aip_quran
Translation

  العربية              తెలుగు  

1. సూరా అల్ ఫాతిహా
2. సూరా అల్ బఖర
3. సూరా ఆలి ఇమ్రాన్
4. సూరా అన్ నిసా
5. సూరా అల్ మాయిద
6. సూరా అల్ అన్ ఆమ్
7. సూరా అల్ ఆరాఫ్
8. సూరా అల్ అన్ ఫాల్
9. సూరా అత్ తౌబా
10. సూరా యూనుస్
11. సూరా హూద్
12. సూరా యూసుఫ్
13. సూరా ఆర్ రాద్
14. సూరా ఇబ్రహీం
15. సూరా అల్ హిజ్ర్
16. సూరా అన్ నహ్ల్
17. సూరా బనీ ఇస్రాయీల్
18. సూరా అల్ కహఫ్
19. సూరా మర్యం
20. సూరా తాహా
21. సూరా అల్ అంబియా
22. సూరా అల్ హజ్
23. సూరా అల్ మూ ‘మినూన్
24. సూరా అన్ నూర్
25. సూరా అల్ ఫుర్ఖాన్
26. సూరా ఆష్ షుఅరా
27. సూరా అన్ నమ్ల్
28. సూరా అల్ ఖసస్
29. సూరా అల్ అన్ కబూత్
30. సూరా ఆర్ రూమ్
31. సూరా లుక్మాన్
32. సూరా అస్ సజ్ ద హ్
33. సూరా అల్ ఆహ్ జాబ్
34. సూరా సబా
35. సూరా ఫాతిర్
36. సూరా యాసీన్
37. సూరా అస్ సాఫ్ఫాత్
38. సూరా సాద్
39. సూరా అజ్ జుమర్
40. సూరా అల్ మూమిన్
41. సూరా హామీమ్ అస్ సజ్ ద హ్
42. సూరా ఆష్ షూరా
43. సూరా అజ్ జుఖ్ రుఫ్
44. సూరా అద్ దుఖాన్
45. సూరా అల్ జాసియ హ్
46. సూరా అల్ ఆహ్ ఖాఫ్
47. సూరా ముహమ్మద్
48. సూరా అల్ ఫతహ్
49. సూరా అల్ హుజురాత్
50. సూరా ఖాఫ్
51. సూరా అజ్ జారియాత్
52. సూరా అత్ తూర్
53. సూరా అన్ నజ్మ్
54. సూరా అల్ ఖమర్
55. సూరా ఆర్ రహ్మాన్
56. సూరా వాఖియహ్
57. సూరా అల్ హదీద్
58. సూరా అల్ ముజాదల హ్
59. సూరా అల్ హష్ర్
60. సూరా అల్ ముమ్ తహిన హ్
61. సూరా అస్ సఫ్
62. సూరాఅల్ జుముఅ హ్
63. సూరా అల్ మునాఫిఖూన్
64. సూరా అత్ తగాబున్
65. సూరా అత్ తలాఖ్
66. సూరా అత్ తహ్రీం
67. సూరా అల్ ముల్క్
68. సూరా అల్ ఖలమ్
69. సూరా అల్ హఖ్ఖ
70. సూరా అల్ ముఆరిజ్
71. సూరా నూహ్
72. సూరా అల్ జిన్న్
73. సూరా అల్ ముజ్జమ్మిల్
74. సూరా అల్ ముద్దస్సిర్
75. సూరా అల్ ఖియామ హ్
76. సూరా అద్ దహ్ర్
77. సూరా అల్ ముర్సలాత్
78. సూరా అన్ నబా
79. సూరా అన్ నాజి ఆత్
80. సూరా అబస
81. సూరా అత్ తక్వీర్
82. సూరా అల్ ఇన్ ఫితార్
83. సూరాఅల్ ముతఫ్ఫిఫీన్
84. సూరా అల్ ఇన్ షి ఖాక్
85. సూరా అల్ బురూజ్
86. సూరా అత్ తారిఖ్
87. సూరా అల్ ఆలా
88. సూరా అల్ గాషియ హ్
89. సూరా అల్ ఫజ్ర్
90. సూరా అల్ బలద్
91. సూరా ఆష్ షమ్స్
92. సూరా అల్ లైల్
93. సూరా అజ్ జుహా
94. సూరా ఆలమ్ నష్ర్
95. సూరా అత్ తతీన్
96. సూరా అల్ అలఖ్
97. సూరా అల్ ఖద్ర్
98. సూరా అల్ బయ్యిన హ్
99. సూరా అజ్ జిలజాల్
100. సూరా అల్ ఆదియాత్
101. సూరా అల్ ఖారియ హ్
102. సూరా అత్ తకాసుర్
103. సూరా అల్ అస్ర్
104. సూరా అల్ హుమజా హ్
105. సూరా అల్ ఫీల్
106. సూరా ఖురైష్
107. సూరా అల్ మాఊ న్
108. సూరా అల్ కౌసర్
109. సూరా అల్ ఖాఫిరూన్
110. సూరా అన్ నస్ర్
111. సూరా అల్ లహబ్
112. సూరా అల్ ఇఖ్లాస్
113. సూరా అల్ ఫలఖ్
114. సూరా అన్ నాస్

52. సూరా అత్ తూర్

52:1  وَالطُّورِ
తూరు (పర్వతం) సాక్షిగా!
