aip_quran
Translation

  العربية              తెలుగు  

1. సూరా అల్ ఫాతిహా
2. సూరా అల్ బఖర
3. సూరా ఆలి ఇమ్రాన్
4. సూరా అన్ నిసా
5. సూరా అల్ మాయిద
6. సూరా అల్ అన్ ఆమ్
7. సూరా అల్ ఆరాఫ్
8. సూరా అల్ అన్ ఫాల్
9. సూరా అత్ తౌబా
10. సూరా యూనుస్
11. సూరా హూద్
12. సూరా యూసుఫ్
13. సూరా ఆర్ రాద్
14. సూరా ఇబ్రహీం
15. సూరా అల్ హిజ్ర్
16. సూరా అన్ నహ్ల్
17. సూరా బనీ ఇస్రాయీల్
18. సూరా అల్ కహఫ్
19. సూరా మర్యం
20. సూరా తాహా
21. సూరా అల్ అంబియా
22. సూరా అల్ హజ్
23. సూరా అల్ మూ ‘మినూన్
24. సూరా అన్ నూర్
25. సూరా అల్ ఫుర్ఖాన్
26. సూరా ఆష్ షుఅరా
27. సూరా అన్ నమ్ల్
28. సూరా అల్ ఖసస్
29. సూరా అల్ అన్ కబూత్
30. సూరా ఆర్ రూమ్
31. సూరా లుక్మాన్
32. సూరా అస్ సజ్ ద హ్
33. సూరా అల్ ఆహ్ జాబ్
34. సూరా సబా
35. సూరా ఫాతిర్
36. సూరా యాసీన్
37. సూరా అస్ సాఫ్ఫాత్
38. సూరా సాద్
39. సూరా అజ్ జుమర్
40. సూరా అల్ మూమిన్
41. సూరా హామీమ్ అస్ సజ్ ద హ్
42. సూరా ఆష్ షూరా
43. సూరా అజ్ జుఖ్ రుఫ్
44. సూరా అద్ దుఖాన్
45. సూరా అల్ జాసియ హ్
46. సూరా అల్ ఆహ్ ఖాఫ్
47. సూరా ముహమ్మద్
48. సూరా అల్ ఫతహ్
49. సూరా అల్ హుజురాత్
50. సూరా ఖాఫ్
51. సూరా అజ్ జారియాత్
52. సూరా అత్ తూర్
53. సూరా అన్ నజ్మ్
54. సూరా అల్ ఖమర్
55. సూరా ఆర్ రహ్మాన్
56. సూరా వాఖియహ్
57. సూరా అల్ హదీద్
58. సూరా అల్ ముజాదల హ్
59. సూరా అల్ హష్ర్
60. సూరా అల్ ముమ్ తహిన హ్
61. సూరా అస్ సఫ్
62. సూరాఅల్ జుముఅ హ్
63. సూరా అల్ మునాఫిఖూన్
64. సూరా అత్ తగాబున్
65. సూరా అత్ తలాఖ్
66. సూరా అత్ తహ్రీం
67. సూరా అల్ ముల్క్
68. సూరా అల్ ఖలమ్
69. సూరా అల్ హఖ్ఖ
70. సూరా అల్ ముఆరిజ్
71. సూరా నూహ్
72. సూరా అల్ జిన్న్
73. సూరా అల్ ముజ్జమ్మిల్
74. సూరా అల్ ముద్దస్సిర్
75. సూరా అల్ ఖియామ హ్
76. సూరా అద్ దహ్ర్
77. సూరా అల్ ముర్సలాత్
78. సూరా అన్ నబా
79. సూరా అన్ నాజి ఆత్
80. సూరా అబస
81. సూరా అత్ తక్వీర్
82. సూరా అల్ ఇన్ ఫితార్
83. సూరాఅల్ ముతఫ్ఫిఫీన్
84. సూరా అల్ ఇన్ షి ఖాక్
85. సూరా అల్ బురూజ్
86. సూరా అత్ తారిఖ్
87. సూరా అల్ ఆలా
88. సూరా అల్ గాషియ హ్
