Translation
| 4. సూరా అన్ నిసా 4:1 يَا أَيُّهَا النَّاسُ اتَّقُوا رَبَّكُمُ الَّذِي خَلَقَكُم مِّن نَّفْسٍ وَاحِدَةٍ وَخَلَقَ مِنْهَا زَوْجَهَا وَبَثَّ مِنْهُمَا رِجَالًا كَثِيرًا وَنِسَاءً ۚ وَاتَّقُوا اللَّهَ الَّذِي تَسَاءَلُونَ بِهِ وَالْأَرْحَامَ ۚ إِنَّ اللَّهَ كَانَ عَلَيْكُمْ رَقِيبًا మానవులారా! మిమ్మల్ని ఒకే ప్రాణి నుంచి పుట్టించి, దాన్నుంచే దాని జతను కూడా సృష్టించి, ఆ ఇద్దరి ద్వారా ఎంతో మంది పురుషులను, స్త్రీలను వ్యాపింపజేసిన మీ ప్రభువుకు భయపడండి. ఎవరిపేరుతో మీరు పరస్పరం మీకు కావలసిన వాటిని అడుగుతారో ఆ అల్లాహ్‌కు భయపడండి. బంధుత్వ సంబంధాల తెగత్రెంపులకు దూరంగా ఉండండి. నిశ్చయంగా అల్లాహ్ మీపై నిఘావేసి ఉన్నాడు. 4:2 وَآتُوا الْيَتَامَىٰ أَمْوَالَهُمْ ۖ وَلَا تَتَبَدَّلُوا الْخَبِيثَ بِالطَّيِّبِ ۖ وَلَا تَأْكُلُوا أَمْوَالَهُمْ إِلَىٰ أَمْوَالِكُمْ ۚ إِنَّهُ كَانَ حُوبًا كَبِيرًا తండ్రి లేని బిడ్డలకు వారి ఆస్తిని వారికివ్వండి. పరిశుద్ధమైన, ధర్మసమ్మతమైన వస్తువులకు బదులు అపవిత్రమైన, అధర్మమైన వస్తువులను తీసుకోకండి. మీ సొమ్ములతోపాటు వారి సొమ్మును కూడా కలగాపులగం చేసి స్వాహా చేయకండి. ముమ్మాటికీ ఇది మహా పాతకమే. 4:3 وَإِنْ خِفْتُمْ أَلَّا تُقْسِطُوا فِي الْيَتَامَىٰ فَانكِحُوا مَا طَابَ لَكُم مِّنَ النِّسَاءِ مَثْنَىٰ وَثُلَاثَ وَرُبَاعَ ۖ فَإِنْ خِفْتُمْ أَلَّا تَعْدِلُوا فَوَاحِدَةً أَوْ مَا مَلَكَتْ أَيْمَانُكُمْ ۚ ذَٰلِكَ أَدْنَىٰ أَلَّا تَعُولُوا (మీ సంరక్షణలో ఉన్న) తండ్రిలేని ఆడపిల్లలను వివాహమాడి న్యాయం చేయలేమన్న భయం మీకుంటే, మీకు నచ్చిన వేరితర స్త్రీలలో ఇద్దరినిగానీ, ముగ్గురినిగానీ, నలుగురినిగానీ వివాహ మాడండి. అయితే వారి మధ్య న్యాయబద్ధంగా వ్యవహరించలేమన్న భయం మీకున్నప్పుడు ఒక్కామెతోనే సరిపెట్టుకోండి. లేదా మీ యాజమాన్యంలోకి వచ్చిన బానిస స్త్రీలతో గడపండి. మీరు ఒక వైపుకు మొగ్గిపోకుండా (అంటే అన్యాయానికి పాల్పడకుండా) ఉండటానికి ఇది అత్యుత్తమ మార్గం. 4:4 وَآتُوا النِّسَاءَ صَدُقَاتِهِنَّ نِحْلَةً ۚ فَإِن طِبْنَ لَكُمْ عَن شَيْءٍ مِّنْهُ نَفْسًا فَكُلُوهُ هَنِيئًا مَّرِيئًا స్త్రీలకు వారి మహర్ సొమ్మును మనస్ఫూర్తిగా ఇవ్వండి. ఒకవేళ వారు గనక తమంతట తాముగా - ఇష్టపూర్వకంగా - మహర్లో కొంత మొత్తాన్ని వదలిపెట్టినట్లయితే సంతోషంగా (నిస్సంకోచంగా) దాన్ని అనుభవించండి. 4:5 وَلَا تُؤْتُوا السُّفَهَاءَ أَمْوَالَكُمُ الَّتِي جَعَلَ اللَّهُ لَكُمْ قِيَامًا وَارْزُقُوهُمْ فِيهَا وَاكْسُوهُمْ وَقُولُوا لَهُمْ قَوْلًا مَّعْرُوفًا అల్లాహ్ మీ జరుగుబాటుకు ఆధారంగా చేసిన మీ ధనాన్ని అవివేకుల పరం చేయకండి. కాకపోతే ఆ సంపదలో నుంచి వారికి అన్నవస్త్రాలు మొదలగునవి సమకూర్చండి. వారితో మంచితనంతో, మృదువుగా మాట్లాడండి. 4:6 وَابْتَلُوا الْيَتَامَىٰ حَتَّىٰ إِذَا بَلَغُوا النِّكَاحَ فَإِنْ آنَسْتُم مِّنْهُمْ رُشْدًا فَادْفَعُوا إِلَيْهِمْ أَمْوَالَهُمْ ۖ وَلَا تَأْكُلُوهَا إِسْرَافًا وَبِدَارًا أَن يَكْبَرُوا ۚ وَمَن كَانَ غَنِيًّا فَلْيَسْتَعْفِفْ ۖ وَمَن كَانَ فَقِيرًا فَلْيَأْكُلْ بِالْمَعْرُوفِ ۚ فَإِذَا دَفَعْتُمْ إِلَيْهِمْ أَمْوَالَهُمْ فَأَشْهِدُوا عَلَيْهِمْ ۚ وَكَفَىٰ بِاللَّهِ حَسِيبًا తండ్రిలేని బిడ్డలు పెళ్ళీడుకు వచ్చేవరకూ వారిని తీర్చిదిద్దుతూ, పరీక్షిస్తూ ఉండండి. ఒకవేళ వారిలో తెలివితేటలు, కార్యదక్షత కానవస్తే వారి ఆస్తిని వారికి అప్పగించండి. వారు పెద్దవారవుతున్నారన్న భయంతో వారి ఆస్తిపాస్తులను ఆదరా బాదరాగా దుబారా ఖర్చుచేయకండి. తండ్రిలేని బిడ్డల పోషకుడు ధనవంతుడైన పక్షంలో వారి సొమ్మును ముట్టుకోకూడదు. ఒకవేళ అతడు పేదవాడైతే ధర్మబద్ధంగా - అవసరమైనంత మేరకు - అనుభవించవచ్చు. మరి వారి ఆస్తిని వారికి అప్పగించేటప్పుడు దానికి సాక్షుల్ని పెట్టుకోండి. లెక్క తీసుకోవటానికి అల్లాహ్ చాలు. 4:7 لِّلرِّجَالِ نَصِيبٌ مِّمَّا تَرَكَ الْوَالِدَانِ وَالْأَقْرَبُونَ وَلِلنِّسَاءِ نَصِيبٌ مِّمَّا تَرَكَ الْوَالِدَانِ وَالْأَقْرَبُونَ مِمَّا قَلَّ مِنْهُ أَوْ كَثُرَ ۚ نَصِيبًا مَّفْرُوضًا తల్లిదండ్రులు, సమీప బంధువులు వదలివెళ్ళిన ఆస్తిలో పురుషులకు భాగం ఉంది. అలాగే తల్లిదండ్రులు, సమీప బంధువులు వదలివెళ్ళిన ఆస్తిలో స్త్రీలకు కూడా భాగం ఉంది. ఆ ఆస్తి తక్కువైనాసరే, ఎక్కువైనాసరే (అందులో) వాటా మాత్రం నిర్ధారితమై ఉంది. 4:8 وَإِذَا حَضَرَ الْقِسْمَةَ أُولُو الْقُرْبَىٰ وَالْيَتَامَىٰ وَالْمَسَاكِينُ فَارْزُقُوهُم مِّنْهُ وَقُولُوا لَهُمْ قَوْلًا مَّعْرُوفًا ఆస్తిని పంచుకునే సమయంలో బంధువులు, తండ్రిలేని బిడ్డలు, నిరుపేదలు వస్తే అందులో నుంచి వారికీ కొంత ఇవ్వండి. (ఆ సందర్భాన) వారితో మృదువుగా మాట్లాడండి. 4:9 وَلْيَخْشَ الَّذِينَ لَوْ تَرَكُوا مِنْ خَلْفِهِمْ ذُرِّيَّةً ضِعَافًا خَافُوا عَلَيْهِمْ فَلْيَتَّقُوا اللَّهَ وَلْيَقُولُوا قَوْلًا سَدِيدًا ఒకవేళ తాము తమ వెనుక చిన్న చిన్న పసికందులను విడిచిపోతే, వారికెక్కడ అన్యాయం జరుగుతుందోనని ఆందోళన చెందేవారు (ఈ సందర్భంగా) భయపడాలి. వారు అల్లాహ్‌కు భయపడుతూ, సముచితమైన రీతిలో మాట్లాడాలి. 4:10 إِنَّ الَّذِينَ يَأْكُلُونَ أَمْوَالَ الْيَتَامَىٰ ظُلْمًا إِنَّمَا يَأْكُلُونَ فِي بُطُونِهِمْ نَارًا ۖ وَسَيَصْلَوْنَ سَعِيرًا తండ్రిలేని బిడ్డల సొమ్మును అన్యాయంగా తినేవారు తమ పొట్టల్ని అగ్నితో నింపుకుంటున్నారు. త్వరలోనే వారు మండే అగ్నిలోకి ప్రవేశిస్తారు. 4:11 يُوصِيكُمُ اللَّهُ فِي أَوْلَادِكُمْ ۖ لِلذَّكَرِ مِثْلُ حَظِّ الْأُنثَيَيْنِ ۚ فَإِن كُنَّ نِسَاءً فَوْقَ اثْنَتَيْنِ فَلَهُنَّ ثُلُثَا مَا تَرَكَ ۖ وَإِن كَانَتْ وَاحِدَةً فَلَهَا النِّصْفُ ۚ وَلِأَبَوَيْهِ لِكُلِّ وَاحِدٍ مِّنْهُمَا السُّدُسُ مِمَّا تَرَكَ إِن كَانَ لَهُ وَلَدٌ ۚ فَإِن لَّمْ يَكُن لَّهُ وَلَدٌ وَوَرِثَهُ أَبَوَاهُ فَلِأُمِّهِ الثُّلُثُ ۚ فَإِن كَانَ لَهُ إِخْوَةٌ فَلِأُمِّهِ السُّدُسُ ۚ مِن بَعْدِ وَصِيَّةٍ يُوصِي بِهَا أَوْ دَيْنٍ ۗ آبَاؤُكُمْ وَأَبْنَاؤُكُمْ لَا تَدْرُونَ أَيُّهُمْ أَقْرَبُ لَكُمْ نَفْعًا ۚ فَرِيضَةً مِّنَ اللَّهِ ۗ إِنَّ اللَّهَ كَانَ عَلِيمًا حَكِيمًا అల్లాహ్ మీ సంతానం విషయంలో మీకు ఈ విధంగా ఆజ్ఞాపిస్తున్నాడు : ఒక అబ్బాయి వాటా ఇద్దరు అమ్మాయిల వాటాకు సమానం. ఒకవేళ (మృతునికి) ఇద్దరుకన్నా ఎక్కువ మంది కుమార్తెలు మాత్రమే ఉంటే వారికి వారసత్వ ఆస్తిలో మూడింట రెండొంతుల భాగం లభిస్తుంది. ఒకవేళ ఒకే కూతురుంటే ఆమెకు సగభాగం దక్కుతుంది. చనిపోయిన వ్యక్తికి గనక సంతానముంటే, అతని తల్లిదండ్రులలో ఒక్కొక్కరికి అతను వదలివెళ్ళిన ఆస్తిలో ఆరింట ఒక భాగం లభిస్తుంది. ఒకవేళ మృతుడు సంతానం లేనివాడై ఉండి, అతని తల్లిదండ్రులే అతని ఆస్తికి వారసులైనపుడు, అతని తల్లికి మూడింట ఒక భాగం ఇవ్వాలి. ఒకవేళ మృతునికి గనక అనేక మంది అన్నదమ్ములుంటే, అప్పుడు తల్లికి ఆరింట ఒక భాగం మాత్రమే దక్కుతుంది. చనిపోయిన వ్యక్తి వ్రాసిన వీలునామాను అమలు పరచి, అతను చేసి వున్న అప్పులను తీర్చిన మీదటే ఈ (ఆస్తి) వాటాలు లభిస్తాయి. మీ తండ్రులలో లేక కుమారులలో - మీకు ప్రయోజనం చేకూర్చటంలో ఎవరు ఎక్కువ సన్నిహితులో మీకు తెలియదు. ఇవి అల్లాహ్ తరఫున నిర్ణయించబడిన వాటాలు. నిశ్చయంగా అల్లాహ్ సర్వజ్ఞాని, పరిపూర్ణ వివేకం గలవాడు. 4:12 وَلَكُمْ نِصْفُ مَا تَرَكَ أَزْوَاجُكُمْ إِن لَّمْ يَكُن لَّهُنَّ وَلَدٌ ۚ فَإِن كَانَ لَهُنَّ وَلَدٌ فَلَكُمُ الرُّبُعُ مِمَّا تَرَكْنَ ۚ مِن بَعْدِ وَصِيَّةٍ يُوصِينَ بِهَا أَوْ دَيْنٍ ۚ وَلَهُنَّ الرُّبُعُ مِمَّا تَرَكْتُمْ إِن لَّمْ يَكُن لَّكُمْ وَلَدٌ ۚ فَإِن كَانَ لَكُمْ وَلَدٌ فَلَهُنَّ الثُّمُنُ مِمَّا تَرَكْتُم ۚ مِّن بَعْدِ وَصِيَّةٍ تُوصُونَ بِهَا أَوْ دَيْنٍ ۗ وَإِن كَانَ رَجُلٌ يُورَثُ كَلَالَةً أَوِ امْرَأَةٌ وَلَهُ أَخٌ أَوْ أُخْتٌ فَلِكُلِّ وَاحِدٍ مِّنْهُمَا السُّدُسُ ۚ فَإِن كَانُوا أَكْثَرَ مِن ذَٰلِكَ فَهُمْ شُرَكَاءُ فِي الثُّلُثِ ۚ مِن بَعْدِ وَصِيَّةٍ يُوصَىٰ بِهَا أَوْ دَيْنٍ غَيْرَ مُضَارٍّ ۚ وَصِيَّةً مِّنَ اللَّهِ ۗ وَاللَّهُ عَلِيمٌ حَلِيمٌ మీ భార్యలకు సంతానం లేనిపక్షంలో వారు వదలివెళ్ళిన ఆస్తిలో సగభాగం మీది. ఒకవేళ వారికి సంతానముంటే వారు విడిచిపెట్టిన ఆస్తిలో నాల్గోభాగం మీకు చెందుతుంది. వారు వ్రాసిపోయిన వీలునామాను అమలుపరచిన మీదట, లేదా వారు చేసిన అప్పుల్ని తీర్చిన మీదటే ఈ పంపకం జరగాలి. మీకు పిల్లలు లేని పక్షంలో మీరు వదలిపోయే ఆస్తిలో మీ భార్యలకు నాల్గో భాగం లభిస్తుంది. ఒకవేళ మీకు పిల్లలుంటే అప్పుడు మీరు వదలివెళ్ళే ఆస్తిలో మీ భార్యలకు ఎనిమిదో వంతు మాత్రమే లభిస్తుంది. మీరు వ్రాసి వెళ్ళిన వీలునామాను అమలు పరచి, లేదా మీరు చేసివెళ్ళిన అప్పుల్ని తీర్చిన తరువాతే మిగిలిన ఆస్తిలో పంపకాలు జరుగుతాయి. చనిపోయిన పురుషుడు లేక స్త్రీ 'కలాలా' అయి ఉండి (అంటే వారికి తండ్రిగాని, కొడుకు గాని లేకుండా ఉండి) వారికి ఒక సోదరుడు లేక ఒక సోదరి ఉన్నట్లయితే వారిలో ఒక్కొక్కరికి ఆరింట ఒక భాగం చొప్పున లభిస్తుంది. కాని వారు ఒకరికన్నా ఎక్కువ మంది ఉన్నట్లయితే అప్పుడు మొత్తం ఆస్తిలోని మూడో భాగాన్ని వారంతా సమానంగా పంచుకోవాలి. అయితే మృతుడు వ్రాసిన వీలునామాను అమలుపరచి, లేదా అతని అప్పులన్నీ తీర్చిన మీదటే ఈ పంపకం జరగాలి. ఇది ఇతరులకు నష్టకరంగా పరిణమించకూడదు. ఇది అల్లాహ్ తరఫున జరిగిన నిర్థారణ. అల్లాహ్ అన్నీ తెలిసినవాడు, సహనశీలుడు. 4:13 تِلْكَ حُدُودُ اللَّهِ ۚ وَمَن يُطِعِ اللَّهَ وَرَسُولَهُ يُدْخِلْهُ جَنَّاتٍ تَجْرِي مِن تَحْتِهَا الْأَنْهَارُ خَالِدِينَ فِيهَا ۚ وَذَٰلِكَ الْفَوْزُ الْعَظِيمُ ఇవి అల్లాహ్ నిర్ధారించిన హద్దులు. అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త (సఅసం)కు విధేయత చూపేవారికి అల్లాహ్, క్రింద కాలువలు ప్రవహించే (స్వర్గ) వనాలలో ప్రవేశం కల్పిస్తాడు. వాటిలో వారు కలకాలం ఉంటారు. గొప్ప విజయం అంటే ఇదే. 4:14 وَمَن يَعْصِ اللَّهَ وَرَسُولَهُ وَيَتَعَدَّ حُدُودَهُ يُدْخِلْهُ نَارًا خَالِدًا فِيهَا وَلَهُ عَذَابٌ مُّهِينٌ ఎవడు అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త (సఅసం) యెడల అవిధేయుడై, ఆయన నిర్ధారించిన హద్దులను మీరిపోతాడో వాడ్ని ఆయన నరకాగ్నిలో పడవేస్తాడు. వాడందులో ఎల్లకాలం పడి ఉంటాడు. అవమానకరమైన శిక్ష అలాంటి వారికోసమే ఉంది. 4:15 وَاللَّاتِي يَأْتِينَ الْفَاحِشَةَ مِن نِّسَائِكُمْ فَاسْتَشْهِدُوا عَلَيْهِنَّ أَرْبَعَةً مِّنكُمْ ۖ فَإِن شَهِدُوا فَأَمْسِكُوهُنَّ فِي الْبُيُوتِ حَتَّىٰ يَتَوَفَّاهُنَّ الْمَوْتُ أَوْ يَجْعَلَ اللَّهُ لَهُنَّ سَبِيلًا మీ స్త్రీలలో ఎవరయినా అక్రమ సంబంధం పెట్టుకుంటే వారికి వ్యతిరేకంగా మీలోని నలుగురు వ్యక్తులను సాక్షులుగా తీసుకురండి. వారు గనక సాక్ష్యం ఇస్తే ఆ స్త్రీలను మరణకాలం వచ్చే వరకుగానీ, లేదా అల్లాహ్ వారికోసం ఏదైనా మార్గాంతరం సూచించేవరకు గానీ - గృహాల్లో నిర్బంధించి ఉంచండి. 4:16 وَاللَّذَانِ يَأْتِيَانِهَا مِنكُمْ فَآذُوهُمَا ۖ فَإِن تَابَا وَأَصْلَحَا فَأَعْرِضُوا عَنْهُمَا ۗ إِنَّ اللَّهَ كَانَ تَوَّابًا رَّحِيمًا మీలో ఏ ఇద్దరయినా ఈ (పాడు) పని చేస్తే వారిద్దరినీ బాధించండి. ఒకవేళ వారు పశ్చాత్తాపపడి, తమ ప్రవర్తనను సరిదిద్దుకుంటే వారిని ఉపేక్షించండి. నిస్సందేహంగా అల్లాహ్ పశ్చాత్తాపాన్ని స్వీకరించేవాడు, కరుణించేవాడు కూడా. 4:17 إِنَّمَا التَّوْبَةُ عَلَى اللَّهِ لِلَّذِينَ يَعْمَلُونَ السُّوءَ بِجَهَالَةٍ ثُمَّ يَتُوبُونَ مِن قَرِيبٍ فَأُولَٰئِكَ يَتُوبُ اللَّهُ عَلَيْهِمْ ۗ وَكَانَ اللَّهُ عَلِيمًا حَكِيمًا అవివేకం వల్ల ఏదైనా చెడు కార్యానికి పాల్పడి, వెనువెంటనే తప్పు తెలుసుకుని పశ్చాత్తాపం చెందేవారి పశ్చాత్తాపాన్ని స్వీకరించే బాధ్యత మాత్రమే అల్లాహ్‌పై ఉంది. అటువంటి వారి పశ్చాత్తాపాన్ని అల్లాహ్ స్వీకరిస్తాడు. అల్లాహ్ మహాజ్ఞాని, గొప్ప వివేకవంతుడు. 