52:2  وَكِتَابٍ مَّسْطُورٍ
వ్రాయబడిన గ్రంథం సాక్షిగా!
52:3  فِي رَقٍّ مَّنشُورٍ
(అది) విప్పబడిన పత్రంలో ఉంది.
52:4  وَالْبَيْتِ الْمَعْمُورِ
నిత్యం దాసులతో నిండుగా ఉండే గృహం (బైతె మామూర్) సాక్షిగా!
52:5  وَالسَّقْفِ الْمَرْفُوعِ
ఎత్తైన కప్పు సాక్షిగా!
52:6  وَالْبَحْرِ الْمَسْجُورِ
రాజేయబడిన సముద్రం సాక్షిగా!
52:7  إِنَّ عَذَابَ رَبِّكَ لَوَاقِعٌ
నీ ప్రభువు శిక్ష సంభవించి తీరుతుంది.
52:8  مَّا لَهُ مِن دَافِعٍ
దాన్ని అడ్డుకోగలిగే వాడెవడూ లేడు.
52:9  يَوْمَ تَمُورُ السَّمَاءُ مَوْرًا
ఏ రోజున ఆకాశం గజగజా వణికి పోతూ ఉంటుందో,
52:10  وَتَسِيرُ الْجِبَالُ سَيْرًا
మరెప్పుడైతే పర్వతాలు నడుస్తూ తిరుగుతూ ఉంటాయో,
52:11  فَوَيْلٌ يَوْمَئِذٍ لِّلْمُكَذِّبِينَ
ఆ రోజు ధిక్కరించే వారికి మూడుతుంది.
52:12  الَّذِينَ هُمْ فِي خَوْضٍ يَلْعَبُونَ
వారు తమ అపసవ్యమైన విషయాలలో ఎగురుతూ, దుముకుతూ ఉండేవారు.
52:13  يَوْمَ يُدَعُّونَ إِلَىٰ نَارِ جَهَنَّمَ دَعًّا
ఆ రోజు వారు త్రోయబడుతూ, నెట్టబడుతూ నరకాగ్ని వైపు తీసుకురాబడతారు.
52:14  هَٰذِهِ النَّارُ الَّتِي كُنتُم بِهَا تُكَذِّبُونَ
“మీరు ధిక్కరిస్తూ వచ్చిన నరకాగ్ని ఇదే”.
52:15  أَفَسِحْرٌ هَٰذَا أَمْ أَنتُمْ لَا تُبْصِرُونَ
“(ఇప్పుడు చెప్పండి) ఇది మంత్రజాలమా? లేక మీకు కనబడటం లేదా?”
52:16  اصْلَوْهَا فَاصْبِرُوا أَوْ لَا تَصْبِرُوا سَوَاءٌ عَلَيْكُمْ ۖ إِنَّمَا تُجْزَوْنَ مَا كُنتُمْ تَعْمَلُونَ
“నరకానికి ఆహుతి అవండి. ఇప్పుడు మీరు ఓపికపట్టినా, ఓపిక పట్టకపోయినా మీకు ఒకటే. మీరు చేసుకున్న దాని ఫలితమే మీకివ్వబడింది” (అని అనబడుతుంది).
52:17  إِنَّ الْمُتَّقِينَ فِي جَنَّاتٍ وَنَعِيمٍ
నిశ్చయంగా భయభక్తులు గలవారు (స్వర్గ) వనాలలో, సుఖసౌఖ్యాలలో ఉంటారు.
