aip_quran
Translation

  العربية              తెలుగు  

1. సూరా అల్ ఫాతిహా
2. సూరా అల్ బఖర
3. సూరా ఆలి ఇమ్రాన్
4. సూరా అన్ నిసా
5. సూరా అల్ మాయిద
6. సూరా అల్ అన్ ఆమ్
7. సూరా అల్ ఆరాఫ్
8. సూరా అల్ అన్ ఫాల్
9. సూరా అత్ తౌబా
10. సూరా యూనుస్
11. సూరా హూద్
12. సూరా యూసుఫ్
13. సూరా ఆర్ రాద్
14. సూరా ఇబ్రహీం
15. సూరా అల్ హిజ్ర్
16. సూరా అన్ నహ్ల్
17. సూరా బనీ ఇస్రాయీల్
18. సూరా అల్ కహఫ్
19. సూరా మర్యం
20. సూరా తాహా
21. సూరా అల్ అంబియా
22. సూరా అల్ హజ్
23. సూరా అల్ మూ ‘మినూన్
24. సూరా అన్ నూర్
25. సూరా అల్ ఫుర్ఖాన్
26. సూరా ఆష్ షుఅరా
27. సూరా అన్ నమ్ల్
28. సూరా అల్ ఖసస్
29. సూరా అల్ అన్ కబూత్
30. సూరా ఆర్ రూమ్
31. సూరా లుక్మాన్
32. సూరా అస్ సజ్ ద హ్
33. సూరా అల్ ఆహ్ జాబ్
34. సూరా సబా
35. సూరా ఫాతిర్
36. సూరా యాసీన్
37. సూరా అస్ సాఫ్ఫాత్
38. సూరా సాద్
39. సూరా అజ్ జుమర్
40. సూరా అల్ మూమిన్
41. సూరా హామీమ్ అస్ సజ్ ద హ్
42. సూరా ఆష్ షూరా
43. సూరా అజ్ జుఖ్ రుఫ్
44. సూరా అద్ దుఖాన్
45. సూరా అల్ జాసియ హ్
46. సూరా అల్ ఆహ్ ఖాఫ్
47. సూరా ముహమ్మద్
48. సూరా అల్ ఫతహ్
49. సూరా అల్ హుజురాత్
50. సూరా ఖాఫ్
51. సూరా అజ్ జారియాత్
52. సూరా అత్ తూర్
53. సూరా అన్ నజ్మ్
54. సూరా అల్ ఖమర్
55. సూరా ఆర్ రహ్మాన్
56. సూరా వాఖియహ్
57. సూరా అల్ హదీద్
58. సూరా అల్ ముజాదల హ్
59. సూరా అల్ హష్ర్
60. సూరా అల్ ముమ్ తహిన హ్
61. సూరా అస్ సఫ్
62. సూరాఅల్ జుముఅ హ్
63. సూరా అల్ మునాఫిఖూన్
64. సూరా అత్ తగాబున్
65. సూరా అత్ తలాఖ్
66. సూరా అత్ తహ్రీం
67. సూరా అల్ ముల్క్
68. సూరా అల్ ఖలమ్
69. సూరా అల్ హఖ్ఖ
70. సూరా అల్ ముఆరిజ్
71. సూరా నూహ్
72. సూరా అల్ జిన్న్
73. సూరా అల్ ముజ్జమ్మిల్
74. సూరా అల్ ముద్దస్సిర్
75. సూరా అల్ ఖియామ హ్
76. సూరా అద్ దహ్ర్
77. సూరా అల్ ముర్సలాత్
78. సూరా అన్ నబా
79. సూరా అన్ నాజి ఆత్
80. సూరా అబస
81. సూరా అత్ తక్వీర్
82. సూరా అల్ ఇన్ ఫితార్
83. సూరాఅల్ ముతఫ్ఫిఫీన్
84. సూరా అల్ ఇన్ షి ఖాక్
85. సూరా అల్ బురూజ్
86. సూరా అత్ తారిఖ్
87. సూరా అల్ ఆలా
88. సూరా అల్ గాషియ హ్
89. సూరా అల్ ఫజ్ర్
90. సూరా అల్ బలద్
