aip_quran
Translation

  العربية              తెలుగు  

1. సూరా అల్ ఫాతిహా
2. సూరా అల్ బఖర
3. సూరా ఆలి ఇమ్రాన్
4. సూరా అన్ నిసా
5. సూరా అల్ మాయిద
6. సూరా అల్ అన్ ఆమ్
7. సూరా అల్ ఆరాఫ్
8. సూరా అల్ అన్ ఫాల్
9. సూరా అత్ తౌబా
10. సూరా యూనుస్
11. సూరా హూద్
12. సూరా యూసుఫ్
13. సూరా ఆర్ రాద్
14. సూరా ఇబ్రహీం
15. సూరా అల్ హిజ్ర్
16. సూరా అన్ నహ్ల్
17. సూరా బనీ ఇస్రాయీల్
18. సూరా అల్ కహఫ్
19. సూరా మర్యం
20. సూరా తాహా
21. సూరా అల్ అంబియా
22. సూరా అల్ హజ్
23. సూరా అల్ మూ ‘మినూన్
24. సూరా అన్ నూర్
25. సూరా అల్ ఫుర్ఖాన్
26. సూరా ఆష్ షుఅరా
27. సూరా అన్ నమ్ల్
28. సూరా అల్ ఖసస్
29. సూరా అల్ అన్ కబూత్
30. సూరా ఆర్ రూమ్
31. సూరా లుక్మాన్
32. సూరా అస్ సజ్ ద హ్
33. సూరా అల్ ఆహ్ జాబ్
34. సూరా సబా
35. సూరా ఫాతిర్
36. సూరా యాసీన్
37. సూరా అస్ సాఫ్ఫాత్
38. సూరా సాద్
39. సూరా అజ్ జుమర్
40. సూరా అల్ మూమిన్
41. సూరా హామీమ్ అస్ సజ్ ద హ్
42. సూరా ఆష్ షూరా
43. సూరా అజ్ జుఖ్ రుఫ్
44. సూరా అద్ దుఖాన్
45. సూరా అల్ జాసియ హ్
46. సూరా అల్ ఆహ్ ఖాఫ్
47. సూరా ముహమ్మద్
48. సూరా అల్ ఫతహ్
49. సూరా అల్ హుజురాత్
50. సూరా ఖాఫ్
51. సూరా అజ్ జారియాత్
52. సూరా అత్ తూర్
53. సూరా అన్ నజ్మ్
54. సూరా అల్ ఖమర్
55. సూరా ఆర్ రహ్మాన్
56. సూరా వాఖియహ్
57. సూరా అల్ హదీద్
58. సూరా అల్ ముజాదల హ్
59. సూరా అల్ హష్ర్
60. సూరా అల్ ముమ్ తహిన హ్
61. సూరా అస్ సఫ్
62. సూరాఅల్ జుముఅ హ్
63. సూరా అల్ మునాఫిఖూన్
64. సూరా అత్ తగాబున్
65. సూరా అత్ తలాఖ్
66. సూరా అత్ తహ్రీం
67. సూరా అల్ ముల్క్
68. సూరా అల్ ఖలమ్
69. సూరా అల్ హఖ్ఖ
70. సూరా అల్ ముఆరిజ్
71. సూరా నూహ్
72. సూరా అల్ జిన్న్
73. సూరా అల్ ముజ్జమ్మిల్
74. సూరా అల్ ముద్దస్సిర్
75. సూరా అల్ ఖియామ హ్
76. సూరా అద్ దహ్ర్
77. సూరా అల్ ముర్సలాత్
78. సూరా అన్ నబా
79. సూరా అన్ నాజి ఆత్
80. సూరా అబస
81. సూరా అత్ తక్వీర్
82. సూరా అల్ ఇన్ ఫితార్
83. సూరాఅల్ ముతఫ్ఫిఫీన్
84. సూరా అల్ ఇన్ షి ఖాక్
85. సూరా అల్ బురూజ్
86. సూరా అత్ తారిఖ్