4:18 وَلَيْسَتِ التَّوْبَةُ لِلَّذِينَ يَعْمَلُونَ السَّيِّئَاتِ حَتَّىٰ إِذَا حَضَرَ أَحَدَهُمُ الْمَوْتُ قَالَ إِنِّي تُبْتُ الْآنَ وَلَا الَّذِينَ يَمُوتُونَ وَهُمْ كُفَّارٌ ۚ أُولَٰئِكَ أَعْتَدْنَا لَهُمْ عَذَابًا أَلِيمًا నిరంతరం పాపకార్యాలకు పాల్పడుతూ, తీరా మరణ ఘడియలు సమీపించాక, “ఇప్పుడు నేను పశ్చాత్తాపపడుతున్నాను” అని అనే వారి పశ్చాత్తాపం ఆమోదించబడదు. అలాగే అవిశ్వాస స్థితిలో ప్రాణం విడిచే వారి పశ్చాత్తాపం కూడా స్వీకరించబడదు. ఇలాంటి వారి కోసమే మేము వ్యధాభరితమైన శిక్షను సిద్ధం చేసి ఉంచాము. 4:19 يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا لَا يَحِلُّ لَكُمْ أَن تَرِثُوا النِّسَاءَ كَرْهًا ۖ وَلَا تَعْضُلُوهُنَّ لِتَذْهَبُوا بِبَعْضِ مَا آتَيْتُمُوهُنَّ إِلَّا أَن يَأْتِينَ بِفَاحِشَةٍ مُّبَيِّنَةٍ ۚ وَعَاشِرُوهُنَّ بِالْمَعْرُوفِ ۚ فَإِن كَرِهْتُمُوهُنَّ فَعَسَىٰ أَن تَكْرَهُوا شَيْئًا وَيَجْعَلَ اللَّهُ فِيهِ خَيْرًا كَثِيرًا విశ్వసించిన ఓ ప్రజలారా! మీరు బలవంతంగా స్త్రీలకు వారసులై కూర్చోవటం మీకు ధర్మసమ్మతం కానేరదు. మీరు వారికి ఇచ్చిన దానిలో (మహర్) నుంచి కొంత సొమ్ము కాజేసే ఉద్దేశ్యంతో వారిని ఆపి ఉంచుకోకండి. ఒకవేళ వారు గనక బాహాటంగా ఏదైనా నీతిమాలిన పనికి పాల్పడితే అది వేరే విషయం. వారితో ఉత్తమరీతిలో కాపురం చేయండి. ఒకవేళ వారు మీకు నచ్చకపోతే బహుశా ఏదో ఒక్క విషయం మూలంగా మీకు నచ్చకపోవచ్చు. కాని మీకు నచ్చని ఆ విషయంలోనే అల్లాహ్ అపారమైన శుభాన్ని పొందుపరచాడేమో! (మీకేం తెలుసు?) 4:20 وَإِنْ أَرَدتُّمُ اسْتِبْدَالَ زَوْجٍ مَّكَانَ زَوْجٍ وَآتَيْتُمْ إِحْدَاهُنَّ قِنطَارًا فَلَا تَأْخُذُوا مِنْهُ شَيْئًا ۚ أَتَأْخُذُونَهُ بُهْتَانًا وَإِثْمًا مُّبِينًا మీరు ఒక భార్య స్థానంలో మరో భార్యను చేసుకోదలిస్తే, వారిలో ఎవరికయినా మీరు పెద్ద ధనరాశిని ఇచ్చివున్నా సరే, దానిలోనుంచి ఏ కొంచెం కూడా తిరిగి తీసుకోకండి. ఏమిటీ, అది అన్యాయం, స్పష్టమైన పాపం అయినప్పటికీ మీరు దాన్ని తీసుకుంటారా? 4:21 وَكَيْفَ تَأْخُذُونَهُ وَقَدْ أَفْضَىٰ بَعْضُكُمْ إِلَىٰ بَعْضٍ وَأَخَذْنَ مِنكُم مِّيثَاقًا غَلِيظًا మీరు పరస్పరం కలుసుకున్న తరువాత, ఆ స్త్రీలు మీ నుండి గట్టి వాగ్దానం తీసుకున్న తరువాత కూడా ఆ ధనాన్ని మీరెలా (తిరిగి) తీసుకోగలుగుతారు? 4:22 وَلَا تَنكِحُوا مَا نَكَحَ آبَاؤُكُم مِّنَ النِّسَاءِ إِلَّا مَا قَدْ سَلَفَ ۚ إِنَّهُ كَانَ فَاحِشَةً وَمَقْتًا وَسَاءَ سَبِيلًا మీ తండ్రులు వివాహమాడిన స్త్రీలను మీరు ఎట్టి పరిస్థితిలోనూ పెళ్ళి చేసుకోకండి. పూర్వం జరిగిందేదో జరిగిపోయింది. అదొక సిగ్గుమాలిన పని, ద్వేషానికి మూలం, ఒక చెడు నడత. 4:23 حُرِّمَتْ عَلَيْكُمْ أُمَّهَاتُكُمْ وَبَنَاتُكُمْ وَأَخَوَاتُكُمْ وَعَمَّاتُكُمْ وَخَالَاتُكُمْ وَبَنَاتُ الْأَخِ وَبَنَاتُ الْأُخْتِ وَأُمَّهَاتُكُمُ اللَّاتِي أَرْضَعْنَكُمْ وَأَخَوَاتُكُم مِّنَ الرَّضَاعَةِ وَأُمَّهَاتُ نِسَائِكُمْ وَرَبَائِبُكُمُ اللَّاتِي فِي حُجُورِكُم مِّن نِّسَائِكُمُ اللَّاتِي دَخَلْتُم بِهِنَّ فَإِن لَّمْ تَكُونُوا دَخَلْتُم بِهِنَّ فَلَا جُنَاحَ عَلَيْكُمْ وَحَلَائِلُ أَبْنَائِكُمُ الَّذِينَ مِنْ أَصْلَابِكُمْ وَأَن تَجْمَعُوا بَيْنَ الْأُخْتَيْنِ إِلَّا مَا قَدْ سَلَفَ ۗ إِنَّ اللَّهَ كَانَ غَفُورًا رَّحِيمًا మీ కొరకు నిషేధించబడినవారు - మీ తల్లులు, మీ కుమార్తెలు, మీ అక్కా చెల్లెళ్ళు, మీ మేనత్తలు, మీ తల్లి సోదరీమణులు (మీ పిన్నమ్మ పెద్దమ్మలు), మీ అన్నదమ్ముల కుమార్తెలు, అక్కాచెల్లెళ్ళ కూతుళ్ళు (మేనకోడళ్ళు), మీకు పాలిచ్చిన తల్లులు, పాల వరుస ద్వారా మీకు అక్కాచెల్లెళ్ళు అయినవారు, మీ భార్యల తల్లులు (అత్తలు), మీరు దాంపత్య సుఖాన్ని అనుభవించిన మీ భార్యల (ఆమె మాజీ భర్త ద్వారా పుట్టిన) మీ సంరక్షణలోనున్న కూతుళ్ళు - ఒకవేళ మీరు వారితో సమాగమం జరపకుండా ఉంటే (కేవలం పెళ్ళిమాత్రం చేసుకుని వారికి విడాకులు యిచ్చేసివున్న పక్షంలో వారి కూతుళ్లను వివాహమాడటం) మీ కొరకు పాపం కాదు. అలాగే మీ వెన్ను నుండి (స్ఖలించబడిన వీర్యంతో) పుట్టిన మీ కొడుకుల భార్యలు (కోడళ్ళు) మీ కోసం నిషేధించబడ్డారు. (ఏకకాలంలో) ఇద్దరు అక్కా చెల్లెళ్ళను కలిపి భార్యలుగా చేసుకోవటం కూడా మీ కొరకు నిషిద్ధమే, లోగడ జరిగిందేదో జరిగిపోయింది. నిస్సందేహంగా అల్లాహ్ క్షమాశీలి, కృపాకరుడు కూడాను. 4:24 وَالْمُحْصَنَاتُ مِنَ النِّسَاءِ إِلَّا مَا مَلَكَتْ أَيْمَانُكُمْ ۖ كِتَابَ اللَّهِ عَلَيْكُمْ ۚ وَأُحِلَّ لَكُم مَّا وَرَاءَ ذَٰلِكُمْ أَن تَبْتَغُوا بِأَمْوَالِكُم مُّحْصِنِينَ غَيْرَ مُسَافِحِينَ ۚ فَمَا اسْتَمْتَعْتُم بِهِ مِنْهُنَّ فَآتُوهُنَّ أُجُورَهُنَّ فَرِيضَةً ۚ وَلَا جُنَاحَ عَلَيْكُمْ فِيمَا تَرَاضَيْتُم بِهِ مِن بَعْدِ الْفَرِيضَةِ ۚ إِنَّ اللَّهَ كَانَ عَلِيمًا حَكِيمًا భర్తగల స్త్రీలు కూడా మీ కొరకు నిషేధించబడ్డారు. అయితే మీ యాజమాన్యంలోనికి వచ్చిన బానిస స్త్రీలు మాత్రం (నిషేధించబడలేదు). అల్లాహ్ ఈ ఆదేశాలను మీపై విధించాడు. ఈ స్త్రీలు మినహా మిగతా స్త్రీలను మీరు మహర్ రూపంలో ధనం చెల్లించి వివాహమాడటం మీ కొరకు ధర్మసమ్మతం (హలాల్) చేయబడింది. అయితే చెడుల నుండి దూరంగా ఉండే ఉద్దేశ్యంతోనే ఈ పని చెయ్యాలి తప్ప కామక్రీడల కోసం కాదు. అందుకే మీరు ఏ స్త్రీలతో సౌఖ్యాన్ని పొందారో వారికి నిర్థారిత మహర్ సొమ్మును ఇచ్చివేయండి. మహర్ సొమ్ము నిర్ధారించబడిన తరువాత మీరు పరస్పరం - ఇష్టపూర్వకంగా - ఆ విషయమై ఒక అవగాహనకు వస్తే అందులో దోషం ఏమీ లేదు. నిశ్చయంగా అల్లాహ్ సర్వం తెలిసినవాడు, వివేకవంతుడు. 4:25 وَمَن لَّمْ يَسْتَطِعْ مِنكُمْ طَوْلًا أَن يَنكِحَ الْمُحْصَنَاتِ الْمُؤْمِنَاتِ فَمِن مَّا مَلَكَتْ أَيْمَانُكُم مِّن فَتَيَاتِكُمُ الْمُؤْمِنَاتِ ۚ وَاللَّهُ أَعْلَمُ بِإِيمَانِكُم ۚ بَعْضُكُم مِّن بَعْضٍ ۚ فَانكِحُوهُنَّ بِإِذْنِ أَهْلِهِنَّ وَآتُوهُنَّ أُجُورَهُنَّ بِالْمَعْرُوفِ مُحْصَنَاتٍ غَيْرَ مُسَافِحَاتٍ وَلَا مُتَّخِذَاتِ أَخْدَانٍ ۚ فَإِذَا أُحْصِنَّ فَإِنْ أَتَيْنَ بِفَاحِشَةٍ فَعَلَيْهِنَّ نِصْفُ مَا عَلَى الْمُحْصَنَاتِ مِنَ الْعَذَابِ ۚ ذَٰلِكَ لِمَنْ خَشِيَ الْعَنَتَ مِنكُمْ ۚ وَأَن تَصْبِرُوا خَيْرٌ لَّكُمْ ۗ وَاللَّهُ غَفُورٌ رَّحِيمٌ మీలో ఎవరికయినా స్వతంత్రులగు ముస్లిం స్త్రీలను వివాహమాడే స్థోమత లేకపోతే, మీ యాజమాన్యంలో ఉన్న విశ్వాసులైన బానిస స్త్రీలను నికాహ్ చేసుకోవాలి. మీ విశ్వాస స్థితి గురించి అల్లాహ్‌కు బాగా తెలుసు. మీరంతా పరస్పరం ఒక్కటే కదా! కాబట్టి వారి యజమానుల అనుమతితో వారిని వివాహమాడండి. నియమానుసారం వారి మహర్‌ను వారికి ఇవ్వండి. అయితే వారు సౌశీల్యవతులై ఉండాలి. బాహాటంగా అశ్లీల కార్యాలకు పాల్పడనివారై ఉండాలి. చాటుమాటు ప్రేమ కలాపాలు సాగించేవారు కాకుండా ఉండాలి. మరి ఆ బానిస స్త్రీలు వివాహబంధంలో కట్టుబడిన తరువాత కూడా సిగ్గుమాలిన పనికి గనక ఒడిగడితే స్వతంత్రులగు స్త్రీలకు విధించే శిక్షలో సగం శిక్ష వీరికి విధించబడుతుంది. తమ వల్ల పాపకార్యం జరిగి పోతుందేమో, ఓర్చుకోలేమేమో అన్న భయం ఉన్నవారికి ఇలా బానిస స్త్రీలను వివాహమాడే వెసులుబాటు ఇవ్వబడింది. ఒకవేళ మీరు ఆత్మనిగ్రహాన్ని అలవరచుకుంటే అది మీకే శ్రేయస్కరం. అల్లాహ్ అమితంగా క్షమించేవాడు, అపారంగా కనికరించేవాడూను. 4:26 يُرِيدُ اللَّهُ لِيُبَيِّنَ لَكُمْ وَيَهْدِيَكُمْ سُنَنَ الَّذِينَ مِن قَبْلِكُمْ وَيَتُوبَ عَلَيْكُمْ ۗ وَاللَّهُ عَلِيمٌ حَكِيمٌ అల్లాహ్ మీకు (ధర్మాధర్మాలను) విడమరచి చెప్పాలనీ, మీ పూర్వీకుల్లోని (సజ్జనుల) మార్గంపై మిమ్మల్ని నడిపించాలనీ, మీ పశ్చాత్తాపాన్ని ఆమోదించాలని అభిలషిస్తున్నాడు. అల్లాహ్ సర్వం తెలిసినవాడు, వివేక సంపన్నుడు. 4:27 وَاللَّهُ يُرِيدُ أَن يَتُوبَ عَلَيْكُمْ وَيُرِيدُ الَّذِينَ يَتَّبِعُونَ الشَّهَوَاتِ أَن تَمِيلُوا مَيْلًا عَظِيمًا అల్లాహ్ మీ పశ్చాత్తాపాన్ని అంగీకరించాలని కోరుతున్నాడు. కాని, తమ మనోవాంఛలను అనుసరిస్తున్నవారు మాత్రం మీరు (దైవమార్గం నుంచి) పెడదారి తీసి చాలా దూరం వెళ్ళిపోవాలని కోరుకుంటున్నారు. 4:28 يُرِيدُ اللَّهُ أَن يُخَفِّفَ عَنكُمْ ۚ وَخُلِقَ الْإِنسَانُ ضَعِيفًا మీపైన ఉన్న బరువును తగ్గించాలన్నది అల్లాహ్ అభిలాష. ఎందుకంటే మానవుడు బలహీనుడుగా పుట్టించబడ్డాడు. 4:29 يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا لَا تَأْكُلُوا أَمْوَالَكُم بَيْنَكُم بِالْبَاطِلِ إِلَّا أَن تَكُونَ تِجَارَةً عَن تَرَاضٍ مِّنكُمْ ۚ وَلَا تَقْتُلُوا أَنفُسَكُمْ ۚ إِنَّ اللَّهَ كَانَ بِكُمْ رَحِيمًا ఓ విశ్వసించిన వారలారా! ఒండొకరి సొమ్మును అధర్మంగా తినకండి. అయితే పరస్పర అంగీకారంతో జరిగే క్రయ విక్రయాల ద్వారా లభించే దానిని (తినవచ్చు). మిమ్మల్ని మీరు చంపుకోకండి. నిస్సందేహంగా అల్లాహ్ మీపై అమితమైన దయగలవాడు. 4:30 وَمَن يَفْعَلْ ذَٰلِكَ عُدْوَانًا وَظُلْمًا فَسَوْفَ نُصْلِيهِ نَارًا ۚ وَكَانَ ذَٰلِكَ عَلَى اللَّهِ يَسِيرًا తలబిరుసుతనంతో, దౌర్జన్యంతో దీనికి (ఈ అవిధేయతకు) పాల్పడేవాడ్ని మేము నరకాగ్నిలో పడవేస్తాము. ఇలా చేయటం అల్లాహ్‌కు చాలా తేలిక. 4:31 إِن تَجْتَنِبُوا كَبَائِرَ مَا تُنْهَوْنَ عَنْهُ نُكَفِّرْ عَنكُمْ سَيِّئَاتِكُمْ وَنُدْخِلْكُم مُّدْخَلًا كَرِيمًا మీకు వారించబడే మహాపరాధాలకు గనక మీరు దూరంగా ఉన్నట్లయితే, మీ చిన్న చిన్న పాపాలను మేము మీ (లెక్క) నుండి తీసేస్తాము. ఇంకా మిమ్మల్ని గౌరవప్రద స్థానాల్లో ప్రవేశింపజేస్తాము. 4:32 وَلَا تَتَمَنَّوْا مَا فَضَّلَ اللَّهُ بِهِ بَعْضَكُمْ عَلَىٰ بَعْضٍ ۚ لِّلرِّجَالِ نَصِيبٌ مِّمَّا اكْتَسَبُوا ۖ وَلِلنِّسَاءِ نَصِيبٌ مِّمَّا اكْتَسَبْنَ ۚ وَاسْأَلُوا اللَّهَ مِن فَضْلِهِ ۗ إِنَّ اللَّهَ كَانَ بِكُلِّ شَيْءٍ عَلِيمًا అల్లాహ్ మీలో కొందరికి మరికొందరిపై దేని మూలంగా విశిష్ఠతను ప్రసాదించాడో దానికోసం ఆశపడకండి. పురుషులు సంపాదించిన దానినిబట్టి వారి భాగం వారికుంటుంది. అలాగే స్త్రీలు సంపాదించిన దానినిబట్టి వారి భాగం వారికుంటుంది. కాకపోతే మీరు అల్లాహ్ నుండి ఆయన అనుగ్రహాన్ని అర్థిస్తూ ఉండండి. నిశ్చయంగా అల్లాహ్ ప్రతిదీ తెలిసినవాడు. 4:33 وَلِكُلٍّ جَعَلْنَا مَوَالِيَ مِمَّا تَرَكَ الْوَالِدَانِ وَالْأَقْرَبُونَ ۚ وَالَّذِينَ عَقَدَتْ أَيْمَانُكُمْ فَآتُوهُمْ نَصِيبَهُمْ ۚ إِنَّ اللَّهَ كَانَ عَلَىٰ كُلِّ شَيْءٍ شَهِيدًا తల్లిదండ్రులు, సమీప బంధువులు వదలివెళ్ళిన ఆస్తికి మేము వారి వారసులను నిర్థారించిపెట్టాము. మీరు ఎవరితోనయినా ఏదయినా ఒప్పందం చేసుకుని ఉంటే, తదనుగుణంగా వారి భాగాన్ని వారికి ఇవ్వండి. యదార్థానికి అల్లాహ్ అన్నింటిపై సాక్షిగా ఉన్నాడు. 4:34 الرِّجَالُ قَوَّامُونَ عَلَى النِّسَاءِ بِمَا فَضَّلَ اللَّهُ بَعْضَهُمْ عَلَىٰ بَعْضٍ وَبِمَا أَنفَقُوا مِنْ أَمْوَالِهِمْ ۚ فَالصَّالِحَاتُ قَانِتَاتٌ حَافِظَاتٌ لِّلْغَيْبِ بِمَا حَفِظَ اللَّهُ ۚ وَاللَّاتِي تَخَافُونَ نُشُوزَهُنَّ فَعِظُوهُنَّ وَاهْجُرُوهُنَّ فِي الْمَضَاجِعِ وَاضْرِبُوهُنَّ ۖ فَإِنْ أَطَعْنَكُمْ فَلَا تَبْغُوا عَلَيْهِنَّ سَبِيلًا ۗ إِنَّ اللَّهَ كَانَ عَلِيًّا كَبِيرًا పురుషులు స్త్రీలపై అధికారులు. ఎందుకంటే అల్లాహ్ ఒకరికి ఇంకొకరిపై విశిష్ఠతను వొసగాడు. అదీగాక పురుషులు తమ సంపదను (వారిపై) ఖర్చుపెట్టారు. కనుక గుణవంతులైన స్త్రీలు విధేయులై ఉంటారు. తమ భర్తలు లేని సమయంలో అల్లాహ్ రక్షణలో ఉంటూ (తమ శీలాన్నీ, భర్త సంపదను) కాపాడుతారు. ఏ స్త్రీలు అవిధేయతకు పాల్పడతారని మీకు భయం ఉంటుందో వారికి నచ్చజెప్పండి. (అవసరమైతే) పడక దగ్గర వారిని వేరుగా ఉంచండి. వారిని కొట్టండి. ఆ తరువాత వారు గనక మీకు విధేయులైతే వారిని అనవసరంగా వేధించే ఉద్దేశ్యంతో సాకులు వెతక్కండి. నిశ్చయంగా అల్లాహ్ సర్వోన్నతుడు, గొప్పవాడు. 4:35 وَإِنْ خِفْتُمْ شِقَاقَ بَيْنِهِمَا فَابْعَثُوا حَكَمًا مِّنْ أَهْلِهِ وَحَكَمًا مِّنْ أَهْلِهَا إِن يُرِيدَا إِصْلَاحًا يُوَفِّقِ اللَّهُ بَيْنَهُمَا ۗ إِنَّ اللَّهَ كَانَ عَلِيمًا خَبِيرًا ఒకవేళ ఆలుమగల మధ్య విముఖత విరోధంగా మారే భయం మీకుంటే భర్త తరఫు నుంచి ఒక మధ్యవర్తినీ, భార్య వైపు నుంచి ఒక మధ్యవర్తినీ నియమించుకోండి. వారిద్దరూ గనక సర్దుబాటుకు ప్రయత్నం చేయదలిస్తే అల్లాహ్ ఆ దంపతుల మధ్య రాజీ కుదుర్చుతాడు. నిస్సందేహంగా అల్లాహ్ అన్నీ తెలిసినవాడు, సర్వం ఎరిగినవాడు. 