89. సూరా అల్ ఫజ్ర్
90. సూరా అల్ బలద్
91. సూరా ఆష్ షమ్స్
92. సూరా అల్ లైల్
93. సూరా అజ్ జుహా
94. సూరా ఆలమ్ నష్ర్
95. సూరా అత్ తతీన్
96. సూరా అల్ అలఖ్
97. సూరా అల్ ఖద్ర్
98. సూరా అల్ బయ్యిన హ్
99. సూరా అజ్ జిలజాల్
100. సూరా అల్ ఆదియాత్
101. సూరా అల్ ఖారియ హ్
102. సూరా అత్ తకాసుర్
103. సూరా అల్ అస్ర్
104. సూరా అల్ హుమజా హ్
105. సూరా అల్ ఫీల్
106. సూరా ఖురైష్
107. సూరా అల్ మాఊ న్
108. సూరా అల్ కౌసర్
109. సూరా అల్ ఖాఫిరూన్
110. సూరా అన్ నస్ర్
111. సూరా అల్ లహబ్
112. సూరా అల్ ఇఖ్లాస్
113. సూరా అల్ ఫలఖ్
114. సూరా అన్ నాస్

54. సూరా అల్ ఖమర్

54:1  اقْتَرَبَتِ السَّاعَةُ وَانشَقَّ الْقَمَرُ
ప్రళయ ఘడియ దగ్గరపడింది. చంద్రుడు చీలిపోయాడు.
54:2  وَإِن يَرَوْا آيَةً يُعْرِضُوا وَيَقُولُوا سِحْرٌ مُّسْتَمِرٌّ
ఒకవేళ వీళ్ళు ఏదైనా మహిమను చూసినా, దాన్నుండి ముఖం త్రిప్పుకుంటారు. “పూర్వం నుండి జరుగుతూ వస్తున్న మాయాజాలమే కదా ఇది!” అనంటారు.
54:3  وَكَذَّبُوا وَاتَّبَعُوا أَهْوَاءَهُمْ ۚ وَكُلُّ أَمْرٍ مُّسْتَقِرٌّ
వీళ్ళు ధిక్కరించారు. తమ మనోవాంఛల వెనుకపోయారు. అయితే ప్రతి విషయానికి ఒక సమయం నిర్ధారితమై ఉంది.
54:4  وَلَقَدْ جَاءَهُم مِّنَ الْأَنبَاءِ مَا فِيهِ مُزْدَجَرٌ
నిశ్చయంగా వారివద్దకు ఎన్నో వార్తలొచ్చాయి. వాటిలో మందలింపుతో కూడిన హితోపదేశం ఉంది.
54:5  حِكْمَةٌ بَالِغَةٌ ۖ فَمَا تُغْنِ النُّذُرُ
సంపూర్ణ వివేకం ఉంది. కాని ఆ హెచ్చరికలు కూడా వారికెలాంటి ప్రయోజనం చేకూర్చలేదు.
54:6  فَتَوَلَّ عَنْهُمْ ۘ يَوْمَ يَدْعُ الدَّاعِ إِلَىٰ شَيْءٍ نُّكُرٍ
కనుక (ఓ ప్రవక్తా!) నువ్వు వారిని వదలిపెట్టు. పిలిచేవాడు భరించశక్యం కాని విషయం వైపు పిలిచిననాడు,
54:7  خُشَّعًا أَبْصَارُهُمْ يَخْرُجُونَ مِنَ الْأَجْدَاثِ كَأَنَّهُمْ جَرَادٌ مُّنتَشِرٌ
వారు కళ్ళు వంచుకుని గోరీల నుండి లేచి చెల్లాచెదురైన మిడుతల దండు వలే వస్తారు.
54:8  مُّهْطِعِينَ إِلَى الدَّاعِ ۖ يَقُولُ الْكَافِرُونَ هَٰذَا يَوْمٌ عَسِرٌ
తమను పిలిచేవాని వైపు పరుగెత్తుకుంటూ వస్తారు. అప్పుడు అవిశ్వాసులు “ఇది చాలా గడ్డు రోజు” అనంటారు.