87. సూరా అల్ ఆలా
88. సూరా అల్ గాషియ హ్
89. సూరా అల్ ఫజ్ర్
90. సూరా అల్ బలద్
91. సూరా ఆష్ షమ్స్
92. సూరా అల్ లైల్
93. సూరా అజ్ జుహా
94. సూరా ఆలమ్ నష్ర్
95. సూరా అత్ తతీన్
96. సూరా అల్ అలఖ్
97. సూరా అల్ ఖద్ర్
98. సూరా అల్ బయ్యిన హ్
99. సూరా అజ్ జిలజాల్
100. సూరా అల్ ఆదియాత్
101. సూరా అల్ ఖారియ హ్
102. సూరా అత్ తకాసుర్
103. సూరా అల్ అస్ర్
104. సూరా అల్ హుమజా హ్
105. సూరా అల్ ఫీల్
106. సూరా ఖురైష్
107. సూరా అల్ మాఊ న్
108. సూరా అల్ కౌసర్
109. సూరా అల్ ఖాఫిరూన్
110. సూరా అన్ నస్ర్
111. సూరా అల్ లహబ్
112. సూరా అల్ ఇఖ్లాస్
113. సూరా అల్ ఫలఖ్
114. సూరా అన్ నాస్

53. సూరా అన్ నజ్మ్

53:1  وَالنَّجْمِ إِذَا هَوَىٰ
క్రింద పడేటప్పటి నక్షత్రం సాక్షిగా!
53:2  مَا ضَلَّ صَاحِبُكُمْ وَمَا غَوَىٰ
మీ సహచరుడు (అయిన ముహమ్మద్ సల్లల్లాహు అలైహివ సల్లం) దారి తప్పనూ లేదు, పెడదారి పట్టనూ లేదు.
53:3  وَمَا يَنطِقُ عَنِ الْهَوَىٰ
అతను తన మనోభిరామం ప్రకారం మాట్లాడటమూ లేదు.
53:4  إِنْ هُوَ إِلَّا وَحْيٌ يُوحَىٰ
అది (అతను మాట్లాడేదంతా) అతని వద్దకు పంపబడే దైవవాణి (వహీ) తప్ప మరేమీ కాదు.
53:5  عَلَّمَهُ شَدِيدُ الْقُوَىٰ
అసాధారణ శక్తిగల దైవదూత (జిబ్రయీల్) అతనికి (ఖుర్ఆన్) నేర్పాడు.
53:6  ذُو مِرَّةٍ فَاسْتَوَىٰ
అతడు గొప్ప శక్తి సంపన్నుడు. మరి అతను తిన్నగా నిలబడ్డాడు -
53:7  وَهُوَ بِالْأُفُقِ الْأَعْلَىٰ
అతడు ఎత్తైన ఆకాశపుటంచులపై ఉన్నాడు.
53:8  ثُمَّ دَنَا فَتَدَلَّىٰ
మరి అతను సమీపించసాగాడు... అలా అలా వాలుతూ వచ్చాడు.
53:9  فَكَانَ قَابَ قَوْسَيْنِ أَوْ أَدْنَىٰ
చివరికి అతను రెండు ధనస్సులంత దూరాన లేక అంతకన్నా తక్కువ దూరాన ఉండిపోయాడు.
53:10  فَأَوْحَىٰ إِلَىٰ عَبْدِهِ مَا أَوْحَىٰ
– తరువాత అతడు దైవదాసునికి అందజేయవలసిన సందేశాన్ని అందజేశాడు.
53:11  مَا كَذَبَ الْفُؤَادُ مَا رَأَىٰ
(ప్రవక్త) తిలకించినది అసత్యమని అతని హృదయం చెప్పలేదు.
53:12  أَفَتُمَارُونَهُ عَلَىٰ مَا يَرَىٰ
ఏమిటీ (ప్రవక్త) చూస్తున్న దానిపై మీరు అతనితో వాదులాడుతున్నారా?