4:36 وَاعْبُدُوا اللَّهَ وَلَا تُشْرِكُوا بِهِ شَيْئًا ۖ وَبِالْوَالِدَيْنِ إِحْسَانًا وَبِذِي الْقُرْبَىٰ وَالْيَتَامَىٰ وَالْمَسَاكِينِ وَالْجَارِ ذِي الْقُرْبَىٰ وَالْجَارِ الْجُنُبِ وَالصَّاحِبِ بِالْجَنبِ وَابْنِ السَّبِيلِ وَمَا مَلَكَتْ أَيْمَانُكُمْ ۗ إِنَّ اللَّهَ لَا يُحِبُّ مَن كَانَ مُخْتَالًا فَخُورًا అల్లాహ్‌ను ఆరాధించండి. ఆయనకు సహవర్తులుగా ఎవరినీ కల్పించకండి. తల్లిదండ్రుల పట్ల ఉత్తమంగా వ్యవహరించండి. బంధువుల పట్ల, తండ్రిలేని బిడ్డల పట్ల, నిరుపేదల పట్ల, ఆత్మీయులైన పొరుగువారి పట్ల, బంధువులు కాని పొరుగువారి పట్ల, ప్రక్కనున్న మిత్రుల పట్ల, బాటసారుల పట్ల, మీ అధీనంలో ఉన్న బానిసల పట్ల ఔదార్యంతో మెలగండి. నిశ్చయంగా అల్లాహ్ అహంకారంతో విర్రవీగేవారిని, బడాయి కొట్టే వారిని ఎంతమాత్రం ఇష్టపడడు. 4:37 الَّذِينَ يَبْخَلُونَ وَيَأْمُرُونَ النَّاسَ بِالْبُخْلِ وَيَكْتُمُونَ مَا آتَاهُمُ اللَّهُ مِن فَضْلِهِ ۗ وَأَعْتَدْنَا لِلْكَافِرِينَ عَذَابًا مُّهِينًا వారు పిసినారులుగా ప్రవర్తించటమే గాక, ఇతరులకు కూడా పిసినారితనాన్ని నేర్పుతారు. అల్లాహ్ తన అనుగ్రహం నుండి తమకు ప్రసాదించిన దాన్ని దాచిపెడతారు. ఇటువంటి తిరస్కారుల కొరకు మేము అవమానకరమైన శిక్షను సిద్ధం చేసి ఉంచాము. 4:38 وَالَّذِينَ يُنفِقُونَ أَمْوَالَهُمْ رِئَاءَ النَّاسِ وَلَا يُؤْمِنُونَ بِاللَّهِ وَلَا بِالْيَوْمِ الْآخِرِ ۗ وَمَن يَكُنِ الشَّيْطَانُ لَهُ قَرِينًا فَسَاءَ قَرِينًا వారు ప్రజలకు చూపటానికి తమ సొమ్మును ఖర్చుపెడతారు. అల్లాహ్‌ను, అంతిమదినాన్ని విశ్వసించరు. వాస్తవమేమిటంటే షైతాను ఎవరికి స్నేహితుడయ్యాడో (వారిని ఇలాగే నాశనం చేస్తాడు), వాడు బహుచెడ్డ స్నేహితుడు. 4:39 وَمَاذَا عَلَيْهِمْ لَوْ آمَنُوا بِاللَّهِ وَالْيَوْمِ الْآخِرِ وَأَنفَقُوا مِمَّا رَزَقَهُمُ اللَّهُ ۚ وَكَانَ اللَّهُ بِهِمْ عَلِيمًا వారే గనక అల్లాహ్‌ను, అంతిమదినాన్ని విశ్వసించి, అల్లాహ్ తమకు ప్రసాదించిన దానిలో నుంచి ఖర్చుపెడితే ఏం పోయేది? వారి స్థితిగతులు అల్లాహ్‌కు బాగా తెలుసు. 4:40 إِنَّ اللَّهَ لَا يَظْلِمُ مِثْقَالَ ذَرَّةٍ ۖ وَإِن تَكُ حَسَنَةً يُضَاعِفْهَا وَيُؤْتِ مِن لَّدُنْهُ أَجْرًا عَظِيمًا అల్లాహ్ ఎవరికీ రవ్వంత అన్యాయం చేయడనేది నిశ్చయం. సత్కార్యం ఉంటే ఆయన దాన్ని రెట్టింపు చేస్తాడు. అంతేకాదు, తన వద్దనున్న దానిలో నుంచి గొప్ప ప్రతిఫలాన్ని వొసగుతాడు. 4:41 فَكَيْفَ إِذَا جِئْنَا مِن كُلِّ أُمَّةٍ بِشَهِيدٍ وَجِئْنَا بِكَ عَلَىٰ هَٰؤُلَاءِ شَهِيدًا (ఓ ముహమ్మద్-స!) మేము ప్రతి సమాజం నుంచి ఒక సాక్షిని తెచ్చి, వారిపై నిన్ను సాక్షిగా పెట్టినప్పుడు పరిస్థితి ఎలా ఉంటుంది? 4:42 يَوْمَئِذٍ يَوَدُّ الَّذِينَ كَفَرُوا وَعَصَوُا الرَّسُولَ لَوْ تُسَوَّىٰ بِهِمُ الْأَرْضُ وَلَا يَكْتُمُونَ اللَّهَ حَدِيثًا ఆ రోజు అవిశ్వాసులూ, ప్రవక్త పట్ల అవిధేయతకు పాల్పడినవారూ తాము నేలమట్టం చేయబడితే బావుండునే! అని కోరుకుంటారు. వారు దైవసమక్షంలో ఏ ఒక్క విషయాన్నీ దాచలేరు. 4:43 يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا لَا تَقْرَبُوا الصَّلَاةَ وَأَنتُمْ سُكَارَىٰ حَتَّىٰ تَعْلَمُوا مَا تَقُولُونَ وَلَا جُنُبًا إِلَّا عَابِرِي سَبِيلٍ حَتَّىٰ تَغْتَسِلُوا ۚ وَإِن كُنتُم مَّرْضَىٰ أَوْ عَلَىٰ سَفَرٍ أَوْ جَاءَ أَحَدٌ مِّنكُم مِّنَ الْغَائِطِ أَوْ لَامَسْتُمُ النِّسَاءَ فَلَمْ تَجِدُوا مَاءً فَتَيَمَّمُوا صَعِيدًا طَيِّبًا فَامْسَحُوا بِوُجُوهِكُمْ وَأَيْدِيكُمْ ۗ إِنَّ اللَّهَ كَانَ عَفُوًّا غَفُورًا విశ్వసించిన ప్రజలారా! మీరు (తాగిన) మత్తులో ఉన్నప్పుడు నమాజు దరిదాపులకు కూడా పోకండి. మీరు పలికేదేమిటో మీకు అర్థం కాగలిగినప్పుడే (నమాజు చెయ్యాలి). లైంగిక అశుద్ధావస్థలో కూడా - స్నానం చేయనంతవరకూ - నమాజు చేయరాదు. (మస్జిదు) దారిగుండా సాగిపోయేటి పరిస్థితి అయితే అది వేరే విషయం! ఒకవేళ మీరు వ్యాధిగ్రస్తులైతే, లేక ప్రయాణంలో ఉంటే లేక మీలో ఎవరయినా మలమూత్ర విసర్జన చేసివస్తే లేక మీరు స్త్రీలతో సమాగమం జరిపి ఉంటే - అట్టి స్థితిలో మీకు నీరు లభ్యం కానిపక్షంలో పరిశుభ్రమైన మట్టి(ని ఉపయోగించే) సంకల్పం చేసుకోండి. (దాంతో) మీ ముఖాలను, చేతులను తుడుచుకోండి. నిశ్చయంగా అల్లాహ్ మన్నించేవాడు, క్షమాభిక్ష పెట్టేవాడు. 4:44 أَلَمْ تَرَ إِلَى الَّذِينَ أُوتُوا نَصِيبًا مِّنَ الْكِتَابِ يَشْتَرُونَ الضَّلَالَةَ وَيُرِيدُونَ أَن تَضِلُّوا السَّبِيلَ గ్రంథంలో కొంతభాగం యివ్వబడిన వారిని మీరు చూడలేదా? వారు మార్గభ్రష్టతను కొనితెచ్చుకుంటారు. మీరు కూడా మార్గం తప్పాలన్నది వారి ఉద్దేశం. 4:45 وَاللَّهُ أَعْلَمُ بِأَعْدَائِكُمْ ۚ وَكَفَىٰ بِاللَّهِ وَلِيًّا وَكَفَىٰ بِاللَّهِ نَصِيرًا మీ శత్రువుల గురించి అల్లాహ్ బాగా ఎరిగినవాడు. మీకు మిత్రుడిగా అల్లాహ్ చాలు. మీకు సహాయకుడిగా (కూడా) అల్లాహ్ చాలు. 4:46 مِّنَ الَّذِينَ هَادُوا يُحَرِّفُونَ الْكَلِمَ عَن مَّوَاضِعِهِ وَيَقُولُونَ سَمِعْنَا وَعَصَيْنَا وَاسْمَعْ غَيْرَ مُسْمَعٍ وَرَاعِنَا لَيًّا بِأَلْسِنَتِهِمْ وَطَعْنًا فِي الدِّينِ ۚ وَلَوْ أَنَّهُمْ قَالُوا سَمِعْنَا وَأَطَعْنَا وَاسْمَعْ وَانظُرْنَا لَكَانَ خَيْرًا لَّهُمْ وَأَقْوَمَ وَلَٰكِن لَّعَنَهُمُ اللَّهُ بِكُفْرِهِمْ فَلَا يُؤْمِنُونَ إِلَّا قَلِيلًا కొంతమంది యూదులు పదాలను వాటి నిజస్థానం నుంచి తారుమారు చేస్తారు. “మేము విన్నాము, అవిధేయులం అయ్యాము” అని వారంటారు. అంతేకాదు - “విను. నీకేమీ వినపడకూడదు. రాయినా” అని పలుకుతారు. అలా అనేటప్పుడు వారు తమ నాలుకను మెలి తిప్పుతారు. (ఇస్లాం) ధర్మాన్ని ఎగతాళి చేయాలన్నది అసలు వారి ఉద్దేశం. ఇలా అనే బదులు వారు, “మేము విన్నాము. విధేయులమయ్యాము” అనీ, “వినండి. మా వంక చూడండి” అని పలికి ఉంటే అది వారి కొరకు ఎంతో శ్రేయస్కరంగా, సమంజసంగా ఉండేది. కాని అల్లాహ్ వారి అవిశ్వాసం మూలంగా వారిని శపించాడు. ఇక వారిలో విశ్వసించేది బహుకొద్దిమంది మాత్రమే. 4:47 يَا أَيُّهَا الَّذِينَ أُوتُوا الْكِتَابَ آمِنُوا بِمَا نَزَّلْنَا مُصَدِّقًا لِّمَا مَعَكُم مِّن قَبْلِ أَن نَّطْمِسَ وُجُوهًا فَنَرُدَّهَا عَلَىٰ أَدْبَارِهَا أَوْ نَلْعَنَهُمْ كَمَا لَعَنَّا أَصْحَابَ السَّبْتِ ۚ وَكَانَ أَمْرُ اللَّهِ مَفْعُولًا ఓ గ్రంథవహులారా! మేము అవతరింపజేసిన దానిని విశ్వసించండి. అది మీ వద్ద ఉన్నదానిని ధృవీకరిస్తుంది. మేము ముఖాలను వికృతం చేసి, వీపు వైపుకు తిప్పకముందే లేక శనివారం వాళ్లను శపించినట్లుగా మేము వారినీ శపించక ముందే దీనిని (ఈ గ్రంథాన్ని) విశ్వసించండి. అల్లాహ్ తలచుకున్న పని ఇక అయిపోయినట్లే. 4:48 إِنَّ اللَّهَ لَا يَغْفِرُ أَن يُشْرَكَ بِهِ وَيَغْفِرُ مَا دُونَ ذَٰلِكَ لِمَن يَشَاءُ ۚ وَمَن يُشْرِكْ بِاللَّهِ فَقَدِ افْتَرَىٰ إِثْمًا عَظِيمًا తనకు భాగస్వామిగా మరొకరిని కల్పించటాన్ని (షిర్కును) అల్లాహ్ సుతరామూ క్షమించడు. ఇది తప్ప ఆయన తాను కోరిన వారి ఇతర పాపాలను క్షమిస్తాడు. అల్లాహ్‌కు భాగస్వామ్యం కల్పించినవాడు ఘోర పాపంతో కూడిన కల్పన చేశాడు. 4:49 أَلَمْ تَرَ إِلَى الَّذِينَ يُزَكُّونَ أَنفُسَهُم ۚ بَلِ اللَّهُ يُزَكِّي مَن يَشَاءُ وَلَا يُظْلَمُونَ فَتِيلًا తాము పవిత్రులమని ఆత్మస్తుతి చేసుకునే వారిని నువ్వు చూడలేదా? యదార్థానికి అల్లాహ్ తాను కోరిన వారిని పవిత్రులుగా చేస్తాడు. ఎవరికీ ఒక చిన్న పీచు అంత అన్యాయం కూడా జరగదు. 4:50 انظُرْ كَيْفَ يَفْتَرُونَ عَلَى اللَّهِ الْكَذِبَ ۖ وَكَفَىٰ بِهِ إِثْمًا مُّبِينًا వారు అల్లాహ్‌కు ఎలాంటి అసత్యాలను ఆపాదిస్తున్నారో చూడు! స్పష్టమైన పాపం కావటానికి ఈ ఒక్క చేష్ట చాలు. 4:51 أَلَمْ تَرَ إِلَى الَّذِينَ أُوتُوا نَصِيبًا مِّنَ الْكِتَابِ يُؤْمِنُونَ بِالْجِبْتِ وَالطَّاغُوتِ وَيَقُولُونَ لِلَّذِينَ كَفَرُوا هَٰؤُلَاءِ أَهْدَىٰ مِنَ الَّذِينَ آمَنُوا سَبِيلًا గ్రంథంలో కొంతభాగం ఇవ్వబడిన వారిని నీవు చూడలేదా? వారు విగ్రహాల (జిబ్త్)పై, మిథ్యాదైవాల (తాగూత్)పై విశ్వాసం కలిగి ఉన్నారు. అవిశ్వాసుల గురించి అభిప్రాయపడుతూ, “విశ్వాసుల కంటే వీరే చాలా వరకు సన్మార్గాన ఉన్నారు” అని అంటారు. 4:52 أُولَٰئِكَ الَّذِينَ لَعَنَهُمُ اللَّهُ ۖ وَمَن يَلْعَنِ اللَّهُ فَلَن تَجِدَ لَهُ نَصِيرًا అల్లాహ్ శపించింది కూడా వీరినే. అల్లాహ్ శాపానికి గురైన వారిని ఆదుకునే వాడెవణ్ణీ నీవు చూడవు. 4:53 أَمْ لَهُمْ نَصِيبٌ مِّنَ الْمُلْكِ فَإِذًا لَّا يُؤْتُونَ النَّاسَ نَقِيرًا రాజ్యాధికారంలో వారికేదన్నా భాగముందా? ఒకవేళ ఉంటే వారు జనులకు రవంత కూడా ఇవ్వరు. 4:54 أَمْ يَحْسُدُونَ النَّاسَ عَلَىٰ مَا آتَاهُمُ اللَّهُ مِن فَضْلِهِ ۖ فَقَدْ آتَيْنَا آلَ إِبْرَاهِيمَ الْكِتَابَ وَالْحِكْمَةَ وَآتَيْنَاهُم مُّلْكًا عَظِيمًا లేక అల్లాహ్ తన అనుగ్రహంతో ప్రజలకు ప్రసాదించిన దానిపై వారు అసూయ పడుతున్నారా? మేమైతే ఇబ్రాహీము సంతతికి గ్రంథాన్ని, వివేకాన్నీ ప్రసాదించాము. గొప్ప సామ్రాజ్యాన్ని కూడా వొసగాము. 4:55 فَمِنْهُم مَّنْ آمَنَ بِهِ وَمِنْهُم مَّن صَدَّ عَنْهُ ۚ وَكَفَىٰ بِجَهَنَّمَ سَعِيرًا తరువాత వారిలో కొందరు ఈ గ్రంథాన్ని విశ్వసించగా, కొందరు (విశ్వసించకుండా) ఆగిపోయారు. (వారిని) దహించటానికి నరకం చాలు. 4:56 إِنَّ الَّذِينَ كَفَرُوا بِآيَاتِنَا سَوْفَ نُصْلِيهِمْ نَارًا كُلَّمَا نَضِجَتْ جُلُودُهُم بَدَّلْنَاهُمْ جُلُودًا غَيْرَهَا لِيَذُوقُوا الْعَذَابَ ۗ إِنَّ اللَّهَ كَانَ عَزِيزًا حَكِيمًا మా ఆయతులను త్రోసిపుచ్చిన వారిని మేము అగ్నిలో పడవేస్తాము. వారి చర్మాలు బాగా ఉడికిపోయినప్పుడల్లా, వాటికి బదులుగా, వారు శిక్ష యొక్క రుచి చూసేందుకు వేరే చర్మాలను సృష్టిస్తాము. నిశ్చయంగా అల్లాహ్ సర్వాధిక్యుడు, వివేకవంతుడు. 4:57 وَالَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ سَنُدْخِلُهُمْ جَنَّاتٍ تَجْرِي مِن تَحْتِهَا الْأَنْهَارُ خَالِدِينَ فِيهَا أَبَدًا ۖ لَّهُمْ فِيهَا أَزْوَاجٌ مُّطَهَّرَةٌ ۖ وَنُدْخِلُهُمْ ظِلًّا ظَلِيلًا మరెవరు విశ్వసించి సత్కార్యాలు చేస్తారో వారిని మేము, క్రింద కాలువలు ప్రవహించే (స్వర్గ) వనాలలోకి తీసుకుపోతాము. వాటిలో వారు కలకాలం ఉంటారు. వారి కోసం అక్కడ పవిత్రులైన భార్యలుంటారు. ఇంకా మేము వారిని దట్టమైన నీడల్లోకి (మరియు పూరిపూర్ణ సౌఖ్యంలోకి) తీసుకుపోతాము. 4:58 إِنَّ اللَّهَ يَأْمُرُكُمْ أَن تُؤَدُّوا الْأَمَانَاتِ إِلَىٰ أَهْلِهَا وَإِذَا حَكَمْتُم بَيْنَ النَّاسِ أَن تَحْكُمُوا بِالْعَدْلِ ۚ إِنَّ اللَّهَ نِعِمَّا يَعِظُكُم بِهِ ۗ إِنَّ اللَّهَ كَانَ سَمِيعًا بَصِيرًا “ఎవరి అమానతులను వారికి అప్పగించండి. ప్రజల మధ్య తీర్పులు చేసేటప్పుడు న్యాయంగా తీర్పు చేయండి” అని అల్లాహ్ మిమ్మల్ని గట్టిగా ఆదేశిస్తున్నాడు. నిశ్చయంగా అల్లాహ్ మీకు చేసే ఉపదేశం ఎంతో చక్కనిది. నిస్సందేహంగా అల్లాహ్ అన్నీ వింటున్నాడు, చూస్తున్నాడు. 4:59 يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا أَطِيعُوا اللَّهَ وَأَطِيعُوا الرَّسُولَ وَأُولِي الْأَمْرِ مِنكُمْ ۖ فَإِن تَنَازَعْتُمْ فِي شَيْءٍ فَرُدُّوهُ إِلَى اللَّهِ وَالرَّسُولِ إِن كُنتُمْ تُؤْمِنُونَ بِاللَّهِ وَالْيَوْمِ الْآخِرِ ۚ ذَٰلِكَ خَيْرٌ وَأَحْسَنُ تَأْوِيلًا ఓ విశ్వాసులారా! అల్లాహ్‌కు విధేయత చూపండి. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)కు విధేయత చూపండి. మరియు మీలోని అధికారులకు కూడా. ఆపైన ఏ విషయంలోనైనా మీ మధ్య వివాదం తలెత్తితే దాన్ని అల్లాహ్ మరియు ప్రవక్త వైపుకు మరల్చండి - మీకు నిజంగా అల్లాహ్‌పై, అంతిమ దినంపై నమ్మకం ఉన్నట్లయితే (మీరిలా చేయటం అవశ్యం)! ఇదే మేలైన పద్ధతి. పరిణామం రీత్యా కూడా ఇదే అన్నింటికంటే ఉత్తమమైనది. 4:60 أَلَمْ تَرَ إِلَى الَّذِينَ يَزْعُمُونَ أَنَّهُمْ آمَنُوا بِمَا أُنزِلَ إِلَيْكَ وَمَا أُنزِلَ مِن قَبْلِكَ يُرِيدُونَ أَن يَتَحَاكَمُوا إِلَى الطَّاغُوتِ وَقَدْ أُمِرُوا أَن يَكْفُرُوا بِهِ وَيُرِيدُ الشَّيْطَانُ أَن يُضِلَّهُمْ ضَلَالًا بَعِيدًا (ఓ ప్రవక్తా!) నీపై అవతరించినదాన్నీ, నీకు పూర్వం వారిపై అవతరించిన దాన్నీ విశ్వసించాము అని అంటూనే తమ వ్యవహారాలను తీర్పు కోసం దైవేతరుల (తాగూత్) వద్దకు తీసుకు పోగోరే వారిని నీవు చూడలేదా? మరి నిజానికి షైతాన్ను (తాగూత్ను) తిరస్కరించమని వారికి (స్పష్టంగా) ఆదేశించటం జరిగింది. షైతానైతే వారిని మార్గం తప్పించి చాలా దూరంలో పడవేయాలని కోరుతున్నాడు. 