52:18  فَاكِهِينَ بِمَا آتَاهُمْ رَبُّهُمْ وَوَقَاهُمْ رَبُّهُمْ عَذَابَ الْجَحِيمِ
వారు తమ ప్రభువు ప్రసాదించిన దానిపై సంతోషిస్తూ ఉంటారు. వారి ప్రభువు వారిని నరకయాతన నుండి రక్షించాడు కదా!
52:19  كُلُوا وَاشْرَبُوا هَنِيئًا بِمَا كُنتُمْ تَعْمَلُونَ
(వారితో ఇలా అనబడుతుంది:) “మీరు చేసుకున్న కర్మలకు ప్రతిఫలంగా హాయిగా తింటూ, త్రాగుతూ ఉండండి.”
52:20  مُتَّكِئِينَ عَلَىٰ سُرُرٍ مَّصْفُوفَةٍ ۖ وَزَوَّجْنَاهُم بِحُورٍ عِينٍ
వారక్కడ వరుసగా పరచబడిన ఆసనాలపై దిండ్లకు ఆనుకుని (ఠీవిగా) కూర్చుని ఉంటారు. అప్పటికి పెద్ద పెద్ద కన్నులు గల సుందరాంగులతో మేము వారి వివాహం జరిపించాము.
52:21  وَالَّذِينَ آمَنُوا وَاتَّبَعَتْهُمْ ذُرِّيَّتُهُم بِإِيمَانٍ أَلْحَقْنَا بِهِمْ ذُرِّيَّتَهُمْ وَمَا أَلَتْنَاهُم مِّنْ عَمَلِهِم مِّن شَيْءٍ ۚ كُلُّ امْرِئٍ بِمَا كَسَبَ رَهِينٌ
మరెవరైతే విశ్వసించారో, వారి సంతానం కూడా విశ్వసించి వారిని అనుసరించి ఉంటే, మేము వారి సంతానాన్ని కూడా వారితో కలుపుతాము. మరి వారి కర్మలను ఏ మాత్రం తగ్గించము. (నిజానికి) ప్రతి వ్యక్తీ తన సంపాదనకు తాకట్టుగా ఉన్నాడు.
52:22  وَأَمْدَدْنَاهُم بِفَاكِهَةٍ وَلَحْمٍ مِّمَّا يَشْتَهُونَ
మేము వారి కోరిక మేరకు ఫలాలను, మాంసాహారాలను పుష్కలంగా సరఫరా చేస్తూ ఉంటాము.
52:23  يَتَنَازَعُونَ فِيهَا كَأْسًا لَّا لَغْوٌ فِيهَا وَلَا تَأْثِيمٌ
వారు ఒకరి నుండి ఒకరు మధుపాత్రలను (ఆనందంతో) అందుకుంటూ ఉంటారు. ఆ మధువు వల్ల వ్యర్ధ ప్రేలాపనలుగానీ, పాపం (వైపు ప్రేరేపించే గుణం) గానీ ఉండవు.
52:24  وَيَطُوفُ عَلَيْهِمْ غِلْمَانٌ لَّهُمْ كَأَنَّهُمْ لُؤْلُؤٌ مَّكْنُونٌ
వారి చుట్టూ (సేవకోసం) అందమైన బాల సేవకులు తిరుగుతూ ఉంటారు. వారు మూసిఉంచబడిన ముత్యాల్లా (స్వచ్ఛంగా) ఉంటారు.
52:25  وَأَقْبَلَ بَعْضُهُمْ عَلَىٰ بَعْضٍ يَتَسَاءَلُونَ
వారు ఒండొకరి వైపు తిరిగి ప్రశ్నలు వేసుకుంటూ ఉంటారు.
52:26  قَالُوا إِنَّا كُنَّا قَبْلُ فِي أَهْلِنَا مُشْفِقِينَ
వారిలా అంటారు : “ఇదివరకు మేము మా వాళ్ళ మధ్య భయపడుతూ గడిపేవాళ్ళం.
52:27  فَمَنَّ اللَّهُ عَلَيْنَا وَوَقَانَا عَذَابَ السَّمُومِ
“ఇప్పుడు అల్లాహ్ మాకెంతో మేలు చేశాడు. తీవ్రమైన వడగాల్పుల శిక్ష నుండి మమ్మల్ని రక్షించాడు.”