53:13  وَلَقَدْ رَآهُ نَزْلَةً أُخْرَىٰ
అతను (ముహమ్మద్ సల్లల్లాహు అలైహివ సల్లం) అతణ్ణి (జిబ్రయీల్ ను) మరో సందర్భంలో కూడా చూసి ఉన్నాడు -
53:14  عِندَ سِدْرَةِ الْمُنتَهَىٰ
‘సిద్రతుల్ మున్తహా’ దగ్గర!
53:15  عِندَهَا جَنَّةُ الْمَأْوَىٰ
అక్కడే ‘జన్నతుల్ మావా’ కూడా ఉంది.
53:16  إِذْ يَغْشَى السِّدْرَةَ مَا يَغْشَىٰ
అప్పుడు ఆ ‘సిద్రా’ను ఆవరించే వస్తువేదో ఆవరిస్తూ ఉన్నది.
53:17  مَا زَاغَ الْبَصَرُ وَمَا طَغَىٰ
(అతని) చూపు తప్పిపోనూ లేదు, హద్దు దాటి పోనూ లేదు.
53:18  لَقَدْ رَأَىٰ مِنْ آيَاتِ رَبِّهِ الْكُبْرَىٰ
నిస్సందేహంగా అతను తన ప్రభువు యెక్క గొప్ప సూచనలు (కొన్నింటిని) తిలకించాడు.
53:19  أَفَرَأَيْتُمُ اللَّاتَ وَالْعُزَّىٰ
ఏమిటీ, మీరు లాతు, ఉజ్జాలను చూశారా?
53:20  وَمَنَاةَ الثَّالِثَةَ الْأُخْرَىٰ
మూడవది, చివరిది అయిన మనాతును (కూడా చూశారా?)
53:21  أَلَكُمُ الذَّكَرُ وَلَهُ الْأُنثَىٰ
ఏమిటేమిటి!? మీ కోసమేమో మగపిల్లలూను, ఆయన కోసమేమో ఆడపిల్లలా?
53:22  تِلْكَ إِذًا قِسْمَةٌ ضِيزَىٰ
ఈ విభజన మరీ ఘోరమైనది (కదూ!).
53:23  إِنْ هِيَ إِلَّا أَسْمَاءٌ سَمَّيْتُمُوهَا أَنتُمْ وَآبَاؤُكُم مَّا أَنزَلَ اللَّهُ بِهَا مِن سُلْطَانٍ ۚ إِن يَتَّبِعُونَ إِلَّا الظَّنَّ وَمَا تَهْوَى الْأَنفُسُ ۖ وَلَقَدْ جَاءَهُم مِّن رَّبِّهِمُ الْهُدَىٰ
నిజానికి ఇవన్నీ మీరూ, మీ తాత ముత్తాతలు వాటికి పెట్టుకున్న పేర్లు మాత్రమే. వీటిని గురించి అల్లాహ్ ఏ ప్రమాణమూ పంపలేదు. వీళ్ళు కేవలం అంచనాలను, తమ మనోవాంఛలను అనుసరిస్తున్నారు. మరి చూడబోతే వారి ప్రభువు తరఫున వారి వద్దకు ఖచ్చితంగా మార్గ దర్శకత్వం వచ్చి ఉన్నది.
53:24  أَمْ لِلْإِنسَانِ مَا تَمَنَّىٰ
ఏమిటీ, మనిషి కోరుకున్నదల్లా అతనికి ప్రాప్తిస్తుందా?
53:25  فَلِلَّهِ الْآخِرَةُ وَالْأُولَىٰ
ఇహలోకమూ, పరలోకమూ అల్లాహ్ అధీనంలో మాత్రమే ఉన్నాయి.