4:61 وَإِذَا قِيلَ لَهُمْ تَعَالَوْا إِلَىٰ مَا أَنزَلَ اللَّهُ وَإِلَى الرَّسُولِ رَأَيْتَ الْمُنَافِقِينَ يَصُدُّونَ عَنكَ صُدُودًا “అల్లాహ్ అవతరింపజేసిన దాని వైపుకు, ప్రవక్త (సఅసం) వైపుకు రండి” అని వారితో అన్నప్పుడల్లా, ఈ కపటులు నీ నుండి అయిష్టంగా ముఖం త్రిప్పుకుని పోవటాన్ని నీవు గమనిస్తావు. 4:62 فَكَيْفَ إِذَا أَصَابَتْهُم مُّصِيبَةٌ بِمَا قَدَّمَتْ أَيْدِيهِمْ ثُمَّ جَاءُوكَ يَحْلِفُونَ بِاللَّهِ إِنْ أَرَدْنَا إِلَّا إِحْسَانًا وَتَوْفِيقًا మరి ఇదేమిటి? వారు తమ చేజేతులా చేసుకున్న దాని పర్యవసానంగా వారిపై ఏదన్నా ఆపద వచ్చిపడితే, అప్పుడు వారు నీ వద్దకు వచ్చి, అల్లాహ్‌పై ప్రమాణం చేస్తూ , “మేము మేలును, సయోధ్యను కాంక్షించి మాత్రమే ఇలా చేశాము” అని అంటారు. 4:63 أُولَٰئِكَ الَّذِينَ يَعْلَمُ اللَّهُ مَا فِي قُلُوبِهِمْ فَأَعْرِضْ عَنْهُمْ وَعِظْهُمْ وَقُل لَّهُمْ فِي أَنفُسِهِمْ قَوْلًا بَلِيغًا వారి హృదయాలలో ఉన్నదంతా అల్లాహ్‌కు బాగా తెలుసు. కనుక (ఓ ప్రవక్తా!) వారిని పట్టించుకోకు. కాకపోతే వారికి బోధపరుస్తూ ఉండు. వారి మనోక్షేత్రంలో నాటుకునేలా మాట చెబుతూ ఉండు. 4:64 وَمَا أَرْسَلْنَا مِن رَّسُولٍ إِلَّا لِيُطَاعَ بِإِذْنِ اللَّهِ ۚ وَلَوْ أَنَّهُمْ إِذ ظَّلَمُوا أَنفُسَهُمْ جَاءُوكَ فَاسْتَغْفَرُوا اللَّهَ وَاسْتَغْفَرَ لَهُمُ الرَّسُولُ لَوَجَدُوا اللَّهَ تَوَّابًا رَّحِيمًا మేము ఏ ప్రవక్తను పంపినా దైవాజ్ఞతో (ప్రజలు) అతనిని అనుసరించాలనే పంపాము. వారే గనక తమ ఆత్మలకు అన్యాయం చేసుకున్నప్పుడు, నీ వద్దకు వచ్చి క్షమాపణకై దైవాన్ని వేడుకుని ఉంటే, ప్రవక్త కూడా వారి మన్నింపుకై విన్నవించుకుని ఉంటే అప్పుడు వారు అల్లాహ్‌ను క్షమించేవాడుగా, కరుణించేవాడుగా పొంది ఉండేవారు. 4:65 فَلَا وَرَبِّكَ لَا يُؤْمِنُونَ حَتَّىٰ يُحَكِّمُوكَ فِيمَا شَجَرَ بَيْنَهُمْ ثُمَّ لَا يَجِدُوا فِي أَنفُسِهِمْ حَرَجًا مِّمَّا قَضَيْتَ وَيُسَلِّمُوا تَسْلِيمًا కనుక (ఓ ప్రవక్తా!) నీ ప్రభువు తోడు! వారు తమ పరస్పర వివాదాలన్నింటిలో నిన్ను తీర్పరిగా చేసుకోనంతవరకూ, తర్వాత నీవు వారి మధ్య చెప్పిన తీర్పుపట్ల వారు తమ మనసులలో ఎలాంటి సంకోచానికి, అసంతృప్తికి ఆస్కారం యివ్వకుండా మనస్ఫూర్తిగా శిరసావహించనంతవరకూ - వారు విశ్వాసులు కాజాలరు. 4:66 وَلَوْ أَنَّا كَتَبْنَا عَلَيْهِمْ أَنِ اقْتُلُوا أَنفُسَكُمْ أَوِ اخْرُجُوا مِن دِيَارِكُم مَّا فَعَلُوهُ إِلَّا قَلِيلٌ مِّنْهُمْ ۖ وَلَوْ أَنَّهُمْ فَعَلُوا مَا يُوعَظُونَ بِهِ لَكَانَ خَيْرًا لَّهُمْ وَأَشَدَّ تَثْبِيتًا ఒకవేళ మేము “మిమ్మల్ని మీరు చంపుకోండి” లేదా “మీ ఇళ్ల నుంచి వెళ్ళిపోండి” అనే ఆదేశాన్ని వారిపై విధించి ఉంటే, వారిలో బహుకొద్దిమంది మాత్రమే దాన్ని పాటించేవారు. అలా కాకుండా వారు తమకు ఉపదేశించబడుతున్న విధంగా చేసి వుంటే నిశ్చయంగా అది వారి కొరకు శ్రేయస్కరం అయ్యేది, ఎక్కువ స్థయిర్యాన్నీ ఒనగూర్చేది. 4:67 وَإِذًا لَّآتَيْنَاهُم مِّن لَّدُنَّا أَجْرًا عَظِيمًا అదేగనక జరిగి ఉంటే మేము మా వద్ద నుండి వారికి గొప్ప పుణ్యఫలం ప్రసాదించి ఉండేవాళ్ళం. 4:68 وَلَهَدَيْنَاهُمْ صِرَاطًا مُّسْتَقِيمًا ఇంకా వారికి రుజుమార్గం చూపించి ఉండేవాళ్ళం. 4:69 وَمَن يُطِعِ اللَّهَ وَالرَّسُولَ فَأُولَٰئِكَ مَعَ الَّذِينَ أَنْعَمَ اللَّهُ عَلَيْهِم مِّنَ النَّبِيِّينَ وَالصِّدِّيقِينَ وَالشُّهَدَاءِ وَالصَّالِحِينَ ۚ وَحَسُنَ أُولَٰئِكَ رَفِيقًا ఎవరయితే అల్లాహ్‌కు, ప్రవక్త (సఅసం)కు విధేయత కనబరుస్తారో వారే అల్లాహ్ అనుగ్రహం పొందిన ప్రవక్తలతోనూ, సత్య సంధులతోనూ, షహీదులతోనూ, సద్వర్తనులతోనూ ఉంటారు. వీరు ఎంతో మంచి స్నేహితులు. 4:70 ذَٰلِكَ الْفَضْلُ مِنَ اللَّهِ ۚ وَكَفَىٰ بِاللَّهِ عَلِيمًا ఇదీ అల్లాహ్ తరఫు నుంచి లభించే అనుగ్రహం. తెలుసుకోవటానికి అల్లాహ్‌యే చాలు. 4:71 يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا خُذُوا حِذْرَكُمْ فَانفِرُوا ثُبَاتٍ أَوِ انفِرُوا جَمِيعًا విశ్వాసులారా! మీరు మీ ఆత్మరక్షణా సామగ్రిని సమకూర్చుకోండి. ఆపైన వేర్వేరు దళాలుగా ఏర్పడి బయలుదేరండి లేదా అందరూ కలసికట్టుగా కదలండి. 4:72 وَإِنَّ مِنكُمْ لَمَن لَّيُبَطِّئَنَّ فَإِنْ أَصَابَتْكُم مُّصِيبَةٌ قَالَ قَدْ أَنْعَمَ اللَّهُ عَلَيَّ إِذْ لَمْ أَكُن مَّعَهُمْ شَهِيدًا మీలో కొందరు వెనుకాడేవారు కూడా ఉన్నారు. ఒకవేళ మీకు ఏదన్నా నష్టం వాటిల్లితే, “అల్లాహ్ నన్ను అనుగ్రహించాడు. ఆ సమయంలో నేను వారివెంట లేను” అని అంటారు. 4:73 وَلَئِنْ أَصَابَكُمْ فَضْلٌ مِّنَ اللَّهِ لَيَقُولَنَّ كَأَن لَّمْ تَكُن بَيْنَكُمْ وَبَيْنَهُ مَوَدَّةٌ يَا لَيْتَنِي كُنتُ مَعَهُمْ فَأَفُوزَ فَوْزًا عَظِيمًا ఒకవేళ దైవానుగ్రహం ఏదన్నా మీకు లభిస్తే, మీ మధ్య- అతని మధ్య స్నేహబంధమే లేనట్లుగా మాట్లాడుతూ - “అరెరే! నేనూ వారి వెంట ఉండి ఉంటే ఘనవిజయాన్ని పొంది ఉండేవాడినే!” అని చెబుతారు. 4:74 فَلْيُقَاتِلْ فِي سَبِيلِ اللَّهِ الَّذِينَ يَشْرُونَ الْحَيَاةَ الدُّنْيَا بِالْآخِرَةِ ۚ وَمَن يُقَاتِلْ فِي سَبِيلِ اللَّهِ فَيُقْتَلْ أَوْ يَغْلِبْ فَسَوْفَ نُؤْتِيهِ أَجْرًا عَظِيمًا కాబట్టి ఇహలోక జీవితాన్ని పరలోకానికి బదులుగా అమ్మి వేసినవారు దైవమార్గంలో పోరాడాలి. దైవమార్గంలో పోరాడుతూ చంపబడినవానికి లేదా విజయం పొందినవానికి మేము గొప్ప పుణ్యఫలాన్ని వొసగుతాము. 4:75 وَمَا لَكُمْ لَا تُقَاتِلُونَ فِي سَبِيلِ اللَّهِ وَالْمُسْتَضْعَفِينَ مِنَ الرِّجَالِ وَالنِّسَاءِ وَالْوِلْدَانِ الَّذِينَ يَقُولُونَ رَبَّنَا أَخْرِجْنَا مِنْ هَٰذِهِ الْقَرْيَةِ الظَّالِمِ أَهْلُهَا وَاجْعَل لَّنَا مِن لَّدُنكَ وَلِيًّا وَاجْعَل لَّنَا مِن لَّدُنكَ نَصِيرًا “మా ప్రభూ! దుర్మార్గుల ఈ పురము నుండి మాకు విముక్తి నొసగు. మా కొరకు నీ వద్దనుంచి ఒక రక్షకుణ్ణి నియమించు, మాకు (అండగా) నీ వద్ద నుంచి ఒక సహాయకుణ్ణి పంపించు” అని వేడుకుంటున్న బలహీన పురుషుల, స్త్రీల, పసివాళ్ళ విమోచనకై మీరు దైవమార్గంలో ఎందుకు పోరాడటం లేదు?! 4:76 الَّذِينَ آمَنُوا يُقَاتِلُونَ فِي سَبِيلِ اللَّهِ ۖ وَالَّذِينَ كَفَرُوا يُقَاتِلُونَ فِي سَبِيلِ الطَّاغُوتِ فَقَاتِلُوا أَوْلِيَاءَ الشَّيْطَانِ ۖ إِنَّ كَيْدَ الشَّيْطَانِ كَانَ ضَعِيفًا విశ్వసించినవారు దైవమార్గంలో పోరాడతారు. అవిశ్వాస వైఖరిని అవలంబించినవారు దైవేతరుల మార్గంలో పోరాడతారు. కనుక (ఓ విశ్వాసులారా!) మీరు షైతాను స్నేహితులతో యుద్ధం చేయండి. షైతాను జిత్తులు అత్యంత బలహీనమైనవి. 4:77 أَلَمْ تَرَ إِلَى الَّذِينَ قِيلَ لَهُمْ كُفُّوا أَيْدِيَكُمْ وَأَقِيمُوا الصَّلَاةَ وَآتُوا الزَّكَاةَ فَلَمَّا كُتِبَ عَلَيْهِمُ الْقِتَالُ إِذَا فَرِيقٌ مِّنْهُمْ يَخْشَوْنَ النَّاسَ كَخَشْيَةِ اللَّهِ أَوْ أَشَدَّ خَشْيَةً ۚ وَقَالُوا رَبَّنَا لِمَ كَتَبْتَ عَلَيْنَا الْقِتَالَ لَوْلَا أَخَّرْتَنَا إِلَىٰ أَجَلٍ قَرِيبٍ ۗ قُلْ مَتَاعُ الدُّنْيَا قَلِيلٌ وَالْآخِرَةُ خَيْرٌ لِّمَنِ اتَّقَىٰ وَلَا تُظْلَمُونَ فَتِيلًا “మీ చేతులను ఆపుకోండి, నమాజులను నెలకొల్పుతూ ఉండండి, జకాతును చెల్లిస్తూ ఉండండి” అని ఆదేశించబడిన వారిని నీవు చూడలేదా? తీరా వారికి యుద్ధం చెయ్యమని ఆజ్ఞాపించబడితే, వారిలోని ఒక వర్గంవారు అల్లాహ్‌కు భయపడవలసిన రీతిలో- పైగా అంతకంటే ఎక్కువగానే- జనులకు భయపడసాగారు. “ప్రభూ! నీవు మాపై యుద్ధాన్ని ఎందుకు విధించావు? మరి కొంతకాలంపాటు మమ్మల్ని ఎందుకు బ్రతకనివ్వలేదు?” అని అనసాగారు. వారితో ఇలా చెప్పు: ప్రాపంచిక ప్రయోజనాలు బహు స్వల్పమైనవి. (అల్లాహ్‌కు) భయపడేవారికి పరలోకమే మేలైనది. మీకు (అక్కడ) ఒక చిన్న పీచు అంత అన్యాయం కూడా జరగదు. 4:78 أَيْنَمَا تَكُونُوا يُدْرِككُّمُ الْمَوْتُ وَلَوْ كُنتُمْ فِي بُرُوجٍ مُّشَيَّدَةٍ ۗ وَإِن تُصِبْهُمْ حَسَنَةٌ يَقُولُوا هَٰذِهِ مِنْ عِندِ اللَّهِ ۖ وَإِن تُصِبْهُمْ سَيِّئَةٌ يَقُولُوا هَٰذِهِ مِنْ عِندِكَ ۚ قُلْ كُلٌّ مِّنْ عِندِ اللَّهِ ۖ فَمَالِ هَٰؤُلَاءِ الْقَوْمِ لَا يَكَادُونَ يَفْقَهُونَ حَدِيثًا మీరెక్కడ ఉన్నాసరే, మృత్యువు మిమ్మల్ని కబళిస్తుంది. ఆఖరికి మీరు పటిష్టమైన కోటలలో ఉన్నాసరే (అది మిమ్మల్ని వదలదు). వారికేదైనా మంచి జరిగితే, “ఇది అల్లాహ్ తరఫున లభించింది” అని అంటారు. అదే వారికేదైనా కీడు కలిగితే, “ఇదంతా నీ మూలంగానే జరిగింది” అని నిందిస్తారు. “ఇవన్నీ వాస్తవానికి అల్లాహ్ తరఫుననే సంభవించాయి” అని (ఓ ప్రవక్తా!) వారికి తెలియజేయి. అసలు వీరికేమైపోయిందీ? ఏ విషయాన్ని కూడా వీరు బొత్తిగా అర్థం చేసుకోరే?! 4:79 مَّا أَصَابَكَ مِنْ حَسَنَةٍ فَمِنَ اللَّهِ ۖ وَمَا أَصَابَكَ مِن سَيِّئَةٍ فَمِن نَّفْسِكَ ۚ وَأَرْسَلْنَاكَ لِلنَّاسِ رَسُولًا ۚ وَكَفَىٰ بِاللَّهِ شَهِيدًا నీకు ఏ మంచి జరిగినా అది అల్లాహ్ తరఫు నుంచే జరుగుతుంది. నీకు ఏదైనా చెడు జరిగితే అది నీ స్వయంకృతమే. (ఓ ముహమ్మద్!) మేము నిన్ను సమస్త జనులకు సందేశం అందజేసేవానిగా చేసి పంపాము. దీనికి సాక్షిగా అల్లాహ్ చాలు. 4:80 مَّن يُطِعِ الرَّسُولَ فَقَدْ أَطَاعَ اللَّهَ ۖ وَمَن تَوَلَّىٰ فَمَا أَرْسَلْنَاكَ عَلَيْهِمْ حَفِيظًا ఈ ప్రవక్త (సఅసం)కు విధేయత చూపినవాడు అల్లాహ్‌కు విధేయత చూపినట్లే. మరెవరైతే విముఖత చూపుతారో వారిపై మేము నిన్ను కావలివానిగా చేసి పంపలేదు. 4:81 وَيَقُولُونَ طَاعَةٌ فَإِذَا بَرَزُوا مِنْ عِندِكَ بَيَّتَ طَائِفَةٌ مِّنْهُمْ غَيْرَ الَّذِي تَقُولُ ۖ وَاللَّهُ يَكْتُبُ مَا يُبَيِّتُونَ ۖ فَأَعْرِضْ عَنْهُمْ وَتَوَكَّلْ عَلَى اللَّهِ ۚ وَكَفَىٰ بِاللَّهِ وَكِيلًا తాము విధేయత చూపుతున్నట్లు వారు నీ ముందర ప్రకటిస్తారు. కాని నీ దగ్గర నుంచి వెళ్ళిపోయిన తరువాత, వారిలోని ఒక వర్గం వారు రాత్రివేళల్లో సమావేశమై తాము చెప్పినదానికి వ్యతిరేకంగా మంతనాలు జరుపుతారు. రాత్రిపూట వారు జరిపే రహస్య మంతనాలను అల్లాహ్ నమోదు చేసుకుంటున్నాడు. కనుక (ఓ ముహమ్మద్!) వారిని పట్టించుకోకు. అల్లాహ్‌పైనే ఆధారపడి ఉండు. కార్యసాధనకై అల్లాహ్‌యే చాలు. 4:82 أَفَلَا يَتَدَبَّرُونَ الْقُرْآنَ ۚ وَلَوْ كَانَ مِنْ عِندِ غَيْرِ اللَّهِ لَوَجَدُوا فِيهِ اخْتِلَافًا كَثِيرًا ఏమిటీ, వారు ఖుర్ఆన్ గురించి యోచన చేయరా? ఒకవేళ ఇది గనక అల్లాహ్ తరఫు నుంచి గాక ఇంకొకరి తరఫు నుంచి వచ్చి ఉంటే అందులో వారికి ఎంతో వైరుద్ధ్యం కనపడేది. 4:83 وَإِذَا جَاءَهُمْ أَمْرٌ مِّنَ الْأَمْنِ أَوِ الْخَوْفِ أَذَاعُوا بِهِ ۖ وَلَوْ رَدُّوهُ إِلَى الرَّسُولِ وَإِلَىٰ أُولِي الْأَمْرِ مِنْهُمْ لَعَلِمَهُ الَّذِينَ يَسْتَنبِطُونَهُ مِنْهُمْ ۗ وَلَوْلَا فَضْلُ اللَّهِ عَلَيْكُمْ وَرَحْمَتُهُ لَاتَّبَعْتُمُ الشَّيْطَانَ إِلَّا قَلِيلًا శాంతికి సంబంధించిన వార్తగానీ, భయాందోళనల్ని కలిగించే సమాచారంగానీ ఏదైనా వారికి అందినప్పుడు దాన్ని వారు చాటింపు వేసేస్తారు. దానికి బదులు వారు ఆ విషయాన్ని ప్రవక్తకు, విషయం లోతుల్లోకి వెళ్ళే తమలోని విజ్ఞులకు చేరవేసి ఉంటే వారు అందలి నిజానిజాలను, ఉచితానుచితాలను పరికించి ఒక నిర్ణయానికి రావటానికి ఆస్కారముండేది. దైవానుగ్రహం, ఆయన కారుణ్యమే గనక మీపై లేకుండినట్లయితే మీలో కొందరు తప్ప - అందరూ షైతాను అనుయాయులుగా మారిపోయేవారు. 4:84 فَقَاتِلْ فِي سَبِيلِ اللَّهِ لَا تُكَلَّفُ إِلَّا نَفْسَكَ ۚ وَحَرِّضِ الْمُؤْمِنِينَ ۖ عَسَى اللَّهُ أَن يَكُفَّ بَأْسَ الَّذِينَ كَفَرُوا ۚ وَاللَّهُ أَشَدُّ بَأْسًا وَأَشَدُّ تَنكِيلًا కనుక నీవు అల్లాహ్ మార్గంలో యుద్ధం చెయ్యి. నీవు నీ స్వయానికి మాత్రమే బాధ్యుడవు. అయితే విశ్వసించిన వారిని (యుద్ధం చేయమని) ప్రేరేపిస్తూ ఉండు. త్వరలో అల్లాహ్ అవిశ్వాసుల యుద్ధాన్ని ఆపినా ఆపి వేయవచ్చు! అల్లాహ్ అందరికంటే గొప్ప శక్తిగలవాడు, శిక్షించటంలో కూడా చాలా కఠినుడు. 