91. సూరా ఆష్ షమ్స్
92. సూరా అల్ లైల్
93. సూరా అజ్ జుహా
94. సూరా ఆలమ్ నష్ర్
95. సూరా అత్ తతీన్
96. సూరా అల్ అలఖ్
97. సూరా అల్ ఖద్ర్
98. సూరా అల్ బయ్యిన హ్
99. సూరా అజ్ జిలజాల్
100. సూరా అల్ ఆదియాత్
101. సూరా అల్ ఖారియ హ్
102. సూరా అత్ తకాసుర్
103. సూరా అల్ అస్ర్
104. సూరా అల్ హుమజా హ్
105. సూరా అల్ ఫీల్
106. సూరా ఖురైష్
107. సూరా అల్ మాఊ న్
108. సూరా అల్ కౌసర్
109. సూరా అల్ ఖాఫిరూన్
110. సూరా అన్ నస్ర్
111. సూరా అల్ లహబ్
112. సూరా అల్ ఇఖ్లాస్
113. సూరా అల్ ఫలఖ్
114. సూరా అన్ నాస్

51. సూరా అజ్ జారియాత్

51:1  وَالذَّارِيَاتِ ذَرْوًا
దుమ్మును రేపే గాలుల సాక్షిగా!
51:2  فَالْحَامِلَاتِ وِقْرًا
మరి బరువును లేపే మేఘాలు (సాక్షి!)
51:3  فَالْجَارِيَاتِ يُسْرًا
మరి అలవోకగా, సుతిమెత్తగా సాగిపోయే ఓడలు (సాక్షి!)
51:4  فَالْمُقَسِّمَاتِ أَمْرًا
మరి పనులను పంపకం చేసేవారు (సాక్షి!)
51:5  إِنَّمَا تُوعَدُونَ لَصَادِقٌ
మీకు వేటి గురించి వాగ్దానం చేయబడుతున్నదో అవి నిజంగా సత్యమైనవి.
51:6  وَإِنَّ الدِّينَ لَوَاقِعٌ
నిశ్చయంగా న్యాయం (తీర్పు) జరగనున్నది.
51:7  وَالسَّمَاءِ ذَاتِ الْحُبُكِ
మార్గాలతో నిండిన ఆకాశం సాక్షిగా!
51:8  إِنَّكُمْ لَفِي قَوْلٍ مُّخْتَلِفٍ
నిశ్చయంగా మీరు అభిప్రాయభేదంతో కూడిన మాటలో పడి ఉన్నారు.
51:9  يُؤْفَكُ عَنْهُ مَنْ أُفِكَ
మరలింపబడినవాడే దాన్నుండి మరలిపోతాడు.
51:10  قُتِلَ الْخَرَّاصُونَ
నిరాధారమైన మాటలు మాట్లాడేవారు నాశనమవుదురు (గాక!)
51:11  الَّذِينَ هُمْ فِي غَمْرَةٍ سَاهُونَ
వారు పరధ్యానంలో పడి, మైమరచి పోయారు.
51:12  يَسْأَلُونَ أَيَّانَ يَوْمُ الدِّينِ
ఇంతకీ తీర్పుదినం ఎప్పుడట?! అని వారు ప్రశ్నిస్తున్నారు.
51:13  يَوْمَ هُمْ عَلَى النَّارِ يُفْتَنُونَ
అది వారు అగ్నిలో మాడ్చబడే దినమై ఉంటుంది.
51:14  ذُوقُوا فِتْنَتَكُمْ هَٰذَا الَّذِي كُنتُم بِهِ تَسْتَعْجِلُونَ
మీ శిక్ష యెక్క రుచి చూడండి. ఏ శిక్ష గురించి మీరు హడావిడి చేశారో ఆ శిక్ష ఇదే! (అని వారితో అనబడుతుంది).
51:15  إِنَّ الْمُتَّقِينَ فِي جَنَّاتٍ وَعُيُونٍ
నిశ్చయంగా భక్తిపరులు మాత్రం ఉద్యానవనాల, ఊటల మధ్య ఉంటారు.