53:26  وَكَم مِّن مَّلَكٍ فِي السَّمَاوَاتِ لَا تُغْنِي شَفَاعَتُهُمْ شَيْئًا إِلَّا مِن بَعْدِ أَن يَأْذَنَ اللَّهُ لِمَن يَشَاءُ وَيَرْضَىٰ
ఆకాశాలలో ఎంతో మంది దైవదూతలు ఉన్నారు. కాని వాళ్ళ సిఫారసు ఏ మాత్రం పనికిరాదు. కాకపోతే అల్లాహ్ తన ఇష్టంతో, తాను కోరిన వారి విషయంలో (సిఫారసు వినడానికి) సమ్మతిస్తే అది వేరే విషయం.
53:27  إِنَّ الَّذِينَ لَا يُؤْمِنُونَ بِالْآخِرَةِ لَيُسَمُّونَ الْمَلَائِكَةَ تَسْمِيَةَ الْأُنثَىٰ
పరలోకాన్ని విశ్వసించనివారు దైవదూతలకు ఆడవారి పేర్లు పెడతారు.
53:28  وَمَا لَهُم بِهِ مِنْ عِلْمٍ ۖ إِن يَتَّبِعُونَ إِلَّا الظَّنَّ ۖ وَإِنَّ الظَّنَّ لَا يُغْنِي مِنَ الْحَقِّ شَيْئًا
వాస్తవానికి వారికి ఈ విషయంలో ఎలాంటి పరిజ్ఞానము లేదు. వారు ఉత్త అనుమానాలను అనుసరిస్తున్నారు. నిజానికి (మూఢ) అనుమానాలు సత్యం ముందు దేనికీ పనికిరావు.
53:29  فَأَعْرِضْ عَن مَّن تَوَلَّىٰ عَن ذِكْرِنَا وَلَمْ يُرِدْ إِلَّا الْحَيَاةَ الدُّنْيَا
కనుక (ఓ ప్రవక్తా!) మా ధ్యానం నుండి తిరిగిపోయి, కేవలం ప్రాపంచిక జీవితాన్ని మాత్రమే ఆశించేవాణ్ణి నువ్వు పట్టించుకోకు.
53:30  ذَٰلِكَ مَبْلَغُهُم مِّنَ الْعِلْمِ ۚ إِنَّ رَبَّكَ هُوَ أَعْلَمُ بِمَن ضَلَّ عَن سَبِيلِهِ وَهُوَ أَعْلَمُ بِمَنِ اهْتَدَىٰ
వారికి తెలిసింది అంతవరకే. తన మార్గం నుండి తప్పిపోయిన వాడెవడో నీ ప్రభువుకు బాగా తెలుసు. సన్మార్గం పొందినవాని గురించి కూడా ఆయనకు బాగా తెలుసు.
53:31  وَلِلَّهِ مَا فِي السَّمَاوَاتِ وَمَا فِي الْأَرْضِ لِيَجْزِيَ الَّذِينَ أَسَاءُوا بِمَا عَمِلُوا وَيَجْزِيَ الَّذِينَ أَحْسَنُوا بِالْحُسْنَى
భూమ్యాకాశాలలో ఉన్నదంతా అల్లాహ్ దే. దుష్కర్మలు చేసేవారికి అల్లాహ్ వారి కర్మలకు తగ్గ ప్రతిఫలం ఇవ్వటానికి, సత్కర్మలు చేసేవారికి వారి కర్మలకు తగ్గట్టుగా పుణ్యఫలం ప్రసాదించటానికి (సన్మార్గ దుర్మార్గాలు ఆయన చేతుల్లోనే ఉన్నాయి).