4:85 مَّن يَشْفَعْ شَفَاعَةً حَسَنَةً يَكُن لَّهُ نَصِيبٌ مِّنْهَا ۖ وَمَن يَشْفَعْ شَفَاعَةً سَيِّئَةً يَكُن لَّهُ كِفْلٌ مِّنْهَا ۗ وَكَانَ اللَّهُ عَلَىٰ كُلِّ شَيْءٍ مُّقِيتًا ఎవరయినా ఒక మంచి పని కోసం సిఫారసు చేస్తే, అతనికి అందులో కొంత భాగం లభిస్తుంది. మరెవరయినా ఒక చెడు పని కోసం సిఫారసు చేస్తే, ఆ పాపంలో అతనికీ వాటా ఉంటుంది. అల్లాహ్ అన్నింటిపై అదుపు అజమాయిషీ కలవాడు. 4:86 وَإِذَا حُيِّيتُم بِتَحِيَّةٍ فَحَيُّوا بِأَحْسَنَ مِنْهَا أَوْ رُدُّوهَا ۗ إِنَّ اللَّهَ كَانَ عَلَىٰ كُلِّ شَيْءٍ حَسِيبًا ఎవరయినా మీకు 'సలాం' చేసినప్పుడు మీరు అంతకంటే ఉత్తమరీతిలో జవాబు ఇవ్వండి లేదా కనీసం అదే విధంగానైనా చెప్పండి. నిశ్చయంగా అల్లాహ్ ప్రతిదానికీ లెక్క తీసుకుంటాడు. 4:87 اللَّهُ لَا إِلَٰهَ إِلَّا هُوَ ۚ لَيَجْمَعَنَّكُمْ إِلَىٰ يَوْمِ الْقِيَامَةِ لَا رَيْبَ فِيهِ ۗ وَمَنْ أَصْدَقُ مِنَ اللَّهِ حَدِيثًا అల్లాహ్ - ఆయన తప్ప మరో ఆరాధ్య దైవం లేడు. ఆయన మిమ్మల్నందరినీ ప్రళయదినాన సమీకరిస్తాడు. ఆ రోజు (రావటం)లో సందేహానికి తావేలేదు. అల్లాహ్ మాటకన్నా సత్యమైన మాట మరెవరిది కాగలదు? 4:88 فَمَا لَكُمْ فِي الْمُنَافِقِينَ فِئَتَيْنِ وَاللَّهُ أَرْكَسَهُم بِمَا كَسَبُوا ۚ أَتُرِيدُونَ أَن تَهْدُوا مَنْ أَضَلَّ اللَّهُ ۖ وَمَن يُضْلِلِ اللَّهُ فَلَن تَجِدَ لَهُ سَبِيلًا మీకేమైపోయిందీ? కపటుల విషయంలో మీరు రెండు వర్గాలుగా అయిపోతున్నారు? వాస్తవానికి వారి స్వయంకృతాల మూలంగా అల్లాహ్ వారిని వెనక్కి మరలించాడు. ఏమిటీ, అల్లాహ్ సన్మార్గం నుంచి తప్పించిన వారిని మీరు సన్మార్గానికి తీసుకురాదలుస్తున్నారా? అల్లాహ్ అపమార్గం పట్టించినవారి కోసం నీవు ఎన్నటికీ ఏ మార్గం కనుగొనలేవు సుమా! 4:89 وَدُّوا لَوْ تَكْفُرُونَ كَمَا كَفَرُوا فَتَكُونُونَ سَوَاءً ۖ فَلَا تَتَّخِذُوا مِنْهُمْ أَوْلِيَاءَ حَتَّىٰ يُهَاجِرُوا فِي سَبِيلِ اللَّهِ ۚ فَإِن تَوَلَّوْا فَخُذُوهُمْ وَاقْتُلُوهُمْ حَيْثُ وَجَدتُّمُوهُمْ ۖ وَلَا تَتَّخِذُوا مِنْهُمْ وَلِيًّا وَلَا نَصِيرًا తాము అవిశ్వాసులుగా ఉన్నట్లే మీరు కూడా అవిశ్వాస వైఖరిని అవలంబించి, ఆపైన అందరూ ఒకేలాగా అయిపోవాలన్నది వారి ఆకాంక్ష! కనుక వారు దైవమార్గంలో తమ స్వస్థలాన్ని వదలి బయలుదేరనంతవరకూ, వారిలో ఎవరినీ మీ స్నేహితులుగా చేసుకోకండి. ఒకవేళ వారు విముఖులైపోతే వారిని పట్టుకోండి. ఎక్కడ దొరికితే అక్కడ వారిని చంపండి. జాగ్రత్త! వారిలో ఎవరినీ మీ మిత్రునిగా, సహాయకునిగా భావించకండి. 4:90 إِلَّا الَّذِينَ يَصِلُونَ إِلَىٰ قَوْمٍ بَيْنَكُمْ وَبَيْنَهُم مِّيثَاقٌ أَوْ جَاءُوكُمْ حَصِرَتْ صُدُورُهُمْ أَن يُقَاتِلُوكُمْ أَوْ يُقَاتِلُوا قَوْمَهُمْ ۚ وَلَوْ شَاءَ اللَّهُ لَسَلَّطَهُمْ عَلَيْكُمْ فَلَقَاتَلُوكُمْ ۚ فَإِنِ اعْتَزَلُوكُمْ فَلَمْ يُقَاتِلُوكُمْ وَأَلْقَوْا إِلَيْكُمُ السَّلَمَ فَمَا جَعَلَ اللَّهُ لَكُمْ عَلَيْهِمْ سَبِيلًا అయితే మీతో ఒప్పందం చేసుకున్న వారితో కలసిపోయిన వారికీ, లేదా ఇటు మీతోనూ, అటు తమ వర్గం వారితోనూ యుద్ధం చేయటానికి మనసొప్పక మీ దగ్గరకు వచ్చే వారికి మాత్రం ఈ ఆజ్ఞ నుండి మినహాయింపు ఉంది. అల్లాహ్‌యే గనక తలిస్తే మీపై వారికి ప్రాబల్యాన్ని ఒసగేవాడే. అదేగనక జరిగితే వారు మీతో యుద్ధం చేసేవారే. కాబట్టి వారు మీ దారినుంచి తప్పుకుని, మీతో యుద్ధం చేయకుండా, సంధి కోసం ప్రయత్నిస్తే (అప్పుడు వారిపై దాడి జరపటానికి) అల్లాహ్ మీకు మార్గం తెరచి ఉంచలేదు. 4:91 سَتَجِدُونَ آخَرِينَ يُرِيدُونَ أَن يَأْمَنُوكُمْ وَيَأْمَنُوا قَوْمَهُمْ كُلَّ مَا رُدُّوا إِلَى الْفِتْنَةِ أُرْكِسُوا فِيهَا ۚ فَإِن لَّمْ يَعْتَزِلُوكُمْ وَيُلْقُوا إِلَيْكُمُ السَّلَمَ وَيَكُفُّوا أَيْدِيَهُمْ فَخُذُوهُمْ وَاقْتُلُوهُمْ حَيْثُ ثَقِفْتُمُوهُمْ ۚ وَأُولَٰئِكُمْ جَعَلْنَا لَكُمْ عَلَيْهِمْ سُلْطَانًا مُّبِينًا వారిలో మరి కొంతమందిని కూడా మీరు చూస్తారు. వారు (పైకి) మీ నుంచి, తమ వర్గం వారి నుంచి శాంతిగా ఉండాలని కోరుకుంటారు. (కాని) ఎప్పుడైనా ఉపద్రవం వైపు మరలించ బడితే మాత్రం పిల్లిమొగ్గలు వేస్తారు. వారు గనక మీకు దూరంగా ఉండకపోతే, మీకు స్నేహ హస్తం అందించకపోతే, (యుద్ధం నుంచి) తమ చేతులను ఆపి ఉంచకపోతే వారిని పట్టుకోండి, ఎక్కడ దొరికితే అక్కడే వారిని హతమార్చండి. మేము మీకు స్పష్టమయిన అధికారాన్ని ప్రసాదించినది వీరి పైనే. 4:92 وَمَا كَانَ لِمُؤْمِنٍ أَن يَقْتُلَ مُؤْمِنًا إِلَّا خَطَأً ۚ وَمَن قَتَلَ مُؤْمِنًا خَطَأً فَتَحْرِيرُ رَقَبَةٍ مُّؤْمِنَةٍ وَدِيَةٌ مُّسَلَّمَةٌ إِلَىٰ أَهْلِهِ إِلَّا أَن يَصَّدَّقُوا ۚ فَإِن كَانَ مِن قَوْمٍ عَدُوٍّ لَّكُمْ وَهُوَ مُؤْمِنٌ فَتَحْرِيرُ رَقَبَةٍ مُّؤْمِنَةٍ ۖ وَإِن كَانَ مِن قَوْمٍ بَيْنَكُمْ وَبَيْنَهُم مِّيثَاقٌ فَدِيَةٌ مُّسَلَّمَةٌ إِلَىٰ أَهْلِهِ وَتَحْرِيرُ رَقَبَةٍ مُّؤْمِنَةٍ ۖ فَمَن لَّمْ يَجِدْ فَصِيَامُ شَهْرَيْنِ مُتَتَابِعَيْنِ تَوْبَةً مِّنَ اللَّهِ ۗ وَكَانَ اللَّهُ عَلِيمًا حَكِيمًا ఒక విశ్వాసి మరో విశ్వాసిని చంపటం ఎంతమాత్రం తగదు. పొరపాటున జరిగితే అది వేరే విషయం. ఎవరయినా పొరపాటున ఒక ముస్లింను చంపితే దానికి పరిహారంగా ఒక ముస్లిం బానిసను బానిసత్వం నుంచి విడిపించాలి. ఇంకా హతుని కుటుంబీకులకు రక్త పరిహారం చెల్లించాలి. ఒకవేళ వారు క్షమాభిక్షపెడితే అది వేరే విషయం. కాని చంపబడిన వ్యక్తి, శత్రు వర్గానికి చెందినవాడై, అతను ముస్లిం కూడా అయి వుంటే అట్టి పరిస్థితిలో ఒక్క ముస్లిం బానిసకు విముక్తి నొసగాలి. ఒకవేళ హతుడు మీతో ఒడంబడిక చేసుకున్న జాతికి చెందినవాడైనపుడు రక్త పరిహారాన్ని అతని కుటుంబీకులకు చెల్లించి తీరాలి. (దాంతో పాటు) ఒక ముస్లిం బానిసను కూడా స్వతంత్రుడ్ని చేయాలి. బానిసకు విముక్తి నొసగే స్థోమత లేనివారు ఎడతెగకుండా రెండు మాసాలు ఉపవాసం ఉండాలి. అల్లాహ్ నుంచి క్షమాభిక్ష పొందటానికి (ఈ పద్ధతి సూచించబడింది). అల్లాహ్ అన్నీ తెలిసినవాడు, వివేచనా పరుడూను. 4:93 وَمَن يَقْتُلْ مُؤْمِنًا مُّتَعَمِّدًا فَجَزَاؤُهُ جَهَنَّمُ خَالِدًا فِيهَا وَغَضِبَ اللَّهُ عَلَيْهِ وَلَعَنَهُ وَأَعَدَّ لَهُ عَذَابًا عَظِيمًا ఇక ఉద్దేశ్యపూర్వకంగా ఒక విశ్వాసిని చంపేవానికి ప్రతిఫలం నరకమే. అందులో వాడు కలకాలం పడి ఉంటాడు. వాడిపై దైవాగ్రహం, ఆయన శాపం పడుతుంది. ఇంకా ఆయన అతని కోసం పెద్ద శిక్షను సిద్ధం చేసి ఉంచాడు. 4:94 يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا إِذَا ضَرَبْتُمْ فِي سَبِيلِ اللَّهِ فَتَبَيَّنُوا وَلَا تَقُولُوا لِمَنْ أَلْقَىٰ إِلَيْكُمُ السَّلَامَ لَسْتَ مُؤْمِنًا تَبْتَغُونَ عَرَضَ الْحَيَاةِ الدُّنْيَا فَعِندَ اللَّهِ مَغَانِمُ كَثِيرَةٌ ۚ كَذَٰلِكَ كُنتُم مِّن قَبْلُ فَمَنَّ اللَّهُ عَلَيْكُمْ فَتَبَيَّنُوا ۚ إِنَّ اللَّهَ كَانَ بِمَا تَعْمَلُونَ خَبِيرًا ఓ విశ్వాసులారా! మీరు దైవమార్గంలో వెళ్తున్నప్పుడు నిజానిజాలను తెలుసుకొని వ్యవహరించండి. ఎవరయినా మీకు సలాం చేస్తే దానికి సమాధానంగా 'నీవు విశ్వాసివి కావు' అని అనకండి. మీరు ప్రాపంచిక జీవన సామగ్రిని అన్వేషించటంలో పడి ఉన్నారేమో! అయితే అల్లాహ్ వద్ద విజయధనం పుష్కలంగా ఉంది. లోగడ మీరు కూడా ఇలాగే ఉండేవారు. కాని తరువాత అల్లాహ్ మిమ్మల్ని కటాక్షించాడు. కనుక మీరు విషయాన్ని పరికించి మరీ మసలుకోండి. నిస్సందేహంగా అల్లాహ్‌కు మీరు చేసేదంతా తెలుసు. 4:95 لَّا يَسْتَوِي الْقَاعِدُونَ مِنَ الْمُؤْمِنِينَ غَيْرُ أُولِي الضَّرَرِ وَالْمُجَاهِدُونَ فِي سَبِيلِ اللَّهِ بِأَمْوَالِهِمْ وَأَنفُسِهِمْ ۚ فَضَّلَ اللَّهُ الْمُجَاهِدِينَ بِأَمْوَالِهِمْ وَأَنفُسِهِمْ عَلَى الْقَاعِدِينَ دَرَجَةً ۚ وَكُلًّا وَعَدَ اللَّهُ الْحُسْنَىٰ ۚ وَفَضَّلَ اللَّهُ الْمُجَاهِدِينَ عَلَى الْقَاعِدِينَ أَجْرًا عَظِيمًا ఏ కారణమూ లేకుండా (ఇంటి పట్టున) కూర్చుండిపోయే విశ్వాసులు, దైవమార్గంలో తమ ధన ప్రాణాలతో పోరాడే విశ్వాసులూ సమానులు కాలేరు. తమ ధనప్రాణాలతో పోరాడేవారికి అల్లాహ్ ఇంట్లో కూర్చుని ఉండేవారిపై అంతస్థుల రీత్యా ఎంతో ఉన్నతిని ప్రసాదించాడు. ఆ మాటకొస్తే అల్లాహ్ ప్రతి ఒక్కరికీ ఉత్తమ ప్రతిఫలం ఇస్తానని వాగ్దానం చేసి ఉన్నాడు. అయితే ఆయన కూర్చుని ఉండే వారిపై ముజాహిద్ (యోధు)లకు గొప్ప ప్రతిఫలం ద్వారా శ్రేష్ఠతను ప్రసాదించాడు. 4:96 دَرَجَاتٍ مِّنْهُ وَمَغْفِرَةً وَرَحْمَةً ۚ وَكَانَ اللَّهُ غَفُورًا رَّحِيمًا ఆయన తరఫున వారి కొరకు ఉన్నత స్థానాలూ ఉన్నాయి. మన్నింపు మరియు కారుణ్యం కూడా ఉంది. అల్లాహ్ క్షమించేవాడు, కరుణించేవాడు కూడాను. 4:97 إِنَّ الَّذِينَ تَوَفَّاهُمُ الْمَلَائِكَةُ ظَالِمِي أَنفُسِهِمْ قَالُوا فِيمَ كُنتُمْ ۖ قَالُوا كُنَّا مُسْتَضْعَفِينَ فِي الْأَرْضِ ۚ قَالُوا أَلَمْ تَكُنْ أَرْضُ اللَّهِ وَاسِعَةً فَتُهَاجِرُوا فِيهَا ۚ فَأُولَٰئِكَ مَأْوَاهُمْ جَهَنَّمُ ۖ وَسَاءَتْ مَصِيرًا ఎవరయితే తమకు తాము అన్యాయం చేసుకుంటూ ఉన్నారో, వారి ప్రాణాలను తీసేటప్పుడు దైవదూతలు, “మీరే స్థితిలో ఉండేవారు?” అని వారిని అడుగుతారు. దానికి వారు, “మేము మా ప్రదేశంలో బలహీనులముగా, (నిస్సహాయులంగా) ఉండేవారము” అని బదులిస్తారు. “ఏమిటీ? మీరు (ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి) వలసపోవటానికి దేవుని భూమి విశాలంగా లేదా?” అని దైవ దూతలు వారిని అడుగుతారు. వీరి నివాస స్థలమే నరకం. అది అత్యంత చెడ్డ గమ్య స్థానం. 4:98 إِلَّا الْمُسْتَضْعَفِينَ مِنَ الرِّجَالِ وَالنِّسَاءِ وَالْوِلْدَانِ لَا يَسْتَطِيعُونَ حِيلَةً وَلَا يَهْتَدُونَ سَبِيلًا అయితే నిజంగానే ఏ సాధన సంపత్తి లేని, దారి తెలియని నిస్సహాయులైన పురుషుల, స్త్రీల, పసివాళ్ళ (సంగతి వేరు). 4:99 فَأُولَٰئِكَ عَسَى اللَّهُ أَن يَعْفُوَ عَنْهُمْ ۚ وَكَانَ اللَّهُ عَفُوًّا غَفُورًا అల్లాహ్ వారిని మన్నించవచ్చు! అల్లాహ్ మన్నించేవాడు, క్షమాభిక్ష పెట్టేవాడు. 4:100 وَمَن يُهَاجِرْ فِي سَبِيلِ اللَّهِ يَجِدْ فِي الْأَرْضِ مُرَاغَمًا كَثِيرًا وَسَعَةً ۚ وَمَن يَخْرُجْ مِن بَيْتِهِ مُهَاجِرًا إِلَى اللَّهِ وَرَسُولِهِ ثُمَّ يُدْرِكْهُ الْمَوْتُ فَقَدْ وَقَعَ أَجْرُهُ عَلَى اللَّهِ ۗ وَكَانَ اللَّهُ غَفُورًا رَّحِيمًا అల్లాహ్ మార్గంలో తన స్వస్థలాన్ని వదలి వలసపోయిన వాడు భూమండలంలో ఎన్నో ఆశ్రయాలను, విస్తృతిని పొందుతాడు. అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త (సఅసం) వైపుకు వలస వెళ్ళటానికి తన గృహం నుంచి బయలుదేరి దారిలో మృత్యువాతన పడిన వానికి పుణ్యఫలం ప్రసాదించే బాధ్యత అల్లాహ్‌ది. అల్లాహ్ అపారంగా క్షమించేవాడు, అమితంగా కరుణించేవాడు. 4:101 وَإِذَا ضَرَبْتُمْ فِي الْأَرْضِ فَلَيْسَ عَلَيْكُمْ جُنَاحٌ أَن تَقْصُرُوا مِنَ الصَّلَاةِ إِنْ خِفْتُمْ أَن يَفْتِنَكُمُ الَّذِينَ كَفَرُوا ۚ إِنَّ الْكَافِرِينَ كَانُوا لَكُمْ عَدُوًّا مُّبِينًا మీరు ప్రయాణంలో ఉన్నప్పుడు, అవిశ్వాసులు మిమ్మల్ని వేధిస్తారనే భయం గనక మీకుంటే, మీరు నమాజులను కుదించుకోవటంలో తప్పులేదు. నిశ్చయంగా అవిశ్వాసులు మీ బహిరంగ శత్రువులే. 4:102 وَإِذَا كُنتَ فِيهِمْ فَأَقَمْتَ لَهُمُ الصَّلَاةَ فَلْتَقُمْ طَائِفَةٌ مِّنْهُم مَّعَكَ وَلْيَأْخُذُوا أَسْلِحَتَهُمْ فَإِذَا سَجَدُوا فَلْيَكُونُوا مِن وَرَائِكُمْ وَلْتَأْتِ طَائِفَةٌ أُخْرَىٰ لَمْ يُصَلُّوا فَلْيُصَلُّوا مَعَكَ وَلْيَأْخُذُوا حِذْرَهُمْ وَأَسْلِحَتَهُمْ ۗ وَدَّ الَّذِينَ كَفَرُوا لَوْ تَغْفُلُونَ عَنْ أَسْلِحَتِكُمْ وَأَمْتِعَتِكُمْ فَيَمِيلُونَ عَلَيْكُم مَّيْلَةً وَاحِدَةً ۚ وَلَا جُنَاحَ عَلَيْكُمْ إِن كَانَ بِكُمْ أَذًى مِّن مَّطَرٍ أَوْ كُنتُم مَّرْضَىٰ أَن تَضَعُوا أَسْلِحَتَكُمْ ۖ وَخُذُوا حِذْرَكُمْ ۗ إِنَّ اللَّهَ أَعَدَّ لِلْكَافِرِينَ عَذَابًا مُّهِينًا (ఓ ప్రవక్తా!) నీవు వారి మధ్య ఉన్నప్పుడు, వారి కోసం నమాజును మొదలుపెట్టినప్పుడు, వారిలోని ఒక సమూహం తమ ఆయుధాలను తీసుకొని నీ వెంట నిలబడాలి. మరి వారు సజ్దా చేయగానే మీ వెనక్కి వెళ్ళిపోవాలి. అప్పటి వరకూ నమాజ్‌లో పాల్గొనని రెండవ సమూహం వచ్చి నీతోపాటు నమాజు చేయాలి. వారు కూడా తమ రక్షణ సామగ్రిని, తమ ఆయుధాలను చేబూని ఉండాలి. మీరు మీ ఆయుధాల పట్ల, సామగ్రిపట్ల ఏమరుపాటుకు లోనైతే, ఒక్కసారిగా మీపై విరుచుకుపడాలని అవిశ్వాసులు కోరుకుంటారు. అయితే వర్షం మూలంగా లేక అస్వస్థత మూలంగా ఇబ్బందిగా ఉండి మీరు మీ ఆయుధాలను విడిచినట్లయితే అది దోషం కాదు. అయినా ఆత్మరక్షణ సామగ్రిని వెంట తీసుకొని ఉండండి. నిశ్చయంగా అల్లాహ్ తిరస్కారుల కోసం అవమానకరమైన శిక్షను సిద్ధం చేసి ఉంచాడు. 