51:16  آخِذِينَ مَا آتَاهُمْ رَبُّهُمْ ۚ إِنَّهُمْ كَانُوا قَبْلَ ذَٰلِكَ مُحْسِنِينَ
తమ ప్రభువు తమకు ప్రసాదించిన దాన్ని వారు గ్రహిస్తూ ఉంటారు. వారు అంతకుముందు సదాచార సంపన్నులుగా ఉండేవారు.
51:17  كَانُوا قَلِيلًا مِّنَ اللَّيْلِ مَا يَهْجَعُونَ
వారు రాత్రి పూట చాలా తక్కువగా నిద్రించేవారు.
51:18  وَبِالْأَسْحَارِ هُمْ يَسْتَغْفِرُونَ
రాత్రి చివరి గడియలలో క్షమాపణకై (అల్లాహ్ ను) వేడుకునేవారు.
51:19  وَفِي أَمْوَالِهِمْ حَقٌّ لِّلسَّائِلِ وَالْمَحْرُومِ
వారి ధనంలో యాచించేవారికి, యాచించని పేదవారికి కూడా హక్కుండేది.
51:20  وَفِي الْأَرْضِ آيَاتٌ لِّلْمُوقِنِينَ
నమ్మేవారికి భూమిలో పలు నిదర్శనాలున్నాయి.
51:21  وَفِي أَنفُسِكُمْ ۚ أَفَلَا تُبْصِرُونَ
స్వయంగా మీ ఆత్మల్లో (అస్తిత్వంలో) కూడా ఉన్నాయి. మరి మీరు పరిశీలనగా చూడటం లేదా?
51:22  وَفِي السَّمَاءِ رِزْقُكُمْ وَمَا تُوعَدُونَ
ఇంకా మీ ఉపాధి, దాంతోపాటు మీకు వాగ్దానం చేయబడేదంతా ఆకాశంలోనే ఉంది.
51:23  فَوَرَبِّ السَّمَاءِ وَالْأَرْضِ إِنَّهُ لَحَقٌّ مِّثْلَ مَا أَنَّكُمْ تَنطِقُونَ
కనుక భూమ్యాకాశాల ప్రభువు సాక్షిగా! ముమ్మాటికీ ఇది సత్యం. మీరు పరస్పరం మాట్లాడుకుంటున్నట్లే (సత్యమిది).
51:24  هَلْ أَتَاكَ حَدِيثُ ضَيْفِ إِبْرَاهِيمَ الْمُكْرَمِينَ
(ఓ ప్రవక్తా!) ఏమిటి, ఇబ్రాహీము యెక్క గౌరవనీయులైన అతిథుల గాధ నీకు చేరిందా?!
51:25  إِذْ دَخَلُوا عَلَيْهِ فَقَالُوا سَلَامًا ۖ قَالَ سَلَامٌ قَوْمٌ مُّنكَرُونَ
వారతని దగ్గరకు వచ్చినప్పుడు అతనికి సలాం చెప్పారు. అతను కూడా సలాంకు జవాబు చెప్పి, ‘ వీళ్ళు అపరిచిత వ్యక్తుల్లా ఉన్నారే!’ (అనుకున్నాడు).
51:26  فَرَاغَ إِلَىٰ أَهْلِهِ فَجَاءَ بِعِجْلٍ سَمِينٍ
తరువాత (మారు మాట్లాడకుండా గబగబా) తన ఇంటివారి వద్దకు వెళ్లి, ఒక బలిసిన అవుదూడను (దాని మాంసము వేయించి) తెచ్చాడు.
51:27  فَقَرَّبَهُ إِلَيْهِمْ قَالَ أَلَا تَأْكُلُونَ
దాన్ని వారి ముందు సమర్పించాడు. “(అయ్యో!) మీరు తినరేమిటి?” అన్నాడు.