52:28  إِنَّا كُنَّا مِن قَبْلُ نَدْعُوهُ ۖ إِنَّهُ هُوَ الْبَرُّ الرَّحِيمُ
“మేము ఇదివరకే ఆయన్ని ఆరాధిస్తూ ఉండేవారం. నిశ్చయంగా ఆయన సద్వ్యవహారం చేసేవాడు, దయాకరుడు.”
52:29  فَذَكِّرْ فَمَا أَنتَ بِنِعْمَتِ رَبِّكَ بِكَاهِنٍ وَلَا مَجْنُونٍ
కనుక (ఓ ప్రవక్తా!) నువ్వు వారికి బోధపరుస్తూ ఉండు. ఎందుకంటే నీ ప్రభువు అనుగ్రహం వల్ల నీవు (విషయాన్ని జిన్నాతుల నుండి గ్రహించే) జ్యోతిష్యుడవూ కావు, పిచ్చివాడవూ కావు.
52:30  أَمْ يَقُولُونَ شَاعِرٌ نَّتَرَبَّصُ بِهِ رَيْبَ الْمَنُونِ
“ఇతడొక కవిపుంగవుడు, మేమితనిపై కాలచక్రపు విపత్తులు వచ్చిపడతాయని ఎదురు చూస్తున్నాము” అని వారంటున్నారా?
52:31  قُلْ تَرَبَّصُوا فَإِنِّي مَعَكُم مِّنَ الْمُتَرَبِّصِينَ
(ఓ ప్రవక్తా!) వారికి చెప్పు : “సరే, మీరు ఎదురుచూస్తూ ఉండండి. మీతో పాటు నేను కూడా ఎదురుచూస్తాను.”
52:32  أَمْ تَأْمُرُهُمْ أَحْلَامُهُم بِهَٰذَا ۚ أَمْ هُمْ قَوْمٌ طَاغُونَ
ఏమిటి, వారి బుద్ధులు వారికి ఆజ్ఞాపించేది ఇదేనా?! లేక వారు పొగరుబోతు జనులుగా తయారయ్యారా?
52:33  أَمْ يَقُولُونَ تَقَوَّلَهُ ۚ بَل لَّا يُؤْمِنُونَ
“ఇతను దీనిని (ఈ ఖుర్ఆన్ ను) స్వయంగా కల్పించుకున్నాడ”ని వారంటున్నారా? అసలు విషయం ఏమిటంటే వీళ్ళు విశ్వసించటం లేదు.
52:34  فَلْيَأْتُوا بِحَدِيثٍ مِّثْلِهِ إِن كَانُوا صَادِقِينَ
సరే, ఒకవేళ వారు (ఈ ఆరోపణలో) సత్యవంతులే అయితే దీన్ని పోలిన ఒక్క వాక్కునయినాసరే చేసి తీసుకు రావాలి.
52:35  أَمْ خُلِقُوا مِنْ غَيْرِ شَيْءٍ أَمْ هُمُ الْخَالِقُونَ
ఏమిటి, వీరు (పుట్టించేవాడు) ఎవరూ లేకుండానే వారంతట వారే పుట్టుకు వచ్చారా? లేక వారే స్వయంగా సృష్టికర్తలా?
52:36  أَمْ خَلَقُوا السَّمَاوَاتِ وَالْأَرْضَ ۚ بَل لَّا يُوقِنُونَ
ఏమిటి, భూమ్యాకాశాలను వాళ్ళే సృష్టించారా? అసలు వాళ్ళు నమ్మేరకం కాదు.
52:37  أَمْ عِندَهُمْ خَزَائِنُ رَبِّكَ أَمْ هُمُ الْمُصَيْطِرُونَ
పోనీ, వాళ్ళ దగ్గర నీ ప్రభువు ఖజానాలకు గాని ఉన్నాయా? వాళ్ళుగాని ఆ ఖజానాలను కావలివాళ్ళుగా ఉన్నారా?
52:38  أَمْ لَهُمْ سُلَّمٌ يَسْتَمِعُونَ فِيهِ ۖ فَلْيَأْتِ مُسْتَمِعُهُم بِسُلْطَانٍ مُّبِينٍ
పోనీ, వారి దగ్గర నిచ్చెన ఏదైనా ఉందా? దానిపైకెక్కి వారు (ఊర్థ్వ లోకాల రహస్యాలు) వినివస్తున్నారా? ఒకవేళ అలాంటిదేదైనా ఉంటే ఆ వినివచ్చేవాడు ఆ మేరకు ఏదైనా స్పష్టమైన ప్రమాణాన్ని సమర్పించాలి.