4:103 فَإِذَا قَضَيْتُمُ الصَّلَاةَ فَاذْكُرُوا اللَّهَ قِيَامًا وَقُعُودًا وَعَلَىٰ جُنُوبِكُمْ ۚ فَإِذَا اطْمَأْنَنتُمْ فَأَقِيمُوا الصَّلَاةَ ۚ إِنَّ الصَّلَاةَ كَانَتْ عَلَى الْمُؤْمِنِينَ كِتَابًا مَّوْقُوتًا మరి మీరు నమాజును నెరవేర్చిన తరువాత నిలుచున్నా, కూర్చున్నా, పరుండినా అల్లాహ్‌ను స్మరిస్తూ ఉండండి. అయితే పరిస్థితులు కుదుటపడిన తరువాత మాత్రం నమాజును నెలకొల్పండి. నిస్సందేహంగా నమాజును నిర్ధారిత వేళల్లో చేయటం విశ్వాసులకు విధిగా చేయబడింది. 4:104 وَلَا تَهِنُوا فِي ابْتِغَاءِ الْقَوْمِ ۖ إِن تَكُونُوا تَأْلَمُونَ فَإِنَّهُمْ يَأْلَمُونَ كَمَا تَأْلَمُونَ ۖ وَتَرْجُونَ مِنَ اللَّهِ مَا لَا يَرْجُونَ ۗ وَكَانَ اللَّهُ عَلِيمًا حَكِيمًا వారిని వెంబడించటంలో ఏ మాత్రం బలహీనతను ప్రదర్శించకండి. ఒకవేళ మీరు అవిశ్రాంతంగా ఉన్నారను కుంటే మీ మాదిరిగానే వారు కూడా అవిశ్రాంతంగా ఉన్నారు. పైగా అల్లాహ్ నుంచి వారు ఆశించని వాటిని మీరు ఆశిస్తున్నారు. అల్లాహ్ అన్నీ తెలిసినవాడు, వివేచనాపరుడు. 4:105 إِنَّا أَنزَلْنَا إِلَيْكَ الْكِتَابَ بِالْحَقِّ لِتَحْكُمَ بَيْنَ النَّاسِ بِمَا أَرَاكَ اللَّهُ ۚ وَلَا تَكُن لِّلْخَائِنِينَ خَصِيمًا (ఓ ప్రవక్తా!) అల్లాహ్ నీకు చూపిన విధంగా నీవు ప్రజల మధ్య తీర్పు చెయ్యటానికిగాను మేము నీ వైపుకు ఈ గ్రంథాన్ని సత్యంతోపాటు పంపాము. కనుక ద్రోహానికి పాల్పడే వారి తరఫున వాదిగా నిలబడకు. 4:106 وَاسْتَغْفِرِ اللَّهَ ۖ إِنَّ اللَّهَ كَانَ غَفُورًا رَّحِيمًا క్షమాభిక్షకై అల్లాహ్‌ను వేడుకో. నిస్సందేహంగా అల్లాహ్ క్షమించేవాడు, కనికరించేవాడు. 4:107 وَلَا تُجَادِلْ عَنِ الَّذِينَ يَخْتَانُونَ أَنفُسَهُمْ ۚ إِنَّ اللَّهَ لَا يُحِبُّ مَن كَانَ خَوَّانًا أَثِيمًا ఆత్మ ద్రోహం చేసుకునే వారి పక్షాన నిలిచి వాదించకు. దగాకోరును, పాపిష్టివాడిని అల్లాహ్ సుతరామూ ఇష్టపడడు. 4:108 يَسْتَخْفُونَ مِنَ النَّاسِ وَلَا يَسْتَخْفُونَ مِنَ اللَّهِ وَهُوَ مَعَهُمْ إِذْ يُبَيِّتُونَ مَا لَا يَرْضَىٰ مِنَ الْقَوْلِ ۚ وَكَانَ اللَّهُ بِمَا يَعْمَلُونَ مُحِيطًا వారు ప్రజల నుంచి దాక్కోగలరు. కాని అల్లాహ్ నుంచి దాక్కోలేరు. వారు రాత్రివేళల్లో అల్లాహ్ ఇష్టపడని విషయాలపై రహస్య మంతనాలు సాగిస్తున్నప్పుడు ఆయన వారితో పాటు ఉంటాడు. వారి కర్మలన్నింటినీ ఆయన చుట్టుముట్టి ఉన్నాడు. 4:109 هَا أَنتُمْ هَٰؤُلَاءِ جَادَلْتُمْ عَنْهُمْ فِي الْحَيَاةِ الدُّنْيَا فَمَن يُجَادِلُ اللَّهَ عَنْهُمْ يَوْمَ الْقِيَامَةِ أَم مَّن يَكُونُ عَلَيْهِمْ وَكِيلًا ప్రాపంచిక జీవితంలోనైతే మీరు వారి తరఫున వాదించారుగాని, ప్రళయ దినాన వారికి మద్దతుగా అల్లాహ్‌తో ఎవరు వాదిస్తారు? వారి తరఫున వకాల్తా ఎవరు పుచ్చుకుంటారు? 4:110 وَمَن يَعْمَلْ سُوءًا أَوْ يَظْلِمْ نَفْسَهُ ثُمَّ يَسْتَغْفِرِ اللَّهَ يَجِدِ اللَّهَ غَفُورًا رَّحِيمًا ఎవరయినా దుష్కార్యానికి పాల్పడి లేదా తనకు తాను అన్యాయం చేసుకుని, ఆ తరువాత క్షమాపణకై అల్లాహ్‌ను అర్థిస్తే, అతడు అల్లాహ్‌ను క్షమాశీలిగా, కృపాశీలిగా పొందుతాడు. 4:111 وَمَن يَكْسِبْ إِثْمًا فَإِنَّمَا يَكْسِبُهُ عَلَىٰ نَفْسِهِ ۚ وَكَانَ اللَّهُ عَلِيمًا حَكِيمًا కాని ఎవడయినా పాపాన్ని సంపాదించుకుంటే అతను సంపాదించుకున్నది అతనిపైనే పడుతుంది. అల్లాహ్ ప్రతిదీ తెలిసినవాడు, వివేచనాపరుడు. 4:112 وَمَن يَكْسِبْ خَطِيئَةً أَوْ إِثْمًا ثُمَّ يَرْمِ بِهِ بَرِيئًا فَقَدِ احْتَمَلَ بُهْتَانًا وَإِثْمًا مُّبِينًا ఇంకా ఎవరయినా ఏదైనా తప్పు చేసి, లేదా పాపానికి పాల్పడి, ఆ నిందను ఏ పాపం ఎరుగని అమాయకుని పైకి నెట్టివేస్తే, అలాంటివాడు చాలా పెద్ద అపనిందను, స్పష్టమైన పాపాన్ని ఎత్తుకున్నవాడవుతాడు. 4:113 وَلَوْلَا فَضْلُ اللَّهِ عَلَيْكَ وَرَحْمَتُهُ لَهَمَّت طَّائِفَةٌ مِّنْهُمْ أَن يُضِلُّوكَ وَمَا يُضِلُّونَ إِلَّا أَنفُسَهُمْ ۖ وَمَا يَضُرُّونَكَ مِن شَيْءٍ ۚ وَأَنزَلَ اللَّهُ عَلَيْكَ الْكِتَابَ وَالْحِكْمَةَ وَعَلَّمَكَ مَا لَمْ تَكُن تَعْلَمُ ۚ وَكَانَ فَضْلُ اللَّهِ عَلَيْكَ عَظِيمًا (ఓ ముహమ్మద్!) దైవానుగ్రహం, ఆయన కారుణ్యం నీపై లేకుండా ఉంటే వారిలోని ఒక సమూహం నిన్ను తప్పు దారి పట్టించాలనే అనుకుంది. కాని నిజానికి వారు తమను తామే అపమార్గానికి లోనుచేసుకుంటున్నారు. వారు నీకెలాంటి హానీ కలిగించలేరు. అల్లాహ్ నీపై గ్రంథాన్ని, వివేకాన్నీ అవతరింపజేశాడు. నీకు తెలియని విషయాలను నీకు నేర్పాడు. నీపై అల్లాహ్ యొక్క గొప్ప అనుగ్రహం ఉంది. 4:114 لَّا خَيْرَ فِي كَثِيرٍ مِّن نَّجْوَاهُمْ إِلَّا مَنْ أَمَرَ بِصَدَقَةٍ أَوْ مَعْرُوفٍ أَوْ إِصْلَاحٍ بَيْنَ النَّاسِ ۚ وَمَن يَفْعَلْ ذَٰلِكَ ابْتِغَاءَ مَرْضَاتِ اللَّهِ فَسَوْفَ نُؤْتِيهِ أَجْرًا عَظِيمًا వారు జరిపే అత్యధిక రహస్య మంతనాలలో ఏ మేలూ ఉండదు. అయితే దానధర్మాల గురించి లేక మంచి పనుల గురించి లేక ప్రజల మధ్య సంబంధాలను మెరుగుపరచటం గురించి ఆజ్ఞాపించేవాని రహస్య మంతనాల్లో మేలుంటుంది. ఎవరయినా కేవలం దైవప్రసన్నత కోసం ఈ పనులు చేస్తే నిశ్చయంగా మేమతనికి గొప్ప ప్రతిఫలం ప్రసాదిస్తాము. 4:115 وَمَن يُشَاقِقِ الرَّسُولَ مِن بَعْدِ مَا تَبَيَّنَ لَهُ الْهُدَىٰ وَيَتَّبِعْ غَيْرَ سَبِيلِ الْمُؤْمِنِينَ نُوَلِّهِ مَا تَوَلَّىٰ وَنُصْلِهِ جَهَنَّمَ ۖ وَسَاءَتْ مَصِيرًا కాని ఎవరయినా సన్మార్గం ప్రస్ఫుటమైన మీదట కూడా ప్రవక్త (సఅసం)కు వ్యతిరేకంగా పోతే, విశ్వాసులందరి మార్గాన్ని వీడి, ఇతర మార్గాన్ని అనుసరిస్తే, మేమతన్ని అతను మరలదలచుకున్న వైపుకే మరల్చుతాము. కడకు అతన్ని నరకంలో పడవేస్తాము. అది అత్యంత చెడ్డ గమ్యస్థానం. 4:116 إِنَّ اللَّهَ لَا يَغْفِرُ أَن يُشْرَكَ بِهِ وَيَغْفِرُ مَا دُونَ ذَٰلِكَ لِمَن يَشَاءُ ۚ وَمَن يُشْرِكْ بِاللَّهِ فَقَدْ ضَلَّ ضَلَالًا بَعِيدًا తనకు భాగస్వామ్యం (షిర్క్) కల్పించటాన్ని అల్లాహ్ ఎట్టి పరిస్థితిలోనూ క్షమించడు. షిర్క్ మినహా తాను కోరిన వారి ఇతర పాపాలను క్షమిస్తాడు. అల్లాహ్‌కు సహవర్తులుగా ఇతరులను నిలబెట్టినవాడు మార్గభ్రష్టతలో చాలా దూరం వెళ్ళి పోయాడు. 4:117 إِن يَدْعُونَ مِن دُونِهِ إِلَّا إِنَاثًا وَإِن يَدْعُونَ إِلَّا شَيْطَانًا مَّرِيدًا వారు అల్లాహ్‌ను వదలి స్త్రీలను మొరపెట్టుకుంటున్నారు. వాస్తవానికి వారసలు పొగరుబోతు షైతానును మొరపెట్టుకుంటున్నారు. 4:118 لَّعَنَهُ اللَّهُ ۘ وَقَالَ لَأَتَّخِذَنَّ مِنْ عِبَادِكَ نَصِيبًا مَّفْرُوضًا అల్లాహ్ వాణ్ణి శపించాడు. షైతాను ఇలా అన్నాడు: “నీ దాసుల నుండి నేను నిర్ణీత భాగాన్ని పొంది తీర్తాను.” 4:119 وَلَأُضِلَّنَّهُمْ وَلَأُمَنِّيَنَّهُمْ وَلَآمُرَنَّهُمْ فَلَيُبَتِّكُنَّ آذَانَ الْأَنْعَامِ وَلَآمُرَنَّهُمْ فَلَيُغَيِّرُنَّ خَلْقَ اللَّهِ ۚ وَمَن يَتَّخِذِ الشَّيْطَانَ وَلِيًّا مِّن دُونِ اللَّهِ فَقَدْ خَسِرَ خُسْرَانًا مُّبِينًا “వారిని దారి నుంచి తప్పిస్తూ ఉంటాను. వారికి ఉత్తుత్తి ఆశలు చూపిస్తూ ఉంటాను. పశువుల చెవులు చీల్చమని వారికి పురమాయిస్తాను. అల్లాహ్ సృష్టిని మార్చమని వారిని ఆదేశిస్తాను.” వినండి! అల్లాహ్‌ను వదలి షైతానును తన స్నేహితునిగా చేసుకున్నవాడు స్పష్టంగా నష్టపోయినట్లే. 4:120 يَعِدُهُمْ وَيُمَنِّيهِمْ ۖ وَمَا يَعِدُهُمُ الشَّيْطَانُ إِلَّا غُرُورًا వాడు వారికి వట్టి వాగ్దానాలు చేస్తూ ఉంటాడు. ఆశలు కలిగిస్తూ ఉంటాడు. కాని షైతాను వారితో చేసే వాగ్దానాలన్నీ మోసపూరితమైనవే. 4:121 أُولَٰئِكَ مَأْوَاهُمْ جَهَنَّمُ وَلَا يَجِدُونَ عَنْهَا مَحِيصًا ఇటువంటి వారు చేరుకోవలసిన స్థలం నరకం. ఇక వారికి దాన్నుంచి తప్పించుకునే మార్గం ఏదీ ఉండదు. 4:122 وَالَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ سَنُدْخِلُهُمْ جَنَّاتٍ تَجْرِي مِن تَحْتِهَا الْأَنْهَارُ خَالِدِينَ فِيهَا أَبَدًا ۖ وَعْدَ اللَّهِ حَقًّا ۚ وَمَنْ أَصْدَقُ مِنَ اللَّهِ قِيلًا కాగా; ఎవరు విశ్వసించి సత్కార్యాలు చేస్తారో వారిని మేము క్రింద కాలువలు ప్రవహించే (స్వర్గ) వనాలలోకి తీసుకుపోతాము. అందులో వారు కలకాలం, శాశ్వతంగా ఉంటారు. ఈ అల్లాహ్ వాగ్దానం సత్యమైనది. అల్లాహ్ కంటే సత్యమైన మాట పలికేదెవరు? 4:123 لَّيْسَ بِأَمَانِيِّكُمْ وَلَا أَمَانِيِّ أَهْلِ الْكِتَابِ ۗ مَن يَعْمَلْ سُوءًا يُجْزَ بِهِ وَلَا يَجِدْ لَهُ مِن دُونِ اللَّهِ وَلِيًّا وَلَا نَصِيرًا నిజస్థితి (సాఫల్యం) మీ ఆకాంక్షల కనుగుణంగా గానీ, గ్రంథవహుల ఆశలు, అభిలాషలపై ఆధారపడిగానీ లేదు. చెడుకు పాల్పడినవాడు ఎవడైనా దాని ఫలితాన్ని అనుభవిస్తాడు. దైవసమక్షంలో తనను సమర్థించే, తనను ఆదుకునే వారెవరినీ అతడు పొందలేడు. 4:124 وَمَن يَعْمَلْ مِنَ الصَّالِحَاتِ مِن ذَكَرٍ أَوْ أُنثَىٰ وَهُوَ مُؤْمِنٌ فَأُولَٰئِكَ يَدْخُلُونَ الْجَنَّةَ وَلَا يُظْلَمُونَ نَقِيرًا సత్కార్యాలు చేసేవారు - వారు పురుషులైనా, స్త్రీలైనా- విశ్వసించి ఉంటే, ఇలాంటివారు తప్పకుండా స్వర్గంలో ప్రవేశిస్తారు. వారికి ఖర్జూరపు విత్తనంపై ఉండే గాటుకు సమానంగా కూడా అన్యాయం జరగదు. 4:125 وَمَنْ أَحْسَنُ دِينًا مِّمَّنْ أَسْلَمَ وَجْهَهُ لِلَّهِ وَهُوَ مُحْسِنٌ وَاتَّبَعَ مِلَّةَ إِبْرَاهِيمَ حَنِيفًا ۗ وَاتَّخَذَ اللَّهُ إِبْرَاهِيمَ خَلِيلًا ఒక వ్యక్తి అల్లాహ్ ముందు తలవంచి, సదాచార సంపన్నుడై ఉండి, ఏకాగ్రచిత్తుడైన ఇబ్రాహీము ధర్మాన్ని అనుసరిస్తే - ధర్మం రీత్యా అతని కంటే ఉత్తముడు మరెవడు కాగలడు? ఇబ్రాహీమ్ (అలైహిస్సలాం)ను అల్లాహ్ తన మిత్రునిగా చేసుకున్నాడు. 4:126 وَلِلَّهِ مَا فِي السَّمَاوَاتِ وَمَا فِي الْأَرْضِ ۚ وَكَانَ اللَّهُ بِكُلِّ شَيْءٍ مُّحِيطًا ఆకాశాలలో, భూమిలో ఉన్న సమస్తమూ అల్లాహ్‌దే. అల్లాహ్ అన్నింటినీ పరివేష్ఠించి ఉన్నాడు. 4:127 وَيَسْتَفْتُونَكَ فِي النِّسَاءِ ۖ قُلِ اللَّهُ يُفْتِيكُمْ فِيهِنَّ وَمَا يُتْلَىٰ عَلَيْكُمْ فِي الْكِتَابِ فِي يَتَامَى النِّسَاءِ اللَّاتِي لَا تُؤْتُونَهُنَّ مَا كُتِبَ لَهُنَّ وَتَرْغَبُونَ أَن تَنكِحُوهُنَّ وَالْمُسْتَضْعَفِينَ مِنَ الْوِلْدَانِ وَأَن تَقُومُوا لِلْيَتَامَىٰ بِالْقِسْطِ ۚ وَمَا تَفْعَلُوا مِنْ خَيْرٍ فَإِنَّ اللَّهَ كَانَ بِهِ عَلِيمًا (ఓ ప్రవక్తా!) వారు నిన్ను స్త్రీల విషయమై ధర్మాదేశం ఏమిటని అడుగుతున్నారు. వారికి చెప్పు: “అల్లాహ్ స్వయంగా వారి విషయంలో మిమ్మల్ని ఆదేశిస్తున్నాడు. ఇంకా తండ్రిలేని ఆడ పిల్లలకు మీరు, వారి కొరకు నిర్ధారించబడిన హక్కును వారికివ్వకుండా, వారిని వివాహమాడాలనే మీ కోరిక గురించీ, బలహీనులైన పిల్లల గురించీ మీకు వినిపించబడుతున్న ఖుర్ఆన్ ఆయతులు కూడా (మిమ్మల్ని ఆదేశిస్తున్నాయి). ఇంకా తండ్రిలేని బిడ్డల విషయంలో న్యాయంగా వ్యవహరించమని కూడా ఆయన మీకు ఆజ్ఞాపిస్తున్నాడు. మీరు ఏ మంచిపని చేసినా దాని గురించి అల్లాహ్‌కు పూర్తిగా తెలుసు. 4:128 وَإِنِ امْرَأَةٌ خَافَتْ مِن بَعْلِهَا نُشُوزًا أَوْ إِعْرَاضًا فَلَا جُنَاحَ عَلَيْهِمَا أَن يُصْلِحَا بَيْنَهُمَا صُلْحًا ۚ وَالصُّلْحُ خَيْرٌ ۗ وَأُحْضِرَتِ الْأَنفُسُ الشُّحَّ ۚ وَإِن تُحْسِنُوا وَتَتَّقُوا فَإِنَّ اللَّهَ كَانَ بِمَا تَعْمَلُونَ خَبِيرًا భర్త తనను ఈసడించుకుంటాడనో లేక తనను పట్టించుకోడనో స్త్రీకి భయమున్నప్పుడు వారిద్దరూ పరస్పరం సర్దుబాటు చేసుకుంటే అందులో వారిరువురిపై ఏమాత్రం దోషం లేదు. సర్దుబాటు అన్నింటికన్నా మేలైనది. 'పేరాశ' అనేది ప్రతి ప్రాణిలోనూ పొందుపరచబడి ఉంది. ఒకవేళ మీరు ఔదార్యాన్ని చూపి, భయభక్తుల వైఖరిని అవలంబించినట్లయితే మీ వ్యవహార శైలి అల్లాహ్‌కు తెలుస్తుంది. 