54:9  كَذَّبَتْ قَبْلَهُمْ قَوْمُ نُوحٍ فَكَذَّبُوا عَبْدَنَا وَقَالُوا مَجْنُونٌ وَازْدُجِرَ
వారికి పూర్వం నూహ్ జాతి వారు కూడా (తమ ప్రవక్తను) ధిక్కరించారు. వారు మా దాసుణ్ణి త్రోసిపుచ్చి, అతణ్ణి “పిచ్చోడ”న్నారు. అతణ్ణి విదిలించారు.
54:10  فَدَعَا رَبَّهُ أَنِّي مَغْلُوبٌ فَانتَصِرْ
అప్పుడతను, “నేను ఆశక్తుణ్ణి అయిపోయాను. కాబట్టి నీవు నాకు సహాయం చెయ్యి” అంటూ తన ప్రభువును మొరపెట్టుకున్నాడు.
54:11  فَفَتَحْنَا أَبْوَابَ السَّمَاءِ بِمَاءٍ مُّنْهَمِرٍ
అప్పుడు మేము ఉధృతంగా నీటిని కురిపించేలా ఆకాశ ద్వారాలను తెరచి వేశాము.
54:12  وَفَجَّرْنَا الْأَرْضَ عُيُونًا فَالْتَقَى الْمَاءُ عَلَىٰ أَمْرٍ قَدْ قُدِرَ
మరి భూమి నుండి కూడా నీటి ఊటలు పొంగిపొరలేలా చేశాము. నిర్ణయించబడిన పనిని పూర్తిచేయటానికి (రెండు) నీళ్ళు కలిశాయి.
54:13  وَحَمَلْنَاهُ عَلَىٰ ذَاتِ أَلْوَاحٍ وَدُسُرٍ
మరి మేమతన్ని పలకలు, మేకులు గల దానిలో ఎక్కించాము.
54:14  تَجْرِي بِأَعْيُنِنَا جَزَاءً لِّمَن كَانَ كُفِرَ
అది మా కనుల ముందరే పయనించసాగింది – త్రోసిపుచ్చబడినవానికి ప్రతిఫలంగా!
54:15  وَلَقَد تَّرَكْنَاهَا آيَةً فَهَلْ مِن مُّدَّكِرٍ
నిశ్చయంగా మేము ఈ సంఘటనను ఒక సూచనగా మిగిల్చి ఉంచాము. మరి హితబోధను గ్రహించే వాడెవడైనా ఉన్నాడా?
54:16  فَكَيْفَ كَانَ عَذَابِي وَنُذُرِ
నా శిక్ష, నా హెచ్చరికలు ఎలా ఉండినవో చెప్పండి.
54:17  وَلَقَدْ يَسَّرْنَا الْقُرْآنَ لِلذِّكْرِ فَهَلْ مِن مُّدَّكِرٍ
నిశ్చయంగా మేము ఖుర్ఆన్ ను అర్ధం చేసుకోవటానికి గాను సులభతరం చేశాము. మరి (దీనిద్వారా) హితబోధను గ్రహించేవాడెవడైనా ఉన్నాడా?
54:18  كَذَّبَتْ عَادٌ فَكَيْفَ كَانَ عَذَابِي وَنُذُرِ
ఆద్ జాతి వారు (కూడా) ధిక్కరించారు. మరి నా శిక్ష, నా హెచ్చరికలు ఎలా ఉండినాయో (చూశారుగా)!
54:19  إِنَّا أَرْسَلْنَا عَلَيْهِمْ رِيحًا صَرْصَرًا فِي يَوْمِ نَحْسٍ مُّسْتَمِرٍّ
మేము వారిపై నిరంతరంగా వీచే ప్రచండమైన పెనుగాలిని ఒకానొక దుర్దినాన పంపాము.
54:20  تَنزِعُ النَّاسَ كَأَنَّهُمْ أَعْجَازُ نَخْلٍ مُّنقَعِرٍ
అది ఆ జనులను, కూకటివ్రేళ్ళతో పెకలించబడిన ఖర్జూరపు బోదెలవలె అమాంతం లేపి పడవేసేది.