51:28  فَأَوْجَسَ مِنْهُمْ خِيفَةً ۖ قَالُوا لَا تَخَفْ ۖ وَبَشَّرُوهُ بِغُلَامٍ عَلِيمٍ
(అప్పటికీ వారు తినకపోయేసరికి) వారి గురించి లోలోపలే భయపడిపోయాడు. “భయపడకండి” అని వారు అభయమిచ్చారు. ఇంకా వారతనికి జ్ఞానసంపన్నుడైన అబ్బాయి పుడతాడని శుభవార్త వినిపించారు.
51:29  فَأَقْبَلَتِ امْرَأَتُهُ فِي صَرَّةٍ فَصَكَّتْ وَجْهَهَا وَقَالَتْ عَجُوزٌ عَقِيمٌ
అంతలోనే అతని భార్య లబోదిబోమంటూ ముందుకు వచ్చింది. నెత్తి నోరు బాదుకుంటూ, “హవ్వ! నేనా ముసలిదాన్ని. దానికి తోడు గొడ్రాలిని కూడా” (నాకు సంతానమేమిటి?) అని అన్నది.
51:30  قَالُوا كَذَٰلِكِ قَالَ رَبُّكِ ۖ إِنَّهُ هُوَ الْحَكِيمُ الْعَلِيمُ
“అవును, ఇలాగే జరుగుతుందని నీ ప్రభువు సెలవిచ్చాడు. నిశ్చయంగా ఆయన వివేకవంతుడు, సర్వం తెలిసినవాడు” అని వారన్నారు.
51:31  قَالَ فَمَا خَطْبُكُمْ أَيُّهَا الْمُرْسَلُونَ
“ఓ దైవదూతలారా! ఇంతకీ మీ రాకలోని ముఖ్య ఉద్దేశం ఏమిటి?” అని (ఇబ్రాహీము) అడిగాడు.
51:32  قَالُوا إِنَّا أُرْسِلْنَا إِلَىٰ قَوْمٍ مُّجْرِمِينَ
“మేము అపరాధ జనుల వైపుకు పంపబడ్డాము.
51:33  لِنُرْسِلَ عَلَيْهِمْ حِجَارَةً مِّن طِينٍ
“వారిపై మట్టి రాళ్ళను కురిపించటానికి (వచ్చాము).
51:34  مُّسَوَّمَةً عِندَ رَبِّكَ لِلْمُسْرِفِينَ
“బరితెగించిపోయిన వారి కోసం నీ ప్రభువు వద్ద గుర్తులు వేయబడిన రాళ్ళవి” అని వారు చెప్పారు.
51:35  فَأَخْرَجْنَا مَن كَانَ فِيهَا مِنَ الْمُؤْمِنِينَ
మరి అక్కడున్న విశ్వాసులందరినీ మేము బయటికి తీసుకువచ్చాము.
51:36  فَمَا وَجَدْنَا فِيهَا غَيْرَ بَيْتٍ مِّنَ الْمُسْلِمِينَ
అయితే మేమక్కడ ముస్లింలకు చెందిన ఒక్కగానొక్క ఇల్లును మాత్రమే కనుగొన్నాము.
51:37  وَتَرَكْنَا فِيهَا آيَةً لِّلَّذِينَ يَخَافُونَ الْعَذَابَ الْأَلِيمَ
మరి మేమక్కడ, వ్యధాభరితమైన శిక్షకు భయపడే వారి కోసం ఒక (స్పష్టమైన) సూచనను వదలి పెట్టాము.
51:38  وَفِي مُوسَىٰ إِذْ أَرْسَلْنَاهُ إِلَىٰ فِرْعَوْنَ بِسُلْطَانٍ مُّبِينٍ
మరి మూసా (వృత్తాంతం)లో కూడా (మా తరఫున సూచన ఉంది). మేమతనికి స్పష్టమైన ప్రమాణాన్ని ఇచ్చి ఫిరౌను వద్దకు పంపించాము.
51:39  فَتَوَلَّىٰ بِرُكْنِهِ وَقَالَ سَاحِرٌ أَوْ مَجْنُونٌ
కాని అతను (ఫిరౌను) తన బలగాలను చూసుకుని విముఖతకు పాల్పడ్డాడు. “(వీడా! వీడొక) మాంత్రికుడో లేదా పిచ్చివాడో అయిఉంటాడ”ని ప్రేలాడు.