4:129 وَلَن تَسْتَطِيعُوا أَن تَعْدِلُوا بَيْنَ النِّسَاءِ وَلَوْ حَرَصْتُمْ ۖ فَلَا تَمِيلُوا كُلَّ الْمَيْلِ فَتَذَرُوهَا كَالْمُعَلَّقَةِ ۚ وَإِن تُصْلِحُوا وَتَتَّقُوا فَإِنَّ اللَّهَ كَانَ غَفُورًا رَّحِيمًا మీరు ఎంతగా ఆశించినప్పటికీ, శాయశక్తులా ప్రయత్నించినప్పటికీ మీ భార్యలందరి మధ్య మీరు అన్నివిధాలా న్యాయం చెయ్యటమన్నది మీ వల్ల కాని పని. కాబట్టి మీరు పూర్తిగా ఒకామె వైపుకు మొగ్గిపోయి, రెండో ఆవిడను అనిశ్చిత స్థితిలో పడవెయ్యకండి. ఒకవేళ మీరు మీ ధోరణిని సరిదిద్దుకుని, భయభక్తుల (తఖ్వా)తో మసలుకుంటే నిశ్చయంగా అల్లాహ్ క్షమించేవాడు, కనికరించేవాడు. 4:130 وَإِن يَتَفَرَّقَا يُغْنِ اللَّهُ كُلًّا مِّن سَعَتِهِ ۚ وَكَانَ اللَّهُ وَاسِعًا حَكِيمًا ఒకవేళ వారిరువురూ విడిపోవటం జరిగితే, అప్పుడు అల్లాహ్ తన విస్తృతమైన అనుగ్రహంతో వారిరువురికీ- ఒకరి అవసరం ఇంకొకరికి లేకుండా - తోడ్పడతాడు. అల్లాహ్ అపారమైన విస్తృతి కలవాడు, వివేక సంపన్నుడు. 4:131 وَلِلَّهِ مَا فِي السَّمَاوَاتِ وَمَا فِي الْأَرْضِ ۗ وَلَقَدْ وَصَّيْنَا الَّذِينَ أُوتُوا الْكِتَابَ مِن قَبْلِكُمْ وَإِيَّاكُمْ أَنِ اتَّقُوا اللَّهَ ۚ وَإِن تَكْفُرُوا فَإِنَّ لِلَّهِ مَا فِي السَّمَاوَاتِ وَمَا فِي الْأَرْضِ ۚ وَكَانَ اللَّهُ غَنِيًّا حَمِيدًا ఆకాశాలలో, భూమిలో వున్న సమస్తమూ అల్లాహ్‌దే. అల్లాహ్‌కు భయపడుతూ మెలగవలసిందిగా మేము మీకు పూర్వం గ్రంథం వొసగబడినవారికీ, మీకూ ఆజ్ఞాపించాము. ఒకవేళ మీరు తిరస్కరిస్తే, ఆకాశాలలో, భూమిలో ఉన్నదంతా అల్లాహ్దేననీ, అల్లాహ్ అక్కరలు లేనివాడనీ, స్తోత్రనీయుడనీ మరువకండి. 4:132 وَلِلَّهِ مَا فِي السَّمَاوَاتِ وَمَا فِي الْأَرْضِ ۚ وَكَفَىٰ بِاللَّهِ وَكِيلًا ఆకాశాలలో, భూమిలో ఉన్న వస్తువులన్నీ అల్లాహ్ అధీనంలోనే ఉన్నాయి. కార్యనిర్వాహకారిగా అల్లాహ్ చాలు. 4:133 إِن يَشَأْ يُذْهِبْكُمْ أَيُّهَا النَّاسُ وَيَأْتِ بِآخَرِينَ ۚ وَكَانَ اللَّهُ عَلَىٰ ذَٰلِكَ قَدِيرًا అల్లాహ్‌యే గనక తలిస్తే ఓ ప్రజలారా! మిమ్మల్ని తొలగించి, మీ స్థానంలో ఇతరుల్ని తేగలడు. ఈ పని చేయగల పూర్తి శక్తి అల్లాహ్‌కు ఉంది. 4:134 مَّن كَانَ يُرِيدُ ثَوَابَ الدُّنْيَا فَعِندَ اللَّهِ ثَوَابُ الدُّنْيَا وَالْآخِرَةِ ۚ وَكَانَ اللَّهُ سَمِيعًا بَصِيرًا ఎవరయితే ప్రాపంచిక ప్రతిఫలాన్ని కోరుకుంటున్నాడో (అతడు), అల్లాహ్ వద్ద ప్రాపంచిక ప్రతిఫలంతో పాటు పరలోక ప్రతిఫలం కూడా ఉంది (అని తెలుసుకోవాలి). అల్లాహ్ అంతా వినేవాడు, అన్నింటినీ చూసేవాడు సుమా! 4:135 يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا كُونُوا قَوَّامِينَ بِالْقِسْطِ شُهَدَاءَ لِلَّهِ وَلَوْ عَلَىٰ أَنفُسِكُمْ أَوِ الْوَالِدَيْنِ وَالْأَقْرَبِينَ ۚ إِن يَكُنْ غَنِيًّا أَوْ فَقِيرًا فَاللَّهُ أَوْلَىٰ بِهِمَا ۖ فَلَا تَتَّبِعُوا الْهَوَىٰ أَن تَعْدِلُوا ۚ وَإِن تَلْوُوا أَوْ تُعْرِضُوا فَإِنَّ اللَّهَ كَانَ بِمَا تَعْمَلُونَ خَبِيرًا ఓ విశ్వసించిన వారలారా! మీరు న్యాయం విషయంలో గట్టిగా నిలబడండి. అల్లాహ్ ప్రసన్నత నిమిత్తం (సత్యం మాత్రమే పలికే) సాక్షులుగా ఉండండి - అది మీ స్వయానికీ, మీ తల్లిదండ్రులకు, మీ బంధువులకు వ్యతిరేకంగా పరిణమించినా సరే! అతను ధనికుడయినా, పేదవాడైనా సరే. వారి పట్ల అల్లాహ్ (మీకన్నా) ఎక్కువ శ్రేయోభిలాషి. కాబట్టి మీరు మీ మనోవాంఛకు లొంగిపోయి న్యాయాన్ని వీడకండి. ఒకవేళ మీరు మీ సాక్ష్యాన్ని వక్రీకరించినా, సాక్ష్యం చెప్పటానికి విముఖత చూపినా మీరు చేసే పనులన్నీ అల్లాహ్‌కు తెలుసు సుమా! 4:136 يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا آمِنُوا بِاللَّهِ وَرَسُولِهِ وَالْكِتَابِ الَّذِي نَزَّلَ عَلَىٰ رَسُولِهِ وَالْكِتَابِ الَّذِي أَنزَلَ مِن قَبْلُ ۚ وَمَن يَكْفُرْ بِاللَّهِ وَمَلَائِكَتِهِ وَكُتُبِهِ وَرُسُلِهِ وَالْيَوْمِ الْآخِرِ فَقَدْ ضَلَّ ضَلَالًا بَعِيدًا ఓ విశ్వాసులారా! అల్లాహ్‌ను, ఆయన ప్రవక్త (స)ను, ఆయన తన ప్రవక్త (స)పై అవతరింపజేసిన గ్రంథాన్నీ, అంతకు మునుపు ఆయన అవతరింపజేసిన గ్రంథాలన్నిటినీ విశ్వసించండి. ఎవడు అల్లాహ్‌ను, ఆయన దూతలను, ఆయన గ్రంథాలను, ఆయన ప్రవక్తలను, అంతిమ దినాన్ని తిరస్కరించాడో వాడు మార్గం తప్పి చాలాదూరం వెళ్ళిపోయాడు. 4:137 إِنَّ الَّذِينَ آمَنُوا ثُمَّ كَفَرُوا ثُمَّ آمَنُوا ثُمَّ كَفَرُوا ثُمَّ ازْدَادُوا كُفْرًا لَّمْ يَكُنِ اللَّهُ لِيَغْفِرَ لَهُمْ وَلَا لِيَهْدِيَهُمْ سَبِيلًا ఎవరు విశ్వసించి మళ్ళీ తిరస్కారులయ్యారో, మళ్లీ విశ్వసించి మళ్లీ తిరస్కార వైఖరికి ఒడిగట్టారో, ఆపైన తమ తిరస్కార వైఖరిలో పెచ్చరిల్లిపోయారో అలాంటి వారిని అల్లాహ్ ససేమిరా క్షమించడు. అటువంటి వారికి సన్మార్గం కూడా చూపడు. 4:138 شِّرِ الْمُنَافِقِينَ بِأَنَّ لَهُمْ عَذَابًا أَلِيمًا కపటులకు వ్యధాభరితమైన శిక్ష ఖాయం అన్న శుభవార్తను వారికి అందజెయ్యి. 4:139 الَّذِينَ يَتَّخِذُونَ الْكَافِرِينَ أَوْلِيَاءَ مِن دُونِ الْمُؤْمِنِينَ ۚ أَيَبْتَغُونَ عِندَهُمُ الْعِزَّةَ فَإِنَّ الْعِزَّةَ لِلَّهِ جَمِيعًا వారు ఎలాంటివారంటే, విశ్వాసులను వదలి అవిశ్వాసులను తమ మిత్రులుగా చేసుకుంటున్నారు. ఏమిటీ? వారు గౌరవ ప్రతిష్ఠల కోసం వారి వద్దకు వెళుతున్నారా? యదార్థానికి గౌరవమంతా అల్లాహ్ అధీనంలో ఉంది (అని వారు తెలుసుకోవాలి). 4:140 وَقَدْ نَزَّلَ عَلَيْكُمْ فِي الْكِتَابِ أَنْ إِذَا سَمِعْتُمْ آيَاتِ اللَّهِ يُكْفَرُ بِهَا وَيُسْتَهْزَأُ بِهَا فَلَا تَقْعُدُوا مَعَهُمْ حَتَّىٰ يَخُوضُوا فِي حَدِيثٍ غَيْرِهِ ۚ إِنَّكُمْ إِذًا مِّثْلُهُمْ ۗ إِنَّ اللَّهَ جَامِعُ الْمُنَافِقِينَ وَالْكَافِرِينَ فِي جَهَنَّمَ جَمِيعًا అల్లాహ్ తన గ్రంథంలో ఇదివరకే మీ వద్దకు ఈ ఆజ్ఞను అవతరింపజేశాడు: ఎవరైనా అల్లాహ్ వాక్యాలను తిరస్కరిస్తూ, పరిహాసమాడుతున్నట్లు మీరు విన్నట్లయితే, - వారు ఆ మాటలు విడిచి పెట్టి వేరే మాటలు మాట్లాడటం మొదలు పెట్టనంతవరకూ - ఆ సమూహంలో వారితో కలసి కూర్చోకండి. (అన్యధా) మీరు కూడా ఆ సమయంలో వారిలాంటి వారుగానే పరిగణించబడతారు. అల్లాహ్ నిశ్చయంగా కపటులను, అవిశ్వాసులందరినీ నరకంలో పోగుచేయనున్నాడు. 4:141 الَّذِينَ يَتَرَبَّصُونَ بِكُمْ فَإِن كَانَ لَكُمْ فَتْحٌ مِّنَ اللَّهِ قَالُوا أَلَمْ نَكُن مَّعَكُمْ وَإِن كَانَ لِلْكَافِرِينَ نَصِيبٌ قَالُوا أَلَمْ نَسْتَحْوِذْ عَلَيْكُمْ وَنَمْنَعْكُم مِّنَ الْمُؤْمِنِينَ ۚ فَاللَّهُ يَحْكُمُ بَيْنَكُمْ يَوْمَ الْقِيَامَةِ ۗ وَلَن يَجْعَلَ اللَّهُ لِلْكَافِرِينَ عَلَى الْمُؤْمِنِينَ سَبِيلًا ఈ కపటులు మీకు ఏ గతి పడుతుందోనని ఆసక్తితో ఎదురుచూస్తూ ఉంటారు. ఒకవేళ అల్లాహ్ తరఫు నుంచి మీకు విజయం చేకూరితే, “మేము మీతో లేమా?!” అని అంటారు. ఒకవేళ అవిశ్వాసులకు కాస్తంత ఆధిక్యత లభిస్తే, “మీకు వ్యతిరేకంగా పోరాడే శక్తి మాకు లేదా? (అయినాసరే) మేము ముస్లింలబారి నుంచి మిమ్మల్ని రక్షించలేదా?” అని (కపటులు) వారితో అంటారు. కాబట్టి ప్రళయదినాన అల్లాహ్ స్వయంగా మీ మధ్య తీర్పు చేస్తాడు. అల్లాహ్ ఎన్నటికీ అవిశ్వాసులకు, విశ్వాసులపై (విజయ) మార్గం సుగమం చేయడు. 4:142 إِنَّ الْمُنَافِقِينَ يُخَادِعُونَ اللَّهَ وَهُوَ خَادِعُهُمْ وَإِذَا قَامُوا إِلَى الصَّلَاةِ قَامُوا كُسَالَىٰ يُرَاءُونَ النَّاسَ وَلَا يَذْكُرُونَ اللَّهَ إِلَّا قَلِيلًا నిశ్చయంగా కపటులు అల్లాహ్‌ను మోసం చేయజూస్తున్నారు. అయితే అల్లాహ్ వారి మోసానికి శిక్ష విధించనున్నాడు. వారు నమాజు కోసం నిలబడినప్పుడు ఎంతో బద్దకంతో, కేవలం జనులకు చూపే ఉద్దేశంతో నిలబడతారు. ఏదో నామ మాత్రంగా దైవాన్ని స్మరిస్తారు. 4:143 مُّذَبْذَبِينَ بَيْنَ ذَٰلِكَ لَا إِلَىٰ هَٰؤُلَاءِ وَلَا إِلَىٰ هَٰؤُلَاءِ ۚ وَمَن يُضْلِلِ اللَّهُ فَلَن تَجِدَ لَهُ سَبِيلًا వారు ఎటూ కాకుండా మధ్యలోనే ఊగిసలాడుతున్నారు. పూర్తిగా అటూ ఉండరు, సరిగ్గా ఇటూ ఉండరు. అల్లాహ్ ఎవరినయితే అపమార్గం పాల్జేస్తాడో వాని కోసం నీవు ఏ మార్గాన్నీ కనుగొనలేవు. 4:144 يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا لَا تَتَّخِذُوا الْكَافِرِينَ أَوْلِيَاءَ مِن دُونِ الْمُؤْمِنِينَ ۚ أَتُرِيدُونَ أَن تَجْعَلُوا لِلَّهِ عَلَيْكُمْ سُلْطَانًا مُّبِينًا ఓ విశ్వసించిన వారలారా! విశ్వాసులను వదలి అవిశ్వాసులను మిత్రులుగా చేసుకోకండి. ఏమిటీ, మీకు వ్యతిరేకంగా మీరే అల్లాహ్‌కు స్పష్టమైన ఆధారం సమకూర్చదలుస్తున్నారా? 4:145 إِنَّ الْمُنَافِقِينَ فِي الدَّرْكِ الْأَسْفَلِ مِنَ النَّارِ وَلَن تَجِدَ لَهُمْ نَصِيرًا కపటులు నిశ్చయంగా నరకంలోని అధమాతి అధమ శ్రేణిలోకిపోతారు. వారికి సహాయపడే వారిని నీవు ఎన్నటికీ చూడలేవు. 4:146 إِلَّا الَّذِينَ تَابُوا وَأَصْلَحُوا وَاعْتَصَمُوا بِاللَّهِ وَأَخْلَصُوا دِينَهُمْ لِلَّهِ فَأُولَٰئِكَ مَعَ الْمُؤْمِنِينَ ۖ وَسَوْفَ يُؤْتِ اللَّهُ الْمُؤْمِنِينَ أَجْرًا عَظِيمًا అయితే పశ్చాత్తాపం చెంది, తమ ప్రవర్తనను చక్కదిద్దుకుని, అల్లాహ్‌ను గట్టిగా నమ్మి, తమ ధర్మాన్ని అల్లాహ్ కొరకే ప్రత్యేకించుకున్నట్లయితే అప్పుడు వీరు విశ్వాసులతోపాటు ఉంటారు. త్వరలోనే అల్లాహ్ విశ్వాసులకు గొప్ప ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాడు. 4:147 مَّا يَفْعَلُ اللَّهُ بِعَذَابِكُمْ إِن شَكَرْتُمْ وَآمَنتُمْ ۚ وَكَانَ اللَّهُ شَاكِرًا عَلِيمًا మీరు కృతజ్ఞులుగా మసలుకుంటూ, విశ్వాసులుగా ఉన్నప్పుడు అల్లాహ్ మిమ్మల్ని శిక్షించి ఏం చేస్తాడు? అల్లాహ్ విలువనిచ్చేవాడూ, అన్నీ తెలిసినవాడు. 4:148 لَّا يُحِبُّ اللَّهُ الْجَهْرَ بِالسُّوءِ مِنَ الْقَوْلِ إِلَّا مَن ظُلِمَ ۚ وَكَانَ اللَّهُ سَمِيعًا عَلِيمًا అన్యాయానికి గురైనవాడు తప్ప, ఏ మనిషి అయినా చెడు మాటలు బిగ్గరగా పలకటాన్ని అల్లాహ్ ఇష్టపడడు. అల్లాహ్ అంతా వినేవాడూ, అన్నీ తెలిసినవాడు. 4:149 إِن تُبْدُوا خَيْرًا أَوْ تُخْفُوهُ أَوْ تَعْفُوا عَن سُوءٍ فَإِنَّ اللَّهَ كَانَ عَفُوًّا قَدِيرًا మీరు ఏదన్నా మంచి పనిని బహిర్గతంగా చేసినా, గుట్టుగా చేసినా లేక ఏదైనా చెడుగును మన్నించి వదలి పెట్టినా అల్లాహ్ అమితంగా మన్నించేవాడు, సర్వశక్తుడూ (అని తెలుసుకోండి.) 4:150 إِنَّ الَّذِينَ يَكْفُرُونَ بِاللَّهِ وَرُسُلِهِ وَيُرِيدُونَ أَن يُفَرِّقُوا بَيْنَ اللَّهِ وَرُسُلِهِ وَيَقُولُونَ نُؤْمِنُ بِبَعْضٍ وَنَكْفُرُ بِبَعْضٍ وَيُرِيدُونَ أَن يَتَّخِذُوا بَيْنَ ذَٰلِكَ سَبِيلًا ఎవరయితే అల్లాహ్‌ను, ఆయన ప్రవక్తలను తిరస్కరిస్తారో, అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తల మధ్య భేదభావం పాటించదలుస్తున్నారో, ఇంకా “మేము కొంతమంది ప్రవక్తలను విశ్వసిస్తాం, మరి కొంతమందిని విశ్వసించం” అని చెబుతూ, రెంటికీ మధ్య ఓ (సరికొత్త) మార్గాన్ని తీయదలుస్తున్నారో- 4:151 أُولَٰئِكَ هُمُ الْكَافِرُونَ حَقًّا ۚ وَأَعْتَدْنَا لِلْكَافِرِينَ عَذَابًا مُّهِينًا వీళ్ళే అసలైన అవిశ్వాసులు. ఇలాంటి అవిశ్వాసుల కొరకు మేము అవమానకరమైన శిక్షను సిద్ధం చేసి ఉంచాము. 4:152 وَالَّذِينَ آمَنُوا بِاللَّهِ وَرُسُلِهِ وَلَمْ يُفَرِّقُوا بَيْنَ أَحَدٍ مِّنْهُمْ أُولَٰئِكَ سَوْفَ يُؤْتِيهِمْ أُجُورَهُمْ ۗ وَكَانَ اللَّهُ غَفُورًا رَّحِيمًا (దీనికి భిన్నంగా) ఎవరు అల్లాహ్‌ను, ఆయన ప్రవక్తలందరినీ విశ్వసించి, వారిలో ఎవరి మధ్యా తేడా చూపకుండా ఉంటారో వారికి అల్లాహ్ వారి పూర్తి పుణ్యఫలాన్ని ప్రసాదిస్తాడు. అల్లాహ్ అపారంగా క్షమించేవాడు, అమితంగా కరుణించేవాడు. 4:153 يَسْأَلُكَ أَهْلُ الْكِتَابِ أَن تُنَزِّلَ عَلَيْهِمْ كِتَابًا مِّنَ السَّمَاءِ ۚ فَقَدْ سَأَلُوا مُوسَىٰ أَكْبَرَ مِن ذَٰلِكَ فَقَالُوا أَرِنَا اللَّهَ جَهْرَةً فَأَخَذَتْهُمُ الصَّاعِقَةُ بِظُلْمِهِمْ ۚ ثُمَّ اتَّخَذُوا الْعِجْلَ مِن بَعْدِ مَا جَاءَتْهُمُ الْبَيِّنَاتُ فَعَفَوْنَا عَن ذَٰلِكَ ۚ وَآتَيْنَا مُوسَىٰ سُلْطَانًا مُّبِينًا (ఓ ప్రవక్తా!) నీవు ఆకాశం నుంచి ఏదైనా గ్రంథాన్ని తమపై అవతరింపజెయ్యవలసిందిగా ఈ గ్రంథవహులు నిన్ను అడుగుతున్నారు. వారు దీనికన్నా పెద్ద కోరికే మూసాను కోరి ఉన్నారు. “మాకు అల్లాహ్‌ను ప్రత్యక్షంగా చూపించు” అని వారు కోరారు. వారి ఈ దుర్మార్గ వైఖరి మూలంగా వారిపై పిడుగు విరుచుకుపడింది. ఆపైన వారి వద్దకు ఎన్నో స్పష్టమైన నిదర్శనాలు వచ్చిన తరువాత కూడా వారు ఆవు దూడను తమ ఆరాధ్య దైవంగా చేసుకున్నారు. అప్పటికీ మేము దాన్ని మన్నించాము. ఇంకా, మేము మూసాకు స్పష్టమైన ప్రాబల్యాన్ని (బహిరంగ నిదర్శనాన్ని) వొసగాము. 