54:21  فَكَيْفَ كَانَ عَذَابِي وَنُذُرِ
మరి నా శిక్ష, నా హెచ్చరిక ఎలా ఉండింది? (చూశారుగా)!
54:22  وَلَقَدْ يَسَّرْنَا الْقُرْآنَ لِلذِّكْرِ فَهَلْ مِن مُّدَّكِرٍ
నిశ్చయంగా మేము ఖుర్ఆన్ ను అర్ధం చేసుకునేందుకుగాను సులభతరం చేశాము. మరి (దీనిద్వారా) హితబోధను గ్రహించేవాడెవడైనా ఉన్నాడా?
54:23  كَذَّبَتْ ثَمُودُ بِالنُّذُرِ
సమూదు జాతి వారు (కూడా) హెచ్చరించేవారిని ధిక్కరించారు.
54:24  فَقَالُوا أَبَشَرًا مِّنَّا وَاحِدًا نَّتَّبِعُهُ إِنَّا إِذًا لَّفِي ضَلَالٍ وَسُعُرٍ
“ఏమిటీ, మనలోని ఒక మానవుణ్ణి మనం అనుసరించాలా? ఒకవేళ అదే గనక జరిగితే మనం ముమ్మాటికీ పెడదారిపట్టి, పిచ్చిలో పడినట్లే.
54:25  أَأُلْقِيَ الذِّكْرُ عَلَيْهِ مِن بَيْنِنَا بَلْ هُوَ كَذَّابٌ أَشِرٌ
“ఏమిటీ, మనం ఇంతమందిమి ఉండగా మన మధ్యన కేవలం అతనొక్కడికే బోధన (వహీ) పంపబడిందా? లేదు, అతను బీరాలు పోతున్న అబద్ధాల రాయుడు” అన్నారు.
54:26  سَيَعْلَمُونَ غَدًا مَّنِ الْكَذَّابُ الْأَشِرُ
అబద్ధాల రాయుడు, బడాయిని చాటుకునేవాడెవడో రేపు అందరూ తెలుసుకుంటారు.
54:27  إِنَّا مُرْسِلُو النَّاقَةِ فِتْنَةً لَّهُمْ فَارْتَقِبْهُمْ وَاصْطَبِرْ
వీళ్ళను పరీక్షించటానికి మేము ఒక ఆడ ఒంటెను పంపిస్తున్నాము. కాబట్టి (ఓ సాలెహ్!) నువ్వు వీళ్ళ (పరిణామం) కోసం ఎదురు చూస్తూ ఉండు. కాస్త ఓపిక పట్టు.
54:28  وَنَبِّئْهُمْ أَنَّ الْمَاءَ قِسْمَةٌ بَيْنَهُمْ ۖ كُلُّ شِرْبٍ مُّحْتَضَرٌ
అయితే వాళ్ళ మధ్య నీళ్ళ పంపకం జరిగిందని, ప్రతి ఒక్కరూ (నీళ్ళ కోసం) తమ తమ వంతు ప్రకారం రావలసి ఉంటుందని వారికి తెలియజెయ్యి.
54:29  فَنَادَوْا صَاحِبَهُمْ فَتَعَاطَىٰ فَعَقَرَ
కాని వాళ్ళు మాత్రం తమ సహవాసిని పిలిచారు. వాడు (ఆడ ఒంటెపై) దాడి చేసి, దాని గిట్టల్ని నరికివేశారు.
54:30  فَكَيْفَ كَانَ عَذَابِي وَنُذُرِ
ఇక నా శిక్ష ఎలా పడిందో, నా హెచ్చరిక ఎలా పరిణమించిందో (చూడండి)!
54:31  إِنَّا أَرْسَلْنَا عَلَيْهِمْ صَيْحَةً وَاحِدَةً فَكَانُوا كَهَشِيمِ الْمُحْتَظِرِ
మేము వారిపై ఒకే ఒక కేకను వదిలాము. అంతే! వాళ్ళ పరిస్థితి కంచే నిర్మించేవాడు తొక్కివేసిన గడ్డి మాదిరిగా అయిపోయింది.