51:40  فَأَخَذْنَاهُ وَجُنُودَهُ فَنَبَذْنَاهُمْ فِي الْيَمِّ وَهُوَ مُلِيمٌ
ఎట్టకేలకు మేము అతణ్ణి, అతని సైన్యాలను పట్టుకుని సముద్రంలో పడవేశాము. వాడసలు నిందార్హుడే.
51:41  وَفِي عَادٍ إِذْ أَرْسَلْنَا عَلَيْهِمُ الرِّيحَ الْعَقِيمَ
అలాగే ఆదు వారిలో కూడా (మా తరఫున సూచన కలదు). మేము వారిపై అశుభమైన గాలులను పంపినప్పుడు,
51:42  مَا تَذَرُ مِن شَيْءٍ أَتَتْ عَلَيْهِ إِلَّا جَعَلَتْهُ كَالرَّمِيمِ
అవి ఏ వస్తువుపై వీచినా (ఎడాపెడా ఊపేసి) దాన్ని తుత్తునియలు చేసిగాని వదిలేవి కావు.
51:43  وَفِي ثَمُودَ إِذْ قِيلَ لَهُمْ تَمَتَّعُوا حَتَّىٰ حِينٍ
ఇంకా సమూదు (గాధ)లో కూడా (గుణపాఠం ఉంది). “కొద్ది రోజుల పాటు లబ్ది పొందండి” అని వారితో అనబడినపుడు...
51:44  فَعَتَوْا عَنْ أَمْرِ رَبِّهِمْ فَأَخَذَتْهُمُ الصَّاعِقَةُ وَهُمْ يَنظُرُونَ
(వారు దారికి రాకుండా) తమ ప్రభువు ఆజ్ఞ పట్ల పెడసరి వైఖరిని ప్రదర్శించారు. తత్కారణంగా వారు చూస్తూ ఉండగానే ఒక భయంకరమైన కేక (ప్రేలుడు) అమాంతం వారిని కబళించింది.
51:45  فَمَا اسْتَطَاعُوا مِن قِيَامٍ وَمَا كَانُوا مُنتَصِرِينَ
అంతే! (ఆ దెబ్బకు) వారు నిలబడనూ లేకపోయారు. తమకు సహాయం కూడా చేసుకోలేకపోయారు.
51:46  وَقَوْمَ نُوحٍ مِّن قَبْلُ ۖ إِنَّهُمْ كَانُوا قَوْمًا فَاسِقِينَ
మరి నూహ్ జాతి వారికి కూడా అంతకు మునుపు (అదే గతి పట్టింది). వారు కూడా పరమ అవిధేయులుగా ఉండేవారు.
51:47  وَالسَّمَاءَ بَنَيْنَاهَا بِأَيْدٍ وَإِنَّا لَمُوسِعُونَ
ఇంకా ఆకాశాన్ని మేము (మా) హస్తాలతో నిర్మించాము. నిశ్చయంగా మేము విశాలంగా చేసేవారము.
51:48  وَالْأَرْضَ فَرَشْنَاهَا فَنِعْمَ الْمَاهِدُونَ
భూమిని మేము పాన్పుగా చేశాము. ఎంతైనా మేము చాలా చక్కగా పరచేవారము.
51:49  وَمِن كُلِّ شَيْءٍ خَلَقْنَا زَوْجَيْنِ لَعَلَّكُمْ تَذَكَّرُونَ
మరి మీరు హితబోధను గ్రహించేటందుకుగాను మేము ప్రతి వస్తువునూ జతలు జతలుగా సృష్టించాము.
51:50  فَفِرُّوا إِلَى اللَّهِ ۖ إِنِّي لَكُم مِّنْهُ نَذِيرٌ مُّبِينٌ
కనుక మీరు అల్లాహ్ వైపు పరుగెత్తండి. నేను మాత్రం ఆయన తరఫున (వచ్చి) మిమ్మల్ని స్పష్టంగా హెచ్చరించే వాణ్ణి మాత్రమే.
