66 فِيهِمَا عَيْنَانِ نَضَّاخَتَانِ ఆ రెండు వనాలలో పొంగిపొరలే రెండు సెలయేరులుంటాయి. 55:67 فَبِأَيِّ آلَاءِ رَبِّكُمَا تُكَذِّبَانِ కాబట్టి మీరు మీ ప్రభువు అనుగ్రహాలలో దేనిని నిరాకరించగలరు? 55:68 فِيهِمَا فَاكِهَةٌ وَنَخْلٌ وَرُمَّانٌ ఆ రెండింటిలోనూ పండ్లు, ఖర్జూరాలు, దానిమ్మ కాయలు (పుష్కలంగా) ఉంటాయి. 55:69 فَبِأَيِّ آلَاءِ رَبِّكُمَا تُكَذِّبَانِ కాబట్టి మీరు మీ ప్రభువు అనుగ్రహాలలో దేనిని నిరాకరించగలరు? 55:70 فِيهِنَّ خَيْرَاتٌ حِسَانٌ వాటిలో సౌశీల్యవతులు, సౌందర్యవతులు అయిన స్త్రీలు ఉంటారు. 55:71 فَبِأَيِّ آلَاءِ رَبِّكُمَا تُكَذِّبَانِ కాబట్టి మీరు మీ ప్రభువు అనుగ్రహాలలో దేనిని నిరాకరించగలరు? 55:72 حُورٌ مَّقْصُورَاتٌ فِي الْخِيَامِ గుడారాలలో సురక్షితంగా ఉంచబడిన (ఎర్రని) సుందరాంగులు కూడా ఉన్నారు. 55:73 فَبِأَيِّ آلَاءِ رَبِّكُمَا تُكَذِّبَانِ కాబట్టి మీరు మీ ప్రభువు అనుగ్రహాలలో దేనిని నిరాకరించగలరు? 55:74 لَمْ يَطْمِثْهُنَّ إِنسٌ قَبْلَهُمْ وَلَا جَانٌّ వారికి (ఈ స్వర్గవాసులకు) పూర్వం వారిని ఏ మనిషిగానీ, జిన్నుగానీ ముట్టుకొని ఉండడు. 55:75 فَبِأَيِّ آلَاءِ رَبِّكُمَا تُكَذِّبَانِ కాబట్టి మీరు మీ ప్రభువు అనుగ్రహాలలో దేనిని నిరాకరించగలరు? 55:76 مُتَّكِئِينَ عَلَىٰ رَفْرَفٍ خُضْرٍ وَعَبْقَرِيٍّ حِسَانٍ వారు పచ్చటి పరుపులపై, ఖరీదైన తివాచీలపై దిండ్లకు ఆనుకొని కూర్చుని ఉంటారు. 55:77 فَبِأَيِّ آلَاءِ رَبِّكُمَا تُكَذِّبَانِ కాబట్టి మీరు మీ ప్రభువు అనుగ్రహాలలో దేనిని నిరాకరించగలరు? 55:78 تَبَارَكَ اسْمُ رَبِّكَ ذِي الْجَلَالِ وَالْإِكْرَامِ ఘనత గౌరవాలు గల నీ ప్రభువు నామం ఎంతో శుభప్రదమైనది. ఈ తెలుగు ఖుర్ఆన్ శాంతి మార్గం పబ్లికేషన్ వారు ప్రచురించారు. వారి అనుమతితో ఈ వెబ్ పోర్టల్ పై వేయబడింది. |