53:32  الَّذِينَ يَجْتَنِبُونَ كَبَائِرَ الْإِثْمِ وَالْفَوَاحِشَ إِلَّا اللَّمَمَ ۚ إِنَّ رَبَّكَ وَاسِعُ الْمَغْفِرَةِ ۚ هُوَ أَعْلَمُ بِكُمْ إِذْ أَنشَأَكُم مِّنَ الْأَرْضِ وَإِذْ أَنتُمْ أَجِنَّةٌ فِي بُطُونِ أُمَّهَاتِكُمْ ۖ فَلَا تُزَكُّوا أَنفُسَكُمْ ۖ هُوَ أَعْلَمُ بِمَنِ اتَّقَىٰ
ఎవరైతే పెద్ద పాపాలకు దూరంగా ఉంటారో, చిన్న చిన్న తప్పులు మినహా నీతిబాహ్యతను కూడా విడనాడతారో (వారి పాలిట) నిశ్చయంగా నీ ప్రభువు ఎంతో ఉదారంగా క్షమించేవాడు. ఆయన మిమ్మల్ని భూమి (మట్టి) నుండి సృజించినప్పుడూ, మీరు మీ మాత్రుగర్భాలలో శిశువులుగా ఉన్నప్పుడు కూడా మీ గురించి ఆయనకు బాగా ఎరుకే. కాబట్టి మీ పారిశుద్ధ్యాన్ని గురించి మీరు (గొప్పలు) చెప్పుకోకండి. దైవానికి భయపడే వాడెవడో ఆయనకు బాగా తెలుసు.
53:33  أَفَرَأَيْتَ الَّذِي تَوَلَّىٰ
సరేగాని (ఓ ప్రవక్తా! దైవ మార్గం నుండి) ముఖం త్రిప్పుకున్నవాన్ని నువ్వు గమనించావా?
53:34  وَأَعْطَىٰ قَلِيلًا وَأَكْدَىٰ
అతడు కాస్తంత ఇచ్చాడు. తర్వాత ఆపేశాడు.
53:35  أَعِندَهُ عِلْمُ الْغَيْبِ فَهُوَ يَرَىٰ
వాడి దగ్గర రహస్య జ్ఞానంగాని ఉందా? వాడు అన్నీ చూస్తూ ఉన్నాడా?
53:36  أَمْ لَمْ يُنَبَّأْ بِمَا فِي صُحُفِ مُوسَىٰ
ఏమిటీ, మూసా గ్రంథ ప్రతులలో గల విషయం గురించి వాడికి సమాచారం ఇవ్వబడలేదా?
53:37  وَإِبْرَاهِيمَ الَّذِي وَفَّىٰ
(అలాగే) విశ్వాసపాత్రుడైన ఇబ్రాహీము గ్రంథ ప్రతుల్లోని విషయం గురించి.
53:38  أَلَّا تَزِرُ وَازِرَةٌ وِزْرَ أُخْرَىٰ
(ఆ విషయం ఏమిటంటే) బరువును మోసేవాడెవడూ ఇంకొకరి బరువును మోయడు.
53:39  وَأَن لَّيْسَ لِلْإِنسَانِ إِلَّا مَا سَعَىٰ
ప్రతి మనిషి దేనికోసం పాటుపడతాడో అది మాత్రమే అతనికి లభిస్తుంది.
53:40  وَأَنَّ سَعْيَهُ سَوْفَ يُرَىٰ
నిశ్చయంగా అతని కృషి త్వరలోనే చూడబడుతుంది.
53:41  ثُمَّ يُجْزَاهُ الْجَزَاءَ الْأَوْفَىٰ
మరి అతనికి సంపూర్ణ ప్రతిఫలం వొసగబడుతుంది.
53:42  وَأَنَّ إِلَىٰ رَبِّكَ الْمُنتَهَىٰ
కడకు అందరూ పోయి చేరవలసింది నీ ప్రభువు వద్దకే.
53:43  وَأَنَّهُ هُوَ أَضْحَكَ وَأَبْكَىٰ
మరి ఆయనే నవ్విస్తున్నాడు, ఆయనే ఏడిపిస్తున్నాడు.
53:44  وَأَنَّهُ هُوَ أَمَاتَ وَأَحْيَا
మరి ఆయనే చంపుతున్నాడు, ఆయనే బ్రతికిస్తున్నాడు.
53:45  وَأَنَّهُ خَلَقَ الزَّوْجَيْنِ الذَّكَرَ وَالْأُنثَىٰ
మరి ఆయనే జంటలను – అంటే ఆడ మగలను – సృజించాడు.