52:39  أَمْ لَهُ الْبَنَاتُ وَلَكُمُ الْبَنُونَ
ఏమిటి, అల్లాహ్ కైతే అందరూ ఆడపిల్లలూను, మీకేమో మగపిల్లలా?
52:40  أَمْ تَسْأَلُهُمْ أَجْرًا فَهُم مِّن مَّغْرَمٍ مُّثْقَلُونَ
ఏమిటి, నువ్వు ఏదన్నా ప్రతిఫలం అడుగుతున్నావా వారిని, దాని భారంతో వారు అణగారిపోతున్నారనటానికి?
52:41  أَمْ عِندَهُمُ الْغَيْبُ فَهُمْ يَكْتُبُونَ
ఏమిటి, వారి దగ్గర అగోచర జ్ఞానంగాని ఉందా? దాన్ని వారు లిఖిస్తూ ఉన్నారా?
52:42  أَمْ يُرِيدُونَ كَيْدًا ۖ فَالَّذِينَ كَفَرُوا هُمُ الْمَكِيدُونَ
ఏమిటి, వీళ్ళు ఏదైనా మాయోపాయం చేస్తున్నారా? అలాగైతే అవిశ్వాసులే ఆ మాయోపాయంలో పడతారు.
52:43  أَمْ لَهُمْ إِلَٰهٌ غَيْرُ اللَّهِ ۚ سُبْحَانَ اللَّهِ عَمَّا يُشْرِكُونَ
ఏమిటి, అల్లాహ్ తప్ప వారికి వేరే ఆరాధ్యదైవం ఉన్నాడా? (ముమ్మాటికీ లేడు) వారు కల్పించే భాగస్వామ్యాలకు అల్లాహ్ అతీతుడు, పరిశుద్ధుడు.
52:44  وَإِن يَرَوْا كِسْفًا مِّنَ السَّمَاءِ سَاقِطًا يَقُولُوا سَحَابٌ مَّرْكُومٌ
ఒకవేళ వారు ఆకాశం నుండి ఏదైనా రాలిపడే తునకను చూసినా “అది దట్టమైన మేఘం మాత్రమే” అంటారు.
52:45  فَذَرْهُمْ حَتَّىٰ يُلَاقُوا يَوْمَهُمُ الَّذِي فِيهِ يُصْعَقُونَ
కనుక (ఓ ముహమ్మద్!) వారు స్పృహ తప్పి పడిపోయే రోజున ఎదుర్కొనే వరకూ వారిని వారి మానాన వదలిపెట్టు.
52:46  يَوْمَ لَا يُغْنِي عَنْهُمْ كَيْدُهُمْ شَيْئًا وَلَا هُمْ يُنصَرُونَ
ఆ రోజు వారి మాయోపాయమేదీ వారికి ఉపయోగపడదు. వారికెలాంటి సహాయం కూడా చేయబడదు.
52:47  وَإِنَّ لِلَّذِينَ ظَلَمُوا عَذَابًا دُونَ ذَٰلِكَ وَلَٰكِنَّ أَكْثَرَهُمْ لَا يَعْلَمُونَ
నిశ్చయంగా దుర్మార్గులకు అది గాకుండా మరిన్ని శిక్షలు కూడా ఉన్నాయి. కాని వారిలో చాలా మందికి తెలియదు.
52:48  وَاصْبِرْ لِحُكْمِ رَبِّكَ فَإِنَّكَ بِأَعْيُنِنَا ۖ وَسَبِّحْ بِحَمْدِ رَبِّكَ حِينَ تَقُومُ
మరి నీవు నీ ప్రభువు ఆజ్ఞకై ఓపికతో నిరీక్షించు. నిశ్చయంగా నువ్వు మా కళ్ళ ముందరే ఉన్నావు. నువ్వు నిలబడినప్పుడల్లా నీ ప్రభువు పవిత్రతను కొనియాడు, ఆయన్ని స్తుతించు.
52:49  وَمِنَ اللَّيْلِ فَسَبِّحْهُ وَإِدْبَارَ النُّجُومِ
రాత్రిపూట కూడా ఆయన పవిత్రతను కొనియాడు – మరి నక్షత్రాలు వెను తిరిగే వేళ కూడా.


ఈ తెలుగు ఖుర్ఆన్ శాంతి మార్గం పబ్లికేషన్ వారు ప్రచురించారు. వారి అనుమతితో ఈ వెబ్ పోర్టల్ పై వేయబడింది.