54:32  وَلَقَدْ يَسَّرْنَا الْقُرْآنَ لِلذِّكْرِ فَهَلْ مِن مُّدَّكِرٍ
మేము ఖుర్ ఆన్ ను అర్థం చేసుకునేటందుకు ఎంతో సులభతరం చేశాము. (మరి (దీనిద్వారా) హితబోధను గ్రహించే వాడెవడైనా ఉన్నాడా?
54:33  كَذَّبَتْ قَوْمُ لُوطٍ بِالنُّذُرِ
లూత్ జాతి వారు (కూడా తమను) హెచ్చరించేవారిని ధిక్కరించారు.
54:34  إِنَّا أَرْسَلْنَا عَلَيْهِمْ حَاصِبًا إِلَّا آلَ لُوطٍ ۖ نَّجَّيْنَاهُم بِسَحَرٍ
మేము వారిపై రాళ్లు కురుపించే గాలిని పంపాము. అయితే లూత్ ఇంటివారిని మాత్రం (శిక్ష నుండి) మినహాయించాము. వాళ్ళను మేము రాత్రి వేకువజామున కాపాడాము -
54:35  نِّعْمَةً مِّنْ عِندِنَا ۚ كَذَٰلِكَ نَجْزِي مَن شَكَرَ
మా అనుగ్రహంతో! కృతజ్ఞతా భావం కలిగి ఉండే వారందరికీ మేమిలాగే (మంచి) ప్రతిఫలం ఇస్తూ ఉంటాము.
54:36  وَلَقَدْ أَنذَرَهُم بَطْشَتَنَا فَتَمَارَوْا بِالنُّذُرِ
అతను (లూత్ ప్రవక్త) వారికి మా పట్టు గురించి ముందుగానే హెచ్చరించాడు. కాని వారు హెచ్చరికల విషయంలో (సందేహించి అతనితో) కయ్యానికి దిగారు.
54:37  وَلَقَدْ رَاوَدُوهُ عَن ضَيْفِهِ فَطَمَسْنَا أَعْيُنَهُمْ فَذُوقُوا عَذَابِي وَنُذُرِ
అతన్నుండి అతని అతిథులను తీసుకోగోరి, అతణ్ణి దువ్వటం మొదలెట్టారు. అయితే మేము వారి కళ్ళు పోగొట్టాము. “నా శిక్ష, నా హెచ్చరికల రుచిచూడండి!” (అని వారితో అనటం జరిగింది).
54:38  وَلَقَدْ صَبَّحَهُم بُكْرَةً عَذَابٌ مُّسْتَقِرٌّ
తెల తెల వారుతుండగానే స్థిరమైన శిక్ష వారిని అమాంతం కబళించింది.
54:39  فَذُوقُوا عَذَابِي وَنُذُرِ
కాబట్టి నా శిక్షను, నా హెచ్చరికను చవిచూడండి.
54:40  وَلَقَدْ يَسَّرْنَا الْقُرْآنَ لِلذِّكْرِ فَهَلْ مِن مُّدَّكِرٍ
నిశ్చయంగా మేము ఖుర్ఆన్ ను హితబోధన నిమిత్తం సులభతరం చేశాము. మరి ఈ హితబోధనను గ్రహించే వాడెవడైనా ఉన్నాడా?
54:41  وَلَقَدْ جَاءَ آلَ فِرْعَوْنَ النُّذُرُ
ఫిరౌనువారి వద్దకు కూడా హెచ్చరించేవారు వచ్చారు.
54:42  كَذَّبُوا بِآيَاتِنَا كُلِّهَا فَأَخَذْنَاهُمْ أَخْذَ عَزِيزٍ مُّقْتَدِرٍ
కాని వారు మా సూచనలన్నింటినీ ధిక్కరించారు. అందుచేత మేము వారిని మహాశక్తిమంతుడు, సర్వాధికారి పట్టుకున్నట్లే పట్టుకున్నాము.
54:43  أَكُفَّارُكُمْ خَيْرٌ مِّنْ أُولَٰئِكُمْ أَمْ لَكُم بَرَاءَةٌ فِي الزُّبُرِ
(ఓ ఖురైషులారా!) మీలోని తిరస్కారులు (గతించిన) ఆ తిరస్కారులకంటే ఘనులా? లేక పూర్వపు గ్రంథాలలో మీ కోసం (మినహాయింపు) ఏదైనా వ్రాయబడి ఉందా?