51:51  وَلَا تَجْعَلُوا مَعَ اللَّهِ إِلَٰهًا آخَرَ ۖ إِنِّي لَكُم مِّنْهُ نَذِيرٌ مُّبِينٌ
అల్లాహ్ తో పాటు మరో ఆరాధ్య దైవాన్ని చేర్చకండి. నిశ్చయంగా నేను ఆయన తరఫున మిమ్మల్ని స్పష్టంగా హెచ్చరించేవాడిని.
51:52  كَذَٰلِكَ مَا أَتَى الَّذِينَ مِن قَبْلِهِم مِّن رَّسُولٍ إِلَّا قَالُوا سَاحِرٌ أَوْ مَجْنُونٌ
ఇలాగే వీరికి పూర్వం గడచిన వారు కూడా తమ వద్దకు వచ్చిన ప్రవక్తను గురించి, “ఇతడు మాంత్రికుడైనా అయిఉంటాడు లేదా పిచ్చివాడైనా అయిఉంటాడు” అనేవారు.
51:53  أَتَوَاصَوْا بِهِ ۚ بَلْ هُمْ قَوْمٌ طَاغُونَ
ఏమిటీ, ఈ విషయాన్ని వారు ఒండొకరికి తాకీదు చేసుకుంటూ వస్తున్నారా? లేదు, అసలు వారంతా తలబిరుసులే.
51:54  فَتَوَلَّ عَنْهُمْ فَمَا أَنتَ بِمَلُومٍ
కాబట్టి నువ్వు వాళ్ళ నుండి ముఖం త్రిప్పుకో. నీపై ఎలాంటి నింద ఉండదు.
51:55  وَذَكِّرْ فَإِنَّ الذِّكْرَىٰ تَنفَعُ الْمُؤْمِنِينَ
అయితే బోధనా కార్యక్రమాన్ని మాత్రం కొనసాగించు. ఎందుకంటే బోధన విశ్వాసులకు లాభదాయకం అవుతుంది.
51:56  وَمَا خَلَقْتُ الْجِنَّ وَالْإِنسَ إِلَّا لِيَعْبُدُونِ
నేను జిన్నాతులను, మానవులను సృష్టించినది వారు నన్ను ఆరాధించటానికి మాత్రమే.
51:57  مَا أُرِيدُ مِنْهُم مِّن رِّزْقٍ وَمَا أُرِيدُ أَن يُطْعِمُونِ
నేను వారి నుండి జీవనోపాధిని కోరటం లేదు. వారు నాకు అన్నం పెట్టాలని కూడా నేను కోరటం లేదు.
51:58  إِنَّ اللَّهَ هُوَ الرَّزَّاقُ ذُو الْقُوَّةِ الْمَتِينُ
అల్లాహ్ యే స్వయంగా అందరికీ ఉపాధిని సమకూర్చేవాడు. ఆయన మహాశక్తిశాలి, మహాబలుడు.
51:59  فَإِنَّ لِلَّذِينَ ظَلَمُوا ذَنُوبًا مِّثْلَ ذَنُوبِ أَصْحَابِهِمْ فَلَا يَسْتَعْجِلُونِ
కాబట్టి ఈ దుర్మార్గుల్లాంటివారికి ఏ వంతు లభించిందో అలాంటి వంతే వీరికి కూడా లభిస్తుంది. కాబట్టి వారు దాని కోసం నన్ను తొందరపెట్టరాదు.
51:60  فَوَيْلٌ لِّلَّذِينَ كَفَرُوا مِن يَوْمِهِمُ الَّذِي يُوعَدُونَ
ఏ దినం గురించి వాగ్దానం చేయబడుతున్నదో ఆ దినాన అవిశ్వాసులకు మూడటం తథ్యం.


ఈ తెలుగు ఖుర్ఆన్ శాంతి మార్గం పబ్లికేషన్ వారు ప్రచురించారు. వారి అనుమతితో ఈ వెబ్ పోర్టల్ పై వేయబడింది.