4:154 وَرَفَعْنَا فَوْقَهُمُ الطُّورَ بِمِيثَاقِهِمْ وَقُلْنَا لَهُمُ ادْخُلُوا الْبَابَ سُجَّدًا وَقُلْنَا لَهُمْ لَا تَعْدُوا فِي السَّبْتِ وَأَخَذْنَا مِنْهُم مِّيثَاقًا غَلِيظًا వారి నుంచి ప్రమాణం తీసుకోవటానికి మేము వారిపైకి తూరు పర్వతాన్ని ఎత్తాము. సజ్దా చేస్తూ (నగర) ద్వారంలోనికి ప్రవేశించమని వారిని ఆజ్ఞాపించాము. శనివారం నాడు హద్దు మీరి ప్రవర్తించవద్దని కూడా వారికి ఉపదేశించాము. ఈ విధంగా మేము వారినుంచి చాలా గట్టి వాగ్దానం తీసుకున్నాము. 4:155 فَبِمَا نَقْضِهِم مِّيثَاقَهُمْ وَكُفْرِهِم بِآيَاتِ اللَّهِ وَقَتْلِهِمُ الْأَنبِيَاءَ بِغَيْرِ حَقٍّ وَقَوْلِهِمْ قُلُوبُنَا غُلْفٌ ۚ بَلْ طَبَعَ اللَّهُ عَلَيْهَا بِكُفْرِهِمْ فَلَا يُؤْمِنُونَ إِلَّا قَلِيلًا వారు ప్రమాణ భంగం చేయటం వల్లనూ, దైవాజ్ఞల పట్ల తిరస్కార వైఖరికి ఒడిగట్టడం వల్లనూ, ప్రవక్తలను అన్యాయంగా హతమార్చటం వల్లనూ, “మా హృదయాలపై గలేబులున్నాయి” అని చెప్పటం వల్లనూ (వారికీ శాస్తి జరిగింది). వాస్తవానికి వారి తిరస్కారం కారణంగా అల్లాహ్ వారి హృదయాలకు సీలువేశాడు. అందువల్ల వారు చాలా తక్కువగా మాత్రమే విశ్వసిస్తారు. 4:156 وَبِكُفْرِهِمْ وَقَوْلِهِمْ عَلَىٰ مَرْيَمَ بُهْتَانًا عَظِيمًا వారు తిరస్కారానికి పాల్పడటం వల్ల, మర్యమ్పై చాలా ఘోరమైన అపనిందను మోపటం వల్ల, 4:157 وَقَوْلِهِمْ إِنَّا قَتَلْنَا الْمَسِيحَ عِيسَى ابْنَ مَرْيَمَ رَسُولَ اللَّهِ وَمَا قَتَلُوهُ وَمَا صَلَبُوهُ وَلَٰكِن شُبِّهَ لَهُمْ ۚ وَإِنَّ الَّذِينَ اخْتَلَفُوا فِيهِ لَفِي شَكٍّ مِّنْهُ ۚ مَا لَهُم بِهِ مِنْ عِلْمٍ إِلَّا اتِّبَاعَ الظَّنِّ ۚ وَمَا قَتَلُوهُ يَقِينًا ఇంకా - “మర్యమ్ పుత్రుడగు దైవప్రవక్త ఈసాను మేము హతమార్చాము” అని అనటం వల్ల - (వారు శిక్షను చవిచూశారు). నిజానికి వారు ఆయన్ని చంపనూలేదు, శిలువ పైకి ఎక్కించనూ లేదు. నిజం ఏమిటంటే, వారి కొరకు ఆయన్ని పోలిన వ్యక్తి రూపొందించబడ్డాడు. ఈసా విషయంలో విభేదించినవారు ఆయన వ్యవహారంలో సందేహానికి లోనయ్యారు. అంచనాలను అనుసరించటం తప్ప వారికి ఈ విషయమై ఖచ్చితంగా ఏమీ తెలియదు. అసలు వారు ఆయన్ని చంపలేదు, 4:158 بَل رَّفَعَهُ اللَّهُ إِلَيْهِ ۚ وَكَانَ اللَّهُ عَزِيزًا حَكِيمًا పైగా అల్లాహ్ ఆయన్ని తన వైపునకు ఎత్తుకున్నాడు. అల్లాహ్ సర్వాధిక్యుడు, మహావివేకి. 4:159 وَإِن مِّنْ أَهْلِ الْكِتَابِ إِلَّا لَيُؤْمِنَنَّ بِهِ قَبْلَ مَوْتِهِ ۖ وَيَوْمَ الْقِيَامَةِ يَكُونُ عَلَيْهِمْ شَهِيدًا గ్రంథవహులలో ఏ ఒక్కడూ ఈసాను, అతని (అంటే తన లేక ఆయన) మరణానికి మునుపు విశ్వసించకుండా మిగలడు. ప్రళయ దినాన ఆయన వారిపై సాక్షిగా ఉంటాడు. 4:160 فَبِظُلْمٍ مِّنَ الَّذِينَ هَادُوا حَرَّمْنَا عَلَيْهِمْ طَيِّبَاتٍ أُحِلَّتْ لَهُمْ وَبِصَدِّهِمْ عَن سَبِيلِ اللَّهِ كَثِيرًا యూదుల దుర్మార్గం వల్ల వారికి ధర్మసమ్మతంగా ఉన్న అనేక పరిశుద్ధ వస్తువులను మేము వారికోసం నిషేధించాము. వారు ఎంతో మందిని దైవమార్గం నుంచి అడ్డుకోవటం వల్లనూ, 4:161 وَأَخْذِهِمُ الرِّبَا وَقَدْ نُهُوا عَنْهُ وَأَكْلِهِمْ أَمْوَالَ النَّاسِ بِالْبَاطِلِ ۚ وَأَعْتَدْنَا لِلْكَافِرِينَ مِنْهُمْ عَذَابًا أَلِيمًا నిషేధించబడిన వడ్డీని పుచ్చుకోవటం వల్లనూ, జనుల సొమ్మును అన్యాయంగా స్వాహా చేయటం వల్లనూ (వారికీ దుర్గతి పట్టింది). వారిలో అవిశ్వాసులుగా ఉన్నవారి కోసం మేము బాధాకరమయిన శిక్షను సిద్ధం చేసి ఉంచాము. 4:162 لَّٰكِنِ الرَّاسِخُونَ فِي الْعِلْمِ مِنْهُمْ وَالْمُؤْمِنُونَ يُؤْمِنُونَ بِمَا أُنزِلَ إِلَيْكَ وَمَا أُنزِلَ مِن قَبْلِكَ ۚ وَالْمُقِيمِينَ الصَّلَاةَ ۚ وَالْمُؤْتُونَ الزَّكَاةَ وَالْمُؤْمِنُونَ بِاللَّهِ وَالْيَوْمِ الْآخِرِ أُولَٰئِكَ سَنُؤْتِيهِمْ أَجْرًا عَظِيمًا అయితే వారిలో పరిపూర్ణమైన, పరిపక్వతనొందిన జ్ఞానంగలవారూ, విశ్వసించినవారూ, నీపై అవతరింపజెయ్య బడినదానినీ, నీకు పూర్వం అవతరింపజెయ్యబడిన దానినీ విశ్వసించేవారూ, నమాజులను నెలకొల్పేవారూ, జకాతును చెల్లించేవారూ, అల్లాహ్ మరియు అంతిమ దినాన్ని విశ్వసించేవారూ - వీరందరికీ మేము గొప్ప పుణ్యఫలాన్ని ప్రసాదిస్తాము. 4:163 إِنَّا أَوْحَيْنَا إِلَيْكَ كَمَا أَوْحَيْنَا إِلَىٰ نُوحٍ وَالنَّبِيِّينَ مِن بَعْدِهِ ۚ وَأَوْحَيْنَا إِلَىٰ إِبْرَاهِيمَ وَإِسْمَاعِيلَ وَإِسْحَاقَ وَيَعْقُوبَ وَالْأَسْبَاطِ وَعِيسَىٰ وَأَيُّوبَ وَيُونُسَ وَهَارُونَ وَسُلَيْمَانَ ۚ وَآتَيْنَا دَاوُودَ زَبُورًا (ఓ ముహమ్మద్!) మేము నూహ్ వైపుకు, అతని తరువాత వచ్చిన ప్రవక్తల వైపుకు వహీ పంపినట్లే (వాణిని అవతరింపజేసినట్లే) నీ వైపుకూ వహీ పంపాము. ఇంకా మేము ఇబ్రాహీము, ఇస్మాయీలు, ఇస్హాఖు, యాకూబు మరియు అతని సంతతి వారికి, ఈసా, అయ్యూబు, యూనుసు, హారూను, సులైమానుల వైపుకు కూడా వహీ పంపాము. ఇంకా మేము దావూదుకు జబూరు (గ్రంథం) వొసగాము. 4:164 وَرُسُلًا قَدْ قَصَصْنَاهُمْ عَلَيْكَ مِن قَبْلُ وَرُسُلًا لَّمْ نَقْصُصْهُمْ عَلَيْكَ ۚ وَكَلَّمَ اللَّهُ مُوسَىٰ تَكْلِيمًا నీకు పూర్వం గతించిన ఎంతో మంది ప్రవక్తల వృత్తాంతాలను మేము నీకు తెలియజేశాము. మరెంతో మంది ప్రవక్తల గాథలను తెలుపలేదు. మూసా (అలైహిస్సలాం) తోనైతే అల్లాహ్ నేరుగా మాట్లాడాడు. 4:165 رُّسُلًا مُّبَشِّرِينَ وَمُنذِرِينَ لِئَلَّا يَكُونَ لِلنَّاسِ عَلَى اللَّهِ حُجَّةٌ بَعْدَ الرُّسُلِ ۚ وَكَانَ اللَّهُ عَزِيزًا حَكِيمًا మేము వారిని శుభవార్తలు వినిపించే, హెచ్చరించే ప్రవక్తలుగా చేసి పంపాము - ప్రవక్తలు వచ్చిన తరువాత అల్లాహ్‌కు వ్యతిరేకంగా వాదించటానికి ప్రజల వద్ద ఏ ఆధారమూ మిగలకూడదని (మేమిలా చేశాము). అల్లాహ్‌యే సర్వాధిక్యుడు, మహావివేకి. 4:166 لَّٰكِنِ اللَّهُ يَشْهَدُ بِمَا أَنزَلَ إِلَيْكَ ۖ أَنزَلَهُ بِعِلْمِهِ ۖ وَالْمَلَائِكَةُ يَشْهَدُونَ ۚ وَكَفَىٰ بِاللَّهِ شَهِيدًا (ఓ ప్రవక్తా!) నీపై అవతరింపజేసిన దానిని గురించి, దాన్ని తన జ్ఞానంతో అవతరింపజేశానని అల్లాహ్ స్వయంగా సాక్ష్యమిస్తున్నాడు. దూతలు సయితం దాని గురించి సాక్ష్యమిస్తున్నారు. అసలు సాక్షిగా అల్లాహ్‌యే చాలు. 4:167 إِنَّ الَّذِينَ كَفَرُوا وَصَدُّوا عَن سَبِيلِ اللَّهِ قَدْ ضَلُّوا ضَلَالًا بَعِيدًا ఎవరయితే అవిశ్వాసానికి ఒడిగట్టి, అల్లాహ్ మార్గంలోకి రాకుండా ఇతరులను కూడా అడ్డుకున్నారో వారు నిస్సందేహంగా అపమార్గంలో చాలా దూరం వెళ్ళిపోయారు. 4:168 إِنَّ الَّذِينَ كَفَرُوا وَظَلَمُوا لَمْ يَكُنِ اللَّهُ لِيَغْفِرَ لَهُمْ وَلَا لِيَهْدِيَهُمْ طَرِيقًا అవిశ్వాసులై, అన్యాయానికి పాల్పడిన వారిని అల్లాహ్ ఎట్టి పరిస్థితిలోనూ క్షమించటంగానీ, ఏదైనా మార్గం చూపటంగానీ చేయడు- 4:169 إِلَّا طَرِيقَ جَهَنَّمَ خَالِدِينَ فِيهَا أَبَدًا ۚ وَكَانَ ذَٰلِكَ عَلَى اللَّهِ يَسِيرًا వారికి నరకమార్గం చూపటం తప్ప! వారందులో ఎల్లకాలం పడి ఉంటారు. ఇలా చేయటం అల్లాహ్‌కు బహు సులువు. 4:170 يَا أَيُّهَا النَّاسُ قَدْ جَاءَكُمُ الرَّسُولُ بِالْحَقِّ مِن رَّبِّكُمْ فَآمِنُوا خَيْرًا لَّكُمْ ۚ وَإِن تَكْفُرُوا فَإِنَّ لِلَّهِ مَا فِي السَّمَاوَاتِ وَالْأَرْضِ ۚ وَكَانَ اللَّهُ عَلِيمًا حَكِيمًا ప్రజలారా! మీ వద్దకు మీ ప్రభువు తరఫు నుంచి ప్రవక్త సత్యం తీసుకువచ్చాడు. కాబట్టి మీరు విశ్వసించండి. అది మీకే మేలు. ఒకవేళ మీరు గనక తిరస్కరిస్తే ఆకాశాలలో, భూమిలో ఉన్నదంతా అల్లాహ్‌దే (అని తెలుసుకోండి). అల్లాహ్ అన్నీ తెలిసినవాడు, వివేకవంతుడూను. 4:171 يَا أَهْلَ الْكِتَابِ لَا تَغْلُوا فِي دِينِكُمْ وَلَا تَقُولُوا عَلَى اللَّهِ إِلَّا الْحَقَّ ۚ إِنَّمَا الْمَسِيحُ عِيسَى ابْنُ مَرْيَمَ رَسُولُ اللَّهِ وَكَلِمَتُهُ أَلْقَاهَا إِلَىٰ مَرْيَمَ وَرُوحٌ مِّنْهُ ۖ فَآمِنُوا بِاللَّهِ وَرُسُلِهِ ۖ وَلَا تَقُولُوا ثَلَاثَةٌ ۚ انتَهُوا خَيْرًا لَّكُمْ ۚ إِنَّمَا اللَّهُ إِلَٰهٌ وَاحِدٌ ۖ سُبْحَانَهُ أَن يَكُونَ لَهُ وَلَدٌ ۘ لَّهُ مَا فِي السَّمَاوَاتِ وَمَا فِي الْأَرْضِ ۗ وَكَفَىٰ بِاللَّهِ وَكِيلًا ఓ గ్రంథవహులారా! మీరు మీ ధర్మం విషయంలో అతిశయిల్లకండి. సత్యం తప్ప మరోమాట అల్లాహ్‌కు ఆపాదించకండి. మర్యమ్ కుమారుడైన ఈసా మసీహ్ కేవలం దైవప్రవక్త మరియు (అయిపో అన్న) దైవవాక్కు (ద్వారా పుట్టించబడినవారు) మాత్రమే. దాన్ని ఆయన మర్యమ్ వైపు ప్రయోగించాడు. ఇంకా ఆయన (ఈసా), దేవుని దగ్గరి నుంచి వచ్చిన ఆత్మ మాత్రమే. కాబట్టి మీరు అల్లాహ్నూ, ఆయన పంపిన ప్రవక్తలందరినీ విశ్వసించండి. దేవుడు 'ముగ్గురు' అని అనకండి. ఈ (త్రిత్వం) వాదనను మానండి. ఇందులోనే మీకు మేలుంది. ఆరాధ్యుడగు అల్లాహ్ ఒక్కడు మాత్రమే. ఆయనకు కుమారుడున్నాడనే విషయానికి ఆయన అతీతుడు, పరిశుద్ధుడు. ఆకాశాలలోనూ, భూమిలోనూ ఉన్నదంతా ఆయనకు చెందినదే. కార్య నిర్వాహకారిగా అల్లాహ్ ఒక్కడే చాలు. 4:172 لَّن يَسْتَنكِفَ الْمَسِيحُ أَن يَكُونَ عَبْدًا لِّلَّهِ وَلَا الْمَلَائِكَةُ الْمُقَرَّبُونَ ۚ وَمَن يَسْتَنكِفْ عَنْ عِبَادَتِهِ وَيَسْتَكْبِرْ فَسَيَحْشُرُهُمْ إِلَيْهِ جَمِيعًا మసీహ్ (అలైహిస్సలాం) గానీ, అల్లాహ్ సామీప్యం పొందిన దూతలుగానీ తాము అల్లాహ్ దాసులు కావటాన్ని అగౌరవంగా, అవమానకరంగా ఎంత మాత్రం భావించరు. అల్లాహ్ దాస్యం చేయటాన్ని అవమానకరంగా, అగౌరవంగా భావించి, గర్వాతిశయంతో విర్రవీగే వారినందరినీ అల్లాహ్ తన వద్దకు ప్రోగుచేస్తాడు. 4:173 فَأَمَّا الَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ فَيُوَفِّيهِمْ أُجُورَهُمْ وَيَزِيدُهُم مِّن فَضْلِهِ ۖ وَأَمَّا الَّذِينَ اسْتَنكَفُوا وَاسْتَكْبَرُوا فَيُعَذِّبُهُمْ عَذَابًا أَلِيمًا وَلَا يَجِدُونَ لَهُم مِّن دُونِ اللَّهِ وَلِيًّا وَلَا نَصِيرًا మరి ఎవరు విశ్వసించి, సత్కార్యాలు ఆచరించారో, వారికి వారి పూర్తి పుణ్య ఫలాన్ని వొసగటమేగాక, తన అనుగ్రహంతో మరింతగా ప్రసాదిస్తాడు. కాగా; (అల్లాహ్ దాస్యాన్ని) చిన్నతనంగా తలపోసి తలబిరుసులుగా ప్రవర్తించిన వారికి ఆయన బాధాకరమైన శిక్షను విధిస్తాడు. అల్లాహ్ తప్ప తమను ఆదుకునే రక్షకుణ్ణిగానీ, సహాయకుణ్ణిగానీ వారు పొందలేరు. 4:174 يَا أَيُّهَا النَّاسُ قَدْ جَاءَكُم بُرْهَانٌ مِّن رَّبِّكُمْ وَأَنزَلْنَا إِلَيْكُمْ نُورًا مُّبِينًا ప్రజలారా! మీ వద్దకు మీ ప్రభువు తరఫు నుంచి స్పష్టమైన నిదర్శనం (బుర్హాన్) వచ్చేసింది. ఇంకా, మేము మీ వద్దకు స్పష్టమైన జ్యోతిని పంపాము. 4:175 فَأَمَّا الَّذِينَ آمَنُوا بِاللَّهِ وَاعْتَصَمُوا بِهِ فَسَيُدْخِلُهُمْ فِي رَحْمَةٍ مِّنْهُ وَفَضْلٍ وَيَهْدِيهِمْ إِلَيْهِ صِرَاطًا مُّسْتَقِيمًا కాబట్టి, ఎవరు అల్లాహ్‌ను విశ్వసించి, ఆయనతో తమ సంబంధాన్ని పటిష్ఠం చేసుకుంటారో వారిని ఆయన తన కారుణ్యంలోకి, అనుగ్రహంలోకి తీసేసుకుంటాడు. వారికి తన వైపుకు తెచ్చే రుజుమార్గం చూపుతాడు. 4:176 يَسْتَفْتُونَكَ قُلِ اللَّهُ يُفْتِيكُمْ فِي الْكَلَالَةِ ۚ إِنِ امْرُؤٌ هَلَكَ لَيْسَ لَهُ وَلَدٌ وَلَهُ أُخْتٌ فَلَهَا نِصْفُ مَا تَرَكَ ۚ وَهُوَ يَرِثُهَا إِن لَّمْ يَكُن لَّهَا وَلَدٌ ۚ فَإِن كَانَتَا اثْنَتَيْنِ فَلَهُمَا الثُّلُثَانِ مِمَّا تَرَكَ ۚ وَإِن كَانُوا إِخْوَةً رِّجَالًا وَنِسَاءً فَلِلذَّكَرِ مِثْلُ حَظِّ الْأُنثَيَيْنِ ۗ يُبَيِّنُ اللَّهُ لَكُمْ أَن تَضِلُّوا ۗ وَاللَّهُ بِكُلِّ شَيْءٍ عَلِيمٌ (ఓ ప్రవక్తా!) వీరు నిన్ను ('కలాలా' గురించి) ధర్మాదేశం అడుగుతున్నారు. అల్లాహ్ (స్వయంగా) 'కలాలా' గురించి మీకు ఆదేశం ఇస్తున్నాడని నువ్వు వారికి చెప్పు. ఏ వ్యక్తయినా సంతానం లేకుండా చనిపోతే, అతనికి ఒక సోదరి మాత్రమే ఉంటే, అతను వదలి వెళ్ళిన ఆస్తిలో సగభాగం ఆమెకు లభిస్తుంది. ఒకవేళ సోదరి-సంతానం లేకుండా మరణిస్తే ఆమె సోదరుడు ఆమె ఆస్తికి వారసుడౌతాడు. ఒకవేళ (మరణించిన వ్యక్తికి) ఇద్దరు సోదరీమణులుంటే, అతని మొత్తం ఆస్తిలో మూడింట రెండొంతుల భాగం వారిద్దరికీ దక్కుతుంది. ఒకవేళ సోదరీసోదరులు అనేకమంది వారసులుగా ఉన్నప్పుడు, ఒక పురుషుని భాగం ఇద్దరు స్త్రీలకు ఇచ్చే భాగాలకు సమానంగా ఉంటుంది. మీరు పెడదారి పట్టకుండా ఉండేందుకుగాను అల్లాహ్ మీకు స్పష్టంగా విడమరచి చెబుతున్నాడు. అల్లాహ్ ప్రతిదీ తెలిసినవాడు. ఈ తెలుగు ఖుర్ఆన్ శాంతి మార్గం పబ్లికేషన్ వారు ప్రచురించారు. వారి అనుమతితో ఈ వెబ్ పోర్టల్ పై వేయబడింది. |