54:44  أَمْ يَقُولُونَ نَحْنُ جَمِيعٌ مُّنتَصِرٌ
లేక “మేము గెలుపొందే వర్గం వాళ్ళము” అని వారు ధీమాను వ్యక్తపరుస్తున్నారా?
54:45  سَيُهْزَمُ الْجَمْعُ وَيُوَلُّونَ الدُّبُرَ
(బాగా తెలుసుకోండి) త్వరలోనే ఆ వర్గం ఓడిపోతుంది. వారు వెన్ను చూపి పారిపోతారు.
54:46  بَلِ السَّاعَةُ مَوْعِدُهُمْ وَالسَّاعَةُ أَدْهَىٰ وَأَمَرُّ
పైగా వారికి వాగ్దానం చేయబడిన అసలు (పరాభవ) సమయమైతే ప్రళయమే. ఆ ఘడియ అత్యంత కఠినమైనది, చేదైనది.
54:47  إِنَّ الْمُجْرِمِينَ فِي ضَلَالٍ وَسُعُرٍ
నిశ్చయంగా అపరాధులు మార్గవిహినులయ్యారు. యాతనకు గురయ్యారు.
54:48  يَوْمَ يُسْحَبُونَ فِي النَّارِ عَلَىٰ وُجُوهِهِمْ ذُوقُوا مَسَّ سَقَرَ
ఏ రోజున వారు తమ ముఖముల ఆధారంగా అగ్నిలోకి ఈడ్చబడతారో (ఆ రోజు) “నరకాగ్ని తాకిడి రుచిచూడండి” (అని వారితో అనబడుతుంది).
54:49  إِنَّا كُلَّ شَيْءٍ خَلَقْنَاهُ بِقَدَرٍ
నిశ్చయంగా, మేము ప్రతి వస్తువును ఒక (నిర్ణీత) ‘విధి’ ప్రకారం సృష్టించాము.
54:50  وَمَا أَمْرُنَا إِلَّا وَاحِدَةٌ كَلَمْحٍ بِالْبَصَرِ
మా ఆజ్ఞ ఒక్కటి చాలు (అది అమల్లోకి రావటం అనేది) రెప్పపాటు కాలంలో జరిగిపోతుంది.
54:51  وَلَقَدْ أَهْلَكْنَا أَشْيَاعَكُمْ فَهَلْ مِن مُّدَّكِرٍ
మేము (గతంలో) మీలాంటి వారినెందరినో తుదముట్టించి ఉన్నాము. మరి (దీని ద్వారా) నీతిని గ్రహించే వాడెవడైనా ఉన్నాడా?
54:52  وَكُلُّ شَيْءٍ فَعَلُوهُ فِي الزُّبُرِ
వీళ్ళు చేసినదంతా కర్మల పత్రాలలో నమోదై ఉంది.
54:53  وَكُلُّ صَغِيرٍ وَكَبِيرٍ مُّسْتَطَرٌ
(అలాగే) ప్రతి చిన్న పెద్ద విషయం వ్రాయబడి ఉంది.
54:54  إِنَّ الْمُتَّقِينَ فِي جَنَّاتٍ وَنَهَرٍ
నిశ్చయంగా మాపట్ల భయభక్తులు కలవారు (స్వర్గ) వనాల, సెలయేరుల మధ్య ఉంటారు.
54:55  فِي مَقْعَدِ صِدْقٍ عِندَ مَلِيكٍ مُّقْتَدِرٍ
సర్వశక్తుడు అయిన రాజాధిరాజు (అల్లాహ్) దగ్గర సత్యంతో కూడిన, గౌరవప్రదమైన సదస్సులో ఉంటారు.


ఈ తెలుగు ఖుర్ఆన్ శాంతి మార్గం పబ్లికేషన్ వారు ప్రచురించారు. వారి అనుమతితో ఈ వెబ్ పోర్టల్ పై వేయబడింది.