53:46  مِن نُّطْفَةٍ إِذَا تُمْنَىٰ
(గర్భంలో) కార్చబడినప్పటి వీర్యపు బిందువుతో!
53:47  وَأَنَّ عَلَيْهِ النَّشْأَةَ الْأُخْرَىٰ
మలిసారి బ్రతికించి లేపే బాధ్యత కూడా ఆయనదే.
53:48  وَأَنَّهُ هُوَ أَغْنَىٰ وَأَقْنَىٰ
మరి ఆయనే ధనవంతులుగా చేస్తున్నాడు. మూలధనాన్ని కూడా ప్రసాదిస్తున్నాడు.
53:49  وَأَنَّهُ هُوَ رَبُّ الشِّعْرَىٰ
షీరా (నక్షత్రము) కు ప్రభువు కూడా ఆయనే.
53:50  وَأَنَّهُ أَهْلَكَ عَادًا الْأُولَىٰ
ప్రాచీన ఆదు వారిని అంతమొందించింది కూడా ఆయనే.
53:51  وَثَمُودَ فَمَا أَبْقَىٰ
సమూదు వారిని కూడా – ఒక్కర్ని మిగల్చకుండా (తుదముట్టించిన వాడూ ఆయనే)!
53:52  وَقَوْمَ نُوحٍ مِّن قَبْلُ ۖ إِنَّهُمْ كَانُوا هُمْ أَظْلَمَ وَأَطْغَىٰ
అంతకు మునుపు నూహు జాతివారిని (ఆయనే తుడిచిపెట్టాడు). నిశ్చయంగా వారు పరమ దుర్మార్గులు, తలబిరుసులు.
53:53  وَالْمُؤْتَفِكَةَ أَهْوَىٰ
తలక్రిందులుగా చేయబడిన బస్తీలను ఆయనే అమాంతం ఎత్తి పడవేశాడు.
53:54  فَغَشَّاهَا مَا غَشَّىٰ
మరి ఆ బస్తీలపై క్రమ్ముకున్నదేదో వచ్చి క్రమ్ముకుంది.
53:55  فَبِأَيِّ آلَاءِ رَبِّكَ تَتَمَارَىٰ
కనుక (ఓ మనిషీ!) నువ్వు నీ ప్రభువు అనుగ్రహాలలో దేనిపై గొడవపడగలవు?
53:56  هَٰذَا نَذِيرٌ مِّنَ النُّذُرِ الْأُولَىٰ
ఈయన పూర్వం హెచ్చరించిన ప్రవక్తల మాదిరిగానే హెచ్చరించే ప్రవక్త.
53:57  أَزِفَتِ الْآزِفَةُ
రానున్న గడియ దగ్గరపడింది.
53:58  لَيْسَ لَهَا مِن دُونِ اللَّهِ كَاشِفَةٌ
అల్లాహ్ తప్ప దాన్ని (ఆ నిర్ణీత సమయాన) స్పష్టంగా చూపించేవాడెవడూ లేడు.
53:59  أَفَمِنْ هَٰذَا الْحَدِيثِ تَعْجَبُونَ
ఏమిటీ, మీరు ఈ విషయంపై ఆశ్చర్యపోతున్నారా?
53:60  وَتَضْحَكُونَ وَلَا تَبْكُونَ
నవ్విపోతున్నారా? ఏడుపు రావటం లేదా?
53:61  وَأَنتُمْ سَامِدُونَ
పైపెచ్చు ఆటపాటల్లో నిర్లక్ష్యంగా ఉంటున్నారు.
53:62  فَاسْجُدُوا لِلَّهِ وَاعْبُدُوا ۩
అల్లాహ్ సన్నిధిలో సాష్టాంగపడండి. (ఆయన్నే) ఆరాధించండి.


ఈ తెలుగు ఖుర్ఆన్ శాంతి మార్గం పబ్లికేషన్ వారు ప్రచురించారు. వారి అనుమతితో ఈ వెబ్ పోర్టల్ పై వేయబడింది.